Home Blog Page 8450

50 వేల కరోనా టెస్టుల నిర్ణయం వెనుక కారణం మీదేనా?


తెలంగాణలో కోవిడ్-19 కేసులు రోజురోజుకు భారీగా నమోదవుతున్నాయి. అన్ని రాష్ట్రాల కంటే ముందుగానే తెలంగాణలో లాక్డౌన్ విధించిన సంగతి తెల్సిందే. ప్రజలంతా కూడా ఇళ్లకే పరిమితమై ప్రభుత్వానికి మద్దతు తెలిపారు. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడంతో తొలినాళ్లలో కరోనా కేసులు సింగిల్ డిజిట్ కే పరిమితయ్యయాయి. కరోనా పరిస్థితి కట్టడిలోనే ఉందనే ప్రభుత్వం కూడా భావించింది. అయితే గత రెండువారాలుగా తెలంగాణలో కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

ఇటీవల కాలంలో కేంద్రం లాక్డౌన్ సడలింపులు ఇవ్వడంతో ఆయా రాష్ట్రాలకు కూడా అన్నిరంగాలకు అనుమతులను ఇచ్చింది. తెలంగాణలో లాక్‌డౌన్ కఠినంగా అమల్లో ఉన్న ఏప్రిల్‌ వరకు 941 కేసులు నమోదయ్యాయి. కాగా జూన్ నెలలో గత రెండు వారాల్లోనే 2276 కేసులు నమోదవడం ఆందోళన కలిగింది. కేసులు సంఖ్య జీరోకు వెళుతుందని అనుకున్న దశ నుంచి మళ్లీ కేసులు భారీగా నమోదవుతుండటం చూస్తుంటే వైరస్ కట్టడిలో ప్రభుత్వం విఫలమైందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దీంతో తెలంగాణ సర్కార్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈనేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ సహా ఐదు జిల్లాల్లోని 30నియోజకవర్గాల పరిధిలో 50వేలు టెస్టులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రయివేట్ ల్యాబుల్లోనూ కోవిడ్ పరీక్షలు చేయడానికి అనుమతి ఇచ్చింది. ప్రయివేట్ ఆసుపత్రిల్లో వైద్యం అందించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కరోనా టెస్టులు పెద్దఎత్తున నిర్వహించాలని ప్రజలు ఎప్పటి నుంచి కోరుతున్న ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. ఐసీఎంఆర్ మార్గదర్శకాల మేరకే కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్రంలో కరోనా సామూహిక వ్యాప్తి దశకు చేరలేదని ప్రభుత్వం చెబుతోంది.

తెలంగాణలో ఇప్పటివరకు 40వేలమందికి టెస్టుగా నిర్వహించగా ఏపీలో 5 లక్షలకుపైగా కరోనా టెస్టులు చేశారు. దీంతో రాష్ట్రంలోనూ టెస్టుల సంఖ్య పెంచాలనే డిమాండ్ వచ్చింది. కరోనా కట్టడికి భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం, చికిత్స అందించడం చేయాల్సి ఉంది. అయితే తెలంగాణ సర్కార్ ట్రేస్.. టెస్ట్.. ట్రీట్మెంట్ ను ఇన్నాళ్లూ ఐసీఎంఆర్ మార్గదర్శకాల పేరుచెప్పి టెస్టుల అంశాన్ని పక్కనపెట్టింది. అదేవిధంగా కొన్ని కేసుల్లో ఎవరి వల్ల కరోనా సోకిందనేది తెలియడం లేదు. ఈ నేపథ్యంలోనే కేసులు ఎక్కువ నమోదు కాకుండా ఉండేందుకు టెస్టుల సంఖ్య పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇంతకీ చంద్రబాబుని తిట్టావా? పొగిడవా?..జేసీ


రాజకీయాల్లో తల పండిన నేతల్లో టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి ఒకరు. ఇప్పుడు ఆయన పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ప్రైవేటు బస్సుల వ్యాపారం కోసం నానా అక్రమాలు చేసి దొరికిపోయిన తన తమ్ముడు ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిని ఎలా వెనకేసుకురావాలో తెలియక సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. చంద్రబాబు అగ్నిగుండమని, అందులో ఎవరు కాలిపోతారో తెలియదన్నారు. జగన్ కూడా కాలిపోవచ్చని జేసీ దివాకర్ రెడ్డి శాపనార్దాలు పెట్టారు. ఈ కామెంట్స్ లో చంద్రబాబుని తిట్టాడో..?లేక పొగిడాడో..? తెలియడం లేదు.

బీఎస్ 3 వాహనాలను బీఎస్ 4గా మార్చి అమ్మేసుకున్న కేసులో తన తమ్ముడు దోషి కాదని, ఆ వాహనాలు అమ్మిన అశోక్ లేల్యాండ్ సంస్ధ, రిజిస్టర్ చేసిన అధికారులే నిందితులని జేసీ కామెంట్స్ చేశారు. వీరిని వదిలిపెట్టి తన తమ్ముడిని మాత్రమే అరెస్టు చేశారన్నారు. ఇది జగన్ సర్కారు కక్షసాధింపులో భాగమేనన్నారు. అధికారులెవరూ సరిగా పనిచేయడం లేదని, జగనే సర్వం అన్నట్లు పాలన సాగిస్తున్నారని జేసీ ధ్వజమెత్తారు. తన బస్సులు నిలిపివేయించి రూ.40 కోట్ల పైన్ వేశారన్నారు. తనతో పాటు మరికొందరిని కూడా అరెస్టు చేసే అవకాశముందని జేసీ జోస్యం చెప్పారు.

