Home Blog Page 8442

టీడీపీకి షాక్ ఇచ్చిన రెబల్ ఎమ్మెల్యేలు..!


రాజ్యసభ ఎన్నికల్లో ఓట్లు లెక్కింపులో చెల్లకుండా ఓటు హక్కు వినియోగించుకున్న రెబెల్ ఎమ్మెల్యేలు టీడీపీ షాక్ ఇచ్చారు. రాజ్యసభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే విషయంలో టీడీపీ అభ్యర్థికే ఓటు వేసినప్పటికీ అవి చెల్లుబాటు కాకుండా వేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు కరణం బలరాం, మద్దాలి గిరి, వల్లభనేని వంశీమోహన్ ముగ్గురు టీడీపీని వీడి వైసీపీతో సన్నిహితంగా ఉంటున్న విషయం విదితమే. టీడీపీ విప్ జారీ చేయడంతోపాటు అందరి ఎమ్మెల్యేలతో పాటు ఈ ముగ్గురికీ నోటీసులు ఇచ్చారు.

సీఎం తీరుపై మండిపడుతున్న నెటిజన్లు..!

నిబంధనల ప్రకారం ఓటింగ్ లో పాల్గొన్నవారు ఎవరికి ఓట్ వేశారో ఆపార్టీ ప్రతినిధికి చూపించాల్సి ఉంటుంది. దీంతో ఎమ్మెల్యేలు టీడీపీ అభ్యర్థికే ఓటు వేసినా అది చెల్లుబాటు కాని విధంగా ఒకటి అని అంకె వేయాల్సిన చోట మొదటి ప్రాధాన్యతా స్థానంలో టిక్ మార్క్ పెట్టడంతో ఆ ఓట్లు చెల్లుబాటు కాకుండా పోయాయి. ఈ విధంగా ఓటు వేయడంతో దీనిపై చర్యలు తీసుకునే అవకాశం టీడీపీకి లేకుండా చేశారు.

చెల్లకుండా ఓటు వేయాలని వైసీపీ ఆదేశాలు ఇవ్వడంతో రెబెల్ ఎమ్మెల్యేలు ఈ విధంగా చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి. రాజ్యసభ ఎన్నికల్లో మొత్తం 175 ఓట్లు ఉండగా 173 మంది ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇ.ఎస్.ఐ స్కామ్ లో అరెస్ట్ అయిన మాజీ మంత్రి అచ్చెన్నాయుడు, క్వారంటైన్ ఉన్న టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఉన్నారు. దీంతో టీడీపీ రాజ్యసభ అభ్యర్థి వర్ల రామయ్యకు 17 ఓటు మాత్రమే లభించాయి. దీంతో ఆయన ఓటమి పాలయ్యారు.

జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో మిక్స్డ్ టాక్..!

పోలింగ్‌ సందర్భంగా ఓ ఎమ్మెల్యే బ్యాలెట్‌ పేపర్‌పై రాసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారాయి. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తీరును ప్రశ్నించే విధంగా ఆ వ్యాఖ్యలు ఉన్నాయి. ‘గెలిచేటప్పుడు చంద్రబాబు కులానికి, ఓడిపోయేటప్పుడు దళితులకు ఇచ్చేది?’ అని బ్యాలెట్‌ పేపర్‌పై రాశారు. అయితే అలా రాసిన ఎమ్మెల్యే ఎవరనేది ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. మరోవైపు జనసేన ఎమ్మెల్యే రాపాక రాంప్రసాద్ ఈ ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. తాను జనసేనలో ఉన్నానని, తమ ఎవరికి ఓటు వేయాలో చెప్పకపోవడంతో నాకు ఇష్టమైన వ్యక్తికి ఓటు వేశానని చెప్పారు.

చైనా ఎఫెక్ట్.. బాలీవుడ్ స్టార్లపై మండిపడుతున్న నెటిజన్లు..


బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య బాలీవుడ్లో సంచలనం సృష్టించిన సంగతి తెల్సిందే. సుశాంత్ ఆత్మహత్యను ఆయన అభిమానులు, నెటిజన్లు ఇప్పట్లో మర్చిపోయేలా కన్పించడం లేదు. ఈ విషాదం కొనసాగుతుండగానే భారత్-చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో భారత జవాన్లు 20మంది వీరమరణం పొందారు. ఈ సంఘటనను సుశాంత్ అభిమానులు, మద్దతుదారులు బాలీవుడ్ స్టార్లకు లింకు పెడుతూ సోషల్ మీడియాలో ఫైరవుతోన్నారు.

హైకోర్టు మాట కేసీఆర్ ఎందుకు వినడం లేదు?

భారత జవాన్ల మృతి నేపథ్యంలో యావత్ దేశం చైనా వస్తువులను బైకాట్ చేయాలని నినదిస్తోంది. ఈనేపథ్యంలోనే ఇండియాలో చైనా కంపెనీ వస్తువులకు బ్రాండ్ అంబాసిడర్లు వ్యవహరిస్తున్న పలువురు బాలీవుడ్ స్టార్లపై నెటిజన్లు మండిపడుతున్నారు. తక్షణమే చైనా వస్తువులకు చేస్తున్న ప్రమోషన్లను బాలీవుడ్ స్టార్లు ఆపేయాలని లేకుంటే వారిని సైతం బైకాట్ చేస్తామంటూ హెచ్చరిస్తున్నారు.

సీఎం తీరుపై మండిపడుతున్న నెటిజన్లు..!

కాగా బాలీవుడ్ హీరోలు అమీర్ ఖాన్ వీవో, రణ్‌బీర్ కపూర్ ఒప్పో, రణ్‌వీర్ సింగ్‌ షావోమి, సల్మాన్ ఖాన్ రియల్‌మీ, క్రికెటర్ విరాట్ కోహ్లీ వివో ఐక్యూ బ్రాండ్లకు ప్రచారం చేస్తున్నారు. వీరితోపాటు బిగ్ బీ అమితాబ్ సహా పలువురు సెలబెట్రీలు చైనాకు చెందిన ఎలక్ట్రానిక్ ఇతర వస్తువులకు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉంటున్నారు. చైనా కంపెనీలకు ప్రచారం చేస్తున్న స్టార్లు ఇకపై ప్రచారం చేయద్దని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) కోరుతోంది. సుశాంత్ ఆత్మహత్య నేపథ్యంలో ఇప్పటికే బాలీవుడ్ స్టార్లపై ఫైరవుతున్ననెటిజన్లు చైనా ఇష్యూ నేపథ్యంలో మరోసారి వారిపై సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

హంకాంగ్, తైవాన్ లో శ్రీరాముడి ఫొటో వైరల్.. ఎందుకంటే?


భారత్-చైనా సరిహద్దుల్లో సోమవారం రాత్రి ఇరుదేశాల మధ్య ఘర్షణ జరిగిన సంగతి తెల్సిందే. ఈ ఘర్షణలో ఇరుదేశాలకు చెందిన సైనికులు మృత్యువాత పడ్డారు. భారత జవాన్లు 20మంది వీరమరణం పొందగా చైనా సైనికులు 35నుంచి 40వరకు మరణించినట్లు తెలుస్తోంది. చైనా సైనికులను భారత బలగాలు సమర్థవంతం తిప్పికొట్టడంతో డ్రాగన్ కంట్రీని వ్యతిరేకించే దేశాలు పెద్దఎత్తున తమ మద్దతును వ్యక్తం చేస్తున్నారు.

