Home Blog Page 8413

తెలంగాణ సీఎంగా కోట శ్రీనివాసరావు


కోట శ్రీనివాస రావు. విలక్షణ నటుడు. ఏ పాత్ర చేసినా అందులో జీవిస్తారు. ఆ పాత్రకు ప్రాణం పోయడమే కాదు దానికి హుందా తనం తీసుకొస్తారు. కామెడీ క్యారెక్టర్ తో కడుపుబ్బా నవ్వించగలరు.. ఎమోషన్‌ సీన్స్‌తో ఏడిపించగలరు..ప్రతి నాయకుడిగా క్రూరత్వం ప్రదర్శించగలరు. తండ్రిగా, తాతగా, స్నేహితుడిగా… ఇలా ఆయన పోషించని పాత్ర లేదు. ఇక రాజకీయ పాత్రలు చేయడంలో ఆయణ్ని మించిన వారు లేరు. ఇప్పుడు కోట మరోసారి రాజకీయ నాయకుడి అవతారం ఎత్తబోతున్నారు. సీఎం పాత్రలో మెప్పించబోతున్నారు.

జగన్ టీంలోకి దూకుడు బ్యాచ్!

చరణ్‌ రోరి దర్శక నిర్మాతగా తెరకెక్కిస్తున్న ‘రోరి’ చిత్రంలో ఆయన తెలంగాణ ముఖ్యమంత్రిగా కనిపించనున్నారు. ఇందులో కోట శ్రీనివాసరావు ఫస్ట్‌లుక్‌ను ఆయన పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. ఈ చిత్రానికి భీమ్స్‌ సంగీత దర్శకుడు.ఈ మూవీలో ఆర్‌.రామన్న చౌదరి అనే సెన్సిటివ్‌ సీఎంగా కోట ఓ డిఫెరెంట్‌ పాత్రలో కనిపిస్తారు. అసలే ముఖ్యమంత్రి క్యారెక్టర్ కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా తీర్చిదిద్దారు చరణ్ రోరి. ఈ చిత్రాన్ని సీటీఎస్‌ స్టూడియోస్‌, ఎస్‌టీవీ ఎంటైర్టైన్మెంట్స్‌ నిర్మిస్తున్నాయి.

‘రాధేశ్యామ్‌’ రికార్డులు షురూ


యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఎన్నాళ్ల నుంచో ఎదురు చూసిన కొత్త సినిమా మూవీ ఫస్ట్‌ లుక్‌ శుక్రవారం విడులైంది. ఈ సినిమాను ‘జిల్‌’ ఫేమ్‌ రాధాకృష్ణ కుమార్‌ తెరకెక్కిస్తున్నారు. రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్‌ పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రశీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, మలయాళం, హిందీ, తమిళ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదలకానుంది. ప్రభాస్ సరసన హీరోయిన్‌గా పూజాహెగ్డే నటిస్తోంది. ప్రచారంలో ఉన్న ‘రాధేశ్యామ్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ పోస్టర్ రిలీజ్‌ చేసింది చిత్ర బృందం. రాయల్ క్యాస్టూమ్స్‌లో ప్రభాస్‌, పూజా హెగ్డే రొమాంటిక్‌ లుక్‌ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది.ఈ పోస్టర్ కు మంచి స్పందన వస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానులు ఫస్ట్‌లుక్‌ చూసి ఫిదా అయ్యారు. సోషల్‌ మీడియాలో షేర్, లైక్‌ చేస్తూ రెబల్‌ స్టార్పై తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. దాంతో, రాధేశ్యామ్‌ పోస్టర్ సోషల్‌ మీడియాలో దూసుకుపోతోంది. ఇప్పటికే రికార్డుల వేట మొదలు పెట్టింది.

జాతీయ స్థాయిలో జగన్ ఇమేజ్ డ్యామేజ్..!

