
‘వ్యవసాయం’లోనే సాయం ఉందని ఓ సినీ కవి చెప్పినట్టు.. ఓ ప్రముఖ నటుడు వ్యవసాయం బాట పట్టారు. లాక్ డౌన్ కారణంగా వచ్చిన గ్యాప్ లో సినీ సెలబ్రిటీలు.. రకరకాల ఛాలెంజ్ లు విసురుకుంటూ కాలం కరిగించుకుంటూ వస్తుంటే.. విలక్షణ నటుడు పైగా నేటి నటనకే మేటి నటుడు అయిన ‘నవాజుద్దీన్ సిద్దిఖీ’ మాత్రం రైతు అవతారం ఎత్తి తన సొంతూరికి వెళ్లి అక్కడే వ్యవసాయం చేసేస్తున్నాడు.
ఉత్తర ప్రదేశ్ లోని బుధాన అనే ఓ చిన్న టౌన్ లో పుట్టి పెరిగిన ‘నవాజుద్దీన్ సిద్దిఖీ’ స్టేజి ఆర్టిస్ట్ నుండి చాలా కష్టపడి బాలీవుడ్ లోనే మేటి నటుడిగా ఎదిగారు. అయితే ప్రస్తుతం దొరికిన ఖాళీ సమయాన్ని ఎంతో చక్కగా ఆస్వాదిస్తున్నారు. గత కొన్నేళ్లుగా షూటింగ్ లతో ఎప్పుడూ బిజీగా ఉండే నవాజుద్దీన్ కి, లాక్ డౌన్ పెద్ద ఉపశమనంగా మారింది.
కరోనా మహమ్మారి నుంచి దేశాన్ని కాపాడేందుకు విధించిన లాక్ డౌన్ సామాన్యులకు కష్టాలను తెచ్చినా, ప్రముఖులకు మాత్రం వారి గతాన్ని గుర్తు తెచ్చుకుంటూ వారి ఇష్టాలను తీర్చుకునే గొప్ప అవకాశాన్ని కల్పించింది. మొత్తానికి ‘నవాజుద్దీన్ సిద్దిఖీ’ లాంటి సెలబ్రిటీలు ఏమి చేసినా ప్రత్యేకంగానే ఉంటుంది.