ఈసారి హరితహారంలో 20 కోట్ల మొక్కలు


ఆరో విడత హరితహారం ఈ నెల 20నుండి ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 20 కోట్ల మొక్కలు నాటడమే లక్షంగా పెట్టుకున్నారు. జంగల్ బచావో….జంగల్ బడావో (అడవిని కాపాడుదాం….అడవిని విస్తరిద్దాం) అనే నినాదంతో సిఎం కెసిఆర్ హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర అటవీ శాఖ, పంచాయితీలు, పురపాలిక సంస్థలతో పాటు వివిధ ప్రభుత్వ శాఖలు కూడా పెద్దఎత్తున మొక్కలు నాటేందుకు రంగం సిద్దం చేశారు. ఆ ఏర్పాట్లన్నీ దాదాపుగా పూర్తి అయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో వర్షాలు కూడా ప్రారంభమయ్యాయి. దీంతో 20వ తేదీ నుంచి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఒక ఉద్యమంగా చేపట్టనున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఐదు విడతల్లో కోట్ల సంఖ్యల్లో మొక్కలు నాటిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మొక్కలు నాటిన ప్రాంతాలన్నీ పచ్చటి వనాలుగా మారుతున్నాయి.

ఆరవ విడత హరితహారంలో భాగంగా రైతులకు అదనపు, ప్రత్యామ్నాయ ఆదాయ వనరులను పెంచడమే లక్షంగా మొక్కలను పెంచనున్నారు. వర్షాలకు అనుగుణంగా హరితహారం కొనసాగించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తగు ఆదేశాలు జారీ చేసింది. గంధం, టేకు, వెదురు, సరుగుడు, చింత, పూలు, పండ్ల మొక్కలకు కూడా పెద్దఎత్తున ప్రాధాన్యతను ఇస్తున్నారు. ప్రతి జిల్లాలో ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో మియావాకీ పద్దతిలో తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలతో చిట్టడవులను పెంచేందుకు ప్రణాళికలను సిద్దం చేశారు. గ్రామ, పట్టణ ప్రాంతాల్లో నర్సరీలకు అటవీ శాఖ సాంకేతిక సహకారాన్ని అందించనుంది.

గ్రామాల్లో ఇంటింటికి ఆరు మొక్కలు ఇవ్వటం, బాధ్యతగా పెంచేలా పంచాయితీల పర్యవేక్షణ చేస్తాయి. కోతుల బెడద నివారణ కోసం ప్రత్యేకంగా గుర్తించిన 37 రకాల మొక్కల జాతులను క్షీణించిన అటవీ ప్రాంతాల్లో నాటే ప్రణాళికలను కూడా అమలు చేయనున్నారు. వానలు వాపస్ రావాలి… కోతు లు అడవులకు వాపస్ పోవాలనే లక్ష్యంతో హరితహారం కార్యక్రమంలో పెద్దఎత్తున మొక్కలను పెంచుతున్నారు.

కరోనా పరిక్షల పై కేసీఆర్ క్లారిటీ!

Rythu bandhu


రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో కోవిద్ పరీక్షల విషయంలో కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. కరోనా మహమ్మారిని రాష్ట్రంలో కట్టుదిట్టంగా కట్టడిచేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని సీఎం కేసీఆర్ వివరించారు. వచ్చే వారం, పదిరోజుల్లో హైదరాబాద్‌, దాని చుట్టుపక్కల జిల్లాల్లోని 30 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 50వేల మందికి కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయనున్నామని వెల్లడించారు. ప్రైవేటు ల్యాబ్‌ లు, ప్రైవేటు దవాఖానల్లో కొవిడ్‌ నిబంధనలను అనుసరించి వ్యాధి నిర్ధారణ పరీక్షలు, చికిత్స చేయించుకోవడానికి అనుమతినిస్తున్నట్టు తెలిపారు. ఇందుకు అవసరమైన మార్గదర్శకాలు, ధరలు నిర్ణయించాలని అధికారులను సీఎం ఆదేశించారు.

కరోనా వ్యాప్తి నివారణ చర్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదివారం ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో వైరస్‌ వ్యాప్తి తక్కువగానే ఉందని అధికారులు వివరించారు. మరణాల రేటు తక్కువగానూ, కోలుకుంటున్నవారి సంఖ్య చాలా ఎక్కువగానూ నమోదవుతున్నదని వారు చెప్పారు. అయితే, రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలతో పోలిస్తే హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో ఎక్కువగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయని, ఆ తర్వాత స్థానంలో సంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాలున్నాయని తెలిపారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ.. హైదరాబాద్‌, దాని చుట్టుపక్కల ఉన్న ఇతర నాలుగు జిల్లాలపై మరింత ఎక్కువ దృష్టి పెట్టాలని, ఈ ఐదు జిల్లాల పరిధిలోని 30 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

ఆ డ్రైవర్లను ఆదుకోవాలి: పవన్


ఏపీఎస్ఆర్టీసీలో ఉన్న అద్దె బస్సుల్లో పని చేసే డ్రైవర్ల సమస్యలపై జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పందించారు. లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి జీతాలు అందకపోవడంతో డ్రైవర్ల కుటుంబాలు ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్నాయని తెలిపారు. సుమారు 8 వేల మంది డ్రైవర్లు ఆ అద్దె బస్సుల్లో ఉద్యోగాలు చేస్తున్నారని చెప్పారు. మార్చి నెల నుంచి తమకు జీతాలు లేకపోవడంతో జీవనం చాలా కష్టంగా మారిందని డ్రైవర్లు పార్టీ దృష్టికి తీసుకువచ్చారన్నారు. ఆ కుటుంబాల గురించి రాష్ట్ర ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచించి తగిన రీతిలో ఆదుకోవాలని, డ్రైవింగ్ లో పదేళ్ళ పైబడిన అనుభవం ఉన్నా వీరికి తక్కువ వేతనాలే అందుతున్నాయన్నారు.