ఈ ఫస్ట్‌లుక్‌ ట్విటర్‌లో నిన్న టాప్‌ ట్రెండింగ్‌లో చోటుదక్కించుకోవడమే కాకుండా తక్కువ సమయంలో సింగిల్‌ హాష్‌ట్యాగ్‌లతో 3.8 మిలియన్లకు పైగా ట్వీట్లు సాధించి రికార్డు సృష్టించింది. మరోవైపు సినిమా పరిశ్రమకు చెందిన ఇతర నటీనటులు, ప్రముఖులు కూడా ట్విటర్‌ ద్వారా ‘రాధేశ్యామ్‌’ చిత్రయూనిట్‌కు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. వాళ్ల అభిమానుల ద్వారా కూడా ఫస్ట్‌లుక్‌ మరింత ట్రెండింగ్‌గా మారింది. దాంతో #RadheShyam హాష్‌ట్యాగ్‌ హవా కొనసాగింది. అదే టైమ్‌లో మరో ఇన్సిడెంట్‌ కూడా ప్రభాస్‌ కొత్త మూవీ ప్రమోషన్‌కు పనికొచ్చింది. అదేంటంటే ‘బాహుబ‌లి: ది బిగినింగ్’ సినిమా విడుదలై శుక్రవారానికి ఐదేళ్లు పూర్తవడం. దాంతో, అటు రాధేశ్యామ్‌.. ఇటు బాహుబలి ఫైవ్‌ ఇయర్స్‌, ప్రభాస్‌ పేర్లతో పలు హాష్‌ట్యాగ్‌లు శుక్రవారం ట్విటర్‌లో ట్రెండింగ్‌లో ఉన్నాయి. రాధేశ్యామ్‌ లుక్‌తో పాటు బాహుబలి ఫొటోలు, వీడియోలు షేర్ చేశారు. చాలా మంది వాటిని రీట్వీట్స్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో సందడి చేశారు. ఒక్కరోజులోనే పలు రికార్డులు బద్దలు కొట్టిన ‘రాధేశ్యామ్‌’ మున్ముందు ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

సచివాలయం కూల్చివేతకు.. కేటీఆర్ కు లింకేంటీ?


తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కేసీఆర్ వల్లనే సాధ్యమైందని ప్రతీఒక్కరి నమ్మకం. అందుకే ప్రత్యేక రాష్ట్రం ప్రకటించిన కాంగ్రెస్ కంటే కేసీఆర్ ఆధ్వర్యంలో నడిచే టీఆర్ఎస్ కే ప్రజలు పట్టంగట్టారు. దీంతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసి కొత్తశకాన్ని ప్రారంభించారు. ధనిక రాష్ట్రంగా ఆవిర్భావించిన తెలంగాణలో సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకు చేరువయ్యారు. సీఎం కేసీఆర్ రైతుపక్షపాతిగా అనేక పథకాలను రైతుల కోసం ప్రవేశపెట్టారు. వీరితోపాటు తెలంగాణలోని అన్నివర్గాలను ఆకట్టుకునే పథకాలను ప్రవేశపెట్టి అందరివాడిలా గుర్తింపు తెచ్చుకున్నారు. కేసీఆర్ ఐదేళ్ల పాలన పూర్తికాకుండానే ముందస్తు ఎన్నికలకు వెళ్లి ప్రతిపక్షాలను ఢిపెన్స్ లో పడేశారు. ఈ ఎన్నికల్లో కారు జెట్ స్పీడుతో దూసుకెళ్లడంతో టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చింది.

జగన్ టీంలోకి దూకుడు బ్యాచ్!

అయితే ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. రెండోసారి సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఆయనకు అనేక సవాళ్లు ఎదురయ్యారు. పార్టీలోని సీనియర్లను పక్కకు పెడుతూ వస్తున్నట్లు ప్రచారం జరిగింది. కేసీఆర్ రెండోసారి సీఎం అయ్యాక చాలామందికి మంత్రి పదవులు ఇవ్వకుండా కొంతకాలం దూరం పెట్టారు. కేటీఆర్ ను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించారు. కేసీఆర్ క్యాబినెట్లోనూ కేటీఆర్ కు సన్నిహితులైన వారికే అవకాశం ఇవ్వడం.. హరీష్ రావు, ఈటల రాజేందర్ నేతలను కొంతకాలం పక్కకు పెట్టడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది.

సీఎం కేసీఆర్ కు జాతీయ రాజకీయాలపై ఇంట్రెస్టు ఉండటం, ఆయనకు ఆరోగ్యం సహకరించడం వల్ల సీఎంగా కేటీఆర్ ను ప్రకటిస్తారని ప్రచారం జరిగింది. దీనిపై సీఎం కేసీఆర్ స్వయంగా స్పందించాల్సి వచ్చింది. తాను ఆరోగ్యంగానే ఉన్నానని సీఎంగా తనే కొనసాగుతానని.. మీకు బాగోలేదంటే చెప్పండి.. తప్పుకుంటా అంటూ తనదైనశైలిలో కౌంటర్ ఇచ్చారు. ఆ తర్వాత కొద్దిరోజులకు కేటీఆర్, హరీష్ రావు, రాజేందర్ లను క్యాబినెట్లోకి తీసుకోవడంతో కొంతకాలం కొత్త సీఎం చర్చ ఆగిపోయింది.

జాతీయ స్థాయిలో జగన్ ఇమేజ్ డ్యామేజ్..!

