క్యాన్సర్ మహమ్మారిని జయించిన వారిలో హంసానందిని ఒకరు.
ఈ బ్యూటీ తన అంద చందాలతో, నటనతో ఎంతో మందిని అభిమానులుగా మలుచుకుంది.
ఈ బ్యూటీ మహారాష్ట్రలోని పుణేకు చెందినది. ఈమె పూర్తి పేరు పూనం బర్తాకే.
చదువు పూర్తయిన తర్వాత ముంబై వెళ్లింది. ఇక్కడే తన కెరీర్ ను ప్రారంభించింది.
ముందుగా మోడల్ గా కెరీర్ ను ప్రారంభించింది ఈ హంస నందిని.
టాలీవుడ్‌కు చెందిన మా స్టార్స్ మేగజైన్‌కు మోడలింగ్ గా పని చేసింది ఈ బ్యూటీ.
2004లో ఒకటవుదాం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
ఆ తర్వాత 786 ఖైదీ ప్రేమకథ, అనుమానాస్పదం, అధినేత, ప్రవరాఖ్యుడు, అహ నా పెళ్లంట, ఈగ వంటి సినిమాల్టో నటించింది.