
2020 అక్టోబర్ 10న బడి పిల్లల కోసం ప్రారంభించిన వైస్సార్ కంటి వెలుగు మూడోవ దశను ఈ రోజు కర్నూలులో అవ్వ తాతల కొరకు ప్రారంభించారు ఏపీ సీఎం జగన్. ఏపీలో 60 ఏళ్లు, ఆ పై వయసున్న 56,88,420 మంది అవ్వాతాతలకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి, అవసమైన వారికి కంటి ఆద్దాలను కూడా ఉచితంగా ఇవ్వనున్నారు. అలాగే అవసరమైన వారికి శస్త్ర చికిత్సలు చేయనున్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రాథమిక, సెకండరీ స్క్రీనింగ్ కంటి పరీక్షలను ప్రారంభించి జూలై 31వ తేదీ నాటికి పూర్తి చేస్తారు.
సెకండరీ స్క్రీనింగ్ పూర్తయిన తర్వాత వాలంటీర్ల ద్వారా కళ్ల జోళ్లను అందజేయనున్నారు. శస్త్రచికిత్సలు అవసరమైన వారిని ఎంపిక చేసిన ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మార్చి 1 నుంచి శస్త్రచికిత్సలు చేయిస్తారు. ఇప్పటికే కంటి వెలుగు పథకం ద్వారా ప్రభుత్వం రెండు విడతలుగా పాఠశాలల్లో 66 లక్షల మంది పిల్లలకు కంటి పరీక్షలు చేసింది. 4.36 లక్షల మందికి కంటి సమస్యలు ఉన్నట్లు గుర్తించింది.. ఇప్పుడు మూడో విడత ప్రారంభించారు.