చైనా నుంచి కరోనా వైరస్ కేసీఆర్ పాలిట శాపంగా మారింది. తెలంగాణలో తిరుగులేకుండా పోతున్న కేసీఆర్ సర్కార్ కు కరోనా ఛాలెంజ్ విసిరింది. కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతుండటంతో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రభుత్వం కరోనా కట్టడిలో చేతులెత్తినట్లు కన్పిస్తుండటంతో సర్కార్ పై ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. ఈ సమయంలోనూ సీఎం కేసీఆర్ సచివాలయం కూల్చివేతకు ప్రాధాన్యం ఇవ్వడంపై పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నారు. సచివాలయాన్ని కోవిడ్ ఆస్పత్రిగా మార్చాలని విపక్షాలు, ప్రజాసంఘాలు డిమాండ్ చేసినప్పటికీ సర్కార్ పట్టించుకోకుండా కూల్చివేతకే ప్రాధాన్యం ఇవ్వడంపై ప్రజల్లో చర్చ మొదలైంది.

సీఎం కేసీఆర్ తొలి నుంచి జాతకాలు, వాస్తు, న్యూమరాలజీని నమ్ముతుంటారని అందరికీ తెల్సిందే. వచ్చే ఎన్నికల నాటికి సీఎం సీటు మార్చాలని కేసీఆర్ భావిస్తున్నారట. కేటీఆర్ జాతకానికి ప్రస్తుత సచివాలయం అనువుగా లేదనే అందుకే సచివాలయాన్ని కూల్చివేశారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీనికి వారంతా ఓ కారణం చెబుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు ఈ సచివాలయం నుంచి పనిచేయగా వారి వారసులెవరు కూడా ముఖ్యమంత్రులు కాలేదని లాజిక్ చూపిస్తున్నారు.

దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ చనిపోయాక సీఎంగా జగన్మోహన్ రెడ్డి అవకాశం వచ్చిన చివరికీ కాలేదని చెబుతున్నారు. అందువల్లే పక్క రాష్ట్రంలో సీఎం అయ్యారని చెప్పుకుంటున్నారు. దీంతో కేసీఆర్ తన తనయుడి జాతకం ప్రకారంగా కొత్త సచివాలయాన్ని నిర్మిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇందులో వాస్తవం ఎంతుందోగానీ ప్రతిపక్షాలు మాత్రం కేటీఆర్ ను సీఎం చేసేందుకు సచివాలయాన్ని కూల్చివేస్తున్నారనే భావనను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సస్ అయినట్లు కన్పిస్తుంది. ఓవైపు కరోనా.. మరోవైపు సచివాలయం కూల్చివేతతో సీఎం కేసీఆర్ ప్రస్తుతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విమర్శలను సీఎం కేసీఆర్ ఏవిధంగా చెక్ పెడుతారో వేచి చూడాల్సిందే..!

కరోనా లక్షణాల లిస్టు రోజురోజుకు పెరిగిపోతుందా?

రోగం కంటే.. భయమే మనిషిని పిరికివాడిగా మారుస్తుందనే నానుడి ప్రతీఒక్కరు వినే ఉంటారు. ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా విషయంలోనూ అదే జరుగుతుందనే మాట విన్పిస్తోంది. ఓవైపు కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతుండగా మరోవైపు కరోనాపై వస్తున్న ప్రచారాలు ప్రజలను మరింత భయాందోళనకు గురిచేస్తున్నాయి. కరోనా సోకినపుడు రోగికి ఉండే లక్షణాలు ఏంటీ? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై ఇప్పటికీ కూడా ఎవరికీ సరైన అవగాహన లేదా అనే సందేహాలు కలుగుతున్నాయి.

ఎందుకిలా చెప్పాల్సి వస్తుందంటే.. కరోనా లక్షణాల లిస్టులో రోజుకో లక్షణం వచ్చి చేరిపోతూ చాంతడంత అవుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా కరోనా లక్షణాలపై పూర్తి క్లారిటీ లేదా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. డబ్ల్యూహెచ్ఓ ఇప్పటివరకు మూడుదశల్లో కరోనా లక్షణాలను ప్రకటించింది. కరోనా సోకినవారు దగ్గినపుడు, తుమ్మినపుడు వైరస్ సోకుతుందని తొలుత డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది. ఆ తర్వాత జ్వరం, జలుబు, ఒళ్లు నొప్పులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తదితర లక్షణాలుంటాయని తెలిపింది. తాజాగా తుంపర్లు, గాలిద్వారా కూడా కరోనా సోకుందని పలువురు వైద్య నిపుణులు వాదించగా డబ్ల్యూహెచ్ఓ సైతం నిజమేనంటూ నిర్ధారించింది.

