
శాసన, చట్టపరమైన అడ్డంకుల కారణంగా ఆరు నెలలుగా ఆగిపోయిన ఏపీ రాజధాని మార్పు ప్రక్రియ తాజాగా ఊపందుకుంది. అమరావతి నుంచి విశాఖపట్నంకు రాజధాని మార్చే ప్రక్రియకు సీఎం జగన్ ముహూర్తం ఫిక్స్ చేశారు.
మూడు రాజధానుల విషయంలో ముందుకే వెళ్లాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో వచ్చే అక్టోబర్ నాటికి సచివాలయాన్ని అమరావతి నుంచి తరలించడం ఖాయంగా కనిపిస్తోందని సమాచారం. దసరా నుంచి విశాఖ నుంచే పరిపాలన సాగాలే సీఎం జగన్ రెడీ చేస్తున్నారని తెలుస్తోంది.
సోనియా గాంధీ చేష్టలతో కాంగ్రెస్ పరువు గంగపాలు
సీఎం జగన్ మూడు రాజధానులపై వెనక్కి వెళ్లకూడాదని నిర్ణయించుకున్నట్టు సమాచారం. తాజాగా గవర్నర్ ప్రసంగంలోనూ జగన్ వినిపించారు. వచ్చే అక్టోబర్ నాటికి తరలింపు ఖాయమని తెలుస్తోంది. అసెంబ్లీలోనూ దీన్ని చర్చించారు.
గతేడాది డిసెంబర్‌లోనే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రానికి మూడు రాజధానులను ప్రకటించారు. పరిపాలన వికేంద్రీకరణ అవసరమని తేల్చారు. విశాఖపట్నం వద్ద కార్యనిర్వాహక రాజధాని, అమరావతిలో శాసన రాజధాని మరియు కర్నూలులో న్యాయ రాజధానిని ప్రకటించారు.
వైసీపీకి కొత్త చిక్కులు తెచ్చిన షోకాజ్ నోటీస్..!
అయితే జనవరి 21న రాష్ట్ర అసెంబ్లీ మొదట మూడు రాజధానుల బిల్లులను ఆమోదించింది. కాని ఈ బిల్లును రాష్ట్ర శాసనమండలిలో టీడీపీ అడ్డుకుంది. ఈ బిల్లును తరువాత సెలెక్ట్ కమిటీకి పంపారు. ఇంతలో, ఈ సమస్య రాష్ట్ర హైకోర్టుకు చేరింది.
పది రోజుల క్రితం, మూడు రాజధానుల బిల్లులు మరియు ఏపీసిఆర్డిఎను రద్దు చేయడం రెండవ సారి ఆమోదించారు. మరోసారి వాటిని శాసనమండలికి పంపారు. జూలై మొదటి వారంలో కౌన్సిల్ నుండి స్పందన లేకపోతే బిల్లులు ఆమోదించబడతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో రాజధాని బదిలీకి ఉన్న అడ్డంకులను తొలగిపోతాయని ప్రభుత్వం భావిస్తోంది.అయితే రాష్ట్రం కరోనావైరస్ మహమ్మారితో బాధపడుతున్నందున, రాజధాని మార్పుకు నెమ్మదిగా సన్నాహాలు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను కోరినట్లు తెలిసింది.
మాటల్లో స్నేహం, చర్యల్లో యుద్ధం..వైసీపీ ఎంపీ తీరిదే..!
అక్టోబర్ 25 విజయదశమి పండుగ కల్లా సచివాలయం, సీఎం కార్యాలయాన్ని విశాఖకు మార్చడానికి జగన్ ప్రయత్నాలు చేస్తున్నాడని అధికార వర్గాలు తెలిపాయి. భీమిలిలోని మూతబడిన ఓ ఇంజినీరింగ్ కాలేజీని తాత్కాలిక సచివాలయంగా మార్చవచ్చని తెలుస్తోంది. మాజీ సీఎం రోశయ్య అల్లుడు పైడా కృష్ణ ప్రసాద్ కు చెందిన పైడా ఇంజినీరింగ్ కాలేజీ రెండేళ్ల నుంచి మూతపడింది. దీన్నే సచివాలయంగా మారుస్తారని సమాచారం.
విశాఖ శారదా పీఠాధిపతి సూచనల మేరకు దసరా నాటికి సచివాలయాన్ని తరలిస్తారంటూ వార్తలు వచ్చాయి.ఇదే మూహూర్తాన్ని జగన్ విశాఖ నుంచి పాలించడానికి ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది.