US Presidential Elections: అమెరికా ఎన్నికల్లో అభ్యర్థుల సంక్షోభం.. పెరుగుతున్న బైడెన్‌ వ్యతిరేక స్వరం.. ట్రంప్‌ గుడ్డిలో మెల్ల!

అమెరికన్లు ప్రధానంగా దేశాన్ని సరిగా నాడిపే నాయకుడు కావాలని కోరుకుంటున్నారు. అనారోగ్య సమస్యలతో ఉన్నవారు కాదని పేర్కొంటున్నారు. ప్రస్తుతం బరిలో ఉన్న ఇద్దరు అభ్యర్థులూ వైదొలగాలని సూచిస్తున్నారు. రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉండే మిషిగన్, పెన్సిల్వేనియా, నెవడా రాస్ట్రాల్లో బైడెన్‌పై తీవ్రమైన వ్యతిరేకత ఉంది. డెమోక్రాట్లు తప్పనిసరై బైడెన్‌కే ఓటు వేస్తామంటున్నారు. అభ్యర్థిపై నిరాసక్తి కారణంగానే చాలా మంది ఓటింగ్‌కు దూరంగా ఉండే అవకాశం ఉంది. దీంతో రిపబ్లిక్‌ పార్టీ అభ్యర్థి ట్రంప్‌ లాభపడతారని, సెనెట్, ప్రతినిధుల సభలో ఓడిపోయే అవకాశం ఉందని డెమోక్రాటిక్‌ మద్దతు దారులు ఆందోళన చెందుతున్నారు.

Written By: Raj Shekar, Updated On : July 12, 2024 5:13 pm

US Presidential Elections

Follow us on

US Presidential Elections: అగ్రరాజ్యం అమెరికా గతంలో ఎన్నడూ లేనివిధంగా అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థుల సంక్షోభం ఎదుర్కొంటోంది. ప్రస్తుతం పోటీలో ఉన్న డెమోక్రటిక్‌ అభ్యర్థి జో బైడెన్, రిపబ్లిక్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌పై ఓటర్లు పెదవి విరుస్తున్నారు. ఇద్దరు అభ్యర్థులను పోలిస్తే గుడ్డిలో మెల్లలా ట్రంప్‌ కాస్త నయం అన్న అభిప్రాయం అమెరిన్లు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు బైడెన్‌ అభ్యర్థిత్వంపై వ్యతిరేకత క్రమంగా పెరుగుతోంది. బైడెన్‌ తప్పుకోవాలని సొంత పార్టీనేతలే సూచిస్తున్నారు. ఆ జాబితాలో బైడెన్‌కు హాలీవుడ్‌లో నిధులు సేకరించే నటుడు, దర్శకుడు జార్జ్‌ క్లూనీ సైతం చేరారు. బైడెన్‌ అధ్యక్ష బరిలో ఉంటే డెమోక్రాట్ల గెలుపు కష్టమని స్పష్ట ంచేశారు. మరోవైపు భారత సంతతి అమెరికన్లు కూడా బైడెన్‌ను వ్యతిరేకిస్తున్నారు.

నడిపించే నాయకుడు కావాలి..
అమెరికన్లు ప్రధానంగా దేశాన్ని సరిగా నాడిపే నాయకుడు కావాలని కోరుకుంటున్నారు. అనారోగ్య సమస్యలతో ఉన్నవారు కాదని పేర్కొంటున్నారు. ప్రస్తుతం బరిలో ఉన్న ఇద్దరు అభ్యర్థులూ వైదొలగాలని సూచిస్తున్నారు. రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉండే మిషిగన్, పెన్సిల్వేనియా, నెవడా రాస్ట్రాల్లో బైడెన్‌పై తీవ్రమైన వ్యతిరేకత ఉంది. డెమోక్రాట్లు తప్పనిసరై బైడెన్‌కే ఓటు వేస్తామంటున్నారు. అభ్యర్థిపై నిరాసక్తి కారణంగానే చాలా మంది ఓటింగ్‌కు దూరంగా ఉండే అవకాశం ఉంది. దీంతో రిపబ్లిక్‌ పార్టీ అభ్యర్థి ట్రంప్‌ లాభపడతారని, సెనెట్, ప్రతినిధుల సభలో ఓడిపోయే అవకాశం ఉందని డెమోక్రాటిక్‌ మద్దతు దారులు ఆందోళన చెందుతున్నారు. ఆఫ్రో అమెరికన్ల మద్దుతు బైడెన్‌కే ఉన్నా.. ఆయన సమర్ధతపైనే వారు ఆందోళన చెందుతున్నారు. ధరల పెరుగుదలను కట్టడి చేయగలిగే నేత కావాలని వారు కోరుకుంటున్నారు. ఇక ట్రంప్‌ గెలిస్తే తమకు ఇబ్బందులు తప్పవని పేర్కొంటున్నారు.

