Home Blog Page 8559

సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ.5 కోట్లు విరాళం ఇచ్చిన సంస్థ

ప్రముఖ మందుల తయారీ సంస్థ దివీస్ లేబొరేటరీస్ లిమిటెడ్, ఎన్ సి సి లిమిటెడ్ లు కొవిడ్ 19 విపత్తు సందర్భంగా తమవంతుగా ముఖ్యమంత్రి సహాయ నిధికి భారీ విరాళం ఇవ్వడం జరిగింది. విజయవాడలోని ప్రధాన కార్యదర్శి విడిది కార్యాలయంలో మంగళవారం సాయంత్రం దివిస్ లేబోరేటరీస్ లిమిటెడ్ రూ. 5 కోట్లు ను , ఎన్ సి సి లిమిటెడ్ రూ.1 కోటి రూపాయల చెక్కులను కంపెనీ ప్రతినిధులు ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నిని కలిసి ముఖ్యమంత్రి సహాయ నిధికి చెక్కులను అందచేశారు.

మరోవైపు ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.44.52 లక్షల విరాళాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల కాంట్రాక్ట్‌ లెక్చరర్లు సంఘం నాయకులు అందించారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌.జగన్‌కు చెక్కు అందించిన తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్, జూనియర్‌ లెక్చరర్స్‌ అసోసియేషన్‌ జేఏసీ కన్వీనర్‌ యార్లగడ్డ రాజాచౌదరి, కో కన్వీనర్‌ మాధవ్‌లు సీఎంను కలిసిన వారిలో ఉన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.25 లక్షలు విరాళం గుంటూరు జిల్లా పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు అందజేశారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌కు చెక్కును అందించారు.

మరోసారి నోటికి పని చెప్పిన మంత్రి

తప్పుడు ప్రచారం చేస్తే చంద్రబాబు బట్టలు ఊడదీయాల్సి వస్తుందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ కొడాలి వెంకటేశ్వరరావు(నాని) అన్నారు. కరోనా వైరస్ కు భయపడి చంద్రబాబు ఇంట్లో దాక్కున్నారని ఎద్దేవ చేశారు. తాడేపల్లిలోని వై.సి.పి ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబులా సీఎం జగన్మోహన్ రెడ్డి దాక్కోలేదన్నారు.

వయస్సు పై బడి చస్తాననే భయంతో చంద్రబాబు ఆక్సిజన్ పెట్టుకొని బతుకుతున్నాడని విమర్శించారు. ఈ విపత్కర పరిస్దితులలో రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవుపలికారు. రాష్ట్రంలో ఎల్లో వైరస్ ఉంది. కరోనా వైరస్ కంటే ప్రమాదకరమైనది ఎల్లో వైరస్ అని చెప్పారు. ఎల్లో వైరస్ కోరలు పీకే మందు మాదగ్గర ఉందన్నారు. కరోనా నుంచి ప్రజలను కాపాడాల్సిన బాధ్యత సీఎంపై ఉందన్నారు. ప్రజలు కరోనా వైరస్ బారిన పడకుండా వైయస్ సీఎం జగన్ పగడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. చంద్రబాబులా ప్రచార పిచ్చి జగన్ కు లేదన్నారు. అందరికి రేషన్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రజలకు నిత్యావసరాలకు ఇబ్బంది లేకుండా చూస్తున్నామని చెప్పారు.
రేషన్ షాపుల వద్ద జనం గుంపులు గుంపులుగా ఉండకూడదన్నారు.ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉచితంగా సరుకులు సరఫరా చేస్తున్నామని తెలిపారు.

వేలిముద్ర లేకుండా నిత్యావసర వస్తువులు ఇస్తున్నామని, గంటకు 20 నుంచి 25 మందికి మాత్రమే రేషన్ ఇవ్వగలుగుతున్నాం అన్నారు. ప్రతి ఒక్క వినియోగదారునికి సరుకులు అందిస్తామని ఏఒక్కరు ఆందోళన చెందనవసరం లేదని చెప్పారు. వాలంటరీ వ్యవస్థ ద్వారా సరుకులు ఇవ్వాలని కొందరు అడుగుతున్నారని, గతంలో వాళ్ళే వాలంటరీ వ్యవస్థ ను హేళన చేసిన నిష్టదరిద్రులని చెప్పుకొచ్చారు. వాలంటీర్లు అమ్మాయిలను ఏడిపిస్తారని విమర్శలు చేశారన్నారు.

కరోనా నియంత్రణపై వాలంటీర్లు సైనికుల్లా పనిచేస్తున్నారని కితాబిచ్చారు. వాలంటీర్లు ఒకరి ఇంటికి తరువాత మరొక ఇంటికి వెళ్లి ఇస్తే కరోనా వలన ఇబ్బంది అవుతుందని ఆ విధానం అవలంభించడం లేదన్నారు. ప్రస్తుతం వాలంటీర్లు ఖాళీగా లేరని, నిత్యం ప్రజల ఆరోగ్యాల గురించి పనిచేస్తున్నారన్నారు. విదేశాల నుంచి వచ్చింది ఎవరు అని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారని చెప్పారు. వాలంటీర్ల వ్యవస్థను అభినందించారు. చంద్రబాబు ఊర కుక్కలు మహిళ రేషన్ కోసం వచ్చి చనిపోయిందని మొరుగుతున్నాయని, ఇందులో వాస్తవం లేదన్నారు. పనికిమాలిన దేవినేని ఉమా, సోదిరెడ్డి సోమిరెడ్డి ప్రభుత్వం పై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. వదిన ను చంపిన దేవినేని ఉమాకు నన్ను రాజీనామా చేయమని అడిగే హక్కు లేదన్నారు. ఈ నెల రేషన్ తీసుకోకపోతే వచ్చే నెల ఇచ్చే విషయం సీఎం గారితో చర్చిస్తానని చెప్పారు.

దేశంలో కరోనా కల్లోలానికి, కారణం.. ఆ ప్రార్థనలు?

