
కమేడియన్‌గా ఒకప్పుడు వెలుగు వెలిగాడు సునీల్. ‘అందాల రాముడి’తో హీరో అవతారం ఎత్తాడు. తన యాక్టింగ్‌తోనే కాకుండా డ్యాన్సింగ్ స్కిల్స్‌తో కూడా అభిమానులను మెప్పించాడు. ఏకంగా స్టార్ డైరెక్టర్ రాజమౌళితో ‘మర్యాద రామన్న’ చేసి బ్లాక్‌బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్నాడు. కానీ, ఆ తర్వాత వరుస ఫెయిల్యూర్స్ రావడం మళ్లీ హాస్య నటుడి అవతారం ఎత్తాడు. చాన్నాళ్ల తర్వాత ‘అరవింద సమేత వీర రాఘవ’లో చిన్న రోల్ చేసిన అతను.. కమేడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కొనసాగుతున్నాడు. కానీ, యువ కమేడియన్లతో పోటీలో అతను మునుపటిలా పేరు తెచ్చుకోవడం లేదు. చివరకు రవితేజ ‘డిస్కో రాజా’లో విలన్‌గా కూడా నటించాడు. అద్భుతంగా నటించినా.. ఆ సినిమా ఆశించిన విజయం సాధించలేకపోయింది.
ఈ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కొత్త చిత్రంపై సునీల్ భారీ అంచనాలు పెట్టుకున్నాడు. ఈ మూవీలో ఓ కామెడీ ట్రాక్ కోసం అతడిని ఎంచుకున్నారు. హీరోగానే కాకుండా ఆర్టిస్ట్‌గా వరస పరాజయాల ఎదుర్కొన్నందున ఈ మూవీతో మళ్లీ ట్రాక్‌లో పడాలని చూస్తున్నాడు. మరోవైపు ‘వినయ విధేమ రామ’తో భారీ పరాజయాన్ని మూటగట్టుకున్న బోయపాటి కూడా బాలయ్య మూవీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. తన నమ్మకం ప్రకారం ఓ ఫైట్‌తో ఈ చిత్రాన్ని మొదలెట్టాడు. కానీ, నాలుగైదు రోజుల తర్వాత కరోనా వ్యాప్తి మొదలవడంతో షూటింగ్ నిలిచిపోయింది. అయితే లాక్‌డౌన్ కారణంగా సినిమా చాలా ఆలసమయ్యే అవకాశం ఉండడంతో స్క్రిప్టును కొంచెం మార్చాలని బోయపాటి, బాలయ్య డిసైడయ్యారట. ముందుగా రాసుకున్న ఓ కామెడీ ట్రాక్ ఒకదాన్ని బోయపాటి పూర్తిగా తొలగించినట్లు సమాచారం. సునీల్‌ను దాని కోసమే తీసుకున్నారు. ఇప్పుడా ట్రాక్ లేదు కాబట్టి మూవీ నుంచి అతడిని తప్పించినట్టు తెలుస్తోంది. దాంతో ఈ మూవీపై ఎన్నో అంచనాలు పెట్టుకున్న సునీల్‌కు నిరాశే మిగలనుంది.