Homeఆంధ్రప్రదేశ్‌విశాఖలో భారీ ప్రమాదం...!

విశాఖలో భారీ ప్రమాదం…!


భోపాల్ గ్యాస్ దుర్ఘటన ఇప్పటి దేశం మర్చిపోనేలేదు, ఇంతలో విశాఖపట్నంలో ఒక రసాయన పరిశ్రమ నుంచి ప్రమాదకరమైన గ్యాస్ లీక్ అయ్యి గాలిలో కలవడంతో ఆ ప్రాంతంలో ప్రజలు ఊపిరి ఆడక ఏడుగురు మరణించగా, మిగిలిన వారు అందరూ మరణం అంచుల వరకు వెళ్లి వచ్చారని సమాచారం. సంఘటన జరిగిందని దృవీకరించిన అధికారులు ఎంత మంది మృతి చెందారనే వివరాలు వెల్లడించలేదు.15 మంది అస్వస్థతకు గురయ్యారు. విరిని కేజీహెచ్ కు తరలించారని తెలిసింది. రసాయన వాసన ప్రభావంతో కళ్ళు మండటం, కడుపు వికారం వంటి లక్షణాలు భాదితులలో కనిపిస్తున్నాయి. ప్రమాదకర గ్యాస్ లీక్ అయి గాలిలో కలిసిన విషయం తెలియని ఆ ప్రాంత వాసులు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిశారు.

ఒక్కో ఇంటికి 2లీటర్ల మద్యం డెలివరీ!

ఎల్జీ పాలిమర్స్ ఆర్ఆర్ వెంకటాపురం పరిసరాల్లో నివాసముంటున్న స్థానికులు ఆ ప్రాంతాన్ని వదిలి మేఘాద్రి గెడ్డ వైపు పరుగులు తీస్తున్నారు. గురువారం ఉదయం నాలుగు గంటల నుంచి ఎల్జి పాలిమర్స్ నుంచి రసాయనాలు లీక్ అయిన సంఘటన చోటు చేసుకుంది. అంబులెన్స్ లో అస్వస్థతకు గురైన వారిని ఆస్పత్రికి తరలిస్తున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తో పాటు చర్మంమీద బొబ్బులు, మంటలతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.

దీని ఎల్జీ పాలిమర్ పరిశ్రమలో వ్యాపించింది. అక్కడివారిని అంబులెన్స్ తో పాటు వ్యక్తిగత వాహనాలు కూడా అస్వస్థకు గురైన వారిని హాస్పిటల్ కి తరలిస్తున్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. ఈ రసాయనం వల్ల ప్రాణానికి ఇబ్బంది లేకపోయినప్పటికీ ప్రజలు చాలా భయాందోళనకు గురవుతున్నారు. శ్వాసకోశ సంబంధ ఉన్న రోగులకు మరింత ప్రమాదకరంగా తయారైందని, వీరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలిసింది.
పరిశ్రమల నుంచి గ్యాస్ లీక్ ను 90 అదుపు తెచ్చినట్లు, పూర్తి స్థాయిలో అదుపు చేయడానికి మరో రెండు గంటలు సమయం పడుతుందని ప్రరిశ్రమ వర్గాలు వెల్లడించారు

అత్యవసర నిధిని ఏర్పాటు చేయండి: పవన్

దాదాపు 2000 మంది పైగా అస్వస్థకు గురైన వారిని స్థానికులు, అధికారులు అంబులెన్స్ తో పాటు ఆటోలు, కారులోనూ తమసమీప ఆస్పత్రికి తరలిస్తున్నారు దీనివల్ల ప్రాణాపాయం ఉండదని మంచి వైద్యం తీసుకుంటే త్వరగా కోలుకో వచ్చునని వైద్యులు చెబుతున్నారు లాక్ డౌన్లోడ్ కారణంగా మూతబడిన ఎల్జి పాలిమర్స్ కంపెనీ తిరిగి ప్రారంభించే ఈ క్రమంలోనే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. చిన్నారులు, మహిళలు ఎక్కువగా ప్రమాదానికి గురయ్యారు, కడుపులో మంట తో పాటు శ్వాస తీసుకోవడం లో ఇబ్బంది పడుతున్నారు. ప్రజలు ప్రాణ భయంతో వేపగుంట, మేఘాద్రి గడ్డ, నరవ ప్రాంతాలకు పరుగులు తీశారు, వీరిలో కూడా చాలామంది అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. జిల్లా మంత్రి అవంతి శ్రీనివాస్ తో పాటు ఎమ్మెల్యేలు గణబాబు, అదీప్ రాజ్, వై ఎస్ ఆర్ సి పి సమన్వయకర్త మల్ల విజయప్రసాద్ ఇతర ప్రజాప్రతినిధులు సంఘటన స్థలానికి చేరుకొని, పరిస్థితిని సమీక్షిస్తున్నారు

ఇతర ప్రాంతాల ప్రజలు ఎవరు అత్యుత్సాహంతో ఈ ప్రాంతానికి రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎక్కడ జనం గుమికుడితే అస్వస్థతకు గురైన వారికి ఆక్సిజన్ అదే అవకాశం ఉండదని తెలిపారు. యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
RELATED ARTICLES

Most Popular