
దేశంలో లాక్డౌన్ అమలు చేయడంతో వలస కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. లాక్డౌన్ అమలుతో ఉన్నచోట పనిలేక.. సొంతూళ్లకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. కరోనా ఎఫెక్ట్ తో తమవాళ్లు ఎలా ఉన్నారో అనే ఆవేదన వలస కార్మికుల్లో కన్పించింది. దీంతో కొందరు కాలినడననే కొన్ని వేలకిలోమీటర్లు నడుచుకుంటూ సొంతూళ్లకు చేరుకుంటున్నారు. ఈక్రమంలో కొందరు మార్గమధ్యలో మృతిచెందిన సంఘటనలు వెలుగుచూశాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రాలు వారిని ఆవేదనను గుర్తించి లాక్డౌన్ సమయంలో వారిని సొంతూళ్లకు వెళ్లేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈమేరకు కేంద్రం వలస కార్మికులు సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు అనుమతిచ్చింది.
రేషన్, లాక్ డౌన్ డబ్బులపై కీలక నిర్ణయం!
లాక్డౌన్ సమయంలో చిక్కుకుపోయిన వలస కార్మికులు, విద్యార్థులు, టూరిస్టులను సొంత ప్రాంతాలకు చేరుకునే వెసులుబాటను కేంద్రం కల్పించింది. దీంతో ఆయా రాష్ట్రాలు వలస కార్మికులను తరలించేందుకు చర్యలు చేపట్టాయి. తెలంగాణలో 15లక్షల మంది వలస కార్మికులు ఉండగా వీరిందరినీ బస్సుల్లో తరలించడం కష్టంగా మారింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు కేంద్రం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది.
మరోసారి రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లను ప్రకటించిన కేంద్రం
ఈమేరకు తెలంగాణ నుంచి జార్ఖండ్‌కు తొలి ట్రైన్ ప్రారంభమైంది. దాదాపు 1100మంది కూలీలతో లింగంపల్లి నుంచి జార్ఖండ్‌కు శుక్రవారం తెల్లవారుజామున స్పెషల్ ట్రైన్ బయలుదేరి వెళ్లినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ ట్రైన్ మంచిర్యాల, బెల్లంపల్లి, కాగజ్‌నగర్ మీదుగా ప్రయాణించనుంది. వీరంతా స్వస్థలాలకు వెళ్లిన తర్వాత టెస్టులు నిర్వహించి హోం క్వారంటైన్లో ఉంచాలని ఆయా రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది.