Home Blog Page 8592

బీహార్ ను తలపిస్తున్న ఏపీ.. పవన్, కన్నా ధ్వజం

స్థానిక ఎన్నికల సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ లో అధికార పక్షం విచ్చలవిడిగా దౌర్జన్యకాండకు పాల్పడటం, పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం, రాష్ట్ర ఎన్నికల కమీషన్ పట్టించుకొనక పోవడం, అనేక చోట్ల ప్రతిపక్ష అభ్యర్థులు నామినేషన్ కూడా వేయకుండా అడ్డుకొని పలుచోట్ల ఏకగ్రీవ ఎన్నికలు జరుపుకోవడం పట్ల జనసేన, బీజేపీ పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.

రాష్ట్రంలో క్షీణిస్తున్న పరిస్థితులు బీహార్ ను తలపిస్తున్నాయని మండి పడ్డారు. రాష్ట్రంలో నెలకొన్న దౌర్జన్యకర పరిస్థితులపై కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాకు, రాష్ట్ర గవర్నర్ కు ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు. రాజకీయాలను నేరమయం కావించడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి.

”151 సభ్యులుండి వీరెందుకు భయపడుతున్నారో.. ఇలా దౌర్జన్యంగా వ్యవహరించేటప్పుడు రాష్ట్ర న్నికలు ఎందుకు పెట్టాలి ? ” అని పవన్ కళ్యాణ్ ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు. కొంతమంది పోలీసులు వైసిపి కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

భయపెట్టి సాధించుకునే గెలుపు ఎప్పుడూ నిలబడదన్నారు. దౌర్జన్యాలకు, బెదిరింపులకు లొంగకుండా ఏకగ్రీవం కోసమే అయితే ఇసి ఎందుకు.. ఎన్నికల తంతు ఎందుకు.. అని పవన్‌ ప్రశ్నించారు. 13 జిల్లాలోనూ ఇంత హింసను ఎన్నడూ చూడలేదని ఆందోళన వ్యక్తం చేశారు.

నియంతృత్వానికి తోడు ఫ్యాక్షనిజం తోడైందని కన్నా మండిపడ్డాయిరు. మండలాఫీసుల నుండి పోలీసుల సహకారంతో నామినేషన్‌ పత్రాలను లాక్కెళ్లడం, చింపేయడం, చివరికి ఆర్‌ఒ ల వద్ద కూడా నామినేషన్ల కాగితాలను చింపేయడం .. తన 47 ఏళ్ల రాజకీయ జీవితంలో మొట్టమొదటిగా చూడటం అని విస్మయం వ్యక్తం చేశారు.

ఏకగ్రీవాల కోసం వైసిపి దాడులకు పాల్పడుతోందని కన్నా విమర్శించారు. వైసిపి దాడుల్ని తప్పించుకొని నామినేషన్లు వేస్తే స్క్రూటినీలో తీసేస్తున్నారని, పోలీసులు కొందరు రౌడీల్లాగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు.

చిత్తూరులో బిజెపి నేతలపై దాడులు చేశారని తెలిపారు. దుర్గి ఎస్సై రౌడీలా వ్యవహరించారని విమ‌ర్శించారు. ఎలక్షన్‌ కమీషన్ పరిధిలో ఉన్న అధికారాన్ని కూడా ప్రభుత్వం తన పరిధిలోకి తీసుకోవడం దుర్మార్గమని దుయ్యబట్టారు.

దేశంలో కరోనా కేసుల జాబితా…

కరోనా వైరస్ కట్టడి పై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ లోక్ సభలో మాట్లాడుతూ.. రాష్ట్రాల వారీగా నమోదైన కరోనా కేసుల జాబితాను విడుదల చేశారు. కరోనా సోకిన 73 మందిలో 17 మంది విదేశీయులు, కేరళలో 17 పాజిటీవ్ కేసులు నమోదు కాగా… మహారాష్ట్రలో 11, ఉత్తర ప్రదేశ్ లో 10, ఢిల్లీలో ఆరుగురికి టెస్టుల్లో పాజిటీవ్ వచ్చింది. అటు కర్ణాటకలో 4, లడక్ లో 3 కేసులు నమోదు అయ్యాయి. తెలంగాణ, రాజస్థాన్, తమిళనాడు, కశ్మీర్, పంజాబ్ లో ఒక్కో పాజిటీవ్ కేసు నమోదు అయ్యిందని మంత్రి తెలిపారు.

