Home Blog Page 8440

రాజధాని తరలింపుపై ప్రభుత్వం వెనక్కి?


రాష్ట్రంలో మూడు రాజధానులలో భాగంగా కార్యనిర్వాహక రాజధానిని విశాఖ తరలించే విషయంలో ప్రభుత్వం ఒక పక్క అనధికారికంగా చర్యలు చేపడుతూనే ఉంది. మరోవైపు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ విషయంలో చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయంగా మారాయి. జూలై నాటికి రాష్ట్రంలో కరోనా కేసులు మూడు రేట్లయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తున్న నేపథ్యంలో రాజధాని తరలింపు ఆలోచన ప్రభుత్వానికి లేదన్నారు. కరోనా తీవ్రత తగ్గితే, అప్పుడు రాజధాని తరలింపుపై ఆలోచన చేస్తామని తిరుపతిలో చెప్పారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగంలో మూడు రాజధానుల అంశాన్ని పేర్కొనడంతో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంలో ఎటువంటి మార్పు లేదన్నారు.

చిరు-పవన్ ల మధ్య అగ్రతాంబూలమే అడ్డు..!

తాజాగా అసెంబ్లీలో పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదించి, మండలిలో మాత్రం ఆమోదించుకోలేక పోయిన ప్రభుత్వం చర్య వల్ల మంత్రులు, టీడీపీ ఎమ్మెల్సీలు బాహాబాహికి దిగారు. అంతా అయిపోయిన తరువాత కరోనా వైరస్ తగ్గే వరకు రాజధానిపై మాట్లాడమని మంత్రి చెప్పడం విడ్డురంగా ఉందని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. శాసన మండలిలో ప్రవేశపెట్టిన బిల్లు మండలి ఆమోదించక పోయినా 14 రోజుల అనంతరం సాంకేతిక కారణాల చూపి ఆమోదించినట్లుగా భావించి రాజధానిని తరలిస్తారనే వాదనలు వినిపిస్తున్నాయి.

మోడీ సెల్ఫ్ గోల్ వేసుకున్నాడా?

రాష్ట్ర బడ్జెట్ లో ఈ ఏడాది రూ. 600 కోట్లను విశాఖలో రాజధాని నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించింది. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఆర్కియాలజీ నిపుణులతో కలిసి విశాఖ బీచ్ సమీపంలో ఉన్న పలు స్థలాలను పరిశీలించారు. ఈ నేపథ్యంలో తరలింపు ఆగదని అందరూ భావిస్తున్న తరుణంలో పెద్దిరెడ్డి వ్యాఖ్యలు ఆసక్తి కరంగా మారాయి. దీంతో ప్రభుత్వం తాత్కాలికంగా వెనక్కి తగ్గిందనే విషయం వెల్లడైంది. ఇది రాజధాని వాసులను, ప్రతిపక్షాల దృష్టి మరల్చేందుకే ఇటువంటి చర్యలకు ప్రభుత్వం పాల్పడుతుందనే వాదనలు లేకపోలేదు. రాజధాని విషయంలో ప్రభుత్వం వ్యూహంలో మార్పు ఉండదు అనేది స్పష్టం అవుతోంది, తరలింపులో న్యాయపరమైన, సాంకేతిక కారణాలతో కొంత వరకూ ఆలస్యం జరగవచ్చని తెలుస్తోంది.

మంత్రి వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. మంత్రి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని సీపీఐ డిమాండ్ చేసింది. రాజధాని ప్రాంత రైతులు మంత్రి వ్యాఖ్యలను తప్పు బతుడున్నారు. రాజధాని అమరావతిలోనే ఎప్పటికీ కొనసాగించాలని కోరుతున్నారు. ఇతర పార్టీలు రాజధానిగా అమారావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్న విషయం విదితమే.

ఏపీ ఈఎస్ఐ స్కామ్ కు తెలంగాణకు సంబంధం ఏంటీ?


ఏపీలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశాక గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అక్రమాలపై దృష్టిసారించారు. ఇందులో భాగంగా టీడీపీ హయాంలో జరిగిన ఈఎస్ఐ కుంభకోణం వెలుగుచూసింది. 150కోట్ల మేర అవినీతి జరిగినట్లు అధికార పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఈఎస్ఐ కుంభకోణం కేసులో మాజీ మంత్రి అచ్చెన్నాయుడును ఏసీబీ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఆయనతోపాటు ఈ కేసులో సంబంధం ఉన్న పలువురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్న సంగతి తెల్సిందే.

చిరు-పవన్ ల మధ్య అగ్రతాంబూలమే అడ్డు..!

ఏపీలోని ఈఎస్ఐ కుంభకోణానికి సంబంధించిన లింకులు తెలంగాణలోని కోదాడలో బయటపడుతున్నాయి. ఆంధ్రా ఏసీబీ అధికారులు తెలంగాణలోని కోదాడలో రహస్యంగా విచారణ చేపట్టడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఈఎస్‌ఐ మందుల సరఫరా కుంభకోణంలో కోదాడకు చెందిన ఓ యువకుడికి సంబంధాలు ఉన్నట్లు తాజాగా వెల్లడైంది.ఈ కేసులో కోదాడకు చెందిన ప్రమోద్‌రెడ్డి ఏ–3 నిందితుడిగా అక్కడి ఏసీబీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఏపీ ఏసీబీ అధికారులు ఆదివారం కోదాడకు వచ్చి రహస్యంగా విచారణ చేపట్టడంతో కోదాడలో కలవరం మొదలైంది.

కోదాడకు చెందిన ప్రమోద్ రెడ్డి హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న టెలీహెల్త్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్లో డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈఎస్ఐ స్కాములో ఏ–1 నిందితుడిగా ఈఎస్‌ఐ మాజీ డైరెక్టర్‌ రమేష్‌కుమార్‌ను, ఏ–2గా మాజీమంత్రి అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేశారు. ఏ-3గా ఉన్న ప్రమోద్‌రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈఎస్ఐ కేసులో అచ్చెన్నాయుడు అరెస్టు అయినప్పటి నుంచి ప్రమోద్ రెడ్డి ఫోన్ స్వీచ్ ఆఫ్ చేసినట్లు అధికారుల విచారణలో తేలింది.

మోడీ సెల్ఫ్ గోల్ వేసుకున్నాడా?

ఈమేరకు ప్రమోద్ రెడ్డి కోసం ఏసీబీ అధికారులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. ప్రమోద్ రెడ్డి తల్లిదండ్రులు కోదాడలో ఉండడంతో ఏపీ ఏసీబీ అధికారులు ఆదివారం కోదాడకు వచ్చి రహస్య విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. ప్రమోద్ రెడ్డి బంధువులు, స్నేహితుల గురించి ఆరా తీసినట్లు తెలుస్తోంది. ప్రమోద్ రెడ్డి స్వగ్రామమైన అనంతగిరి మండలంలోనూ అధికారులు విచారణ చేపట్టి నిఘా పెట్టినట్లు సమాచారం.

ఏది ఏమైనా ఏపీలో జరిగిన ఈఎస్ఐ స్కామ్ కు తెలంగాణలో లింకులు బయట పడుతుండటం గమనార్హం. అధికారులు మరింత లోతుగా విచారణ చేపడితే మరిన్ని లింకులు బయటపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీలో జరిగిన ఈఎస్ఐ స్కామ్ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.

 

చిరు-పవన్ ల మధ్య అగ్రతాంబూలమే అడ్డు..!