ప్రస్తుతం భారత్ లో కరోనా రక్కసి కోరలు చాచిన వేళ, అందుకు గల కారణాలను అధికారులు అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలోనే అధికారుల అన్వేషణ మార్చి 13,14, 15 తేదీలలో ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ మసీదులో నిర్వహించిన ప్రార్థనలపై పడింది.ఈ ప్రాంతం దేశ రాజధాని ఢిల్లీలో ఉంది. ఈ ప్రార్ధనలకు దేశ, విదేశాలకు చెందిన వారు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు కుడా సుమారు 2 వేల మంది పాల్గొన్నట్టుగా తెలుస్తోంది.

వారిలో చాలామందికి కరోనా సోకినట్టుగా అధికారులు అంచనాకు వచ్చారు. అందులో ఇప్పటికే ఆరుగురు మృత్యువాత పడడంతో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు, ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారు విధిగా తమ వివరాలు తెలపాలని అధికారులు ఇప్పటికే విజ్ఞప్తి చేశారు.
ప్రార్థనల్లో పాల్గొన్న 2వేల మంది తెలుగువారిలో
తెలంగాణలో ఏకంగా ఆరుగురు కరోనాతో చనిపోవడం, ఆ ఆరుగురూ ఢిల్లీలో మర్కజ్‌ లో ప్రార్థనల కోసం వెళ్లిన వారే కావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
రెండు రోజుల పాటు ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ మసీదులో నిర్వహించిన ప్రార్థనల్లో దేశ, విదేశాలకు చెందిన వారు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. థాయ్‌ లాండ్, ఇండోనేసియా, మలేసియా, కిరిగిస్థాన్, ఇరాన్, ఉజ్ బెకిస్తాన్ తదితర ఆసియా దేశాలకు చెందిన వారు పాల్గొనగా, ఈ ప్రార్థనలకు ఇతర దేశాల నుంచి మత పెద్దలు సైతం వచ్చినట్టుగా అధికారుల విచారణలో తెలిసింది. ఎపి, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 2వేల మంది ఈ ప్రార్థనల్లో పాల్గొనగా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఈ ప్రార్థనలకు హాజరయినట్టుగా సమాచారం.

అంతర్జాతీయ స్థాయిలో ప్రార్థనా మందిరంలో రెండున్నర రోజులపాటు ఓ సదస్సు జరిగింది. ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 2 వేల మంది హాజరుకాగా, వీరిలో అత్యధికులు మార్చి 14-,15వ తేదీల్లో తమ తమ ప్రాంతాల నుంచి రైళ్లలో వెళ్లారు. 16, 17, 18వ తేదీ మధ్యాహ్నం వరకు ఈ సదస్సులో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లిన వారంతా కలిసే ప్రయాణించడంతో పాటు ఢిల్లీలో ఉన్నన్నీ రోజులు కలిసే బస చేశారు. తిరుగు ప్రయాణంలో వీరంతా దురంతో ఎక్స్‌ప్రెస్, ఎపి ఎక్స్‌ప్రెస్‌ లలో ప్రయాణించినట్టుగా అధికారులు గుర్తించారు.

గ్రేటర్ హైదరాబాద్ నుంచి దాదాపు 300 మంది
ఢిల్లీలో ప్రార్థనలకు గ్రేటర్ హైదరాబాద్ నుంచి దాదాపు 300 మంది వెళ్లినట్లు సమాచారం. వారిలో 150 మంది వివరాలను ఇప్పటికే అధికారులు సేకరించారు. కుత్బుల్లాపూర్‌కు చెందిన మరో వ్యక్తికి కూడా ఢిల్లీలో ప్రార్థనలకు వెళ్లొచ్చాక వైరస్ లక్షణాలు కనిపించగా పరీక్షలు చేస్తే పాజిటివ్ వచ్చింది. అతడి నుంచి కుటుంబసభ్యుల్లో నలుగురికి వైరస్ సోకింది. దీంతో వైద్యశాఖ అధికారులు ఢిల్లీ ప్రార్థనా మందిరం నిర్వాహకులను సంప్రదించి ఆ కార్యక్రమానికి హైదరాబాద్ నుంచి వచ్చిన వారి వివరాలను సేకరించారు. ఆ వివరాల ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా వెళ్లిన వారికి పరీక్షలు చేయాలని నిర్ణయించినట్టుగా తెలిసింది.

ఈ ప్రార్ధనలకు వెళ్లి న నాగర్ కర్నూల్ వాసికి కరోనా పాజిటీవ్ కేసు నమోదైంది. దీంతో తెలంగాణలో కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 78కి చేరింది.ఇక, రాష్ట్రంలో కరోనా వైరస్ సోకి ఇప్పటివరకు 8మంది మరణించారు.

ఎన్ టి ఆర్ ఏమంటాడో అంటున్న తరుణ్

2018 లో అరవింద సామెత వీర రాఘవ చిత్రం లో నటించాక చిన్న ఎన్టీఆర్ మరో చిత్రం లో నటించలేదు . తాజాగా ” రౌద్రం రణం రుధిరం ” చిత్రం లో ఇద్దరు హీరోల్లో ఒకడిగా నటిస్తున్నాడు. టాప్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వం లో రూపొందుతున్న ఈ చిత్రం ఫై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ మరో చిత్రం చేయనున్నాడు. అందుకు సంబంధించిన స్క్రిప్ట్ పై త్రివిక్రమ్ వర్క్ కూడా చేస్తున్నాడు. అయితే ఆ తరువాత ఎన్ టి ఆర్ చేయబోయే ప్రాజెక్టు పెళ్లి చూపులు ఫేమ్ తరుణ్ భాస్కర్ తో ఉండొచ్చనే వార్త బయటి కొచ్చింది .

