HomeNewsTelangana New Cabinet: తెలంగాణలో కొత్త మంత్రివర్గం.. బోలెడు ఆశలు ఆశయాలు

Telangana New Cabinet: తెలంగాణలో కొత్త మంత్రివర్గం.. బోలెడు ఆశలు ఆశయాలు

Telangana New Cabinet: తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ(Cabinate Expansion) గురించి చర్చలు జోరందుకుంది. కొత్తగా కేబినెట్‌లోకి రేవంత్‌ నలుగురిని తీసుఉంటారని తెలుస్తోంది. మొత్తం 18 మంత్రి పదవులు ఉండగా, ప్రస్తుతం 12 పదవులతోనే 15 నెలల పాలన సాగింది. ఈ తరుణంలో మరో నాలుగు పదవులు భర్తీకి లైన్‌ క్లియర్‌ అయినట్లు తెలుస్తోంది. కొత్తగా మంత్రులుగా చేరనున్న వారిలో మక్తల్‌ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ముదిరాజ్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, జి. వివేక్, బోధన్‌ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి ఉన్నట్లు సమాచారం. ఈ సమయంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి(Rajagopal reddy) తన ఆసక్తిని బహిరంగంగా వ్యక్తం చేశారు. ‘‘నాకు హోం మంత్రి పదవి అంటే ఇష్టం. ఏ పదవి వచ్చినా సమర్థవంతంగా నిర్వహిస్తా. ప్రజల పక్షాన నిలబడతా’’ అని ఆయన పేర్కొన్నారు. మార్చి 24న ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్‌ అధిష్ఠాన సమావేశంలో మంత్రివర్గ విస్తరణపై సీరియస్‌ చర్చలు జరిగినట్టు సమాచారం. అయితే, ‘‘ఇప్పటివరకు ఢిల్లీ(Delhi) నుంచి నాకు ఫోన్‌ రాలేదు’’ అని రాజగోపాల్‌ రెడ్డి తెలిపారు. రాజగోపాల్‌ రెడ్డి గతంలో బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి మారి, 2022లో మునుగోడు ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. ఇటీవల భువనగిరి(Bhuvanagiri) ఎంపీ సీటును కాంగ్రెస్‌కు అందించడంలో కీలక పాత్ర పోషించారు. ‘‘నాకు మంత్రి పదవి వస్తే పార్టీకే లాభం. నా సామర్థ్యం బట్టి పనిచేస్తా’’ అని ఆయన గతంలోనూ వ్యాఖ్యానించారు.

Also Read: ఐటీ ఉద్యోగులు రుణపడి ఉంటారు.. మీలాంటి ఎమ్మెల్యేలే కావాలి సామీ

మినిస్టర్‌ వివేక్‌ గారు..
ఇక.. అసెంబ్లీ లాబీల్లో మరో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మాజీ మంత్రి, మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే చేమకూర మల్లారెడ్డి(Mallareddy) తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌ వెంకటస్వామిని కలిసిన సందర్భంలో ‘నమస్తే మంత్రి గారు‘ అని పలకరించారు. దీనికి వివేక్‌ వెంకటస్వామి(Vivake Venkata swamy) ‘థాంక్స్‌ మల్లన్న‘ అంటూ సంతోషంగా స్పందించారు. ఈ సంఘటన రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రత్యేకించి వివేక్‌ వెంకటస్వామి కుటుంబం రాష్ట్రంలో ప్రభావం చూపుతున్న నేపథ్యంలో. ఈ పలకరింపు రాజకీయంగా ఎలాంటి అర్థం కలిగి ఉండవచ్చనేది స్పష్టంగా తెలియనప్పటికీ, ఇది నాయకుల మధ్య స్నేహపూర్వక సంబంధాలను సూచిస్తుందని భావించవచ్చు.

విస్తరణ ఖాయం..
ఏది ఏమైనా తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ ఖాయమని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి. ఈమేరకు అధిష్టానం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చిందని చెబుతున్నారు. అయితే మొత్తం ఆరు పదవుల్లో ప్రస్తుతం నాలుగు మాత్రమే భర్తీ చేసే అవకాశం ఉందని అంటున్నారు. మిగతా రెండు పదవులను మరో ఆరు నెలల తర్వాత భర్తీ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం మంత్రివర్గ విస్తరణతోపాటు శాఖల మార్పు, ఇద్దరు మంత్రులకు ఉద్వాసన కూడా ఉంటుందన్న చర్చ జరుగుతోంది.