హైకోర్టు మాట కేసీఆర్ ఎందుకు వినడం లేదు?

చైనా దొంగ దెబ్బకు భారత జవాన్లు తగిన గుణపాఠం చెప్పారనే వార్త తెలియడంతో ఆ దేశాన్ని వ్యతిరేకించే తైవావ్, హాంకాంగ్ దేశాలు సంబరాలు చేసుకుంటున్నాయి. ఈ దేశాల్లో ప్రస్తుతం శ్రీరాముడికి సంబంధించిన ఓ ఫొటో వైరల్ అవుతోంది. హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరాముడు డ్రాగన్‌(చైనా దేశపు లోగో)పైకి బాణాన్ని ఎక్కుపెట్టిన ఫొటోను సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తూ తమ మద్దతును ప్రకటిస్తుండటం విశేషం.

తొలుత ఈ ఫొటోను హాంకాంగ్‌కు చెందిన ప్రముఖ సోషల్ మీడియా సైట్ LIHKGలో షేర్ చేసింది. దీనిని ట్విటర్ యూజర్ హోసైలీ దాన్ని షేర్ చేశారు. దీనిని తైవాన్‌కు చెందిన తైవాన్ న్యూస్.కామ్ ‘ఫొటో ఆఫ్ ది డే’ అంటూ ప్రముఖంగా కథనాన్ని ప్రచురించింది. జూన్ 16న పోస్ట్ చేసినప్పటి నుంచి 2,600 రీట్వీట్లు.. 7,600 లైక్‌లు వచ్చాయి. ఇక భారత్ ఈ ఫొటో ఎలా వైరల్ అవుతోందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చైనా దురాగతాలపై హాంకాంగ్‌, తైవాన్ దేశాల్లో తీవ్ర వ్యతిరేకతలు వ్యక్తం అవుతున్నాయి. ఒకవేళ చైనా, భారత్ మధ్య యుద్ధం వస్తే భారతదేశమే గెలువాలని చాలాదేశాలు కోరుకుంటున్నాయని ఈ ఫొటో చూస్తే ఇట్టే అర్థమైపోతుంది.

హిట్ డైరెక్టర్ కి ఛాన్స్ వస్తోందా ?


నేచురల్ స్టార్ నాని నిర్మాతగా విశ్వక్ సేన్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలను తెరకెక్కించిన క్రైమ్ థ్రిల్లర్ ‘హిట్’ సినిమా డీసెంట్ రివ్యూస్ తో పాటు డీసెంట్ కలెక్షన్స్ తో మంచి హిట్ అనిపించుకుంది. శైలేష్ కొలను అయితే నెక్స్ట్ ‘హిట్ 2’ తీస్తానని అంటూనే అవకాశం వస్తే నానిని కూడా డైరెక్ట్ చేస్తానని మనసులో మాటను ఇప్పటికే బయటపెట్టాడు, ఎలాగూ మంచి కథతో వస్తే కొత్తవారైనా సరే కలిసి పనిచేయడానికి ఉత్సాహం చూపుతుంటారు నాని.

సీఎం తీరుపై మండిపడుతున్న నెటిజన్లు..!

మరి అలాంటిది తన నిర్మాణంలోనే దర్శకుడిగా పరిచయమై మొదటి సినిమాతోనే ప్రూవ్ చేసుకున్న, తనతో సినిమా చేయాలని ఆశపడుతున్న శైలేష్ కొలనుకు నేచురల్ స్టార్ సినిమా ఛాన్స్ ఎందుకు ఇవ్వకూడదు. ఇచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీలో ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం నానికి శైలేష్ ఒక లైన్ చెప్పారని.. ఫుల్ స్క్రిప్ట్ చేసుకొని రమ్మని నాని, శైలేష్ కి చెప్పినట్లు తెలుస్తోంది.

రాహుల్ గాంధీ.. మరోసారి నవ్వులపాలు!

ఒకవేళ శైలేష్ స్క్రిప్ట్ నానికి నచ్చితే శైలేష్ కొలనుకు నాని ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. పైగా హిట్ సినిమాని చక్కగా రూపొందించి శైలేష్ కొలను ప్రేక్షకుల్లో మంచి మార్కులే తెచ్చుకున్నాడు. నాని సైతం శైలేష్ తన నమ్మకాన్ని నిలబెట్టింనందుకు సంతృప్తిగా ఉందని మీడియా సమక్షంలోనే చెప్పారు. మరి నాని నుండి శైలేష్ ఛాన్స్ కొట్టేసే అవకాశమే ఎక్కువ ఉంది.

ఎన్టీఆర్ తో ‘మోహన్ లాల్’ రాజకీయాలు !


అయినను పోయి రావలె హస్తినకు’ అంటూ జూనియర్ ఎన్టీఆర్ తో గురూజీ త్రివిక్రమ్ తన తర్వాతి సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం గురూజీ నేటి భిన్నమైన రాజకీయ నేపథ్యం ఎంచుకున్నారట. సినిమాలో రాజకీయాలతో పాటు ఓ సామాజిక అంశాన్ని కూడా ప్రధానంగా ప్రస్తావించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో మలయాళీ స్టార్ మోహన్ లాల్ కోసం త్రివిక్రమ్ ఓ కీలక పాత్రను రాస్తున్నాడట. అది పక్కా రాజకీయ నాయకుడి పాత్ర అని, ఎన్టీఆర్ పాత్ర కూడా రాజకీయాలకి ముడిపడి ఉంటుందని.. పైగా ఎన్టీఆర్ పాత్రను పక్కా బిజినెస్ మైండెడ్ గా ఉండేలా రాస్తున్నాడట త్రివిక్రమ్.

ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. అందులో ఒక హీరోయిన్ ను బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ను తీసుకోవాలని మేకర్స్ ఫీల్ అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరో కథానాయికగా నివేదా థామస్ ను తీసుకోవాలనే యోచనలో ఉన్నారట త్రివిక్రమ్. ‘జై లవకుశ’లో ఎన్టీఆర్, నివేదా థామస్ ల జోడీ చాలా బాగా కుదిరింది.

అందుకే మళ్లీ ఆమెనే రిపీట్ చేయాలని త్రివిక్రమ్ అనుకుంటున్నారని టాక్. మరి నివేదా థామస్ ఫైనల్ అవుతుందో లేదో తెలియాలంటే కొంత వెయిట్ చేయాల్సిందే. హారికా హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అన్నికుదిరితే డిసెంబర్ నుండి షూటింగ్ మొదలుపెట్టాలని చూస్తున్నారు. అన్నట్టు ఈ సినిమా 2021 సమ్మర్ లో విడుదల కానుంది.

టాలెంటెడ్ హీరోకి సెకెండ్ హాఫ్ లో మెమరీ లాస్ !