ఈ డ్రైవర్లు ఆర్టీసీ ఉద్యోగులు కారనీ, అద్దె బస్సుల యజమానులే ఆ బాధ్యత చూసుకోవాలని ప్రభుత్వం, సంస్థ భావించడం సరికాదని చెప్పారు. సంస్థకు అద్దె బస్సుల ద్వారా సేవలు అందించిన కార్మికులు అనే దృక్పథంతో వారికి ఆర్థిక తోడ్పాటు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు చెప్పారు. ఆటో, టాక్సీ డ్రైవర్లకు సహాయం చేసిన ప్రభుత్వం ఆర్టీసీ అద్దె బస్సులకు పని చేస్తున్న డ్రైవర్ల కష్టాల గురించీ ఆలోచన చేయాలన్నారు. ఈ అద్దె బస్సుల నిర్వహణ, మరమ్మతులపై ఆధారపడ్డ శ్రామిక విభాగం చిరుద్యోగుల గురించి కూడా సంస్థ ఆలోచన చేయాలని కోరారు.

‘ఆర్ఆర్ఆర్’లో ఎన్టీఆర్ ఫ్రెండ్ డబ్బింగ్ !


దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో రాబోతున్న అత్యున్నత భారీ మల్టీస్టారర్ ‘రౌద్రం రణం రుధిరం’ సినిమాలో రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కి ఫ్రెండ్ రోల్ లో నటించబోతున్నాడు. ఇప్పటికే రాహుల్ షూటింగ్ లో కూడా పాల్గొన్నాడు. ఎన్టీఆర్ కి ఫ్రెండ్ అంటే.. రాహుల్ ది ట్రైబ్ క్యారెక్టరే. పైగా ఎక్కువ సీన్స్ లో కనిపిస్తాడట. ప్రస్తుతం రాహుల్ తన పాత్రకు డబ్బింగ్ చెబుతున్నాడట. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే.

ధృడంగా ఉండే కొమరం భీం రోల్ కోసం ఎన్టీఆర్ కఠినమైన కసరత్తులు కూడా చేశాడు. అయితే తారక్ ఫస్ట్ లుక్ వీడియో ఎప్పుడు రిలీజ్ అవుతుందో ? ఆ వీడియోలో ఎన్టీఆర్ ఎలా కనిపించబోతున్నాడు ? అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

కాగా ‘బాహుబలి’ తరవాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడంతోపైగా ఇద్దరు స్టార్ హీరోలు కలిసి మొదటిసారి నటిస్తుండటంతో ఈ మల్టీస్టారర్ పై ఆరంభం నుండి భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి.

 

మనోజ్ కి పాన్ ఇండియా సెట్ అవుతుందా ?


టాలీవుడ్ స్టార్ హీరోలందరీ మెయిన్ టార్గెట్ ప్రస్తుతం పాన్ ఇండియా మూవీనే. ఒక్క మహేష్ బాబు తప్ప మిగిలిన టాప్ హీరోలు ఇప్పటికే పాన్ తో తమ స్పాన్ పెంచుకుని పాన్ ఇండియా స్టార్ గా కొనసాగాలని ప్రయత్నాలు మొదలెట్టేశారు. బన్నీ పుష్పతో పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. అయితే స్టార్ హీరోలతో పాటు మంచు మనోజ్, విజయ్ దేవరకొండ లాంటి హీరోలు కూడా పాన్ ఇండియా మూవీస్ చేస్తుండం విశేషం చాల గ్యాప్ ఇచ్చి ఎట్టకేలకు మళ్లీ ‘అహం బ్రహ్మాస్మి’తో మళ్ళీ సినిమాల్లో యాక్టివ్ కాయబోతున్న మంచు మనోజ్.

‘అహం బ్రహ్మాస్మి’ సినిమాని పాన్ ఇండియా మూవీగానే తీసుకువస్తున్నాడు. ఎప్పుడూ కొత్తదనం కోసం వైవిధ్యమైన కథలతో సినిమాలు చేసే మంచు మనోజ్.. ఈ సారి ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో పాన్ ఇండియా హిట్ కొడతాడా అనేదే ప్రశ్న. అయితే ‘అహం బ్రహ్మాస్మి’ అనే గొప్ప స్లోగన్ ఆధారంగా నడిచే కథ కావడం, మనోజ్ సెకెండ్ ఇనింగ్స్ లో పవర్ ఫుల్ రీఎంట్రీ ఇస్తుండటంతో.. ఈ సినిమా పై మంచి అంచనాలే ఉన్నాయి. అది ఎంతవరకూ వర్కౌట్ అవుతుందో చూడాలి.

ఇక ఇండస్ట్రీలో కొత్త టాలెంట్‌ ను ఎంకరేజ్‌ చేయాలని ‘ఎమ్ఎమ్‌ ఆర్ట్స్‌’ పేరుతో మంచు మనోజ్ సొంత నిర్మాణ సంస్థను కూడా ప్రారంభించాడు. దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా ఎమ్ ఎమ్ ఆర్ట్స్ పతాకం పై మంచు ఫ్యామిలీ స్వయంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మంచి కోసం పోరాడే మనోజ్ కి ఈ సినిమాతోనైనా మంచి జరగాలని కోరుకుందాం.

ఇస్మార్ట్ బ్యూటీస్ తో పాటు పాయల్ కూడా.. !

Payal Rajput

Payal Rajput
రవితేజ ‘క్రాక్’ సినిమా తరువాత రమేష్ వర్మ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలో రవితేజ డబల్ యాక్షన్ అట. అందుకే ఇద్దరు హీరోయిన్స్ నటించనున్నారు. ఇప్పటికే ఒక హీరోయిన్ గా నిధి అగర్వాల్ ను ఫైనల్ చేసిన చిత్రబృందం, మరో హీరోయిన్ గా నభా నటేష్ ను తీసుకోవాలనుకున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. కాగా చిత్రబృందం నభా నటేష్ నే ఆల్ మోస్ట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.

అయితే ఈ వార్తకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అన్నట్లు ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ కూడా ఉందట, ఈ సాంగ్ కోసం పాయల్ రాజ్ పుత్ ను అనుకుంటున్నారు. కాగా ఈ చిత్రాన్ని కోనేరు సత్యనారాయణ నిర్మించనున్నారు. ఇకపోతే ప్రస్తుతం రవితేజ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తోన్న ‘క్రాక్’ సినిమా రవితేజకు పూర్వవైభవాన్ని తీసుకొస్తోందట. ఈ చిత్రాన్ని కరోనా తగ్గాక విడుదల చేయాలనుకుంటున్నారు.

