Home Blog Page 8443

నాడు వద్దన్న బాబు..నేడు గవర్నర్ వద్దకు..!


టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి విమర్శల పాలవుతున్నారు. ఇందుకు కారణం ఏమిటంటే టీడీపీ నాయకుల అరెస్ట్ లు, ఇతర సమస్యలను ఏపీ గవర్నర్ భిశ్వభూషన్ హరిచందన్ దృష్టికి తీసుకువెళ్లడమే. దాదాపు గంటకు పైగా ప్రతిపక్ష నేత గవర్నర్ తో ముచ్చటించారు. వైసీపీ ప్రభుత్వంపై 14 పేజీల సుదీర్ఘ లేఖను ఈ సందర్భంగా గవర్నర్ కు అందజేశారు.

రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ బరిలో నిలిచింది అందుకేనా?

గవర్నర్ వ్యవస్థ శుద్ధ దండగ అన్న చంద్రబాబు ఇప్పుడు గవర్నర్ దగ్గరకు ఎందుకు వెళ్లారని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. చంద్రబాబు సీఎంగా ఉండగా అప్పటి గవర్నర్ నరసింహన్ విషయంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
రెండు రోజుల ముందు శాసన సభలో బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగాన్ని బాయ్ కాట్ చేశారు. అటువంటి చంద్ర బాబు గవర్నర్ ను కలిసిన విషయంపై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విషువర్ధన్ రెడ్డి విమర్శలు ఎక్కుపెట్టారు.

ప్రస్తుత ముఖ్యమంత్రి, అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై విశాఖ ఎయిర్ పోర్టులో దాడి జరిగిన సంఘటన డిజిపికి గవర్నర్ స్వయంగా ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. దీంతో అప్పటి సీఎంగా చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. గవర్నర్ తనను అడగాలే తప్ప నేరుగా డీజీపీకి ఎలా ఫోన్ చేస్తారని ప్రశ్నించారు. గవర్నర్ వ్యవస్థనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అంతకు ముందు చుక్కల భూముల విషయంలో ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ను గవర్నర్ నరసింహన్ వెనక్కి పంపారు. ఆర్డినెన్స్ లోపభూయిష్టంగా ఉందని ఆయన ఆమోదం తెలపలేదు. మరికొన్ని విషయాల్లో గవర్నర్ ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించారు.

జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో మిక్స్డ్ టాక్..!

మరోవైపు వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకుని నలుగురిని చంద్రబాబు మంత్రులుగా చేశారు. అప్పుడు గవర్నర్ నర్శింహన్ వారి చేత ప్రమాణం చేయించారు. అయినా బాబు గవర్నర్ వ్యవస్థను వ్యతిరేకించారు. గవర్నర్ వ్యవస్థనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు మండలి రద్దు చేయాలని జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న చంద్రబాబు తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే రీతిలో వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ బరిలో నిలిచింది అందుకేనా?


రాష్ట్రంలో రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవసరమైన ఎమ్మెల్యేల బలం లేకున్నా టీడీపీ తమ అభ్యర్థిని రంగంలోకి దింపింది. టీడీపీ తరపున వార్ల రామయ్య బరిలో నిలిచారు, వైసీపీ అభ్యర్థులుగా ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వాని, పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకట రమణ పోటీ చేశారు. దీంతో ఏకగ్రీవం కావాల్సిన ఎన్నికలకు పోలింగ్ తప్పనిసరైంది. వాస్తవానికి ఈ పోలింగ్ మార్చి 26న జరగాల్సి ఉంది. కరోనా నేపథ్యంలో వాయిదా వేసి ఈ రోజు నిర్వహిస్తున్నారు.

జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో మిక్స్డ్ టాక్..!

ఓపెన్ బ్యాలెట్ విధానంలో జరిగే ఈ ఎన్నికలకు ఎమ్మెల్యేలు తాము ఎవరికి ఓటు వేశారనే విషయాన్ని పార్టీ తెలుసు కునేందుకు బ్యాలెట్ ప్యాపర్ ను పార్టీ నిర్దేశించిన ప్రతినిధికి చూపించి బ్యాలెట్ బాక్సులో వేయాల్సి ఉంటుంది. ఒకవేళ పార్టీ చెప్పిన అభ్యర్థికి కాకుండా పొరపాటున మరో అభ్యర్థికి ఓటు వేస్తే అది చెల్లదు. ఆ చర్యకు పాల్పడిన ఎమ్మెల్యేకి పార్టీ నోటీసులు జారీ చేయడం, తప్పు చేశారని భావిస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుంది.

రాజ్యసభ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో విజయం సాధించాలంటే ఒక్కో అభ్యర్థి కనీసం 36 తొలి ప్రాధాన్యత ఓట్లు అవసరమవుతాయి. టీడీపీకి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య కేవలం 23 మాత్రమే. వీరిలో ముగ్గురు ఎమ్మెల్యేలు టీడీపీ వీడి వైసీపీతో సన్నిహితంగా ఉంటున్నారు. కారణం బలరాం, మద్దాలి గిరిధర్, వల్లభనేని వంశీమోహన్ ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు వైసీపీతో సన్నిహితంగా ఉండటంతో శాసన సభలో టీడీపీ బలం 20కి తగ్గిపోయింది.

రోజా, రజినీకి షాక్.. వైసీపీలో ఈసారి ఛాన్స్ ఎవరికి?

ఒడిపోతామని తెలిసినా టీడీపీ ఎందుకు పోటీ చేసిందంటే రాజ్యసభ ఎన్నికలకు పోటీ అంటే టీడీపీని వీడి వైసీపీతో సన్నిహితంగా ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలను అవకాశం దొరికితే చట్టపరంగా ఇరికించవచ్చనే కారణంగా వాదనలు వినిపిస్తున్నాయి. ఎన్నికలకు సంబంధించి టీడీపీ విప్ జారీ చేసింది. విప్ ను టీడీపీ ఎమ్మెల్యేలతో పాటు ఆ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు కారణం బలరాం, మద్దాలి గిరిధర్, వల్లభనేని వంశీమోహన్ లకు నోటీసులు పంపింది.

మరో సీక్వెల్‌ ఆలోచనలో రజనీ కాంత్‌!


బాలీవుడ్‌, టాలీవుడ్‌, కోలీవుడ్‌ ఇలా భాషతో సంబంధం లేకుండా ఈ మధ్య సీక్వెల్ మూవీల సందడి నడుస్తోంది. మున్నాభాయ్‌ నుంచి దబాంగ్, హౌజ్‌ఫుల్‌ వరకూ హిందీలో చాలా సీక్వెల్స్‌ వచ్చాయి. పలువురు స్టార్ హీరోలు సీక్వెల్స్‌ చేస్తున్నాడు. కోలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకడైన కమల్‌ హాసన్‌ విశ్వరూపం మూవీని రెండు పార్టుల్లో చేశాడు. ఇప్పుడు ‘భారతీయుడు’ సీక్వెల్‌ అయిన ‘ఇండియన్’లో నటిస్తున్నాడు. తాజాగా మరో కోలీవుడ్‌ సూపర్ స్టార్ ర్రజనీకాంత్ కూడా తన హిట్‌మూవీ సీక్వెల్‌లో నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రజనీ హీరోగా కార్తీక్‌ సుబ్బరాజు దర్శకత్వంలో రూపొందించిన ‘పేట’ గతేడాది విడుదలై మంచి విజయం అందుకుంది. లింగా, కబాలి, కాలా, 2.0తో ఆకట్టుకోలేకపోయిన రజనీ.. పేటతో మళ్లీ ట్రాక్‌లోకి వచ్చాడు. ఆపై, ఏఆర్ మురుగదాస్‌తో దర్బార్ తో మరోహిట్ కొట్టిన సూపర్ స్టార్ ఇప్పుడు శివ డైరెక్షన్‌లో ‘అన్నాత్తె’ అనే మూవీల నటిస్తున్నాడు. నయనతార, మీన, కుష్బు, కీర్తి సురేశ్ ఇతర ప్రధాన పాత్రలు చేస్తున్నారు. దాదాపు 80 శాతం చిత్రీకరణ పూర్తయింది. చివరి షెడ్యూల్‌ లాక్‌డౌన్‌ కారణంగా ఆగిపోయింది.