తరుణ్ భాస్కర్ వైవిధ్యభరితమైన కథలకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తాడు. ఆయన టేకింగ్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. ఇంతకు ముందు తరుణ్ భాస్కర్ డైరెక్ట్ చేసిన `పెళ్లిచూపులు , ఈ నగరానికి ఏమైంది `చిత్రాలు చూస్తే ఆ విషయం అర్ధమౌతుంది . ఇపుడు తనదైన స్టైల్లో ఎన్టీఆర్ ను చూపించడానికి కూడా తరుణ్ భాస్కర్ ఆసక్తిని చూపుతున్నాడు. ఆ ప్రాసెస్ లో ఆల్రెడీ ఎన్టీఆర్ కి ఒక కథను కూడా వినిపించినట్టుగా తెలుస్తోంది. ఇక ఎన్టీఆర్ నుంచి సమాధానం మాత్రమే రావలసి వుంది. ఎన్టీఆర్ ఓకే అంటే ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుంది.

కరోనా కి స్టార్స్ ఏమీ అతీతులు కారు

కోవిడ్ 19 అనబడే కరోనా వైరస్ కారణంగా ప్రపంచం మొత్తం వణికిపోతోంది. దాంతో యెంత గొప్ప వ్యక్తి అయినా, సెలబ్రిటీలు అయినా ఈ వైరస్ బారి నుండి తప్పించుకోలేకపోతున్నారు. ప్రధానంగా విదేశాల నుండి మనదేశానికి తిరిగివస్తున్న సెలబ్రిటీలపై అందరి దృష్టి ఉంది. ఇప్పటికే విదేశీ పర్యటన నుండి తిరిగొచ్చిన బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ కి కరోనా సోకడం తో ఆ జాగ్రత్త మరీ ఎక్కువైంది. ఆ క్రమం లో ప్రముఖ హిందీ నటుడు, ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’లో నటిస్తున్న అజయ్ దేవగన్ కుటుంబానికి సైతం కరోనా సోకినట్టు వార్తలు వచ్చాయి .

ఇంతకీ అసలు విషయం ఏమిటంటే అజయ్ దేవగన్, కాజోల్ కుమార్తె నిశా సింగపూర్లో చదువుకుంటోంది. కరోనా ప్రభావం కారణంగా ఆమెను కాజోల్ స్వయంగా సింగపూర్ వెళ్ళి ముంబై తీసుకు రావడం జరిగింది. దాంతో కాజోల్, నిశా ఇద్దరూ వైద్యుల సలహా మేరకు కొన్ని రోజులుగా సెల్ఫ్ ఐసోలేషన్ లోనే ఉన్నారు.. దీంతో వారికి కరోనా ఎఫెక్ట్ అయిందనే పుకార్లు పుట్టుకొచ్చాయి. వీటిపై స్పందించిన అజయ్ దేవగన్ కాజోల్, నిశా ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని, వారికి కరోనా సోకినట్టు వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని ధృవీకరించారు

కరోనా మహమ్మారి రోజు రోజుకి విజృభిస్తోంది . అందులో భాగంగా తమిళ్ స్టార్ హీరో విజయ్ నివాసంలో ఆరోగ్య శాఖాధికారులు కరోనా పరీక్షలు నిర్వహించారు. విదేశాలకు వెళ్లి వచ్చిన వారి లిస్ట్ ను రెడీ చేసుకున్న తమిళనాడు ప్రభుత్వం అందరికీ కరోనా పరీక్షలు చేస్తున్నారు. అందులో భాగంగానే విజయ్ ఇంటికి వెళ్లి విజయ్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. అయితే ఎవరికీ కరోనా వైరస్ సోకలేదని తెల్సుకొని అంతా ఊపిరి పీల్చుకొన్నారు .రూ ఆరోగ్యంగా ఉన్నారని నొక్కి చెప్పారు .

పిఎం, సిఎం సహాయ నిధులకు గవర్నర్ చేయూత

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వ భూషణ్ హరిచందన్ కరోనా విపత్తు నేపధ్యంలో తనదైన శైలిలో స్పందించారు. రాష్ట్ర ప్రధమ పౌరుని హోదాలో కరోనా వ్యాప్తి నిరోధం కోసం తన వంతు ప్రయత్నాన్ని చేస్తూ ముఖ్యమంత్రి మొదలు అయా శాఖల ఉన్నతాధికారులతో నిరంతరం చర్చలు జరుపుతున్నారు. తనకున్న సుదీర్ఘ ప్రజా జీవితం ఆలంబనగా అధికార గణంకు సూచనలు, సలహాలు ఇస్తూ వస్తున్నారు. రాష్ట్రంలోని విశ్వ విద్యాలయాల కులపతి హోదాలో విద్యార్ధులను సైతం ఆ దిశగా కార్యోన్ముఖులను చేయాలని ఉపకులపతులను ఆదేశించారు. రాష్ట్ర రాజ్యాంగ అధినేతగా అన్ని చేస్తూనే, వ్యక్తిగతంగా కూడా తన పెద్ద మనస్సును చాటుకున్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి లక్ష రూపాయలను విరాళంగా ఇవ్వాలని నిర్ణయించారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రికి సైతం స్వయంగా వివరించిన బిశ్వభూషణ్ రాష్ట్ర ఆరోగ్య స్ధితి గతులను మెరుగు పరిచేందుకు తన వంతుగా చిరు విరాళంను అందిస్తున్నానన్నారు.

విశాలమైన జాతీయ భావాలు కలిగిన హరిచందన్ మరోవైపు ప్రధాని సంరక్షణ నిధికి సైతం తన నెల రోజుల జీతాన్ని విరాళంగా సమకూర్చాలని నిర్ణయించి ఆమేరకు నిధులను బదిలీ చేయాలని రాజ్ భవన్ కార్యదర్శి ముఖేష్ కుమర్ మీనా ను అదేశించారు. ప్రస్తుత పరిస్ధితులలో ప్రతి ఒక్కరూ దాతృత్వం చూపాలని, దాతలు సమకూర్చే ప్రతి రూపాయి ఈ దేశంలో ఆరోగ్య పరిస్ధితులను మెరుగు పరిచేందుకు ఉపయోగపడుతుందని గవర్నర్ అన్నారు. కరోనా వ్యాప్తి నిరోధానికి సామాజిక దూరం పాటించటం మాత్రమే కీలకం అయినందున, ప్రతి ఒక్కరూ తదనుగుణంగా వ్యవహరించాలన్నారు.

