Bigg Boss Telugu : మన తెలుగు ఆడియన్స్ ఎమోషన్స్ కి ఏ రేంజ్ ప్రాధాన్యత ఇస్తారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వాళ్ళ మనసు వెన్న లాంటిది, ఎమోషన్స్ కి చాలా తేలికగా కనెక్ట్ అయిపోతారు. ముఖ్యంగా బిగ్ బాస్ రియాలిటీ షో లో జరిగే కొన్ని సంఘటనలను గుడ్డిగా నమ్మి, అర్హత లేని కంటెస్టెంట్స్ ని గెలిపించేస్తూ ఉంటారు. అది వాళ్ళ తప్పు కాదు, జై జవాన్..జై కిసాన్ అంటూ కంటెస్టెంట్స్ ఎక్కడ లేని సెంటిమెంట్ కార్డ్స్ ని వాడుకుంటూ, టైటిల్ ని గెలిచేసుకుంటున్నారు. సీజన్ 7 లో పల్లవి ప్రశాంత్ ఇలాగే గెలిచాడు. రైతు బిడ్డ అనే ట్యాగ్ ని వాడి, ఈ కంటెస్టెంట్ ఆ సీజన్ టైటిల్ విన్నర్ గా నిలిచాడు. టాస్కులు అద్భుతంగా ఆడేవాడు కానీ, ఆ సీజన్ రన్నరప్ గా నిల్చిన అమర్ దీప్ అంత నిజాయితీగా తనని తానూ జనాలకు చూపించకుండా ముసుగు వేసి కప్పేసాడు.
ఫలితంగా అతని రియాలిటీ తెలియక, మా రైతు బిడ్డని టార్గెట్ చేస్తున్నారు, ఇది చాలా అన్యాయం అని భావించి, ఆడియన్స్ అతని చేతిలో కప్ పెట్టి పంపించారు. ఇక బయటకు వచ్చిన తర్వాత మనోడి విశ్వరూపం చూసి ఇలాంటోడినా మనం గెలిపించాము? అని తలబాదుకున్నారు. ఈ సీజన్ టైటిల్ విన్నర్ గా నిల్చిన పవన్ కళ్యాణ్ కూడా పల్లవి ప్రశాంత్ ని బాగా అనుసరించాడో ఏమో తెలియదు కానీ, ఆయన కూడా తెలివిగా ‘జవాన్’ కార్డుని ఉపయోగించుకోవడమే కాకుండా, తన ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఎమోషన్ ని కూడా షో లో పంచుకొని ఆడియన్స్ కి ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అయ్యాడు. ఫలితంగా శిఖరాగ్ర స్థాయి ఓటు బ్యాంక్ ఉన్నటువంటి తనూజ ని సైతం దాటేసి టైటిల్ గెలుచుకున్నాడు. వాస్తవానికి పవన్ కళ్యాణ్ టైటిల్ గెలుచుకోవడానికి ఏ మాత్రం అర్హుడు కాదు అనే చెప్పాలి.
ఎందుకంటే ఇతగాడు ఇమ్మానుయేల్, డిమోన్ పవన్ లాగా ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేడు. భరణి, డిమోన్ పవన్ మరియు ఇమ్మానుయేల్ లాగా ఫిజికల్ టాస్కులు కూడా ఆడలేడు. సంజన, తనూజ లాగా కంటెంట్ ని ఇవ్వడం కూడా చేత కాదు. కేవలం తనూజ చుట్టూ తిరుగుతూ, ఆమె ఏది చెప్తే అది చేస్తూ, ఆమెకి ఒక అసిస్టెంట్ లాగా మారిపోయి బోలెడంత స్క్రీన్ టైం ని సంపాదించాడు. వీళ్లిద్దరి బాండింగ్ లో కళ్యాణ్ కి సానుభూతి బాగా వర్కౌట్ అయ్యింది. దానికి తోడు అమ్మానాన్న లు హౌస్ లోకి రావడం, వాళ్ళు మాట్లాడిన గొప్ప మాటలు ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవ్వడం వల్లే, పవన్ కళ్యాణ్ నేడు టైటిల్ ని గెలిచాడు. కానీ వీటి అన్నిటికంటే ఆయనకు ‘జై జవాన్’ అనే ట్యాగ్ బాగా కలిసొచ్చింది. ఆయన పీఆర్ టీం సోషల్ మీడియా లో పదే పదే దీనిని రుద్దుతూ ఓట్లు మొత్తం తమ వైపుకు తిప్పుకునేలా చేశారు. మన తెలుగు ప్రజలు మాత్రమే కాదు , దేశ ప్రజలు మొత్తం సైనికుడిని , రైతు ని దైవం లాగా భావిస్తుంటారు. అందుకే పవన్ కళ్యాణ్, పల్లవి ప్రశాంత్ వంటి వారు టైటిల్ విన్నెర్స్ గా నిలిచారు. భవిష్యత్తులో అయినా ఇలాంటి కార్డ్స్ వాడుకునేందుకు స్కోప్ లేకుండా చెయ్యాలి. దాని వల్ల అద్భుతంగా గేమ్స్ ఆడవాళ్లకు అన్యాయం జరుగుతుంది అనడానికి బెస్ట్ ఉదాహరణే ఈ సీజన్.