టాలెంటెడ్ హీరో నిఖిల్ తన కెరీర్ లోనే క్రేజీ మూవీగా చేస్తోన్న మూవీ ’18 పేజెస్’. మొదటి నుండి కమర్షియల్ ఫార్ములాకు దూరంగా కాన్సెప్ట్ ఒరియెంటెడ్ కథల్నే ఎంచుకుంటూ హిట్స్ అందుకుంటూ వస్తున్న నిఖిల్… ఈ చిత్రం కూడా అలాగే వైవిధంగా ఉంటుందని.. హీరో పాత్ర మెమోరీ మెమరీ లాస్ సమస్యతో సఫర్ అవుతూ ఉంటుందని ఇప్పటికే రూమర్స్ వినిపించాయి. అయితే ఈ మెమరీ లాస్ అనేది సెకెండ్ హాఫ్ లో మాత్రమే వస్తోందట. హీరో పాత్ర ఆ సమస్యతోనే విలన్స్ ను ఎలా ఎదురుకున్నాడు అనే కోణంలో సినిమా సాగుతుందట.

అయితే ఇప్పటికే ఈ ఫార్ములా మీద తెలుగులో కొన్ని చిత్రాలు వచ్చినా ఈ కథ కొత్తగా ఉంటుందట. అంతేకాదు ఇందులో మంచి లవ్ స్టోరీ కూడా ఉంటుందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని పల్నాటి సూర్యప్రతాప్ డైరెక్ట్ చేయనుండగా గీతా ఆర్ట్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా అనూ ఇమాన్యుల్ ను తీసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి.

మరోవైపు చందూ మొండేటి దర్శకత్వంలో నిఖిల్ చేయనున్న ‘కార్తికేయ 2’ సినిమా కూడా షూట్ కి రెడీ అవుతుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ ను తీసుకున్నారు. ఈ చిత్రాన్ని ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్నారు. కాగా స్క్రిప్ట్ లో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అలాగే హిస్టారికల్ కి సంబంధించిన ఓ కాస్పెక్ట్ హైలెట్ అవునున్నాయట.

హైకోర్టు మాట కేసీఆర్ ఎందుకు వినడం లేదు?


చిత్తం శివుడి మీద.. భక్తి చెప్పుల మీద ఉండడం అంటే ఇదేనేమో.. పైకి ఎంతో భక్తి ప్రవత్తులతో మెయింటేన్ చేస్తుంటాడు సీఎం కేసీఆర్. హైకోర్టు ఆదేశాలను తూ.చా. తప్పకుండా పాటిస్తాం అంటాడు. కానీ అదే హైకోర్టు ఆదేశించినా పెడచెవిన పెడుతుంటాడని రాజకీయ వర్గాల్లో విమర్శలున్నాయి. కరోనా ఉదంతంలో కేసీఆర్ నిర్లక్ష్యంపై ఎన్ని సార్లు తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు హెచ్చరించినా ఆ నోట వింటూ ఈ నోటూ వదిలేస్తూ కేసీఆర్ సర్కార్ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

కరోనాను ఖతం చేయడమే లక్ష్యంగా తెలంగాణ సీఎం కదిలినప్పుడు అందరూ ఆహోఓహో అంటూ జబ్బలు చరుచుకున్నారు. మొదట్లో హడావుడి చేసిన కేసీఆర్.. రోజు విడిచి రోజూ.. రెండు రోజులకు ఒకసారి కరోనాపై ప్రెస్ మీట్లు పెడుతుంటే జనాలు టీవీలకు అతుక్కుపోయేవారు. కేసీఆర్ కరోనా జాగ్రత్తల గురించి చెబుతుంటే నిక్కబొడుచుకొని వినేవారు. చికెన్ తో కరోనా సోకదని.. అతి తింటేనే తగ్గుతుందని కేసీఆర్ చెబితే అందరూ చికెన్ కోసం ఎగబడ్డ తీరు చూశాం.. రేపటికి, ఎల్లుండికి .. ఫలానా డేట్ కు తెలంగాణ కరోనా ఫ్రీ రాష్ట్రం అవుతుందని కేసీఆర్ ఊహలు చెబుతుంటే వినసొంపుగా విన్నాం.. కానీ ఏమైందీ.. ఇప్పుడు కేసీఆర్ ప్రెస్ మీటే బంద్ అయిపోయింది. తెలంగాణలో కరోనా కంట్రోల్ తప్పింది.. విచ్చలవిడిగా సోకుతోంది. తెలంగాణ ఎమ్మెల్యేలకు కూడా పాకింది. దీంతో కేసీఆర్ సర్కార్ కరోనాను కంట్రోల్ చేయడం మానేసిందని.. చేతులెత్తేసిందన్న ప్రచారం ఎక్కువైంది.

ఇటీవల తెలంగాణ హైకోర్టు కూడా ఇదే మాట అంది. తెలంగాణ సర్కారుపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. కేసీఆర్ సర్కార్ నిస్సహాయత, నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపాయి. తాజాగా హైకోర్టు ‘కరోనాను ఎదుర్కొనే సన్నద్ధత తెలంగాణ ప్రభుత్వంలో కనిపించట్లేదని.. వైరస్ నియంత్రణపై సర్కార్ కు ఆసక్తి ఉత్సాహం పోయిందని’ ఘాటు వ్యాఖ్యలు చేసింది. తెలంగాణ ప్రభుత్వం ధోరణి చూస్తుంటే ప్రజలే ఎవరి జాగ్రత్తలు వారు తీసుకోవాలన్నట్టు కనిపిస్తోందని సంచలన వ్యాఖ్యలు హైకోర్టు చేసింది. పరీక్షలు తక్కువ చేస్తే తీవ్రత ఎలా తెలుస్తుందని ప్రశ్నించింది. తమ ఆదేశాలను తెలంగాణ సర్కార్ పట్టించుకోవడం లేదని.. గాంధీలో జూనియర్ డాక్టర్లు సమ్మె చేయడం పరిస్థితికి అద్దం పడుతోందని హైకోర్టు టీ సర్కార్ పై ఘాటు వ్యాఖ్యలు చేసింది.

భారతదేశవ్యాప్తంగా కరోనా టెస్టులు విపరీతంగా చేస్తున్నారు. పక్కనున్న ఏపీలోనూ రోజుకు 10వేల చొప్పున టెస్టులు చేస్తున్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం లక్షణాలు బయటపడ్డ వారికి మాత్రమే టెస్టులు చేసి వారికి కరోనా చికిత్సలు అందిస్తోంది. దీనివల్ల తమలో కరోనా ఉందో లేదో తెలియక వారు బయట తిరుగుతూ అందిరీకీ అంటించేస్తున్నారు. దీనిపై హైకోర్టు తెలంగాణలో విస్తృతంగా పరీక్షలు చేయాలని సూచించినా పట్టించుకోవడం లేదు. హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ చేసింది. కరోనా వైరస్ కు సంబంధించిన కీలక సమాచారం మీడియా బులిటెన్ లో ఉండాలని స్పష్టం చేసింది.బులెటిన్ లో ఖచ్చితంగా వివరాలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. జీహెచ్ఎంసీ పరిధిలోనే ఎక్కువ కరోనా కేసులు నమోదవుతున్నందున వార్డుల వారీగా కేసుల వివరాలు ప్రకటించాలని.. తద్వారా ప్రజలు అప్రమత్తమవుతారని ఆదేశాలు జారీ చేసింది. ఈ విచారణకు రాష్ట్ర పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ , గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ హాజరయ్యారు. డాక్టర్లకు, పోలీసులకు పీపీఈ కిట్లు, మాస్కులు, రక్షణ పరికరాలు ఇవ్వాలని ఆదేశించింది. వార్డుల వారీగా కేసులు వెల్లడించి ఆయా కాలనీ సంఘాలకు ఇవ్వాలని స్పష్టం చేసింది. అంతేకాదు.. రాష్ట్ర వ్యాప్తంగా ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ నిర్వహించాలంటూ హైకోర్టు సూచించింది. ఈనెల 29లోగా దీనిపై నివేదిక సమర్పించాలని సూచించింది. ఇన్ని ఆదేశాలు ఇచ్చినా కేసీఆర్ సర్కారులో ఇప్పటికీ ఉలుకు లేదు.. పలుకు లేదు అన్నట్టు వ్యవహరిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ ఒక్క ఉదాహరణే కాదు.. తెలంగాణలో వివిధ పథకాలు, వ్యవస్థాగత లోపాలపై హైకోర్టు ఎన్నో సార్లు కీలక సూచనలు చేసినా కేసీఆర్ సర్కార్ పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. కొత్త సచివాలయం, కొత్త అసెంబ్లీ సమయంలోనూ కేసీఆర్ కు హైకోర్టులో చుక్కెదురైంది. అయినా కూడా మొండి పట్టుదలతో కేసీఆర్ సర్కార్ వాటి విషయంలో ముందుకు వెళుతూనే ఉంది.