జనసేన పార్టీలోకి చిరంజీవి వస్తాడా… రాడా అనే ప్రశ్న మెగా ఫ్యామిలీ అభిమానులతో పాటు ప్రజలలో ఎప్పటి నుండో నలుగుతుంది. ఈ ప్రశ్నకు నాగబాబు ఓ సారి తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వివరణ ఇచ్చారు. రాజకీయాల పట్ల విసుగెత్తిపోయిన చిరంజీవి మళ్ళీ రాజకీయాలలోకి రాకూడదని నిర్ణయించుకున్నారని…తన జీవితం సినిమా పరిశ్రమ మరియు దాని అభివృద్ధికే అంకితమని చెప్పారని అన్నారు. ఆయన జనసేన పార్టీలో చేరితే చేసిన వాగ్దానం తప్పినట్లు అవుతుంది కావున, ఆయన పార్టీలో చేరే అవకాశం లేదని చెప్పారు. ఐతే ఆయన చివర్లో …భవిష్యత్ మనం చెప్పలేం కాబట్టి ఆయన మనసు మారి వస్తే రావచ్చు అని కొంచెం తలుపులు తెరిచి వదిలేశారు.

మోడీ సెల్ఫ్ గోల్ వేసుకున్నాడా?

రాజకీయంలో ఇప్పుడే రాటుదేలుతున్న పవన్ కి అన్న చిరంజీవి తోడు ఉంటే బాగుండు అనే ఆశ, కొందరు జనసేన కార్యక్తలలో ఉంది. 2019 ఎన్నికల ఫలితాల తరువాత ఈ వాదన మరింత బలపడింది. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ 2009 అసెంబ్లీ ఎన్నికలలో మొదటిసారి బరిలోకి దిగి 16.22% ఓటు షేర్ తో 18 అసెంబ్లీ సీట్లు గెలుచుకుంది. 2019 అసెంబ్లీ ఎన్నికలలో జనసేన పార్టీ మొదటిసారి ఎలక్షన్స్ కి వెళ్లగా, కేవలం 5.53% ఓటు షేరుతో 1 సీటు మాత్రమే గెలుచుకుంది. మరి ఆ విధంగా చూస్తే పవన్ కంటే..చిరంజీవి సక్సెస్ ఫుల్ పొలిటీషియన్ అని చెప్పవచ్చు. అలాగే పవన్ కి మించిన ప్రజాకర్షణ, నమ్మకం చిరంజీవిపై ఉందన్న విషయం అర్థం అవుతుంది. చిరంజీవి జనసేనకు సపోర్ట్ గా ప్రచారం చేస్తే ఖచ్చితంగా ఎంతో కొంత ప్రయోజనం చేకూరడం ఖాయం.

కానీ చిరంజీవి జనసేన పార్టీలో అధికారికంగా చేరడం అటు పవన్ కి ఇటు చిరంజీవికి కూడా ఇష్టం లేని అంశం. దానికి కారణం ప్రాధాన్యత మరియు ఆధిపత్యం. చిరంజీవి పవన్ కి అన్నయ్య, వయసులో పెద్దవాడు. ఒక విధంగా చెప్పాలంటే పవన్ కి గాడ్ ఫాదర్. కాబట్టి ఒకవేళ జనసేనలో చిరంజీవి చేరితే ఆయన స్థానం ఏమిటీ? పార్టీకి పెద్ద చిరంజీవా లేక పవన్ కళ్యాణా? అనే సందేహం రాకపోదు. పెద్దవాడు కాబట్టి.. తాను స్థాపించిన పార్టీలో చిరంజీవికి మొదటిస్థానం ఇవ్వలేక.. అన్నయ్యను వెనకుంచి పార్టీకి పెద్దన్నలా ప్రవర్తించలేక ఆయన సతమతమయ్యే ప్రమాదం ఉంది. అలాగే చిరంజీవి సైతం పవన్ పెట్టిన పార్టీలో ప్రథమ స్థానం తీసుకున్నప్పటికీ… అపరాధ భావం ఫీలయ్యే అవకాశం ఉంటుంది. మరి ఇన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టే… చిరంజీవి జనసేన పార్టీ జోలికి వెళ్ళడు అనేది అక్షర సత్యం. అలాగే వీరిద్దరి స్వభావాలు కూడా విరుద్ధంగా ఉంటాయి. చిరంజీవిది సామరస్యం..పవన్ ది దూకుడు స్వభావం.

వైసీపీ ఎంపీ రఘురామ అసమ్మతి వెనుక అంతపెద్ద కథా?

raghurama-krishnam-raju-ysrcp-mp
raghurama-krishnam-raju-ysrcp-mp
ఎంకిపెళ్లి సుబ్బి చావుకొచ్చిదంటే ఇదే మరీ.. కొద్దిరోజులుగా వైసీపీలో అసమ్మతి గళం వినిపిస్తున్న వైసీపీ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు వ్యవహారం ఇప్పుడు ముదిరిపాకాన పడింది. ఆయన తాను వైఎస్ జగన్ బొమ్మ మీద గెలవలేదని అనడం..దానికి నర్సాపురం పరిధిలోని వైసీపీ ఎమ్మెల్యేలంతా భగ్గుమని నియోజకవర్గంలో రఘురామను కాలు కూడా పెట్టనీయమని హెచ్చరించడంతో ఈ వివాదం ముదిరింది.
వైసీపీ ఎమ్మెల్యేలు, కార్యకర్తల వార్నింగ్ తో రఘురామకృష్ణం రాజు సంచలన నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో తనకు ప్రాణహాని ఉందని.. కేంద్ర భద్రతా సిబ్బందితో తనకు రక్షణ కల్పించాలని ఏకంగా తాజాగా లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాయడం సంచలమైంది. అంతటితో ఊరుకోకుండా వైసీపీకి కోపం తెప్పించేలా తన పీఏతో కలిసి పశ్చిమ గోదావరి ఎస్పీకి ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని ఫిర్యాదు కూడా చేయించాడు.
ఇక తాజాగా స్పీకర్ రాసిన లేఖలో సీఎం వైఎస్ జగన్ కు ఆగ్రహం కలిగేలా పలు సీరియస్ ఆరోపణలు కూడా చేశాడు. ఆ లేఖలో వైసీపీ ఎంపీ రఘురామ పలు సంచలన ఆరోపణలు చేశారు. ‘ తిరుమల శ్రీవారి భూముల అమ్మకం అంశంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ ను కలవడానికి ప్రయత్నించానని అప్పటి నుంచి తన నియోజకవర్గంలో అలజడి సృష్టిస్తున్నారని ’  ఆరోపించారు.  ఇక ఏపీ ప్రభుత్వ ఇసుక వ్యవహారంలో ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపానని సామాన్యులకు న్యాయం చేయాలని కోరితే వైసీపీ ఎమ్మెల్యేలతో విమర్శలు చేయిస్తున్నారని వైసీపీ ఎంపీ తెలిపారు. నియోజకవర్గంలో అడుగు పెట్టనివ్వమని బెదిరిస్తున్నారన్నారు.  స్థానిక పోలీసులకు తన వ్యక్తిగత కార్యదర్శి ఫిర్యాదు చేసినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని లేఖలో స్పీకర్ కు ఫిర్యాదు చేశారు.
అయితే వైసీపీ నుంచి గెంటేయాలనే రఘురామ ఇదంతా చేస్తున్నాడని ఆ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. బీజేపీలో చేరేందుకే వైసీపీ ఎంపీ నానా రకాలుగా ప్రయత్నిస్తున్నారని.. వైసీపీపై ఆరోపణలు చేస్తున్నాడని అంటున్నారు. దీనిపై అసలు కథ ఏంటని ఆరాతీయగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయట..
2010లో ఈస్ట్ కోస్ట్ పవర్ అనే విద్యుత్ ఉత్పత్తి సంస్థ రఘురామకృష్ణ రాజుకు  ఉండేదట.. దీని మీద ఇప్పటికే ఆయన 947 కోట్ల రూపాయలను బ్యాంకులో లోన్ తీసుకున్నాడు. కానీ తీర్చలేకపోయాడు. దాని మీద రఘురామపై న్యూఢిల్లీలోని ఎకనామిక్ ఆఫీస్ వింగ్ లో కేసు నమోదైందట.. ఈ కేసు విచారణ రావడంతో వైసీపీలో ఉంటే ఇక లాభం లేదని.. బీజేపీలో చేరి ఆ కేసులు విచారణకు రాకుండా మాఫీ చేసుకోవాలని రఘురామకృష్ణం రాజు ఇదంతా చేస్తున్నట్టు ఢిల్లీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.
ఈ విద్యుత్ ఉత్పత్తి సంస్థ నుంచి అధిక ధరకు యూనిట్ కు విద్యుత్ కొనడానికి సీఎం వైఎస్ జగన్ అంగీకరించకపోవడంతో ఆయనపై రఘురామ కోపం పెంచుకున్నాడట…మరోవైపు అప్పులు తీర్చే మార్గం లేకపోవడంతో ఎలాగైనా కేసు నుంచి తప్పించుకునేందుకు బీజేపీలో చేరికనే బెస్ట్ ఐడియా అని వైసీపీ నుంచి వెలివేయించుకోవడానికి ఇంతగా తాపత్రాయపడుతున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
అయితే విషయం తెలిసిన సీఎం జగన్.. రఘురామను పార్టీ నుంచి సస్పెండ్ చేయకుండా.. అలాగే నియోజకవర్గంలో తిరగనీయకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తూ మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నాడట.. మరోవైపు బీజేపీ కూడా రఘురామను తీసుకునేందుకు ఆసక్తి చూపించడం లేదట.. ఇలా వైసీపీలో ఉండలేక.. బీజేపీలో చేరలేక తరుముకొస్తున్న కేసును ఎలా ఎదుర్కోలేక వైసీపీ ఎంపీ రఘురామ కిందామీదపడుతున్నట్టు పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికర చర్చ సాగుతోంది..

