Home Blog Page 8625

‘అసూరన్’ డైరెక్టర్ ను లైన్లో పెట్టిన యంగ్ టైగర్

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ మూవీ షూటింగ్లో బీజీగా ఉన్నాడు. దర్శక దిగ్గజం రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ మూవీని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్నాడు. ‘ఆర్ఆర్ఆర్’లో జూనియర్ ఎన్టీఆర్ కొమురంభీం పాత్రలో కనిపించబోతున్నాడు. ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ శరవేగంగా పూర్తి చేసుకుంటుంది. ఈ మూవీ నుంచి జూనియర్ ఎన్టీఆర్ రిలీవ్ కావడానికి ఇంకా నెలలు సమయం పట్టేలా ఉంది. దీని తర్వాత ఎన్టీఆర్ తమిళ డైరెక్టర్ వెట్రిమారన్ దర్శకత్వంలో నటించనున్నారని సమాచారం. ఇటీవలే వెట్రిమారన్ దర్శకత్వం వహించిన ‘అసూరన్’ మూవీ తమిళంలో సంచలనం సృష్టించిన సంగతి తెల్సిందే. దీంతో ఈ మూవీ డైరెక్టర్ తో కలిసి నటించేందుకు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఎన్టీఆర్ కోసం దర్శకుడు వెట్రిమారన్ ఓ మాస్ ఎమోషన్ కథను సిద్ధం చేశాడు. ఈ కథ నచ్చడంతో వెంటనే ఓకే చెప్పారని తెల్సింది. వెట్రిమారన్ తమిళంలో తెరకెక్కించిన ‘పొల్లాదవన్’, ‘ఆడుకాలమ్’, ‘విశారణై’, ‘వడ చెన్నై మూవీలు భారీ విజయాలు సాధించాయి. ఈ సినిమాలతో ఉత్తమ దర్శకుడిగా పేరుతెచ్చుకోవడంతోపాటు జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులను గెలుపొందారు. ఇటీవలే ధనుష్ తో తెరక్కెక్కించిన ‘అసూరన్’ మూవీతో తమిళనాట సంచనలం సృష్టించింది. దీంతో జూనియర్ ఎన్టీఆర్ వెట్రిమారన్ తో నటించేందుకు ఉత్సాహంగా ఉన్నాడు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఏ మూవీ చేయాలో సందిగ్ధం ఉన్నాడు. కాగా వెట్రిమాన్ కథ ఎన్టీఆర్ కు నచ్చడంతో ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఈ మూవీ ఉండనుందని తెలుస్తోంది.

జూనియర్ ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ మూవీ చేస్తుంగానే దర్శకుడు త్రివిక్రమ్ ను లైన్లో పెట్టాడు. గతంలో వీరి కాంబినేషన్లలో వచ్చిన ‘అరవింద సమేత’ బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. ఇటీవల త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబినేషన్లలో వచ్చిన ‘అల.. వైకుంఠపురములో’ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ మూవీ తర్వాత ఎన్టీఆర్ మూవీ ఉంటుందని అనుకున్నారు. అయితే ‘ఆర్ఆర్ఆర్’ మూవీ షూటింగ్ ఇప్పట్లో పూర్తయ్యేలా కనపించడం లేదు. అయితే ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ నుంచి రిలీవ్ కాకుండా ఇంకా నాలుగునెలలు సమయం పడుతుందని సమాచారం. ఈమేరకు వెట్రిమారన్ కథ నచ్చడంతో త్రివిక్రమ్ కంటే ముందుగానే ఈ మూవీ స్టార్ కానుందని తెలుస్తోంది.

మహేష్, ప్రభాస్ లతో రాజమౌళి భారీ పీరియాడికల్ ఫిలిం?

దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు ప్రధాన పాత్రల్లో ఆర్ ఆర్ ఆర్‌‌ను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’తో బిజీగా ఉన్న రాజమౌళి, తన తదుపరి చిత్రాన్ని కూడా లైన్‌లో పెట్టేశాడని, ‘బాహుబలి’ని మించేలా ఉండే ఈ భారీ పీరియాడికల్ చిత్రంలో టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కలిసి నటిస్తారని ఇండస్ట్రీ లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. దీనిపై అధికారిక సమాచారం లేకున్నా, వీరి ముగ్గురి పేర్లూ వినగానే, ఫ్యాన్స్ కామెంట్ల మీద కామెంట్లు చేస్తున్నారు. కేఎల్ నారాయణ నిర్మాతగా ఓ చిత్రాన్ని రాజమౌళి అంగీకరించిన సంగతి తెలిసిందే. ఈ వార్తల్లో నిజం ఎంతో తెలియాలంటే వేచి చూడాలి.

‘ఏమైపోయావే’ మోషన్ పోస్టర్

శ్రీరామ్ క్రియేషన్స్, వీఎం స్టూడియోస్ పతాకాలపై మురళి దర్శకత్వంలో రాజీవ్ సిద్ధార్థ్, భవాని చౌదరి, శాను మజ్జారి హీరోహీరోయిన్లుగా నిర్మాత హరి కుమార్ నిర్మిస్తున్న చిత్రం ‘ఏమైపోయావే’. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం మోషన్ పొస్టర్ ను ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేశారు.

ఈ సందర్భంగా నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ – ”ఏమైపోయావే’ టైటిల్ చాలా క్యాచీ గా ఉంది. ప్రేమికుల దినోత్సవం రోజున ఈ చిత్రం మోషన్ పోస్టర్ రిలీజ్ చేయడం హ్యాపీగా ఉంది. మోషన్ పోస్టర్ చాలా బావుంది. ఈ చిత్రం తప్పకుండా ఘనవిజయం సాధించి చిత్ర యూనిట్ కి మంచి పేరు రావాలని కోరుకుంటున్నా” అన్నారు.

https://www.youtube.com/watch?v=nZ4dZ5FSEGs

నిర్మాత హరికుమార్ మాట్లాడుతూ – ”మా బ్యానర్లో ‘ఏమైపోయావే’ చిత్రం ఒక మంచి ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోంది. మేము అడిగిన వెంటనే మా చిత్రం మోషన్ పోస్టర్ రిలీజ్ చేసిన నిర్మాత రాజ్ కందుకూరి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. సినిమా బాగా రావడానికి ఆర్టిస్ట్స్, టెక్నిషియన్స్ ఎంతగానో సహకరించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే సినిమా విడుదల తేదీ ప్రకటిస్తాం” అన్నారు.