అదే సమయంలో కరోనా వ్యాప్తి నిరోధానికి విస్తృత చర్యలు చేపట్టామన్నారు హర్షవర్ధన్. కరోనా వైరస్‌ పట్ల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, దేశంలో కరోనా వ్యాప్తి నిరోధంపై రోజువారీ సమీక్షలు జరుపుతున్నామని చెప్పారు. ఇరాన్‌, ఇటలీ సహా విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని, దేశంలో అన్ని విమానాశ్రయాల్లో స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. కరోనా నెగిటివ్‌ వచ్చిన ప్రయాణికులను మాత్రమే బయటికి పంపిస్తున్నామని చెప్పారు. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి పరిస్థితి అదుపులోనే ఉందన్నారు. కరోనా వైరస్‌ను నిర్ధారించేందుకు పుణెలోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ ల్యాబ్‌కు అనుమానిత వ్యక్తుల రక్త నమూనాలను పంపించి ఫలితాలు తెలుసుకుంటున్నాంమన్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా చూసేలా రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు చేస్తున్నామన్నారు మంత్రి.

కమల్ నాథ్ బలపరీక్షకు పావులు కదుపుతున్న బీజేపీ

మధ్య ప్రదేశ్‌‌లో 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కమల్ నాథ్ వచ్చే సోమవారమే, ఈ నెల 16న బలపరీక్ష జరిపేటట్లు చేయాలను బిజెపి పట్టుబడుతున్నది. రెండ్రోజుల క్రితం మాజీ కేంద్రమంత్రి జ్యోతినాదిత్య సింధియా కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పడంతో.. ఆయనకు మద్దతుగా పార్టీకి చెందిన 22 మంది ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

దీంతో 15 నెలల కమల్‌నాథ్ ప్రభుత్వం ఒక్కసారిగా సంక్షోభంలో చిక్కుకుంది. ‘‘కమల్‌నాధ్ ప్రభుత్వం మైనారిటీలో పడినందున ఈ నెల 16న బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా బల పరీక్ష నిర్వహించాలని మేము గవర్నర్, అసెంబ్లీ స్పీకర్‌లను కోరనున్నాం…’’ అని బీజేపీ చీఫ్ విప్ నరోత్తమ్ మిశ్రా వెల్లడించారు. కాగా ఇప్పటికే గవర్నర్, స్పీకర్ల వద్ద ఎమ్మెల్యే రాజీనామాలు పెండింగ్‌లో ఉన్నాయనీ.. ఇక బలపరీక్షపై నిర్ణయం తీసుకోవాల్సింది వారేనని ఆయన తెలిపారు.

మరోవంక, రాజీనామా చేసిన 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్ ప్రజాపతి గురువారం నోటీసులు జారీ చేశారు. ఈ 22 మంది శుక్రవారం తన ముందు హాజరై రాజీనామాలకు కారణాలు తెలపాలని ఆయన నోటీసులో పేర్కొన్నారు. తమంత తామే రాజీనామాలు చేశారా? లేక ఎవరైనా బలవంతం చేశారా? అన్న అంశాన్ని వ్యక్తిగతంగా కలిసి వివరించాలని స్పీకర్ ఆదేశించారు.

దానితో ఈ 22 మంది ఎమ్మెల్యేల భవితవ్యం తేలిన తర్వాతే బలపరీక్ష నిర్వహించాలని కాంగ్రెస్ స్పష్టం చేస్తున్నది. కాగా కమల్‌నాధ్ ప్రభుత్వం మైనారిటీలో పడిందని మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు.

మధ్య ప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం 228 స్థానాలకు గానూ 22 మంది రాజీనామా చేయడంతో అసెంబ్లీలో మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 206కు తగ్గింది. దీంతో మ్యాజిక్ ఫిగర్ 104కు పడిపోయింది. కాంగ్రెస్ పార్టీ 114 మంది ఎమ్మెల్యేల్లో 22 మంది రాజీనామా చేయడంతో ఆ పార్టీ బలం 92కు పడిపోయింది.

మరోవైపు బీజేపీ ఎమ్మెల్యేల సంఖ్య 107గా ఉంది. ఒకవేళ బలపరీక్షలో బీజేపీ నెగ్గితే మళ్లీ శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

రేవంత్ అన్నా.. ఎటు నీ ప్రయాణం?

