
పేస్ బుక్ సీఈవో, ప్రపంచంలో అత్యంత ధనవంతుడైన మార్క్ జకర్బర్గ్ కు షాపింగ్ అంటే ఎంతో ఇష్టం. అదికూడా డిస్కౌంట్ లో ఎక్కడ వస్తువులు దొరుకుతున్నాయో తెలుసుకొని మరి కొంటుంటారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం తాజాగా జకర్బర్గ్ కు సంబంధించిన ఒక ఫోటో వైరల్ గా మారింది. దానిలో ఆయన తన భార్య ప్రిసిలతో పాటు షాపింగ్ చేస్తూ కనిపిస్తున్నారు. ఒక టీవీని వారు పరీక్షగా చూస్తున్నారు. దీనిపై భారీ డిస్కౌంట్ వుంది. ఈ ఘటన అమెరికా లోని కాస్టాకో మాల్ లో చోటుచేసుకుంది. కాగా జకర్బర్గ్ ఆస్తి విలువ మన కరెన్సీ లో రూ. 5. 71 లక్షల కోట్లు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ మనం పిల్లలకు అన్నీ కొని ఇవ్వకూడదని, వారికి భాద్యతలు అప్పజెప్పాలని అన్నారు. అందుకే తన పిల్లలను ఆఫీస్ కి తీసుకువెళ్తానని చెప్పారు. కాగా జకర్బర్గ్ పోస్ట్ చేసిన ఒక వీడియోలో అతని కుమార్తె ఇంటి పనులు చేస్తూ కనిపిస్తున్నారు.