అల్లుడు శీను సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన బెల్లంకొండ శ్రీనుకి ఎట్టకేలకు ఒక హిట్ వచ్చింది. తమిళం లో రామ్ కుమార్ దర్శకత్వంలో విష్జు విశాల్ , అమల పాల్ హీరో , హీరోయిన్లుగా నిర్మించిన సూపర్ హిట్ మూవీ రాచ్చసన్ రీమేక్ రాక్షసుడు సినిమాతో తొలి విజయం అందుకొన్నాడు. బెల్లంకొండ శ్రీను…దాంతో తదుపరి చిత్రాల విషయంలో పలు జాగ్రత్తలు తీసుకొంటున్నాడు.
తెలుగులో ‘కందిరీగ’, ‘రభస’ “హైపర్ ” వంటి హిట్ చిత్రాలు తీసిన దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ ఇపుడు బెల్లంకొండ శ్రీనివాస్ తో కలిసి ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో మరో సక్సెస్ సాధిస్తాననే నమ్మకంగా ఉన్నాడు బెల్లంకొండ శ్రీనివాస్ . దరిమిలా రానున్న సమ్మర్నుఎలాగైనా క్యాష్ చేసుకోవాలనుకుంటున్నాడు. అందులో భాగంగా సినిమాను మే 1న విడుదల చేయాలని అనుకుంటున్నాడట. అయితే అదే రోజున మెగా హీరో సాయితేజ్ నటిస్తోన్న” సోలో బ్రతుకే సో బెటర్” సినిమా విడుదల కానుంది. ఒకవేళ పోటీ ఎందుకులే అనుకుని ఏప్రిల్ 24న వద్దామనుకుంటే … మరో యువ హీరో శర్వానంద్ తాను నటించిన శ్రీకారం మూవీతో అదే రోజున రావాలని ఎదురుచూస్తున్నాడు.
పోనీ ఆలస్యంగా మే రెండో వారంలో వద్దామనుకుంటే పవన్ కళ్యాణ్ నటించిన “వకీల్ సాబ్ ” మూవీ పెద్ద అడ్డంకిగా మారింది.పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ కాబట్టి సినిమాపై ఎలాంటి అంచనాలుంటాయనేది బెల్లంకొండ శ్రీను కి బాగా తెలుసు. దాంతో ఇన్ని సినిమాల మధ్య ఏ తేదిన రావాలో అర్ధంగాక బెల్లంకొండ శ్రీనివాస్ ఆలోచనలో పడ్డాడట … Think twice before you leap