కాంగ్రెస్ లో మల్కాజిగిరి ఎంపీ తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ప్రస్థానం ముగియనున్నట్లు తెలుస్తుంది. ఆయన రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయా..? అంటే అవుననే సమాధానం వినబడుతోంది. రేవంత్ రెడ్డి మొదట్నుంచీ ‘హైలీ యాంబిషస్’ వ్యక్తి. ఎక్కడవున్నా తనకి ప్రత్యేక గుర్తింపు కావాలని కోరుకొనే వ్యక్తి. దానివలన వున్న పార్టీలోనే ఎక్కువమంది శత్రువుల్ని తయారుచేసుకుంటుంటాడు ఈ క్రమంలోనే గత కొన్ని రోజులుగా రేవంత్ రెడ్డిపై తెలంగాణ కాంగ్రెస్ లో అసంతృప్తి ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రధానంగా ఆయన అభిమానులు సోషల్ మీడియాలో చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు కాంగ్రెస్ సీనియర్లకు చిరాగ్గా మారాయి. రేవంత్ రెడ్డి కి ఉన్న క్రేజ్ కాంగ్రెస్ లోఎవరికీ లేదని ఆయన అభిమానులు ఇతర సీనియర్ నేతలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం ఇబ్బందికర పరిణామం.

తెలంగాణ సీఎం కెసిఆర్ మీద రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేసినా అవి ప్రజల్లోకి వెళ్లే అవకాశం లేదని, ఆయన ఫాలోయింగ్ కేవలం అభిమానమే కానీ ఓటు బ్యాంకు కాదని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు ఇప్పటికే అధిష్టానానికి చెప్పినట్లు సమాచారం. గురువారం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా రేవంత్ విషయాన్ని ఆమెకు స్పష్టంగా చెప్పినట్లు సమాచారం. దీనితో రేవంత్ పై కాంగ్రెస్ అధిష్టానం ఆగ్రహంగా ఉందని వార్తలు వస్తున్నాయి. దీంతోనే ఈ విషయాన్ని ముందే గ్రహించిన రేవంత్ రెడ్డి పార్టీ నుంచి తప్పు తప్పుకునే భావన లో ఉన్నారట. తన రాజకీయ జీవితం తెరాస తో మొదలైనా ఎక్కువకాలం తెలుగుదేశం లో చంద్రబాబు నాయుడుకి అభిమానిగానే వున్నాడు. చివరకి కాంగ్రెస్ లో చేరేముందుకూడా చంద్రబాబుకి చెప్పే చేరాడనేది సమాచారం. త్వరలోనే ఆయన కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పి, బీజేపీ గూటికి చేరే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకొనే అవకాశాలు ఉన్నాయి.

అంచనాలు తారుమారు చేసిన కెసిఆర్

తెలంగాణ నుంచి పెద్దలసభకు ఎవరు వెళ్లనున్నారు అనే విషయంలో ఉత్కంఠ వీడింది. తెరాస తరపున రాజ్యసభకు వెళ్లే ఆ ఇద్దరు ఎవరనే సస్పెన్స్‌ కు తెరపడింది. తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కే.కేశవరావుతో పాటు అసెంబ్లీ మాజీ స్పీకర్ కేఆర్ సురేష్ రెడ్డిని రాజ్యసభ అభ్యర్థులుగా ఖరారు చేశారు. కేకే కి మరోసారి ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయించిన సీఎం కెసిఆర్… రెండో అభ్యర్థిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, బండి పార్థసారథిరెడ్డి పేర్లను పరిశీలించిన సీఎం సుదీర్ఘ కసరత్తు చేసి చివరకు సురేష్ రెడ్డి కు అవకాశం కల్పించారు.

రేపు ఉదయం 12 గంటలు ఈ ఇద్దరు నేతలు రాజ్యసభకు తమ నామినేషన్లను దాఖలు చేయనున్నారు. నిజానికి తెరాస తరపున పెద్దల సభకు వెళ్లే వారు ఎవరనే దానిపై కొన్ని నెలలుగా ఉత్కంఠ నెలకొంది. నిజామాబాద్ మాజీ ఎంపీ కవితకు రాజ్యసభ సీటు ఖాయమనే ఊహాగానాలు మొదట్లో వినిపించాయి. అయితే కవితను పరోక్ష ఎన్నికల ద్వారా చట్టసభలకు పంపించే యోచనలో కేసీఆర్ లేరని… అందుకే ఆమెకు రాజ్యసభ ఛాన్స్ ఉండదనే ప్రచారం జరిగింది.