కరోనా మహమ్మరి లక్షణాల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వైద్యులకు సైతం కరోనా వైరస్ పుట్టుక, లక్షణాలపై సరైన అవగాహన లేకుండానే చికిత్స అందిస్తున్నారు. వైద్యులు తమ ప్రాణాలను పణంగాపెట్టి రోగులకు చికిత్స అందిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కోటికిపైగా కరోనా కేసులు నమోదైన తర్వాత తాజాగా గాలి ద్వారా కూడా కరోనా సోకుతుందని డబ్ల్యూహెచ్ఓ ప్రకటించడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

కరోనాకు వ్యాక్సిన్ కనుగోనేందుకు సైంటిస్టులు నిరంతరం శ్రమిస్తున్నారు. వైరస్ ఉసరవెల్లిలా రంగులు మారుస్తుండటంతో వ్యాక్సిన్ తయారీలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అయినప్పటికీ రేయింబవళ్లు సైంటిస్టులు కరోనా వ్యాక్సిన్ తయారీ కోసం శ్రమిస్తున్నారు. వాక్సిన్ ప్రయోగాలు సత్ఫలిస్తున్న తరుణంలో రోజుకో వైరస్ లక్షణం బయటపడటం ఆందోళన రేపుతోంది. మరోవైపు వైరస్‌ సోకిన వారికి చికిత్స చేయడంలో వైద్యులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది.

తాజాగా గాలి ద్వారా కరోనా సోకుతుందని నిర్ధారణ కావడంతో తప్పనిసరిగా మాస్కులు, శానిటైజర్లు, భౌతికదూరం తప్పనిసరిగా పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. కరోనా విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటేనే ఈ మహమ్మరి బారినపడకుండా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు.

జాతీయ స్థాయిలో జగన్ ఇమేజ్ డ్యామేజ్..!


దేశంలో కోవిడ్ రోగుల సంఖ్య 8లక్షలు దాటిపోయింది. వైరస్ తీవ్ర రోపం దాల్చుతున్నప్పటికీ దేశ ఆర్థిక రంగం దెబ్బతినకుండా ఉండడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ నిర్ణయం తీసుకోవడం లేదు. ప్రజలే స్వఛ్చందంగా తమ ఆరోగ్యం పట్ల శ్రద్ద తీసుకోవాలని, భద్రతా నియమాలు పాటించాలని కోరుతున్నారు. ఇక తెలుగు రాష్ట్రాలలో సైతం కరోనా వైరస్ ఉధృతి అధికంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ కేసుల సంఖ్య 23,814కి చేరుకుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ కారణంగా 277 మంది మృత్యువాత పడ్డారు. కాగా ఆంద్రప్రదేశ్ లో కరోనా మృతుల ఖననం విషయంలో జరిగిన కొన్ని సంఘటనలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి.

విమర్శల సుడిగుండం లో యోగీ ప్రభుత్వం

కొద్దిరోజుల క్రితం కరోనా వైరస్ కారణంగా మరణించిన వారి మృత దేహాలను, నెల్లూరులోని పెన్నా నది ఒడ్డున రాత్రిపూట జేసీబీ సాయంతో పూడ్చివేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో మరణించిన రోగుల శవాలను అంబులెన్సులో పెన్నానది తీరానికి తరలించి, జేసీబీ లోడింగ్ బకెట్ లో శవాలను పేర్చి, నేరుగా గుంటలోవేసి ఖననం చేయడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో పుటేజ్ బయటికి రావడంతో ఈ దిగ్భ్రాంతికర సంఘటన వెలుగులోకి వచ్చింది. మరణించిన వారి పట్ల కనీస గౌరవం లేకుండా జేసీబీతో ఖననం చేయడం ఏమిటని, మీడియా మరియు ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని మరియు సిబ్బందిని తప్పుబడుతున్నారు.

ఆ ముగ్గురితో బాబుకు షాకిచ్చేందుకు రంగం సిద్ధం?

జాతీయ స్థాయిలో ఈ సంఘటన చర్చకు దారితీసింది. జాతీయం మీడియా సైతం ఈ సంఘటనను తీవ్రంగా ఖండించింది. గతంలో సైతం శ్రీకాకుళం జిల్లాలో కరోనా సోకి మరణించిన ఓ వృద్ధుడి శవాన్ని వైద్య సిబ్బంది జేసీబీ లో తరలించడం విమర్శలకు దారితీసింది. దీనితో టీడీపీ పెద్ద ఎత్తున ప్రభుత్వ తీరుపై దాడికి దిగింది. మరలా అలాంటి సంఘటనే పునరావృతం కావడంతో జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. కరోనా టెస్టులు నిర్వహణలో భేష్ అనిపించుకున్న జగన్, వైద్య సిబ్బంది నిర్వాకం వలన జాతీయ స్థాయిలో విమర్శల పాలవుతున్నారు. ఇకనైనా జగన్ ఈ విషయంపై దృష్టిపెట్టి అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చేసుకోకపోతే మరిన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

జగన్ టీంలోకి దూకుడు బ్యాచ్!

AP Cabinet Expansion


సీఎంగా జగన్ గద్దెనెక్కగానే ఫైర్ బ్రాండ్ లు, దూకుడు గల ఎమ్మెల్యేలను పక్కనపెట్టి సామాజిక కోణంలో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. అయితే మొదట్లో అది జగన్ కు పేరు తీసుకొచ్చినా దూకుడైన నేతలు లేక కేబినెట్ వెలవెలబోతోంది. ప్రస్తుతం ఉన్న మంత్రులంతా సాప్ట్ గా ఉంటున్నారు. దీంతో వారు ప్రతిపక్షాలను కాచుకోవడం లేదన్న ఆవేదన వైసీపీ అధిష్టానంలో వ్యక్తమవుతోంది.

ఆ ముగ్గురితో బాబుకు షాకిచ్చేందుకు రంగం సిద్ధం?

నిజానికి ఇప్పుడున్న మంత్రివర్గంలో చాలా మంది మంత్రులకు నోట్లో నాలుక లేనట్టే ప్రవర్తిస్తున్నారు. ఖచ్చితంగా మంత్రి పదవి ఖాయమనుకున్న వైసీపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యేలు రోజా, అంబటి రాంబాబు, స్పీకర్ తమ్మినేని సీతారాం, ధర్మాన ప్రసాద్ రావు, కరుణాకర్ రెడ్డి లాంటి వారికి మంత్రి పదవులు లభించలేదు. దీంతో వారంతా పదవులు లేక మౌనంగా ఉండిపోతున్నారు. ఇక మంత్రి పదవులు దక్కిన వారంతా పెద్దగా నోరు విప్పడం లేదు.

దీంతో సీఎం జగన్ ప్రస్తుతం ఖాళీ అయిన రెండు మంత్రి పదవులతోపాటు కొత్తగా కేబినెట్ ను విస్తరించబోతున్నారనే ప్రచారం మొదలైంది. దూకుడైన నేతలను మంత్రివర్గంలోకి తీసుకుంటారని వైసీపీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

విమర్శల సుడిగుండం లో యోగీ ప్రభుత్వం

ఈ నేపథ్యంలో ఫైర్ బ్రాండ్ స్పీకర్ తమ్మినేనికి ఈసారి మంత్రి పదవి ఖాయమన్న ప్రచారం సాగుతోంది. తమ్మినేనితోపాటు రోజా, అంబటి రాంబాబు, ఆళ్ల రామకృష్ణారెడ్డి సహా వైసీపీ తరుఫున బాగా వాయిస్ వినిపించే వారికి జగన్ మంత్రి పదవులు ఇవ్వబోతున్నాడని తెలుస్తోంది.

పర్ఫామెన్స్ ఆధారంగా ఈసారి మంత్రి పదవులు కేటాయిస్తారని.. స్తబ్దుగా ఉన్నవారిని తొలగిస్తారనే ప్రచారం మొదలైంది. జగన్ దూకుడుకు ప్లస్ అయ్యేవారిని కేబినెట్ లోకి తీసుకోబోతున్నారని సమాచారం. ఈనెల చివరి వారంలో జగన్ కేబినెట్ విస్తరణ ఉండబోతోందని వైసీపీ వర్గాల ద్వారా తెలుస్తోంది. దీంతో ఫైర్ బ్రాండ్స్ కేబినెట్ లోకి ఎంట్రీ అయ్యి ప్రతిపక్ష టీడీపీని చెడుగుడు ఆడే ప్లాన్ ను జగన్ రూపొందించినట్టు తెలుస్తోంది.

అరె.. హోమ్లీ హీరోయిన్ గ్లామర్ డోస్ !

ఒకప్పటి హోమ్లీ హీరోయిన్ గా ముందు జనరేషన్ కుర్రాళ్ల గుండెలను తన హ్యూజ్ గ్లామర్ తో ఉక్కిరిబిక్కిరి చేసిన సీనియర్ బ్యూటీ మీనా. మిడిల్ ఏజ్ లో కూడా ఏ మాత్రం బిగువు తగ్గకుండా బాడీని మెయింటైన్ చేస్తోన్న ఈ భారీ ముదురు భామ తాజాగా ఓ వెబ్ సిరీస్ లో నటిస్తోంది. “కరోలిన్ కామాక్షి” పేరుతో తెరకెక్కనున్న ఈ వెబ్ సిరీస్ ని ట్రెండ్ లౌడ్ ప్రొడక్షన్స్ నిర్మిస్తుండగా, దర్శకుడు వివేక్ కుమారన్ తెరకెక్కిస్తున్నారు. వివేక్ కుమారన్ మీనా కోసమే ఈ వెబ్ సిరీస్ రాశాడట. మీనా అంటే ఆయనకు పిచ్చి అభిమానం అట. ఆ అభిమానం నచ్చే, మీనా ఈ వయసులో కూడా స్టెప్స్ వేయడానికి అంగీకరించింది.