ఏమైనా రవితేజ ‘డిస్కో రాజా’తో ఆశించిన స్థాయిలో హిట్ అందుకోలేకపోయాడు. మరి క్రాక్ సినిమాతోనైనా అందుకుంటాడేమో చూడాలి. ఒకవేళ ఈ సినిమా కూడా ప్లాప్ అయితే మాత్రం రవితేజ్ మార్కెట్ పూర్తిగా పడిపోతుంది. అప్పుడిక హీరోగా కొనసాగడం కష్టమే.

అచ్చెన్న విషయంలో చంద్రబాబు ‘బీసీ కార్డ్’ ఎందుకు ఫెయిలైంది?

chandra babu

chandra babu
40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు తిమ్మిని బమ్మిని చేయగలరన్న పేరుంది. ఆయన చేతిలో బలమైన మీడియా కూడా ఉంది. అందుకే మొన్నటిదాకా అధికార వైసీపీని ఓ ఆట ఆడుకున్నారు. కానీ అన్ని రోజులు ఒకలా ఉండవు కదా.. చంద్రబాబుకు ఇప్పుడు కష్టాలొచ్చాయి.

టీడీపీ శాసనసభాపక్ష ఉపనేత అచ్చెన్నాయుడును వైసీపీ ప్రభుత్వం అరెస్ట్ చేశాక చంద్రబాబు నాయుడు ప్రయోగించిన బీసీ కార్డ్ వ్యూహాం ఫ్లాప్ అయ్యింది. ఈ ప్రయత్నం విఫలమైపోయింది. బీసీలందరూ ఏకమై రోడ్ల మీదకు వచ్చి నానా హంగామా చేస్తారని.. బీసీ నేతలంతా గళం విప్పుతారని.. టీడీపీ శ్రేణులతో కలిసి ఆందోళన చేస్తారని చంద్రబాబు భావించారు. కానీ ట్రెయిన్ రివర్స్ అయ్యింది. నాడు చంద్రబాబు ప్రభుత్వంలో బీసీ అయిన వైసీపీ నేత మోపిదేవి వెంకటరమణను అరెస్ట్ చేసినప్పుడు చంద్రబాబుకు బీసీలపై ప్రేమ ఎక్కడికి పోయిందని వైసీపీ నేతలు అడుగుతున్నారు. ఈ ప్లాన్ ఫెయిల్ కావడంతో చంద్రబాబుకు దిక్కుతోచడం లేదట..

టీడీపీ ప్రభుత్వంలో చెలరేగిపోయి.. ప్రతిపక్షంలోనూ వైసీపీ ప్రభుత్వంపై రెచ్చిపోతున్న అచ్చెన్నాయుడు అరెస్ట్ విషయంలో టీడీపీకి ఎక్కడా పెద్దగా మద్దతు లభించడం లేదు. మరీ ముఖ్యంగా అచ్చెన్నాయుడు సొంత జిల్లా శ్రీకాకుళంలోనూ అస్సలు మద్దతు లభించడం లేదు.దీన్ని బట్టి చంద్రబాబు విసిరిన బీసీ కార్డు ఘోరంగా విఫలమైందని అర్థమవుతోంది.

జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్ తర్వాత ఆయన రెడ్డి కావడంతో చంద్రబాబు బీసీ ఫార్ములా ఇక్కడ ఎలా అప్లై చేయాలో తెలియక తెల్లమొహం వేశారు. జేసీ అరెస్ట్ తర్వాత రెడ్డిలను జగన్ టార్గెట్ చేశారని చంద్రబాబు అనలేని పరిస్థితిని జగన్ కల్పించడం విశేషం. మరీ ముఖ్యంగా వీరిద్దరి విషయంలో ఈఎస్ఐ, ట్రావెల్స్ లో అవినీతి జరగలేదని చంద్రబాబు ఇప్పటికీ బహిరంగంగా వ్యాఖ్యానించలేని పరిస్థితిలో ఉండడం గమనార్హం. ఈఎస్ఐ స్కాంలో అవినీతి జరగలేదని టీడీపీ ఇంతవరకు చెప్పలేదు. ఈఎస్ఐ స్కాంలో అవినీతి జరిగిందని చంద్రబాబుకు కూడా తెలుసు అని.. అందుకే నోరుమెదపడం లేదని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు.

అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డి తర్వాత నెక్ట్స్ ఎవరు అరెస్ట్ అవుతారనే దానిపై టీడీపీలో భయం భయం నెలకొంది. ఇప్పటికే ముగ్గురు నాయకులను అరెస్ట్ చేసిన వైసీపీ ప్రభుత్వం ఇది ప్రారంభం మాత్రమేనని వైసీపీ ఎంపీ విజయసాయి, రోజా లాంటి వారు వ్యాఖ్యానించిన నేపథ్యంలో టీడీపీలో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

సునీల్‌కు బాలయ్య, బోయపాటి హ్యాండిచ్చారా?

Suneel

Suneel
కమేడియన్‌గా ఒకప్పుడు వెలుగు వెలిగాడు సునీల్. ‘అందాల రాముడి’తో హీరో అవతారం ఎత్తాడు. తన యాక్టింగ్‌తోనే కాకుండా డ్యాన్సింగ్‌ స్కిల్స్‌తో కూడా అభిమానులను మెప్పించాడు. ఏకంగా స్టార్ డైరెక్టర్ రాజమౌళితో ‘మర్యాద రామన్న’ చేసి బ్లాక్‌బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్నాడు. కానీ, ఆ తర్వాత వరుస ఫెయిల్యూర్స్‌ రావడం మళ్లీ హాస్య నటుడి అవతారం ఎత్తాడు. చాన్నాళ్ల తర్వాత ‘అరవింద సమేత వీర రాఘవ’లో చిన్న రోల్‌ చేసిన అతను.. కమేడియన్‌, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కొనసాగుతున్నాడు. కానీ, యువ కమేడియన్లతో పోటీలో అతను మునుపటిలా పేరు తెచ్చుకోవడం లేదు. చివరకు రవితేజ ‘డిస్కో రాజా’లో విలన్‌గా కూడా నటించాడు. అద్భుతంగా నటించినా.. ఆ సినిమా ఆశించిన విజయం సాధించలేకపోయింది.