గుజరాత్ లో బోలెడు.. తెలంగాణ వేస్ట్ అంట: ఈటల

JP-nadda-trs
JP-nadda-trs
ఒక వేలితో ఎదుటివారిని చూపించే ముందు మిగతా నాలుగు వేళ్లు మనల్నే చూపిస్తాయన్న విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే విమర్శించడం సులువే. కానీ మన దుకాణమే సరిగా లేకుండా ఎదుటివారిని విమర్శించినప్పుడే నవ్వుల పాలు అవుతాం. ఇప్పుడు కేంద్రంలోని బీజేపీకి అలాంటి పరిస్థితే ఎదురైంది.
తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. కరోనా విషయంలో తెలంగాణ నిర్లక్ష్యం వహిస్తోందని.. చేతులు ఎత్తేసిందని విమర్శించాడు. దీనికి గులాబీ శ్రేణులు గట్టిగానే కౌంటర్ ఇస్తున్నాయి. మరి తెలంగాణలో వదిలేద్దామని.. దేశంలో మోడీ ప్రభుత్వం ఏం వెలగబెడుతోందని ప్రశ్నిస్తున్నారు.. పోనీ బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్ లో కరోనా కంట్రోల్ అయ్యిందా అంటే దారుణంగా ఉందంటున్నారు. ముందు తన దుకాణమే బాగా లేకున్నా తెలంగాణలో కరోనా నియంత్రణ లేదని ఆరోపించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శలపై గులాబీ శ్రేణులు మండిపడుతున్నాయి.
తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా చేసిన విమర్శలకు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ బాగానే కౌంటర్ ఇచ్చాడు. బీజేపీ చిల్లర మాటలు మాట్లాడుతోందని.. కరోనా అనేది ప్రపంచ సమస్య అయితే బీజేపీ జాతీయ అధ్యక్షుడు తెలంగాణలో కరోనా కట్టడి లేదనడం నవ్వుల పాలవుతోందన్నారు. ఇతరుల మీద ఆరోపణలు చేసే ముందు బీజేపీ పాలిత ప్రాంతాలు ఏం చేస్తున్నాయో తెలుసుకోండని హితవు పలికారు. గుజరాత్ లో కరోనాతో ఎంతమంది చనిపోయారు? గుజరాత్ లో ప్రభుత్వం విఫలమైందా? గుజరాత్ నుంచి ప్రధాని బాధ్యత వహిస్తారా? అని ఆయన ప్రశ్నించారు. మర్కజ్ ఢిల్లీ ప్రార్థనలు ప్రధాని ఉండే పక్కనే జరిగినా మీరు ఏం పట్టించుకోలేదని విమర్శించారు.
బీజేపీ జాతీయ నాయకులు స్థానిక తెలంగాణ నేతల ప్రోద్భలంతో మాట్లాడుతున్న మాటలకు కేసీఆర్ సహా ఈటలలు పలు సందర్భాల్లో గట్టి వార్నింగ్ లే ఇస్తున్నారు. తెలంగాణలో ఆదాయ వ్యయాలపై ఆ మధ్య కేసీఆర్ ఏకంగా హోంమంత్రి అమిత్ షాకే లెక్కలు చెప్పి ఆయనవి దొంగ లెక్కలు అని నిరూపించడం జాతీయ స్థాయిలో అమిత్ షా పరువును గంగలో కలిపింది. ఇప్పుడు బీజేపీ జాతీయ అధ్యక్షుడికి ఈటల కూడా కౌంటర్ ఇవ్వడం బీజేపీకి పోటులా మారింది.
ఏ ఎండకా గొడుగు పడుతున్న బీజేపీ నాయకుల విమర్శలు ఏ రాష్ట్రంలో ఏం మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి. దేశానికి నాయకత్వం వహిస్తున్న బీజేపీ నేతలు ఒకటి గుర్తు పెట్టుకుంటే మంచిందని నేతలు హితవు పలుకుతున్నారు. దేశమే వారి చేతుల్లో ఉంది. దేశంలో జెట్ స్పీడులా కేసులు పెరుగుతున్నాయి. అది కంట్రోల్ చేయలేక తెలంగాణపై ఏడిస్తే ఎలా అని ఈటల సహా టీఆర్ఎస్ నేతలు బీజేపీ తీరును ఎండగడుతున్నారు.

బాలయ్య వంద  కోట్లు మార్క్ కోసం.. ? 

balakrishna-bb3
balakrishna-bb3
మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్  లాంటి స్టార్ హీరోల సినిమాలు వంద  కోట్లు మార్క్ ను ఎప్పుడో దాటేశాయి.   ఇక సీనియర్ స్టార్ హీరోల్లో మెగాస్టార్ వంద  కోట్లు మార్క్ ను దాటితే, వెంకటేష్ కూడా డెబ్భై  కోట్లు మార్క్ ను  దాటాడు. కానీ పాపం బాలయ్య సినిమాలే  ఈ మధ్య గట్టిగా పది కోట్లు కూడా కలెక్ట్ చేయలేని  దుస్థితిలోకి వెళ్లిపోయాయని బాలయ్య ఫ్యాన్సే ఫీల్ అవుతున్నారు. అయినా వరుసగా డిజాస్టర్లు ఇవ్వడం బాలకృష్ణకు కొత్తేమి కాదు, ‘సింహా’కి ముందు బాలకృష్ణ సినిమాల ప్లాప్ ల పరంపర అందరికీ ఇంకా గుర్తు ఉంది. అయితే  ‘సింహా’తో  బాలయ్యకు సాలిడ్  హిట్ వచ్చింది.

