
ఆర్ ఆర్ ఆర్ చిత్రం షూటింగ్ ముగిసిన వెంటనే ఎన్టీఆర్ తన 30వ చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయనున్నాడు. ఆ సినిమా కి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతోంది . ఇక ఆ సినిమా తరువాత సినిమాను “ రాజా రాణి , అదిరింది “ ఫేమ్ అట్లీకుమార్ దర్శకత్వంలో చేయనున్నాడనే వార్త ఒకటి బయటి కొచ్చింది ఆ క్రమంలో ఎన్టీఆర్- అట్లీకుమార్ కాంబినేషన్ ఎలా సెట్ అయిందన్న అనుమానం చాలా మంది లో ఉంది .
అదెలా జరిగిందంటే తమిళంలో విజయ్ హీరోగా అట్లీ కుమార్ ‘మెర్సల్’ (అదిరింది) సినిమా తీసిన టైం లో ఆ సినిమాకి విజయేంద్ర ప్రసాద్ స్క్రీన్ ప్లే ను సమకూర్చారు. అప్పటి నుంచి అట్లీ కుమార్ కి రైటర్ విజయేంద్ర ప్రసాద్ కి మధ్య మంచి సాన్నిహిత్యం పెరిగింది . ఆ సమయంలోనే తన దగ్గరున్న ఒక కథ గురించి అట్లీ కుమార్ విజయేంద్ర ప్రసాద్ కి చెప్పాడట. దానికి ఆయన స్పందిస్తూ ఈ కథ ఎన్టీఆర్ కి పెర్ఫెక్ట్ గా సూట్ అవుతుందని చెప్పి, ఆ ఇద్దరినీ కలిపాడట . అలా అట్లీ కుమార్ .. ఎన్టీఆర్ ను ఒప్పించి గోల్డెన్ ఛాన్స్ చాలా ఈజీగా దక్కించుకున్నాడు అదలా ఉంటే ఆశ్వినీదత్ కంత్రీ , శక్తి తరవాత మూడో సారి ఎన్టీఆర్ తో సినిమా నిర్మించడానికి ప్రయత్నిస్తున్నాడు. అలాంటి తరుణం లో అట్లీ కుమార్ ప్రొపోజల్ వచ్చింది . అలా ‘విజిల్’ ప్రీ రిలీజ్ వేడుకలో దర్శకుడు అట్లీ కుమార్ కూడా ఎన్టీఆర్ తో సినిమా చేయబోతున్నట్టు రెవీల్ చేసాడు.