సామాజిక సమీకరణాలు, జాతీయ స్థాయిలో రాజకీయ అవసరాలను దృష్టిలో పెట్టుకుని కెసిఆర్ రాజ్యసభ అభ్యర్థులను ఎంపిక చేశారని పార్టీ వర్గాలు తెలిపాయి.

 

ఏపీలో కలకలం.. తొలి కరోనా కేసు!

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా ఆంధ్రాలో కూడా అడుగుపెట్టింది. నెల్లూరులో తొలి పాజిటివ్ కేసు నమోదయిందని అధికారులు తెలిపారు. నెల్లూరుకు చెందిన ఒక యువకుడు ఇటీవల ఇటలీ నుంచి తిరిగొచ్చాడు. అప్పటి నుంచి అతడికి దగ్గు, గొంతు నొప్పి ఉండడంతో బ్లడ్ శాంపిల్స్‌ ని తిరుపతి ల్యాబ్‌ లో పరీక్షించగా.. కరోనా పాజిటివ్ వచ్చినట్లు వెల్లడించారు. ఐతే ధృవీకరణ కోసం పుణెలోని వైరాలజీ ల్యాబ్‌ కు రక్త నమూనాలను పంపించినట్లు తెలిపారు. ఆ రిపోర్టు కోసం వేచిచూస్తున్నామని చెప్పారు. ఆ యువకుడు అప్పటికే మరో ఐదు మందిని కలిశాడని.. వారిని కూడా 14 రోజులపాటు ఐసోలేషన్ వార్డులో ఉంచి పరీక్షలు చేస్తామని తెలిపారు.

చైనా తర్వాత ఇటలీలోనే ఎక్కువ కరోనా మరణాలు నమోదవడంతో.. అనుమానించిన డాక్టర్లు జిల్లా ప్రభుత్వాస్పత్రికి పంపించారు. సోమవారం అతడిని పరీక్షించిన అనంతరం ఐసోలేషన్ వార్డుకు తరలించారు. 14 రోజుల పాటు చికిత్స అందించారు. ఐతే ఇటీవల అతడి రక్త నమూనాలను తిరుపతి ల్యాబ్‌లో పరీక్షల్లో కరోనా పాజిటివ్ వచ్చింది.

మన దేశంలో ఇప్పటి వరకు 73 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రపంచంలోనే అత్యధికంగా చైనాలో కరోనా మరణాలు సంభవించాయి. చైనాలో ఇప్పటి వరకు 3,169 మంది చనిపోయారు. ప్రపంచ వ్యాప్తంగా 4,638 మంది చనిపోగా,  లక్షా 26వేల మంది ఈ వైరస్ సోకడంతో ఆసుపత్రులలో ఉన్నారు.

సుప్రీం హీరో మూవీకి పవర్ స్టార్ క్లాప్

సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కొత్త మూవీ గురువారం ప్రారంభమైంది. ఈ మూవీ ప్రారంభోత్సవానికి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సాయాధరమ్ తేజ్ పై క్లాప్ కొట్టి మూవీని ప్రారంభంచారు. దర్శకుడు దేవకట్టా ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఇంటెన్స్ పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌తో ఈ మూవీని దేవకట్టా తెరకెక్కిందును ప్లాన్ చేస్తున్నాడు. సాయితేజ్ కు జోడీగా నివేదా పేతురాజ్ నటిస్తుంది.

దేవకట్టా తెలుగోల ‘ప్రస్థానం’ మూవీతో టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ మూవీని హిందీలోనూ రీమేక్ చేసి హిట్టుందుకున్నాడు. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ టాలీవుడ్లో సాయిధరమ్ తేజ్ హీరోగా మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రాన్ని జేబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సీనియర్ నిర్మాతలు భగవాన్, పుల్లారావు నిర్మిస్తున్నారు.