మళ్లీ ఇప్పుడు బాలకృష్ణకు ‘సింహా’ లాంటి హిట్ కావాలి.   ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో  రాబోతున్న సినిమాతో అలాంటి హిట్ కొట్టాలని ప్లాన్ చేసుకుంటున్నాడు.  అందుకే  ఈ సినిమా కథను కొత్తాగా తీసుకున్నారు. బాలయ్య బాబు ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాల్లో  పూర్తి ఆధ్యాత్మిక వేత్తగా కనిపించబోతున్నాడు.  ఇంతకీ ఆధ్యాత్మిక వేత్తగా బాలయ్య ఎందుకు మారాడు ? ఎలా మారాడు ? దాని వెనుక ఉన్న  గతం ఏమిటి అనే కోణంలో  ఒక చిన్న ఎమోషనల్ స్టోరీ  ప్లాష్ బ్యాక్ రూపంలో వస్తోందట.  మొత్తానికి బాలయ్య బాబు డిజాస్టర్ల దెబ్బకి   కొత్తగా ట్రై చేస్తున్నాడు

ఎలాగైనా వంద  కోట్లు మార్క్ ను దాటాలనే లక్ష్యంతో బాలయ్య – బోయపాటి ఈ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనుండగా తమన్ సంగీతం సమకూరుస్తున్నారు.  మరి మిర్యాల రవీందర్ రెడ్డికి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ను ఇస్తోందో.   

ఆ ఎంపీపై చర్యలకు జగన్ వెనుకడుగు వేశారా?

వైసీపీకి కొరకరాని కొయ్యగా తయారైన నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు విషయంలో చర్యలకు ఆ పార్టీ ముందుకు వెళ్లలేకపోతుంది. అసెంబ్లీ సమయంలో వైసీపీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఎంపీ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తాను జగన్ బొమ్మ పెట్టుకుని గెలవలేదని, ఎమ్మెల్యేలు తన బొమ్మపెట్టుకుని గెలిచారన్నారు. ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే తాను చేస్తానని చెప్పారు. వైసీపీ ఎమ్మెల్యేలను పరోక్షంగా పందులుగా సంభోధించారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల అనంతరం ఎంపీపై చర్యలు ఉంటాయని భావించారు. అయితే సమావేశాలు ముగిసి మూడు రోజులు అవుతున్నా ఆ విషయంపై వైసీపీ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.
ఎంపీ రఘురామ కృష్ణంరాజు విషయంలో వైసీపీ చర్యలు తీసుకునే ధైర్యం చేయడం లేదు. ఇందుకు కారణం లేక పోలేదు. రఘురామ కృష్ణంరాజు బీజేపీతో సత్సంబంధాలు కలిగి ఉన్నారు. అతనిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే వెంటనే బీజేపీలో చేరతారు. దీని వల్ల వైసీపీకి వచ్చే లాభం ఏమీ లేదు. అదేవిధంగా ఎంపీ రాజుకు వచ్చే నష్టం ఏమీ లేదు, మరో నాలుగేళ్లు ఆయన ఎంపీగా కొనసాగుతారు. రాజును సస్పెండ్ చేయడం వల్ల ఆయనతో పాటు మరి కొంతమంది ఎంపీలు బీజేపీలో చేరతారనే సమాచారంతోనే వైసీపీ అధిష్టానం చర్యలకు వెనుకాడుతుందని తెలుస్తోంది.
కొద్దీ రోజుల కిందట వైసీపీ ఎంపీలు పది మంది బీజేపీ లో చెరతారని వార్తలు వచ్చాయి. దీంతో ఎంపీ రఘురామ కృష్ణంరాజును సస్పెండ్ చేయడం వల్ల అతను బీజేపీలో చేరితే మరికొంత ఎంపీలు ఆ బాట పెట్టె అవకాశం ఉందని పార్టీలో చర్చలు జోరుగా సాగితున్నాయి. ప్రస్తుతం 23 ఎంపీలతో దేశంలో నాల్గవ అతి పెద్ద పార్టీగా వైసీపీ ఉంది.
ఇప్పుడు ఎంపీలను దూరం చేసుకోవడం వల్ల పార్టీయే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని పార్టీ అధిష్టానం భావిస్తోంది. దీంతో ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై చర్యలు తీసుకునేందుకు పార్టీ అధినేత జగన్ సిద్ధంగా లేరు. మరోవైపు ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహారంలో అతిగా స్పందించవద్దని స్థానిక పార్టీ నేతలకు సూచించినట్లు సమాచారం. దీంతో  ఈ విషయాన్ని తాత్కాలికంగా తెరమరుగు చేయాలని వైసీపీ భావిస్తోంది.

అరె.. నాని సినిమాకి ముగింపు లేదట !

Nani-v-Movie-Updates

టాలెంటెడ్ డైరెక్టర్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని – సుధీర్ బాబు కలయికలో రాబోతున్న చిత్రం ‘వి’. అయితే ఈ సినిమా ఎండింగ్ గురించి ఒక ఇంట్రస్టింగ్ అప్ డేట్ ఫిల్మ్ సర్కిల్స్ లో హల్ చల్ చేస్తోంది. ఈ సినిమా కథకు ముగింపు లేదట. అంటే సినిమా ముగిసిన చోట నుండే మరో కొత్త కథ స్టార్ట్ అవుతుందట. అంటే ఈ చిత్రానికి సీక్వెల్ టైపు.. మొత్తానికి ఈ సినిమాకి సీక్వెల్ ఉండటానికి అవకాశం ఉంది అన్నమాట.

మరి ఈ సినిమాకొచ్చే సక్సెస్ ను బట్టి సీక్వెల్ చేయాలా వద్దా అనేది డిసైడ్ చేయాలని మేకర్స్ ప్లాన్ లో ఉన్నారు. ఇక ఈ సినిమాలో నాని, సుధీర్ బాబు మ‌ధ్య నువ్వా నేనా? అనేలా యాక్ష‌న్ సీన్స్ ఉంటాయట. సినిమాలో ఇవే ప్రధాన ఆకర్షణగా ఉంటాయట. పైగా ఇంద్రగంటి అంటేనే వైవిధ్యం. నానితో చేసిన రెండు సినిమాల్లోనూ నానిని డిఫ‌రెంట్‌ యాంగిల్ లో చూపించి సక్సెస్ కొట్టాడు.

మళ్ళీ ఇప్పుడు నానిని విలన్ క్యారెక్ట‌ర్‌లో ఆవిష్క‌రిస్తూ.. సుధీర్‌బాబును ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ రోల్‌ లో చూపిస్తున్నాడు. ఈ సినిమాలో బ్యూటీఫుల్ ల‌వ్‌స్టోరీ కూడా ఉంటుందట. హిట్ సినిమాల నిర్మాత దిల్‌రాజు శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ నిర్మాణంలో శిరీష్‌, హ‌ర్షిత్ రెడ్డి నిర్మాత‌లుగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

‘సిటీమార్’లో  సునీల్ దశ తిరుగుతుందా ? 

Suneel
Suneel
 
గత కొన్ని సినిమాలుగా హిట్ కోసం గోపీచంద్‌ చేయని ప్రయత్నం లేదు. వచ్చిన యాక్షన్ హీరో  ఇమేజ్ ను కాపాడుకోవాటానికి ఈ హీరో బాక్సాఫీస్ వద్ద పోరాడుతూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే చేస్తోన్న  సినిమా ‘సిటీమార్’.  సంపత్‌ నంది డైరెక్షన్ లో రాబోతున్న  ఈ  స్పోర్ట్స్‌ బేస్డ్‌ మూవీలో  మిల్క్ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా  నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో కామెడీ కోసం కోచ్ అసిస్టెంట్ పాత్రను  చాలా వైవిధ్యంగా మలిచారని తెలుస్తోంది. ఆ పాత్రలో  సునీల్ నటిస్తున్నాడట. చాల కాలం తరువాత  సునీల్ కి మంచి కామెడీ క్యారెక్టర్ దొరికిందట. మరి సునీల్ కి ఈ సినిమాతో దశ తిరుగుతుందేమో చూడాలి.     
 