గ్రామ వాలంటీర్లపై ఆధారపడటం సబబేనా..?

ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో గ్రామ వాలంటీర్ల పనితీరును మెచ్చుకుంటూ.. జాతీయ మీడియా, జగన్ సర్కార్ పై పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపించింది. అదే విషయాన్ని ఊటంకిస్తూ.. వైసీపీ నేతలు జగన్ ముందుచూపు పై పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. అయితే ఈ గ్రామ వాలంటీర్లపై అంత మంచి అభ్రిప్రాయం లేదన్నది కొంత మంది ఉదేశ్యం. ఇతర దేశాల నుండి వచ్చిన వారి సమాచారం వాలంటీర్లు సేకరించి ప్రభుత్వానికి అందచేయాలన్న పద్ధతి సరికాదు. పోలీసు యంత్రాంగం వివిధ విమానాశ్రయాల అధికారులనుండి ప్రయాణీకుల వివరాలను స్వీకరిస్తే మంచిదనేది కొంతమంది అభిప్రాయం.

వాలంటీర్ల వ్యవస్థే లోపభూయిష్టం. వారికి సరైన శిక్షణ, వివిధ అంశాలపై సరైన అవగాహన లేదు. వారు సేకరించి పంపే సమాచారం విశ్వసనీయత ఎంత? ఇప్పటికే ప్రభుత్వం రోజుకో సంఖ్య చెబుతూ ప్రజల్లో విశ్వా సం కోల్పోతున్నది.పైగా వాలంటీర్లు అద్భుతంగా పనిచేస్తున్నా రంటూ పాలకులు అసత్య ప్రచారానికి దిగటం హాస్యాస్పదంగా ఉంది. వాస్తవానికి క్షేత్రస్థాయిలో చాలా మంది వాలంటీర్లు అనేక కారణాలతో విధులు నిర్వర్తించడం లేదు.

కరోనా వైరస్‌ ఉధృతి, ఆంక్షల నేపథ్యంలో రేషన్‌ సరుకులను దుకాణాల వద్ద ఇవ్వటం సరికాదు. వాలంటీర్ల ద్వారా ఆయా వినియోగదారులకు ఇళ్లవద్ద అందచేయడం శ్రేయస్కరం. అధికార యంత్రాంగం ఈ మేరకు చర్యలు వెంటనే తీసుకుంటే మంచిది అనేది కొందరి అభిప్రాయం.

అలాగే గ్రామాల్లో, పట్టణాల్లో సంచార నిత్యావసర వస్తువుల విక్రయ విహనాల ద్వారా అవసరమైన వారికి నిత్యావసర వస్తువులను సరసమైన ధరలకు అందచేయాలి. ఇందువలన ప్రజలు ఇళ్లనుండి బయటకు రాకుండా ఉండటానికి అవకాశం ఉంటుందని కొందరు అంటున్నారు.

ప్రభుత్వం లేనిపోని బేషజాలకుపోకుండా అందుబాటులో ఉన్న అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోని, వీలైనంత త్వరగా కరోనా సోకిన వారిని గుర్తించి కరోనాని కత్తిడి చేయాలని కొంతమంది మేధావుల అభిప్రాయం. లేకుంటే వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి తప్పు మీద తప్పు చేస్తూ పోతే అభాసుపాలవుతున్నారని హెచ్చరిస్తున్నారు.

కండిషన్స్ పెడుతున్న రష్మిక

సినీ రంగంలో తారల వైభోగం తాత్కాలికం. మరీ ముఖ్యంగా హీరోలతో పోల్చుకొంటే హీరోయిన్ ల కెరీర్ చాలా షార్ట్ టర్మ్ లో ఉంటుంది. అందుకే సినిమా హిట్ అయితే చాలు.. ఆ సినిమాకి పని చేసిన హీరో , హీరోయిన్ లు తమ తరువాత సినిమాకి రేట్లు పెంచి కోట్లు అడుగుతారు. యాక్టింగ్ స్కిల్ ఉండి కొంచెం ఫాలోయింగ్ పెరిగితే చాలు.. ఇక ఆ హీరోయిన్ రెమ్యూనిరేషన్ అమాంతం పెరిగిపోతుంది. ఇక వరుస హిట్స్ వస్తే ఆ హీరోయిన్ కండిషన్స్ కి అంతుండదు. ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగు తున్న రష్మిక మందన్న కూడా ఫుల్ డిమాండ్ చేస్తోందట. తన కండిషన్స్ కు అడ్డు చెబితే ఇక ఆ సినిమా చేయను అని కూడా చెప్పేస్తోందట.

రీసెంట్ గా సరిలేరు నీకెవ్వరు , భీష్మ చిత్రాల సూపర్ సక్సెస్ తో స్టార్ స్టేటస్ అందుకోవడంతో రష్మిక మందన్న ఎవ్వర్నీ లెక్క చేయట్లేదట. స్టార్ హీరో ల పక్కన తప్ప యంగ్ హీరోలతో ఇక సినిమాలు చేయనని చెప్పేస్తోందట. స్టార్ డమ్ లేని హీరోలను రిజెక్ట్ చేస్తూ కోట్ల రూపాయిల భారీ మొత్తాన్ని అడుగుతోందట …..

ఉద్యోగుల జీతాల కోతకు తెలంగాణ బీజేపీ వ్యతిరేకం

లాక్ డౌన్ కారణంగా ఏర్పడిన ఆర్దిక ఇబ్బందుల నుండి బైట పడటం కోసం ప్రభుత్వ ఉద్యోగుల జీతాలపై సగం మేరకు కొత్త విధించాలని తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు నిర్ణయించడాన్ని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్రంగా వ్యతిరేకించారు. కనీసం వారి సంఘాలతో సంప్రదింపులు కూడా జరుపకుండా ఇటువంటి నిర్ణయం ఏకపక్షంగా ఏ విధంగా తీసుకుంటారని నిలదీశారు.