ఈ మూవీలో రమ్యకృష్ణ, జగపతిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏప్రిల్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం, శ్యామ్ దత్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కాగా నేటి పూజా కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, వంశీ పైడిపల్లి, బీవీఎస్ఎన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Keisha Rawat New Photos

అల్లు శిరీష్ కి అలాంటి డైరెక్టరా…

ఇండియాలో రాజ్ కపూర్ ఫామిలీ తరవాత ఎక్కువ మంది హీరోలు ఉన్నది మెగాస్టార్ ఫ్యామిలీలోనే …అందుకే వీరిని క్రికెట్ టీం అంటూ మీడియా లో ప్రస్తావిస్తుంటారు. మెగా ఫామిలీ లో మెజారిటీ హీరోలు సక్సెస్ అయిన నేపథ్యంలో వారి ఉనికి కి ఒక ప్రత్యేకత వచ్చింది. ఐతే .వీరిలో అల్లు అరవింద్ చిన్న కొడుకు అల్లు శిరీష్ ఇప్పటిదాకా నిలదొక్కుకోలేకపోవడమే ఒకింత వెలితిగా అనిపిస్తుంటుంది.

చిరంజీవి చిన్నఅల్లుడు కళ్యాణ్ దేవ్ కూడా ఇంకా నిలదొక్కు కోలేదు. అయితే కళ్యాణ్ దేవ్ సినీ రంగానికి కొత్త కాబట్టి హీరోగా కుదురుకోలేకపోతున్నాడని అనుకోవచ్చు. పైగా అతను చేసింది ఒక్క సినిమానే. కానీ అల్లు శిరీష్ అలా కాదు. చిన్నప్పట్నుంచి సినిమాలతోనే సావాసం చేశాడు. పైగా అన్నయ్య అల్లు అర్జున్ పెద్ద స్టార్ హీరో.. నాన్న పెద్ద నిర్మాత. తనకూ సినీ రంగంతో పరిచయాలున్నాయి. ఇన్నీ ఉండి కూడా శిరీష్ సక్సెస్ కాలేకపోయాడు.

అల్లు శిరీష్ సినీ కెరీర్ లో ఆరు సినిమాలు వచ్చాయి. వాటిలో 2016 వచ్చిన ‘శ్రీరస్తు శుభమస్తు’ చిత్రం మినహా మరో సక్సెస్సే లేదు. ఆ తర్వాత చేసిన సినిమాలు అన్నీ ఫ్లాపులే. చివరగా ‘ఏబీసీడీ’ అనే రీమేక్ సినిమా చేస్తే అది కూడా ఫెయిల్ అయ్యింది. దీని తర్వాత మంచి ప్రాజెక్టు సెట్ చేసుకుంటాడని అంతా అనుకొన్నారు.

ఐతే అల్లు శిరీష్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఒక ఫెయిల్యూర్ దర్శకుడితో చేయబోతున్నాడు. గతంలో మెగా స్టార్ చిరంజీవి చిన్న అల్లుడు కళ్యాణ్ దేవ్ తో ‘విజేత’ సినిమా తీసిన రాకేశ్ శశితో మూవీ కి కమిట్ అయ్యాడు.దీని కంటే ముందు రాకేష్ శశి తీసిన ‘జతకలిసే’ అనే సినిమా కూడా ప్లాప్ అయ్యింది. అలా రెండూ ఫ్లాపులే ఇచ్చాడు.. దర్శకుడిగా కొంచెం అభిరుచి ఉన్నట్లు కనిపిస్తాడు కానీ.. సినిమా చేసి ప్రేక్షకుల్ని మెప్పించే స్థాయి లేదు. అందుకే అల్లు శిరీష్ కాస్త పేరున్న దర్శకుడితో ఒక సెన్సేషనల్ సినిమా చేస్తే తప్ప ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టు కోలేడు 43 ఏళ్ళ సుదీర్ఘ అనుభవం ఉన్న అల్లు అరవింద్ గారు తన చిన్న కొడుకు విషయం లో ఇంకాస్త శ్రద్ద పెట్టక తప్పదు.
Time and tide wait for none