ఇక ఈ సినిమాలో గోపీచంద్  ఆంధ్రాకి లీడ్‌ చేసే ఫీమేల్‌ కబడ్డీ టీమ్‌కి కోచ్‌గా చేస్తుండగా..  తమన్నా తెలంగాణ ఫీమేల్‌ కబడ్డీ టీమ్‌ కోచ్‌గా నటిస్తోంది.  వీరిద్దరి మధ్య నడిచే ట్రాక్ వెరీ ఇంట్రస్ట్  గా ఉంటుందట. అయితే ఈ సినిమాలో కొన్ని చోట్ల ఓవర్ గా యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయని.. ప్రస్తుత పరిస్థితుల్లో  ఆ యాక్షన్ సీక్వెన్స్  షూట్ చేయటం సాధ్యం కాదని  వాటిని తొలిగిస్తున్నట్లు తెలుస్తోంది. అంటే సినిమాలో యాక్షన్ తగ్గించి  పక్కా కామెడీ అంశాలను హైలెట్ అయ్యే విధంగా  ప్లాన్ చేస్తున్నారట.
 

 అయితే గోపీచంద్ ఎన్నో ఆశలతో  సంపత్ నంది  దర్శకత్వంలో చేసిన  గౌతమ్ నంద చిత్రం పరాజయం అయింది. అందుకే ఈ సారి ఎలాగైనా  గోపిచంద్ కి  సూపర్ హిట్ ఇవ్వాలనే కసితో బాగా పట్టుదలగా ఉన్నాడు సంపత్ నంది.  మరి ఈ సారి ఈ రేంజ్ హిట్ ఇస్తాడో చూడాలి.

ఫాదర్స్ డే.. చిరు భావోద్వేగ ట్వీట్

ramcharan-grandfather

ramcharan-grandfather

మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చాక నిత్యం అభిమానులతో టచ్లో ఉంటున్నారు. నేడు నేడు ఫాదర్స్ డేను పురస్కరించుకొని మెగాస్టార్ తన తండ్రి, కొడుకుతో కూడిన ఫొటోను అభిమానులకు షేర్ చేశారు. ఈ సందర్భంగా తన తండ్రిని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. ట్వీటర్లో ఆయన చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

ఫాదర్స్ డే సందర్భంగా పలువురు సెలబ్రెటీలు తండ్రితో తమకున్న తీపి జ్ఞాపకాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఈక్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి తన తండ్రితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. చిరంజీవి తండ్రి వెంకట్రావుకు సంబంధించిన ఓ పిక్ ను ట్వీటర్లో షేర్ చేశాడు. తన మనవడు రామ్‌చ‌ర‌ణ్ ను తన తండ్రి వెంక‌ట్రావు ఎత్తుకున్న ఫొటోను చిరంజీవి అభిమానులతో పంచుకున్నారు. దీనికి ‘మై చార్మింగ్ డాడ్‌తో చిరుత’ అంటూ ట్వీట్ చేశాడు. ‘మా నాన్న నవ్వు …నా బిడ్డ చిరునవ్వు.. రెండు నాకు చాలా ఇష్టం’ అంటూ ట్యాగ్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా మెగా ఫ్యాన్స్ చిరంజీవికి హ్యాపీ ఫాదర్స్ డే కామెంట్స్ పెడుతూ విషెస్ తెలుపుతున్నారు.

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి-కొరటాల శివ కాంబినేషన్లో ‘ఆచార్య’ మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీకి రాంచరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. చిరంజీవి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాక ఆయన సినిమాలన్నీంటికి రాంచరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ‘ఖైదీ-150’, ‘సైరా’ల మూవీలను చిరంజీవితో నిర్మించాడు. తాజాగా ‘ఆచార్య’ను రాంచరణ్ నిర్మించడంతోపాటు ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. చిరుకు జోడీగా కాజల్ ఆగర్వాల్ నటిస్తుంది. ఆచార్య సినిమాకు మణిశర్మ అదిరిపోయే సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.

జగన్ స్పూర్తితో ఆ స్టార్ హీరో సీఎం కావాలట. 

Y S Jagan Mohan reddy, Tamil stars, Tamil Hero vijay, Dalapathi Vijay news, Kumbakonam, Vijay fans, Tamil Nadu news,
తమిళ తంబీలకు ఒక పట్టాన ఎవరూ నచ్చరు..నచ్చితే వదిలిపెట్టరు. ప్రాంతీయవాదం, భాషాభిమానం వేళ్లూనుకున్న తమిళ గడ్డపై ఇతర రాష్ట్రాలకు చెందిన నటుడైన, నాయకుడైనా రాణించడం..వారి మనసు గెలుచుకోవడం చాలా కష్టం. ఐతే ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన ప్రత్యేకత చాటుకుంటున్నారు. తమిళ యువతలో ఆయనకు ఓ క్రేజ్ ఏర్పడింది. అనేక ప్రజాభిప్రాయ వేదికలపై మరియు సోషల్ మాధ్యమాలలో వారు జగన్ పట్ల అభిమానం చూపారు. జగన్ ఆధునిక రాజకీయాలలో మంచి పరిపాలనా దక్షుడని వారు అభినందించడం విశేషం.
తరచుగా తమిళనాట సినీ మరియు రాజకీయ కార్యక్రమాలకు సంబంధించిన ఫ్లెక్సీలపై జగన్ ఫోటో దర్శనం ఇవ్వడం చెప్పుకోదగ్గ అంశం.తాజాగా ఈ సంఘటన పునరావృతం అయ్యింది. జూన్ 22 దళపతి విజయ్ పుట్టినరోజు. ఈ సంధర్భంగా తమిళనాడులో కొందరు అభిమానులు విజయ్ కి బర్త్ డే విషెష్ చెవుతూ ఫ్లెక్సీ ఏర్పటు చేశారు. ఆ ఫ్లెక్సీ లో విజయ్ ఫొటోతో పాటు సీఎం జగన్ ఫోటో కూడా ఉంది. ఆ బ్యానర్ లో విజయ్ రాజకీయ అరంగేట్రం చేసి  రాజకీయాలలో కీలక శక్తిగా ఎదగాలన్నట్టు, వాళ్ళు కొటేషన్స్ రాయడం జరిగింది.
ఒంటరిగా పదేళ్లు పోరాడి సీఎం పదవి దక్కించుకున్న జగన్మోహన్ రెడ్డి స్ఫూర్తిగా విజయ్ రాజకీయాలలో ఎదగాలని…సీఎం కావాలని కోరుకుంటున్నారు. సంకల్పంతో ముందుకు వెళితే సాధ్యం కానిది ఏమిలేదని, దానిని జగన్ నిదర్శనం అని తమ హీరోకి గుర్తు చేస్తున్నారు. కొంత కాలంగా విజయ్ కి రాజకీయ వేధింపులు ఎక్కువయ్యాయి. స్థానిక ప్రభుత్వాలతో పాటు, కేంద్రంలో ఉన్న బీజేపీతో ఆయనకు పట్టింపులు వచ్చాయి. బీజేపీ తీసుకు వచ్చిన ఎన్ఆర్సి మరియు సిఏఏ చట్టాలకు వ్యతిరేకమని ఆయన పరోక్షంగా చెప్పారు. ఆయన చేసిన సర్కార్, మెర్సల్ సినిమాలలో కేంద్రరాష్ట్ర  ప్రభుత్వాల నిర్ణయాలను ఉద్దేశిస్తూ ఘాటు విమర్శలు ఉన్నాయి.
ఈనేపథ్యంలో బీజేపీ కార్యకర్తలు ఆమధ్య మాస్టర్ మూవీ షూటింగ్ ని అడ్డుకోవడం జరిగింది. అలాగే విజయ్ పై ఐటీ దాడులు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో తమ హీరో రాజకీయంగా ఎదిగిచక్రం తిప్పాలని..ఆయనను ఇబ్బంది పెడుతున్న వారికి చెక్ పెట్టాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అందుకే విజయ్ తండ్రి గారైన ఎస్ ఏ చంద్రశేఖర్ పై ఒత్తిడి తెస్తున్నారు. విజయ్ రాజకీయాలలోకి ప్రవేశించేలా ప్రేరేపించాలని కోరుతున్నారు. కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో విజయ్ రాజకీయాల వైపు అడుగువేయకపోవచ్చు.

