
2019 సంక్రాంతి బాక్ బస్టర్ మూవీ కి సీక్వెల్ రెడీ అవుతోంది .`ఎఫ్ 2` టైటిల్ తో దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో వెంకటేశ్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్ హీరో హీరోయిన్లుగా నటించడం జరిగింది. కాగా ఈ సినిమాకు సీక్వెల్ గా ` ఎఫ్ 3 ` మూవీ ని తీయాలని నిర్మాత దిల్ రాజు అనుకోవడం జరిగింది. అయితే దర్శకుడు అనిల్ రావిపూడి కి సూపర్ స్టార్ మహేష్ బాబు తో సినిమా చేసే ఛాన్స్ రావడం తో `ఎఫ్ 3 ` సినిమా పట్టాలెక్కలేదు .కానీ ఇపుడు `సీక్వెల్ ఎఫ్ 3 విషయం మరోసారి తెరపైకి వచ్చిం
అత్యవసర నిధిని ఏర్పాటు చేయండి: పవన్
విశ్వసనీయంగా తెలుస్తున్న దాన్ని బట్టి అనిల్ రావిపూడి `ఎఫ్ 3 ` సినిమా స్క్రిప్ట్ పూర్తి చేశాడు. కరోనా ప్రభావంతో కావాల్సినంత గ్యాప్ దొరకడంతో సొంత వూరిలో కూర్చొని స్క్రిప్ట్ ని పూర్తి చేసేశాడు. కాగా ఈ చిత్రంలో మరో హీరో నటించే అవకాశం ఉంటుందని తెలుస్తోంది . గతంలో ` ఎఫ్ 3 ` చిత్రం లో మహేశ్ బాబు నటిస్తాడని, రవితేజ నటిస్తాడని వార్తలు వచ్చాయి గాని వాటిల్లో నిజం లేదని తెలుస్తోంది .