విమర్శల సుడిగుండం లో యోగీ ప్రభుత్వం

కాగా ఈ నెల మూడో వారం నుండి ఈ వెబ్ సిరీస్ షూటింగ్ శరవేగంగా జరుగనుంది. ఈ షూట్ లో మీనాతో పాటు మిగిలిన నటీనటులు కూడా పాల్గొనాబోతున్నారు. ఏమైనా 90లలో తెలుగు, తమిళ భాషలలో టాప్ స్టార్ గా కొనసాగిన మీనా మొదటిసారి ఇలా ఓ వెబ్ సిరీస్ చేయడం, పైపెచ్చు మీనా ఈ సిరీస్ లో ఒక సిబిఐ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తుండటం, అలాగే కాస్త గ్లామర్ డోస్ కూడా ఈ సిరీస్ కోసం మీనా కురిపిస్తుండటంతో ఈ సిరీస్ పై ప్రేక్షకుల్లో కాస్త ఆసక్తి ఉంది. అలాగే ఆమె పాత్ర చాల కామిక్ గా ఉండనుందని తెలుస్తోంది.

ఆ ముగ్గురితో బాబుకు షాకిచ్చేందుకు రంగం సిద్ధం?

మరి మీనా కామెడీ చేయగలదా.. ఎదో సాంగ్స్ అంటే డాన్స్ బాగా చేస్తోంది.. రొమాంటిక్ సీన్స్ అంటే.. ముప్పై ఏళ్ల ఇండస్ట్రీ కాబట్టి అవలీలగా చేసి పారేస్తోంది. మరి కామెడీ సంగతి ? గతంలో మీనా నటించిన చాలా సినిమాలు చూస్తే.. మీనా అమాయకమైన రొమాంటిక్ కామెడీని బాగా చేస్తోంది. ఆయితే సీరియస్ కామెడీని ఎలా చేస్తోందో చూడాలి. ఇక మీనా ఆ మధ్య డబ్బులు కోసం కొన్ని తెలుగు, తమిళ సీరియల్స్ కూడా నటించింది.

వయసైన రవితేజం.. కొత్త సినిమాల యవ్వారం !


మాస్ మహారాజా అని బిరుదు సంపాధించిన రవితేజ పరిస్థితి.. ప్రస్తుతం అటు మాస్ కాకుండా ఇటు క్లాస్ కాకుండా మధ్యలో ఏది కాకుండా ఉంది. ఏ సినిమా చేయాలో.. ఎవరితో చేయాలో.. ఎలాంటి కథ చేయాలో ఏమి అర్ధం కావడం లేదు. వయసు చూస్తే బాగా కనిపించేస్తుంది, పోనీ వయసుకు తగ్గ పాత్రలు చేద్దాం అంటే కథలు దొరకవు. దొరికినా రవితేజ మీద అలాంటి కథలు చూస్తారా అనేది మరో అనుమానం. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ‘క్రాక్’ సినిమా ఆ తరువాత రమేష్ వర్మ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలో రవితేజ డబల్ యాక్షన్ అట. అసలుకే ఒక్క రవితేజను చూడటానికే రెడీగా లేరంటే.. మళ్ళీ ఇద్దరు రవితేజలా..!

ఆ ముగ్గురితో బాబుకు షాకిచ్చేందుకు రంగం సిద్ధం?

పైగా రవితేజ సరసన ఇద్దరు హీరోయిన్స్ నటించనున్నారు. ఇప్పటికే ఒక హీరోయిన్ గా నిధి అగర్వాల్ ను ఫైనల్ చేసిన చిత్రబృందం, మరో హీరోయిన్ గా నభా నటేష్ ను ఫిక్స్ చేశారు..నిధి అగర్వాల్ అంటే ఏదో భారీ కాయం కాబట్టి సరే అనుకోవచ్చు.. కానీ, రవితేజ పక్కన నభా నటేష్ ఏమిటి ? గతంలో చేసిన సినిమాలోనే ఆమె సెట్ అవ్వలేదు. పైగా అమ్ముడు ఫిజిక్ కూడా అంతంత మాత్రమే. అసలుకే రమేష్ వర్మ అనే డైరెక్టర్ సినిమా అనగానే సినిమా పై హోప్స్ సగం వదిలేసుకోవచ్చు. పైపెచ్చు ఇలాంటి క్యాస్టింగ్ తో రవితేజ మళ్ళీ హిట్ ఎలా కొట్టగలడో..!