మోడీ సెల్ఫ్ గోల్ వేసుకున్నాడా?

నిన్నటి అఖిలపక్ష వీడియో సమావేశం మంచి వాతావరణంలో జరిగింది. చైనాతో జరుగుతున్న ఘర్షణలో అన్ని పార్టీల నాయకులను విశ్వాసం లోకి  తీసుకోవటం అభినందించదగ్గ విషయం. ఇటువంటి సమయాల్లో అందరిని కలుపుకొని వెళ్ళటం ఎంతో అవసరం. దానికి తగ్గట్టుగానే అందరూ కూడా ప్రభుత్వం వెనక నిలబడటమే కాకుండా మోడీని అభినందించటం కూడా జరిగింది. ఒక్క సోనియా గాంధీ మాత్రమే భిన్న స్వరాన్ని వ్యక్తపరచింది. ఆమెకు మద్దత్తుగా ఏ ఒక్క పార్టీ నాయకుడు కూడా నిలబడలేదు. ఈ సమయంలో రాజకీయాలకు తావులేదనే సెలవిచ్చారు. ఇది శుభ పరిణామం. మహాభారతం లో ధర్మరాజు చెప్పినట్లు మాలోమాకు ఎన్ని తగాదాలున్నా      బయటివాళ్ళు వచ్చినప్పుడు మాత్రం మేము 105 మందిమి ఒక్కటే . అదే సూత్రం , అదే వారసత్వం ఇప్పుడు కొనసాగాలి. దురదృష్టవశాత్తూ సోనియా గాంధీ ఆ లైన్ తీసుకోకపోవటం విచారకరం.

అంతవరకూ బాగానే వున్నా చివరలో మోడీ చేసిన తుది పలుకులు మొత్తం దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేశాయి. అమరవీరులకు జోహార్లు అర్పించటం, సైన్యాన్ని ప్రశంసించటం లాంటి మాటలు ఉత్తేజాన్నిఇచ్చినా రెండు వాక్యాలు అందరినీ ఒక్క నిముషం షాక్ కి గురిచేసినాయి. మన భూభాగం లోకి ఎవరూ చొరబడలేదని, ఇప్పుడూ ఎవరూ లేరని, మన భారత పోస్టు ని ఎవరూ స్వాధీనం చేసుకోలేదని చెప్పటం ఒకనిముషం నోట మాట రాలేదు. అదేసమయంలో మన జవాన్లు గట్టి జవాబిచ్చారని చెప్పినా ముందు మాటలే అందరి చెవుల్లో ఏదో వినరానిది విన్నట్లుగా అనిపించింది. ఆ షాక్ నుంచి తేరుకోవటానికి కొంచెం టైం పట్టింది.

నిజంగా చైనా మన  భూభాగం లోకి  చొచ్చుకు రాలేదా? రాకపోతే మన సైనికులు ఎందుకు బలిదానం చేసినట్లు? ఇది అందరి మదిలో కదిలాడే ప్రశ్న. వచ్చిన వారిని తిప్పికొట్టారని చెప్పటం వేరూ  , అసలు మన భూభాగం లోకి రాలేదని వ్యాఖ్యానించటం ఆశ్చర్యంగా వుంది. మోడీ అలా ఎందుకు మాట్లాడవలిసి వచ్చిందో అంతుబట్టటంలేదు. ఒకవేళ వ్యూహాత్మకంగా ప్రస్తుతం పరిస్థితిని శాంతపరచాలని అనుకున్నా మోడీకి అ అధికారం వుంది. మోడీ ఏం చేసినా దేశాహితం కోసమే చేస్తాడని అనుకుంటారు. కాబట్టి అంతవరకూ ఇబ్బందిలేదు. కానీ అలా వ్యాఖ్యానించి వుండాల్సింది కాదు. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత సరిహద్దులో రోడ్లు ఇతర మౌలిక సౌకర్యాలు త్వర త్వరగా నిర్మించటం, అధునాతన ఆయుధాలు, విమానాలు కొనటం , సైన్యం నైతిక బలాన్ని పెంచటం లాంటి అనేక చర్యలు చేపట్టిన మాట వాస్తవం. అంతమాత్రాన ఇలా మాట్లాడటం మింగుడుపడటం లేదు. దేశప్రజలందరికీ మోడీ పై పూర్తి విశ్వాసం వుంది. ఈ తరుణంలో ఇటువంటి మాటలు ప్రజల స్థైర్యాన్ని , నైతిక బలాన్ని దెబ్బ తీస్తాయి. ఇలా మాట్లాడి వుండాల్సింది కాదు. ఏదేమైనా ఇది దేశ ప్రజలకి పెద్ద షాకే.

‘ఎన్టీఆర్’ కొత్త బిజినెస్.. ఐడియా సూపర్ !


మన స్టార్ హీరోలు సినిమాలతో పాటు బిజినెస్ లు కూడా పర్ఫెక్ట్ గానే ప్లాన్ చేసుకుంటున్నారు. కొత్తగా ఎన్టీఆర్ కొత్త బిజినెస్ ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే నాగార్జున స్టూడియో, నిర్మాణంతో పాటు వేరే వ్యాపారాలు కూడా చేస్తున్నాడు. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు ఏఎంబీ సినిమాస్ మల్టీప్లెక్స్ తో థియేటర్స్ బిజినెస్ తో పాటు ఎంబీ ప్రొడక్షన్స్ అనే పేరుతో మూవీ ప్రొడక్షన్ కూడా చేస్తున్నాడు. తన సినిమాలనే కాకుండా బయట హీరోలతో కూడా సినిమాలను ప్రొడ్యూస్ చేస్తున్నాడు మహేష్. ఇంతకీ ఎన్టీఆర్ ప్లాన్ చేస్తోన్న బిజినెస్ ఏంటంటే ‘యువ’ అనే టీవీ ఛానెల్ పెట్టబోతున్నాడు.

కరోనా ఎఫెక్ట్.. ఉద్యోగులకు ప్రభుత్వం కీలక ఉత్తర్వులు..

ప్రస్తుతం ఈ న్యూస్ ఫిల్మ్ సర్కిల్స్‌లో హాట్ గాసిప్ గా హల్ చల్ చేస్తోంది. ఎన్టీఆర్ మామయ్య నార్నె శ్రీనివాస రావుకి ఇప్పటికే ఒక టీవీ ఛానల్ ఉంది. అయితే ఎన్టీఆర్ ఆ ఛానెల్ కు అనుసంధానంగా తన మామయ్య సహాయంతో మరో కొత్త ఛానెల్ ప్రారంభించబోతున్నాడని.. ఆ టీవీ ఛానెల్‌ పేరు ‘యువ’ అని తెలుస్తోంది. మొత్తానికి పేరు ఆసక్తికరంగా అనిపిస్తుంది.

‘పది’ పరీక్షలపై ఏపీ నిర్ణయం ఇదే..!

ఇక గత కొన్నేళ్లుగా థియేటర్ల వ్యాపారం కంటే కూడా టీవీ పరిశ్రమల వ్యాపారం బాగుండటం, కొత్తగా ఓటీటీ పరిశ్రమ కూడా బాగా పుంజుకుంటుండటంతో ఎన్టీఆర్ టీవీ బిజినెస్ లోకి దిగుతున్నాడట. మరి ఎన్టీఆర్ మరియు ఆయన టీవీ బృందం ప్రేక్షకుల కోసం ఎలాంటి కార్యక్రమాలను ప్లాన్ చేస్తారో చూడాలి.