ఇక ఆర్టీసీ ప్రైవేటీకరణ విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు అప్పట్లో షాకిచ్చింది. కోర్టు ఉత్తర్వులు ఇచ్చే వరకు తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ రూట్లను ప్రైవేటీకరించేందుకు అవకాశం లేకుండా చేసింది. కానీ కేసీఆర్ సర్కారు ఆర్టీసీ లో కీలక సంస్కరణలు చేసి పని కానిచ్చేసింది. ఇక ముగ్గురు ఎమ్మెల్సీల అనర్హత విషయంలోనూ కేసీఆర్ కు హైకోర్టు షాకిచ్చింది. వారి రద్దును అన్యాయమని చెప్పింది. ఇలా ఒక్కటేమిటీ కేసీఆర్ సర్కార్ నిబంధనలకు విరుద్ధంగా చేసిన ఎన్నో పనులకు హైకోర్టు ఆగ్రహాలు, ఆదేశాలు వెలువరిస్తూనే ఉంది. కానీ కేసీఆర్ సర్కార్ మాత్రం అప్పుడే అమలు చేసినట్టు కలరింగ్ ఇవ్వడం అందరూ మరిచిపోయాక దాన్ని పెడచెవిన పెట్టడం చేస్తూనే ఉంది. ఎవరూ ఎన్ని చెప్పినా కేసీఆర్ మాత్రం తాను అనుకున్నది మాత్రమే చేసేలా ఉన్నట్టు కనిపిస్తోంది.

ఏపీలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు..!


రాష్ట్రంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగితుంది. గడచిన 24 గంటల్లో అత్యధికంగా 376 కేసులు నమోదు అయ్యాయి. కరోనా వైరస్ ప్రభావం ఏపీలో ప్రారంభమైన నాటి నుంచి ఎంత పెద్ద మొత్తంలో పాజిటివ్ కేసుల నమోదు కావడం ఇదే మొదటి సారి. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 6,230 మందికి వైరస్ సోకగా 3,066 మంది చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. 3,069 మంది వివిధ కోవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. కృష్ణా జిల్లాలో ఇద్దరు, ప్రకాశం జిల్లాలో ఒకరు, శ్రీకాకుళం జిల్లాలో ఒకరు చొప్పున మొత్తం నలుగురు మృతి చెందడంతో ఇప్పటి వరకూ మృతుల సంఖ్య 96కు చేరింది.

సీఎం తీరుపై మండిపడుతున్న నెటిజన్లు..!

ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చిన వారితో కలిపి కొత్తగా 465 కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకూ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 1,423 మందికి వైరస్ సోకగా, విదేశాల నుంచి వచ్చిన వారిలో 308 పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,961కి చేరాయి. ప్రస్తుతం కరోనా సోకి చికిత్స అనంతరం రికవరీ అయిన వారి సంఖ్య కంటే చికిత్స పొందుతున్న వారి సంఖ్య అధికం అయ్యింది.

రాహుల్ గాంధీ.. మరోసారి నవ్వులపాలు!

కరోనా ప్రభావం అధికంగా ఉన్న జిల్లాల్లో భాదితుల సంఖ్య వెయ్యి దాటిన కర్నూలు జిల్లా మొదటి స్థానంలో ఉండగా, కృష్ణ జిల్లా రెండవ స్థానంలో, గుంటూరు జిల్లా మూడవ స్థానంలో, అనంతపురం జిల్లా నాల్గవ స్థానంలో ఉన్నాయి. కరోనా పరీక్షల విషయానికి వస్తే గడచిన 24 గంటల్లో 17,609 శాంపిల్ టెస్టులు చేశారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో చేసిన మొత్తం టెస్టుల సంఖ్య 6,30,006 పూర్తి చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

సినిమా కోసం మెగా అల్లుడు..?


మెగాస్టార్ చిరంజీవి చిన్న అల్లుడు ‘కళ్యాణ్ దేవ్’ హీరోగా, డైలాగ్ రైటర్ ‘శ్రీధర్ సీపాన’ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కథ పట్ల వైష్ణవ్ తేజ్ చాలా ఇంప్రెస్ అయ్యారు. అందుకే కథలో మరింత ఆకర్షణీయంగా కనబడటం కోసం లుక్ మార్చుకుంటున్నాడని.. లాక్ డౌన్ తో వచ్చిన ఖాళీ సమయంలో ఇప్పటికే బరువు తగ్గే వర్కవుట్స్ మొదలుపెట్టాడని.. అందుకోసం ఆర్గానిక్ థెరపీ ఫాలో అవుతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. కరోనా ప్రభావం ముగియగానే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉంది. ఇందులో దేవ్ సరసన అవికా ఘోర్ కథానాయకిగా నటిస్తుందట.

అయితే ఈ సినిమాలోని ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలు గురించి ఇంకా తెలియాల్సి ఉంది. ‘జిఏ 2 పిక్చర్స్’ సమర్పణలో నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, వివేక్ కూచిభొట్ల ఈ సినిమాని నిర్మిస్తున్నారు. పూలరంగడు, భీమవరం బుల్లోడు, లౌక్యం వంటి పలు హిట్ చిత్రాలకు కథ, మాటలు అందించిన ‘శ్రీధర్ సీపాన’ మరి ఈ సినిమా కోసం ఎలాంటి కథాకథనాలను వాడేరో చూడాలి.

ఇక కల్యాణ్ దేవ్ హీరోగా ‘విజేత’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకున్నే ప్రయత్నం చేశాడు. అయితే ఆ చిత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు. కళ్యాణ్ దేవ్ మాత్రం నటనలో మంచి ప్రతిభను కనబరిచాడు. ప్రస్తుతం ‘కళ్యాణ్ దేవ్’ నూతన దర్శకుడు పులి వాసు దర్శకత్వంలో తన రెండువ చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ సినిమా రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందుతుంది. ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.

సీఎం తీరుపై మండిపడుతున్న నెటిజన్లు..!


