
2024కల్లా చంద్రుడి పై బాత్ రూం కట్టాలని నాసా సన్నాహాలు చేస్తోంది. బాత్ రూం టెక్నాలజీ అనేది భూమిపై కంటే అడ్వాన్స్ డ్ గా ఉండాలని సైంటిస్టులు ప్రయత్నిస్తున్నారు. దీనికి బెటర్ ప్లాన్ ఇస్తే 35వేల డాలర్ల ప్రైజ్ లు ఉంటాయని చెప్తుంది. నాసా, ఆస్ట్రోనాట్స్ ను 2024 కల్లా చంద్రుడిపైకి పంపేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది. అయితే వారు ల్యూనార్ సర్ఫేస్ కు చేరుకున్న తర్వాత బాత్రూంకు వెళ్లేందుకు చోటు కావాలని వెతుకుతున్నారు. ఈ క్రమంలోనే సోలార్ సిస్టమ్ లో బెస్ట్ మూన్ టాయిలెట్ కోసం ప్లాన్లు ఇవ్వాలని ఇంజినీర్లకు ఆఫర్ చేస్తుంది. ల్యూనార్ రెస్ట్ రూం కోసం ఎవరు బెటర్ ఐడియా ఇస్తే వారికి ప్రైజ్ కూడా నాసా ప్రకటించింది.
నాసా హీరో ఎక్స్ తో కలిపి ల్యానార్ లూ ఛాలెంజ్ కాంపిటేషన్ నిర్వహిస్తోంది. భవిష్యత్ లో ల్యూనార్ తలానికి చేరుకుంటే అక్కడ టాయిలెట్ ఎలా వాడాలనే దానిపై పరిశోధనలు జరుపుతున్నారు. చంద్రుడిపైకి 2024కల్లా తొలి మహిళ, తొలి పురుషుడ్ని పంపాలని నాసా ప్లాన్ చేస్తుంది. రెస్ట్ రూం అనే వర్సటైల్ గా ఉండడంతో పాటు అది ఆర్బిట్ లోనే పనిచేసేదిగా ఉండాలి. ఆ కక్ష్యలో ఆస్ట్రోనాట్స్ కూడా తేలిగ్గా అనిపించే సమయంలో రెస్ట్ రూం పనిచేయాల్సి ఉంటుంది. భూమిపై ఉన్న గురుత్వాకర్షణ శక్తిలో ఆరో వంతు అక్కడి తలంలో ఉంటుంది. గురుత్వాకర్షణ పనిచేయని సమయంలో పనితీరు అనేది సరిగ్గా పనిచేయాల్సి ఉంటుంది. మనుషులను 50సంవత్సరాల కంటే ఎక్కువ కాలం నుంచే చంద్రునిపైకి పంపిస్తున్నప్పటికీ స్పేస్ టాయిలెట్స్ గురించి నాసా ఇప్పుడే ఆలోచిస్తుంది.