
టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి విమర్శల పాలవుతున్నారు. ఇందుకు కారణం ఏమిటంటే టీడీపీ నాయకుల అరెస్ట్ లు, ఇతర సమస్యలను ఏపీ గవర్నర్ భిశ్వభూషన్ హరిచందన్ దృష్టికి తీసుకువెళ్లడమే. దాదాపు గంటకు పైగా ప్రతిపక్ష నేత గవర్నర్ తో ముచ్చటించారు. వైసీపీ ప్రభుత్వంపై 14 పేజీల సుదీర్ఘ లేఖను ఈ సందర్భంగా గవర్నర్ కు అందజేశారు.
రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ బరిలో నిలిచింది అందుకేనా?
గవర్నర్ వ్యవస్థ శుద్ధ దండగ అన్న చంద్రబాబు ఇప్పుడు గవర్నర్ దగ్గరకు ఎందుకు వెళ్లారని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. చంద్రబాబు సీఎంగా ఉండగా అప్పటి గవర్నర్ నరసింహన్ విషయంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
రెండు రోజుల ముందు శాసన సభలో బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగాన్ని బాయ్ కాట్ చేశారు. అటువంటి చంద్ర బాబు గవర్నర్ ను కలిసిన విషయంపై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విషువర్ధన్ రెడ్డి విమర్శలు ఎక్కుపెట్టారు.
ప్రస్తుత ముఖ్యమంత్రి, అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై విశాఖ ఎయిర్ పోర్టులో దాడి జరిగిన సంఘటన డిజిపికి గవర్నర్ స్వయంగా ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. దీంతో అప్పటి సీఎంగా చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. గవర్నర్ తనను అడగాలే తప్ప నేరుగా డీజీపీకి ఎలా ఫోన్ చేస్తారని ప్రశ్నించారు. గవర్నర్ వ్యవస్థనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అంతకు ముందు చుక్కల భూముల విషయంలో ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ను గవర్నర్ నరసింహన్ వెనక్కి పంపారు. ఆర్డినెన్స్ లోపభూయిష్టంగా ఉందని ఆయన ఆమోదం తెలపలేదు. మరికొన్ని విషయాల్లో గవర్నర్ ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించారు.
జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో మిక్స్డ్ టాక్..!
మరోవైపు వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకుని నలుగురిని చంద్రబాబు మంత్రులుగా చేశారు. అప్పుడు గవర్నర్ నర్శింహన్ వారి చేత ప్రమాణం చేయించారు. అయినా బాబు గవర్నర్ వ్యవస్థను వ్యతిరేకించారు. గవర్నర్ వ్యవస్థనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు మండలి రద్దు చేయాలని జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న చంద్రబాబు తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే రీతిలో వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.