Home Blog Page 8664

తెలంగాణలో అమ్మాయిలకు రక్షణ లేదా?

తెలంగాణలో ఈ మధ్య కాలంలో అమ్మాయిలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలు చూస్తుంటే ఒక రకమైన అభద్రతా భావం కలుగుతుంది. వరంగల్ లో 9నెలల చిన్నారి శ్రీహితపై అత్యాాచారం చేసి ప్రాణాలు తీసిన ప్రవీణ్‌. హైదరాబాద్ శాలిబండలో నాలుగేళ్ల బాలికపై అత్యాచారం చేసిన 62 ఏళ్ల కార్మికుడు. హన్మకొండలో పుట్టినరోజు నాడు గుడికి వెళ్ళొస్తానని చెప్పి వెళ్లిన యువతిని తీసుకెళ్లి అత్యాచారం చేసి చంపేశారు. హాస్పిటల్ కి వెళ్లి చూపించుకొని వస్తానని చెప్పి వెళ్ళిన ప్రియాంకరెడ్డిని అతిదారుణంగా అత్యాచారం చేసి చంపేసిన ఘటన. ఇలా చెప్పుకుంటూ.. పోతే తెలంగాణలో అనేకచోట్ల ఎన్నెనో అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయి.

ఇన్ని దారుణాలు జరుగుతున్నా.. ప్రభుత్వం నుండి కఠినమైన చట్టాలేవీ లేకపోవడం గమనార్హం. కేసులని, విచారణ అని, కోర్టులని నిందితులను తిప్పి తిప్పి చివరికి తూతూ మంత్రంగా కేసులు మూసివేయడంమో లేదా ఏదో ఒక కేసుపెట్టి కొంతకాలం శిక్ష అనుభవించడమే చేస్తున్నారు. ఖఛ్చితమైన చట్టం తీసుకొస్తే తప్పా ఈ నేరాలు ఘోరాలు తగ్గేలాలేవు. మంత్రులు, మేధావులు, జ్ఞానవంతులు ఒక్కసారి ఆలోచించండి.

ప్రియాంకరెడ్డి హత్య:తెలంగాణ లాయర్ల సంచలన నిర్ణయం!

 

దేశవ్యాప్తంగా నిర్భయను తలపించిన ప్రియాంకరెడ్డి హత్య ఘటన తెలంగాణ రాష్ట్రంలో చోటుచేసుకోవడంతో అడ్వకేట్లు కూడా సంచలన నిర్ణయం తీసుకున్నారు. లాయర్లు ఎవరూ కూడా నిందితులకు సహాయం చేయకూడదని, వారి తరఫున వాదించిన కూడదని నిర్ణయం తీసుకున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే న్యాయవాదులు సైతం తమ వంతు పాత్ర పోషించాలని భావిస్తున్నారు. మహబూబ్ నగర్ బార్ అసోసియేషన్ తీసుకున్న నిర్ణయంతో ఎవరు వారి తరపున వాదించని పరిస్థితి. అంతేకాదు నిందితులకు కఠినంగా శిక్షపడే విధంగా న్యాయపోరాటం చేస్తామని లాయర్లు చెప్తున్న నేపథ్యంలో, కోర్టులో నిందితులకు ఏ విధమైన శిక్ష పడుతుంది. ఇంత ఘాతుకానికి ఒడిగట్టిన వారికి కోర్టులు ఎప్పటి వరకు శిక్షను విధిస్తాయి అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

 

ప్రియాంకరెడ్డిని హత్యచేసిన నిందితులను ఉరి తీయాలని దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు మిన్నంటుతున్నాయి

 

 

ప్రియాంక రెడ్డి అత్యంత పాశవికంగా అత్యాచారానికి గురై,హత్య చేసిన సంఘటన యావత్ భారతదేశాన్ని కదిలించి వేస్తోంది. మన చట్టాలను, మన న్యాయ వ్యవస్థను ప్రశ్నిస్తోంది. ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నా ఏం చేయలేని నిస్సహాయ స్థితికి ప్రజల నుండి తీవ్ర అసహనం వ్యక్తం అవుతుంది. నలుగురు మృగాళ్ల చేతిలో దారుణంగా అత్యాచారం గావించ బడి,హత్యకు గురైన ప్రియాంక రెడ్డి కేసులో నలుగురు నిందితులను పోలీసులు రాత్రి సంఘటనా స్థలానికి తీసుకువెళ్లారు.డాక్టర్ ప్రియాంక రెడ్డి గ్యాంగ్ రేప్ మరియు హత్య కేసులో ఘటనకు పాల్పడిన నలుగురు నిందితులను పోలీసులు రాత్రంతా విచారించారు. మరికొద్ది సేపట్లో వారిని బయటకు తీసుకురాబోతున్నారు.