విమర్శల సుడిగుండం లో యోగీ ప్రభుత్వం

ఇంకో విషయం ఒకటి మర్చిపోయాం. ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ కూడా ఉంది.. ఈ సాంగ్ కోసం బోల్డ్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ ను ఫిక్స్ చేశారు. వయసు అయిపోయిన రవితేజ పక్కన మంచి కసి మీద ఉండే పాయల్ ఏమి బాగుంటుందని డైరెక్టర్ ఎందుకు ఆలోచించడో. ఎనీవే.. డబ్బులు గురించి పెద్దగా భయపడకుండా ఈ చిత్రాన్ని కోనేరు సత్యనారాయణ నిర్మించనున్నారు. పాపం కోనేరుకు నిర్మాతగా పెద్దగా అనుభవం లేకపాయే. పైగా రవితేజ ‘డిస్కో రాజా’తో బాక్సాపీస్ వద్ద డిస్కో చేయలేక చేతులు ఎత్తేసిన సంగతి మరీ కోనేరుకు తెలుసో.. లేదో !

జిల్లాకో సలహా, నియోజకవర్గానికో డిమాండ్!

ఏపీలో నియోజవర్గాలను జిల్లాలుగా మార్చడానికి ఇంకా ముహూర్తం ఖరారు కాలేదు. ఇంతలోనే సీఎం జగన్ కి జిల్లాకో సలహా, నియోజకవర్గానికో డిమాండ్ ల ప్రక్రియ ప్రారంభమయ్యాయి.. కొత్త జిల్లాలకు సంబంధించి ప్రాధమికంగా కొన్ని ప్రకటనలు మాత్రమే వచ్చాయి. చూచాయగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవల ఓ సమావేశంలో పార్లమెంట్ నియోజక వర్గాలను జిల్లాలుగా మారుస్తామన్నారు. ఇది పట్టుకొని వైసీపీ నాయకులు టీడీపీ నాయకులు కొంత మంది హడావుడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొత్త జిల్లాల డిమాండ్ లు కొన్ని పుట్టుకొస్తున్నాయి. పాత జిల్లాలను విభజించవద్దని డిమాండ్ లు పుట్టుకొస్తున్నాయి. ఇవి చిలికి చిలికి వివాదాస్పదం గా మరే అవకాశాలు ఉన్నాయి. తాజాగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కొత్త జిల్లాల విషయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి కి ఒక సూచన చేశారు.

2026 లో దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. అప్పుడు పార్లమెంట్ నియోజకవర్గాల సరిహద్దులు మారిపోతాయి. అంటే అప్పటికి జిల్లాల విభజన పూర్తి అయితే ఆ నియోజకవర్గాల పునర్విభజన ఆధారంగా జిల్లాలను మారుస్తారా అంటూ సోమిరెడ్డి ప్రశ్నించారు. ఇది నిజానికి జగన్ ఆలోచించాల్సిన విషయమే. పార్లమెంటు నియోజకవర్గాన్ని జిల్లాగా మార్చాలని అనుకునే ఆలోచననే చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. మేధావి వర్గం కావచ్చు, ఐఎఎస్ వర్గం కావచ్చు, రాజకీయ నాయకుల్లో సీనియర్లు కూడా పార్లమెంటు ను జిల్లాగా చేయడం ఏ మాత్రం అంగీకరించడం లేదు. పార్లమెంటు స్థానం అనేది కేవలం ఎన్నికలు, ఓటర్ల దృష్టిలో పెట్టుకుని చేసింది. ఓటర్లు ఓట్లు వేయాలంటే పార్లమెంటు స్థానం కేంద్రానికీ వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఎవరు ఎవరి ఊళ్ళో పోలింగ్ బూత్ కు వెళ్లి ఓట్లు చేసుకోవచ్చు. కానీ పార్లమెంటు నియోజకవర్గాన్ని జిల్లా గా మార్చడం వలన నియోజకవర్గ కేంద్రం అంటే జిల్లా కేంద్రానికి ప్రజలు తరచు రావాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే దూరాభారం ఎక్కువగా ఉంటుంది. అరకు పార్లమెంట్ ను తీసుకుంటే ఈ పార్లమెంట్ పరిధిలో నాలుగు జిల్లాలు ఉన్నాయి. విశాఖపట్నం జిల్లా నుంచి మొదలుకొని విజయనగరం, శ్రీకాకుళం తూర్పు గోదావరి జిల్లాలోని కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. దాదాపు 250 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. దాన్ని జిల్లాగా మారిస్తే ఈ 250 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి రావడం కంటే హైదరాబాద్ వెళ్లి రావడం నయం అన్న భావన ప్రజల్లో కలుగుతోంది. అలాగే ప్రకాశం జిల్లా లోనూ, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో కూడా ఇటువంటి సమస్యలు ఉన్నాయి. అందుకే సి ఎం జగన్ దీనిపై పునరాలోచన చేయాలని సూచిస్తున్నారు. ఇది ఇలా ఉండగా శ్రీకాకుళం జిల్లాలోని నాయకులు నుంచి కూడా జిల్లాల విషయంలో కొన్ని సూచనలు భిన్న వాదనలు వస్తున్నాయి.

