Pawan Kalyan Tweet: పవన్ కళ్యాణ్ ఒక అగ్ని పర్వతం.. అందులో ఎప్పుడూ లావా ఉడుకుతూనే ఉంది. అది బయటపెడితే ప్రత్యర్థులు కాలిపోవాల్సిందే. రగులుతున్న ఆ లావాను అప్పుడప్పుడే బయటకు కక్కుతుంటారు.. తాజాగా మరోసారి సెగలు కక్కాడు. తన సినిమాను ఏపీలో తొక్కేసిన జగన్ సర్కార్ ను.. ఆయనను బతిమిలాడుతున్న సినీ ఇండస్ట్రీని ఉద్దేశించి పరోక్షంగా పవన్ చేసిన ట్వీట్ సంచలనమైంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘భీమ్లానాయక్’ మూవీ ఈరోజు విడుదలైంది. తెలంగాణలో 5వ షోకు అనుమతి, బెనిఫిట్, ప్రీషోలు, టికెట్ రేట్లు పెంచి కేసీఆర్ సర్కార్ సహకరించింది. అయితే ఏపీలో మాత్రం జగన్ సర్కార్ టికెట్ రేట్లు పెంచకుండా తొక్కేసింది.సినిమాపై ఉక్కుపాదం మోపింది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ లో ఆవేశం, ఆక్రందన తన్నుకొచ్చింది. తాజాగా ఆయన చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
ఏపీలో ‘భీమ్లానాయక్’ మూవీపై జగన్ సర్కార్ ఉక్కుపాదం మోపింది. అదనపు షోలకు, టికెట్ ధరల పెంపునకు అనుమతి నిరాకరించింది. జీవో నం.35ను స్టిక్ట్ గా అమలు చేసింది. లేకుంటే థియేటర్లు సీజ్ చేస్తామని ఆ నోటీసుల్లో పేర్కొంది. ఈ సందర్భంగా విడుదలకు కొన్ని గంటల ముందు చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రముఖ జర్మన్ వేదాంతి పాస్టర్ మార్టిన్ నిమొల్లర్ తెలిపిన మాటలను ఆయన తన ట్వీట్ లో పేర్కొన్నారు. ‘మొదట వారు సోషలిస్టుల కోసం వచ్చారు. అప్పుడు నేను మాట్లాడలేదు. నేను సోషలిస్టును కాదు కాబట్టి.. ఆ తర్వాత వారు ట్రేడ్ యూనియనిస్టుల కోసం వచ్చారు. అప్పుడు కూడా నేను మాట్లాడలేదు. ఎందుకంటే నేను ట్రేడ్ యూనియనిస్టును కాదు కాబట్టి. ఆ తర్వాత వారు యూదుల కోసం వచ్చారు. అప్పుడు కూడా నేను మాట్లాడలేదు. ఎందుకంటే నేను యూదుడిని కాదు కాబట్టి. చిట్టచివరికి వారు నా కోసం వచ్చారు. అప్పుడు నాకోసం మాట్లాడడానికి ఎవరూ లేరు’ అని పవన్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
పవన్ ట్వీట్ చూస్తే ఇది సినిమా ఇండస్ట్రీపై పవన్ సంధించిన అస్త్రంగా చెప్పొచ్చు. సినీ ఇండస్ట్రీకి సమస్య వస్తే మిగతావారు మౌనంగా ఉంటున్నారని.. వారికి కూడా సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఇన్ డైరెక్టుగా పవన్ చెప్పకనే చెప్పారు.
Also Read: Bheemla Nayak Movie AP Govt: భీమ్లానాయక్ పై జగన్ సర్కార్ నెగిటివ్ ప్రచారం
గతంలో సాయిధరమ్ తేజ్ ‘రిపబ్లిక్’ ప్రీరిలీజ్ ఈవెంట్లో కూడా పవన్ కళ్యాణ్ ఇవే మాటలు చెప్పుకొచ్చారు. ఈ ట్వీట్ ఇన్ డైరెక్టుగా ఏపీ ప్రభుత్వం తీరు మీద కూడా ఇన్ డైరెక్టుగా కామెంట్ చేసినట్లు కనిపిస్తోంది.
ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హీరో నానికి కూడా ఆ ప్రభుత్వం ఇబ్బందులు పెట్టింది. ‘శ్యామ్ సింగరాజ్ ’ సినిమాకు ఏపీలో సమస్యలు సృష్టించారు. సినిమాలను కఠినంగా అమలు చేసేలా స్థానిక అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే సినీ ఇండస్ట్రీ మౌనంపై పవన్ కళ్యాణ్ సంధించిన ఈ ట్వీట్ ఇప్పుడు ఇండస్ట్రీ పెద్దలకు బాగానే గుచ్చుకుంది.
One of my all time favourite quote,wich came out of immense suffering ,pain & realisation from ‘Pastor Martin Niemoller’ during Nazi Germany regime. What an eternal truth! pic.twitter.com/15oUJl8EOA
— Pawan Kalyan (@PawanKalyan) February 24, 2022
Also Read: Bheemla Nayak Donetions: ‘భీమ్లా నాయక్’ కోసం విరాళాలు.. ఎవరి జేబుల కోసం ?
Recommended Video:
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Pawan kalyans sensational tweet on the silence of the film industry elders
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com