Home Blog Page 8441

ఎల్లుండి సంతోష్ బాబు ఇంటికి వెళ్లనున్న కేసీఆర్


భారత్-చైనా సరిహద్దు ఘర్షణలో తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్ బాబు మృతిచెందాడు. సూర్యాపేట జిల్లాకు చెందిన కల్నల్ సంతోష్ బాబు కొన్నేళ్లుగా ఆర్మీలో విధులు నిర్వహిస్తున్నాడు. గడిచిన ఏడాదిన్నర చైనా సరిహద్దుల్లో కల్నల్ స్థాయిలో సంతోష్ బాబు విధులు నిర్వహిస్తున్నారు. ఈనేపథ్యంలో గడిచిన సోమవారం భారత్-చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో కల్నల్ సంతోష్ బాబు సహా 19మంది జవాన్లు వీరమరణం పొందారు. సంతోష్ బాబు అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు.

కేసీఆర్ కరుణిస్తాడా? కాలదన్నుతాడా?

కల్నల్ సంతోష్ బాబు అంత్యక్రియల్లో గవర్నర్ తమిళిసై, మంత్రులు కేటీఆర్, జగదీశ్ రెడ్డి, ప్రతిపక్ష నాయకులు రేవంత్ రెడ్డి, కోమటరెడ్డి వెంకట్ రెడ్డి తదితర నేతలు పాల్గొని వీరజవానుకు నివాళ్లర్పించారు. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ ఇందులో పాల్గొనకపోవడంపై ప్రతిపక్షాలు విమర్శలకు గుప్పించారు. దీంతో ఈ విమర్శలకు చెక్ పెడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతోష్ బాబు కుటుంబానికి భారీ సాయం ప్రకటించారు.

కనుమరుగు కథ.. కాంగ్రెస్ చేసిన పెద్ద తప్పు అదే!

సంతోష్ బాబు కుటుంబానికి రూ.5 కోట్ల పరిహారం, ఆయన భార్యకు గ్రూప్-1 స్థాయి ఉద్యోగం ఇస్తామని.. ఇంటి స్థలం అందజేస్తామని సీఎం కేసీఆర్ శుక్రవారం రాత్రి ప్రకటించారు. అదేవిధంగా గాల్వన్లో అమరులైన మిగతా జవాన్లకు రూ.10 లక్షల చొప్పున పరిహారాన్ని తెలంగాణ ప్రభుత్వం అందజేయనుందనని ప్రకటించారు. ఈమేరకు సోమవారం సీఎం కేసీఆర్ ఆయన కల్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని పరామర్శించి సాయం అందించనున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే శుక్రవారం సాయంత్రం ప్రధాని మోదీ నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో సీఎం కేసీఆర్ ప్రధానికి పలు సూచనలు చేశారు. చైనా విషయంలో భారత్ రాజనీతితో కాకుండా రణనీతిని ప్రదర్శించాలని ప్రధాని మోదీకి సూచించారు. కశ్మీర్ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న వైఖరిని చైనా జీర్ణించుకోలేక ఘర్షణలకు దిగుతోందని ఆయన ఆరోపించారు. భారత జవాన్లను దొంగదెబ్బ తీసిన చైనాకు తగిన గుణపాఠం చెప్పే సమయం ఆసన్నమైందన్నారు.

జూన్ నెల జీతాలపై క్లారిటీ ఇవ్వని సర్కార్..!


కరోనా వైరస్ కారణంగా దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ముందుగానే తెలంగాణలో లాక్డౌన్ విధించారు. ముందుగా లాక్డౌన్ 15రోజుల నుంచి నెలరోజుల వరకు ఉంటుందని అందరూ భావించారు. అయితే అనుహ్యంగా లాక్డౌన్ నాలుగు నెలలుగా కొనసాగుతోంది. దీంతో కేంద్రం, ఆయా రాష్ట్రాల ఆదాయం తగ్గడంతో కేంద్రం కొన్ని సడలింపులను ఇచ్చింది. ఈమేరకు రాష్ట్రాల్లో కొన్ని షరతులతో దాదాపు అన్నిరంగాలకు మినహాయింపులను ఇచ్చారు. దీంతో కేంద్రం, రాష్ట్రాలకు తిరిగి ఆదాయం సమకూరుతోంది.

కేసీఆర్ కరుణిస్తాడా? కాలదన్నుతాడా?

కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తి జీతాలు చెల్లిస్తున్నాయి. అయితే తెలంగాణలో మాత్రం ఉద్యోగుల స్థాయిని బట్టి 10నుంచి 70శాతం వరకు కోతలను విధిస్తోంది. వైద్యులు, పోలీసులు, పారిశుధ్య కార్మికులు, విద్యుత్ సిబ్బంది మినహా రాష్ట్రంలోని అన్ని శాఖల ఉద్యోగులకు ప్రభుత్వం జీతాల్లో కోతలను విధిస్తుంది. దీంతో గడిచిన మూడునెలలుగా ఉద్యోగులకు సగం జీతమే అందుతుండటంతో వారంతా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ప్రభుత్వం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఉద్యోగులు, పెన్షన్ల సంఘం హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ప్రభుత్వానికి ఉద్యోగులు, పెన్షన్లో కోత విధించడానికి ఉన్న హక్కు ఏంటో చెప్పాలని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం రాత్రికి రాత్రే ఆర్డినెన్స్ తీసుకురావడంపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఏవైనా విపత్తులు లేదా ప్రజారోగ్యానికి సంబంధించి అత్యవసర పరిస్థితి తలెత్తినప్పుడు ఏ వ్యక్తికైనా, సంస్థకైనా, పెన్షనర్లకైనా చెల్లింపులను వాయిదా వేసే అధికారం ఆర్డినెన్స్ ద్వారా ప్రభుత్వానికి కల్పించారు.

కనుమరుగు కథ.. కాంగ్రెస్ చేసిన పెద్ద తప్పు అదే!

ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ను సవాల్ చేస్తూ మరోసారి ఉద్యోగులు, పెన్షన్లు హైకోర్టు ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధమని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. పిటిషనర్‌ వాదనలు విన్న హైకోర్టు ఆర్డినెన్స్‌పై మూడు వారాల్లో వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. గడిచిన మూడునెలలుగా ఉద్యోగులకు జీతాల్లో ప్రభుత్వం కోతలు విధిస్తూనే ఉంది.

కరోనా లాంటి విపత్కర పరిస్థితులను ఉద్యోగులను ఆదుకోవాల్సిందిపోయి కోతలు విధించడం ఏంటని ఉద్యోగ సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో ప్రభుత్వానికి ఆదాయం వస్తుండటంతో జూన్ నుంచి పూర్తిస్థాయి జీతాలు చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. జూన్ నెలలో 20రోజులుగా గడిచినప్పటికీ ఉద్యోగుల జీతాలపై ఇంకా క్లారిటీ రావడం లేదు. ఉద్యోగులు హైకోర్టు ఆశ్రయించడంతో జీతాల కోతలపై ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. దీంతో జూన్ నెల జీతం ఉద్యోగులకు పూర్తి స్థాయిలో అందుతుందా?. అనేది ప్రశ్నార్థకంగా మారింది.

కేసీఆర్ కరుణిస్తాడా? కాలదన్నుతాడా?


టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఈ మధ్య ఏదీ తొందరగా తేల్చడం లేదు. కరోనా లాక్ డౌన్ తో ఇప్పుడు రాజకీయమే బంద్ అయిపోయింది. దీంతో పదవుల పందేరంలో మరింత ఆలస్యం చేస్తున్నారు కేసీఆర్. తెలంగాణలో సీఎం కేసీఆర్ రెండోసారి గద్దెనెక్కకా.. స్లో అండ్ స్టడీగా ముందుకు సాగుతున్నారు. మొదటి దఫాలో ఠంచనుగా నామినేటెడ్ పదవుల భర్తీ చేసిన కేసీఆర్ ఇప్పుడు సంవత్సరం దాటుతున్నా ఆ ఊసే ఎత్తడం లేదు. దీంతో ఖాళీ అయ్యే సీట్లపై నేతలు కన్నేశారు.టీఆర్ఎస్ లో ఈ నెలాఖరుకు మూడు ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అవుతున్నాయి. దీంతో ఎమ్మెల్సీ పదవుల సందడి మొదలైంది. ఈ మూడు పదవుల కోసం నేతలంతా గులాబీ దళపతిని ప్రసన్నం చేసుకోవడానికి తెగ కష్టపడుతున్నారు. ఎవరికి తోచిన దారిలో వారు లాబీయింగ్ మొదలు పెడుతున్నారు.

కనుమరుగు కథ.. కాంగ్రెస్ చేసిన పెద్ద తప్పు అదే!

ఈనెల 17తో మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పదవీకాలం ముగుస్తోంది. ఆగస్టులో మరో ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ది ముగుస్తోంది. ఇక కాంగ్రెస్ లో చేరి అనర్హత వేటుపడ్డ రాములునాయక్ ది కూడా ముగిసిపోయింది. ఈ మూడు స్థానాలకు అభ్యర్థుల కోసం కేసీఆర్ కసరత్తు ప్రారంభించారు.

ఇప్పటికే నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి కేసీఆర్ కూతురు కవిత నామినేషన్ వేశారు. ఇప్పుడు గవర్నర్ కోటాలోని మూడు స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయబోతున్నారు సీఎం కేసీఆర్.

రెండోసారి గద్దెనెక్కి ఏడాది దాటినా కేసీఆర్ పదవుల భర్తీపై అస్సలు ఆసక్తి చూపడం లేదు. తెలంగాణలో ఇప్పుడు పదవుల భర్తీ కోసం నేతలంతా ఆశగా ఎదురుచూస్తున్నారు.. ఆ మూడు ఎమ్మెల్సీల పదవుల కోసం బారెడు క్యూ నెలకొంది. దాదాపు 30 మంది పోటీ పడుతున్నారు. ఇందులో కేసీఆర్ హామీనిచ్చిన వారితోపాటు ఆశావహులు ఉన్నారు. ప్రధానంగా కేసీఆర్ స్వయంగా ఇంటికెళ్లి మరీ పార్టీలోకి ఆహ్వానించిన నిజామాబాద్ మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీ బూర నర్సయ్య, ఉద్యోగ నేతలు స్వామిగౌడ్, దేవీ ప్రసాద్ తోపాటు బస్వరాజు సారయ్య, సీతారాం నాయక్, వేముల వీరేశం, క్యామ మల్లేష్ లు ప్రధానంగా ఎమ్మెల్సీ బరిలో ప్రయత్నాలు చేస్తున్నారు. కేసీఆర్ ఫాంహౌస్ చుట్టూ , ప్రగతి భవన్ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు.

జగన్ బాటలోనే సీఎం కేసీఆర్?

కరోనా కారణంగా మిగతా నామినేటెడ్ పదువులు ఇప్పట్లో భర్తీ చేసే యోచనలో కేసీఆర్ లేడు. దీంతో ఇప్పుడు అందరిచూపు తెలంగాణలో ఖాళీ అవుతున్న ఎమ్మెల్సీ పదవులపై పడింది. ఈ పదవిని దక్కించుకునేందుకు రకరకాల మార్గాల్లో నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ మూడు స్థానాల్లో కర్నె ప్రభాకర్ కు మళ్లీ కేసీఆర్ అవకాశం ఇస్తారని టీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నాయి. ఆయన టీఆర్ఎస్ లో యాక్టివ్ గా ఉంటూ పార్టీ వాయిస్ ను బలంగా వినిపిస్తుంటాడు. ఇక కేసీఆర్ కేబినెట్ లో తొలి హోంమంత్రి అయిన నాయిని నర్సింహారెడ్డికి ఈసారి కేసీఆర్ ఇస్తాడో లేదో తెలియకుండా ఉంది. ఆయన ఈ మధ్య కేసీఆర్ గురించి లూజ్ టాక్ చేయడం మైనస్ గా మారింది. ఇక మూడో సీటులో కొత్త నేతకు అవకాశం గ్యారెంటీగా కనిపిస్తోంది. ఈ మూడు పదవుల కోసం టీఆర్ఎస్ లో దాదాపు 30మందికి పైగా ప్రయత్నాలు చేస్తున్నారు. పురుషుల్లో చాలా మంది ఉండగా.. కేసీఆర్ కు దగ్గరగా ఉండే పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మహిళా కోటాలో ప్రధానంగా తుల ఉమ, గుండు సుధారాణి, ఉమా మాధవరెడ్డి రేసులో ఉన్నారు. అంతిమంగా ఈ పదవులు ఎవరికి దక్కుతాయనేది ఆసక్తిగా మారింది

మెగాస్టార్ ‘లూసిఫర్’ పై ఇంట్రస్టింగ్ అప్ డేట్ !


మెగాస్టార్ చిరంజీవి యంగ్ స్టార్ డైరెక్టర్ సుజీత్ తో ‘లూసిఫర్’ తెలుగు రీమేక్ చేయబోతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా గురించి ఫిల్మ్ సర్కిల్స్‌ లో వినిపిస్తోన్న లేటెస్ట్ అప్ డేట్ ఏమిటంటే, తెలుగు ఆడియన్స్ కోరుకునే ఎమోషన్స్ కి తగ్గట్టుగా లూసిఫెర్ స్క్రిప్ట్‌ లో మెగాస్టార్ కొన్ని కీలకమైన మార్పులను సూచించాడట. సుజీత్ ఆ మార్పులను పూర్తి చేసి చిరుకి పూర్తి స్క్రిప్ట్‌ వినిపించారని, ఫైనల్ గా మెగాస్టార్ స్క్రిప్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని.. ప్రస్తుతం సాయి మాధవ్ బుర్రా డైలాగ్ వెర్షన్ రాస్తున్నారని తెలుస్తోంది.

కనుమరుగు కథ.. కాంగ్రెస్ చేసిన పెద్ద తప్పు అదే!

ఇక ‘లూసిఫర్’లో మంజు వార్యర్, హీరోకి చెల్లి పాత్రలో నటించింది. అయితే మంజు వార్యర్ పాత్రలోనే విజయశాంతి కనిపించబోతుందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ అందులో వాస్తవం లేదట. ఇక ఈ సినిమాలో హీరోయిజమ్ ఎలివేషన్స్ ఉన్న సీన్స్ మెయిన్ హైలైట్ గా ఉండేలా.. మెగా అభిమానులకు ఫుల్ జోష్ ని ఇచ్చేలా సినిమాని తెరకెక్కించాలని సుజిత్ షాట్ మేకింగ్ పై ప్రత్యేక దృష్టి పెట్టాడట.

అయితే గత సంవత్సరం సుజీత్ దర్శకత్వంలో వచ్చిన భారీ విజువల్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ సాహో మిశ్రమ ఫలితాలను అందుకుంది. అయినప్పటికి మెగాస్టార్ చిరంజీవి సుజీత్ టాలెంట్ పై నమ్మకముంచి అతనికే ఈ భారీ మూవీని రీమేక్ చేసే అవకాశం ఇచ్చారు.

కనుమరుగు కథ.. కాంగ్రెస్ చేసిన పెద్ద తప్పు అదే!


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చెరగని ముద్రవేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ ను అత్యధిక సంవత్సరాలు పాలించిన పార్టీగా రికార్డుల్లోకి ఎక్కింది. 9 ఏళ్ల చంద్రబాబు పాలనకు చరమగీతం పాడేందుకు నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాష్ట్రమంతా పాదయాత్ర చేసి అధమ స్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఊపిరిలూది అధికారంలోకి తీసుకొచ్చారు. వరుసగా పదేళ్లపాటు నిలబెట్టారు. ఉమ్మడి ఏపీ విడిపోయే వరకు కూడా కాంగ్రెస్ పాలనే కొనసాగింది.

కాంగ్రెస్ లేని ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఊహించలేం. కాంగ్రెస్ తో అనుబంధం నిన్నటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ కు ఉండేది. 100 ఏళ్ల పార్టీ ఉనికి ఆంధ్రప్రదేశ్ లో నిన్నటితో సమాప్తమైంది.

రెబల్ ఎమ్మెల్యేలపై టీడీపీ చర్యలు తీసుకుంటుందా?

నిజానికి కాంగ్రెస్ 2014 ఎన్నికల్లో ఉమ్మడి ఏపీని విడగొట్టినప్పుడే ఏపీలో భూస్థాపితమైపోయింది. తెలంగాణలో ప్రతిపక్షానికి పరిమితమైంది. మరి ఈ ఆరేళ్లు ఎలా తన ఉనికి ఏపీలో చాటిందంటే అది రాజ్యసభ ఎంపీలుగా కాంగ్రెస్ పార్టీ నుంచి నాడు ఎన్నికైన వారి కాలపరిమితి నేటితో తీరిపోయింది.

ఇన్నాళ్లు కాంగ్రెస్ నామినేట్ చేసిన కేవీపీ రాంచంద్రరావు, సుబ్బిరామిరెడ్డి లాంటి తదితర వారి కాలపరిమితి నిన్నటి రాజ్యసభ ఎన్నికలతో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. నిన్నటి వరకు కూడా వారు రాజ్యసభ ఎంపీలుగా కొనసాగారు. వారిద్దరూ కాంగ్రెస్ ఎంపీలే. నాడు ఉమ్మడి ఏపీ చివరి హయాంలో నామినేట్ అయినవారు. 6 ఏళ్లుగా ఏపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

బీజేపీ చర్యలకు… పవన్ జవాబుదారు కాదా?

ఆంధ్రప్రదేశ్ లో శుక్రవారం జరిగిన రాజ్యసభ ఎన్నికలు కొత్త చరిత్రను సృష్టించాయి. ఏపీ నుంచి పూర్తిగా కాంగ్రెస్ ను ఈ ఎన్నికలు తుడిచివేశాయి. కాంగ్రెస్ ముక్త ఆంధ్రప్రదేశ్ గా ఈ ఎన్నికలతో మారిపోయింది. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వైట్ వాష్ తర్వాత ఏపీ శాసనమండలితోపాటు రాజ్యసభలో ఏపీ కోటా నుంచి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీ ఎంతో చరిత్ర కలిగిన ఏపీలో ఇప్పుడు పూర్తిగా కనుమరుగైన వైనం తాజాగా చోటుచేసుకుంది.

కాంగ్రెస్ పార్టీ చేసిన అతిపెద్ద తప్పు వైఎస్ జగన్ ను తక్కువగా అంచనావేయడం.. అతడిని పార్టీ నుంచి సాగనంపడం.. జగన్ ఒక ప్రాంతీయ పార్టీని ఏర్పాటు చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభ మెల్లిమెల్లిగా ఏపీలో కోల్పోవడం ప్రారంభించింది. ముఖ్య నాయకులందరినీ ఒక్కొక్కరిగా కోల్పోయింది. ఇప్పుడు పూర్తిగా ఏపీలో కనుమరుగైంది.

ఏపీ విడిపోయాక తొలి ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా కాడి వదిలి సొంత ఊళ్లో వ్యవసాయం చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఆయన ప్లేసులో భర్తీ అయిన కొత్త పీసీసీ చీఫ్ శైలజానాథ్ అస్సలు కాంగ్రెస్ ను భుజానకెత్తుకోవడం లేదు. ఒక్క పర్యటన కూడా చేపట్టడం లేదు. దీంతో కాంగ్రెస్ ఎలాగూ ఏపీలో బలపడదని వారికి అర్థమై నిద్రాన స్థితిలోనే వదిలేస్తున్నారు. ఇప్పుడు రాజ్యసభ ఎన్నికలతో కాంగ్రెస్ కథ పూర్తిగా కంచికి చేరింది..

తమిళ్ స్టార్ కూడా యాక్షన్ సీన్స్ కోసం !


తమిళ్ ఇండస్ట్రీలోనే అతి పెద్ద మాస్ ఫ్యాన్ బేస్ ఉన్న స్టార్ హీరో అజిత్. ప్రస్తుతం ఆయన చేస్తోన్న నూతన చిత్రం పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. వాలిమై అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే కీలకమైన సన్నివేశాల షూటింగ్ పార్ట్ ను పూర్తి చేసుకుంది. కరోనా ప్రభావం తగ్గాక హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో పలు యాక్షన్ సీక్వెన్సెస్ ను ప్లాన్ చేయనున్నారు. నెర్కొండ పార్వై అనే సూపర్ హిట్ సినిమాని తెరకెక్కించిన హెచ్ వినోత్ ఈ సినిమాకి కూడా దర్శకత్వం వహించడం విశేషం.

జగన్ బాటలోనే సీఎం కేసీఆర్?

మాస్ అండ్ కమర్షియల్ అంశాలతో యాక్షన్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమాలో అజిత్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడట. అందులో ఒక పాత్రలో అజిత్ పోలీస్ అధికారిగా కనిపించబోతున్నారని తమిళ్ సినీ వర్గాల్లో వినిపిస్తోంది. ఏమైనా అజిత్ ద్విపాత్రాభినయంలో ఏమి చేసినా ఆయన ఫ్యాన్స్ కు అది ప్రత్యేకమే.

విమర్శించిన నోటితోనే జై కొట్టించుకున్న కేసీఆర్..!

పైగా అజిత్ వరుస సూపర్ హిట్స్ తో తమిళ్ బాక్సాఫీస్ కి ఎప్పటికప్పుడు తన స్టామినా ఏమిటో ప్రూవ్ చేస్తూనే ఉన్నారు. గత కొన్ని సినిమాలుగా అజిత్ చిత్రాలు తమిళంలో వరుస రికార్డ్స్ మీద రికార్డ్స్ సాధిస్తున్నాయి. గత సినిమా విశ్వాసం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఆయన ఆ తరువాత నెర్కొండ పార్వై అనే సినిమాలో లాయర్ గా నటించి మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు.

బాలీవుడ్ లో స్టార్ డమ్ మిస్ చేసుకున్న ‘రష్మిక’ !