ఈ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కొత్త చిత్రంపై సునీల్ భారీ అంచనాలు పెట్టుకున్నాడు. ఈ మూవీలో ఓ కామెడీ ట్రాక్‌ కోసం అతడిని ఎంచుకున్నారు. హీరోగానే కాకుండా ఆర్టిస్ట్‌గా వరస పరాజయాల ఎదుర్కొన్నందున ఈ మూవీతో మళ్లీ ట్రాక్‌లో పడాలని చూస్తున్నాడు. మరోవైపు ‘వినయ విధేమ రామ’తో భారీ పరాజయాన్ని మూటగట్టుకున్న బోయపాటి కూడా బాలయ్య మూవీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. తన నమ్మకం ప్రకారం ఓ ఫైట్‌తో ఈ చిత్రాన్ని మొదలెట్టాడు. కానీ, నాలుగైదు రోజుల తర్వాత కరోనా వ్యాప్తి మొదలవడంతో షూటింగ్ నిలిచిపోయింది. అయితే లాక్‌డౌన్‌ కారణంగా సినిమా చాలా ఆలసమయ్యే అవకాశం ఉండడంతో స్క్రిప్టును కొంచెం మార్చాలని బోయపాటి, బాలయ్య డిసైడయ్యారట. ముందుగా రాసుకున్న ఓ కామెడీ ట్రాక్ ఒకదాన్ని బోయపాటి పూర్తిగా తొలగించినట్లు సమాచారం. సునీల్‌ను దాని కోసమే తీసుకున్నారు. ఇప్పుడా ట్రాక్‌ లేదు కాబట్టి మూవీ నుంచి అతడిని తప్పించినట్టు తెలుస్తోంది. దాంతో ఈ మూవీపై ఎన్నో అంచనాలు పెట్టుకున్న సునీల్‌కు నిరాశే మిగలనుంది.

ఈ టైంలో ఇలా దోచుకోవడం న్యాయమా మోడీజీ?

Modi

Modi
కరోనా-లాక్ డౌన్ తో ప్రజల చేతిలో రూపాయి లేని పరిస్థితి. రూపాయి రూపాయికి జనం వెతుక్కుంటున్నారు. ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయి అరిగోసపడుతున్నారు. ఇంతటి క్లిష్ట సమయంలో ఇలాంటి దోపిడీ అవసరమా మోడీజీ అని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. ప్రజల నెత్తిన భారం మోపి దోచుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కనికరం లేని బీజేపీ సర్కార్ పై ఆడిపోసుకుంటున్నారు.

20 లక్షల కోట్లు అంటూ ప్రకటించిన మోడీ ప్యాకేజీ ఒట్టి గాలిబుడగ అని తేలిపోయింది. ప్రజల ఉద్యోగాలు నిలబడలేదు. జీతాల లోటు భర్తీ కాలేదు. ఏ పథకమూ దరిచేరలేదు. వట్టి గ్యాస్ అని తెలంగాణ సీఎం సహా దేశంలోని సీఎంలంతా మోడీజీ ప్యాకేజీపై నిప్పులు పోశారు.

పోనీ పథకాలు , ఆర్థిక సాయం చేయడంలో మోడీకి చేయి రాలేదు సరే.. కనీసం ధరలు అయినా పెంచకపోతే ప్రజలు బతుకుతారు కదా అంటే.. దానిమీద మోడీ సార్ శవాల మీద పేలాలు ఏరుకునే చందంగా వ్యవహరిస్తున్నారని సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా ఎనిమిదో రోజు కూడా పెట్రోల్, డీజీల్ ధరలు పెంచుతూ చమురు కంపెనీలు దేశ ప్రజలకు వాతలు పెట్టాయి. మెట్రో నగరాల్లో పెట్రోల్ ధర వరుసగా ఎనిమిదో రోజునాడు రూ.62పైసలు పెరిగింది. డీజీల్ ధర రూ.64 పైసలు పెరిగింది. దీంతో పెరిగిన ధరల ప్రకారం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.75.78కి చేరగా.. డీజిల్ ధర రూ.74.03కి చేరింది.

గత ఎనిమిది రోజుల్లో పెట్రోల్ ధర లీటర్ కు ఏకంగా రూ.4.52 రూపాయలు పెరగగా.. డీజిల్ ధర కూడా రూ. 4.64 రూపాయలు పెరిగింది.

ఇలా సామాన్యుడికి ఆదాయం లేకుండా చేసి ఇప్పుడిప్పుడే రోడ్ల మీదకు వస్తున్న ప్రజల ఆదాయాన్ని పెట్రోల్, డీజిల్ తో పీల్చిపిప్పి చేస్తున్న కేంద్రంలోని బీజేపీ సర్కార్ పై కారాలు మిరియాలు నూరుతున్నారు సామాన్యులు. ఇంత కరువులో ఈ పెంచుడేంది మోడీసార్ అంటూ నిలదీస్తున్నారు.

‘రజిని’తో రొమాన్స్ కి ఖుష్బూ రెడీ !

Khushboo

Khushboo

సూపర్ స్టార్ రజనీకాంత్ తన 168వ చిత్రాన్ని యాక్షన్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఆగష్టు నుండి ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళనుంది. అయితే డైరెక్టర్ శివ ఈ చిత్రంలో రజనీ సరసన యంగ్ హీరోయిన్ కాకుండా వయసులో పెద్దగా కనబడే నటి అయితే బాగుంటుందని ఖుష్బూను తీసుకున్నారు. ఖుష్బూ కూడా ఈ సినిమా కోసం ఇరవై కిలోలు తగ్గి సరికొత్తగా రెడీ అయింది. కాగా తాజాగా కోలీవుడ్ సినీ వర్గాల సమాచారం ప్రకారం రజిని సరసన ఖుష్బూనే రెగ్యులర్ హీరోయిన్ లా నటిస్తోందట.