రవి తేజ మళ్ళీ మ మ మ… మాస్

మాస్ మహా రాజా రవితేజ కొత్తగా ఏదైనా ట్రై చేద్దామనుకున్న ప్రతిసారీ ఫెయిల్యూర్ చవిచూశాడు. నా ఆటోగ్రాఫ్ , శంభో శివ శంభో , ఆ అబ్బాయి చాలా మంచోడు, నేనింతే లాంటి డిఫరెంట్ చిత్రాలు చేసి అపజయాల్ని మూటగట్టుకున్నాడు. ఇటీవలే ‘డిస్కో రాజా’ అంటూ డిఫరెంట్ మూవీ చేస్తే అది కాస్తా రవితేజ కెరీర్ లోనే పెద్ద డిజాస్టర్ అయింది. ఆ దెబ్బతో ఇక తన స్టయిల్లోనే పక్కా మాస్ మసాలా సినిమాలు చేయాలని ఫిక్సయిపోయాడు రవితేజ. అందులో భాగంగానే గోపీచంద్ మలినేనితో ‘క్రాక్’ అనే సినిమా చేసాడు. ఇటవలే విడుదలైన దీని టీజర్కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.కాగా ఈ చిత్రం 2016 వచ్చిన తమిళ సూపర్ హిట్ ‘సేతుపతి’కి రీమేక్ అని వినికిడి..ఇక దీని తర్వాత రవి తేజ చేయబోయే మరో సినిమా కూడా తమిళ రీమేకే అని తెలుస్తోంది.

గతంలో రవితేజ తో ‘వీర’ సినిమా తీసిన రమేష్ వర్మతో మరో సినిమాకు మాస్ మహా రాజా పచ్చజెండా ఊపాడు.విశేషం ఏమిటంటే రమేష్ వర్మ కెరీర్ అంతా ఫ్లాపుల మయం. కెరీర్ ఆరంభం లో ఓ కొరియన్ సినిమాను కాపీ కొట్టి తీసిన ‘రైడ్’ ఓ మాదిరిగా ఆడింది. గత ఏడాది తమిళ ‘రాక్షసన్’ సినిమాను మక్కీ మక్కీ దించుతూ రమేష్ వర్మ తీసిన ‘రాక్షసుడు’ సినిమా పర్వాలేదనిపించింది. దీంతో తన కథల్ని నమ్ముకోకుండా మళ్లీ రీమేక్ సినిమా తోనే రవితేజను రమేష్ వర్మ ఇంప్రెస్ చేసినట్టు తెలుస్తోంది.

తమిళంలో రెండేళ్ల కిందటే పూర్తయినా విడుదలకు నోచుకోని ‘శతురంగ వేట్టై’ సినిమా ప్రివ్యూ చూసి ఆ కథను రవి తేజ ఇమేజ్ కి అనుగుణంగా మార్చే ప్రయత్నంలో ఉన్నాడట రమేష్ వర్మ. తమిళంలో అరవింద్ స్వామి, త్రిష జంటగా నటించిన ఈ చిత్రానికి ‘ఖాకి’ మూవీ ఫేమ్ హెచ్ .వినోద్ దర్శకుడు.కాగా ఇది దర్శకుడు వినోద్ తొలి సూపర్ హిట్ చిత్రం ‘శతురంగ వేట్టై’ (తెలుగులో బ్లఫ్ మాస్టర్)కు సీక్వెల్.
Remakes are always safe bets

వైసీపీలోకి టీడీపీ వలసల జాతర!


ఆంధ్రప్రదేశ్ లో స్థానిక ఎన్నికలు దగ్గరౌతున్న సమయంలో పార్టీల మధ్య వలసలు పెరుగుతున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం, ఆయన కొడుకు కరణం వెంకటేష్ వైసీపీలో చేరనున్నారు. ప్రస్తుతం కరణం చీరాల నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రభుత్వ సలహాదారు సజ్జల… 13-17 మంది టీడీపీ ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారని అన్నారు. మేం వారిని ఆహ్వానించకున్నా వారంతట వారే వస్తున్నారన్న ఆయన టీడీపీకి గడ్డుకాలమే అని చాలా మందికి అర్ధం అవుతోందని అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ మీద ఆ పార్టీ నేతలకే నమ్మకం కలగడం లేదని, ఇప్పుడున్న టీడీపీ ఎన్టీఆర్ పెట్టింది కాదని ఆయన అన్నారు.