మంత్రివర్గ విస్తరణ వేల.. నేతల ఆసక్తికర వ్యాఖ్యలు..!

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువు దీరిన 15 నెలల తర్వాత మంత్రివర్గ విస్తరణ అంశం ఒక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలుమార్లు విస్తరణపై చర్చలు జరిగినా ఖరారు కాలేదు. ఈసారి నాలుగు పదవులకు నేతలను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది

తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ(Cabinate Expansion) గురించి చర్చలు జోరందుకుంది. కొత్తగా కేబినెట్‌లోకి రేవంత్‌ నలుగురిని తీసుఉంటారని తెలుస్తోంది. మొత్తం 18 మంత్రి పదవులు ఉండగా, ప్రస్తుతం 12 పదవులతోనే 15 నెలల పాలన సాగింది. ఈ తరుణంలో మరో నాలుగు పదవులు భర్తీకి లైన్‌ క్లియర్‌ అయినట్లు తెలుస్తోంది. కొత్తగా మంత్రులుగా చేరనున్న వారిలో మక్తల్‌ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ముదిరాజ్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, జి. వివేక్, బోధన్‌ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి ఉన్నట్లు సమాచారం. ఈ సమయంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి(Rajagopal reddy) తన ఆసక్తిని బహిరంగంగా వ్యక్తం చేశారు. ‘‘నాకు హోం మంత్రి పదవి అంటే ఇష్టం. ఏ పదవి వచ్చినా సమర్థవంతంగా నిర్వహిస్తా. ప్రజల పక్షాన నిలబడతా’’ అని ఆయన పేర్కొన్నారు. మార్చి 24న ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్‌ అధిష్ఠాన సమావేశంలో మంత్రివర్గ విస్తరణపై సీరియస్‌ చర్చలు జరిగినట్టు సమాచారం. అయితే, ‘‘ఇప్పటివరకు ఢిల్లీ(Delhi) నుంచి నాకు ఫోన్‌ రాలేదు’’ అని రాజగోపాల్‌ రెడ్డి తెలిపారు. రాజగోపాల్‌ రెడ్డి గతంలో బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి మారి, 2022లో మునుగోడు ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. ఇటీవల భువనగిరి(Bhuvanagiri) ఎంపీ సీటును కాంగ్రెస్‌కు అందించడంలో కీలక పాత్ర పోషించారు. ‘‘నాకు మంత్రి పదవి వస్తే పార్టీకే లాభం. నా సామర్థ్యం బట్టి పనిచేస్తా’’ అని ఆయన గతంలోనూ వ్యాఖ్యానించారు.

మినిస్టర్‌ వివేక్‌ గారు..
ఇక.. అసెంబ్లీ లాబీల్లో మరో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మాజీ మంత్రి, మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే చేమకూర మల్లారెడ్డి(Mallareddy) తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌ వెంకటస్వామిని కలిసిన సందర్భంలో ‘నమస్తే మంత్రి గారు‘ అని పలకరించారు. దీనికి వివేక్‌ వెంకటస్వామి(Vivake Venkata swamy) ‘థాంక్స్‌ మల్లన్న‘ అంటూ సంతోషంగా స్పందించారు. ఈ సంఘటన రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రత్యేకించి వివేక్‌ వెంకటస్వామి కుటుంబం రాష్ట్రంలో ప్రభావం చూపుతున్న నేపథ్యంలో. ఈ పలకరింపు రాజకీయంగా ఎలాంటి అర్థం కలిగి ఉండవచ్చనేది స్పష్టంగా తెలియనప్పటికీ, ఇది నాయకుల మధ్య స్నేహపూర్వక సంబంధాలను సూచిస్తుందని భావించవచ్చు.

విస్తరణ ఖాయం..
ఏది ఏమైనా తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ ఖాయమని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి. ఈమేరకు అధిష్టానం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చిందని చెబుతున్నారు. అయితే మొత్తం ఆరు పదవుల్లో ప్రస్తుతం నాలుగు మాత్రమే భర్తీ చేసే అవకాశం ఉందని అంటున్నారు. మిగతా రెండు పదవులను మరో ఆరు నెలల తర్వాత భర్తీ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం మంత్రివర్గ విస్తరణతోపాటు శాఖల మార్పు, ఇద్దరు మంత్రులకు ఉద్వాసన కూడా ఉంటుందన్న చర్చ జరుగుతోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version