ముఖ్యమంత్రికి వ్రాసిన ఒక లేఖలో ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరిలోపట భరోసా కల్పించాల్సిన సమయంలో ఈ నిర్ణయాన్ని పునరాలోచించాలని కోరారు. ధనిక రాష్ట్రంగా ప్రకటించుకొని, కోవిడ్-19 సమస్య మొదలైన మొదటి నెలలోనే ఇటువంటి నిర్ణయం తీసుకోవటం పట్ల విస్మయం వ్యక్తం చేశారు.

కేవలం 15 రోజుల లాక్ డౌన్ కే ఆర్థిక పరిస్థితి ఇంత దారుణంగా తయారైందంటే నమ్మశక్యంగా లేదని ముఖ్యమంత్రిని ఎద్దేవా చేశారు. జీవన వ్యయ ప్రమాణాలకు అనుగుణంగా వేతన సవరణ జరగక, ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వ నిర్ణయం అశనీపాతం కలిగిస్తుందని ధ్వజమెత్తారు.

కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగుల వేతనాల విషయంలో, ఇటువంటి తొందరపాటు నిర్ణయం తీసుకోలేదని ఈ సందర్భంగా సంజయ్ గుర్తు చేశారు. వేతనంపై ఆధారపడి బ్రతికే ఉద్యోగుల వేతనాల్లో ఏక పక్షంగా 50 శాతం కోత విధిస్తే కుటుంబాల జీవన పరిస్థితి అస్తవ్యస్థమౌతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

స్వయంగా ప్రధాన మంత్రి లాక్ డౌన్ పరిస్థితుల నేపథ్యంలో ప్రైవేట్ ఉద్యోగస్తుల, కార్మికులకు పూర్తి వేతనాలు చెల్లించాలని చెప్పారని గుర్తు చేశారు.

కానీ, కేసీఆర్ తీసుకున్న నిర్ణయంను అలుసుగా తీసుకొని, ప్రైవేట్ కంపెనీలు, వ్యాపారస్తులు, తమ దగ్గర పనిచేసే ఉద్యోగస్తుల, కార్మికుల జీతాల్లో కోతలు విధించే ప్రమాదం ఉందని హెచ్చరించారు . భారతదేశంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్న మొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మాత్రమే అని విస్మయం వ్యక్తం చేశారు.

కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక, సహాయక చర్యల్లో పలు శాఖల ఉద్యోగులు అహర్నిశలు పని చేస్తూ ప్రభుత్వ ప్రతిష్ట పెంపుదలకు ప్రయత్నిస్తున్నారని చెబుతూ . ఉద్యోగుల, పెన్షనర్ల పరిస్థితిని అర్థం చేసుకుని తమ నిర్ణయాన్ని పునఃపరిశీలన చేయాలని స్పష్టం చేశారు.

ముఖ్యంగా క్లిష్ట పరిస్థితుల్లో పనిచేస్తున్న ఆరోగ్య శాఖ, వైద్యులు, నర్సులు, నాలుగవ తరగ తి సిబ్బంది, పోలీస్, ఇతర శాఖల సిబ్బంది కి పూర్తి వేతనాలు చెల్లించటం తో పాటు, వారికి మాస్కులు వంటి వ్యక్తిగత రక్షణ సామగ్రిని వెంటనే సమకూర్చే విధంగా చర్యలు తీసుకోవాలని సంజయ్ డిమాండ్ చేశారు. య్ కోరారు.

‘కరోనాతో ఎవరు చనిపోతారా..’ అని చూస్తున్నారా?

ఆంధ్రప్రదేశ్ ని కరోనా రక్కసి అతలాకుతలం చేస్తున్న వేళ టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, టీడీపీ నేతల పై ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు.కరోనా వచ్చి ‘ఎవరు చనిపోతారా అని గోతి కాడ నక్కలాగా ఎదురు చూస్తోంది ఎల్లో మీడియా చూస్తోందని విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు చేసారు. విశాఖ జిల్లా లో వృద్ధురాలు అనారోగ్యంతో మరణిస్తే రేషన్ కోసం నిల్చుని చనిపోయిందని దుష్ప్రచారం మొదలు పెట్టారు. కరోనా అదుపులో ఉన్నందుకు ఇప్పటికే కుళ్లికుళ్లి ఏడుస్తున్న వారు డెడ్ బాడీని చూసి సంబరపడుతున్నారు’ అని ట్విట్టర్‌లో ప్రతిపక్ష పార్టీ టీడీపీని ఉద్దేశించి తీవ్రమైన విమర్శలు చేశారు.

టీడీపీ నేతలు చేస్తున్న ప్రతీ ఆరోపణకు ట్విట్టర్‌ లో ఘాటైన కౌంటర్లు ఇస్తున్నారు వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి. టీడీపీ చేస్తున్న ట్వీట్లకు కూడా ఆయన సమాధనం ఇస్తున్నారు. ఆర్టీజీ సేవల్ని వాడుకోవట్లేదన్న టీడీపీకి కూడా విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగానే సమాధానం ఇచ్చారు.

ఓవైపు రాష్ట్రవ్యాప్తంగా కరోనా వ్యాపిస్తున్నా ఏపీలో అధికార , ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు మాత్రం ఆగడం లేదు.

వలస కూలీల బాధ్యత కేంద్రానిదే… సుప్రీం స్పష్టం

వలస కూలీలను ఎక్కడివారక్కడే ఉండేటట్లు అవసరమైన వసతి, భోజనం ఏర్పాట్లు చేయమని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించి ఊరుకున్న ప్రభుత్వాన్ని ఒక విధంగా సుప్రీం కోర్ట్ మందలించింది. సుదీర్ఘ ప్రయాణాలు చేస్తున్న వలస కూలీలను నిలువరించి వెంటనే వారిని షెల్టర్‌ హోంలకు తరలించాలని కేంద్రాన్ని ఆదేశించింది.

