తెలుగమ్మాయి ఐశ్వర్య రాజేష్ కోలీవుడ్‌లో హీరోయిన్ గా బీజీగా మారింది. వరుస సినిమాలతో ఐశ్వర్య రాజేశ్ బీజీగా మారింది. తాజాగా ఐశ్వర్య రాజేష్ షూటింగ్ లోకేషన్లో నోరూరించే ఎగ్‌దోశ వేసి అందరినీ ఆశర్చానికి గురిచేసింది. ఐశ్వర్య దోశ వేస్తుండగా తీసిన వీడియోను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతోంది.
ఐశ్వర్య రాజేష్ ప్రస్తుతం కోలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తోంది. సతీష్ దర్శకత్వంలో హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీలో నటిస్తోంది. ఈ మూవీతోపాటు తమిళంలో కా.పే రణసింగం, భూమిక, ఇదు భేతాళం సొల్లుం కథై చిత్రాల్లో నటిస్తుంది. అదేవిధంగా తెలుగులో నాని ‘టక్ జగదీష్’ మూవీలో నటిస్తుంది. ‘కౌసల్య కృష్ణమూర్తి’ మూవీలో ఐశ్వర్య రాజేష్ నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇటీవలే విడుదలైన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ మూవీలో సువర్ణ పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలను అందుకుంది.
ఐశ్వర్య రాజేష్ పోస్టు చేసిన వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. కొందరు నెటిజన్లు ‘ఐశ్వర్య రాజేష్ మల్టి టాలెంటెడ్ అని కొడియాడుతుంటే.. మరికొందరు తన తదుపరి మూవీలో ఛెప్ గా కనిపించబోతున్నారా అంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. ఏదిఏమైనా షూటింగ్లో సరదాగా ఐశ్వర్య రాజేష్ వేసిన ఎగ్ దోశకు ఆమె అభిమానులు ఫిదా అవుతున్నారు.


సినీ రంగంలో హీరోయిన్లు త్వరగా ఫేడ్ అవుట్ అవుతారన్నది జగమెరిగిన సత్యం. అదే హీరోలకు అయితే లాంగ్ రన్ ఉంటుంది. 1989లో వచ్చిన హిందీ డబ్బింగ్ చిత్రం ప్రేమ పావురాలు తెలుగు నాట స్ట్రైట్ చిత్రాలతో పోటీపడి వసూళ్లు సాధించింది. ఆ సినిమాలో హీరో,హీరోయిన్ లుగా నటించిన సల్మాన్ ఖాన్ భాగ్యశ్రీ ఓవర్ నైట్ స్టార్లుగా మారిపోయారు. కానీ ఇపుడు సల్మాన్ ఖాన్ మాత్రమే స్టార్ హీరోగా ఉన్నాడు. తన హవాని కంటిన్యూ చేస్తున్నాడు. భాగ్యశ్రీ మాత్రం ఫేడ్ అవుట్ అయిపోయి తల్లి పాత్రలకు సిద్ద మౌతోంది ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇప్పుడు నిర్మాణంలో ఉన్న ప్రభాస్ చిత్రం లో తల్లి పాత్రకు భాగ్యశ్రీ ఎంపికయ్యింది..జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఒక పిరియాడికల్ లవ్ స్టోరీ గా తెర కెక్కుతోంది . భారీ నిర్మాణ విలువలతో తెర కెక్కుతోన్న ఈ చిత్రం లో భాగ్యశ్రీ పోషించ బోయే పాత్ర చాలా కీలకం అని తెలుస్తోంది.

