
పగోడు ఎన్నన్నా పర్లేదు…అయినోడు అంటేనే ఇబ్బంది. పగోడు ఏమన్నా పట్టించుకొని ప్రజలు, మనోడు విమరిస్తే నిజమేనేమో అనుకుంటారు. పొలిటిక్ పార్టీలకు కూడా ఈ సూత్రం బాగా వర్తిస్తుంది. సొంత పార్టీ నాయకులు పార్టీకి, అధినేత నిర్ణయాలకు విరుద్ధంగా నడుచుకున్నా, వ్యతిరేకించినా ప్రత్యర్థి పార్టీ నాయకులకు అస్త్రం దొరికినట్టవుతుంది. ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన పార్టీలుగా ఉన్న వైసీపీ, టీడీపీ మరియు జనసేన పార్టీలలో ఈ తరహా నాయకులు ఉన్నారు. వారి బలమో, బలహీనతో, అసహనమో తెలియదు కానీ సొంత పార్టీపై విమర్శలు చేస్తూ వార్తలలో నిలుస్తున్నారు.
ఎల్లుండి సంతోష్ బాబు ఇంటికి వెళ్లనున్న కేసీఆర్
వీరిలో మనం ప్రధానంగా చెప్పుకోవలసింది, వైసీపీ ఎంపీ రఘు రామ కృష్ణం రాజు. ఈయన కొన్నిరోజులుగా సొంత పార్టీ ఎమ్ పి అయ్యుండి…జగన్ కి షాకులపై షాకులు ఇస్తున్నాడు. జగన్ పరిపాలనే బాగోలేదన్న ఈయన… వైసీపీ పార్టీలోకి వారు బ్రతిమిలాడితే వచ్చాను కానీ… ఇష్టపూర్వకంగా రాలేదని ఆయన చెప్పడం వైసీపీ పార్టీకి గొడ్డలి పెట్టులా మారింది. రాజుగారి వ్యాఖ్యలు ఆసరాగా తీసుకొని జగన్ పరిపాలనా తీరు బాగోలేదని సొంత ఎంపీనే చెవుతున్నారని టీడీపీ నాయకులు ఎద్దేవా చేస్తున్నారు. మరి ఆయన ఈ ఘాటు విమర్శల వెనుక కారణం ఏమిటనేది ఎవరికి అంతుబట్టని విషయం.
కనుమరుగు కథ.. కాంగ్రెస్ చేసిన పెద్ద తప్పు అదే!
ఇక టీడీపీలో చాల కాలంగా నాయకుడిగా ఉన్న ఎంఎల్ఏ వల్లభనేని వంశీ..సంధర్భం వచ్చినప్పుడల్లా చంద్రబాబుని వాయించేస్తున్నాడు. లోకేష్ తనపై కుట్ర పన్నారని, కొన్ని విషయాలలో ఇరికించడానికి ప్రయతించాడన్న ఆరోపణలతో టీడీపీ నుండి బయటికి వచ్చిన వల్లభనేని చేసే విమర్శలు… వైసీపీ నాయకులు చేసే వాటికంటే ఘాటుగా ఉంటాయి. ఐదేళ్లలో బాబు, లోకేష్ చేసిన అక్రమాలు ఇవి అని చిట్టా విప్పుతుంటే, వారిద్దరికీ ఏమి పాలుపోని పరిస్థితి. కనీసం వంశీ వ్యాఖ్యలను గట్టిగా తిప్పికొట్టిన దాఖలాలు కూడా లేవు.
ఇక జనసేన పార్టీలో నుండి రాపాక వరప్రసాద్ ఈ తరహా నాయకుడిగా చెప్పుకోవచ్చు. ఐతే ఈయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఎప్పుడూ విమర్శలు చేయలేదు. ఐతే పవన్ విమర్శించే జగన్ కి మద్దతు తెలుపుతూ పవన్ మాటకు, వాదనకు విలువ లేకుండా చేస్తున్నాడు. ఇలా సొంత పార్టీ నేతల గిల్లుడు తట్టుకోలేక, గట్టిగా విమర్శించ లేక సమయం కోసం ఎదురుచూస్తునారు మూడు పార్టీల అధినేతలు.