చిమ్మ చీకటిలో కలిసి పోయిన ప్రియాంకరెడ్డి రోదన

 

ప్రియాంకరెడ్డి రిమాండ్ రిపోర్ట్ లో నమ్మలేని నిజాలు బయటకు వస్తున్నాయి. సంచలనం రేకెత్తిస్తున్న ప్రియాంక రెడ్డి రేప్ మరియు మర్డర్ కేసులో జీర్ణించుకోలేని నిజాలు బయటకు వస్తున్నాయి. ఆమె పై కామాంధులు చేసిన ఆఘాయిత్యం అతి దారుణం. పశువుల డాక్టర్ ప్రియాంక రెడ్డి, పశువులను హ్యాండిల్ చేయగలిగింది కానీ పశువుల వలె నలుగురు ఆమెపై అఘాయిత్యం చేస్తుంటే ప్రతిఘటించలేక, నిస్సహాయ స్థితిలో ఏమి చేయలేక ఆమె రోదన ఆ చిమ్మ చీకటిలో కలిసి పోయింది. ఆమె తనువు కానరాని లోకానికి వెళ్లిపోయింది.

 

 

ప్రియాంకారెడ్డి హత్యోదంతంలో పాల్గొన్న దుండగులు ఆరీఫ్, శివ, నవీన్, చెన్నకేశవులును పోలీసులు శనివారం తెల్లవారు జామున 4గంటల సయమంలో శంషాబాద్‌ నుంచి ప్రత్యేక వాహనంలో షాద్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించా రు. పోలీసులు స్టేషన్‌లోనే నిందితులకు వైద్య పరీక్షలు చేయించి తహసీల్దార్‌ ఎదుట హాజరు పర్చి ఆ తర్వాత చర్లపల్లి జైలుకు తరలించారు.

 

‘దిశా’ రేపిస్టులకు సపోర్ట్:స్మైలీనాని ఒరిజినల్ ఆడియో రికార్డు

ప్రియాంక రేపిస్టులను సపోర్ట్ స్మైలీనాని ఒరిజినల్ ఆడియో రెకార్డ్ ఇంకా వైరల్గా మారింది

పవన్, చంద్రబాబు వేరు వేరు అని చెప్పడానికి.. ఇవి చాలవా?

 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బాగా నలుగుతున్నారు. అందుకు కారణం జగన్ సర్కార్ తీసుకున్న కొన్ని తప్పుడు నిర్ణయాలకు అనేకమంది ప్రజలు ఇబ్బంధులు పడుతున్నారు. వైసీపీ తీసుకొచ్చిన “కొత్త ఇసుక పాలసీ” వల్ల ఇసుక కొరత ఏర్పడం వల్ల అనేక లక్షల భవన నిర్మాణ కార్మికులు పనులు లేక ఇబ్బందులు పడటంలో పవన్ కళ్యాణ్ వైజాగ్ లో లాంగ్ మార్చ్ నిర్వహించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో “ఇంగ్లిష్ మీడియం” తప్పనిసరి చేయడంతో.. తెలుగు భాష కనుమరుగౌతుందని, పవన్ కళ్యాణ్ “మన నుడి మన నది” కార్యక్రమంతో జగన్ సర్కార్ పై విమర్శలు గుప్పిస్తున్నారు.

 

జనసేన వైజాగ్ లాంగ్ మార్చ్ విజయం కావడం అలాగే “మన నుడి మన నది” కి అనేకమంది ప్రముఖులు మద్దతు తెలియజేయడంతో.. వైసీపీ నేతలు తట్టుకోలేక పవన్ పై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. అలాగే ఆయనను “చంద్రబాబు దత్త పుత్రుడని”, “డి ఎన్ ఏ అని”,” ప్యాకేజి స్టార్” అని విమర్శలు చేస్తున్నారు. ప్రధానంగా.. చంద్రబాబు హయంలో నోరు మెదపని పవన్ కళ్యాణ్ ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారని చాలా విమర్శలు చేస్తున్నారు. అయితే ఈ ట్వీట్ ని చూడండి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ ఎలా విమర్శించారో తెలుస్తుంది.

 

“మనసాక్షి సాక్షిగా ఈ సాక్షి పెద్ద” “జర్నలిజానికి సరైనఅర్థం చెప్పిన సాక్షి కి ” అని జనసేన ప్రకాష్ ట్వీట్ చేసాడు.

రాష్ట్ర ప్రజలకు చావు కబురు చల్లగా చెప్పిన కెసిఆర్

 

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన నిన్న ఏర్పాటు చేసిన కాబినెట్ మీటింగ్ లో ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని నిర్ణయిచినట్లు తెలిసిందే. అయితే ఈ రోజు రాష్ట్రంలోని అన్ని డిపోల్లో ఆర్టీసీ కార్మికులు విధుల్లోకి చేరుతున్నారు. అనేక చోట్ల మీడియాతో మాట్లాడిన కార్మికులు కెసిఆర్ నిర్ణయానికి ఆనంద వ్యక్తం చేస్తున్నారు.

 

ఇంతవరకు బాగానే ఉంది, కానీ 52రోజుల సమ్మెలో ఆర్టీసీ కార్మికులు సాధించింది ఏమి లేకపోగా అప్రతిష్ట మూటకట్టుకున్నారు. ప్రతిపక్షాల మాటలు విని ఆర్టీసీ జేఏసి నేతలు తప్పు దారిలో వెళ్లారనేది వాస్తవం. మరోవైపు కెసిఆర్ కూడా మెట్టు దిగక పోవడంతో పరిస్థితి ఇక్కడి దాకా వచ్చింది. అంటే కెసిఆర్, జేఏసి నేతలు పంతాలకుపోయి టీఎస్ఆర్టీసీకి వందల కోట్ల నష్టాన్ని తీసుకొచ్చారని తెలుస్తుంది. మరి ఈ నష్టం ఎవరు భరించాలి అంటే రాష్ట్ర ప్రజలు భరించాలి అని చావు కబురు చల్లగా చెప్పారు మన ముఖ్యమంత్రిగారు. “మన బిడ్డలు” “మన వాళ్ళు” “మనమెలా పోగొట్టుకుంటామంటూ” తియ్య తీయగా మాట్లాడి నష్టాన్ని మొత్తం ప్రజల మీదికి నెట్టారు. కిలోమీటర్ కి 20పైసలే పెంచుతున్నాం అని భలేగా మాట్లాడారు. దానివల్ల ఆర్టీసీ ఏడాదికి 752కోట్లు ఆదాయం చేకూరుతుందని కమ్మగా.. ప్రజలకు దెబ్బ తగలకుండా చెప్పారు.

 

అయినా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సొమ్మంతా ఎక్కడ నుండి వచ్చింది? అదంతా రాష్ట్ర ప్రజలు వివిధ రూపాల్లో ఇచ్చిన సొమ్మే కదా? అదే ఉపయోగిస్తే బాగుంటది కదా? మరింత భారాన్ని ఎందుకు ప్రజల మీద మోపుతున్నారు.

 

తెలంగాణ ప్రభుత్వం యాదగిరిలో దేవాలయాన్ని పునర్నిర్మించటం కోసం వందలకోట్ల ప్రభుత్వ ఖజానాన్ని ఖర్చుపెట్టటం ఎంతవరకు సబబు? కాళేశ్వరం ప్రాజెక్టు అని చెప్పి వందల కోట్లు ఖర్చుపెడుతున్నారు. ఆ ప్రాజెక్ట్ ఒక మిస్టరీ. ఎన్ని లక్షల ఎకరాలకు నీరొస్తుందో ఇప్పటికీ తెలియదు. ఇంతగా ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారు.. ఈ ఖచ్చితంగా ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగపరచటమే కదా? ఇవన్నీ సరిపోవన్నట్లు మరలా కొత్తగా ప్రజల మీద అదనపు భారం పెట్టటం సబబా? ప్రియమైన ముఖ్యమంత్రిగారు…?

 

ప్రస్తుత పరిస్థితులకు అద్దంపట్టే ఈ వీడియో సాంగ్ లో చివరికి “వీడు వాడ్ని తిట్,టి వాడు వీడ్ని తిట్టి చివరకు జనాలకు పిచ్చి పట్టింది” వినండి

ప్రియాంకరెడ్డి హత్య:నిందితుల్ని వెంటనే ఉరితీయాలని డిమాండ్!

 

ప్రియాంకరెడ్డిను లారీ డ్రైవర్లతోపాటు క్లీనర్లు కలిసి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడి, అనంతరం హత్యచేసినట్లు నిర్ధరించారు. నిందితులను నారాయణపేట జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. టోల్ ప్లాజా వెనకాల ఉన్న ఖాళీ ప్రదేశంలో అత్యాచారం చేసి హత్య చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.