తాము బీజేపీకే దూరమయ్యాం కానీ.. హిందుత్వానికి కాదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే స్పష్టం చేశారు. మహా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 100 రోజులు పూర్తైన సందర్భంగా అయోధ్యకు వచ్చారు. రామ్ లల్లా ఆశీర్వాదం తీసుకునేందుకు ఇక్కడకి వచ్చానని ఠాక్రే తెలిపారు.
చెక్ బౌన్స్ కేసులో టాలీవుడ్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ నట్టికుమార్ కు ఏడాది జైలు శిక్ష పడింది. ‘శంఖం’ సినిమా డిస్ట్రిబ్యూషన్ సమయంలో విజయవాడలోని రాజ్యలక్ష్మి థియేటర్ యాజమన్యానికి-నట్టికుమార్ కు మధ్య వివాదం నెలకొంది. ఇటీవల నట్టికుమార్ పై చౌక్ బౌన్స్ కేసు నమోదయింది. శుక్రవారం ఈ కేసులో నట్టికుమార్ కు ఏడాది జైలు శిక్ష, 6లక్షల జరిమానాను విధిస్తూ స్థానిక మెజిస్ట్రేట్ కె.దివ్యకృప తీర్పునిచ్చారు.
ఢిల్లీ హింసాకాండలో ఇప్పటివరకు 53 మంది మరణించారు. పలువురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. హింసాయుత ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలు ఇప్పటికీ మోహరించి వున్నాయి. పరిస్థితిని చక్కదిద్దాలని పోలీసులు, అధికారులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. బాధితులకు ఇప్పటివరకు రెండు కోట్ల రూపాయలకుపైగా పరిహారం అందించారు. అయితే 1984 అల్లర్ల బాధితుడైన మొహిందర్ సింగ్ ఇప్పుడు హీరోగా మారాడు. ఢిల్లీ అల్లర్లలో ముస్లింలు హిందువులను, హిందువులు ముస్లిం కుటుంబాలను రక్షించిన ఘటనలు చాలా ఉన్నాయి.
క్యాన్సర్ రోగులకు విజయవంతంగా చికిత్సలు నిర్వహిస్తున్న భారతీయ సంతతికి చెందిన ఇద్దరు అమెరికన్ వైద్యులు భారతదేశం గురించి ఒక హెచ్చరిక జారీ చేశారు. దేశంలో తక్షణ చర్యలు తీసుకోకపోతే త్వరలోనే భారతదేశం ‘క్యాన్సర్ సునామీ’లో చిక్కుకుంటుందని డాక్టర్ దత్తాత్రేయుడు నోరి, డాక్టర్ రేఖ భండారి హెచ్చరించారు. ప్రముఖ క్యాన్సర్ పాథాలజిస్ట్ డాక్టర్ దత్తాత్రేయుడు నోరి…. ఈ వ్యాధితో బాధపడుతున్న అనేక మంది భారతీయులకు చికిత్స చేశారు. ప్రారంభ దశలోనే వ్యాధిని గుర్తించడం ద్వారా మాత్రమే భారతదేశం ‘క్యాన్సర్ సునామి’లో చిక్కుకోకుండా నిరోధించవచ్చని వారిద్దరూ తెలిపారు.
సినీ ఇండస్ట్రీలో కూడా రాజకీయాల్లో లాగానే శాశ్వత మిత్రులు ,శాశ్వత శత్రువులు ఉండరు. అవసరాన్ని బట్టి మనుషుల్ని కలుపుకు పోతారు. ఇప్పుడు తాజాగా నందమూరి బాలకృష్ణ కి అదే పరిస్థితి వచ్చింది. తన గత చిత్రం రూలర్ షూటింగ్ సమయంలో గొడవపడ్డ వ్యక్తి తోనే మరలా పనిచేయాల్సిన పరిస్థితి వచ్చింది. 2019 డిసెంబర్ ఇరవైన విడుదలయిన రూలర్ చిత్రం బాలయ్య బాబు చిత్రాల్లోనే ఒక డిజాస్టర్ చిత్రంగా నిలిచింది. అవుట్ డేటెడ్ కథ తో వచ్చిన ఈ చిత్రం టోటల్ గా ప్రపంచ వ్యాప్తంగా 8 కోట్ల షేర్ ని మాత్రమే రాబట్టింది. విమర్శకుల నుంచి ప్రేక్షకుల నుంచి విపరీతంగా వ్యతిరేకతను మూటగట్టుకున్న ఈ చిత్రం యొక్క అపజయానికి కారణమైన వాటిలో బాలకృష్ణ గెటప్ గురించి చెప్పక తప్పదు. దరిమిలా బాలయ్య ఆ చిత్రం యొక్క కెమెరామెన్ రామ్ ప్రసాద్ తో గొడవ పడటం జరిగింది. కట్ చేస్తే ఇపుడు బాలయ్య బాబు కొత్తగా బోయపాటి శ్రీను దర్శత్వంలో చేయబోయే చిత్రానికి రామ్ ప్రసాద్ ని కెమెరామెన్ గా ఎన్నిక చేయడం జరిగింది. దీనికంతటికి కారణం బాలయ్య బాబు చిత్రానికి పనిచేయడానికి వేరే కెమెరామెన్ ముందుకి రాకపోవడమే అని తెలిసింది.



ఇండోనేషియాలో తన కంటే 76 సంవత్సరాల చిన్న వయస్సు గల స్త్రీని వివాహం చేసుకున్న 103 ఏళ్ల వ్యక్తి అకస్మాత్తుగా వెలుగులోకి వచ్చాడు. 103 ఏళ్ల పువాంగ్ కట్టే 27 ఏళ్ల ఇండో అలంగ్‌ను వివాహం చేసుకున్నాడు. వారి వివాహానికి సంబంధించిన ఫొటోలు ఫేస్బుక్, ట్విట్టర్లలో వైరల్ అయిన తరువాత ఈ వివాహ వివాహానికి వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తాయి. స్థానిక మీడియా చెప్పినదాని ప్రకారం పువాంగ్ 1945-1949 మధ్య కాలంలో ఒక మహిళను వివాహం చేసుకున్నాడు. ఆ మహిళ బంధువు తనకు పువాంగ్ ఖచ్చితమైన వయస్సు తెలియదని అన్నారు.



తెలంగాణలో ప్రారంభమైన గ్రీన్ ఛాలెంజ్ కు అన్నివర్గాల నుంచి మంచి స్పందన లభిస్తుంది. ఈ ఛాలెంజ్లో చాలా మంది సీని, రాజకీయ ప్రముఖులు మొక్కలు నాటి మరో ముగ్గురిని నామినేట్ చేస్తారు. నామినేట్ అయిన వ్యక్తులు మొక్కలు నాటి మరో ముగ్గురిని నామినేస్తూ ఛాలెంజ్ ను కొనసాగిస్తుంటారు. దీనిని స్ఫూర్తిగా తీసుకున్న వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐసీసీ చైర్ పర్సన్ రోజా ‘రోజావనం’ అనే ఛాలెంజ్ ప్రారంభించారు.


హీరోలపై ఆర్జీవీ ‘కరోనా’ పంచ్
కరోనా వైరస్ తెలంగాణలో సోకిందని ప్రచారం కాగానే హీరోయిన్ ఛార్మి వెల్ కమ్ చేస్తూ వీడియో పోస్టుచేసి నెటిజన్ల ఆగ్రహానికి గురైంది. ఛార్మిని నెటిజన్లు ట్రోలింగ్ చేయడంతో వీడియోను డిలీట్ చేసి అందరికి క్షమాపణ చెప్పింది. అందరినీ భయపెడుతున్న కరోనా వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో టార్గెట్ చేయడంతో నెటిజన్లు అవాక్కాయ్యారు. ‘మూగదానిలా అందరినీ చంపుకుంటూ పోతున్న డియర్ కరోనా నువ్వొక విషయం గుర్తించుకో.. నీవు ఒక పరాన్నజీవివి. మాతోపాటే నీవు కూడా చస్తావ్.. నీవు నా మాటలను నమ్మకపోతే.. వైరాలజీలో ఒక క్రాష్ కోర్సు తీసుకో.. నీకు ఇదే నా విన్నపం.. నువ్వు బ్రతుకు.. అందరినీ బతికించు. అంటూ కరోనాకు జ్ఞానోదయం చేశాడు.
తాజాగా రాంగోపాల్ వర్శ హీరోలపై తనదైన శైలిలో సెటైర్ వేసి ఆకట్టుకున్నాడు. విలన్లను భయపెట్టే హీరోలు ఈ కరోనా వైరస్‌ను ఎదుర్కోకుండా ఎక్కడికి పోయారంటూ ట్వీట్ చేశాడు. సూపర్‌మ్యాన్, బ్యాట్‌మ్యాన్, స్పైడర్‌మ్యాన్ మొదలైన హీరోలందరూ ఎక్కడ ఉన్నారు. వారు వేరే గ్రహానికి పారిపోయారని మాత్రం చెప్పకండి అంటూ వర్మ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌కు నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.