‘జెర్సీ’ మూవీ హిందీలో కూడా భారీ స్థాయిలోనే రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ నటిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా మొదట రష్మిక మండన్నాను అనుకున్నారు. కానీ, ఆమె ఈ సినిమా అంగీకరించలేదు. అయితే షాహిద్ కపూర్ లాంటి స్టార్ సరసన బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి ఉంటే రష్మిక కెరీర్ కి అది బాగా ప్లస్ అయ్యేది. బాలీవుడ్ లో కూడా స్టార్ డమ్ తెచ్చుకుని బిజీ అయ్యేది. మొత్తానికి హీరోయిన్ గా ఆమె రేంజ్ ఇంకా పెరిగేది.

జగన్ బాటలోనే సీఎం కేసీఆర్?

కానీ ఆమె మంచి అవకాశాన్ని మిస్ చేసుకుంది. రష్మిక దీని పై ఇటీవలే స్పందిస్తూ.. ‘ నేను కమర్షియల్‌ సినిమాలే చేయాలనుకుంటున్నాను. కానీ ‘జెర్సీ’ రియలిస్టిక్ చిత్రం. అందుకే ఆ సినిమా ఒప్పుకోలేదు. అని చెప్పుకొచ్చింది, ఏమైనా ఆమె నిర్ణయం మాత్రం సరైనది కాదంటున్నారు నెటిజన్లు. మరోవైపు రష్మిక వదిలేసిన అవకాశాన్ని దక్కించుకున్న హీరోయిన్ మృణాల్‌ ఠాకూర్‌ కు, ‘జెర్సీ రీమేక్’తో బాలీవుడ్ లో మంచి పాపులారిటీ రాబోతుందని బాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.

బీజేపీ చర్యలకు… పవన్ జవాబుదారు కాదా?

ఇక షాహిద్ కపూర్ ఇంతకుముందే తెలుగు చిత్రం ‘అర్జున్ రెడ్డి’ని హిందీలోకి ‘కబీర్ సింగ్’ పేరుతో రీమేక్ చేసి భారీ హిట్ అందుకొన్నారు. ఇప్పుడు కూడా అదే రీమేక్ ఫార్ములాను ఫాలో అవుతూ చేస్తున్న ఈ సినిమా మీద హిందీ ప్రేక్షకుల్లో కూడా అమితాశక్తి నెలకొని ఉంది.

హిట్ కాంబినేషన్ లో మరో ఫుల్ ఎంటర్ టైనర్ !


కమర్షియల్ డైరెక్టర్ మారుతి డైరెక్ట్ చేసిన ‘భలే భలే మగాడివోయ్’ సినిమా నేచురల్ స్టార్ నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. పైగా ఈ సినిమాతోనే నాని మార్కెట్ స్థాయి కూడా పెరిగిందంటే మారుతి చలవే. ఇక ఈ సినిమా తర్వాత మారుతి, నాని కలిసి మరొక సినిమా చేస్తే బాగుంటుందని ప్రేక్షకులు కూడా భావించారు. అందుకు తగ్గట్లుగానే మారుతి, నానిలు కూడా మరొసారి కలిసి వర్క్ చేయాలని చాలాసార్లే అనుకున్నారు.

జగన్ బాటలోనే సీఎం కేసీఆర్?

కానీ ఇప్పటివరకు అది సాధ్యపడలేదు. అయితే వీరి కాంబినేషన్ మళ్లీ పట్టాలెక్కే సూచనలు కనబడుతున్నాయి. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం మారుతి, నాని కోసం ఫుల్ ఎంటర్ టైనర్ ను సిద్ధం చేస్తోన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మారుతి స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాడట. అయితే ఈ వార్తకు సంబంధించి ఎలాంటి అఫీషియల్ క్కన్ఫర్మేషన్ అయితే ఇంతవరకు రాలేదు.

కాకపోతే వీరి కాంబినేషన్ లో సినిమా కచ్చితంగా వస్తోందని ఫిల్మ్ సర్కిల్స్ లో బాగా వినిపిస్తోంది. దానికి తోడు నాని కూడా ఆ మధ్య మారుతితో కచ్చితంగా మళ్లీ సినిమా చేస్తానన్న సంగతి తెలిసిందే. ఇకపోతే ప్రస్తుతం ‘వి’ చిత్రం రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నాడు, అలాగే కరోనా అనంతరం నాని ‘టక్ జగదీష్’ అనే సినిమాను స్టార్ట్ చేయనున్నారు.

భారత్ మిత్ర దేశానికి వల వేస్తున్న చైనా?


భారత్-చైనా సరిహద్దుల్లో గడిచిన నెలరోజులుగా ఘర్షణ వాతావారణం నెలకొంది. గత సోమవారం ఇరుదేశాల సైనికుల మధ్య జరిగిన దాడిలో భారత జవాన్లు 20మంది మృతిచెందడంతో సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఓవైపు శాంతివచనాలు వళ్లిస్తూనే డ్రాగన్ కంట్రీ సరిహద్దుల్లో భారత జవాన్లపై దొంగదాడికి దిగడంతో ఆ దేశంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతోన్నాయి. ఈనేపథ్యంలో కేంద్రం కూడా చైనా అంశంపై సీరియస్ దృష్టిసారింది.

బీజేపీ చర్యలకు… పవన్ జవాబుదారు కాదా?

భారత జవాన్లను దొంగదెబ్బ తీసిన చైనాకు తగిన గుణపాఠం చెప్పేందుకు భారత ఆర్మీ సిద్ధమవుతోంది. జవాన్ల మృతిపై రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ప్రధాని మోదీ చర్చించిన ఈమేరకు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి చైనా విషయంలో అనుసరించాల్సిన వ్యూహాన్ని చర్చించారు. అన్ని రాష్ట్రాల సీఎంలు కూడా భారత రక్షణ విషయంలో రాజీలేదని స్పష్టం చేశారు. భారత జవాన్లపై దొంగదాడికి దిగిన చైనాకు తగిన గుణపాఠం చెప్పాలని సూచించారు. చైనా విషయంలో ప్రధాని ఏ నిర్ణయం తీసుకున్న యావత్ దేశం మీవెంటే ఉంటుందని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

విమర్శించిన నోటితోనే జై కొట్టించుకున్న కేసీఆర్..!

ఇప్పటికే కేంద్రం చైనా విషయంలో బహుముఖ వ్యూహంతో ముందుకెళుతోంది. సరిహద్దుల్లో కమాండర్ స్థాయి అధికారులకు పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకునే అధికారం కట్టబెట్టింది. అదేవిధంగా సరిహద్దు యుద్ధవిమానాలను రెడీ చేసింది. త్రివిధ దళాలకు సిద్ధంగా ఆదేశాలను కూడా జారీ చేసింది. దీంతో భారత సరిహద్దుల్లో యుద్ధమేఘాలు ఆవరించాయి. అంతేకాకుండా చైనా కంపెనీలకు కేటాయించిన కాంట్రాక్ట్ లను రద్దు చేస్తోంది. చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులను ఆంక్షలు విధించేందుకు యత్నిస్తుంది. మరోవైపు భారతీయులు చైనా వస్తువులను బహిష్కరించాలని పెద్దఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. చైనాను ఆర్థికంగా దెబ్బకొట్టాలని భారత్ ప్లాన్ చేస్తోంది.

మరోవైపు చైనా సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఇప్పటికే గాల్వాన్ లోయలో ఘర్షణకు కారణమైన చైనా అటూ అరుణాచల్ ప్రదేశ్లోకి దూసుకొచ్చింది. దీంతో భారత బలగాలకు చైనాకు మధ్య ఉద్రికత్తలు నెలకొన్నాయి. భారత బలగాలు సమర్థవంతంగా చైనా సైన్యాన్ని అడ్డుకోవడంతో వెనక్కి వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికైనా భారత మిత్రదేశమైన నేపాల్ ను చైనా తనవైపు తిప్పుకుంది. చైనా అండగా సరిహద్దుల్లో నేపాల్ భారత భూభాగాన్ని తనదిగా ప్రకటించుకుంది. దీనిపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తత నెలకొంది.

హంకాంగ్, తైవాన్ లో శ్రీరాముడి ఫొటో వైరల్.. ఎందుకంటే?

ఇదిలా ఉంటే భారత్ పొరుగున ఉన్న బంగ్లాదేశ్ ను సైతం చైనా తనవైపు తిప్పుకునేందుకు తాయిళాలు ప్రకటిస్తూ ఆకర్షిస్తోంది. భారత్-చైనా ఘర్షణ జరిగిన మరునాడే బంగ్లాపై విధిస్తున్న కొన్ని టారీఫ్ లను చైనా మాఫీ చేసింది. జూలై 1నుంచి ఈ టారీఫ్లు అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే ఆసియా-పసిఫిక్ ట్రేడ్ అగ్రిమెంట్ ప్రకారం 3095 వస్తువులకు ఎలాంటి సుంకాలు లేకుండా వాణిజ్యం చేసే అవకాశాన్ని చైనా కల్పిస్తోంది. ఈ జాబితాలో మరిన్ని వస్తువులను చేర్చడం ద్వారా ఇరు దేశాలు మరింత దగ్గరయ్యే అవకాశం ఉంది.

బంగ్లా ఏర్పాటు భారత్ కీలక పాత్ర పోషించింది. భారత్-బంగ్లాదేశ్ మధ్య బలమైన సంబంధాలు ఉన్నాయి. కానీ ఎన్ఆర్సీసీ విషయంలో బంగ్లాదేశ్ కొంత అసంతృప్తితో ఉంది. ఇదే అదనుగా భావించిన చైనా బంగ్లాకు కొన్ని తాయిలాలు ప్రకటించిన తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. చైనా దేశం భారత్ కు ఎప్పటికి ప్రమాదకరమేననే భావన అందరిలో వ్యక్తమవుతోంది. చైనా దురాగతాలకు భారత్ తగిన గుణపాఠం చెప్పాలని డిమాండ్ విన్పిస్తోంది. అయితే శాంతియుతంగానే ఈ సమస్యను పరిష్కరించుకోవాలని ఇరుదేశాలు భావిస్తున్నాయి. అయితే చైనా వ్యవహరాన్ని కేంద్రం ఓ కంటకనిపెడుతూనే తగిన వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

జగన్ బాటలోనే సీఎం కేసీఆర్?


తెలంగాణలో కరోనా ఉగ్రరూపం చూపుతోంది. రోజురోజుకు కరోనా కేసులు తెలంగాణలో భారీగా నమోదవుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. గత కొన్నిరోజులుగా తెలంగాణలో పాజిటివ్ కేసుల సంఖ్యగా భారీగా పెరిగిపోతుంది. కరోనా కట్టడి ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టిన కంట్రోల్ కావడంలేదని అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇటీవల పెరుగుతున్న కేసుల సంఖ్య చేస్తుంటే కేసీఆర్ సర్కార్ కరోనా విషయంలో చేతులేత్తిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు ఏపీలో కూడా కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతుండగా ప్రభుత్వం టెస్టులను సంఖ్య భారీగా చేస్తోంది. అదేవిధంగా ఏపీలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న మూడు జిల్లాలో సంపూర్ణ లాక్డౌన్ విధిస్తున్నట్లు జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలోనూ కేసీఆర్ ఇలాంటి నిర్ణయం తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది.

ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య వెనుక కారణమేంటీ?

తెలంగాణలో శుక్రవారం ఏకంగా 499 కొత్త కేసులు నమోదవడం చూస్తుంటే వైరస్ ఎలా విజృంభిస్తుందో అర్థం చేసుకోవచ్చు. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 499 కేసులు నమోదుగా కాగా జీహెచ్ఎంసీ పరిధిలోనే 329కేసులు నమోదవడం గమనార్హం. రాష్ట్రంలో మొత్తంగా ఇప్పటివరకు 6,526కరోనా కేసులు నమోదుకాగా 198కరోనాతో మృతిచెందారు. జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం కేసుల సంఖ్య 4,526కు చేరాయి. కరోనా కేసులు పెరుగుతుండటంతో హైదరాబాద్లో 50వేల కరోనా టెస్టులను చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతోపాటు ప్రైవేటు ల్యాబ్లో కరోనా టెస్టులకు అనుమతి ఇచ్చింది.

ఆధిపత్య పోరు: కిషన్ రెడ్డి వర్సెస్ బండి

గత నెలక్రితం వరకు తెలంగాణలో వైరస్ కట్టడిలోనే ఉండేది. యాభై.. వందల్లోనే కేసులు నమోదయ్యేవి. అయితే గడిచిన వారం పదిరోజులుగా తెలంగాణలో రోజుకు మూడొందలు, నాలుగొందల కేసులు పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టిన కరోనా కంట్రోల్లోకి రాకపోవడంతో క్షేత్రస్థాయిలో అధికారులు సక్రమంగా పని చేస్తున్నారా? అనే అనుమానాలు తలెత్తుతోన్నాయి. మరోవైపు ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న ప్రకాశం, అనంతపురం. శ్రీకాకుళం జిల్లాల్లో లాక్డౌన్ విధిస్తూ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది.

ఈ నేపథ్యంలోనే కేసీఆర్ కూడా జీహెచ్ఎంసీ పరిధిలో లాక్డౌన్ విధిస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని తెలంగాణ మంత్రులు గతంలోనే ఖండించారు. అయితే తాజాగా తెలంగాణలో మహమ్మరి విజృంభిస్తున్న నేపథ్యంలో వైరస్ ను కట్టడి చేసేందుకు లాక్డౌన్ విధించాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే దీనిపై సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే..!

ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య వెనుక కారణమేంటీ?


తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు ఇటీవలే విడుదలయ్యాయి. అయితే ఈ ఫలితాలు వెల్లడయ్యాక పలువురు విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలకు పాల్పడటం శోచనీయంగా మారింది. ఫెయిల్ అయ్యామని కొందరు.. తక్కువ మార్కులొచ్చాయని మరికొందరు బలవర్మణానికి పాల్పడటం ఆందోళనను రేకెత్తిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఐదుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

విమర్శించిన నోటితోనే జై కొట్టించుకున్న కేసీఆర్..!

తెలంగాణ ఇంటర్మీయట్ బోర్డు శుక్రవారం పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. ప్రతియేటాలాగే కొంతమంది విద్యార్థులు ఫెయిల్ కాగా మరికొందరు అత్యవసర మార్కులతో పాస్ అయ్యారు. ఈ ఫలితాల్లో ఫెయిల్ విద్యార్థులు, తక్కువ మార్కులొచ్చిన విద్యార్థులు మనస్థాపం చెంది ఆత్మహత్యలకు పాల్పడినట్లు తెలుస్తోంది. సిద్దిపేట, వికారాబాద్, మహబూబాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాలకు చెందిన పలువురు ఇంటర్మీయట్ విద్యార్థులు బలవర్మాణానికి పాల్పడటంతో ఆయా జిల్లాల్లో విషాదచాయలు నెలకొన్నాయి.