 

 

తెల్లవారుజామున 3-4 గంటల మధ్య సమయంలో హత్యచేసి ఉంటారని శవపరీక్షలో తేలింది. అంతేకాకుండా ప్రాథమిక పోస్ట్ మార్టం రిపోర్టు ఆధారంగా ప్రియాంక రెడ్డిని కిరోసిన్‌ పోసి చంపినట్లు డాక్టర్లు చెప్పడంతో లారీ డ్రైవర్లే హతమార్చినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. శరీరం గంటపాటు తగలబడినట్లు వైద్యులు భావిస్తున్నారు. మెడను చున్నీతో బిగించి హత్య చేసి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ప్రియాంకరెడ్డి తలపైనా వైద్యులు గాయాన్ని గుర్తించారు.

కుట్రలకు చిక్కకుండా వాట్సాప్ లో ఈ సెట్టింగ్స్ తప్పనిసరి

 

వాట్సాప్ గ్రూప్‌ల్లో, ఫేస్‌బుక్‌లో భారత ఆర్మీ జవాన్లకు అందమైన అమ్మాయిల ఫోటోలను ఎరగా వేసి రహస్యాలు దొంగిలించాలన్న దుర్బుద్ధి తో పాకిస్థాన్ సోషల్ మీడియాలో మన సైనికులను టార్గెట్ చేస్తోంది. ముసుగులో వల వేసి, సీక్రెట్స్ తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. ఇటీవల ఇలాంటి కేసులపై అలర్ట్ అయిన భారత ఆర్మీ.. వాట్సాప్ విషయంలోనూ అప్రమత్తమైంది. జవాన్లను జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

 

ఓ జవాన్‌ను తనకు తెలియకుండానే పాక్ వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేసేశారు పాక్ ఐఎస్ఐ ఏజెంట్స్. +92తో మొదలయ్యే ఓ పాక్ నంబర్ ఆర్మీ జవాన్‌ను వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేయడం గమనించాడు. దీంతో వెంటనే అప్రమత్తమై ఈ విషయాన్ని పోలీసులకు, ఆర్మీకి తెలియజేశాడు. పాక్ కొత్త కుట్రలు తెలియడంతో భారత ఆర్మీ వాట్సాప్ వినియోగంపై అడ్వైజరీ విడుదల చేసింది. గ్రూప్‌లో యాడ్ చేయడానికి సంబంధించిన సెట్టింగ్స్ మార్చుకోవాలని సూచించింది.

 

+92తో మొదలయ్యే ఏ నంబర్‌ను కనిపించినా వెంటనే అది పాకిస్థాన్‌దని గుర్తించి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. వాట్సాప్‌లో గుర్తు తెలియని వ్యక్తులు వారి గ్రూప్‌లలో యాడ్ చేయకుండా చూసుకోవాలని తెలిపింది.

 

తెలియనివాళ్లు వాట్సాప్‌లో యాడ్ చేయకుండా సెట్టింగ్స్‌లో అకౌంట్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ప్రైవసీ ఆప్షన్ ఓపెన్ చేస్తే.. లాస్ట్ సీన్, ప్రొఫైల్ ఫొటో, అబౌట్, రీడ్ రిసిప్ట్స్, గ్రూప్స్, లైవ్ లొకేషన్ ఆప్షన్స్ కనిపిస్తాయి. వాటిలో గ్రూప్స్ ఓపెన్ చేసి.. నో బడీ లేదా మై కాంటాక్ట్స్ సెలెక్ట్ చేసుకుంటే అసలెవరూ వాళ్ల గ్రూప్‌లో మన పర్మిషన్ లేకుండా యాడ్ చేయడం కుదరదు.

 

అదే మై కాంటాక్ట్స్ సెలెక్ట్ చేస్తే మన ఫోన్‌లో ఉన్న కాంటాక్ట్స్‌లో ఎవరైనా మనల్ని యాడ్ చేయడం వీలవుతుంది.

ఛాన్స్ దొరికింది రెచ్చి పో చంద్రబాబు!

 

2019 అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయం పాలైన చంద్రబాబు ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నారు. ఎప్పుడు మూటకట్టుకొని అప్రతిష్ట మూటకట్టుకున్నారు. ఎన్నడూ ఎదుర్కొనని గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఎన్నడూ లేనంత అనిశ్చితి, నిరాశలో ఆ పార్టీ నేతలు కూరుకుపోయారు. టీడీపీ కథ కంచికే అని ఎన్నెన్నో విమర్శలు ఎదుర్కొన్నారు టీడీపీ అధినేత.