దీని తర్వాత రజనీ ఏ మూవీ చేస్తాడనే దానిపై ఆసక్తి నెలకొంది. అది ‘పేట’కు సీక్వెల్‌ అని తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా కార్తీక్‌ సుబ్బరాజే చెప్పాడు. కీర్తి సురేశ్‌ ప్రధాన పాత్రలో అతను నిర్మించిన ‘పెంగ్విన్‌’ ఈ రోజే అమెజాన్‌ ప్రైమ్‌లో రిలీజైంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో అతను ‘పేట’ గురించి మాట్లాడాడు. ‘పేట’ చేసేప్పుడు సీక్వెల్‌ ఆలోచనే లేదన్నాడు. కానీ, ఆ మూవీ విడుదలై మంచి విజయం సాధించిన తర్వాత సీక్వెల్‌ కథ తట్టిందని చెప్పాడు. ఇందుకోసం ఇప్పటికే కొన్ని ఐడియాలు ఉన్నాయని చెప్పాడు.ఇదే విషయాన్ని రజనీ దృష్టికి తీసుకెళ్లాడట. సూపర్ స్టార్ కూడా సుముఖంగానే ఉన్నట్టు తెలుస్తోంది. రజనీ ఇప్పటికే రోబోకు సీక్వెల్‌గా 2.0 చేసిన సంగతి తెలిసిందే.

కాజల్ బర్త్‌డే స్పెషల్: ‘మోసగాళ్లు’ న్యూ పోస్టర్..


మోహన్‌ బాబు నట వారసుడిగా తెరంగేట్రం చేసిన మంచు విష్ణు పెద్దగా సక్సెస్‌ కాలేకపోయాడు. పదిహేడేళ్ల సినీ కెరీర్లో చేసిన దాదాపు 20 చిత్రాల్లో ‘డీ’, ‘దేనికైనా రెడీ’ మాత్రమే సక్సెస్‌ అయ్యాయి. ఎనిదేళ్ల నుంచి విజయం మొహం చాటేసినా విష్ణు వరుసగా చిత్రాలు చేస్తూనే ఉన్నాడు. కానీ, అతని చిత్రాలు విడుదలయ్యాయి అని తెలిసేలోపు థియేటర్ల నుంచి వెళ్లిపోతున్నాయి. తన చివరి చిత్రాలు ఆచారి అమెరికా యాత్ర, ఓటర్ తీవ్రంగా నిరాశ పరిచాయి. ఇక లాభం లేదనుకున్న విష్ణు.. హాలీవుడ్‌ డైరెక్టర్ జెఫ్రే గీ చిన్‌ ను లైన్‌లో పెట్టాడు. తానే ప్రొడ్యూస్‌ చేస్తూ ‘మోసగాళ్లు’ అనే మూవీలో నటిస్తున్నాడు. ఇందులో కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్. ప్రపంచంలో అతిపెద్ద ఐటీ స్కామ్ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో విష్ణు, కాజల్ కవలలుగా నటిస్తున్నట్లు సమాచారం. చిత్రంలో వీరిద్దరి పేర్లు అర్జున్, అను. నవదీప్, నవీన్ చంద్ర, బాలీవుడ్ నటుడు సుశీల్ శెట్టితో పాటు పలువురు హాలీవుడ్ నటులు భాగం అయ్యారు. ఇప్పటికే 80 శాతం పైగా ఈ మూవీ షూటింగ్ పూర్తయింది.

జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో మిక్స్డ్ టాక్..!

కాజల్‌ అగర్వాల్‌ పుట్టిన రోజు (జూన్ 19)ను సందర్భంగా ఆమెకు బర్త్‌డే విషెస్‌ చెబుతూ ఈ మూవీ తాజా పోస్టర్ను రిలీజ్‌ చేసింది చిత్ర బృందం. శివుడు పార్వతిలా…మంచు విష్ణు, కాజల్ ముఖాలను కలిపి డిజైన్‌ చేసిన పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీన్ని ట్విట్టర్లో షేర్ చేసిన విష్ణు.. కాజల్‌కు బర్త్‌డే విషెస్‌ చెబుతూ ఆమె కళ్లు సెక్సీగా ఉన్నాయని పొడిగాడు. ‘హ్యాపీ బర్త్‌డే టు మై అమేజింగ్‌ టాలెంటెడ్‌ కాజల్‌ అగర్వాల్. చాలా సెక్సీగా ఉన్న ఇలాంటి పెద్ద కళ్లతో అదగొడుతూనే ఉండు’ అని ట్వీట్‌ చేశాడు.

ఇండస్ట్రీలో మరో విషాదం.. స్టార్ డైరెక్టర్ కన్నుమూత


చిత్ర పరిశ్రమను విషాదాలు వెంటాడుతున్నాయి. బాలీవుడ్‌ అగ్ర నటులు రిషి కపూర్, ఇర్ఫాన్‌ ఖాన్‌, కన్నడ హీరో చిరంజీవి సర్జా, సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణాల మరచిపోకముందే ఇండస్ట్రీలో మరో వ్యక్తి మృతి చెందాడు. ప్రముఖ మలయాళ దర్శకుడు, రచయిత ఆర్. సచిదానందన్‌ కన్నుమూశారు. సాచీగా సుపరిచితుడైన 48 ఏళ్ల ఈ దర్శకుడు కొంతకాలంగా ఆర్థోపెడిక్‌ సమస్యతో బాధపడుతున్నాడు. ఈ మధ్యే ఆయనకు సర్జరీ జరిగింది. దాని నుంచి కోలుకుంటూ ఉండగా మూడు రోజుల క్రితం గుండెపోటు రావడంతో ఆసుపత్రిలో చేర్చారు. దాంతో వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందించారు. కానీ, ఆరోగ్యం విషమించడంతో గురువారం రాత్రి ఆయన మృతి చెందారు.

రోజా, రజినీకి షాక్.. వైసీపీలో ఈసారి ఛాన్స్ ఎవరికి?

సాచీకి ఇండస్ట్రీలో మంచి పేరుంది. ఆయన దర్శకత్వం వహించిన ‘అయ్యప్పనమ్ కోషియమ్’ ఇటీవలే విడుదలై భారీ విజయం సాధించింది. మ‌ల‌యాళ‌ స్టార్ హీరో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, బిజూ మేనన్‌ నటించిన ఈ మూవీ దేశ వ్యాప్తంగా పేరు తెచ్చుకుంది. కేవలం 5 కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ 50 కోట్లకు పైగా వసూలు చేసి సంచలనం సృష్టించింది. దాని రీమేక్‌ రైట్స్‌ కోసం అన్ని భాషల నిర్మాతలు పోటీ పడుతున్నారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులను కొనుగోలు చేశారు. ఇందులో రవితేజ, రానా నటిస్తారని.. సుదీర్ వర్మ దర్శకత్వం వహిస్తాడని సమాచారం. కాగా, తొలుత పలు చిత్రాలకు రచయితగా పని చేసిన సాచీ.. 2015లో వచ్చిన ‘అనార్కలి’ దర్శకుడిగా సాచీకి మొదటి సినిమా. ఆయన రెండో సినిమానే ‘అయ్యప్పనమ్ కోషియమ్’. ఆ మూవీ చిత్రీకరణ సమయంలోనే ఆయన ఆనారోగ్యానికి గురయ్యారు. భారీ విజయాన్ని ఖాతాలో వేసుకొని స్టార్డమ్‌ తెచ్చుకున్న కొన్ని రోజులకే సాచీ ఈ లోకాన్ని విడిచి వెళ్లపోవడాన్ని పరిశ్రమ వర్గాలు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో మిక్స్డ్ టాక్..!


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వై ఎస్ జగన్మోహరెడ్డి బాధ్యతలు చేపట్టి ఏడాది దాటిపోతుంది. ఈ ఏడాది పాలనలో జగన్ తనదైన ముద్ర వేశాడన్నది ఒప్పుకోవాల్సిన నిజం. ఎన్నికల సమయంలో ఆయన ఇచ్చిన హామీలలో చాలావరకు ఏడాది లోపే నెరవేర్చే ప్రయత్నం చేశారు. అమ్మవడి, మత్యకార భరోసా, విద్యాదీవెన, వాహన మిత్ర మరియు వసతి దీవెన వంటి అనేక పథకాల అమలు జరిగింది. లబ్ది దారులకు అకౌంట్స్ లో డబ్బులు నేరుగా జమకావడం కూడా పూర్తి అయ్యింది.

చైనా ఎత్తులను చిత్తు చేసేదేలా?

సదరు పథకాల ద్వారా లబ్దిపొందిన ప్రజలు జగన్ ప్రభుత్వం పట్ల సంతృప్తిగా ఉన్నా.. మిగతా వర్గాలు అసంతృప్తిగా ఉన్నారన్నమాట వినిపిస్తుంది. ఉదాహరణకు వాహన మిత్ర పధకం క్రింద కేవలం ఆటో డ్రైవర్స్ కి మాత్రమే ఏడాది రూ. 10000 లబ్ది చేకూరుతుంది. సొంత ఆటో లేని డ్రైవర్ కి ఈ పథకం వర్తించదు. అలాగే అనేక రకాల రవాణా వాహనాలు నడిపే వ్యవస్థీకృతం కాని చాలా మంది డ్రైవర్లు ఆర్ధికంగా వెనుకబడినవారే. ఇలాంటి డ్రైవర్లు మరి మా సంగతేంటి అని జగన్ ని సూటిగా అడుగుతున్నారు.

తెలంగాణపై పంజా విసురుతున్న కరోనా

కొద్ది రోజులలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైస్సార్ చేయూత పథకం క్రింద ఎస్ సి, ఎస్ టి మరియు బీసీ మహిళల ఖాతాలలో నేరుగా రూ.75000 జమ చేయనున్నారు. ఈ పథకం పట్ల వెనుకబడిన కులాలకు చెందిన మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నా…ఆర్థికంగా వెనుకబడిన ఉన్నత సామాజిక వర్గాలకు చెందిన వారు పెదవి విరుస్తున్నారు. ఆదాయ ప్రాదిపదికన ఈ పథకం అమలు చేయవచ్చు కదా అని వారు తమ అక్కసు వెళ్లగక్కుతున్నారు. ఈ విధంగా జగన్ అమలుపరుస్తున్న ప్రతి పథకం వలన ప్రయోజనం పొందుతున్న లబ్దిదారులలో జగన్ పై అభిమానం పెరుగుతుంటే, అర్హులు కానివారు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

డిగ్రీ, పీజీ విద్యార్థులను కూడా ప్రమోట్ చేస్తారా?

దీనితో జగన్ అమలు పరిచిన ప్రతి పథకం విషయంలో అనుకూలత మరియు ప్రతికూలత ఏర్పడుతుందట. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఇసుక పాలసీ ఇబ్బంది కరంగా ఉంది. ఇసుక కొరత కారణంగా నిర్మాణ రంగంలోని కార్మికులు ఉపాధి విషయంలో ఇబ్బందులపాలవుతున్నారు.కొన్ని విషయాలలో ప్రభుత్వం పనితీరు బాగోలేదనే మాట వినిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఇన్ని పథకాలు అమలు చేసినా ప్రజల్లో జగన్ పాలనపై మిక్స్డ్ టాక్ ఉందని సమాచారం.

రోజా, రజినీకి షాక్.. వైసీపీలో ఈసారి ఛాన్స్ ఎవరికి?


వైసీపీలో కొత్తగా మంత్రి పదవుల ఆశలు మళ్లీ చిగురించాయి. ఆ పార్టీలో గండరగండరులు లాంటి ఎమ్మెల్యేలు రోజా, అంబటి, ధర్మాన, భూమన లాంటి సీనియర్లను కూడా పక్కనపెట్టి అల్ప కులాల వారికి మంత్రి పదవులు ఇచ్చి సీఎం వైస్ జగన్ తొలి కేబినెట్ లో అందరినీ ఆశ్చర్యపరిచాడు. సామాజిక న్యాయంతో అందరి మెప్పు పొందారు. తనతోపాటు వైసీపీలో పోరాడిన సీనియర్లను సైతం సామాజిక న్యాయం చేయడానికి పక్కనపెట్టారు. వారిని వేరే పదవుల్లో భర్తీ చేశారు. పదవుల పందేరంలో.. సామాజిక న్యాయంలో తనకు తరతమ బేధాలు లేవని.. పైరవీలకు తావు లేదని నిరూపించారు జగన్.

తెలంగాణపై పంజా విసురుతున్న కరోనా

కానీ ఇప్పుడు అనుకోకుండా రెండు మంత్రి పదవులు ఖాళీ కాబోతున్నాయి. తాజాగా ఈరోజు రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే వైసీపీ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ లు వైసీపీ రాజ్యసభ ఎంపీలుగా ఎన్నికవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. మండలి రద్దుతో వారి పదవులు పోవడం గ్యారెంటీ కావడంతో జగన్ వారిని రాజ్యసభకు పంపిస్తున్నారు. అయితే వైసీపీ ప్రభుత్వంలో ఖాళీ అయ్యే మోపిదేవి, పిల్లి సుభాష్ మంత్రి పదవుల్లో ఎవరిని సీఎం జగన్ భర్తీ చేస్తారన్నది ఆసక్తిగా మారింది. ఈ రెండు పదవులతోపాటు వారిద్దరి ఎమ్మెల్సీ పదవులు ప్రస్తుతానికి ఖాళీ అవుతున్నాయి. ఈ రెండు మంత్రి పదవుల చుట్టూ బోలెడంత మంది ఆశలు పెంచుకున్నారు. ప్రధానంగా రేసులో చాలామంది సీనియర్ల పేర్లు వినిపడుతున్నాయి.

చైనాపై సర్జికల్స్ స్ట్రయిక్ తప్పదా?

తాజాగా ఈ ఇద్దరు బీసీ నేతలైన మోపిదేవి, పిల్లి సుభాష్ చంద్రబోస్ లు రాజ్యసభకు వెళుతుండడంతో వారి స్థానాల్లో జగన్ ఎవరికి మంత్రి పదవులు ఇస్తారనే చర్చ ఊపందుకుంది. వీరిలో ప్రధానంగా ఫైర్ బ్రాండ్, సోషల్ మీడియాలో విపరీతమైన పాపులారిటీ సంపాదించిన వైసీపీ ఎమ్మెల్యేలు రోజా, విడుదల రజినీలకు ఈసారి మంత్రి పదవులు ఖాయమనే ప్రచారం మొదలైంది. వారిద్దరూ కూడా బోలేడు ఆశలు పెంచుకున్నారు.

కానీ తాజాగా వైసీపీ అధిష్టానం నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. రోజా, రజినీలకు నిరాశ తప్పదనే సంకేతాలు వినిపిస్తున్నాయి. మంత్రి వర్గ విస్తరణ కరోనా-ఆర్థిక మందగమనం దృష్ట్యా రాబోయే రెండేళ్ల వరకు కూడా ఉండదని జగన్ నిర్ణయించుకున్నట్టు సమాచారం..ఇప్పట్లో మోపిదేవి, పిల్లి సుభాష్ మంత్రి పదవుల భర్తీ ఉండదని.. వారి శాఖలను ఇతర మంత్రులకు కేటాయిస్తారని వైసీపీ అధిష్టానం డిసైడ్ అయ్యిందట..

డిగ్రీ, పీజీ విద్యార్థులను కూడా ప్రమోట్ చేస్తారా?

