దర్శక దిగ్గజం రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ మూవీని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ అప్డేట్స్ కోసం అభిమానులు కొన్నిరోజులుగా ఎంతో అత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఉగాది నుంచి ‘ఆర్ఆర్ఆర్’కు సంబంధించిన వరుస అప్డేట్స్ ను దర్శకుడు రాజమౌళి విడుదల చేస్తూ మూవీపై భారీ అంచనాలను పెంచేస్తున్నాడు. ఉగాది రోజున ‘ఆర్ఆర్ఆర్’ మోషన్ పోస్టర్ విడుదల చేసిన సంగతి తెల్సిందే. ఈ మోషన్ పోస్టర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ఇందులోనే ‘ఆర్ఆర్ఆర్’ టైటిల్ ‘రౌద్రం రణం రధిరం’గా ప్రకటించారు.
నేడు(శుక్రవారం) చెర్రీ పుట్టిన రోజును పురస్కరించుకొని యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ నుంచి సర్ ప్రైజ్ గిప్ట్ అందించారు. కొద్ది క్షణాల కిందటే ‘ఆర్ఆర్ఆర్’లో రాంచరణ్ పాత్రకు సంబంధించిన వీడియోను ఎన్టీఆర్ ట్వీటర్లో రిలీజ్ చేశారు. ‘అల్లూరి సీతారామరాజు’గా చెర్రీ అద్భుత నటనతోడుగా బ్యాగౌండ్లో ఎన్టీఆర్ వాయిస్ తోడవడం మరింత బలాన్నిచ్చింది. ఎన్టీఆర్ చెప్పిన ఒక్కో డైలాగ్ డైనమైట్ లా పేలాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
As promised, I give you @AlwaysRamCharan!
Happy birthday brother! Will cherish our bond forever.#BheemforRamaraju https://t.co/nCiO2YLgs2— Jr NTR (@tarak9999) March 27, 2020
తాజాగా ఈ మూవీకి సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ అభిమానుల్లో ఆసక్తిని రేపుతోంది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ‘ఆర్ఆర్ఆర్’లో కీలక రోల్ చేయనున్నట్లు ఫీల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది. ఇందుకు సంబంధించిన కథను రాజమౌళి మోహన్ లాల్ కు చెప్పగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీలో ఇప్పటికే పలువురు హాలీవుడ్, బాలీవుడ్ స్టార్లు నటిస్తున్నారు. అజయ్ దేవగణ్, సీనియర్ నటి శ్రియ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
రాంచరణ్ సరసన బాలీవుడ్ భామ అలియా భట్, ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ఒలీవియా నటిస్తుంది. తాజాగా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఓ కీలక పాత్రలో నటిస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీని దాదాపు 300కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మాత దానయ్య నిర్మిస్తుండగా కీరవాణి అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్నాడు.