 

ఇటీవల కాలంలో వైసీపీ నేతలు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీని పక్కకు నెట్టి జనసేన పార్టీ పై ఫోకస్ పెట్టటం కూడా టీడీపీకి మింగుడు పడటం లేదు. ఇసుక సమస్య విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ విజయం కావడం టీడీపీ నేతలు చేసిన ఇసుక పై పోరాటం విఫలం కావడంతో టీడీపీని కనీసం ప్రతిపక్షంగా కూడా గుర్తించడం లేదనే భావన టీడీపీ శ్రేణుల్లో ఆందోళన కలిగించింది. బాబు, తనయుడు లోకేష్ కోసం జూనియర్ ఎన్టీఆర్‌ను బలిపశువును చేశారన్న ఆరోపణలు ప్రకంపనలు సృష్టించాయి. ఈ నెల 29 రానున్న రాంగోపాల్ వర్మ సినిమాలో కూడా ఇదే విషయం తీసుకురావడం. దీంతో ఊపిరి సలపని పరిస్థితి ఏర్పడింది తెలుగుదేశం పార్టీకి. అయితే.. సరిగ్గా ఈ సమయంలో అమరావతి అంశం తెరపైకి రావడం టీడీపీ అధినేతకు ఊరట దొరికినట్లైంది.

 

చంద్రబాబు హయంలో శంకుస్థాపన చేసిన అమరావతి.. రాజధాని కాకుండా పోతోందని మదనపడుతున్న తరుణంలో కేంద్రం తీసుకున్న సానుకూల నిర్ణయం ఆయనకు కలిసి వస్తోందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అప్పట్లో జగన్ రాజధానిని మారుస్తారని, అందుకే రాజధాని కమిటీని ఏర్పాటు చేశారని వార్తలు గుప్పుమన్నాయి. ఆ వార్తలు నిజమే అనుకునేలా ఏపీకి రాజధానే లేనట్లు కేంద్రం ఇండియా మ్యాప్ రిలీజ్ చేసింది. అయితే.. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ఈ అంశాన్ని లోక్‌సభలో లేవనెత్తాడు. దాంతో వెంటనే స్పందించిన కేంద్రం.. అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ మళ్లీ మ్యాప్ విడుదల చేసింది.

 

ఇది ఒక రకంగా చంద్రబాబుకు పెద్ద విజయంగా రాజకీయ పండితులు అభివర్ణిస్తున్నారు. అధికారం కోల్పోయినప్పటి నుంచి ఇప్పటి వరకు జగన్‌పై పైచేయి సాధించని బాబు.. అమరావతి విషయంలో మాత్రం గెలుపొందారని చెబుతున్నారు. దీనికి తోడు నిన్న వైసీపీ నేత బొత్స సత్యనారాయణ నోటి దురుసుతో అమరావతిని స్మశాన వాటికతో పోల్చారు. ఈ రెండు అనుకోని పరిణామాలతో జగన్‌పై పోరాటానికి సిద్ధమౌతున్నారు చంద్రబాబు. టీడీపీ ఇప్పటికే ట్వీట్ల దాడి ప్రారంభించింది. “ఆంధ్రులు గర్వించేలా రాష్ట్రానికి రాజధానిగా ఒక ప్రపంచస్థాయి నగరాన్ని నిర్మిస్తామంటే… కేవలం చంద్రబాబు మీది నమ్మకంతో వేల ఎకరాలను ఇచ్చారు రాజధాని ప్రాంత రైతులు. ఈరోజు అమరావతిని స్మశానంతో పోల్చి, ఆ రైతుల త్యాగాలను అవహేళన చేసారు బొత్సగారు” అంటూ టీడీపీ ట్వీట్ చేసింది.

 

ఆరు నెలల పాలనలో జగన్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయని స్పష్టమౌతుంది. ప్రస్తుతం కడప టూర్ లో ఉన్న చంద్రబాబు పర్యటన రేపటితో ముగియనుంది. చేతికి దొరికిన అవకాశాన్ని ఎంతవరకు ఉపయోగించుకుంటారో చూద్దాం..

భూముల అమ్మకం: జగన్ నిర్ణయం తప్పు

 

ఆంధ్రప్రదేశ్ ప్రజల అవసరాలకు మించి ప్రభుత్వ భూమి ఉంది కాబట్టి వేస్ట్ గా పడి ఉన్న భూమిని అమ్మి సంక్షేమ పథకాలకు ఉపయోగించాలని జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే ప్రస్తుతం ఉన్న సంక్షేమ పథకాలు ఇలానే కొనసాగాలంటే ప్రభుత్వానికి తగినంత ఆదాయం కూడా లేదనేది సర్కార్ వాదన. కాబట్టి వేస్ట్ గా పడి ఉన్న భూమిని ఎవరు ఆక్రమించుకోకుండా ఉండాలన్నా.. సంక్షేమ పథకాలు కొనసాగాలన్నా.. ప్రభుత్వ భూమిని అమ్మక తప్పదు అని జగన్ సర్కార్ ఆలోచిస్తున్నది. అయితే ఈ వాదనల పై నిజ నిజాలను ఇప్పుడు చూద్దాం..

