
ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న కరోనా రక్కసి ఏపీలో కూడా తన ప్రతాపాన్ని చూపిస్తోంది. వేగంగా విస్తరిస్తున్న ఈ వైరస్ కు కట్టడి చేయలేక అగ్రరాజ్యాలే గడగడలాడుతున్న వేళ దేశంలో కరోనా పాజిటివ్ కేసు నిర్థారణ అయిన వెనువెంటనే స్పందించి, పటిష్ట చర్యలతో వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేశారు అధికారులు.
ఏపీలో కరోనా నివారణ చర్యలపై క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష జరిపారు. కేసులు అధికంగా ఉన్న జిల్లాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలని ఆదేశించారు. కచ్చితంగా భౌతిక దూరం పాటించేలా నిబంధనలు అమలు చేయాలని జగన్ స్పష్టం చేశారు. వివిధ సెంటర్ల నుంచి క్వారంటైన్ పూర్తిచేసుకున్న వారిని ఇంటికి పంపేటప్పుడు పేదలకు 2 వేల రూపాయలు ఇవ్వాలని చెప్పారు. పౌష్టికాహారం తీసుకునేలా సూచనలు చేయకపోతే.. సమస్య మొదటికి వస్తుందని జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. హాట్ స్పాట్ల ప్రాంతాల్లో మాస్కులు పంపిణీ చేయాలని సూచించారు జగన్. వ్యవసాయ, మత్స్య ఉత్పత్తులు అమ్ముకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు ముఖ్యమంత్రి. కరోనా నివారణకు తీసుకుంటున్న చర్యలు…రాష్ట్రంలో కరోనా వ్యాప్తిపై సీఎం తెలుసుకున్నారు. రెడ్ జోన్లలో కఠిన చర్యలు తీసుకోవాలని, టెస్టులను క్రమంగా పెంచాలని సూచించిన సీఎం, రెండవ విడత రేషన్ పంపిణి అంశాలపై చర్చించారు. ఈ విధంగా ఏపీలో కరోనా కట్టడికి మరింత పకడ్బందీతో సీఎం జగన్ ముదుకెళ్తున్నారు.