
తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు కొరియన్ మూవీస్ రీమేక్ ట్రెండ్ నడుస్తోంది. రీసెంట్ గా రిలీజై ఘనవిజయం సాధించిన ఓ బేబితో ఈ ట్రెండ్ మరింత ఊపు అందుకుంది. కొరియన్ ఫిల్మ్ ‘మిస్ గ్రానీ’ ఆధారంగా రూపొందిన ఈ సోషియో ఫాంటసీ మూవీ.. నటిగా సమంతకి ఎనలేని గుర్తింపు తెచ్చింది. ఇప్పుడు సామ్ బాటలోనే పయనించేందుకు మరో అగ్ర కథానాయిక సిద్ధమైంది. ఆమె మరెవరో కాదు.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్.
‘ఓ బేబి’ నిర్మాతల్లో ఒకరైన డి.సురేష్ బాబు మరో రెండు కొరియన్ మూవీస్ ని తెలుగులో రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వాటిలో ఒకటైన ‘మిడ్ నైట్ రన్నర్స్’ ని రెజీనా, నివేదా థామస్ కాంబినేషన్ లో చేయనున్న సురేష్.. మరొకటైన ‘డాన్సింగ్ క్వీన్’ ని కాజల్ అగర్వాల్ తో నిర్మించనున్నారట. అంతేకాదు.. ఈ రీమేక్ లో కాజల్ తో పాటు ‘అల్లరి’ నరేష్ కూడా నటిస్తాడని ప్రచారం సాగుతోంది. మరి.. ఓ బేబితో సామ్ మెస్మరైజ్ చేసినట్టే.. ‘డాన్సింగ్ క్వీన్గా’ కాజల్ కూడా తనదైన ముద్ర వేస్తుందేమో చూడాలి.