కొత్త మంత్రి పదవుల కోసం చాలా మంది సీనియర్లు ఎదురుచూస్తున్నారు. వారందరికీ ఒకేసారి రెండున్నరేళ్ల వైసీపీ పాలన తరువాతనే మంత్రి వర్గాన్ని పునరవ్వ్యస్థీకరించి మంత్రి పదవులు ఇస్తామని.. ప్రస్తుతం ఖాళీ అయ్యే స్థానాలను అలాగే వదిలేయాలని జగన్ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.

రోజా, ధర్మాన , రజినీ, అంబటి, భూమన సహా చాలా మంది సీనియర్లను జగన్ తొలి కేబినెట్ లో మంత్రి పదవులు కేటాయించలేదు. ఇప్పుడు రెండింటిలో ఇద్దరినీ తీసుకొని మిగతా వారికి ఇవ్వకపోతే పొరపొచ్చాలు రావడం ఖాయం. అందుకే మంత్రివర్గాన్ని పూర్తిగా ప్రక్షాళన సమయంలోనే రెండోదఫాలో సీనియర్లకు పదవులు ఇవ్వాలని జగన్ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.

-నరేశ్ ఎన్నం

డిగ్రీ, పీజీ విద్యార్థులను కూడా ప్రమోట్ చేస్తారా?


తెలంగాణలో కరోనా మహమ్మరి పంజా విసురుతోంది. దీంతో కొద్దిరోజుల క్రితమే తెలంగాణలో పదోతరగతి విద్యార్థుల పరీక్షలను రద్దు చేస్తూ ప్రభుత్వం సంచలనం నిర్ణయం తీసుకుంది. ప్రీఫైనల్లో వచ్చిన మార్కులు, అసైన్మెంట్ ద్వారా విద్యార్థులందరినీ ప్రమోట్ చేస్తున్నట్లు తెలంగాణ విద్యాశాఖ ప్రకటించింది. ఇదిలా ఉంటే ఇంటర్మీయట్ పరీక్షలు రాష్ట్రంలో లాక్డౌన్ విధించిన సమయానికి పూర్తయ్యాయి. దీంతో ఇంటర్ విద్యార్థులకు పరీక్షలు సజావుగానే జరిగాయి. అయితే ఇంటర్ పేపర్ వాల్యుయేషన్ చేసేందుకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఇటీవల లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో ఇంటర్మీయట్ బోర్డు ప్రభుత్వ నిబంధనల మేరకు పేపర్ వాల్యుయేషన్ చేపట్టింది. ఈమేరకు ఇంటర్ రిజల్ట్ ను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం విడుదల చేశారు.

తెలంగాణపై పంజా విసురుతున్న కరోనా

పదో తరగతి, ఇంటర్ విద్యార్థుల లైన్ క్లియర్ కావడంతో డిగ్రీ, పీజీ విద్యార్థుల పరిస్థితి ఏంటనే ప్రశ్న తలెత్తుతోంది. ప్రభుత్వం ఇప్పటికే డిగ్రీ, పీజీ ఫైనలియర్ మినహా మిగతా విద్యార్థులను పరీక్షల్లేకుండానే ప్రమోట్ చేసింది. పరిస్థితి బట్టి వీరికి నవంబర్ లేదా డిసెంబర్లో పరీక్షలను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో కరోనా కేసులు కట్టడిలోకి రాకపోవడంతో డిగ్రీ ఫైనల్, పీజీ ఫైనలియర్ విద్యార్థులకు కూడా ప్రమోట్ చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు విద్యాశాఖ మంత్రి ఉన్నతా విద్యాశాఖ అధికారులతో చర్చించినట్లు తెలుస్తోంది.

చైనాపై సర్జికల్స్ స్ట్రయిక్ తప్పదా?

ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షలను రద్దుచేసి, ఇంటర్నల్‌ మార్కుల ఆధారంగానే ప్రమోట్‌ చేయాలనే అభిప్రాయాన్ని మెజార్టీ అధికారులు వ్యక్తం చేసినట్లు తెల్సింది. ఈమేరకు పరీక్షలను రద్దు చేసేందుకే అధికారులు మొగ్గుచూపుతుండటంతో ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికెళ్లి నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. సీఎం గ్రీన్ సిగ్నల్ ఇస్తే విద్యార్థులను ప్రమోట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. వీరితోపాటు బీటెక్ పరీక్షల రద్దును కూడా చర్చించినట్లు తెలుస్తోంది. అదేవిధంగా రాబోయే విద్యాసంవత్సరం క్లాసులను ఏవిధంగా నిర్వహించాలో అధికారులు చర్చించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పదో పరీక్షలు రద్దయిన నేపథ్యంలో డిగ్రీ, పీజీ ఫైనలియర్ పరీక్షలు కూడా రద్దవడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. దీనిపై మరికొద్దిరోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

మహేశ్‌ సరసన మహానటి.. ఇది ఫిక్స్‌


సూపర్ స్టార్ మహేశ్ బాబు తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’పై తెగ చర్చ నడుస్తోంది. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో హీరోయిన్‌పై రోజుకో వార్త బయటకొస్తోంది. తొలుత పూజా హెగ్డే అన్నారు. ఆపై, కియారా అద్వానీ పేరు వచ్చింది. ఆపై, బాలీవుడ్‌ యువ నటి సయీ మంజ్రేకర్ని సంప్రదిస్తున్నట్టు ప్రచారం జరిగింది. దాంతో , మహేశ్‌కు జోడీ ఎవరనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎట్టకేలకు చిత్ర బృందం హీరోయిన్‌ను ఖాయం చేసింది. సూపర్ స్టార్ తో నటించే లక్కీ చాన్స్‌ యువ నటి కీర్తి సురేశ్‌ను వరిచింది. ఈ విషయాన్ని కీర్తినే తెలిపింది. ఇన్‌స్టా గ్రాం వేదికగా తన అభిమానుతో ముచ్చటించిన కీర్తి ఆసక్తి కరమైన విషయాలను వెల్లడించింది. తన తదుపరి ప్రాజెక్ట్‌లో మహేష్‌ బాబుతో కలిసి నటిస్తున్నట్లు స్వయంగా చెప్పింది. దీంతో మహేష్‌బాబు సినిమా సర్కారు వారి పాటలో కీర్తి నటిస్తున్నట్లు స్పష్టం అయ్యింది.

తెలంగాణపై పంజా విసురుతున్న కరోనా

మహానటితో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న కీర్తి అయితే ఈ ప్రాజెక్ట్‌కు మరింత క్రేజ్‌ వస్తుందని ‘సర్కారు వారి పాట’ చిత్ర బృందం భావించిందని తెలుస్తోంది. దక్షిణాది పలు భాషల్లో వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ..సూపర్ స్టార్ తో మూవీ అనగానే కీర్తి డేట్స్‌ అడ్జస్ట్‌ చేసిందట. దాంతో, టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబినేషన్‌ సెట్‌ అయింది. కాగా, కీర్తి తాజాగా ఒక విభిన్నమైన కథనం పెంగ్విన్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కరోనా కారణంగా థియేటర్లు తెరవడానికి సర్కారు అనుమతినివ్వక పోవడంతో ఈ మూవీ అమెజాన్‌ ప్రైమ్‌లో ఈ రోజే విడుదలైంది. కీర్తి చేతిలో ఇప్పుడు చాలానే ప్రాజెక్టులున్నాయి. రజనీకాంత్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘అన్నాత్తా’ చిత్రంలో కీర్తి ఆయనకు కూతురుగా నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్‌ చివరి దశలో ఉంది. అలాగే, తెలుగులో ‘రంగ్ దే’ , ‘మిస్ ఇండియా, ‘గుడ్ లక్ సఖి’, మలయాళంలో ‘మరక్కార్’ చిత్రాలు చేస్తోందామె.

‘పుష్ప’ మొదట మహబూబ్ నగర్ లోనే..!


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో రాబోతున్న సినిమా ‘పుష్ప’. కాగా ఆగ‌స్ట్ నుండి ఈ చిత్రం షూటింగ్ స్టార్ట్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. రెడ్ శాండిల్ స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ అధిక భాగం అడవులలో చిత్రీకరించాల్సి వుంది. దాంతో మహబూబ్ నగర్ ప్రాంతంలోని అటవి ప్రాంతంలో షూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇక మిగతా సీన్స్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్స్ నిర్మిస్తారట. అయితే ముందుగా సాధ్యమైనంత తక్కువమంది స‌భ్యుల‌తో స్టార్ట్ చేస్తారట.