భారత్-చైనా సరిహద్దులో జరిగిన ఘర్షణలో 20మంది భారత జవాన్లు వీరమరణం పొందిన సంగతి తెల్సిందే. వీరిలో తెలంగాణకు చెందిన సంతోష్ బాబు ఉన్నారు. సూర్యాపేట జిల్లాకు చెందిన సంతోష్ బాబు ఆర్మీలో కల్నల్ స్థాయి హోదాలో విధులు నిర్వహిస్తున్నారు. ఇండో-చైనా బోర్డర్లో సోమవారం జరిగిన రాత్రి జరిగిన ఘర్షణలో సంతోష్ బాబు మృతిచెందిన సంగతి తెల్సిందే. సంతోష్ బాబు పార్థివదేహానికి ప్రభుత్వం అధికార లాంఛనాలతో వీడ్కోలు పలికింది. అయితే వీరజవానుకు నివాళి అర్పించేందుకు సీఎం కేసీఆర్ రాకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతోన్నాయి.

దేశం కోసం ప్రాణాలర్పించిన కల్నల్ సంతోష్ బాబుకు సూర్యాపేట వాసులు కన్నీటితో వీడ్కోలు పలికింది. తెలంగాణ గవర్నర్ తమిళిసై కల్నల్ పార్థీవ దేహానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. మంత్రి కేటీఆర్, ఎంపీ రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు సంతోష్ భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. అయితే స్వతహాగా ఉద్యమకారుడైన సీఎం కేసీఆర్ జవాన్ కుటుంబానికి అండగా ఉంటాయని ప్రకటించారే తప్ప కల్నల్ పార్థీవ దేహానికి నివాళులు అర్పించడానికి వెళ్లలేదు. కేసీఆర్ తీరుపై తెలంగాణ ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

గతంలో ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణ మృతిచెందిన సమయంలో సీఎం కేసీఆర్ స్వయంగా వెళ్లిమరీ అతడి కుటుంబ సభ్యులను పరామర్శించారు.సూపర్ స్టార్ కృష్ణ సతీమణి విజయనిర్మల మృతి చెందినపుడు కూడా సీఎం ఆమె భౌతిక కాయానికి నివాళి అర్పించారు. కృష్ణను దగ్గరకు తీసుకొని ఓదార్చారు. ఇవన్నీ చేసిన కేసీఆర్.. తెలంగాణ గడ్డ మీద పుట్టి, దేశం కోసం అమరుడైన వీరజవానుకు నివాళి అర్పించే తీరిక లేకుండా పోయిందా? అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. సినిమా వాళ్లకు ఇచ్చిన గౌరవం కూడా జవాన్లకు ఇవ్వరా? అంటూ ప్రశ్నిస్తున్నారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ వీరజవాన్ పట్ల ఇలా వ్యవహారిస్తే ఛత్తీస్‌గఢ్‌‌ సీఎం మాత్రం వీరజవాను శవపేటికను భుజాలపై మోసి తన దేశభక్తిని చాటుకున్నారు. చైనాతో జరిగిన ఘర్షణలో సంతోష్ బాబుతోపాటు ఛత్తీస్‌గఢ్‌‌కు చెందిన జవాన్ గణేశ్ రామ్ కుంజామ్ కూడా అమరుడయ్యాడు. దీంతో గణేశ్ రామ్ భౌతికకాయం వద్ద సీఎం భూపేశ్ భాగేల్ అంజలి ఘటించడంతోపాటు అతడి శవపేటికను తన భుజాలపై మోశారు. అమర జవాన్ కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. దేశం కోసం ప్రాణం అర్పించిన వీరజవాన్ల పట్ల ఏవిధంగా వ్యవహరించాలో ఛత్తీస్‌గఢ్‌‌ సీఎం ను చూసి కేసీఆర్ నేర్చుకోవాలని నెటిజన్లు హితవు పలుకుతున్నారు.

రాహుల్ గాంధీ.. మరోసారి నవ్వులపాలు!


తప్పుల మీద తప్పులు కాంగ్రెస్ రారాజు కొంప ముంచుతున్నాయి. ఇప్పటికే బీజేపీ సహా ప్రతిపక్షాలు ఆయనను ‘పప్పు’ అంటూ విమర్శిస్తున్నాయి. జాతీయ రాజకీయాల్లో అగ్రస్థానంలో ఉన్న రాహుల్ గాంధీ కనీస పరిజ్ఞానం లేకుండా రాజకీయాల్లో ఒక ఫెయిల్యూర్ నాయకుడిగా మిగిలిపోతున్నాడన్న చర్చ జాతీయ స్థాయిలో జరుగుతోంది. మొన్నటి లాక్ డౌన్ వేళ రాహుల్ గాంధీ చేసిన పనులు ఆయనకు మంచి పేరు తీసుకొచ్చాయి. వలస కూలీల వద్దకు స్వయంగా వెళ్లి వారి కష్టాలు తెలుసుకొని వాహనాలు సమకూర్చి మరీ వారి రాష్ట్రాలకు రాహుల్ గాంధీ పంపారు. ప్రాథమిక సమస్యలపై రాహుల్ గాంధీకి ఉన్న అవగాహన సీరియస్ విషయాల్లో కొరవడిందనే అపవాదు ఉంది. ఇప్పుడది నిరూపితమైంది.

చైనాపై సర్జికల్స్ స్ట్రయిక్ తప్పదా?

తాజాగా చైనా-భారత సైనికులు గాల్వాన్ లోయలో ఘర్షణపడ్డారు. ఇందులో 20 మంది భారత సైనికులు వీరమరణం పొందారు. దీనిపై రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ ఆయనను నవ్వుల పాలు చేసింది.ఒక జాతీయ నేత కనీసం పరిజ్ఞానం లేకుండా ఇలా చేయడంతో ఆయన అభాసుపాలయ్యారు. తన అజ్ఞానాన్ని రాహుల్ గాంధీ బయటపెట్టుకున్నట్టు అయ్యింది. భావి ప్రధానిగా కాంగ్రెస్ లో అందరూ అనుకుంటున్న రాహుల్ గాంధీ ఇలా చేయడంపై విమర్శలు చెలరేగాయి.

20 మంది భారత సైనికుల మృతికి నివాళులర్పిస్తూ రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ ఆయన అపరిపకత్వతను తెలియజేసింది. అంతమంది భారత సైనికులు చనిపోతుంటే వారి చేతికి తుపాకులు ఎందుకు ఇవ్వలేదని రాహుల్ గాంధీ డిమాండ్ చేసిన తీరు అందరినీ ముక్కున వేలేసుకునేలా చేసింది. ఒక భారతీయ ఎంపీగా, ఒక జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా చేసిన రాహుల్ గాంధీ భారత్-చైనా వాస్తవాధీన రేఖ వద్ద ఎందుకు తుపాకులు తీసుకెళ్లలేదోనన్న విషయం కూడా అవగాహన లేకపోవడంపై చాలా మంది నెటిజన్లు సెటైర్లు వేశారు.

కవిత ఎన్నిక.. బస్తీమే సవాల్ అంటున్న అన్నదమ్ములు..!

