
కరోనా వైరస్ కారణంగా దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ముందుగానే తెలంగాణలో లాక్డౌన్ విధించారు. ముందుగా లాక్డౌన్ 15రోజుల నుంచి నెలరోజుల వరకు ఉంటుందని అందరూ భావించారు. అయితే అనుహ్యంగా లాక్డౌన్ నాలుగు నెలలుగా కొనసాగుతోంది. దీంతో కేంద్రం, ఆయా రాష్ట్రాల ఆదాయం తగ్గడంతో కేంద్రం కొన్ని సడలింపులను ఇచ్చింది. ఈమేరకు రాష్ట్రాల్లో కొన్ని షరతులతో దాదాపు అన్నిరంగాలకు మినహాయింపులను ఇచ్చారు. దీంతో కేంద్రం, రాష్ట్రాలకు తిరిగి ఆదాయం సమకూరుతోంది.
కేసీఆర్ కరుణిస్తాడా? కాలదన్నుతాడా?
కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తి జీతాలు చెల్లిస్తున్నాయి. అయితే తెలంగాణలో మాత్రం ఉద్యోగుల స్థాయిని బట్టి 10నుంచి 70శాతం వరకు కోతలను విధిస్తోంది. వైద్యులు, పోలీసులు, పారిశుధ్య కార్మికులు, విద్యుత్ సిబ్బంది మినహా రాష్ట్రంలోని అన్ని శాఖల ఉద్యోగులకు ప్రభుత్వం జీతాల్లో కోతలను విధిస్తుంది. దీంతో గడిచిన మూడునెలలుగా ఉద్యోగులకు సగం జీతమే అందుతుండటంతో వారంతా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ప్రభుత్వం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఉద్యోగులు, పెన్షన్ల సంఘం హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ప్రభుత్వానికి ఉద్యోగులు, పెన్షన్లో కోత విధించడానికి ఉన్న హక్కు ఏంటో చెప్పాలని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం రాత్రికి రాత్రే ఆర్డినెన్స్ తీసుకురావడంపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఏవైనా విపత్తులు లేదా ప్రజారోగ్యానికి సంబంధించి అత్యవసర పరిస్థితి తలెత్తినప్పుడు ఏ వ్యక్తికైనా, సంస్థకైనా, పెన్షనర్లకైనా చెల్లింపులను వాయిదా వేసే అధికారం ఆర్డినెన్స్ ద్వారా ప్రభుత్వానికి కల్పించారు.
కనుమరుగు కథ.. కాంగ్రెస్ చేసిన పెద్ద తప్పు అదే!
ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ను సవాల్ చేస్తూ మరోసారి ఉద్యోగులు, పెన్షన్లు హైకోర్టు ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధమని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. పిటిషనర్ వాదనలు విన్న హైకోర్టు ఆర్డినెన్స్‌పై మూడు వారాల్లో వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. గడిచిన మూడునెలలుగా ఉద్యోగులకు జీతాల్లో ప్రభుత్వం కోతలు విధిస్తూనే ఉంది.
కరోనా లాంటి విపత్కర పరిస్థితులను ఉద్యోగులను ఆదుకోవాల్సిందిపోయి కోతలు విధించడం ఏంటని ఉద్యోగ సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో ప్రభుత్వానికి ఆదాయం వస్తుండటంతో జూన్ నుంచి పూర్తిస్థాయి జీతాలు చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. జూన్ నెలలో 20రోజులుగా గడిచినప్పటికీ ఉద్యోగుల జీతాలపై ఇంకా క్లారిటీ రావడం లేదు. ఉద్యోగులు హైకోర్టు ఆశ్రయించడంతో జీతాల కోతలపై ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. దీంతో జూన్ నెల జీతం ఉద్యోగులకు పూర్తి స్థాయిలో అందుతుందా?. అనేది ప్రశ్నార్థకంగా మారింది.