ఇందులో నాగర్ కర్నూల్ కు చెందిన కల్వకోల్ గ్రామానికి చెందిన సోని ఇంటర్మీయట్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఫస్టియర్ ఫలితాల్లో సోనికి తక్కువ మార్కులొచ్చాయి. తాను బాగా చదివినా కూడా మార్కులు తక్కువగా వచ్చాయని మనస్తాపంతో పురుగుల మంది తాగి ఆత్మహత్య చేసుకోవడం విషాదంగా మారింది. అదేవిధంగా మహబూబాబాద్ జిల్లా చెంద్రుగూడెంకు చెందిన సోలం సరుయు మూడు సబ్జెక్టుల్లో ఫెలవడంతో ఆత్మహత్య చేసుకుంది. వికారాబాద్ జిల్లా భజ్యానాయక్ తండాకు చెందిన నిఖిత, సిద్దిపేట జిల్లా క్యాసారం గ్రామానికి చెందిన శ్రావణి, గజ్వేల్ పట్టణానికి చెందిన అభి పరీక్షల్లో ఫెయిలవడంతో ఉరి వేసుకొని ఆత్మహత్యలకు పాల్పడటం శోచనీయంగా మారింది.

హంకాంగ్, తైవాన్ లో శ్రీరాముడి ఫొటో వైరల్.. ఎందుకంటే?

రాష్ట్రవ్యాప్తంగా ఐదుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడంపై విద్యావేత్తలు, విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం అనుసరిస్తున్న విద్యావిధానం సరైనదేనా? అనే చర్చ నడుస్తుంది. విద్యార్థులకు మార్కులు, ర్యాంకులే ప్రధానం అనే రీతిలో విద్యావ్యవస్థ మారడం కరెక్ట్ కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

విద్యార్థులు పరీక్షల్లో ఫెయిలైనా ఇతర రంగాల్లో రాణించవచ్చని.. ఫెయిలయినంత మాత్రనా ప్రాణం తీసుకోవాల్సిన అవసరం లేదని నిపుణులు అంటున్నారు. తల్లిదండ్రులు, అధ్యాపకులు విద్యార్థులకు జీవితంపై అవగాహన కల్పించాలని కోరుతున్నారు. విద్యార్థుల ఆత్మహత్య మన విద్యావ్యవస్థలోని లోపాన్ని ఎత్తిచూపుతుందని విద్యావేత్తలు అంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుత విద్యావ్యవస్థను మార్చే దిశగా ఆలోచించాలని నిపుణులు కోరుతున్నారు.

ఆధిపత్య పోరు: కిషన్ రెడ్డి వర్సెస్ బండి


బీజేపీలో సామాన్యులకు న్యాయం జరుగుతుందని అధిష్టానం ఎప్పుడో రూఢీ చేసింది. ఒక చాయ్ వాలాను దేశానికి ప్రధానిని చేసింది. తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలి తెలంగాణ గవర్నర్ ను చేసింది.. పార్టీ కోసం పరితపించిన మన దత్తన్నను హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా పంపింది. తెలంగాణ బిడ్డ విద్యాసాగగర్ రావు ఏకంగా దేశంలో పెద్ద రాష్ట్ర మహారాష్ట్ర గవర్నర్ అయ్యారు. ఇప్పుడే అదే బాటలో తెలంగాణలో ఒక బీజేపీ కౌన్సిలర్ గా చేసిన ఆర్ఎస్ఎస్ కార్యకర్తను ఏకంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిని చేసింది. నమ్ముకున్న వారికి.. కష్టపడ్డ వారికి బీజేపీలో అందలం దక్కుతుందని ఎన్నో సార్లు రుజువైంది.

విమర్శించిన నోటితోనే జై కొట్టించుకున్న కేసీఆర్..!

అయితే తెలంగాణ బీజేపీ పగ్గాలు చేపట్టిన బండి సంజయ్ కు అంతా పూలపాన్పుగా ఏమీ లేదు. ముళ్ల నడక ముందుంది. తలపండిన సీనియర్ బీజేపీ నేతల ముందు బండి నడక తడబడుతోంది. వారిని ఎదురించేలేక.. స్ట్రాంగ్ నిర్ణయాలు తీసుకోలేక ఆయన తటపటాయిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయని బీజేపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

తెలంగాణ బీజేపీలో ఇప్పుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. ఇన్నాళ్లు లక్ష్మన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అన్నీ తానై వ్యవహరించిన కిషన్ రెడ్డి.. ఆయన స్థానంలో బండి సంజయ్ రాగానే ఆయన దూకుడు యవ్వారంతో పార్టీపై తన ప్రభావం తగ్గకుండా చూసుకుంటున్నారన్న ప్రచారం కమలనాథుల్లో వ్యక్తమవుతోంది.

బీజేపీ చర్యలకు… పవన్ జవాబుదారు కాదా?

ఇటీవలే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడైన బండి సంజయ్ జిల్లా అధ్యక్షులను నియమించే పనిలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే కొన్ని జిల్లాలకు నియమించారు. అయితే తమ ఆధిపత్యం పోతుందని బీజేపీ సీనియర్లు అంతా కూడబలుక్కున్నట్టు ప్రచారం జరుగుతోంది. కేంద్రసహాయ మంత్రి కిషన్ రెడ్డి రంగ ప్రవేశం చేసి హైదరాబాద్ బీజేపీ అధ్యక్షుడిగా ఫైర్ బ్రాండ్ బీజేపీ ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ పేరును తెరపైకి తీసుకొచ్చారట.. దీనికి బీజేపీ సీనియర్ నేతలు లక్ష్మన్ సహా అందరి సపోర్టు ఉన్నట్టు పార్టీ వర్గాల్లో గుసగుసలాడుకుంటున్నాయి.

అయితే హైదరాబాద్ లాంటి మహానగరాన్ని ఒక్కరి చేతిలో పెడితే బాగుండదని.. అందరికీ అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రస్తుత బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ హైదరాబాద్ ను నాలుగు భాగాలుగా చేసి నలుగురిని బీజేపీ అధ్యక్షులుగా చేయాలని తద్వారా పోరాటం.. నిరసనలు, పార్టీలో అవకాశాలు ఇచ్చినట్టు అవుతుందని ఈ ప్లాన్ చేశారట..

రెబల్ ఎమ్మెల్యేలపై టీడీపీ చర్యలు తీసుకుంటుందా?

కానీ కిషన్ రెడ్డి మాత్రం రాజాసింగ్ నే హైదరాబాద్ అధ్యక్షుడిని చేయాలని పట్టుబడుతుండడంతో బీజేపీ రాజకీయాలు రసవత్తరంగా మారాయట.. బండి సంజయ్ వర్సెస్ కిషన్ రెడ్డి. ఇప్పుడు ఈ ఇద్దరిలో ఎవరి మాట నెగ్గుతుందనేది బీజేపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

విమర్శించిన నోటితోనే జై కొట్టించుకున్న కేసీఆర్..!


ముఖ్యమంత్రి కేసీఆర్ తనను విమర్శించి నోళ్లతోనే ఇప్పుడు జై..జైలు కొట్టుంచుకుంటున్నారు. గత సోమవారం భారత్-చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో కల్నల్ సంతోష్ బాబు సహా 19మంది భారత జవాన్లు వీరమరణం పొందారు. సంతోష్ బాబు తెలంగాణలోని సూర్యాపేట జిల్లాకు చెందినవాడు. ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో పూర్తి చేసింది. సంతోష్ బాబు కుటుంబానికి సీఎం కేసీఆర్ అన్నివిధలా అండగా ఉంటామని ప్రకటించారు.

కల్నల్ సంతోష్ బాబు అంత్యక్రియల్లో ముఖ్యమంత్రి పాల్గొనకపోవడంపై ప్రతిపక్షాలతోపాటు తెలంగాణ ప్రజల నుంచి పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తున్నాయి. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీరుడి కేసీఆర్ ఇచ్చే గౌరవం ఇదేనా? అంటూ పలువురు ప్రశ్నలు సంధించారు. తెలంగాణ ఉద్యమకారుడిగా పోరాటం చేసిన కేసీఆర్.. దేశం కోసం ప్రాణాలర్చిన తెలంగాణ వీరుడి అంత్యక్రియల్లో పాల్గొనకపోవడంపై తెలంగాణ వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమైంది.

గతంలో సినిమా యాక్టర్లు చనిపోయినపుడు సీఎం కేసీఆర్ స్వయంగా వారి వద్దకు వెళ్లి పరామర్శించారని పలువురు గుర్తుచేశారు. సినిమా యాక్టర్లను గుర్తించిన కేసీఆర్ దేశం కోసం ప్రాణం ఆర్పించిన జవాను పట్ల ఇలా వ్యవహరించడంపై ప్రజల్లో ఒకింత అసహనం వ్యక్తమైంది. పత్రికల్లో, మీడియాల్లోనూ కేసీఆర్ వ్యవహార శైలిలో చర్చలు నడిచాయి. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి భారీ సాయం ప్రకటించి విమర్శలు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు.

వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి రూ.5కోట్లతోపాటు ఇంటి స్థలం, ఆయన భార్యకు గ్రూప్ 1స్థాయి ఉద్యోగం ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. తానే స్వయంగా సంతోష్ బాబు ఇంటికెళ్లి సాయం అందిస్తానని ప్రకటించారు. అంతేకాకుండా అమరులైన మరో 19మంది సైనికులకు కూడా సాయం ప్రకటించారు. ఒక్కో అమర జవాన్ కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున సాయం చేస్తామని స్పష్టం చేశారు.

కరోనాతో రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ మిగతా ఖర్చులు తగ్గించుకోనైనా సైనికులకు సాయం అందించనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం సైనికులకు ఎల్లప్పుడు అండగా ఉంటుందనే సందేశాన్ని కేసీఆర్ తెలంగాణ ప్రజలకు పంపించడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. దీంతో సీఎం కేసీఆర్ ను విమర్శించినోళ్లే ఇప్పుడు ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

బీజేపీ చర్యలకు… పవన్ జవాబుదారు కాదా?


మూడునెలలు నిరవధికంగా సాగిన లాక్ డౌన్ పేద మధ్య తరగతి వర్గాల నడ్డి విరిచింది. చిరు వ్యాపారులు ఆదాయం కోల్పోగా, ప్రైవేట్ ఉద్యోగుల జీతాలలో కోతపడింది. కొందరు ఏకంగా ఉద్యోగాలను కోల్పోయారు. ఇక రోజువారి కూలీల వెతలు ఎంత చెప్పినా తక్కువే. లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పియిన శ్రామిక జనానికి తిండి కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెంచుతూ పేదవాడిపై పెనుభారం మోపుతోంది.

రాపాక దూకుడుకి.. పవన్ బ్రేక్ వేసేదెప్పుడు..?

గత 14 రోజులుగా కేంద్రప్రభుత్వం వరుసగా పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెంచుకుంటూ వస్తుంది. రెండు వారాలలో కేంద్రం ఏకంగా రూ. 7 పైగా పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెంచింది. ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర ఏకంగా రూ. 85.72 కు చేరింది, అలాగే డీజిల్ రూ. 75.52 గా ఉంది. ఇంధన ధరలు పెరిగితే రవాణా ఖర్చులు పెరుగుతాయి.దాని పర్యవసానంగా నిత్యావసర వస్తువుల ధరలపై ఆ భారం పడుతుంది. అంటే నిత్యావసర వస్తువుల ధరలకు రెక్కలు వస్తాయి.దీనితో పేదవాడిపై పెనుభారం పడుతుంది.

రెబల్ ఎమ్మెల్యేలపై టీడీపీ చర్యలు తీసుకుంటుందా?

మరి నిరవధికంగా కేంద్రం పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెంచుకుంటూ పోతున్న క్రమంలో…దీనిపై పవన్ కళ్యాణ్ స్టాండ్ ఏందీ అనేది ఇక్కడ ప్రశ్న. పెట్రోల్ ధరల పెరుగుదల గురించి ఆయన మోడీని ప్రశ్నించరా?. ప్రశ్నించుకున్నా సోషల్ మీడియా వేదికగా ఆయన అభిప్రాయం తెలియజేయాలని కొందరు భావిస్తున్నారు. బీజేపీతో మిత్ర పక్షంగా ఉన్నప్పుడు ఆ పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉండాలి. అదే సమయంలో జవాబుదారిగా కూడా ఉండాలి. అడ్డగోలుగా పెరుగుతున్న పెట్రోల్ ధరల గురించి మాట్లాడాల్సిన బాధ్యత, ఎవరైనా అడిగితే జవాబు చెప్పాల్సిన అవసరం ఆయనకు ఉంది. ప్రతి సామాజిక, రాజకీయ అంశంపై స్పందిచే పవన్ ఈ విషయంపైన కూడా తన స్టాండ్ తెలియజేస్తే బాగుంటుంది.

రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల విజయం..!


రాజ్యసభ వై.ఎస్‌.ఆర్‌. కాంగ్రెస్‌ పార్టీ తరపున అభ్యర్థులుగా పోటీచేసిన మోపిదేవి వెంకటరమణారావు, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమళ్‌ నత్వానీలు ఎన్నికల్లో విజయం సాధించారు. దేశ వ్యాప్తంగా 8 రాష్ట్రాల్లోని 19 స్థానాలకు రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి నాలుగు స్థానాలకు జరిగిన ఎన్నికల్లో వైసీపీకి చెందిన నలుగురు అభ్యర్థులు గెలుపొందారు.

రాపాక దూకుడుకి.. పవన్ బ్రేక్ వేసేదెప్పుడు..?

గెలుపొందిన సభ్యులకు ఒక్కొక్కరికి 38 ఓట్ల చొప్పున వచ్చాయి. 175 మంది శాసన సభ్యులకు 173 మంది ఓటింగ్ లో పాల్గొన్నారు. ఇద్దరు శాసన సభ్యులు గైర్హాజరయ్యారు. వీరిలో ఇ.ఎస్.ఐ స్కామ్ లో అరెస్టు అయిన అచ్చెన్నాయుడు, క్వారంటైన్ లో ఉన్న అనగాని సత్య ప్రసాద్ ఉన్నారు. ఎమ్మెల్యేల ఓట్లలో 4 ఓట్లు చెల్లనివని అధికారులు స్పష్టం చేశారు. వీటిలో మూడు టీడీపీ రెబల్ అభ్యర్థులవి ఉన్నాయి. చెల్లిన 169 ఓట్లే మాత్రమే పరిగణలోకి తీసుకున్నారు. టీడీపీ తరపున పోటీచేసిన వర్లరామయ్యకు కేవలం 17 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో టీడీపీ అభ్యర్థి వర్ల రామయ్య ఓటమి పాలయ్యారు.

రెబల్ ఎమ్మెల్యేలపై టీడీపీ చర్యలు తీసుకుంటుందా?

మరోవైపు రాజ్యసభ ఎన్నికల ఓటింగులో జనసేన ఎమ్మెల్యే పార్టీ నుండి సమాచారం లేదంటూ వైకాపా అభ్యర్థికి ఓటేశానని, వైసీపీ మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని బహిరంగంగానే ప్రకటించారు. ఆయన విషయంలో పార్టీ ఎంత వరకూ స్పందించలేదు.

రెబల్ ఎమ్మెల్యేలపై టీడీపీ చర్యలు తీసుకుంటుందా?


రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ రెబల్ అభ్యర్థులపై చర్యలు ఉంటాయా అంటే టీడీపీ నాయకులు మాత్రం ఉంటాయనే చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో 23 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్న టీడీపీ రాజ్యసభ అభ్యర్థి గెలిచే అవకాశం లేదు. అయినా ప్రతిపక్ష నేత తమ పార్టీ అభ్యర్థిగా వర్ల రామయ్యను రంగంలోకి దింపిన విషయం విధితమే. రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయడానికి కారణం రెబల్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేందుకేనని టీడీపీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

హంకాంగ్, తైవాన్ లో శ్రీరాముడి ఫొటో వైరల్.. ఎందుకంటే?

టీడీపీ ఎమ్మెల్యేలైన వల్లభనేని వంశీమోహన్, మద్దాలి గిరిధర్, కారణం బలరాంలు కొంత కాలం కిందట టీడీపీని వీడి వైసీపీతో సన్నిహితంగా ఉంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తమను ప్రత్యేకంగా గుర్తించి సీట్లు కేటాయించాలని శాసన సభ స్పీకర్ ను కోరారు. వీరిపై చర్యలు తీసుకునేందుకు అవకాశం కోసం వేచి చూస్తున్న చంద్రబాబుకు రాజ్యసభ ఎన్నికలు ఒక అవకాశంగా కనిపించాయి. దీంతో తన అభ్యర్థిని ఎన్నికల్లో బరిలోకి దింపింది.

అయితే టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు ముగ్గురు టీడీపీ అభ్యర్థికి ఓటు వేసిన అవి చెల్లుబాటు కాకుండా వేశారు. ప్రాధాన్యతా లోతుగా సంఖ్య వేయాల్సిన చోట టిక్ మార్కు పెట్టారు. బ్యాలెట్ పేపర్ పైనా చంద్రబాబుకు వ్యతిరేకంగా కొన్ని వాక్యాలు రాశారు. దీనిని విప్ ధిక్కారంగా పరిగణించలేమనే వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు పార్టీ విప్‌ను ధిక్కరించిన ముగ్గురు శాసన సభ్యులపై ఫిరాయింపుల చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు తగిన కార్యాచరణ చేపడతామని ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.

టీడీపీకి షాక్ ఇచ్చిన రెబల్ ఎమ్మెల్యేలు..!

అదేవిధంగా టీడీపీ దళిత అభ్యర్థిని రంగంలోకి దించడం వల్ల రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ ఒక్క దళితుడికి అవకాశం ఇవ్వలేదని అధికార పక్షాన్ని ఇరుకున పెట్టె వ్యూహాన్ని ప్రతిపక్షనేత చంద్రబాబు అవలంభించారు. ఎక్కువ మంది వైసీపీ శాసన సభ్యులుగా ఎస్సీ, ఎస్టీలు వున్నా రాజ్యసభలో దళితులకు మొండి చేయి చూపారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు పేర్కొన్నారు. బీసీ మంత్రులు ఇద్దరిని డిప్రమోషన్ చేసి సామాజిక న్యాయాన్ని మంటగలిపారని అధికార పార్టీని విమర్శించారు.

రాపాక దూకుడుకి.. పవన్ బ్రేక్ వేసేదెప్పుడు..?


జనసేన పార్టీ నుండి గెలిచిన ఒకే ఒక్కడు రాపాక వరప్రసాదరావు. ఈ ఒకే ఒక్కడు అధినేత మాట అసలు వినడు. ఓ పక్క జగన్ ని, ఆయన నిర్ణయాలను పవన్ మీడియా వేదికగా సందర్భం వచ్చినప్పుడల్లా ఏకిపారేస్తున్నారు. రాజకీయాలలో జగన్ ని విమర్శించినంతగా మరో నాయకుడిని పవన్ విమర్శించి ఉండరు. ఒక విధంగా చెప్పాలంటే వీరిద్దరూ ఉప్పు-నిప్పు అని చెప్పాలి. జనసేన మొదటిసారి పోటీచేసిన 2019 ఎన్నికలలో పవన్ ఓడిపోయినా..రాజోలు నియోజకవర్గం నుండి సీటు గెలిచి పార్టీని అసెంబ్లీకి తీసుకెళ్లారు రాపాక. ఆ ఒక్క సీటు వలన పవన్ కి ఒరిగేదేమీ లేకున్నా, భవిష్యత్ పై భరోసా కలిగించింది.

టీడీపీకి షాక్ ఇచ్చిన రెబల్ ఎమ్మెల్యేలు..!

ఐతే పవన్ కి ఈ సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. దానికి కారణం రాపాక వరప్రసాద రావు చర్యలే. ఎమ్ఎల్ఏ గా గెలిచిన నాటి నుండి, ఆయన జగన్ కి అనుకూల వ్యాఖ్యలు చేస్తున్నాడు. అసెంబ్లీ వేదికగా జగన్ పాలనకు ఆయన కితాబు ఇవ్వడం జరిగింది. పార్టీలో గెలిచిన ఒకే ఒక్క ఎమ్ఎల్ఏ ప్రత్యర్థికి భజన చేయడం, పవన్ కి తలనొప్పిగా మారింది. ఈ విషయంలో రాపాకకు ఎన్నిసార్లు అంతర్గత చర్చలలో హితబోధ చేసినా, ఫలితం మాత్రం శూన్యం. రాపాక తీరుపై తన స్పందన తెలపాలని మీడియా అనేక సార్లు అడుగగా, పవన్ ముక్తసరిగానే ముగించాడు కానీ…గట్టిగా విమర్శించడం, హెచ్చరించడం చేయలేదు. దీనితో రాజకీయాలలో పవన్-రాపాక అభిప్రాయాలకు పొంతన లేకుండా పోతుంది.

హంకాంగ్, తైవాన్ లో శ్రీరాముడి ఫొటో వైరల్.. ఎందుకంటే?

తాజాగా మరో కీలక వ్యవహారంలో రాపాక జగన్ కి మద్దతుగా నిలిచి, నేనింతే అన్నట్లు ప్రవర్తించారు. రాజ్యసభ సభ్యుల ఎన్నిక కోసం జరిగిన ఎలక్షన్స్ లో రాపాక వైసీపీ కి అనుకూలంగా ఓటేశారు. ఏపీ అసెంబ్లీలో వైసీపీ బలం 151 సీట్లు కాగా..రాపాక ఓటుతో కలిపి ఆ పార్టీకి 152 ఓట్లు వచ్చాయి. టీడీపీ విప్ జారీ చేసిన నేపథ్యంలో రెబల్ ఎమ్ఎల్ఏ లు చెల్లని ఓట్లు వేసి తెలివిగా తప్పించుకున్నారు. జనసేన ఎంఎల్ఏ రాపాక మాత్రం ఒకప్పటి మిత్రపక్షమైన టీడీపీని కూడా కాదని…వైసీపీకి ఓటేసి పవన్ కి షాక్ ఇచ్చారు. మరి ఈ పరిణామం తరువాతైనా పవన్ రాపాకపై ఏదైనా చర్య తీసుకుంటారో లేక ఎప్పటిలాగే మౌనం వహిస్తారో చూడాలి.