భారత్-చైనా 1962 యుద్ధం తర్వాత రెండు దేశాలు కలిసి సరిహద్దుల్లో తుపాకులు వినియోగించరాదని నిర్ణయం తీసుకున్నాయి. 1980తోపాటు 2005లో కూడా ఈ ప్రొటోకాల్ నిబంధనలను ఇరు దేశాలు ఆమోదించాయి. తుపాకులను ఎవరూ పేల్చరాదని.. సరిహద్దుల్లో వాటిని వినియోగించరాదని ఇరు సైన్యాలు అంగీకరించాయి. ఈ ఒప్పందం స్వయంగా రాహుల్ గాంధీ బామ్మ అయిన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హయాంలోనే ఒకటి జరగడం విశేషం.

తాజాగా రాహుల్ గాంధీ ట్వీట్ కు కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ కౌంటర్ ఇచ్చారు. మీ బామ్మ ఇందిరాగాంధీ హయాంలోనే చైనా సరిహద్దుల్లో తుపాకులు వాడవద్దని నిర్ణయించారని.. మీకు అవగాహన లేకుంటే చరిత్ర తెలుసుకోవాలని రాహుల్ గాంధీని ఎద్దేవా చేశారు.

ప్రధాని కావాలనుకుంటున్న రాహుల్ గాంధీ నోటి నుంచి ఇలాంటి ట్వీట్లు రావడం నిజంగా ఎవ్వరూ ఊహించనది. ఆయనకు తెలియకున్నా.. కనీసం మంచి పరిజ్ఞానం ఉన్న మీడియా మేనేజ్ మెంట్ సలహాదారులను తన సోషల్ మీడియా గ్రూపులో పెట్టుకున్నా ఇలాంటి అపవాదులను ఆయన తప్పించుకునే అవకాశం ఉంటుంది. లేదంటే ఇలానే నవ్వుల పాలు కాకతప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

– నరేశ్ ఎన్నం

బాబుకి బీజేపీ దోస్తీ చాలా అవసరం


ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రతిపక్ష పార్టీ నాయకుల అరెస్టుల పర్వానికి తెరలేపింది. స్వల్ప వ్యవధిలో టీడీపీ కి చెందిన ఇద్దరు బడా నాయకులు అరెస్టు అయ్యారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఎమ్మెల్యే సీనియర్ నాయకుడు అచ్చెన్నాయుడుని ఈ ఎస్ ఐ కుంభకోణం కేసులో సి బి ఐ అరెస్ట్ చేసింది. అలాగే అనంతరపురం మాజీ ఎంఎల్ఏ జె సి ప్రభాకర్ రెడ్డి మరియు అతని కుమారుడు అస్మిత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్ట్ లు వైసీపీ ప్రతీకార చర్య, ప్రతిపక్షాన్ని అణచివేసే ఎత్తుగడ అని టీడీపీ నాయకులు మీడియా వేదికగా గగ్గోలు పెడుతున్నారు. అచ్చెన్నాయుడు అరెస్ట్ విషయంలో బి సి కార్డు తెరపైకి తెచ్చి బీసీ నాయకులతో జగన్ పై గట్టి విమర్శలు చేయించారు. ఫలితం మాత్రం శూన్యం అని చెప్పాలి.

మరో వైపు అమరావతి రాజధాని భూముల విషయంలో జరిగిన అవకతవకలతో సంబంధం ఉన్న అధికారుల అరెస్టులు జరుగుతున్నాయి. టీడీపీ అనుకూల మీడియా ఈ విషయాలపై ఎంత గోల చేసినా, ప్రజల్లో టీడీపీ పై సానుభూతి వస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో జగన్ మరింత దూకుడు నిర్ణయాలు తీసుకొనే ఆస్కారం లేకపోలేదు. గత ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న అనేక మంది నాయకుల అరెస్టులు జరిగే అవకాశం ఉందని సమాచారం ఉంది. మరో వైవు నారా లోకేష్ రేపు నన్ను కుడా అరెస్ట్ చేస్తారు అని, గట్టిగా చెవుతున్నారు.

ఈ నేపథ్యంలో ఆలస్యం చేయకుండా జగన్ కి చెక్ పెట్టాలనేది చంద్రబాబు ఆలోచన. కానీ 23 మంది ఎంఎల్ఏ లు ఇద్దరు ఎంపి లతో చంద్రబాబు జగన్ ని ఎదుర్కోవడం అనేది జరగని పని. ఈ తరుణంలో చంద్రబాబుకి కనిపిస్తున్న ఒకే ఒక ఆశాకిరణం బీజేపీ. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మాత్రమే జగన్ ని కంట్రోల్ చేయగలదని చంద్రబాబు భావిస్తున్నాడు. అందుకే ఆయన బీజేపీ తో స్నేహానికి పైరవీలు మొదలుపెట్టారని తెలుస్తుంది. ఇటీవల ఆయన వ్యాఖ్యలు ఇందుకు ఊతం ఇస్తున్నాయి. ఎన్నికలకు ముందు మోడీపై అగ్గిపై గుగ్గిలం అయిన బాబు, రెండు రోజుల క్రితం మోడీతో వ్యక్తిగత విభేదాలు లేవు అన్నారు.

2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాల తరువాత బీజేపీ తో విభేదించకుండా ఉండాల్సింది అని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిన బాబు, తన ఎంఎల్ఏ లను, తనను కాపాడుకోవడానికి బీజేపీతో దోస్తీ కోసం ఎంత వరకైనా వెళ్లొచ్చు. ఒకప్పుడు టీడీపీకి మిత్ర పక్షంగా ఉన్న జనసేన… బీజేపీ పార్టీతో చేతులు కలిపిన నేపథ్యంలో, టీడీపీ మళ్ళీ బీజేపీతో దోస్తీ కడుతుందన్న వాదన కొట్టిపారేయలేం. 2024 ఎన్నికల నాటికి బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పోటీచేసినా, ఒకే వేదికపై ఈ మూడు పార్టీలు కలిసి కనిపించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు .

చైతు ‘లవ్ స్టోరీ’ నా మజాకా ?


బలమైన ఎమోషనల్ కథలతో సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో సెన్సిబుల్ డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు శేఖర్ కమ్ముల. ఇక ఫిదా లాంటి సెన్సేషనల్ హిట్ అందుకున్న తరువాత శేఖర్ కమ్ముల, క్రేజీ కాంబినేషన్ ‘ చైతు – సాయిపల్లవి’లతో లవ్ స్టోరీ అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా శాటిలైట్ రైట్స్ అండ్ ఓవర్సీస్ హక్కులు భారీ ధర పలుకుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు కారణం సినిమా కాంబినేషన్. శేఖర్ కమ్ముల గత చిత్రం ‘ఫిదా’ భారీ బ్లాక్ బస్టర్ అయింది.

కవిత ఎన్నిక.. బస్తీమే సవాల్ అంటున్న అన్నదమ్ములు..!

ఓవర్సీస్ ప్రేక్షకుల్ని కూడా విపరీతంగా ఆకట్టుకుంది. దానికి తోడు సాయి పల్లవి ఇందులో హీరోయిన్. చైతూతో ఆమె నటించడం ఇదే ప్రథమం. అందుకే వీరి జోడీ పై అంచనాలు పెరిగాయి. అందుకే ప్రముఖ ఛానెల్ అమెజాన్ ప్రైమ్ శాటిలైట్ రైట్స్ భారీ మొత్తాన్ని ఆఫర్ చేసిందట. ఇక డిస్ట్రిబ్యూటర్స్ గా ఇప్పటి వరకూ వందలాది సినిమాలను విడుదల చేసిన ఏసియన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ సినిమాతో ఫస్ట్ టైమ్ నిర్మాణ రంగంలోకి దిగుతోంది.