గ్లామర్ పరంగా ఇప్పటికీ ఏ మాత్రం వంక పెట్టలేని విధంగా ఉండే ఖుష్బూ.. మరి రజిని సరసన ఈ లేట్ వయసులో ఎలా నటిస్తోందో ఎలాంటి రొమాన్స్ చేస్తోందో చూడాలి. ఇక రజనీ గత సినిమాలు చూసినా ‘కాలా’లో సీనియర్ నటి ఈశ్వరీ రావ్, ‘పేటా’లో సిమ్రన్ తో కలిసి నటించారాయన. ఆ తరహాలోనే కొత్త చిత్రంలో ఖుష్బూతో జోడీ కట్టనున్నారు అన్నమాట. ఈ న్యూస్ విన్న రజిని ఫ్యాన్స్ సైతం కొంచెం సప్రైజ్ ఫీలైనా.. ఫైనల్ గా వారిద్దరి పెయిర్ చాల బాగుంటుందని అంటున్నారట.

గతంలో రజనీ, ఖుష్బూలు కలిసి ‘అన్నామలై, మన్నన్, పాండియన్, నట్టుక్కు ఓరు నల్లవన్’ వంటి చిత్రాలు చేశారు. రజనీ మొదటిసారి శివతో చేస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో ఈ సినిమా పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ సినిమాని రజనీతో ‘రోబో, పేట’ సినిమాల్ని నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది.

జగన్ ప్రతీకారానికి ఏడాది వెయిట్ చేశాడా?

Jagan

Jagan
అన్ని రాష్ట్రాలు కరోనాతో ఫైట్ చేస్తుంటే.. ఏపీలోని వైఎస్ జగన్ ప్రభుత్వం మాత్రం కరోనాతోపాటు ప్రధాన ప్రతిపక్ష టీడీపీ నేతలను కూడా కంట్రోల్ చేసే పనిని పెట్టుకుంది. ఆ వేడిలోనే ఈ వేడిని కలిపేసి టీడీపీ నేతల వేదనను అరణ్య రోదన చేస్తోందన్న వాదన ఉంది.

గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో మోసాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రతిపక్ష టిడిపి నాయకులను ప్రస్తుతం సీఎం జగన్ మోహన్ రెడ్డి వేటాడేస్తున్నారు. జగన్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు రాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి..

ఇప్పటికే ఇద్దరు తెలుగుదేశం పార్టీ కీలక నేతలు అరెస్ట్ అయ్యారు. వైసీపీ నేతలు లిస్టుల మరింత మంది టీడీపీ నేతలు ఉన్నారని అర్థమవుతోంది. గత ఏడాది మేలో జరిగిన ఎన్నికల్లో గెలిచిన తర్వాత అరెస్ట్ అయిన తొలి టీడీపీ నాయకుడు అచ్చెన్నాయుడు కావడం గమనార్హం.

ముఖ్యమంత్రి అయిన తరువాత, జగన్ మోహన్ రెడ్డి గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకున్న అన్ని ప్రధాన నిర్ణయాలను పున:పరిశీలించడమే కాకుండా, అవకతవకలు జరిగిన శాఖల్లో దర్యాప్తునకు ఆదేశించాలని నిర్ణయించుకున్నారు.

టిడిపి పాలనలో వివిధ పథకాలలో జరిగిన అవకతవకలపై సిబిఐ దర్యాప్తుకు రాష్ట్ర మంత్రివర్గం అనుమతి ఇచ్చిన ఒక రోజు తర్వాత ఈ అరెస్టులు జరగడం విశేషంగా మారింది.

అరెస్టుల సమయం కూడా అనేక సందేహాలను రేకెత్తించింది. కోవిడ్ -19 వ్యాప్తి తో రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఎదురుదెబ్బల కారణంగా రాష్ట్ర సమస్యల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇది జరిగిందని ప్రతిపక్ష నాయకులు భావిస్తున్నారు.

మొత్తం మీద, జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన ఏడాదిలో అభివృద్ధి సంక్షేమంలో తన మార్క్ చూపి ప్రజల్లో విజయం సాధించారు. ఈ నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన ఒక సంవత్సరం తరువాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కడం ప్రారంభించాడు. అభివృద్ధి ముసుగులో చంద్రబాబు, టీడీపీ నేతల అరెస్ట్ ను ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు.

-నరేశ్ ఎన్నం

‘వకీల్ సాబ్‌’ సినిమానే చివరిది అంటున్న దిల్‌ రాజు!

Dil Raju


కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచం మొత్తం స్తంభించిపోయింది. దాదాపు మూడు నెలల పాటు ఆగిపోయిన షూటింగ్స్ ఈ మధ్యే మొదలయ్యాయి. లాక్‌డౌన్‌ రూల్స్‌ పాటించాల్సిన నేపథ్యంలో పరిమిత సంఖ్యలో ఆర్టిస్టులతో షూటింగ్స్‌ చేస్తున్నారు. పెద్ద సినిమాల చిత్రీకరణకు ఇంకా సమయం పట్టేలా ఉంది.

ఇక మూడు నెలల నుంచి మూతపడ్డ థియేటర్లపై ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయం తీసుకో లేకపోతున్నాయి. సీటింగ్స్‌లో మార్పులు చేసినప్పటికీ మరో రెండు, మూడు నెలల వరకూ వాటిని ఓపెన్‌ చేసే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో కొంత మంది నిర్మాతలు ఓటీటీల్లో సినిమాలు రిలీజ్‌ చేస్తున్నారు. కీర్తి సురేశ్ నటించిన ‘పెంగ్విన్’ నేరుగా అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల కానుంది. అయితే, పెద్ద సినిమాల విషయంలో మాత్రం దర్శక, నిర్మాతలు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. మార్కెట్‌తో పాటు ఆయా హీరోల అభిమానుల దృష్టిలో ఉంచుకొని థియేటర్ల వైపే మొగ్గు చూపుతున్నారు.