టీడీపీ నేతలు స్థానిక ఎన్నికల్లో బరిలోకి దిగకుండా వైసీపీ అడ్డుకుంటోందని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారుని సజ్జల విమర్శించారు. ఓటమికి సాకులు వెతుక్కుంటున్న చంద్రబాబు వైసీపీని దోషిగా చూపుతున్నారని అన్నారు. స్థానిక ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎవరైనా నామినేషన్ల వేయడానికి ఇబ్బందులు ఎదుర్కొంటే మేం ఎస్కార్ట్ ఇచ్చి పంపుతామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే పరిమల్ నత్వానీకి టిక్కెట్ ఇచ్చామన్న సజ్జల టిక్కెట్లను అమ్ముకునే సంస్కృతి టీడీపీదేనని అన్నారు. సుజనా, సీఎం రమేష్, గరికిపాటి, కనకమేడల వంటి వాళ్లకు రాజ్యసభ ఇచ్చిన టీడీపీ.. మమ్మల్ని విమర్శించడం సరికాదని ఆయన పేర్కొన్నారు.

బిజీ అవుతున్న నివేద పేతురేజ్

2017 లో వచ్చిన మెంటల్ మదిలో చిత్రం తో తెలుగు నాట కాలు మోపిన తమిళ పొన్ను నివేథ పేతురాజ్ టాలీవుడ్ లో మెల్ల మెల్లగా తన స్థానాన్ని పదిల పరుచు కొంటోంది. తెలుగు ప్రేక్షకులకు మెంటల్ మదిలో చిత్రంతో పరిచయం అయిన ఈ అమ్మడు గత ఏడాది చిత్రలహరి ఇంకా బ్రోచేవారెవరు రా అనే చిత్రాల్లో నటించి మెప్పించింది. అందంతో పాటు అద్బుతమైన అభినయ ప్రతిభ ఉన్న నాయిక గా నివేథ పేతురాజ్ కు పేరొచ్చింది. అందుకే నివేద పేతురేజ్ కి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన అల వైకుంఠపురంలో సినిమాలో రెండవ హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చాడు.

అల వైకుంఠపురం లో నివేద నటన అల్లు అర్జున్ కు కూడా నచ్చడంతో తన తదుపరి చిత్రానికి హీరోయిన్ గా పరిశీలిస్తున్నట్లుగా తెలిసింది. ఇప్పటికే రెండు మెగా చిత్రాల్లో నటించిన నివేద మరో మెగా ఛాన్స్ ను దక్కించుకుంది. ఆల్రెడీ చిత్రలహరి చిత్రంలో సాయి ధరమ్ తేజ్ తో కల్సి నటించిన నివేథ పేతురాజ్ మరోసారి సాయి తేజ్ తో జత కట్టేందుకు సినిమా సిద్దం అయ్యింది.

విశ్వసనీయంగా తెలుస్తున్న దాన్ని బట్టి ” సోలో బ్రతుకే సోబెటర్ ” చిత్రం తర్వాత సాయి ధరమ్ తేజ్ దేవా కట్టా దర్శకత్వం లోచేయబోతున్న మూవీలో హీరోయిన్ గా ఈ తమిళ పొన్నుని ఎంపిక చేశారట. నటన ప్రతిభ ఉన్న అమ్మాయిని ఈ సినిమా కోసం తీసుకోవాలనే ఉద్దేశ్యంతో నివేథ పేతురాజ్ ను హీరోయిన్ గా ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది..ఈ చిత్రమే కాకుండా ప్రస్తుతం రామ్ ‘రెడ్’ లో కూడా ఈ నివేద నటి స్తోంది.ఇంకా కొన్ని చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి. మొత్తానికి ఈ ఏడాది నివేద పేతురాజ్ తెలుగు లో పలు సినిమాలతో బిజీగా ఉండే అవకాశం కనిపిస్తోంది.
Talent is her investment

Pawan Kalyan at Sai Dharam Tej movie launch

శివకుమార్ రాకతో యడ్డ్యూరప్పకు ముళ్లబాట!

ఒక వంక పార్టీ ప్రధాన కార్యదర్శి జ్యోతిరాదిత్య సింధియా తిరుగుబాటు చేయడంతో మధ్య ప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వ మనుగడ ప్రశ్నార్ధకరమైన సమయంలోనే హడావుడిగా కర్ణాటకలో పార్టీ అధ్యక్షుడిగా కాంగ్రెస్‌లో ట్రబుల్‌ షూటర్‌గా పేరొందిన డీకే శివకుమార్‌ను ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ నియమించారు

లోక్ సభ ఎన్నికలలో పార్టీ పరాజయానికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేసిన దినేష్ గుండూరావు స్థానంలో ఈ నియామకం జరిపారు. ఈ నిర్ణయం చాలా ముందుగానే జరిగినా అందుకు మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉండడంతో నియామకంలో జాప్యం జరిగిన్నట్లు చెబుతున్నారు.

