Homeఆంధ్రప్రదేశ్‌ఏపీ పోలీసులను దోషులుగా నిలబెడుతున్న సెక్షన్ 151

ఏపీ పోలీసులను దోషులుగా నిలబెడుతున్న సెక్షన్ 151

గత వారం విశాఖ విమానాశ్రయంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును పోలీసులు సెక్షన్ 151 సి ఆర్ పీ కింద అరెస్ట్ చేయడం రాష్ట్ర రాజకీయాలలో కలకలం రేపింది. ఇప్పుడు ప్రశ్న అంతా అరెస్ట్ గురించి కాకూండా సెక్షన్ 151 నుండి చెలరేగుతుంది.

సరిగ్గా మూడేళ్ళ క్రితం నేటి ముఖ్యమంత్రి, అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌ రెడ్డిను కూడా అదే విధంగా అరెస్ట్ చేసినా ఈ ప్రశ్న తలెత్తలేదు. పోలీసులు తరచూ ప్రతిపక్ష నేతలను ప్రభుత్వ విధానాలపై నిరసనలకు దిగినప్పుడు ఈ విధంగా కట్టడి చేయడం జరుగుతున్నప్పటికీ ఇటువంటి ప్రశ్నలు తలెత్తలేదు.

ఇప్పుడు స్వయంగా హై కోర్ట్ ఈ ప్రశ్న వేసి, డిజిపిని వచ్చి సంజాయతి చెప్పమని ఆదేశించడంతో ఈ ప్రశ్న మరింత కీలకంగా మారింది. అసలు ఈ సెక్షన్ ఏమిటి?

ఈ చట్టం ప్రకారం చెప్పుకోదగిన నేరం చేయకుండా నిరోధించడం కోసం అరెస్ట్ చేయవచ్చు:

1. ఒక వ్యక్తి చెప్పుకోదగిన నేరం చేస్తున్నట్లు భావిస్తే మెజిస్ట్రేట్ ఉత్తరువు, అరెస్ట్ వారెంట్ లేకుండా ఒక పోలీస్ అధికారి ఎవరినైనా అరెస్ట్ చేయవచ్చు. మరో విధంగా నేరం చేయకుండా అడ్డుకోవడం సాధ్యం కాదనిపించినప్పుడు ఆ విధంగా చేయవచ్చు.

2. ఈ చట్టంలోని సబ్ సెక్షన్ (1) ప్రకారం ఆ విధంగా నిర్బంధంలోకి తీసుకున్న వారెవ్వరిని మరింకా నిర్బంధంలో ఉంచడం అవసరమైన పక్షంలో లేదా ఈ చట్టంలోని మరే నిబంధన ప్రకారం అయినా అధికారం పొందిన పక్షంలో లేదా అప్పుడు అమలులో ఉన్న మరే చట్ట ప్రకారం కాకూండా
24 గంటలకు మించి నిర్బంధంలో ఉంచరాదు.

సెక్షన్ 151 సీఆర్పీసీ అనేది పోలీసుల ముందస్తు నివారణ చర్యలకు సంబంధించింది. ఒక వ్యక్తి ఒక నేరం చేయడానికి ముందే దీనిని ఉపయోగించవచ్చు. సాధారణంగా, ఒక వ్యక్తి చెప్పుకోదగిన నేరం చేసిన్నట్లయితే, అందుకు ఏడేళ్లకు పైగా శిక్షార్హత ఉండినట్లయితే సెక్షన్ 41ఎ సీఆర్పీసీ ప్రకారం అరెస్ట్ చేస్తారు.

సెక్షన్ 151 సి ఆర్ పిసి క్రింద ఉండే అధికారం రాష్ట్రంలోని ముందస్తు నిర్బంధ చట్టాల వంటివి. ఈ నిబంధనలను చదివితే ఆ వ్యక్తి ఒక నేరం చేయడానికి సిద్ధంగా ఉన్నాడని, నిర్బంధంలోకి తీసుకోకుండా ఆ నేరాన్ని అడ్డుకోవడం సాధ్యం కాదని పోలీస్ అధికారి ఒక నిర్ణయానికి వచ్చి ఉండాలి.

జనవరి, 2017లో జగన్ ప్రతిపక్ష నేతగా “వై” కేటగిరి భద్రతలో, ఇప్పుడు చంద్రబాబు ప్రతిపక్ష నేతగా “జెడ్ ప్లస్” కేటగిరి భద్రతలో, ఒక విధంగా పోలీసుల వలయంలో, వారి నిరంతర నిఘాలో ఉన్నారు. అటువంటి నేతలను “నేరం చేయవచ్చనే అనుమానం”తో సెక్షన్ 151 సి ఆర్ పిసి క్రింద అరెస్ట్ చేయడం పూర్తిగా అధికార దుర్వినియోగం క్రితమే వస్తుంది.

సెక్షన్ 151 సీఆర్పీసీ క్రింద చర్య తీసుకొనే ముందు పోలీస్ అధికారి తప్పనిసరిగా ఆ వ్యక్తి ఎటువంటి చెప్పుకోదగిన నేరం చేసే ఆవకాశం ఉన్నదో అంటూ నమోదు చేయాలి. ముఖ్యంగా “వై”, “జెడ్” క్యాటగిరీ లలో భద్రత కల్పించిన నాయకుల విషయంలో ఈ విషయమై తగు కారణాలు చూపవలసిన భారం పోలీస్ అధికారులపై మరింత ఎక్కువగా ఉంటుంది. అటువంటి ప్రయత్నం చేయకుండా,కేవలం అధికారంలో ఉన్న నేతల “ఆదేశాలకు” లోబడి పోలీసులు నవ్వులపాలు అయ్యారని చెప్పవలసి ఉంటుంది.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
RELATED ARTICLES

Most Popular