WhatsApp New Features: ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగిస్తున్న ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్. ఈ యాప్ ను మరింత అభివృద్ధి చేసేందుకు మాతృసంస్థ మెటా సన్నాహాలు చేస్తుంది. ఈ యాప్ నుంచి త్వరలో మరిన్ని అధునాతన ఫీచర్లు వినియోగదారుల ముందుకు రానున్నాయి. యూజర్ల భద్రత, గోప్యత, కమ్యూనికేషన్ అనుభవాన్ని మరింత మెరుగుపర్చేందుకు మెటా సంస్థ పలు కొత్త అప్‌డేట్‌లను పరీక్షిస్తోంది. ఇవి వినియోగదారులకు చాలా రకాలుగా ఉపయోగపడున్నాయి. వీటి గురించి పూర్తి వివరాల్లోకి వెళితె..
Scam Alert:
ఆన్‌లైన్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో యూజర్లను రక్షించేందుకు వాట్సాప్ ‘స్కామ్ అలర్ట్స్’ ఫీచర్‌ను తీసుకురానుంది. అనుమానాస్పద లింకులు, తెలియని నంబర్ల నుంచి వచ్చే మోసపూరిత సందేశాలు లేదా ఫిషింగ్ ప్రయత్నాలను గుర్తించి యూజర్లకు హెచ్చరికలు జారీ చేస్తుంది. దీంతో వినియోగదారులు మోసపూరిత మెసేజ్‌లను ముందుగానే గుర్తించి జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది.
One Text Message:
ఇప్పటికే ఫోటోలు, వీడియోలకు ‘వ్యూవన్స్’ ఆప్షన్ అందుబాటులో ఉండగా.. ఇప్పుడు టెక్స్ట్ మెసేజ్‌లకూ అదే తరహా ఫీచర్‌ను తీసుకురావాలని వాట్సప్ ప్రయత్నిస్తోంది. ఈ ఫీచర్ ద్వారా పంపిన సందేశాన్ని గ్రహీత ఒక్కసారి మాత్రమే చదవగలరు. చదివిన వెంటనే ఆ మెసేజ్ ఆటోమేటిక్‌గా మాయమవుతుంది. సున్నితమైన సమాచారం, ఓటీపీలు లేదా వ్యక్తిగత వివరాలను మరింత భద్రంగా పంపేందుకు ఇది ఉపయోగపడుతుంది.
Voice Notes New Updates:
వాయిస్ మెసేజ్‌ల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో వాట్సాప్ వాటిలో కూడా పలు మెరుగుదలలను తీసుకురానుంది. రికార్డ్ చేసిన వాయిస్ నోట్స్‌ను పంపేముందు మరింత సులభంగా రివ్యూ చేయడం, ఎడిట్ చేయడం, అలాగే వాయిస్ మెసేజ్‌ల ట్రాన్స్‌క్రిప్షన్ వంటి ఫీచర్లను పరీక్షిస్తోంది. దీంతో వాయిస్ మెసేజ్‌లను వినలేని సందర్భాల్లో కూడా వాటి టెక్స్ట్ రూపాన్ని చదివే అవకాశం లభిస్తుంది.
Shedule Message:
చాలాకాలంగా యూజర్లు ఎదురుచూస్తున్న షెడ్యూల్డ్ మెసేజ్ ఫీచర్‌ను కూడా వాట్సప్ తీసుకురావొచ్చు. ఈ ఫీచర్ ద్వారా ముందుగానే ఒక సందేశాన్ని టైప్ చేసి, అది పంపాల్సిన తేదీ మరియు సమయాన్ని ఎంపిక చేసుకోవచ్చు. నిర్ణీత సమయంలో ఆ మెసేజ్ ఆటోమేటిక్‌గా పంపబడుతుంది. పుట్టినరోజు శుభాకాంక్షలు, కార్యాలయ రిమైండర్లు లేదా ముఖ్యమైన సందేశాలను ముందుగానే ప్లాన్ చేసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది.
వాట్సప్ తాజా అప్‌డేట్‌లలో ఎక్కువగా ప్రైవసీ మరియు సెక్యూరిటీ అంశాలకే ప్రాధాన్యం ఇస్తోంది. యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని రక్షించడంతో పాటు, అనవసర కాల్స్, స్పామ్ మెసేజ్‌లు, మోసపూరిత కార్యకలాపాలను తగ్గించే దిశగా ఈ కొత్త ఫీచర్లు పనిచేయనున్నాయి. దీంతో వాట్సప్ వినియోగం మరింత సురక్షితంగా మారే అవకాశముంది.