రోజా, రజినీకి షాక్.. వైసీపీలో ఈసారి ఛాన్స్ ఎవరికి?

కాగా ఈ సినిమా జూలై లాస్ట్ వీక్ నుండి షూటింగ్ రెడీ కానుంది. రామోజీ ఫిల్మ్ సిటీలోని ఈ సినిమాలోని కీలక సన్నివేశాలు అన్నిటినీ షూట్ చేస్తారట. ఇప్పటికే కీలక సన్నివేశాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా థియేటర్స్ ఓపెన్ అయినా తరువాత ఆడియన్స్ ముందుకు రానుంది. ఈ సినిమా పై ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలే ఉన్నాయి. పైగా శేఖర్ కమ్ముల ఎంచుకున్న కాస్ట్ కూడా ప్రాజెక్ట్ కు పెద్ద ఎస్సెట్ అయింది.

అరె.. బోల్డ్ డైరెక్టర్ తో బబ్లీ బ్యూటీ.. !


బోల్డ్ డైరెక్టర్ అజ‌య్ భూప‌తి ‘మహా సముద్రం’ అనే సినిమా చేయడానికి ఎప్పటినుండో కిందామీదా పడుతూ సన్నాహాలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే అజ‌య్ భూప‌తి సినిమా నుండి మాస్ మహారాజా రవితేజతో పాటు నాగచైతన్య కూడా తప్పుకోవడంతో.. ఫైనల్ గా అజేయ్, హీరో శర్వానంద్ తో ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. కాగా తాజాగా ఈ సినిమాలో శ‌ర్వానంద్ కి జ‌త‌గా బబ్లీ బ్యూటీ రాశి ఖన్నా నటించబోతుందట. అజ‌య్ ఇప్పటికే రాశి ఖన్నాకి కథ కూడా వివరించార‌ట. రాశి ఖన్నా కూడా సినిమా చేయడానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిందట, ఇవ్వక ఏం చేస్తుందిలే.. అమ్మడుకు అవకాశాలు తగ్గుముఖం పట్టాయి.

కవిత ఎన్నిక.. బస్తీమే సవాల్ అంటున్న అన్నదమ్ములు..!

ఇక ఈ సినిమాలోని మరో హీరో పాత్ర కోసం.. అజయ్ ఫామ్ లో ఉన్న మరో హీరో కోసం ట్రై చేస్తున్నాడు. ఏమైనా “ఆర్ఎక్స్ 100” సినిమాతో సంచలన విజయం సాధించినా.. రెండో సినిమా కోసం మాత్రం అజేయ్ భూపతి బాగా ఎదురుచూడాల్సిన పరిస్థితి. అన్నట్టు ఈ సినిమా ఎకె ఎంటర్ టైన్మెంట్స్ కాంపౌండ్ లోకి వచ్చింది. కరోనా హడావుడి ముగిసాక ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకువెళ్ళనున్నారు.

ఇక ఈ సినిమా పక్కా ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా ఉంటుందట. సినిమాలో సెకెండ్ హీరో పాత్ర చనిపోతుందని.. అలాగే స్టోరీ వరల్డ్ కూడా కాస్త కొత్తగా ఉంటుందని తెలుస్తోంది. ఈ చిత్రం కొరకు పనిచేయనున్న నటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

కవిత ఎన్నిక.. బస్తీమే సవాల్ అంటున్న అన్నదమ్ములు..!


ఒక ఎన్నిక ఇద్దరి అన్నదమ్ముల మధ్య చిచ్చు రేపుతోంది. వైరిపక్షాలుగా ఉన్న అన్నదమ్ములు నువ్వా.. నేనా అని పోటీపడుతున్నారు. అయితే వీరిద్దరు పోటీపడేదీ మాత్రం వారి ఎన్నిక కోసం కాదట. నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ కుమార్తె, మాజీ ఎంపీ కవితను గెలిపించేందుకు ఒకరు ప్రయత్నిస్తుండగా మరికొకరు కవితను ఎలాగైనా ఓడించాలని యత్నిస్తున్నారు. దీంతో నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నిక రసవత్తరంగా మారింది.

తెలంగాణపై పంజా విసురుతున్న కరోనా

రాజ్యసభ్య సభ్యులు డి.శ్రీనివాస్ కుటుంబానికి నిజామాబాద్లో మంచి పట్టుంది. డి.శ్రీనివాస్ కు ఇద్దరు కుమారులు అర్వింద్, సంజయ్. వీరిలో అర్వింద్ కిందటి లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ తరుఫున పోటీచేసి అనుహ్యంగా గెలుపొందారు. ఇక సంజయ్ టీఆర్ఎస్ పార్టీలో ఉంటూ గతంలో నిజామాబాద్ మాజీ మేయర్ గా పని చేశారు. కిందటి లోక్ సభ ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా కవిత గెలుపు నల్లేరుపై నడక అనుకున్న తరుణంలో బీజేపీ నుంచి పోటీచేసిన అర్వింద్ గెలుపొంది టీఆర్ఎస్ కు భారీ షాకిచ్చారు.

తాజాగా నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరోసారి కేసీఆర్ కూతురు కవిత పోటీ చేస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కవిత గెలుపు ఖాయమనే ప్రచారం జరుగుతున్నప్పటికీ గత ఎన్నికల్లో జరిగిన పొరపాట్లు మరోసారి జరుగకుండా జాగ్రత్త పడుతోన్నారు. ఈనేపథ్యంలో టీఆర్ఎస్ నుంచి ధర్మపురి సంజయ్ రంగంలోకి దిగి కవిత గెలుపునకు ఎటువంటి అడ్డంకులు లేకుండా ప్లాన్ చేస్తున్నాడు.

డిగ్రీ, పీజీ విద్యార్థులను కూడా ప్రమోట్ చేస్తారా?

లోక్ సభ ఎన్నికల్లో కవిత ఓటమికి ఇతరులతో కలిసి అర్వింద్ పనిచేశాడు. ఇప్పుడు కూడా ఆ విధంగా చేసే అవకాశం ఉండడంతో టీఆర్ఎస్ అప్రమత్తంగా ఉంది. అందుకే ఎంపీ అరవింద్ కు చెక్ పెట్టేందుకు అతడి సోదరుడు సంజయ్ ను రంగంలోకి దింపింది. ఈమేరకు సంజయ్ బీజేపీ నుంచి పది కార్పొరేట్లను టీఆర్ఎస్ లోకి రప్పించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తనకున్న పాతపరిచయాలతో బీజేపీ కార్పోరేటర్ల భారీ తాయిలాలు ఇస్తుండటంతో ఇప్పటికే నలుగురు కార్పొరేటర్లు కారెక్కినట్లు తెలుస్తోంది. మిగతా వారిని కూడా గులాబీ పార్టీలోకి రప్పించేందుకు సంజయ్ చక్రం తిప్పుతున్నాడని సమాచారం.