సెల్ ఫోన్ వీడియో.. అడ్డంగా బుక్కైన నారా లోకేష్

ఇక ఫస్ట్ షెడ్యూల్ లో బన్నీ – రష్మిక పై సాంగ్ షూట్ చేయనున్నారు. అన్నట్టు ఈ సినిమాలో ఓ స్పెషల్‌ సాంగ్‌ కోసం బాలీవుడ్‌ బ్యూటీ ఊర్వశి రౌటెలాను ఫైనల్ చేసిందట చిత్రబృందం. అలాగే తమిళ హీరో విజయ్‌ సేతుపతి కూడా ఈ సినిమాలో పోలీస్‌ ఆఫీసర్‌ గా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్నీకి జోడీగా వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మిక మందన్న కథానాయికగా నటించనుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు.

తెలంగాణపై పంజా విసురుతున్న కరోనా

ఎప్పుడూ బిజీగా ఉండే దేవీ ఈసారి కూల్‌ గా తీరిగ్గా కూర్చుని మ‌రీ పుష్ప సినిమాకి ట్యూన్స్ కంపోజ్ చేస్తుండటం కూడా ఈ సినిమాకి బాగా ప్లస్ కానుంది. ప్రస్తుతం దేవి ఐటమ్ సాంగ్‌ ను కంపోజ్ చేసే పనిలో ఉన్నాడ‌ట. మ‌రి సుకుమార్ – దేవీ కాంబినేష‌న్‌లో ఐటం సాంగ్స్ అంటే ఏ రేంజ్‌లో ఉంటాయో చెప్ప‌న‌క్క‌ర్లేదు. మొత్తానికి పుష్ప సినిమా కోసం దేవి ప్రిపేర్ చేసే ఐటమ్ సాంగ్ మాస్ ప్రేక్ష‌కుల‌ను ఓ రేంజ్‌ లో ఊపేస్తుందనడంలో సందేహం లేదు. మైత్రి మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మిస్తున్నారు.

తెలంగాణపై పంజా విసురుతున్న కరోనా


తెలంగాణలో కరోనా మహమ్మరి పంజా విసురుతోంది. రోజురోజుకు కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. నిన్న ఒక్కరోజే ఏకంగా 352 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్ పరిధిలో గురువారం 302కేసులు నమోదుకాగా ముగ్గురు మృతి చెందారు. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 6,027కు చేరుకుంది. యాక్టివ్ కేసులు 2,531ఉండగా 3,301మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 195మంది మృతిచెందారు.

ఎక్స్ క్లూజివ్: నీహారిక’కు కాబోయే భర్త ఎవరంటే..!

లాక్డౌన్ సడలింపు అనంతరం కరోనా కేసులు లేని జిల్లాల్లోనూ కొత్త కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తుంది. కరోనా ఫ్రీగా ఉన్న వరంగల్ రూరల్ తదితర జిల్లాల్లో కొత్తగా కేసులు నమోదవడం చూస్తుంటే వైరస్ ఏవిధంగా వ్యాప్తి చెందుతుందో అర్థం చేసుకోవచ్చు. గురువారం నాడు రంగారెడ్డిలో 17, మేడ్చల్లో 10, మంచిర్యాలలో 4, జనగామలో 3, వరంగల్ అర్బన్ లో 3, భూపాలపల్లిలో 2, మహబూబ్ నగర్లో 2, మెదక్లో 2, నిజామాబాద్లో 2, సంగారెడ్డిలో 2, వరంగల్ రూరల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో పాజిటివ్ కేసు నమోదైందని తెలంగాణ వైద్యారోగ్య శాఖ ప్రకటించింది.

తెలంగాణలో ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతున్నా కరోనా కట్టడికాకపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా మహానగరంలో రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతుండంతో నగరవాసులు భయాందోళనకు గురవుతోన్నారు. ఈనేపథ్యంలో సీఎం కేసీఆర్ హైదరాబాద్లో 50వేల మంది కరోనా టెస్టులు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. కరోనా టెస్టులు చేపడుతున్న నేపథ్యంలో మరిన్ని కేసులు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కరోనాపై తొలి నుంచి పోరాడుతున్న వైద్యలు, సిబ్బంది, పోలీసులు, పారిశుధ్య కార్మికులు, జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో కరోనా బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తుంది.

సెల్ ఫోన్ వీడియో.. అడ్డంగా బుక్కైన నారా లోకేష్

లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో పెద్ద సంఖ్యలో ప్రజాప్రతినిధులు పర్యటనలు చేపట్టారు. దీంతో తెలంగాణలో ప్రజాప్రతినిధులు ఇటీవల కాలంలో కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే ముగ్గురు అధికార పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు కరోనా బారినపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అదేవిధంగా నగర మేయర్ బొంతు రాంమోహ్మన్ రెండుసార్లు కరోనా బారినుంచి త్రుటిలో తప్పించుకున్నారు. అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి పీఏకు కరోనా సోకడంతో మంత్రి హోంక్వారైంట్లో ఉంటారు. కరోనా ఫ్రీగా ఉన్న సిద్ధిపేటలో ఇటీవల కరోనా కేసులు భారీగా నమోదుకావడంతో ప్రజలంతా ఇంటికే పరిమితయ్యారు.

అధికార పార్టీ ఎమ్మెల్యేలతో పాటు ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు నేతలు సైతం కరోనాబారిన పడి ఆస్పతుల్లో చికిత్స పొందుతుండగా మరికొందరు హోంక్వారంటైన్లో ఉంటున్నారు. వీరితోపాటు పలు జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాస్థాయి అధికారులకు కరోనా సోకడంతో ఆయా అధికారులు ఇంటి నుంచే పనులను చక్కబెడుతున్నారు. కరోనా నివారణకు ప్రభుత్వం ఎన్నిచర్యలు చేపట్టిన వైరస్ కట్టడి కాకపోవడంతో ప్రజలు ఇళ్లనుంచి బయటికి రావాలంటేనే జంకుతున్నారు. ఈనేపథ్యంలో సీఎం కేసీఆర్ కరోనాను ఏవిధంగా కట్టడి చేస్తారో వేచి చూడాల్సిందే..!

బాబు ‘బీసీ’ రాగం ఎందుకు సక్సెస్ కాలేదంటే..!


మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టు సందర్భంగా చంద్రబాబు అండ్ కో బీసీ కార్డును ప్రయోగించి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టె ప్రయత్నం చేశారు. బిసిల చేత “నేను బీసీని నన్ను అరెస్టు చేయండి” అంటూ ప్లకార్డులతో ఫొటోలు తీసి పార్టీ ట్విట్టర్ ఖాతాలో పోస్టులు పెట్టారు. టీడీపీ, చంద్రబాబు, లోకేష్ ట్విట్టర్ ఖాతా ప్రొఫైల్ పిక్ ను “ఉయ్ స్టాండ్ విత్ అచ్చెన్నాయుడు” అని ఉన్న అచ్చెన్నాయుడు ఫొటోను మార్చారు. అటు సోషల్ మీడియాలోనూ, ఇటు ప్రెస్ మీట్ లలోను ప్రభుత్వం బీసీలను వేధిస్తోందని చంద్రబాబు అండ్ కో చెప్పుకొచ్చింది. ఆ పార్టీ ఇప్పటికీ అదే ప్రచారాన్ని కొనసాగిస్తోంది. అయితే చంద్రబాబు బీసీ ప్లాన్ సక్సెస్ అవ్వకపోవడానికి కారణాలు అనేకం కనిపిస్తున్నాయి. వీటిలో కొన్ని స్వయం కృతాపరాధాలు ఉండగా మరొకొన్ని అధికార పక్షం ఎత్తుగడలు ఉన్నాయి.