లాక్‌డౌన్‌ నేపథ్యంలో వారికి ఆహారం, అవసరమైన వైద్య సహాయం అందించాలని స్పష్టం చేసింది. పోలీసులను ఉపయోగించకుకండా, వారికి నచ్చ చెప్పాలని, ఆయా వర్గాలకు చెందిన నాయకులతో వారికి కౌన్సెలింగ్‌ ఇప్పించాల్సిందిగా సూచించింది. షెల్టర్ హోమ్ లను కూడా పోలీసులతో కాకుండా స్వచ్ఛంద సేవకులతో నిర్వహించేటట్లు చూడాలని హితవు చెప్పింది.

వలసకూలీలు, కరోనా నివారణ అంశాలపై సుప్రీంకోర్టు నేడువిచారణ చేపట్టింది. కరోనా విలాస్ గురించి వదంతులు వ్యాపించి, ప్రజలలో భయాందోళనలు వ్యాప్తి చేయకుండా చూడటం కోసం 24 గంటలలో కేంద్ర ప్రభుత్వం ఒక పోర్టల్ ను ఏర్పాటు చేసి, ఎప్పటికప్పుడు వస్తావ సమాచారాన్ని ఇస్తూ ఉండాలని ఆదేశించింది.

కేంద్రం సమర్పించిన లాక్‌డౌన్‌ స్టేటస్‌ రిపోర్టులో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు 22.8 లక్షల మందికి వసతి, భోజనం ఏర్పాట్లు చేస్తున్నట్లు సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మోహతా తెలిపారు. దేశంలో 4.14 కోట్ల మంది వలసదారులున్నట్లు గణాంకాలు తెలుపుతున్నాయని చెప్పారు.

నెల్లూరులో రెండు డివిజన్లలో కర్ఫ్యూ!

నెల్లూరులో 43, 47 డివజన్లలో కర్ఫ్యూ విధించారు. ఢిల్లీలో జరిగిన ఒక మతపరమైన కార్యక్రమంలో పాల్గొన్న వారిలో ఆ ప్రాంతానికి చెందిన వారు కొంతమంది వున్నారు. ఢిల్లీలో ఈ కార్యక్రమానికి వెళ్ళి వచ్చిన వారికి కరోనా వైరస్ సోకడం, వారిలో కొంతమందికి పాజిటివ్ రావడంతో జిల్లా అధికార యంత్రాంగం ఈ విషయంలో వేగంగా స్పందించింది.

నెల్లూరు జిల్లా నుంచి 70 మంది ఢిల్లీలో జరిగిన ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. నెల్లూరు పెద్దబజారు చేపల మార్కెట్ నుంచి కోటమిట్ట మీదుగా ములుమూడి బస్టాండ్ వరకు చిన్నబజారుని కలుపుకుని పూర్తిగా లాక్ డౌన్ చేశారు. కర్ఫ్యూ అమలులో వున్నట్లుగా కూడా చెబుతున్నారు.

దీనివల్ల ఆ ప్రాంతంలో ఢిల్లీకి వెళ్ళివచ్చిన వారు ఎవరో కనుక్కుని వారికి కరోనా పరీక్షలు నిర్వహిస్తారు. వారిని క్వారంటైన్ లో వుంచుతారు. ఆ తర్వాత వారి కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, వారు ఎక్కడెక్కడ తిరిగింది, ఎవరెవరిని కలిసింది తెలుసుకుని, వారిని కూడా పిలిపించి వారి ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీస్తారు.

కాగా, ఢిల్లీలోని నిజాముద్దీన్‌ ప్రాంతంలో గల మర్కజ్‌ మసీదుకు వెళ్లి వచ్చిన వారితోనే ఒ‍క్కసారిగా రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని ఆందోళన వ్యక్తం చేశారు. నిన్నటివరకూ రాష్ట్రంలో 23 కరోనా పాజిటివ్‌ కేసులు ఉండగా, ఇవాళ ఒక్కసారిగా ఆ సంఖ్య 40కి చేరిందని చెప్పారు.

ఢిల్లీకి వెళ్లివచ్చిన వారు స్వచ్ఛందంగా కరోనా పరీక్షలు నిర్వహించుకోవాలని మంత్రి సూచించారు. రాష్ట్రానికి 30, 995 మంది విదేశాల నుంచి వచ్చారని, వారిలో 30, 693 మంది హోమ్‌ క్వారంటైన్‌లో ఉంచి ఎప్పటికప్పుడు ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.

ఇక రాష్ట్రంలో కరోనాను ఎదుర్కొనేందుకు 30 మంది ఐపీఎస్‌ అధికారులను నియమించామని, పట్టణాలు, నగర పాలక సంస్థలలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. కరోనా నిర్ధారణ ల్యాబ్ ల సంఖ్య పెంచడంతో పాటు అవసరమైన వైద్య పరికరాల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు.

రెండు విడతలుగా ఏపీ ఉద్యోగులకు జీతాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సాలరీలను రెండు విడతల్లో చెల్లిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పినట్లు రాష్ట్ర ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ తెలిపారు.

సీఎంతో భేటీ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా వ్యాప్తి కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతినడంతో ఈ నెలలో సగం జీతం చెల్లిస్తామని, నిధులు సర్దుబాటు అయ్యాక మిగతా సగం చెల్లిస్తామని సీఎం చెప్పారని పేర్కొన్నారు.

ఈ ఆపత్కాల పరిస్థితిలో రెండు విడతలుగా జీతాలు తీసుకునేందుకు ఒప్పుకున్నట్లు సూర్యనారాయణ వెల్లడించారు. ఈ ఒక్క నెల మాత్రమే రెండు విడతల్లో చెల్లిస్తామని, ఆ తర్వాత నుంచి యథావిథిగా మొత్తం ఒకే సారి ఇవ్వనున్నట్లు సీఎం చెప్పారని తెలిపారు.

