Rowdy Janardhana Glimpse : విజయ్ దేవరకొండ హీరోగా రవికిరణ్ కోలా డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా టైటిల్ గ్లింప్స్ కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయింది. ఆ గ్లింప్స్ ను కనక మనం చూసినట్లయితే ఇందులో విజయ్ దేవరకొండ ఒక రౌడీగా కనిపించబోతున్నాడు. ఇందులో డైలాగులు కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ఈ సినిమాలో వాడిన కొన్ని డైలాగులు నాని హీరోగా వస్తున్న ‘ప్యారడైజ్’ సినిమాలో వాడిన డైలాగుల మాదిరిగానే ఉన్నాయి… ఇక సినిమా వరల్డ్ ను పరిచయం చేస్తూ రౌడీ జనార్ధన్ అనే ఒక వ్యక్తి ఊర్లో అందరు రౌడీలుగా చెలమని అవుతున్నారు. కానీ రౌడీ అనే పదాన్ని ఇంటిపేరుగా మార్చుకొని జనార్ధన్ చేయబోయే విధ్వంసం ఎలా ఉంటుంది. అతనికి పోటీగా నిలబడిన వ్యక్తుల యొక్క తాట ఎలా తీస్తాడు తను ఎవరికోసం వెయిట్ చేస్తున్నాడు. ఎందుకోసం వెయిట్ చేస్తున్నాడు అనేది ఈ సినిమాలోని మెయిన్ స్టోరీగా తెలుస్తోంది. ఇక రవికిరణ్ చాలా రోజుల తర్వాత చేస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమాతో మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టించడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది.
విజయ్ దేవరకొండ ఈ సంవత్సరం రిలీజ్ అయిన కింగ్ డమ్ సినిమాతో భారీ విజయాన్ని అందుకోవాలనే ప్రయత్నం చేసినప్పటికి అది ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. దాంతో ఇప్పుడు ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాతో భారీ విజయాన్ని సాధిస్తే మాత్రం విజయ్ టైర్ వన్ హీరోగా మారడానికి అవకాశం ఉంటుంది.
ఈ సినిమాలో యాక్షన్ పార్ట్ కొంచెం ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తోంది. విజయ్ బాడీ కూడా దానికి బాగా సెట్ అయింది. తన బాడీని చూపిస్తూ కత్తి పట్టుకుని విధ్వంసం చేయబోతున్న వ్యక్తి గా ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. ఇక విజయ్ కింగ్ డమ్ సినిమా విషయంలో తీవ్రంగా నిరాశపరిచాడు. కాబట్టి ఈ సినిమాతో సక్సెస్ ని సాధించారు. లేకపోతే మాత్రం చాలా వరకు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది…
ఇప్పటికే నాని లాంటి హీరో ప్యారడైజ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. దాన్ని రిఫరెన్స్ తోనే ఈ సినిమాలో కొన్ని బూతులను పెట్టినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలో అవి వర్కౌట్ అయితే పర్లేదు. కానీ తేడా కొడితే ప్రాబ్లం అవుతోంది. ఇక ప్రస్తుతం రౌడీ జనార్ధన్ గ్లింప్స్ ప్యారడైజ్ స్మెల్ కొడుతోంది అంటు చాలా మంది వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…