సెల్ ఫోన్ వీడియో.. అడ్డంగా బుక్కైన నారా లోకేష్

చంద్రబాబు స్వయం కృతాపరాధం ఏంటంటే బీసీ నాయకుడైన అచ్చెన్నాయుడు కుటుంబ సభ్యులను టీడీపీ అధినేత, ఆయన తనయుడు ఎవ్వరూ ఇంటికి వెళ్లి పరామర్శించలేదు. కేవలం ఫోన్ లో మాట్లాడి ధైర్యం చెప్పారంతే. అనంతపురానికి చెందిన జేసీ ప్రభాకర్ రెడ్డి అతని కొడుకు అరెస్టు అయితే ఆయన కుటుంబ సభ్యలను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అనంతపురం వెళ్లి మరీ పరామర్శించి, ధైర్యం చెప్పారు. ఇది బీసీ వర్గాల్లో అసంతృప్తికి కారణమైంది.

పంతం నెగ్గించుకున్న టీడీపీ..!

మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు బీసీ కార్డు ఎత్తులను ప్రభుత్వం చిత్తు చేసింది. టిటిడిలో సన్నిధి గొల్లలకు వంశ పారంపర్య వారసత్వానికి అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. మరోవైపు మాజీ మంత్రి ఆ అచ్చెన్నాయుడు అరెస్ట్ జరిగిన మరుసటి రోజే జేసీ ప్రభాకర్ రెడ్డి అండ్ సన్స్ అరెస్ట్ చేసి ప్రభుత్వానికి అన్ని వర్గాలు సమానమనే సంకేతాలను ప్రజల్లోకి పంపింది. తాను బీసీ కావడంతోనే టీడీపీ అసత్యాలు ప్రచారం చేస్తోందని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. శాసన మండలిలో జరిగిన గందర గోళంలో తాను అసభ్యంగా ప్రవర్తించలేదని తెలిపారు. ఈ ఆరోపణలు అవాసవమని మండలిలో రికార్డు చేసిన వీడియో చూస్తే స్పష్టం ఆమవుతుందన్నారు. టీడీపీ ప్రభుత్వ హాయంలోను తనపై బెట్టింగ్ కేసు పెట్టారని గుర్తు చేశారు. ఈ సంఘటనలతో బీసీలను తమకు వ్యతిరేకం కాకుండా ప్రభుత్వం ఎత్తుగడలు వేసింది.

చైనాపై సర్జికల్స్ స్ట్రయిక్ తప్పదా?


భారత్-చైనా సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. సోమవారం రాత్రి గాల్వాలో జరిగిన ఘర్షణలో 20మంది భారత జవాన్లు వీరమరణం పొందారు. ఈ ఘటన నేపథ్యం యావత్ దేశం చైనాకు తగిన ఆర్మీ తగిన గుణపాఠం చెప్పాలని ముక్తకంఠంతో డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ప్రధాని మోదీ భారత జవాన్ల మరణం వృథాపోదని స్పష్టం చేశారు. సరిహద్దుల్లోని కమాండర్లకు పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకునే అధికారం కల్పించారు. త్రివిధ దళాలను సైతం సిద్ధం ఉండాలని ఆదేశించిన సంగతి తెల్సిందే. తాజాగా లడఖ్ బీజేపీ ఎంపీ జమ్యాంగ్ సేరింగ్ నాంగ్యాల్ చైనాకు గట్టి వార్నింగ్ ఇచ్చారు.

చైనా ఆరాటం నీళ్ళ కోసమా?

2016లో పాకిస్థాన్‌పై సర్జికల్ స్ట్రయిక్స్‌కు ముందు కూడా ప్రధాని మోదీ ఇలానే వ్యాఖ్యానించారని ఆయన గుర్తుచేశారు. 1962నుంచి ఇప్పటివరకు భారత్‌ను చైనా అనేకసార్లు మోసగించిందన్నారు. 1962యుద్ధంలో మనదేశానికి చెందిన 37,244 చ.కీ.మీ భూభాగాన్ని(అక్సాయ్ చిన్) ఆక్రమించిదని తెలిపారు. అక్సాయ్ చిన్ లడఖ్‌లోని భారత భూభాగమని ఆయన తేల్చిచెప్పారు. ఆ ప్రాంతాన్ని భారత్ తిరిగి స్వాధీనం చేసుకునే సమయం ఆసన్నమైందన్నారు. సరిహద్దుల్లో భారత జవాన్లు వీరమరణం పొందిన తరుణంలో ఇక చైనాను ఏమాత్రం ఉపేక్షించొద్దన్నారు. సరిహద్దు సమస్య శాశ్వత పరిష్కారం కావాల్సిందేనని డిమాండ్ చేశారు.

చైనా వస్తువుల బహిష్కరణ సాధ్యమయ్యేనా?

చైనా విషయంలో భారత ప్రధాని ఎలాంటి నిర్ణయం తీసుకున్న లఢక్ ప్రజలు దేశం, సైన్యం వెంటే ఉంటారని స్పష్టం చేశారు. చైనా సరిహద్దుల్లో మన జవాన్లు తరుచూ అమరులవడం లఢక్ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని తెలిపారు. లఢక్ ప్రజలతోపాటు యావత్ దేశం చైనాతో శాశ్వత పరిష్కారం కోరుకుంటోందన్నారు. ప్రస్తుతం భారత్‌లో ఉన్నది 1962 ప్రభుత్వం కాదని చైనాకు స్పష్టం చేశారు. భారత్ ను కవ్విస్తే తగిన మూల్యం చెల్లించక తప్పదనే సందేశాన్ని ప్రధాని మోదీ ఇప్పటికే పంపించారన్నారు.

తాజాగా లఢక్ ఎంపీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో చైనాపై భారత్ మరో సర్జికల్ స్ట్రయిక్ చేపడుతుందా? అనే ఆసక్తి నెలకొంది. సరిహద్దుల్లో ఉద్రికత్త నేపథ్యంలో ఎప్పుడు జరుగుందోననే టెన్షన్ అందరినీ నెలకొంది.

చైనా ఎత్తులను చిత్తు చేసేదేలా?

చైనా దౌత్యాన్ని అర్ధంచేసుకోవాలంటే చైనా చరిత్రని అధ్యయనం చేయాల్సి వుంది. చైనా ని ‘మిడిల్ కింగ్డమ్’ అంటారు. చైనా అంటే ఇప్పుడున్న చైనా కాదు. ఈశాన్య ప్రాంతం లోని మూడు ప్రావిన్సులు మంచూరియా గా పిలవబడేవి. ఆ జాతివాళ్ళను వాళ్ళలో భాగంగా  చానాళ్ళూ చూడలేదు. ఇవి జపాన్ ఆధిపత్యంలో వుండి పారిశ్రామికంగా అభివృద్ధి చెందాయి. అలాగే గ్రేట్ వాల్ కి ఉత్తరాన వున్న మంగోలియా ఎప్పుడూ చైనాలో భాగం కాదు. పశ్చిమాన వున్న జింజియాంగ్, టిబెట్ కూడా చైనా లో భాగం కాదు. అలాగే నైరుతి లోని కొన్ని ప్రాంతాలు, వాయవ్యం లోని కొన్ని ప్రాంతాలు కూడా చైనా రాజ్యం బయటనే ఉండేవి. స్థానిక చైనీయులు వాళ్ళే నాగరికులని, మిగతా ఈ ప్రాంతపు వాళ్ళంతా అనాగారికులనే భావం లో వుండేవారు. బుద్ధిబలం లో కూడా వాళ్లకు ఎవరూ సరితూగరనే భావం లో వుండేవారు. అప్పట్నుంచి వాళ్ళ ఆలోచనలు విభిన్నంగా ఉండేవి. పైకి చెప్పేదానికి , వాళ్ళ ఆంతరంగిక ఆలోచనలకి పొంతన వుండేది కాదు. వాళ్ళ తెలివి తేటలవలనే వీళ్ళందరూ దారిలోకి వచ్చారనే భావన కూడా వుండేది.