శివకుమార్ ను నియమిస్తే కాంగ్రెస్ నుండి వైదొలిగి, మరో ప్రాంతీయ పార్టీ పెడతానని అంటూ సిద్ధారామాయ్య దిక్కారధోరణి ప్రదర్శించారు. అయితే ఇప్పుడు ఆయనను లెక్క చేయకుండా శివకుమార్ ను నియమించడం గమనార్హం. కానీ, పార్టీ శాసనసభ పక్ష నేతగా సిద్దరామయ్య చేసిన రాజీనామాను ఆమోదించకుండా, ఆయనను అదే పదవిలో కొనసాగించారు.

మొదటి నుండి, తనకు కాకుండా కాంగ్రెస్ లో మరే నాయకుడు ఎదగడాన్ని సిద్దరామయ్య సహింపలేక పోతున్నారు. పైగా తాను ఎవ్వరిని ముఖ్యమంత్రిగా చేయడాన్ని తట్టుకోలేక జేడీఎస్ నుండి బైటకు వచ్చి, కాంగ్రెస్ లో చేరి ముఖ్యమంత్రి కాగలిగానే, అదే సిద్దరామయ్యను కాంగ్రెస్ మద్దతుతో ముఖ్యమంత్రిగా చేయడాన్ని తట్టుకోలేక పోయారు.

అందుకనే, సిద్దరామయ్య మద్దతుదారులు తిరుగుబాటు చేయడంతోనే కాంగ్రెస్ – జేడీఎస్ ప్రభుత్వం కూలిపోయి, తిరిగి బీజేపీ అధికారంలోకి రాగలిగింది. ఒక విధంగా సిద్దరామయ్య కారణంగానే ఇప్పుడు యడ్డ్యూరప్ప ముఖ్యమంత్రిగా ఉండగలుగుతున్నారు. అటువంటిది బిజెపి ప్రలోభాలకు తగ్గుకొని సంకీర్ణ ప్రభుత్వం సంవత్సరంకు పైగా కొనసాగేటట్లు చేయడంలో కీలక పాత్ర వహించిన శివకుమార్ కు కాంగ్రెస్ నాయకత్వం అప్పజెప్పడం యడ్డియూరప్ప ముందున్నది ముళ్లబాటే అన్న సంకేతాన్ని ఇస్తున్నది.

శివకుమార్ కు పార్టీ నాయకత్వం దక్కనీయకుండా చేయడం కోసం సిద్దరామయ్య ద్వారా యడ్డ్యూరప్ప కూడా విశేషంగా ప్రయత్నం చేసిన్నట్లు తెలుస్తున్నది. సిద్దరామయ్య ఏది అడిగినా ప్రభుత్వం వెంటనే చేస్తూ ఉండడం, ఆయన నియోజకవర్గానికి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయడం గమనిస్తే వారిద్దరి మధ్య మంచి అనుబంధం నెలకొన్నట్లు అర్ధం అవుతుంది.

గత మూడేళ్ళుగా ఐటి, ఈడీ శాఖల అధికారులు ఎన్నో సార్లు శివకుమార్, ఆయన సన్నిహితులపై దాడులు జరిపారు. ఆయనను అరెస్ట్ కూడా చేసి జైలులో ఉంచారు. అయినా బిజెపి నుండి వస్తున్న వత్తిడులకు లొంగడం లేదు. యడ్డ్యూరప్ప ముఖ్యమంత్రి పదవిలో కొనసాగడం బీజేపీలోని బలమైన వర్గాలకే ఇష్టం లేదు. అటువంటి పరిస్థితులలో రెండు వైపులా వత్తిడులు ఎదుర్కోవలసిన పరిస్థితి ఇప్పుడు బీజేపీ ప్రభుత్వానికి ఏర్పడింది.

Orey Bujjiga Press Meet Photos

Malavika Nair at Orey Bujjiga Press Meet

Asalem Jarigindhante Trailer Launch Photos