ట్రంప్‌ పైనా వ్యతిరేకత..
ఇక రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌పైనా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ గెలిస్తే ఇబ్బందే అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. గతంలో ట్రంప్‌ పాలన చూశామని, మళ్లీ ఆయన రావాలని కోరుకోవడం లేదని ఆఫ్రో అమెరికన్లు పేర్కొంటున్నారు. ఆఫ్రో అమెరికన్లు, యువత ఓటేస్తే బైడెన్‌ గెలుస్తారని అంటున్నారు.

నేతల్లోనూ అసంతృప్తి..
ఇక బైడెన్‌ అభ్యర్థిత్వంపై డెమోక్రటిక్‌ నేతల్లోనూ అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రతినిధుల సభ మాజీ స్పీకర్‌ నాన్సీ పెలోసీ భిన్నంగా స్పందించారు. పోటీలో ఉండాలా.. వద్దా అని నిర్ణయించుకోవాల్సిందే బైడెనే అని స్పష్టం చేశారు. బైడెన్‌ వైదొలగాలని వెర్మాంట్‌ సెనెటర పీటర్‌ వెల్క్‌ సూచించారు. బైడెన్‌ అభ్యర్థి అయితే గెలవడం కష్టమని డెమోక్రాట్లకు అతిపెద్ద విరాళాల సేకరణ కర్త, నటుడు, దర్శకుడు జార్జ్‌ క్లూనీ తేల్చి చెప్పారు. ఆయన పోటీ నుంచి వైదొలగాలని సూచించారు. ఈ అధ్యక్షుడితో మనం ఎన్నికల్లో గెలవబోం. ప్రతినిధుల సభ, సెనెట్‌లోనూ ఓడిపోబోతున్నాం ఇది నా అభిప్రాయం కాదు.. ప్రతీ చట్టసభ సభ్యుడు, గవర్నట్లు ఇదే అంటున్నారు అని పేర్కొన్నారు. తాను చాలా మందితో వ్యక్తిగతంగా మాట్లాడానని చెబుతున్నారు. వారందరూ బైడెన్‌ అయితే కష్టమే అని తెలిపారని వెల్లడించారు.

సంపన్నుల కుట్ర..
ఇదిలా ఉంటే జూన్‌లో జరిగిన డిబేట్‌లో విఫలమైన బైడెన్‌.. తనను తాను సమర్థించుకున్నారు. సొంతపారీట నుంచి అసంతృప్తి వ్యక్తమువుతన్నా వైదొలిగేది లేదని చెబుతున్నారు. తనను వద్దంటన్న వారిలో సంపన్నులే ఉన్నారని పేర్కొంటున్నారు. సామాన్యులు తనకు మద్దతుగా నిలుస్తున్నారని తెలిపారు. బుధవారం(జూలై 10న) అమెరికాలో అతిపెద్ద కార్మిక సంఘాల యూనియన్‌ అయిన ఏఎఫ్‌ఎల్‌–సీఐవో నాయకులతో సమావేశమయ్యారు బైడెన్‌. వారి మద్దతు కోరారు. యూనియన్‌ అధ్యక్షుడు లిజ్‌ షూలర్‌తోపాటు కార్మిక నాయకులు పలువురు పాల్గొన్నారు. ఈ యూనియన్‌లో 1.25 కోట్ల మంది సభ్యులుగా ఉన్నారు. నాయకులంతా బైడెన్‌కు మద్దతు తెలిపారు.