అదే సమయంలో చిత్ర నిర్మాణాల విషయంలో కూడా దర్శక, నిర్మాతలు ఓ అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ప్రారంభమై షూటింగ్ ఆగిపోయిన చిత్రాలనే ముందుగా పూర్తిగా చేయాలని పరిస్థితులు పూర్తిగా మెరుగుపడే వరకూ కొత్త ప్రాజెక్టుల జోలికి వెళ్లకూడదని భావిస్తున్నారు. ఈ క్రమంలో అగ్ర నిర్మాత దిల్‌ రాజు కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది మరే కొత్త ప్రాజెక్టును ప్రారంభించకూడదని డిసైడ్ అయ్యాడట. ఆయన నిర్మించిన ‘వీ’ మూవీ రిలీజ్‌కు రెడీగా ఉంది. అలాగే, ప్రస్తుతం పవన్ కళ్యాణ్తో ‘వకీల్‌ సాబ్‌’ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

కొంత విరామం తర్వాత పవన్ రీఎంట్రీ ఇస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. లాక్‌డౌన్‌కు ముందు సగం కంటే ఎక్కువ సినిమాను చిత్రీకరించారు. షూటింగ్స్‌కు అనుమతి వచ్చినప్పటికీ.. సిచ్యువేషన్‌ కంట్రోల్‌లోకి వచ్చాకే మళ్లీ సెట్స్‌పైకి వెళ్లాలని పవన్‌ ఇప్పటికే తేల్చిచెప్పాడట. దాంతో, ఈ మూవీ కంప్లీట్‌ కావడానికి చాలా సమయం పట్టేలా ఉంది. దాంతో, ఇప్పుడున్న పరిస్థితుల్లో ‘వీ’ని రిలీజ్‌ చేయడంతో పాటు ‘వకీల్ సాబ్‌’ను ఎలాగోలా పూర్తి చేయాలని, ఈ ఏడాది కొత్త ప్రాజెక్టులకు సెట్స్‌పైకి తీసుకెళ్లకూడదని దిల్‌ రాజ్‌ భావిస్తున్నాడట. వచ్చే ఏడాది వరకు కొత్త సినిమాలను ప్రారంభించకూడదని నిర్ణయించుకున్నాడట. థియేటర్లు పూర్తి స్థాయిలో తెరుచుకున్నాకే కొత్త చిత్రాలను ముందుకు తీసుకెళ్లాలన్నది ఆయన ఉద్దేశ్యం. తాను నిర్మించినా, రిలీజ్‌ చేసినా ఎంతో పక్కాగా వ్యవహరించడం దిల్‌ రాజు శైలి. అలాంటి వ్యక్తే ఈ ఏడాది కొత్త సినిమాల నిర్మాణం వద్దనుకుంటే.. మిగతా వాళ్లు కూడా అదే పని చేసే అవకాశం ఉంది.

చాన్నాళ్లకు తెలుగులో ఈషా రెబ్బాకు మరో చాన్స్?

Esha Rebba

Esha Rebba
ఈషా రెబ్బా. అచ్చ తెలుగు అమ్మాయి. అందం ఉంది. అభినయం ఉంది. స్టార్ హీరోయిన్‌కు కావాల్సిన అన్ని అర్హతలూ ఉన్నాయి. కానీ, సరైన అవకాశాలు మాత్రం రావడం లేదు. అయినా చిన్న, పెద్ద సినిమాలు అనే తేడా లేకుండా వచ్చిన ప్రతి ఆఫర్ను సద్వినియోగం చేసుకుంటోంది. తన ప్రతిభను నిరూపించుకునే ప్రయత్నం చేస్తోంది. అయినప్పటికీ కెరీర్ను మలుపుతిప్పే బ్రేక్‌ కోసం ఈషా చాన్నాళ్ల నుంచి ఎదురు చూస్తూనే ఉంది. ‘బ్రాండ్ బాబు’, ‘సుబ్రమణ్యపురం’, ‘రాగల 24 గంటల్లో’ సినిమాల్లో హీరోయిన్‌గా నటించినప్పటికీ ఆ రెండూ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ‘అరవింద సమేత వీర రాఘవ’లో ఓ పాత్ర పోషించింది. ఆ సినిమా హిట్టయినా.. ఈషాకు ఒరిగిందేమీ లేదు.

దాంతో ఇప్పుడామె తమిళ్‌తో పాటు కన్నడ సినిమాలపై దృష్టి పెట్టింది. జీవీ ప్రకాశ్ కుమార్ సరసన తమిళ్‌లో ఓ సినిమా చేస్తున్న ఆమె.. ‘ఎస్‌ఆర్కే’ అనే మూవీతో కన్నడలో అరంగేట్రం చేస్తోంది. మరోవైపు నెట్‌ఫ్లిక్స్‌లో సంచలనం సృష్టించిన ‘లస్ట్‌ స్టోరీస్‌’ హిందీ వెబ్‌ సిరీస్‌ తెలుగు వెర్షన్‌లో కూడా ఈషా నటిస్తోంది. ఇప్పటిదాకా హోమ్లీ క్యారెక్టర్స్‌కే మొగ్గు చూపిన ఆమె.. అడల్ట్‌ కంటెంట్‌ ఉన్న ఆ వెబ్‌ సిరీస్‌కు ఓకే చెప్పడం గమనార్హం.

ఇలాంటి టైమ్‌లో ఈషాను వెతుక్కుంటూ ఓ తెలుగు సినిమా ఆఫర్ వచ్చింది. ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ తర్వాత సుశాంత్ చేసే తర్వాతి మూవీకి ఆమెను ఎంచుకున్నట్టు సమాచారం. ఆ మూవీలో ఇద్దరు హీరోయిన్లకు అవకాశం ఉందట. ఈషా ఒక హీరోయిన్‌గా ఎంపికైనట్టు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే చాన్సుంది. ఈషా మెయిన్ హీరోయినా.. సెకండ్ హీరోయినా అన్నది కూడా అప్పుడే తెలుస్తుంది.