త్వరలోనే మార్కెట్లోకి కరోనా మెడిసిన్


కరోనా మహ్మమరికి సైంటిస్టులు వాక్సిన్ కనుగోనేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. కరోనా ఉసరవెల్లిలా రూపాంతారం చెందుతుండటంతో వాక్సిన్ కనుగోనడం కొంచెం కష్టంగా మారింది. అయినప్పటికీ శాస్త్రవేత్తలు పట్టువదలని విక్రమార్కుడిలా కరోనాకి వాక్సిన్ కనిపెట్టే పనిలో నిమగ్నమయ్యారు. ఇదిలా ఉంటే భారత దిగ్గజ కంపెనీ కరోనాకు మెడిసన్ తయారుచేసింది. దీనికి కేంద్రం ప్రభుత్వం అనుమతి లభించడంతో త్వరలోనే మార్కెట్లో రానుంది.

కరోనా ఎఫెక్ట్.. ఉద్యోగులకు ప్రభుత్వం కీలక ఉత్తర్వులు..

కరోనా వైరస్ పేరు చెబితేనే ప్రపంచం బెంబెలెత్తిపోతున్నాయి. అగ్రరాజ్యాలు సైతం ఈ మహమ్మరి దాటికి కాకవికలం అవుతున్నాయి. భారత్లోనూ కరోనా కేసుల సంఖ్య రోజుకురోజుకు పెరుగుతోంది. ఈనేపథ్యంలోనే భారత ఫార్మా దిగ్గజ కంపెనీ గ్లెన్‌ మార్క్‌ కరోనా నివారణ మందును ఆవిష్కరించినట్లు వెల్లడించింది. ఇప్పటికే తాము మూడు దశల్లో క్లినికల్‌ ట్రయల్స్‌ విజయవంతంగా నిర్వహించినట్లు ఆ కంపెనీ ప్రకటించింది. ఈ మెడిసిన్ కరోనా స్వల్ప, మధ్యస్థ లక్షణాలతో బాధపడుతున్న వారిపై బాగా పనిచేస్తోందని సదరు కంపెనీ వెల్లడించింది.

‘ఫాబిఫ్లూ బ్రాండ్‌’ పేరిట మెడిసిన్ ను మార్కెట్లోకి విడుదల చేసేందుకు అవసరమైన అనుమతులను శుక్రవారం భారత ఔషధ నియంత్రణ సంస్థ నుంచి అనుమతి లభించిందని గ్లెన్ మార్క్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గ్లెన్ సల్దన్హా ప్రకటించారు. కరోనాపై ‘ఫాబిఫ్లూ’నే తొలి ఓరల్‌ ఔషధమని ఆ సంస్థ వెల్లడించింది. త్వరలోనే దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వంతో తమ సంస్థ కలిసి పనిచేస్తుందని వెల్లడించారు. వైద్యుల ప్రిస్క్రిప్షన్‌ ఆధారంగానే ఈ ఔషధాన్ని విక్రయించనున్నట్లు తెలిపారు. ఈ మెడిసిన్ ధర కూడా తక్కువ ధరలో లభించడనుండటం విశేషం. ఒక్కో మాత్ర ధర రూ.103 మాత్రమేనని పేర్కొంది.

‘పది’ పరీక్షలపై ఏపీ నిర్ణయం ఇదే..!

దేశంలో కరోనా కేసులు విజృంభిస్తున్న తరుణంలో తమ కంపెనీకి అనుమతి లభించాయని ఆ సంస్థ తెలిపింది. తమ మెడిసిన్ వాడటం ద్వారా వైద్యులు, రోగులపై ఒత్తిడిని తగ్గించే అవకాశం ఉంటుందన్నారు. క్లినికల్‌ ట్రయల్స్‌లో ఫాబిఫ్లూను కరోనా రోగులపై సత్ఫలితాలిచ్చిందని పేర్కొన్నారు. స్వల్ప కరోనా లక్షణాలు, మధ్య స్థాయిలో ఉన్నవారిపై ఈ ఔషధం బాగా పని చేసిందని తెలిపారు. వీరితోపాటు డయాబెటిక్‌, గుండె జబ్బు వ్యాధిగ్రస్తులు కూడా ఈ ఔషధాన్ని ఉపయోగించవచ్చని తెలిపారు. నాలుగు రోజుల్లోనే వైరల్‌ లోడ్‌ తగ్గిస్తుందని ఆ సంస్థ వెల్లడించింది. ఎట్టకేలకు భారత మార్కెట్లోకి కరోనా మెడిసిన్ రావడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

కరోనా ఎఫెక్ట్.. ఉద్యోగులకు ప్రభుత్వం కీలక ఉత్తర్వులు..


తెలంగాణలో కరోనా పంజా విసురుతోంది. రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతోన్నారు. శుక్రవారం ఒక్కరోజు తెలంగాణలో 499 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇన్ని కేసులు ఒకే రోజులో నమోదుకావడం ఇదే తొలిసారి. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలోనే 329కేసులు నమోదవడం గమనార్హం. రాష్ట్రంలో మొత్తంగా ఇప్పటివరకు 6,526కరోనా కేసులు నమోదుకాగా 198కరోనాతో మృతిచెందారు. అయితే ప్రభుత్వం కరోనా కట్టడికి ఎన్ని చర్యలు చేపట్టిన కంట్రోల్ కావడంలేదని అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

కేసీఆర్ కరుణిస్తాడా? కాలదన్నుతాడా?

దీంతో ప్రభుత్వం జీహెచ్ఎంసీ పరిధిలో 50వేలమందికి కరోనా టెస్టులు చేసేందుకు రెడీ అయింది. దీంతో కరోనా కేసులు మరింత ఎక్కువగా నమోదవడం ఖాయంగా కన్పిస్తుంది. అదేవిధంగా ప్రయివేట్ ఆస్పతుల్లో కరోనా టెస్టులను చేసేందుకు అనుమతినిచ్చింది. అయినప్పటికీ రోజురోజుకు రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రభుత్వం విమర్శలు వెల్లువెత్తుతోన్నాయి. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా కట్టడిలో విషయంలో మరిన్ని కఠిన చర్యలను చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈమేరకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులు వారానికి 50 శాతం మంది చొప్పున ఆఫీసులకు హాజరు కావాలని సూచించింది.

లాక్డౌన్ సడలింపుల నేథ్యంలో ఇటీవల నుంచి ప్రభుత్వ ఉద్యోగులు పూర్తిస్థాయిలో విధులకు హాజరవుతున్నాయి. కాగా మరోసారి కరోనా కేసులు రాష్ట్రంలో విజృంభిస్తుండటంతో ప్రభుత్వం ఉద్యోగులకు పలు మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇందులో భాగంగా 50శాతం మంది ఉద్యోగులు మాత్రమే విధులకు హాజరు కావాలని సూచించింది. ఒక వారం సగం మంది హాజరైతే మరో వారం మిగతా సగం మంది విధుల్లో పాల్గొనాలని పేర్కొంది. సోమవారం నుంచి జూలై 4వరకు ఈ మార్గదర్శకాలను ఉద్యోగులు పాటించాలని ప్రభుత్వం ఆదేశించింది. విధుల్లోలేని ఉద్యోగులు హెడ్ క్వార్టర్స్‌ను వదలి వెళ్లొద్దని సూచించింది.

కనుమరుగు కథ.. కాంగ్రెస్ చేసిన పెద్ద తప్పు అదే!