 

అమ్మకం పై జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరియైనది కాదనేది అనేకమంది విశ్లేషకుల అభిప్రాయం. 5 సంవత్సరాలు అధికారంలో ఉండే ముఖ్యమంత్రి అసలు ప్రభుత్వ భూమిని అమ్మే హక్కు లేదు. ఒక ఇంటి యజమాని ఇల్లు అమ్ముకొని దాన ధర్మాలు చేస్తే… ప్రస్తుతం బాగుంటుంది కానీ తర్వాత వచ్చే తరాలు ఎలా బ్రతుకుతాయి..? అని కూడా ఆలోచించాలి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రభుత్వరంగ స్కూల్స్, కాలేజీలకు, ఆసుపత్రులకు, బస్సు డిపోలకు, అంగన్ వాడీలకు, కార్యాలయాలకు ఉన్న స్థలం, 30, 40 లేదా 50 సంవత్సరాల తర్వాత కూడా సరిపోతుందా… ? కచ్చితంగా సరిపోదు. మరి అలాంటప్పుడు ఇప్పుడు అమ్ముకోవడం ఎందుకు?. ఇప్పుడు స్థలాలు అమ్ముకొని అప్పుడు కొనుకోవచ్చు అన్నట్లయితే.. ఇప్పుడున్న స్థలాల రేట్ల అప్పటికి పెరిగిపోతే కొనడం కష్టమౌతుంది కదా..! తెలుగు లో ఒక సామెత ఉంది.. “అమ్మబోతే అడవి-కొనబోతే కొరివి” అని అలానే ఉంటది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వ భూములు అమ్మడం అనేది మంచిది కాదు.

 

అలాగే ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురౌతుంది కాబట్టి అమ్ముతాము అంటున్నారు. భూములనే కాపాడటం చేతకాకపోతే ఇక రాష్ట్రాన్ని ఏమి కాపాడతారు? రాష్ట్ర ప్రజలను ఎలా కాపాడతారు? అయినా ఉన్న స్థలం నుండి ఆదాయం వచ్చే మార్గాలను అన్వేషించాలి గాని అమ్మడం అనేది సరైన నిర్ణయం కాదు.

అందాలతో సెగరేపుతున్న పునర్నవి.. ఫొటోస్ వైరల్

 

బిగ్ బాస్ సీజన్ 3లో కంటెస్టంట్ గా పాల్గొన్న పునర్నవి భూపాలం. తన గ్లామర్ షోతో హౌస్ కే అందాన్ని తీసుకొచ్చింది. ఈ షో తరువాత పునర్నవికి ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది.బిగ్ బాస్ విన్నర్ గా నిలిచిన రాహుల్ సిప్లిగంజ్ సక్సెస్ లో కీలకపాత్ర పోషించింది పునర్నవి. హౌస్ లో ఉన్నప్పుడు వీరిద్దరి మధ్య నడిచిన ట్రాక్ బాగా హైలైట్ అయింది.

 

బిగ్ బాస్ షో నుండి బయటకి వచ్చిన తరువాత కూడా రాహుల్, పునర్నవిల మధ్య ఏదో నడుస్తుందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఈ రూమర్లను ఈ జంట ఖండిస్తూనే ఉంది. కాగా.. పునర్నవి ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉంది. ‘ఉయ్యాలా జంపాలా’ సినిమాలో హీరోయిన్ కి ఫ్రెండ్ గా నటించిన ఈ బ్యూటీ ఆ తరువాత ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ అనే సినిమాలో కనిపించింది. ఆ తరువాత ‘పిట్టగోడ’, ‘ఎందుకు ఏమో’ చిత్రాల్లో హీరోయిన్‌గా కనిపించింది.