రాజీవ్ సిద్ధార్థ్, భవాని చౌదరి, శాను మజ్జారి, శ్రీను కేసబోయిన, మిర్చి మాధవి, సునీత మనోహర్, నామాల మూర్తి, మీసం సురేష్, మళ్ళీ రావా బుజ్జి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ, మాటలు: శాంతి పుత్ర విజయ్, సినిమాటోగ్రఫీ: శివ రాధోడ్, సంగీతం: రామ్ చరణ్, పాటలు: తిరుపతి జానవ, పీఆర్వో: సాయి సతీష్, నిర్మాత: హరి కుమార్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మురళి.

కేటీఆర్ లో కొత్త కోణం.. షాక్ లో కెసిఆర్


2014లో మొదటిసారి, 2018లో రెండవసారి తెరాస పార్టీ తెలంగాణాలో అధికార పీఠం ఎక్కింది. రెండవ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత పలు సందర్భాలలో కెసిఆర్ మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో మూడో ఫ్రాంట్ ఏర్పాటుకు తెరాస ముందుంటుందని కెసిఆర్ ప్రగల్బాలు పలికారు. ఆ తర్వాత ఏమి జరిగిందో.. ఏమోగాని కెసిఆర్ ఆ విషయంలో మౌనం వహించాడు. బహుశా మంచి సమయం కోసం ఎదురుచూస్తున్నాడేమో తెలియదు. కానీ జాతీయ నాయకునిగా ఎదగాలని కెసిఆర్ కి తన మనసులో ఉందనేది వాస్తవం.

అసల విషయం ఏమిటంటే.. మొన్న టైమ్స్ నౌ సమ్మిట్, నిన్న నాస్కామ్ సాంకేతిక నాయకత్వ వేదిక సదస్సులో తెలంగాణ మంత్రి కేటీఆర్ మాటలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ సదస్సుల్లో కేటీఆర్ మాట్లాడుతూ.. జాతీయ పార్టీలు లేవని, ఇప్పుడున్న పార్టీలన్నీ ప్రాంతీయపార్టీలేనని చెప్పటం, కేంద్రం పుచ్చుకునే స్థితిలో ఉందని, బీజేపీ, కాంగ్రెస్ రెండూ విఫలమయ్యాయి కాబట్టి ప్రాంతీయ పార్టీల కూటమే శరణ్యమని ప్రజల్ని నమ్మించాలని ప్రయత్నం చేయటం. రాష్ట్రస్థాయి ధాటి జాతీయ స్థాయిలో అడుగుపెట్టాలనుకునే తెరాస కి ఇది మింగుడు పట్టని అంశం. కెసిఆర్ ఒక జాతీయ నాయకునిగా మాట్లాడితే బాగుండేదని విశ్లేషకుల అభిప్రాయం.

ప్రస్తుతానికి తెరాస, ప్రాంతీయ పార్టీ, తర్వాత జాతీయ పార్టీ అవుతుందో లేదో చెప్పలేం, కానీ ఒకవేళ కెసిఆర్ జాతీయ నాయకునిగా చలామణి కావాలనుకుంటే.. కేటీఆర్ పరిపక్వత కలిగి మాట్లాడితే బాగుండేది. ఆప్ విషయానికి వస్తే.. ఢిల్లీ ఒక్క రాష్ట్రంలోనే పరిపాలనలో వున్నా..దేశ ప్రజలు అరవింద్ కేజ్రీవాల్ ని ప్రాంతీయ పార్టీ నాయకుడుగా చూడటంలేదు. ఎందుకని? అదే కెసిఆర్ ని తెలంగాణ నాయకుడుగానే చూస్తున్నారు.ఈ నిజాన్ని మంత్రి కేటీఆర్ ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది.

‘అంధాధున్’లో నితిన్?

బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘అంధాదున్’ తెలుగులో రీమేక్ కాబోతుంది. తెలుగు నేటివిటీగా అనుగుణంగా కథలో మార్పులు జరుగుతున్నాయి. ఈ మూవీలో నితిన్ హీరోగా నటించనున్నాడు. నితిన్ సరసన హేబ్బాపటేల్ ఎంపికైందని తెలుస్తోంది. బాలీవుడ్లో విమర్శకుల ‘అంధాదున్’ విమర్శకుల ప్రశంసలను అందుకోవడమే కాకుండా జాతీయ అవార్డులను గెలుచుకొంది. ప్రస్తుతం తెలుగులో క్రైమ్ థిల్లర్స్ స్టోరీలకు ఆదరణ లభిస్తుంది. దీంతో ఈ మూవీని త్వరలోనే పట్టాలెక్కించేందుకు సన్నహాలు జరుగుతున్నాయి. ఈ మూవీ రీమేక్ హక్కులను నితిన్ తండ్రి సుధాకర్ గతంలోనే దక్కించుకున్నాడు.

‘అంధాధున్’ మూవీలో అద్భుత నటన కనబర్చిన ఆయుష్మాన్ ఖురానా ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు గెలుచుకున్నాడు. ఈ మూవీలో అంధుడైన ప్లియోనో ప్లేయర్ ఓ హత్యకు ప్రత్యక్ష సాక్షిగా నిలుస్తాడు. ఈ కథతో క్రైమ్ థిల్లర్ గా చిత్రం తెరకెక్కించి మంచి విజయం సాధించింది. ఈ మూవీలో రాధికా ఆప్టే, టబులు నటించారు. ఈ మూవీని తెలుగులో మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించనున్నాడు. ఈమేరకు హీరో నితిన్ స్వయంగా ప్రకటించాడు. ఈ మూవీని శ్రేష్ఠ మీడియా, వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించనున్నారు.

