
భారత్-చైనా సరిహద్దుల్లో గడిచిన నెలరోజులుగా ఘర్షణ వాతావారణం నెలకొంది. గత సోమవారం ఇరుదేశాల సైనికుల మధ్య జరిగిన దాడిలో భారత జవాన్లు 20మంది మృతిచెందడంతో సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఓవైపు శాంతివచనాలు వళ్లిస్తూనే డ్రాగన్ కంట్రీ సరిహద్దుల్లో భారత జవాన్లపై దొంగదాడికి దిగడంతో ఆ దేశంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతోన్నాయి. ఈనేపథ్యంలో కేంద్రం కూడా చైనా అంశంపై సీరియస్ దృష్టిసారింది.
బీజేపీ చర్యలకు… పవన్ జవాబుదారు కాదా?
భారత జవాన్లను దొంగదెబ్బ తీసిన చైనాకు తగిన గుణపాఠం చెప్పేందుకు భారత ఆర్మీ సిద్ధమవుతోంది. జవాన్ల మృతిపై రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ప్రధాని మోదీ చర్చించిన ఈమేరకు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి చైనా విషయంలో అనుసరించాల్సిన వ్యూహాన్ని చర్చించారు. అన్ని రాష్ట్రాల సీఎంలు కూడా భారత రక్షణ విషయంలో రాజీలేదని స్పష్టం చేశారు. భారత జవాన్లపై దొంగదాడికి దిగిన చైనాకు తగిన గుణపాఠం చెప్పాలని సూచించారు. చైనా విషయంలో ప్రధాని ఏ నిర్ణయం తీసుకున్న యావత్ దేశం మీవెంటే ఉంటుందని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
విమర్శించిన నోటితోనే జై కొట్టించుకున్న కేసీఆర్..!
ఇప్పటికే కేంద్రం చైనా విషయంలో బహుముఖ వ్యూహంతో ముందుకెళుతోంది. సరిహద్దుల్లో కమాండర్ స్థాయి అధికారులకు పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకునే అధికారం కట్టబెట్టింది. అదేవిధంగా సరిహద్దు యుద్ధవిమానాలను రెడీ చేసింది. త్రివిధ దళాలకు సిద్ధంగా ఆదేశాలను కూడా జారీ చేసింది. దీంతో భారత సరిహద్దుల్లో యుద్ధమేఘాలు ఆవరించాయి. అంతేకాకుండా చైనా కంపెనీలకు కేటాయించిన కాంట్రాక్ట్ లను రద్దు చేస్తోంది. చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులను ఆంక్షలు విధించేందుకు యత్నిస్తుంది. మరోవైపు భారతీయులు చైనా వస్తువులను బహిష్కరించాలని పెద్దఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. చైనాను ఆర్థికంగా దెబ్బకొట్టాలని భారత్ ప్లాన్ చేస్తోంది.
మరోవైపు చైనా సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఇప్పటికే గాల్వాన్ లోయలో ఘర్షణకు కారణమైన చైనా అటూ అరుణాచల్ ప్రదేశ్లోకి దూసుకొచ్చింది. దీంతో భారత బలగాలకు చైనాకు మధ్య ఉద్రికత్తలు నెలకొన్నాయి. భారత బలగాలు సమర్థవంతంగా చైనా సైన్యాన్ని అడ్డుకోవడంతో వెనక్కి వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికైనా భారత మిత్రదేశమైన నేపాల్ ను చైనా తనవైపు తిప్పుకుంది. చైనా అండగా సరిహద్దుల్లో నేపాల్ భారత భూభాగాన్ని తనదిగా ప్రకటించుకుంది. దీనిపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తత నెలకొంది.
హంకాంగ్, తైవాన్ లో శ్రీరాముడి ఫొటో వైరల్.. ఎందుకంటే?
ఇదిలా ఉంటే భారత్ పొరుగున ఉన్న బంగ్లాదేశ్ ను సైతం చైనా తనవైపు తిప్పుకునేందుకు తాయిళాలు ప్రకటిస్తూ ఆకర్షిస్తోంది. భారత్-చైనా ఘర్షణ జరిగిన మరునాడే బంగ్లాపై విధిస్తున్న కొన్ని టారీఫ్ లను చైనా మాఫీ చేసింది. జూలై 1నుంచి ఈ టారీఫ్లు అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే ఆసియా-పసిఫిక్ ట్రేడ్ అగ్రిమెంట్ ప్రకారం 3095 వస్తువులకు ఎలాంటి సుంకాలు లేకుండా వాణిజ్యం చేసే అవకాశాన్ని చైనా కల్పిస్తోంది. ఈ జాబితాలో మరిన్ని వస్తువులను చేర్చడం ద్వారా ఇరు దేశాలు మరింత దగ్గరయ్యే అవకాశం ఉంది.
బంగ్లా ఏర్పాటు భారత్ కీలక పాత్ర పోషించింది. భారత్-బంగ్లాదేశ్ మధ్య బలమైన సంబంధాలు ఉన్నాయి. కానీ ఎన్ఆర్సీసీ విషయంలో బంగ్లాదేశ్ కొంత అసంతృప్తితో ఉంది. ఇదే అదనుగా భావించిన చైనా బంగ్లాకు కొన్ని తాయిలాలు ప్రకటించిన తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. చైనా దేశం భారత్ కు ఎప్పటికి ప్రమాదకరమేననే భావన అందరిలో వ్యక్తమవుతోంది. చైనా దురాగతాలకు భారత్ తగిన గుణపాఠం చెప్పాలని డిమాండ్ విన్పిస్తోంది. అయితే శాంతియుతంగానే ఈ సమస్యను పరిష్కరించుకోవాలని ఇరుదేశాలు భావిస్తున్నాయి. అయితే చైనా వ్యవహరాన్ని కేంద్రం ఓ కంటకనిపెడుతూనే తగిన వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.