
విజయ దేవరకొండ కి స్టార్ డమ్ తెచ్చి పెట్టిన చిత్రం అర్జున్ రెడ్డి అనడంలో ఎటువంటి సందేహం అక్కరలేదు. అప్పటిదాకా సాఫ్ట్ హీరోగా ఉన్న విజయ్ దేవరకొండ ఆ సినిమాతో మాస్ జనాలకు కూడా నచ్చడం జరిగింది. తెలుగు సినిమాల్లో సరికొత్త మార్పులకు నాంది పలికిన అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండ రాత్రికి రాత్రే స్టార్ హీరోగా మారిపోయాడు. ఈ చిత్రాన్ని తెరకెక్కించిన సందీప్ రెడ్డి వంగా కూడా క్రేజీ డైరెక్టర్ గా ఫేమస్ అయ్యాడు. అంతేకాదు అదే సినిమాని హిందీలో తీసి సూపర్ సక్సెస్ అందుకొన్నాడు బాలీవుడ్ కి చెందిన టీ సిరీస్ సంస్థ ఇదే చిత్రాన్ని” కబీర్ సింగ్ ” పేరుతో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రీమేక్ చేసి సెన్షేషనల్ హిట్ దక్కించు కొంది.
దాంతో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కి మరో హిందీ మూవీ అఫర్ వచ్చింది .ఇక త్వరలో మరో భారీ చిత్రానికి రెడీ అవుతున్న టైం లో .. లాక్ డౌన్ కారణంగా సందీప్ రెడ్డి ప్లాన్ మొత్తం తారుమారై పోయింది. దాంతో ఈ లాక్ డౌన్ వేళ ఇంటి వద్దనే ఉంటున్నాడు. అది తెలిసిన విజయ్ దేవరకొండ ఏమైనా కథల్ని సిద్ధం చేస్తే, లాక్డౌన్ తర్వాత ఇద్దరం కలిసి సినిమా చేయొచ్చని సందీప్ రెడ్డి నుద్దేశించి ట్వీట్ చేయడం జరిగింది . దీంతో అర్జున్ రెడ్డి కాంబోలో మరో సినిమా రాబోతుందంటూ..వార్త బయటి కొచ్చింది .