‘అంధాదున్’ మూవీని మేకపాటి గాంధీ క్రైమ్ కెమెడీ థ్రిల్లర్ గా తెరకెక్కించబోతున్నాడు. వెంకట్రాది ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజాలతో మంచి గుర్తింపు తెచ్చకున్నాడు. చివరగా తీసిన కృష్ణార్జున యుద్ధం ఫ్లాప్ కావడంతో అవకాశాలు తగ్గాయి. దీంతో ‘అంధాదున్’ రీమేక్ తో విజయం సాధించి మళ్లీ ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు. ప్రస్తుతం నితిన్ భీష్మ మూవీ ప్రమోషన్లలో బీజీగా ఉన్నాడు. ఈనెల 21న చిత్రం విడుదల కానుంది. ‘అంధాదున్’ రీమేక్ తోపాటు చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ‘రంగ్ దే’ మూవీ చేయబోతున్నారు. త్వరలోనే ఈ రెండు చిత్రాలు పట్టాలెక్కనున్నాయి.

చిన్న సినిమాల్లో ‘చీమ’ సినిమా వేరు!

“చీమ – ప్రేమ మధ్యలో భామ! ” సినిమా దర్శకుడు శ్రీకాంత్ “శ్రీ” అప్పలరాజు మాట్లాడుతూ “మనుషులలో మంచి మనుషులు వేరు – చిన్న సిమిమాలలో ‘చీమ’ సినిమా వేరు. అంటే ఒక వెరైటీ, ఒక నావేల్టీ – అదేంటో తెలియాలంటే మా ‘ చీమ ప్రేమ మధ్యలో భామ! ‘ సినిమాను దగ్గరున్న థియేటర్లో చూడాలి – ఫిబ్రవరి 21విడుదల” అన్నారు.

నిర్మాత లక్ష్మీనారాయణ మాట్లాడుతూ “ఈనాటి యూవతీయువకులు ప్రేమ విషయంలో ఎంత పరిణతితో ఉన్నారో తెలియచెప్పే చిత్రం ఇది. కాలం మారినా నిజమైన ప్రేమ స్వచ్ఛంగా అన్నిపరీక్షలకు అతీతంగానే ఉంటుంది! అని తెలియ చేయడానికే మా ఈ చిన్న ప్రయత్నం” అని అన్నారు.

హీరో అమిత్ ” ఈ concept based సినిమాలో హీరో పాత్ర ప్రేక్షకులకు బాగా connect అవుతుంది, ఎప్పటికీ గుర్తుండిపోతుంది! ” అన్నారు.

మాగ్నమ్ ఓపస్ (Magnum Opus ) ఫిలిమ్స్ పతాకం పై శ్రీకాంత్ “శ్రీ” అప్పల రాజు దర్శకత్వం లో ఎస్ ఎన్ లక్ష్మీనారాయణ నిర్మిస్తున్న చిత్రం “చీమ – ప్రేమ మధ్యలో భామ !”. అమిత్ మరియు ఇందు హీరో హీరోయిన్ గా నటించారు

నటీ నటులు : అమిత్, ఇందు, సుమన్, హరిత, పురంధర్ , వెంకట్ నిమ్మగడ్డ, రమ్య చౌదరి, బొమ్మ శ్రీధర్, రవి కిషోర్ , కిషోర్ రెడ్డి, వెంకటేశ్ మరియు సురేష్ పెరుగు.

మోదీ జిమిక్కులతో బిజెపిని ఓడించిన కేజ్రీవాల్ !


ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ వరుసగా మూడోసారి ఘన విజయం సాధిండానికి బిజేపికి అనూహ్య విజయాలు తీసుకు రావడం కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అనుసరించినా గిమ్మిక్ లనే ప్రయోగించినట్లు స్పష్టం అవుతున్నది. మోదీ బాటలో నడిచి బిజెపికి ఖంగు తినిపించారు.

భావోద్వేగాల ద్వారా రాజకీయ ప్రయోజనం పొందడంలో అలవాటు పడిన పార్టీ బీజేపీ నేతలు వివాదాస్పద ప్రసంగాలు చేస్తూ మొత్తం ప్రచారాన్ని కేజ్రీవాల్ కు అనుకూలంగా మలచడంలో తోడ్పడ్డారని చెప్పవలసి ఉంటుంది. ‘గోలీ మారో (కాల్చి పారేయండి)’, ‘ఇది ఇండో-పాకిస్థాన్‌ మ్యాచ్‌’ వంటి విద్వేష వ్యాఖ్యలు తమ పార్టీ నేతలు చేసి ఉండాల్సింది కాదని.. ఆ ప్రసంగాలే తమకు నష్టం చేసి ఉంటాయని అమిత్‌షా సహితం పేర్కొన్నారు.

వ్యక్తిగత విమర్శలను ఆసరా చేసుకొని ప్రజల నుండి సానుభూతి పొందే వ్యూహాన్ని మోదీ అడుగుజాడలను అనుసరించి కేజ్రీవాల్ మరోసారి ప్రజల మద్దతు చూరగొన్నారు. ఉదాహరణకు 2014 ఎన్నికల ముందు మోదీని `ఛాయివాలా’ అంటూ కాంగ్రెస్ నాయకులు ఎద్దేవా చేస్తే `చాయి పే చర్చ’ అంటూ దేశ వ్యాప్తంగా ప్రచారంలో మోదీ సంచలనం కలిగించడం తెలిసిందే.

అదే విధంగా, రాహుల్ గాంధీని `చౌకీదార్’ అంటూ ప్రధాని మోదీని ఎగతాళి చేసే ప్రయత్నం చేస్తే ట్విట్టర్ లో తన పేరు ముందు `చౌకీదార్’ అనే పదాన్ని ప్రధాని జత చేసుకున్నారు. అదే వరవడిని కేంద్ర మంత్రులు, పార్టీ నాయకులు అనుసరించి ప్రజలలో పెద్ద చర్చకు దారితీశారు.