అదేవిధంగా అనారోగ్య సమస్యలు ఉన్న ఉద్యోగులు సెలవులు పెట్టుకోవాలని సూచించింది. లిఫ్ట్‌లో ముగ్గురి కంటే ఎక్కువ మంది వెళ్లొద్దని, ఏసీలు వాడకపోవడం మంచిదని సూచించింది. అవసరమైతే లిఫ్టులను ఉపయోగించుకోవాలని పేర్కొంది. అధికారుల డ్రైవర్లు పార్కింగ్ ఏరియాలో కాకుండా పేషీలో ఉండాలని ప్రభుత్వం సూచించింది. గతంలోనూ ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో ఇలాంటి చర్యలను చేపట్టింది. కొన్నిరోజులు కరోనా కేసులు తగ్గముఖం పట్టినట్లు కన్పించింది.

అయితే ఇటీవల లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో మరోసారి రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో సర్కార్ మరోసారి సగం మంది ఉద్యోగులే కార్యాలయాల్లో విధులు నిర్వహించాలని తాజాగా ఉత్వర్వులు ఇచ్చింది. అయితే ఈ చర్యల వల్ల కరోనా ఏమాత్రం కట్టడి అవుతుందనేది సందేహాలు వ్యక్తమవుతోన్నాయి.

కరోనా విషయంలో సర్కార్ తొలినాళ్లలో చేసిన నిర్లక్ష్యంగా కారణంగానే రాష్ట్రంలో పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతోన్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ క్షేత్రస్థాయిలోకి దిగితేనే కరోనా కట్టడి సాధ్యమవుతుందని పలువురు అంటున్నారు. దీనిపై సీఎం కేసీఆర్ ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే..!

‘పది’ పరీక్షలపై ఏపీ నిర్ణయం ఇదే..!


ఏపీలో పదవ తరగతి, ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షలను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాపితో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందున విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలు ఇప్పటికే పదవ తరగతి పరీక్షలను రద్దు చేసి విద్యార్థులకు గ్రేడ్‌లు ఇచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం కూడా పదవ తరగతి, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు చేయనున్నట్లు ప్రకటించింది.

కేసీఆర్ కరుణిస్తాడా? కాలదన్నుతాడా?

తొలుత పదవ తరగతి పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. ఇందుకు అన్ని ఏర్పాటు చేసింది. వచ్చేనెల 10వ తేదీ నుంచి పరీక్షలు నిర్వహించేందుకు ముహూర్తం ఖరారు చేసింది. కరోనా ఉధృతి తగ్గుతుందని భావించినా… పెరుగుతూ ఉండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో జనసేన, బీజేపీ, టీడీపీ, వామపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు పదవ తరగతి పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్ చేశాయి. దీంతో ప్రభుత్వం వెనక్కి తగ్గక తప్పలేదు. రెండు రోజులుగా ఉన్నతాధికారులు సమావేశమై తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షలు నిర్వహించారు.

కనుమరుగు కథ.. కాంగ్రెస్ చేసిన పెద్ద తప్పు అదే!

మరోవైపు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిములపు సురేష్ విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. పరీక్ష హాల్ టిక్కెట్ ఉన్నవారందరునీ అప్ గ్రేడ్ చేయనున్నట్లు చెప్పారు. ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం పరీక్షలలో ఫెయిల్ అయిన వారందరినీ సప్లిమెంటరీ పరీక్షలు లేకుండానే ఉత్తీర్ణత సాధించినట్లు ప్రకటించారు. వారి మార్కుల లిస్టులో సప్లిమెంటరీ అని రాయడం జరుగుతుందని స్పష్టం చేశారు.

నిద్ర లేకుండా చేస్తున్న సొంత పార్టీ నేతలు..!


పగోడు ఎన్నన్నా పర్లేదు…అయినోడు అంటేనే ఇబ్బంది. పగోడు ఏమన్నా పట్టించుకొని ప్రజలు, మనోడు విమరిస్తే నిజమేనేమో అనుకుంటారు. పొలిటిక్ పార్టీలకు కూడా ఈ సూత్రం బాగా వర్తిస్తుంది. సొంత పార్టీ నాయకులు పార్టీకి, అధినేత నిర్ణయాలకు విరుద్ధంగా నడుచుకున్నా, వ్యతిరేకించినా ప్రత్యర్థి పార్టీ నాయకులకు అస్త్రం దొరికినట్టవుతుంది. ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన పార్టీలుగా ఉన్న వైసీపీ, టీడీపీ మరియు జనసేన పార్టీలలో ఈ తరహా నాయకులు ఉన్నారు. వారి బలమో, బలహీనతో, అసహనమో తెలియదు కానీ సొంత పార్టీపై విమర్శలు చేస్తూ వార్తలలో నిలుస్తున్నారు.

ఎల్లుండి సంతోష్ బాబు ఇంటికి వెళ్లనున్న కేసీఆర్

వీరిలో మనం ప్రధానంగా చెప్పుకోవలసింది, వైసీపీ ఎంపీ రఘు రామ కృష్ణం రాజు. ఈయన కొన్నిరోజులుగా సొంత పార్టీ ఎమ్ పి అయ్యుండి…జగన్ కి షాకులపై షాకులు ఇస్తున్నాడు. జగన్ పరిపాలనే బాగోలేదన్న ఈయన… వైసీపీ పార్టీలోకి వారు బ్రతిమిలాడితే వచ్చాను కానీ… ఇష్టపూర్వకంగా రాలేదని ఆయన చెప్పడం వైసీపీ పార్టీకి గొడ్డలి పెట్టులా మారింది. రాజుగారి వ్యాఖ్యలు ఆసరాగా తీసుకొని జగన్ పరిపాలనా తీరు బాగోలేదని సొంత ఎంపీనే చెవుతున్నారని టీడీపీ నాయకులు ఎద్దేవా చేస్తున్నారు. మరి ఆయన ఈ ఘాటు విమర్శల వెనుక కారణం ఏమిటనేది ఎవరికి అంతుబట్టని విషయం.

కనుమరుగు కథ.. కాంగ్రెస్ చేసిన పెద్ద తప్పు అదే!

ఇక టీడీపీలో చాల కాలంగా నాయకుడిగా ఉన్న ఎంఎల్ఏ వల్లభనేని వంశీ..సంధర్భం వచ్చినప్పుడల్లా చంద్రబాబుని వాయించేస్తున్నాడు. లోకేష్ తనపై కుట్ర పన్నారని, కొన్ని విషయాలలో ఇరికించడానికి ప్రయతించాడన్న ఆరోపణలతో టీడీపీ నుండి బయటికి వచ్చిన వల్లభనేని చేసే విమర్శలు… వైసీపీ నాయకులు చేసే వాటికంటే ఘాటుగా ఉంటాయి. ఐదేళ్లలో బాబు, లోకేష్ చేసిన అక్రమాలు ఇవి అని చిట్టా విప్పుతుంటే, వారిద్దరికీ ఏమి పాలుపోని పరిస్థితి. కనీసం వంశీ వ్యాఖ్యలను గట్టిగా తిప్పికొట్టిన దాఖలాలు కూడా లేవు.

ఇక జనసేన పార్టీలో నుండి రాపాక వరప్రసాద్ ఈ తరహా నాయకుడిగా చెప్పుకోవచ్చు. ఐతే ఈయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఎప్పుడూ విమర్శలు చేయలేదు. ఐతే పవన్ విమర్శించే జగన్ కి మద్దతు తెలుపుతూ పవన్ మాటకు, వాదనకు విలువ లేకుండా చేస్తున్నాడు. ఇలా సొంత పార్టీ నేతల గిల్లుడు తట్టుకోలేక, గట్టిగా విమర్శించ లేక సమయం కోసం ఎదురుచూస్తునారు మూడు పార్టీల అధినేతలు.