మనకు చైనా తో ప్రత్యక్ష బోర్డర్ వున్నది చాలా చిన్న ప్రాంతం. ప్రస్తుతం పాకిస్తాన్ అధినంలో వున్న జిల్గిట్-బాల్టిస్తాన్ ప్రాంతం ద్వారానే చైనా తో భూభాగం కలిసివుంది. అది నేరుగా జింజియాంగ్లోని కష్గర్ పట్టణాన్ని కలుపుతుంది. దాన్నే ఇప్పుడు చైనా-పాకిస్తాన్ ఆర్ధిక నడవాగా అభివృద్ధి చేస్తున్నారు. అక్కడ వున్న కనుమల ద్వారానే చైనా కు చేరుకోవచ్చు. అలాగే తూర్పు వైపు ఆఫ్ఘనిస్తాన్, మధ్య ఆసియా దేశాలకు దారివుంది. అందుకనే ఆ దారి అత్యంత కీలకం. దాన్ని బ్రిటిష్ కుట్రతో 1948 లోనే మనం పోగొట్టుకున్నాం. ఆ తర్వాత మనకు చైనాతో భూ సంబంధం లేదు. అయితే 1951 లో మావో ఆధ్వర్యాన టిబెట్ ని ఆక్రమించిన తర్వాతనే చైనాతో సంబంధం ఏర్పడింది. 1959లో టిబెట్ లో తిరుగుబాటు జరిగినా దాన్ని నిర్ధాక్షిణ్యంగా అణిచి వేయటం , దలైలామా భారత్ కు పారిపోవటం మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత టిబెట్ స్వతంత్ర పోరాటం దిక్కులేనిదై పోయింది. ఈరోజు వాళ్ళ గొంతుక ఎక్కడైనా వినబడుతుందంటే అది అమెరికా లోనే.

చైనా ఆరోజునుంచీ భారత్ తోటి తగాదా పడుతూనే వుంది. 1954లో ఒకవైపు పంచశీల ఒప్పందం పేరుతో హిందీ -చీనీ భాయి భాయి అంటూనే రెండో వైపు ఆక్సాయ్ చిన్ ని ఆక్రమించింది. మనం వచ్చిన అవకాశాల్ని ఉపయోగించుకోకుండా ప్రవర్తించాం. చైనా ని గుడ్డిగా నమ్మం. 1958 లో గ్వాదర్ ఓడరేవు ని ఒమాన్ సుల్తాన్ అమ్మకం పెట్టినప్పుడు భారత్ కి కూడా ఆఫర్ ఇచ్చాడు. మనం వద్దనుకున్నాం. పాకిస్తాన్ కొనుక్కుంది. అదే ఓడరేవు మనకింద వుంటే ఈరోజు చైనా కు అరేబియా సముద్రానికి దారి ఏర్పడేది కాదు. చరిత్రలో ఇటువంటివి చాలా తప్పులు చేసాము. అలాగే గ్వాదర్ ని ఆనుకుని వున్న బెలూచీలు కలాత్ సుల్తాను తరఫున మన సాయం అర్ధిస్తే ఆరోజు నెహ్రూ నిరాకరించాడు. చైనా, పాకిస్తాన్ ల విషయం లో మనమెప్పుడూ సాఫ్ట్ విధానాన్నే అవలంబించాము. టిబెట్ విషయం లో కూడా మనం చైనా చేసింది తప్పని పల్లెత్తుమాట అనలేదు. కొంతమేరకు ప్రాశ్చాత్య దేశాలు, అమెరికానే నిరసన తెలిపాయి. ఆరోజే మనం ఈరెండు దేశాలతో వ్యూహాత్మకంగా వ్యవహరించివుంటే పరిస్థితులు ఇక్కడిదాకా వచ్చేవి కాదు. 1959 లోనే చైనా కారకోరం హైవే ని ప్రారంబించింది. అయినా మనం ఎటువంటి అంతర్జాతీయ ఫోరం కి తీసికెల్లలేదు. మన భూభాగం లో చైనా ఎలా దారినిర్మిస్తుందని మనం ఆరోజే ప్రపంచ దేశాల్లో ప్రచారం చేసివుంటే ఈ దుస్థితి వచ్చేది కాదు. మన అదృష్టం కొద్దీ అది వెంటనే కార్యరూపం దాల్చలేదు. దాదాపు 20 సంవత్సరాలు పట్టింది. ఇంతలో 1962 యుద్ధం రానే వచ్చింది. దీన్ని అదునుగా తీసుకొని 1963లో మన భూభాగం షాక్ షాగం లోయ 5800 చదరపు కిలో మీటర్లు పాకిస్తాన్ తో   ఒప్పందం పేరుతో చైనా వశపరుచుకుంది. అయినా మనమేమీ చేయలేదు. ఎందుకంటే అప్పటికే మనం చైనా చేతిలో దెబ్బతిని వున్నాం. 1984లో షియాచిన్ మంచుప్రాంతాన్ని మన కంట్రోల్ లోకి తీసుకొని ఉండకపోతే చైనా ఆటలకు పూర్తి సానుకూలత దొరికేది. అప్పట్నుంచి చైనా ఇప్పుడు  గొడవలు జరుగుతున్న గోల్వాన్ లోయ నుంచి పైకి దౌలత్ బేగ్ ఒల్డీ దాకా ఆక్రమిన్చుకోవాలనే కుట్రలు పన్నుతూనే వుంది. అలాగే తూర్పు సెక్టర్ లో కూడా మెక్ మహాన్ లైన్ ని ఒప్పుకోకుండా పేచీ పెడుతూనే వుంది. అది టిబెట్ చేసుకున్న ఒప్పందమని మాకు సంబంధం లేదని వాదిస్తుంది. మొత్తం మీద మనకున్న తగాదా అల్లా టిబెట్ – భారత్  సరిహద్దుకి సంబంధించింది. టిబెట్ చైనా లో భాగమని మనం ఒప్పుకోవటమే అసలు సమస్య. టిబెట్ స్వతంత్ర దేశమని మనం ఒక్కమాట మాట్లాడివుంటే అనాధాలైన టిబెటన్లకు పెద్ద ఊరట కలిగేది. వ్యూహాత్మకంగా చూసినా మనకు వచ్చిన లాభం ఏమీలేదు.

చైనా డెంగ్ షియావోపింగ్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్ధికంగా బలపడి ప్రపంచం లో అమెరికా తర్వాత ఇంకో పవర్ సెంటర్ గా తయారయ్యింది. ఇటీవలికాలం లో ఇంకో నయా వలసవాద దేశంగా మారింది. భారత్ చుట్టూ సైనిక స్థావరాలు ఏర్పరిచి మన భద్రతకి ముప్పుగా పరిణమించింది. ముఖ్యంగా పాకిస్తాన్ మనపై చెలరేగటానికి కొండంత అండగా నిలిచింది. ఒకవైపు నేపాల్ ని రెచ్చగొడుతుంది. ఎప్పట్నుంచో సాంస్కృతిక, చారిత్రిక సంబంధాలున్న నేపాల్ ని రెచ్చగొట్టటం లో సోదర కమ్యూనిస్టుల సహాయం తీసుకొని వ్యూహాత్మకంగా వ్యవహరించింది. చైనా ఈరోజు భారత్ కి పెద్ద ముప్పుగా పరిణమించింది.

అదేసమయం లో మనమూ వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. ఆవేశం పాలు కన్నా , బుద్ధిబలం తో పరిస్థితుల్ని అధిగమించటానికి ప్రయత్నం చేయాలి. మనం 20 వీర సైనికుల్ని పోగుట్టుకున్న మాట నిజమయినా చైనా తో తక్షణ యుద్ధాన్ని కోరుకోకూడదు. వాళ్ళ ఎత్తులకు పై ఎత్తులు వేయాలి. సంప్రదింపుల అవకాశాన్ని వదులుకోకూడదు. అదేసమయం లో మన భూభాగం విషయం లో రాజీ పడకూడదు. చివరిదాకా యుద్ధాన్ని నివారిస్తూనే రాజీ పడకుండా డీల్ చేయాలి. చైనా కన్నా మనం తెలివితేటల్లో తక్కువేమీ కాదని నిరూపించాలి. ప్రపంచానికి చైనా ఎలా ప్రపంచ శాంతికి విఘాతంగా తయారయ్యిందో, పాకిస్తాన్, ఉత్తర కొరియా దేశాలకు ఎలా వెన్నుదన్నుగా వుందో చెబుతూ చైనా ని అడ్డుకట్ట వేసే వ్యూహాలకు పడునుపెట్టాలి.