అదే వ్యూహాన్ని అనుసరించిన కేజ్రీవాల్, బీజేపీ ఎంపీ పారవేశ్ వర్మ తనను “ఉగ్రవాది” గా ఆరోపిస్తే, ప్రత్యారోపణలు చేయలేదు. “నేను ఉగ్రవాదినా?” అంటూ సభలలో అడిగారు. వారంతా “కాదు” అంటూ సమాధానం ఇచ్చారు. ఈ విషయమై ప్రజలకే వదిలివేస్తున్నాను అంటూ నిజంగా తాను ఉగ్రవాదిని అయితే బీజేపీ గుర్తు కమలంకే ఓట్ వేయమని చెప్పారు.

ఈ అంశంపైననే ప్రజలలో భావోద్వేగాలను రెచ్చగొట్టారు. ఆ రోజున తనకు ఇంటికి వెళ్ళగానే తన ముసలి తల్లితండ్రులు ఈ విషయం ప్రస్తావించారని, “నీవు ఉగ్రవాదివి కావు, పక్క దేశభక్తి గలవాడిని” అంటూ మెచ్చుకున్నారని అంటూ చెప్పారు.

ఎన్నికల సమయంలో మతం కార్డు ను తెలివిగా ఉపయోగించడంలో నరేంద్ర మోదీ సిద్దహస్తులు. ఉదాహరణకు, 2019 ఎన్నికలలో చివరి దశ ఓటింగ్ కు ముందు కేదారనాథ్ కు వెళ్లి, కాషాయ వస్త్రధారణతో ఒక గుహలో రాత్రి అంతా ఉండి, ధాన్యం చేసుకున్నారు. ఈ ఫోటోలు మీడియాలో విస్తృతంగా వచ్చేటట్లు చూసారు.

అదే వరవడిని, కేజ్రీవాల్ కూడా అనుసరించారు. ఓటింగ్ కు ముందు రోజు కుటుంభం సభ్యులతో కలసి హనుమాన్ దేవాలయం సందర్శించారు. ఓటింగ్ రోజున నుదిటి బొట్టు ధరించారు. ఆ విధంగా ఒక విధంగా బిజెపి సానుభూతి పరుల ఓట్లను కూడా కైవసం చేసుకున్నారు.

ఎన్నికల సమయంలో మోదీ తన వ్యక్తిగత విశ్వాసాల ద్వారా ప్రజల సానుభూతి పొందే ప్రయత్నం చేస్తారు. గతంలో గుజరాత్ ఎన్నికల సమయంలో సహితం ఓటింగ్ రోజున తల్లి పాదాలకు వెళ్లి నమస్కారం చేసేవారు. అదే విధంగా కేజ్రీవాల్ సహితం ఓటింగ్ కు వెళ్లే ముందు తల్లితండ్రుల పాదాలు నమస్కారం చేశారు.

మోదీ మొత్తం ఎన్నికల ప్రచారం తన చుట్టూ జరిగేటట్లు చూసుకుంటారు. తనకు, మిగిలిన అన్ని ప్రతిపక్షాలకు మధ్య పోరాటంగా కనిపించేటట్లు చేస్తారు. అంటే గాని వివిధ పార్టీల మధ్య రాజకీయ పోరాటంగా ప్రజలు భావించే ప్రయత్నం చేయరు. కేజ్రీవాల్ కూడా అదే చేశారు.

గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సోనియా గాంధీ ఆయనను `మృత్యు వ్యాపారి’ అంటూ నిందించగా, దానిని `గుజరాత్ ప్రతిష్ట’ అంశంగా మోదీ మారారు. ఆమె ఆరోపణలకు ఆరు కోట్ల గుజరాతీ ప్రజలు సమాధానం ఇవ్వాలని కోరారు.

అదే విధంగా, 2019 ఎన్నికలకు ముందు ఫుల్వమా ఉగ్రదాడికి సమాధానంగా బాలకోట వద్ద ఉగ్రవాద శిబిరాలను ధ్వసం చేసిన్నట్లు ప్రకటించగా, అందుకు సాక్ష్యం ఏమిటని ప్రతిపక్షాలు విమర్శలు కురిపించాయి. 130 కోట్ల మంది భారత ప్రజలే సాక్ష్యమని అంటూ ప్రధాని తిప్పి కొట్టారు.

అదే తరహాలో బీజేపీ నాయకులు తపై చేస్తున్న వ్యక్తిగత విమర్శలను ప్రస్తావిస్తూ ఇది రెండు కోట్లమంది ఢిల్లీ పౌరులకు, బీజేపీకు మధ్య జరుగుతున్న పోరాటంగా కేజ్రీవాల్ అభివర్ణించారు.

బిజెపి ఆరోపణలకు రెండు కోట్ల మంది ప్రజలు సమాధానం ఇవ్వాలని కోరారు. ఆ విధంగా ఈ ఎన్నికను రెండు పార్టీల మధ్య పోరాటంగా కాకుండా, తనకు, ఇతర పార్టీల మధ్య జరుగుతున్న పోరాటంగా వ్యక్తిగత స్థాయికి తీసుకు వెళ్లడం ద్వారా ప్రజల సానుభూతి పొందారు.

బురదలో ప్రపంచ రికార్డ్..ఉసేన్ బోల్డ్ కంటే వేగంగా..

జమైకా పరుగుల వీరుడు ‘ఉసేన్ బోల్డ్’ ని ప్రపంచంలోనే నెంబర్ వన్ పరుగుల వీరుడుగా ఇప్పటి వరకు పరిగణించారు. కానీ కర్ణాటక కు చెందిన శ్రీనివాస గౌడ్, ‘బోల్డ్’ కంటే వేగంగా పరుగెడతాడు అనే విషయం ఇప్పుడు దేశంలోనే హాట్ టాపిక్ గా మారింది.

వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని మంగళూరు, ఉడిపి ప్రాంతాలలో ఒక సంప్రదాయ పోటీ “కంబళ” నిర్వహించేవారు. ఈ పోటీలో దున్నలతో పాటు పరుగెత్తాలి. ఎవరైతే తక్కువ సమయంలో గమ్యాన్నిచేరుకుంటారో వారే విజేతలు. అయితే ఈ పోటీ మాములు నేల మీద జరగదు. బురదతో ఉన్న మళ్ళలో నిర్వహిస్తారు.

ఈ పోటీలలో శ్రీనివాస గౌడ్ అనే 28ఏళ్ళ కుర్రవాడు తన దున్నలతో కలిసి 142.50 మీటర్ల దూరాన్ని కేవలం 13.62 సెకన్లలో పరుగెత్తాడు అంటే 100 మీటర్ల దూరాన్ని కేవలం 9.55 సెకన్లల్లోనే పూర్తి చేసాడు. దీంతో ఇప్పటివరకు ఉసేన్ బోల్డ్ తో ఉన్న రికార్డ్ (100 మీ.) 9.58 సెకన్ల కంటే ఇది తక్కువే.. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. శ్రీనివాస్ గౌడ్ ఈ రికార్డ్ చేసింది బురదలో అదేమామూలు నేలపై అయితే సమయం మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయి.

బాలలకు ప్రాణాంతకంగా బ్లడ్ కాన్సర్


భారత దేశంలో నేడు ఒక ప్రాణాంతక వ్యాధిగా మారుతున్న కాన్సర్ ముఖ్యంగా బాలల పట్ల అశనిపాతంగా మారుతున్నది. ప్రపంచం మొత్తం మీద ఎక్కువగా భారత్ లోనే కాన్సర్ బాలలో సోకుతున్నది. భారత్ లో కాన్సర్ తో చనిపిస్తూన్న బాలల్లో 70 శాతం బ్లడ్ కాన్సర్ తో చనిపోతున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 15న జరిపే బాలల కాన్సర్ దినం సందర్భంగా అపోలో క్రెడిల్ హాస్పిటల్ పిల్లల వైద్య నిపుణురాలు డా. షర్మిల ఈ విషయాలను తెలిపారు. భారత వైద్య పరిశోధన మండలి గణాంకాల ప్రకారం భారత దేశంలో వచ్చే చిన్నారుల క్యాన్సర్లలలో ముఖ్యంగా 5 సంవత్సరములలోపూ చిన్నారులలో ఎక్కువగా 70 శాతం వరకు బ్లడ్ కాన్సర్ వస్తున్నదని ఆమె చెప్పారు.

భారత వైద్య పరిశోధన మండలి ప్రకారం దేశంలో11.57 లక్షల మంది కొత్త క్యాన్సర్ రోగులు నమోదు అవుతుంటే, 22.25 లక్షల మంది పాత రోగులు క్యాన్సర్ తో పోరాడుతున్నట్లు తెలుస్తోంది. 2018 గణాంకాల ప్రకారం అధికారికంగా 7.84 లక్షల మంది మంది క్యాన్సర్ తో మృత్యువాత పడ్డారని స్పష్టం అవుతోంది.

కాగా, పీడియాట్రిక్ ఆంకాలజీ వారు ప్రచురించిన దాని ప్రకారం ఏటా 0-19 లోపు చిన్నపిల్లలు 50 వేల మంది క్యాన్సర్ భారిన పడుతున్నారు. అంటే దేశ వ్యాప్తంగా వచ్చే క్యాన్సర్ కేసులలో 4.5 నుండి 5.5 శాతం కేసులు చిన్నారులవే ఉంటున్నాయని వీరు విడుదల చేసిన గణాంకాలు తెలుపుతున్నాయి. ఇక 2016 లో ప్రకటించిన వివరాల ప్రకారం ఏటా నగర ప్రాంతాలలో క్యాన్సర్ భారిన పడుతున్న చిన్నారుల సంఖ్య పైన పేర్కొన్న సగటు కన్నా ఎక్కువగా ఉందని, ముఖ్యంగా ఢిల్లీలో 4.5 శాతానికి మించి ఉన్నదని పేర్కొన్నారు.

ఇది పరిస్థితి తీవ్రతకు అద్దపడుతోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే చిన్నారులలో వచ్చే క్యాన్సర్ వ్యాధులను త్వరగా గుర్తిస్తే నూటికి నూరు శాతం తగ్గించవచ్చని అయితే క్యాన్సర్ పై ఎక్కువ అవగాహన ఉన్న పాశ్చాత్య దేశాలలో క్యాన్సర్ వచ్చిన చిన్నారులలో 90 శాతం మందికి పూర్తిగా నయం చేయగలుగుతుంటే భారత్ లాంటి దేశాలలో ఈ సగటు 37 నుండి 40 శాతం మాత్రమే ఉంది. ఇందుకు ప్రధానంగా పేదరికమే కాకుండా అవగాహన లోపం కూడా ఉందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

వైద్య శాస్త్ర పరంగా చిన్నారులలో వచ్చే క్యాన్సర్లను 90 శాతానికి పైగా తగ్గించవచ్చని పాశ్చాత్య దేశాలలో గణాంకాలు నిరూపిస్తున్నాయి. ఎందుకంటే క్యాన్సర్ చికిత్సకు చిన్నారులు త్వరగా స్పందించి కోలుకొనే సత్తా స్వతహాగా ఉంటుందని వారికి సరైన వైద్యం అందిస్తే పూర్తి స్థాయిలో తగ్గించవచ్చనే విషయం ఇప్పటికే స్పష్టమైందని డా. షర్మిల చెప్పారు. అయితే భారత్ లో 37 నుండి 40 శాతం బాలలకు మాత్రమే నయం అవుతున్నది.

భారత దేశంలో వ్యాధి ముదిరిన తర్వాతనే వైద్యులు గుర్తిస్తున్నారని, దాంతో వ్యాధి తగ్గించ లేకపోతున్నామనే విషయాన్ని అందరూ గుర్తించాలని డా. షర్మిల కోరారు. దీనికి భారత దేశంలో ఉన్న పేదరికం, నిరక్ష్యరాస్యతల కారణంగా ఏర్పడే అవగాహన లేమే ప్రధాన కారణమని అంటూ తద్వారా జరుగుతున్న ఈ పిల్లల మరణాలను అరికట్టడానికి ప్రజలలో విస్తృత ప్రచారం అవగాహన కలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె పేర్కొన్నారు.

28న వస్తున్న’స్వేచ్ఛ’

ఆడపిల్ల పుడితే చాలు అమ్మో అనుకుంటూ అమ్మేస్తున్న సమాజమిది. అలా అమ్మకానికి గురై అభాగ్యురాలైన ఓ యువతి ఎలా బతికింది? ఆమె ఏంసాధించింది అనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘స్వేచ్ఛ’. ప్రముఖ గాయని మంగ్లీ టైటిల్‌ రోల్‌ ను పోషించింది. అన్ని పనులనూ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. కెపీఎన్‌. చౌహన్‌ దర్శకత్వంలో సరస్వతి డెవలపర్స్‌, లచ్చురాం ప్రొడక్షన్స్‌ పతాకంపై ఆంగోత్‌ రాజునాయక్‌ దీన్ని నిర్మించారు.

నిర్మాత మాట్లాడుతూ.. తండా స్థాయి నుండి ప్రపంచస్థాయి వరకు గాయనిగా ఎదిగిన మంగ్లీ ఈ చిత్రంలో అద్భుతమైన పాత్రను పోషించింది. ఆమె పాత్ర నేటి అమ్మాయిలకు ఎంతో ప్రేరణగా నిలుస్తుంది. సెంటిమెంట్‌, వినోదం మేళవింపుతో రూపొందిన ఈ చిత్రం అందర్ని అరిస్తుందనే నమ్మకం వుంది. పాపికొండలతో పాటు అందమైన లోకేషన్లలో చిత్రీకరణ చేశాం’ అని తెలిపారు. ‘ఒక మంచి పాత్రలో నటించడంతో పాటు సంగీతం అందించడం ఆనందంగా ఉందని’ భోలో షావలి తెలిపారు.

దర్శకుడు మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణకు చెట్లు ఎంత ముఖ్యమో, ఈ సృష్టికి ఆడ ప్లిు అంతే ముఖ్యమని తెలిపే చిత్రమిది. ఆడప్లిను పురిటిలోనే చంపకుండా వారిని చదివించి, ప్రయోజకు చేస్తే ఏ రంగంలో వాళ్లు తీసిపోరనే అద్భుతమైన కథాంశమిది. మంగ్లీ నటన ఈ చిత్రానికి హైలైట్‌గా నిుస్తుంది. హాస్య నటుడు చమ్మక్‌ చంద్ర ఈ చిత్రంలో ఓ ముఖ్యపాత్రలో నటించాడని తెలిపారు. ‘బంజారే బంజారే..’ పాటను సింగర్‌ మంగ్లీ అద్భుతంగా ఆపించినట్లు తెలిపారు.

Rashmika New Photoshoot Stills

ఇటలీలో రామ్ రోమాన్స్

ఇస్మార్ట్ శంకర్ మూవీతో హీరో రామ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు. ఈ మూవీ ఇచ్చిన జోష్ తో రామ్ ‘రెడ్’ మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీలో రామ్ సరసన నివేది పేతురాజ్, మాళవిక శర్మ, అమృత అయ్యర్ నటిస్తున్నారు. ప్రస్తుతం ‘రెడ్’ చిత్రం పాటల చిత్రీకరణ జరుపుకుంటుంది. దర్శకుడు కిషోర్ తిరుమల ఇటలోని టస్క్, ప్లారెన్స్, డోలోమైట్స్ వంటి అందమైన లోకేషన్లలో పాటలను చిత్రీకరించేందుకు సన్నహాలు చేసినట్లు తెలుస్తోంది.

‘రెడ్’ చిత్రం ఇప్పటికే గోవా, హైదరాబాద్, విశాఖపట్నంలో షూటింగ్ పూర్తి చేసుకుంది. హీరో రామ్, మళవికా శర్మలపై రెండు పాటలను చిత్రీకరించేందుకు చిత్రబృందం ఇటలీకి బయలుదేరి వెళ్లింది. ఈనెల 20వరకు ఇటలోని అందమైన లోకేషన్లలో షూటింగ్ జరుపుకోనుంది. శోభి మాస్టర్ రామ్, మళావిక శర్మలపై తీసే పాటలకు కోరియోగ్రఫీ చేస్తున్నారు. ‘రెడ్’ మూవీకి మణివర్మ అదిరిపోయే బాణీలను సమకూరుస్తున్నారు.

హీరో రామ్-కిషోర్ తిరుమల కాంబినేషన్లో వచ్చిన ‘నేను శైలజ’, ‘ఉన్నది ఒక్కటే జిందగి’ మంచి విజయం సాధించాయి. తాజాగా వీరి కాంబినేషన్లో మూడో చిత్రం ‘రెడ్’ మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీని కృష్ణ పోతేనిని సమర్పిస్తుండగా శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్లో స్రవంతి రవికిషోర్ నిర్మిస్తున్నారు. ఇటలీలో రెండు పాటలు చిత్రీకరించిన తర్వాత చిత్రబృందం హైదరాబాద్ కు చేరుకుంటుంది. హైదరాబాద్ పరిసరాల్లో ఒక పాట చిత్రీకరణతో సినిమా పూర్తికానుందని సమాచారం. త్వరలోనే నిర్మాణాలను కార్యక్రమాలను పూర్తి చేసుకోనుంది. ఏప్రిల్ 9న సినిమాను విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నహాలు చేస్తుంది.

అల్లు అర్జున్ రేస్ మళ్ళీ షురూ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాతో మంచి సక్సెస్ లో ఉన్నారు. అల్లు అర్జున్ కెరీర్ లో బిగ్ హిట్ మూవీస్ లో రేస్ గుర్రం ఒకటి, ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చింది. అల్లు అర్జున్, సురేందర్ రెడ్డి కాంబినేషన్లో మరో సినిమా చెయ్యడానికి రెడీ అయ్యారని ఫిలిం ఇండస్ట్రీ లో టాక్. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా, వేణు శ్రీరామ్ తో ఐకాన్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాల చిత్రీకరణ తరువాత సురేందర్రెడ్డి తో సినిమా ఉంటుందని సమాచారం.

Rajasekhar’s Arjuna Movie Stills

కేటీఆర్ వాదనలో పస వుందా ?

కేటిఆర్ ఈ పేరు తెలియనివాళ్ళు ఎవరూ వుండరు. కొద్దికాలంలోనే యువత లో , పట్టణ ప్రజానీకంలో మంచి అభిప్రాయం ఏర్పాటు చేసుకున్న వ్యక్తి. రావటం వారసత్వం నుంచి వచ్చినా తనలో ప్రతిభ ఉందని నిరూపించుకున్నాడు. ఈ అభిప్రాయం ప్రజల్లో వుంది. ఇంగ్లీషులో, తెలుగులో, ఉర్దూ లో అనర్గళంగా మాట్లాడగలడు, వాళ్ళ నాన్నలాగా. ముఖ్యంగా పారిశ్రామికవేత్తలతో, విద్యావంతులతో ప్రభుత్వం తరఫున మాట్లాడాలంటే కేటీఆర్ నే ఎంచుకుంటారు. కొన్నాళ్ళు అమెరికాలో పనిచేసివచ్చిన అనుభవం కూడా తనకి కలిసొచ్చింది. ఇంతవరకూ బాగానేవుంది. కానీ నిన్న టైమ్స్ నౌ సమ్మిట్ లో మాట్లాడిన ధోరణి ఏమీ బాగాలేదు.

రాష్ట్రాలకు నిధుల విషయంలో ప్రజలకు చెవిలో పూలు పెట్టటం బాగాలేదు. నిధుల్లో న్యాయబద్ధమైన వాటా అంటే ఏమిటి? రాష్ట్రంలో వసూలైన నిధులన్నీ తిరిగి రాష్ట్రానికే చెందాలనటం వినటానికి , అమాయక జనాన్ని నమ్మించటానికి బాగానేవున్నా అది మోసపూరితమైన వివరణ. పరోక్ష పన్నుల్లో కేంద్రం ప్రత్యక్షంగా వసూలుచేసే నిధులు తక్కువ. జీఎస్టీ పేరుతో రాష్ట్రాలు వసూలు చేసే నిధులే ప్రధానమైనవి. వాటిని ఫైనాన్స్ కమీషన్ మార్గదర్శకాల ప్రకారం కేంద్రానికి, రాష్ట్రాలకు పంపిణి చేయటం జరుగుతుంది. అంతేగాని ఒక రాష్ట్రంలో వసూలయ్యే నిధులు ఆరాష్ట్రంలోనే ఖర్చుచేయాలనటం వితండవాదన. అలాగయితే వెనకబడిన రాష్ట్రాల స్థితిగతులు ఎవరు చూస్తారు?

ఇకపోతే మిషన్ భగీరథకు నిధులు ఇవ్వాలని, కాళేశ్వరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా చేయాలని అడగటంలో తప్పులేదు. కాకపోతే అవి ఇవ్వకపోతే తెలంగాణకు అన్యాయం చేసినట్లని ప్రచారం చేయటం తప్పు. ఇవి న్యాయబద్ధంగా రావాల్సినవి అనటం కూడా తప్పే. ప్రతి రాష్ట్రం తాము మొదలుపెట్టిన ప్రాజెక్టులకు కేంద్రం నిధులివ్వాలని కోరుకుంటుంది. కానీ అది కేంద్రానికున్న సాధ్యాసాధ్యాలను బట్టి ఒప్పుకుంటుంది. ఉదాహరణకు ఆంధ్రాకు పోలవరం ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది. అది విభజన సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం చట్టంలో పొందుపరచిన మేరకు ఒప్పుకుంది. అదే తెలంగాణ విభజన సమయంలో మిగులు రాష్ట్రం. ఆదాయంలో సింహభాగం హైద్రాబాదు నగరం వలన తెలంగాణ కు వచ్చింది. అందుకనే ఆరోజు ఈ డిమాండ్ తెలంగాణ పెట్టలేదు. అయినా వనరులుంటే ఇవ్వకూడదని ఎక్కడా లేదు. కాకపోతే కేంద్రం దగ్గర నిధులు ఎక్కడున్నాయి. ద్రవ్యలోటు ను కట్టడి చేయలేని పరిస్థితుల్లో అదనంగా ఇచ్చే పరిస్థితి లేదు. కేంద్రం నుంచి వచ్చే నిధుల విషయంలో బీజేపీ పాలిత రాష్ట్రాలు సహా ఏవీ సంతృప్తిగా లేవు. కారణం రాష్ట్రాల కోర్కెలు తీర్చే పరిస్థితుల్లో కేంద్రంలేదు కాబట్టి. అంతమాత్రాన పన్నుల్లో వాటా తప్ప కేంద్రం నుంచి ఏమీ రావటల్లేదని అంటే అది మోసపూరితమే అవుతుంది. ఉదాహరణకు ఇటీవలికాలంలో తెలంగాణలోని అనేక రాష్ట్ర రహదారుల్ని జాతీయ రహదారులుగా ప్రకటించింది. అవి పన్నుల వాటాగా వచ్చేవాటికి అదనం. అటువంటివి పన్నుల వాటాకు అదనంగా ఎన్నో ఉంటాయి. కాబట్టి కేటీఆర్ మాట్లాడేదాంట్లో నిజం లేదు. దాన్ని కేంద్ర అహంకార ధోరణి పేరుతో మసిపూసి మారేడుకాయ చేయటం ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో పేరుతెచ్చుకుంటున్న కేటీఆర్ కి తగదు.

ఇక రాజకీయ విషయాల్లోకి వస్తే ఇప్పుడున్న పార్టీలన్నీ ప్రాంతీయపార్టీలేనని చెప్పటం దుస్సాహసం. తెరాస ప్రాంతీయపార్టీ కాబట్టి అది ఎప్పటికీ జాతీయ పార్టీ కాలేదు కాబట్టి జాతీయ పార్టీలను కూడా తమ స్థాయికి తెచ్చుకోవాలనే తాపత్రయం తప్పించి నిజంకాదు. జాతీయ రాజకీయాల్లోకి రావాలంటే ఆచి తూచి మాట్లాడాల్సివుంటుంది. బీజేపీ, కాంగ్రెస్ రెండూ విఫలమయ్యాయి కాబట్టి ప్రాంతీయ పార్టీల కూటమే శరణ్యమని ప్రజల్ని నమ్మించాలని ప్రయత్నం చేయటం అంత తేలిక కాదు. ప్రజల తెలివితేటల్ని తక్కువ అంచనా వేయొద్దు. ఆప్ ఢిల్లీ ఒక్క రాష్ట్రంలోనే పరిపాలనలో వున్నా ప్రజలు అరవింద్ కేజ్రీవాల్ ని ప్రాంతీయ పార్టీ నాయకుడుగా చూడటంలేదు. ఎందుకని? అదే కెసిఆర్ ని తెలంగాణ నాయకుడుగానే చూస్తున్నారు. జాతీయ నాయకుడుగా చూడటం లేదు. ఇది వాస్తవం. ఈ నిజాన్ని కేటీఆర్ ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. కాళ్ళు భూమి మీద పెట్టి నడిచినట్లవుతుంది. కేటీఆర్ కి ఇంకా ఎంతో భవిష్యత్తు వుంది, వయసు వుంది. వేసే అడుగులు జాగ్రత్తగా చూసుకొని వేస్తే ముందు భవిష్యత్తు బాగుంటుందని అర్ధం చేసుకుంటే మంచిది.

కత్తి గుండు పగలగోట్టిన పవన్ ఫ్యాన్స్?


గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేసిన కత్తి మహేష్ ఈ మధ్య ట్రెండ్ మార్చారు. ఆయన చూపు హిందువుల దేవుడైన శ్రీ రాముడుపై పడ్డది. ఇటీవల రాముడు పై చేసిన కామెంట్స్ కత్తి మహేష్ మెడకు చుట్టుకుంటున్నాయి. “రాముడి మాంస ప్రియుడని, ఆయన జింక మాంసం బాగా తినేవాడని కామెంట్స్ చేశారు. అంతటితో ఆగకుండా.. మరో అడుగు ముందుకేసి “రాముని తన రాజ్యంలో చెలికత్తెలతో డాన్స్ వేసేవాడని” కూడా తీవ్ర పదజాలం వాడటంతో ఆయనపై పొలిసు కేసులు నమోదయ్యాయి.

గతంలో ఇలాగే తింగర కామెంట్స్ చేసి హైదరాబాద్ నగర బహిష్కరణకు గురైన ఆయన మళ్ళీ తన పాత అవతారం ఎత్తాడు. ఈ మధ్య హైదరాబాద్ కి వచ్చిన కొద్ది రోజుల దాకా సైలెంట్ గానే ఉన్నా.. ఇప్పుడు మరోసారి వివాదాలకు తేరలేపారు.

విజయ్ దేవరకొండ “వరల్డ్ ఫేమస్ లవర్” సినిమా చూసేందుకు ఐమాక్స్‌ కు వచ్చిన కత్తిపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసారు. సినిమా ముగించుకుని వెళ్తున్న ఆయన కారుపై దుండగులు దాడి చేశారు. దాంతో కారు అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి. అయితే ఈ దాడి నుంచి కత్తి మహేష్ తృటిలో తప్పించుకున్నాడు.

అయితే ఈ దాడి చేసింది పవన్ అభిమానులా..లేక శ్రీ రాముని భక్తులా.. అనేది తెలియాల్సి ఉంది.

‘దిశ యాప్‌’.. ప్రజల ఇచ్చే రేటింగ్, ఎంతో తెలుసా..?


తెలంగాణలో జరిగిన దిశ ఘటనతో ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ “దిశ చట్టం” తీసుకొచ్చిన విషయం తెలిసిందే.. ఈ చట్టం అమలుకోసం జగన్ సర్కార్ అడుగులు వేస్తుంది. ఇటీవల దిశ పోలీస్ స్టేషన్, దిశ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన విషయం, అలాగే “దిశ యాప్” ని లాంచ్ చేసిన విషయం తెలిసిందే..

ఈ యాప్ ఇంటర్నెట్ తో సంబంధం లేకుండా పనిచేయడం గమనార్హం. మొబైల్ ఫోన్‌లో “దిశ యాప్‌”ని ఓపెన్ చేసి ఎస్‌వోఎస్‌ బటన్‌ నొక్కితే… ఆ ఫోన్‌ లొకేషన్‌ పూర్తి వివరాలు పోలీసు కంట్రోల్‌ రూమ్‌కు వెళ్తాయి. దీని వల్ల మహిళలకు మరింత రక్షణ చేకూరే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ యాప్‌తో దగ్గర్లోని ఆసుపత్రులు, బ్లడ్‌బ్యాంక్‌ వివరాలు తెలుసుకోవచ్చు. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే కుటుంబ సమస్యలతో సతమతమయ్యే వారు కూడా ఈ యాప్ ఉపయోగిస్తున్నారు.

గడిచిన 4రోజుల్లోనే “దిశ యాప్‌”ను 50 వేల మంది డౌన్‌లోడ్‌ చేసుకొని, యాప్ పనితీరుకు, పోలీసులు స్పందిస్తున్న తీరుకు గూగుల్‌ ప్లేస్టోర్‌లో 5కి ఏకంగా 4.9 స్టార్‌ రేటింగ్‌ ఇవ్వడం గమనార్హం.