కిందటి లోక్ సభ ఎన్నికల్లో కవితకు భారీ షాకిచ్చిన ఎంపీ అర్వింద్ మరోసారి నిజామాబాద్లో తన సత్తాచాటాలని భావిస్తున్నాడు. బీజేపీ కార్పొరేటర్లకు టీఆర్ఎస్ గాలం వేస్తుండటాన్ని గమనించిన అర్వింద్ ఈమేరకు వారితో సమావేశమై భరోసా ఇచ్చారని తెలుస్తోంది. దీంతో బీజేపీ నుంచి కారెక్కేందుకు యత్నించిన కార్పోరేటర్లు తమ ప్రయత్నాన్ని విరమించుకున్నారని సమాచారం.

అర్వింద్ జిల్లాలో రోజురోజుకు బలం పెంచుకుంటూ టీఆర్ఎస్ పార్టీకి తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది. కవిత ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో ఈ ఇద్దరు అన్నదమ్ములు ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు పావులు కదుపుతూ బస్తీమే సవాల్ అంటున్నారు. దీంతో నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నిక రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

మెగాఫోన్‌ పట్టేందుకు రెడీ అవుతున్న హీరోయిన్‌!


‘అలా మొదలైంది’తో తెలుగు తెరకు పరిచమయైన హీరోయిన్‌ నిత్యా మీనన్. కళ్లతోనే అద్భుతంగా నటించే అతి కొద్ది మంది నాయికల్లో ఒకరు. చాలా టాలెంటెడ్‌ నటి ఆమె. ఏ పాత్రలో నటించినా తనదైన ముద్ర వేస్తుందామె. అందుకే తక్కువ సినిమాలే చేసినా మంచి పేరు తెచ్చుకుంది. దీపం ఉన్నప్పుడే ఇళ్లు చక్కబెట్టుకునే హీరోయిన్లకు ఆమె పూర్తి డిఫరెంట్. ఆఫర్లు వస్తున్నాయి కదా అని అన్ని సినిమాలూ ఒప్పుకోదామె. కథతో పాటు తన పాత్ర నచ్చితేనే సినిమాలు అంగీకరిస్తుంది. దక్షిణాది అన్ని భాషలతో పాటు బాలీవుడ్‌కు వెళ్లినా.. ఆమె చేసిన చిత్రాలు తక్కువే. గతకొంతకాలంగా ప్రయోగాత్మక పాత్రలపై దృష్టిసారిస్తోన్న ఆమె దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లో చక్కటి అవకాశాల్ని అందుకుంటోంది.

జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో మిక్స్డ్ టాక్..!

ఇప్పుడు ఆమె మెగాఫోన్‌ పట్టేందుకు సిద్ధమవుతోందని తెలుస్తోంది. తన సొంత కథతోనే ఆమె డైరెక్టర్ గా మారాలని చూస్తోందట. నటనతో పాటు ఆమెకు దర్శకత్వం అంటే చాలా ఇష్టం. షూటింగుల్లో తన సీన్స్ లేనప్పుడు.. కెమెరా వెనుక నిలబడి చిత్రీకరణ తీరును ఆమె పరిశీలిస్తూ ఉంటుంది. ఆ అభిరుచితోనే దర్శకురాలు కావాలని ఆమె నిర్ణయించుకుంది. అందుకు లాక్‌డౌన్‌ బ్రేక్‌ను పూర్తిగా సద్వినియోగం చేసుకుంటోంది. షూటింగ్స్ ఆగిపోవడంతో వచ్చిన బ్రేక్‌లో నిత్యా పలు కథలు రాస్తోందట. వివిధ భాషల్లో తను కమిట్ అయిన చిత్రాలను వచ్చే ఏడాదిలోగా పూర్తిచేసేసి రెండేళ్లలో మెగా ఫోన్ పట్టుకోవాలని ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. కాగా, ఈ మధ్యే ఆమె డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లో అడుగుపెట్టింది. ‘బ్రీత్‌ ఇన్‌ టూ దీ షాడోస్‌’ అనే హిందీ వెబ్‌సిరీస్‌లో నటించింది. జూలై 10న రిలీజ్ కానున్న ఈ సిరీస్‌లో అభిషేక్‌బచ్చన్‌, సయామీఖేర్‌ ఇతర కీలక పాత్రల్ని పోషించారు.

ఒక్క టాలీవుడ్ కే వందల కోట్లు..?


టాలీవుడ్ అందరికీ సినిమాలు చూపిస్తే.. ఇప్పుడు టాలీవుడ్‌ కే సినిమా చూపిస్తోంది కరోనా. కరోనా వైరస్ కారణంగా ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమ మొత్తం చిక్కుల్లో పడింది. టాలీవుడ్‌ లో ఏకంగా 50 సినిమాలు ఆగిపోయాయని ఇండిస్ట్రీ వ‌ర్గాలు చెబుతున్నాయి. దీంతో సుమారు 650 కోట్ల రూపాయల వరకూ పెట్టుబడులు ఇరుక్కుపోయాయ‌ట. రాజ‌మౌళి 300 కోట్ల రూపాయ‌ల ఆర్ ఆర్ ఆర్ ప్రాజెక్ట్, మెగాస్టార్ – ఆచార్య‌, ప్ర‌భాస్ – జాన్, పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌- వ‌కీల్ సాబ్.. ఇలా చెప్పుకుంటూ పోతే పలు ప్రాజెక్ట్‌ల విలువే వందల కోట్ల రూపాయ‌లు ఉంటాయి.

డిగ్రీ, పీజీ విద్యార్థులను కూడా ప్రమోట్ చేస్తారా?

ఈ నేప‌ధ్యంలో సినీ పరిశ్రమ భవిష్యత్ గురించి ఇప్పుడే ఓ అంచనా రావటం కష్టమేనని షూటింగ్స్ కూడా మొదలుపెట్టడానికి భయపడుతున్నారు సినీ పెద్ద‌లు. ప్ర‌తి ఏటా టాలీవుడ్ సుమారు 200 సినిమాలకు పైగా తెరకెక్కుతాయి. లాక్‌ డౌన్ కారణంగా తెలుగు సినీ పరిశ్రమ నష్టాలు ఎంత మేర ఉంటాయనేది ఇప్పుడే అంచనా వేయలేమ‌ని.. ఇది పరిశ్రమకు మాత్రం పెద్ద దెబ్బగా మిగలబోతుందనేది వాస్తవం. ఇక లాక్‌డౌన్ ఎత్తేసినా ఇఫ్పటికిప్పుడు సినిమా హాళ్ళకు అనుమతులు ఇవ్వటం అసాధ్యమే.

చైనాపై సర్జికల్స్ స్ట్రయిక్ తప్పదా?

ఓవరాల్ గా ఒక్క మాటలో చెప్పాలంటే సినీ పరిశ్రమకు సంబంధించి ఒక ఆర్ధిక సంవత్సరం పూర్తిగా పోయినట్లే. సినీ పరిశ్రమ నష్టం ఒకెత్తు అయితే పరిశ్రమ పై ఆధారపడిన, వివిధ శాఖ‌ల్లో పనిచేసే సుమారు ఎనిమిది వేల మంది వరకు ఉపాధి కోల్పోయారు. మ‌రి ఈ క‌రోనా కాలం ఎప్పుడు ముగుస్తుందో, సినిమా కాలం ఎప్పుడు మొద‌ల‌వుతుందో చూడాలి. అయితే సినీ విశ్లేష‌కుల అంచానా ప్రకారం ఇలాగే మరో ఆరు నెలలు కొనసాగితే సినీ పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి.