
నేచురల్ స్టార్ నాని నిర్మాతగా విశ్వక్ సేన్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలను తెరకెక్కించిన క్రైమ్ థ్రిల్లర్ ‘హిట్’ సినిమా డీసెంట్ రివ్యూస్ తో పాటు డీసెంట్ కలెక్షన్స్ తో మంచి హిట్ అనిపించుకుంది. శైలేష్ కొలను అయితే నెక్స్ట్ ‘హిట్ 2’ తీస్తానని అంటూనే అవకాశం వస్తే నానిని కూడా డైరెక్ట్ చేస్తానని మనసులో మాటను ఇప్పటికే బయటపెట్టాడు, ఎలాగూ మంచి కథతో వస్తే కొత్తవారైనా సరే కలిసి పనిచేయడానికి ఉత్సాహం చూపుతుంటారు నాని.
సీఎం తీరుపై మండిపడుతున్న నెటిజన్లు..!
మరి అలాంటిది తన నిర్మాణంలోనే దర్శకుడిగా పరిచయమై మొదటి సినిమాతోనే ప్రూవ్ చేసుకున్న, తనతో సినిమా చేయాలని ఆశపడుతున్న శైలేష్ కొలనుకు నేచురల్ స్టార్ సినిమా ఛాన్స్ ఎందుకు ఇవ్వకూడదు. ఇచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీలో ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం నానికి శైలేష్ ఒక లైన్ చెప్పారని.. ఫుల్ స్క్రిప్ట్ చేసుకొని రమ్మని నాని, శైలేష్ కి చెప్పినట్లు తెలుస్తోంది.
రాహుల్ గాంధీ.. మరోసారి నవ్వులపాలు!
ఒకవేళ శైలేష్ స్క్రిప్ట్ నానికి నచ్చితే శైలేష్ కొలనుకు నాని ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. పైగా హిట్ సినిమాని చక్కగా రూపొందించి శైలేష్ కొలను ప్రేక్షకుల్లో మంచి మార్కులే తెచ్చుకున్నాడు. నాని సైతం శైలేష్ తన నమ్మకాన్ని నిలబెట్టింనందుకు సంతృప్తిగా ఉందని మీడియా సమక్షంలోనే చెప్పారు. మరి నాని నుండి శైలేష్ ఛాన్స్ కొట్టేసే అవకాశమే ఎక్కువ ఉంది.