‘బాబు’ ఇంటి వద్ద పనిచేసే కానిస్టేబుల్ కు కరోనా..!

bapatla constable

కరోనా వైరస్ భారిన పడకుండా ఉండేందుకు చంద్రబాబు ఎన్నో చర్యలను తీసుకుంటున్నారు. పార్టీ కార్యక్రమాలను సైతం ఇంటి నుంచే నిర్వహిస్తున్నారు. అయితే బాబు ఇంటి వరకూ కరోనా చేరింది. ఆయన ఇంటి వద్ద పనిచేసిన గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన కానిస్టేబుల్ కు కరోనా పాజిటివ్ అని వైద్యులు నిర్ధారించారు. మీ 5వ తేదీన చంద్రబాబు ఇంటి వద్ద విధులు నిర్వహించేందుకు వెళ్లి 7వ తేదీన తిరిగి వచ్చాడు. అనంతరం కొంత నలతగా ఉన్నట్లు గమనించి వైద్యులను సంప్రదించి కరోనా పరీక్షలు చేయించుకున్నాడు. పరీక్ష లో కరోనా పాజిటివ్ గా తేలింది.

విధుల నిమిత్తం హైదరాబాద్ వెళ్లగా అక్కడ ఓ కానిస్టేబుల్ వైరస్ భారిన పడినట్లు తేలింది..అతని నుంచి బాపట్ల కానిస్టేబుల్ కు వైరస్ సోకింది. దీంతో కానిస్టేబుల్ ను కోవిడ్ ఆసుపత్రికి పంపించడంతోపాటు, కుటుంబ సభ్యులను హొమ్ క్వారంటైన్ లో ఉంచారు. వారికీ కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. కానిస్టేబుల్ కు కరోనా లక్షణాలు లేకుండానే ఉండటం గమనార్హం. మరోవైపు హైదరాబాద్ లో చంద్రబాబు నివాసం వద్ద నగర పాలక సంస్థ అధికారులు శానిటేషన్ చర్యలు చేపట్టారు

రవితేజ మూవీకి కోలీవుడ్ బ్యూటీ నో!

Malavika_Mohanan-oktelugu

Malavika_Mohanan-oktelugu
ఈ మధ్య ఆశించిన విజయాలు రాకపోయినా తెలుగులో మంచి  స్టార్డమ్‌, విపరీతమైన మాస్ ఫాలోయింగ్ ఉన్న నటుడు రవితేజ. అవకాశం వస్తే అతని సరసన నటించేందుకు స్టార్ హీరోయిన్లు సైతం వెంటనే ఓకే చెబుతారు. కానీ, కోలీవుడ్‌కు చెందిన ఓ యువ నటి మాత్రం రవితేజ సరసన హీరోయిన్‌ ఆఫర్ వస్తే మాత్రం రిజెక్ట్ చేసిందట. ఆ ముద్దుగుమ్మ పేరు  మాళవికా మోహనన్. కేరళకు చెందిన ఈ  హాట్ యాక్ట్రెస్‌.. తొలుత మలయాళంలో నటించి ఆపై కన్నడ, తమిళ్, హిందీ చిత్రాలు కూడా చేసింది. సూపర్ స్టార్ రజనీకాంత్ ‘పేట’తో కోలీవుడ్‌కు పరిచయమైన మాళవికా మంచి క్రేజ్ సంపాదించుకుంది. దాంతో, మరో అగ్ర  కథానాయకుడు విజయ్‌త కలిసి ‘మాస్టర్’ సినిమాలో హీరోయిన్‌గా నటించింది.

లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ చిత్రీకరణ ఎప్పుడో పూర్తయింది. కానీ, లాక్‌డౌన్‌ కారణంగా విడుదల వాయిదా పడింది. విజయ్ సినిమా అంటే  కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ ఆసక్తి  ఏర్పడుతుంది. దాంతో, మూవీ రిలీజ్‌ కాకముందే  ఈ చిత్ర హీరోయిన్‌ మాళవికకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. విజయ్‌ దేవరకొండ హీరోగా తమిళ డైరెక్టర్ ఆనంద్‌ అన్నమలై  గతేడాది ప్రకటించిన ‘హీరో’ అనే మూవీలో కూడా మాళవిక హీరోయిన్‌గా ఎంపికైంది. అయితే, విజయ్‌, ఆనంద్‌ మధ్య క్రియేటివ్‌ డిఫరెన్సెస్‌ కారణంగా ఈ చిత్రం నిరవధికంగా వాయిదా పడిందని వార్తలు వచ్చాయి. అయినా సరే మాళవికలను పలువురు దర్శక, నిర్మాతలు సంప్రదిస్తూనే ఉన్నారు. ఈ  క్రమంలో రవితేజ హీరోగా ప్లాన్ చేసిన ఓ మూవీలో నటించాలని నిర్మాతలు ఆమెను కలిశారట. కథ చెప్పి భారీ రెమ్యునరేషన్‌ ఇస్తామని కూడా ఆఫర్ చేశారట. కానీ, ఈ ఆఫర్ను మాళవిక రిజెక్ట్ చేయడంతో వాళ్లు షాకయ్యారట. ఆమె  పెద్ద ప్రాజెక్ట్‌ను కాదనుకోవడానికి కారణం లేకపోలేదు. తాను నటించిన ‘మాస్టర్’పై ఆమె భారీ అంచనాలు పెట్టుకుంది. ఈ మూవీ రిలీజైన తర్వాతే  కొత్త సినిమాలకు  ఓకే చెప్పాలని మాళవిక నిర్ణయం తీసుకుందట. ‘మాస్టర్’ హిట్టయి.. తనకు మంచి  పేరొస్తే ఫర్వాలేదు కానీ.. ప్రతికూల ఫలితం వస్తే మాత్రం మొదటికే మోసం వస్తుంది. మాళివిక ఫ్యూచర్ ఎలా ఉంటుందో మరి.