ఇప్పటికే ప్రపంచం లోని ప్రజాస్వామ్య దేశాలు చైనా కి వ్యతిరేకంగా నిలబడ్డాయి. మనం కూడా వాటితో చేయి కలపాలి. ఇప్పటి పరిస్థితుల్లో ఇంతకన్నా వేరే మార్గం లేదు. చైనా ని డీ కొట్టే అధునాతన ఆయుధాలు కావాలన్నా ఈ కొత్త సంఘటన లో చేరక తప్పదు. మెల్లి మెల్లిగా చైనా ప్రభావం నుండి బయటపడాల్సివుంది. చైనా అధీనంలోని ఆసియా బ్యాంకులో మనం రెండో అతిపెద్ద వాటా దారయినా చైనా 26 శాతం పైన వాటాతో వీటో అధికారాన్ని కలిగివుంది. అలాగే షాంఘై కూటమి పై కూడా పునర్విచారణ చేయాల్సి వుంది. మన జియో పొలిటికల్ వ్యూహాన్ని కొత్త పంధాలో నడిపించాలి. అలా అయితేనే చైనా దిగివస్తుంది. మన బలం చాలనప్పుడు ఇదొక్కటే మార్గం. ఈ లోపు మనం ఆర్ధికంగా బలపడటం ఒక్కటే శాశ్వత పరిష్కారం. మనం బలంతోనే చైనా ని ఎదుర్కోగలం. మిగతా పొరుగు దేశాల్ని బెదిరించినట్లు భారత్ ని బెదిరించి లొంగ దీసుకోవటం సాధ్యం కాదని చైనా  గ్రహించినప్పుడే అది మనతో శాశ్వత సంధికి వస్తుంది. అప్పటివరకూ మనం స్వతంత్ర వ్యూహాలతో ముందుకు వెళ్ళాల్సిందే.

నేతల గుండెల్లో కరోనా గుబులు..!


తెలంగాణలో కరోనా మహ్మమరి పంజా విసురుతోంది. గడిచిన పదిరోజులుగా తెలంగాణలో కరోనా కేసులు భారీగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో లాక్డౌన్ విధించిన తొలినాళ్లలో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడంతో కరోనా కేసులు అదుపులోనే ఉండేవి. అయితే ఇటీవల లాక్డౌన్లో భారీ సడలింపులు ఇవ్వడంతో రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. గతంలోని కరోనా కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే ఎక్కువగా నమోదయ్యేవి. తాజాగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కరోనా కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

లాక్డౌన్లో సడలింపు ఇచ్చాక తెలంగాణలో పలు పార్టీలకు చెందిన నాయకులు పర్యటనలతో హడావుడి చేశారు. నియోజకవర్గాల్లో పర్యటిస్తూ పలు పనులకు శ్రీకారం చుట్టారు. నేతల రాకతో నియోజకవర్గాల్లోని పార్టీ శ్రేణులు భారీగా పాల్గొనడంతో సోషల్ డిస్టెన్స్ గాలికొదిలేశారు. దీంతో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. తాజాగా తెలంగాణలోని ముగ్గురు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్ రావడంతో నేతల గుండెల్లో గుబులు పుట్టింది. దీంతో నేతలంతా తమ ఇంటికే పరిమితమవుతోన్నారు. అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్లడం లేదు. ఏదైనా పనులు అవసరమైతే ఫోన్లోనే సంప్రదించాలని నేతలు నియోజకవర్గ ప్రజలకు సూచిస్తున్నారని సమాచారం.

లాక్డౌన్ అనంతరం పెద్దసంఖ్యలో వైద్యులు, పోలీసులు, జర్నలిస్టులు, పారిశుధ్య కార్మికులు కరోనా బారినపడటంతో ఆందోళన నెలకొంది. వీరితోపాటు ప్రజాప్రతినిధులు సైతం ఎక్కువ సంఖ్యలో కరోనా బారిన పడుతున్నారు. భౌతిక దూరం పాటించకుండా ప్రజల్లో తిరగడం వల్లనే వీరికి కరోనా సోకుతుందని తెలుస్తోంది. ఎవరీని నుంచి కరోనా సోకుతుందో తెలియకపోవడంతో నేతలంతా ప్రస్తుతం పర్యటనలకు దూరంగా ఉంటున్నారు.

ఇప్పటికే కొందరు అధికార పార్టీ నేతలు కరోనా బారినపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరికొందరు నేతలు వైరస్ బారినుంచి త్రుటిలో తప్పించుకొని హోం క్వారంటైన్ కు పరిమితమయ్యారు. తమను ఎవరు నేరుగా కలిసే ప్రయత్నం చేయద్దని నేతలు సూచిస్తున్నారు. కరోనా భయంతో నేతలంతా నేతలంతా ఇంటి నుంచి పనులు చక్కబెడుతుండటం గమనార్హం.

‘ద్రవ్య’ బిల్లు ఆమోదం పొందకపోవడానికి కారణమెవరు?


శాసన మండలిలో ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదం పొందకుండా చేసింది మీరంటే మీరని అధికార, ప్రతి పక్షాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. మండలిలో జరిగిన పరిణామాలను క్యాష్ చేసుకోవాలని అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. అనూహ్య రీతిలో ద్రవ్య వినిమయ బిల్లుతో సహా ఐదు బిల్లులను ఆమోదించకుండానే శాసన మండలిని డిప్యూటీ ఛైర్మన్ నిరవధిక వాయిదా వేశారు. మండలి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు యనమల రామకృష్ణుడు స్లిప్ రాసి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యంకు పంపడంతోనే ఆయన సభను వాయిదా వేశారని అధికార పక్షం ఆరోపిస్తోంది.

మండలిలో టీడీపీ అనుసరించిన విధానం వల్ల ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందలేదని, వచ్చే నెలలో ఉద్యోగులకు జీతాలు, సామాజిక ఫించన్లు చెల్లించడం సాధ్యం కాదని ఇందుకు టీడీపీ నాయకులే కారణమని శాసన మండలి సభా నాయకుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ చెప్పారు. స్వయంగా ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి చేతులు జోడించి చెప్పినా డిప్యూటీ ఛైర్మన్, టీడీపీ ఎమ్మెల్సీలు వినిపించుకోకుండా మండలిని నిరవధిక వాయిదా వేశారన్నారు.

మరోవైపు శాసన మండలిలో ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందకుండా ఉండటానికి వైసీపీ మంత్రులే కారణమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు ఆరోపించారు. ఆర్థిక మంత్రి బుగ్గన ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెట్టేందుకు సిద్ధమై ఆయన సీటు నుంచి లేచి పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెనక్కి లాగి ఆర్ధిక మంత్రి కూర్చో పెట్టారని తెలిపారు. ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం కంటే మంత్రులకు పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులే ముఖ్యం అయ్యాయని అందుకే ఈ పరిస్థితి నెలకొందన్నారు.

ఈ క్రమంలో సభలో జరిగిన గందరగోళానికి కారణం ఎవరనే విషయం తెలియాలంటే మండలిలో జరిగిన అంశాలను చిత్రీకరించిన వీడియో రికార్డులే ఆధారం. మండలి నిబంధనల ప్రకారం వీటిని బయటకు విడుదల చేసే అవకాశం లేదు. దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎవరికి అనుకూలంగా వారు చెప్పుకుంటున్నారు. దీంతో సభలో ఎం జరిగిందనేది అంశంపై సర్వత్రా చర్చ జరుగుతుంది.