 

 

కానీ ఆ సినిమాలో పెద్దగా గుర్తింపు తీసుకురాలేకపోయాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ ‘సైకిల్’ అనే సినిమాలో నటిస్తోంది. ఇది ఇలా ఉండగా.. ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటో షూట్ లతో ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మెడిటేషన్ చేస్తున్న ఉన్న ఈ ఫోటో ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. పునర్నవి ఇంత బోల్డ్ గా ఎప్పుడూ కనిపించకపోవడంతో అభిమానులు షాక్ అవుతున్నారు. కావాలనే ఈ ఫోటోని ఎవరో లీక్ చేసి ఉంటారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

 

Read More: Disco Raja Movie Review

సరిలేరు నీకెవ్వరు 12 డేస్ కలెక్షన్స్

 

సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదలైన సరిలేరు నీకెవ్వరు సినిమా తొలిరోజు నుండే సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది. మహేష్ బాబు అభినయం క్లాస్, మాస్ ఆడియన్స్ అందరినీ ఆకట్టుకుంది. అనిల్ రావిపూడి స్టైల్ ఆఫ్ కామెడీ ఫ్యామిలీ ప్రేక్షకుల మనసు దోచుకుంది. మరి 12 రోజుల్లో ఈ సినిమా రాబట్టిన కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.

 

నైజాం – 34.29 కోట్లు

సీడెడ్ – 14.44 కోట్లు

ఉత్తరాంధ్ర – 17.61 కోట్లు

ఈస్ట్ – 10.42 కోట్లు

వెస్ట్ – 6.80 కోట్లు

కృష్ణా – 8.18 కోట్లు

గుంటూరు – 9.22 కోట్లు

నెల్లూరు – 3.65 కోట్లు

ఏపీ+తెలంగాణ – 104.61 కోట్లు

రెస్ట్ ఆఫ్ ఇండియా – 8.85 కోట్లు

ఓవర్సీస్ – 11.41 కోట్లు

వరల్డ్ వైడ్ టోటల్ షేర్ – 124.87 కోట్లు

2020 సమ్మర్… రీమేక్ స్పెషల్

 

2020 వేస‌విలో ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద సంద‌డి చేయ‌నున్నాయి. వీటిలో స్ట్ర‌యిట్ పిక్చ‌ర్స్ తో పాటు రీమేక్ మూవీస్ కూడా ఉండ‌డం విశేషం. ఆ క్రేజీ రీమేక్స్ వివ‌రాల్లోకి వెళితే…ఏప్రిల్ 9న త‌డ‌మ్ కి రీమేక్ గా రూపొందుతున్న రెడ్ (ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ హీరో,కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌కుడు) రిలీజ్ కానుండ‌గా.. మే నెల‌లో అసుర‌న్ రీమేక్ (విక్ట‌రీ వెంక‌టేష్ క‌థానాయ‌కుడు ,శ్రీ‌కాంత్ అడ్డాల ద‌ర్శ‌కుడు) విడుద‌ల కానుంది. ఇక అదే మే నెల‌లో పింక్ రీమేక్ (ఇందులో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌ధాన పాత్ర‌ధారి,వేణు శ్రీ‌రామ్ ద‌ర్శ‌కుడు) ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. మ‌రి.. సమ్మ‌ర్ సీజ‌న్ లో త‌క్కువ గ్యాప్ లోనే రానున్న ఈ క్రేజీ రీమేక్స్.. ఎలాంటి ఫ‌లితాన్ని అందుకుంటాయో చూడాలి.

 

Read More:పవన్ కళ్యాణ్ కోసం ప్రత్యేక విమానం…ఎందుకో తెలుసా…?

బంగార్రాజు మూవీ అప్ డేట్.. ఎప్పుడు విడుదల కాబోతుంది అంటే…!

 

భారీ అంచనాలతో వచ్చిన ‘మన్మధుడు -2’ సినిమా ఘోర పరాజయం పొందడంతో నాగార్జున తన రూటును మార్చాడు. ఇప్పడు ఓ డిఫరెంట్ జోనర్ లో సినిమా చేస్తున్నాడు. నాగార్జున తాజాగా చేస్తున్న సినిమా ‘వైల్డ్ డాగ్’. ఈ సినిమాలో అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ విజయ్ వర్మగా నటిస్తున్నాడు నాగ్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతుంది. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసి సమ్మర్ కానుకగా ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఇక ఈ సినిమాను నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నారు.

 

Read More:పవన్ కళ్యాణ్ కోసం ప్రత్యేక విమానం…ఎందుకో తెలుసా…?

 

ఇక ఈ సినిమా తర్వాత ‘బంగార్రాజు’ సినిమాలో నటించబోతున్నాడు నాగార్జున. ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కబోతుంది. ఈ మూవీ ఎప్పుడో ప్రారంభం కావలసి ఉన్న దర్శకుడు కళ్యాణ్ కృష్ణ సోదరుడి మరణంతో ఈ సినిమా ఆలస్యం అయ్యింది. కాగా ఈ సినిమా స్క్రిప్ట్ పనులు ఫైనల్ స్టేజి లో ఉన్నాయి. రమ్యకృష్ణ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా మార్చిలో సెట్స్ మీదకు వెళ్తుందట. ఈ సినిమా కోసం అనూప్ రూబెన్స్ సాంగ్స్ కంపొజిషన్ పనిలో ఉన్నారు.

 

అన్ని అనుకున్నట్టు జరిగితే వచ్చే సంక్రాంతికి బంగారాజు గోడలు దూకి చేసే చిలిపి పనులు చూడొచ్చు…

 

Read More: అందాలతో సెగరేపుతున్న పునర్నవి.. ఫొటోస్ వైరల్

గూఢచారిగా సూపర్ స్టార్ మహేష్ బాబు..!

 

సరిలేరు నీకెవ్వరు సినిమా విడుదల తర్వాత నుండి రెస్ట్ తీసుకుంటున్న మహేష్ బాబు.. ఏప్రిల్ నుండి వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు.

 

Read More:పవన్ కళ్యాణ్ కోసం ప్రత్యేక విమానం…ఎందుకో తెలుసా…?

 

ఈ సినిమాలో మహేష్ గూఢచారి పాత్రలో నటించబోతున్నాడు. మహేష్ కోసం ఓ స్టైలిష్ స్పై ద్రిల్లర్ రెడీ చేసాడట వంశీ. ఈ సినిమా హాలీవుడ్ జేమ్స్ బాండ్ తరహాలో సాగుతుందని తెలుస్తుంది. కృష్ణ కూడా మహేష్ బాబును జేమ్స్ బాండ్ తరహా పాత్రలో చూడాలని అనుకుంటున్నాడట. గతంలో ‘స్పైడర్’ సినిమాలో మహేష్ ఆ తరహా పాత్రలో నటించినప్పటికీ కానీ ఫలితం దక్కలేదు. ఇప్పుడు పక్క ప్లానింగ్ తో పకడ్బంధితో రాబోతున్నాడట మహేష్. ఇక ఈ సినిమాలో ‘భరత్ అనే నేను’ ఫేం కియారా అద్వానీ హీరోయిన్ గా నటించబోతుండగా తమన్ మ్యూజిక్ అందించబోతున్నాడని తెలుస్తుంది.

 

Read More: కరోనా వైరస్.. సోకితే ఈ లక్షణాలు.. సోకకుండా ఈ జాగ్రత్తలు

రవిశాస్త్రి పై మరో వ్యంగ చిత్రం!

 

టీమిండియా కోచ్‌ రవిశాస్త్రి ఈ మధ్య సోషల్‌ మీడియాలో ఎలాంటి పోస్ట్‌ చేసినా సరే నెటిజన్లు విపరీతంగా ట్రోల్‌ చేస్తున్నారు. అతడి మద్యపాన సేవనం గురించే మాట్లాడుతున్నారు. వెస్టిండీస్‌ పర్యటన నుంచి ఈ ట్రోలింగ్‌ పరంపర కొనసాగుతోంది. ప్రస్తుతం ఇండోర్‌ వేదికగా భారత్‌, బంగ్లాదేశ్‌ తొలి టెస్టులో తలపడుతున్నాయి. మ్యాచ్‌కు ముందు శాస్త్రి ట్విటర్లో ఓ పోస్ట్‌ చేశాడు. బంతిని పట్టుకొని స్పిన్‌ బౌలింగ్‌ చేస్తున్న పోజు ఇచ్చాడు. ఈ చిత్రాలతో ‘పాత అలవాట్లు అంత సులభంగా పోవు’ అనే అర్థం వచ్చేలా ఓ వ్యాఖ్య జతచేశాడు. అంతే.. వెంటనే ట్విటర్లో వ్యంగ్య బాణాల మోత మొదలైంది. నెటిజన్లు అతడి చిత్రాలను మార్ఫింగ్‌ చేసి రీట్వీట్లు చేస్తున్నారు. ‘ప్రధాన కోచ్‌కు యోయో టెస్టు పెట్టాలి’ అని అంటున్నారు. మరికొందరు ‘నిజమే.. పాత అలవాట్లు పోవు’ అంటూ గ్లాసులోకి బీరు వంపుతున్న చిత్రాలు పెట్టేస్తున్నారు. రవిశాస్త్రిని లక్ష్యంగా ఎంచుకోవడం కొత్తేమీ కాదు. చాన్నాళ్లుగా నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు.