
గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేసిన కత్తి మహేష్ ఈ మధ్య ట్రెండ్ మార్చారు. ఆయన చూపు హిందువుల దేవుడైన శ్రీ రాముడుపై పడ్డది. ఇటీవల రాముడు పై చేసిన కామెంట్స్ కత్తి మహేష్ మెడకు చుట్టుకుంటున్నాయి. “రాముడి మాంస ప్రియుడని, ఆయన జింక మాంసం బాగా తినేవాడని కామెంట్స్ చేశారు. అంతటితో ఆగకుండా.. మరో అడుగు ముందుకేసి “రాముని తన రాజ్యంలో చెలికత్తెలతో డాన్స్ వేసేవాడని” కూడా తీవ్ర పదజాలం వాడటంతో ఆయనపై పొలిసు కేసులు నమోదయ్యాయి.
గతంలో ఇలాగే తింగర కామెంట్స్ చేసి హైదరాబాద్ నగర బహిష్కరణకు గురైన ఆయన మళ్ళీ తన పాత అవతారం ఎత్తాడు. ఈ మధ్య హైదరాబాద్ కి వచ్చిన కొద్ది రోజుల దాకా సైలెంట్ గానే ఉన్నా.. ఇప్పుడు మరోసారి వివాదాలకు తేరలేపారు.
విజయ్ దేవరకొండ “వరల్డ్ ఫేమస్ లవర్” సినిమా చూసేందుకు ఐమాక్స్ కు వచ్చిన కత్తిపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసారు. సినిమా ముగించుకుని వెళ్తున్న ఆయన కారుపై దుండగులు దాడి చేశారు. దాంతో కారు అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి. అయితే ఈ దాడి నుంచి కత్తి మహేష్ తృటిలో తప్పించుకున్నాడు.
అయితే ఈ దాడి చేసింది పవన్ అభిమానులా..లేక శ్రీ రాముని భక్తులా.. అనేది తెలియాల్సి ఉంది.