కాగా, దేశంలో కరోనా వైరస్‌కు హాట్‌బెడ్‌గా ఉన్న మహారాష్ట్రలో సహితం ప్రభుత్వం ఆ రాష్ట్ర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వేతనాల్లో కోత పెట్టింది. మార్చి నెలలో వీరి వేతనాల్లో 60 శాతం కోత విధిస్తున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ తెలిపారు.

ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో కూడా కోత పెడుతున్నట్లు ప్రకటించారు. క్లాస్‌ 1,2 ఉద్యోగుల వేతనాల్లో 50శాతం, క్లాస్‌ 3 ఉద్యోగుల వేతనాల్లో 25శాతం కోత విధిస్తున్నట్లు వెల్లడించారు. ఇతర బ్యూరోక్రటిక్‌ ఉద్యోగుల వేతనాల్లో ఎలాంటి కోతలు ఉండవని తెలిపారు.

హీరో కృష్ణ పుట్టి నేటికీ 55 ఏళ్ళు

1965 మార్చ్ 31 వ తారీఖున తెలుగు సినీ చరిత్రలో అందరికి గుర్తు ఉండిపోయేలా ఒక చిత్రం వచ్చింది. అదే “తేనెమనసులు “. ప్రముఖ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం తోనే హీరో కృష్ణ తెలుగు తెరకు పరిచయ మయ్యాడు . నాటికి నేటికీ ఎవర్ గ్రీన్ క్లాసిక్ చిత్రం గా నిలిచిన ” తేనెమనసులు ” చిత్రం అప్పట్లో ” డోలి ” పేరు తో హిందీలో కూడా పునర్ నిర్మాణం జరుపుకొంది. రాజేష్ ఖన్నా హీరోగా నిర్మించ బడ్డ ఈ చిత్రం హిందీలో కూడా ఘన విజయం సాధించింది.

1965 లో విడుదల అయిన ” తేనెమనసులు ” చిత్రం నేటితో 55 వసంతాలు పూర్తి చేసుకొంది. ఆ లెక్కన హీరో గా కృష్ణ గారికి ఇది 55 వ పుట్టిన రోజు. ఆ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రిన్స్ మహేష్ బాబు సోషల్ మీడియా లో స్పందిస్తూ ‘నా ఆల్ టైమ్ ఫేవరెట్.. టైం లెస్ క్లాసిక్ అయిన ‘తేనే మనసులు’ సినిమానే. ఎవర్‌గ్రీన్ సూపర్‌స్టార్ కృష్ణ గారు ప్రయాణం మొదలై ఈ రోజుతోటి 55 సంవత్సరాల పూర్తయింది. ఆయన ప్రారంభం బ్లాక్ బస్టర్ తోనే మొదలైంది. మన సూపర్‌స్టార్ యొక్క లెజెండరీ జర్నీ తెలుసుకోవడానికి కొంత సమయం తీసుకుందాం’ అని పోస్ట్ చేయడం జరిగింది. కాగా ఈ సినిమా అప్పట్లో పలు కేంద్రాల్లో శతదినోత్సవం జరుపు కొంది.

ఢిల్లీ నుంచి వచ్చిన వారు క్వారంటైన్ కు

కరోనా వైరస్ కు సంబంధించి కొత్తగా 17 కేసులు నమోదవడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. కోవిడ్-19 బాధితుల సంఖ్య పెరగడానికి రాష్ట్ర వాసులు ఈ నెల మూడవ వారంలో డిల్లీలో జరిగిన తబ్లీగీ జమాత్ కార్యక్రమంలో పాల్గొనడమే. అక్కడికి వెళ్లి వచ్చిన వారిలో ఎక్కువ మందిలో కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయి. దీనితో ఈ కార్యక్రమానికి వెళ్లిన రాష్ట్ర వాసులు వివరాలు ఇప్పటికే సేకరించిన ప్రభుత్వం వారిని క్వారంటైన్ కు పంపాలని జిల్లా కలెక్టర్ లను ఆదేశించింది. ఈ అంశంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఢిల్లీ వెళ్లి వచ్చిన వారంతా స్వచ్చందంగా వారి వివరాలు అధికారులకు తెలపాలని సూచించారు. వ్యాధి లక్షణాలు ఉన్న వారిని హాస్పిటల్ క్వారంటైన్లోను, లక్షణాలు కనిపించని వారిని హోమ్ క్వారంటైన్, ఐసోలేషన్లో ఉంచాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఆ శాఖ ఆధికారుల మాట్లాడారు. ఢిల్లీలో జరిగిన తబ్లీగీ జమాత్‌ సదస్సుకు హాజరైనవారు, వారి కుటుంబ సభ్యులకు వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు. మరోవైపు ఆన్నీ జిల్లాల కలెక్టర్ లు అప్రమత్తమై రాష్ట్రంనుంచి వెళ్లిన వారు, అదేరోజు రైల్లో ప్రయాణం చేసిన వారి వివరాల ప్రకారం ఆ వ్యక్తులను గుర్తించేందుకు చర్యలు చేపట్టారు. గుంటూరులో జిల్లాలో 180 మందిలో 140 మందిని గుర్తించారు. 103 కేసులు చెక్ చేశారు, అందులో ఐదుగురికి పాజిటివ్ గా వ‌చ్చింది. మిగిలిన 40 మంది కోసం వెతుకుతున్నారు. ఢిల్లీలో మీటింగ్‌కి వెళ్లినవారితో పాటు వారి కుటుంభ సభ్యులకు పాజిటివ్ రిపోర్టులు వచ్చాయి.

ఢిల్లీ వెళ్లి వచ్చిన వారు స్వచ్చందంగా టెస్ట్ చేయించుకోవాలి.. అలా కాకుండా మాకు పట్టుబడితే కఠినంగా చర్యలు ఉంటాయని కలెక్టర్ లు ప్రకటించారు. అనంతపురం జిల్లాలో 73 మందిని గుర్తించారు. ఒకరి ఆచూకీ లభ్యం కాలేదు. మరొకరు ఢిల్లీలోనే ఉన్నట్లు తెలిసిందని అధోకారులు చెబుతున్నారు. ఇతర జిల్లాల్లోని అధికారులు వీరిని గుర్తించే పనిలో ఉన్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన వారి అడ్రసులు, ఫోన్ నెంబర్లు సేకరించడంతో వారిని కనుగొనడం తేలికయ్యింది.

పాత బస్తీలో ఢిల్లీ తరహా అల్లర్లకు పన్నాగం!

గత నెల చివరిలో ఢిల్లీలో జరిగిన అల్లర్ల తరహాలో హైదరాబాద్ లోని పాతబస్తీలో కూడా జరపడం కోసం పన్నాగం పన్నారా? కొందరు దుండగులు అటువంటి ప్రయత్నం చేశారని, అయితే వారు వేసిన బాంబులు పేలక పోవడంతో అనుకున్నట్లు జరగలేదని అల్లాస్యంగా పోలీస్ దర్యాప్తులో వెల్లడైంది.

ఈ మధ్య పాతబస్తీలో రెండు దేవాలయాలను లక్ష్యంగా చేసుకుని కిరోసిన్ బాంబులతో జరిగిన దాడి అటువంటి ప్రయత్నమే అని నిర్ధారణకు వస్తున్నారు. అయితే ఆ బాంబులు పేలకపోవడంతో వారి కుట్ర విఫలమైన్నట్లు భావిస్తున్నారు.

ఈ విషయమై పది రోజుల పాటు తీవ్రంగా శ్రమించి ఇద్దరు యువకులను పట్టుకున్న సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్, మాదన్నపేట్ పోలీసుల దృష్టికి విస్మయం కలిగించే అంశాలు వచ్చిన్నట్లు తెలుస్తున్నది. బాంబులు వేసి మతఘర్షణలు సృష్టించేందుకు నిందితులు నాలుగు రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో రెక్కి నిర్వహించిన్నట్లు కూడా వెలుగులోకి వచ్చింది.

ముష్కరులు అక్టీవా వాహనంపై తమ వెంట తెచ్చుకున్న కిరోసిన్ బాంబులకు లైటర్ తో నిప్పు పెట్టి దేవాలయం పై పడేసి పరారయ్యారు. ఈ ఘటన దర్యాప్తులో సీసీ కెమెరా ఫుటేజీలు కీలకంగా మారాయి.

ఓ పక్క కరోనా లాక్ డౌన్ ను అమలు చేస్తూనే ఈ దర్యాప్తును సవాల్ గా తీసుకున్న పోలీసులు కిరోసిన్ బాంబు కేసును ఛేదించారు. నిందితులు మాదన్నపేట్ పోచమ్మ దేవాలయంపై మూడు కిరోసిన్ బాంబులు విసిరినట్లు దర్యాప్తులో వెల్లడైనది.

నిందితుల్లో ఒక్కరు రియసత్ నగర్ కు చెందిన హర్షద్ కాగా, మరొకరు బాబా నగర్ కు చెందిన వసిలుగా గుర్తించి అరెస్టు చేశారు. వీరిలో హర్షద్ తీవ్రవాద సంస్థలలో శిక్షణ తీసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన వెనుక నిషేధిత మతతత్వ, ఉగ్రవాద సంస్థల హస్తం ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తెలంగాణలో కరోనా ఆసుపత్రులు ఇవే..

తెలంగాణలో కరోనా కట్టడికి ప్రభుత్వం లాక్డౌన్ చేపట్టిన సంగతి తెల్సింది. దీంతో ప్రజారవాణా, వ్యాపార, వాణిజ్య సంస్థలు పూర్తి స్తంభించిపోయాయి. ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రభుత్వం చర్యలతో కరోనా కొంతమేర కట్టడి అయింది. అయితే రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతుండటం ఆందోళన రేకెత్తిస్తుంది. తెలంగాణలో తాజాగా 76కరోనా పాజిటివ్ కేసులు నమోదుగా ఆరుగురు మృతిచెందారు. 13మంది రికవరీ అయ్యారు. ఈ నేపథ్యంలో కరోనా బాధితులకు చికిత్సలు అందించేందుకు తెలంగాణలోని పలు ఆసుప్రతులను వినియోగించుకునేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రంలోని గాంధీ ఆసుపత్రి సహా మరో 12ఆసుప్రతులను ప్రత్యేకంగా కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఆసుపత్రుల్లో కేవలం కరోనా అనుమానితులు, కరోనా రోగులను మాత్రమే చేర్చుకోనున్నారు. మిగతావారిని ఇతర ఆసుప్రతులకు రెఫర్ చేయనున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో హైదరాబాద్లో 9, రంగారెడ్డిలో ఒకటి, వరంగల్లో రెండు కరోనా ఆసుప్రతులు పని చేయనున్నాయి.

కరోనా ఆసుప్రతుల లిస్టు..
హైదరాబాద్ లోని కింగ్ కోఠి ఆసుప్రతి, గాంధీ ఆసుప్రతి, చెస్ట్ హాస్పిటల్, సరోజినిదేవీ ఆసుప్రతి, ఫీవర్ ఆసుప్రతి, బేగంపేటలోని నేచర్ క్యూర్ ఆస్పత్రి, చార్మినార్లోని నిజామియా జనరల్ ఆసుపత్రి, ఎర్రగడ్డలోని ఆయుర్వేద ఆసుపత్రి, రామంతాపూర్లోని హోమియో ఆసుపత్రులు ఉన్నాయి. అదేవిధంగా రంగారెడ్డిలోని గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను కరోనా ఆసుప్రతిగా మార్చుతున్నారు. వరంగల్లోని ఎంజీఎం, ప్రభుత్వ ఆయుర్వేద బోధనాస్పత్రులను కరోనా ఆసుప్రతులుగా వినియోగించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.