తాజాగా స్పీకర్ తమ్మినేని కూడా ఈ విషయంపై స్పందించారు. శ్రీకాకుళం జిల్లాను అసలు విభజించాల్సిన అవసరం లేదని తమ్మినేని అభిప్రాయపడ్డారు. రెండు రోజుల కిందట శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు ఇదే రకమైన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. తాజాగా తమ్మినేని కూడా శ్రీకాకుళం జిల్లాను విధించాల్సిన అవసరం లేదంటూ తన అభిప్రాయాన్ని సూటిగా చెప్పేశారు. శ్రీకాకుళం, విజయనగరం ఈ రెండు విస్తీర్ణం పరంగా కూడా చిన్న జిల్లాలు. వీటిని విభజిస్తే సాంకేతికంగా జిల్లా కేంద్రం విషయంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఇది కొత్త పాయింట్ యే. జగన్ ఆలోచించాల్సిన పాయింటే. రాష్ట్రంలో జిల్లాల విభజనకు వెళ్లాల్సి వస్తే పెద్ద జిల్లాలుగా ఉన్న విశాఖపట్నం, తూర్పు గోదావరి, ప్రకాశం, గుంటూరు,అనంతపురం, కర్నూలు వంటి జిల్లాలపై సి ఏం జగన్ ముఖ్యంగా దృష్టి పెట్టాల్సి ఉంది. ఈ జిల్లాలను రెండు లేదా మూడు జిల్లా లుగా విభజించి మిగిలినవి భౌగోళిక పరంగా స్థానికుల అభిప్రాయం దృష్టిలో పెట్టుకుని చేస్తే బాగుంటుంది అని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా కొత్త జిల్లాలు అనే ఆలోచనలోనే కొత్తగా పుట్టుకొస్తున్న వివాదాలు సమస్యలపై వైఎస్ జగన్మోహన రెడ్డి ఏమి నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాల్సిందే.

ఏదో ఒక షాప్ లో అదేదో మాస్క్.. అయితే జాగ్రత్త!

దేశంలో ప్రస్తుతం అన్ లాక్ ప్రక్రియ నడుస్తోంది. చాలామంది లాక్ డౌన్ నిబంధనలను పక్కాగా పాటించని పరిస్థితి కనబడుతోంది. దీర్ఘకాలం లాక్ డౌన్ వల్ల అటు ఆర్థిక పరిస్థితి కుదేలవుతోంది. ఇప్పటికే కొందరు ఆర్థిక పరిస్థితి దారుణంగా మారడంతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఈ పరిస్థితులు దృష్టా ప్రభుత్వాలు కూడా దశలవారీగా లాక్ డౌన్ సడలిస్తున్నాయి. దీనితో మళ్లీ కరోనావైరస్ వ్యాప్తి రాకెట్ మాదిరిగా దూసుకుపోతుంది. ఈ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ మాస్కు, భౌతిక దూరం తప్పక పాటించాలి.

ఐతే ఏదో షాపులో దొరుకుతుంది కదా అని ఏది బడితే అది వాడితే కరోన బారి నుంచి రక్షించబడటం సాధ్యం కాదని వైద్యులు అంటున్నారు. పరిశుభ్రత, సామాజిక దూరం, మాస్కులు కరోనా ప్రమాదాన్ని తొలగించవు, కానీ అవి గణనీయంగా తగ్గించగలవు. లాక్ డౌన్ వారాలు, నెలల పాటు అనుభవించినవారిలో చాలామంది ఇతరుల నుండి తమ దూరాన్ని ఉంచడానికి ఆసక్తి చూపడంలేదు.

ఇప్పుడు రెస్టారెంట్లు, బార్‌ లు తిరిగి తెరిచారు. చాలామంది మాస్కులను ముక్కు నుంచి తొలగించి నోటికి వేసుకుంటూ కనబడుతున్నారు. మరికొందరు ముక్కు, నోరు రెండూ వదిలేసి గడ్డానికి తగిలించుకుని తిరుగుతున్నారు. ఇలాంటివారి పరిస్థితి వేరే చెప్పక్కర్లేదు. ఫేస్ మాస్క్‌ లు లాలాజలం యొక్క వైరస్ నిండిన కణాలను గాలిలో వ్యాపించకుండా, ఇతర వ్యక్తులకు సోకకుండా నిరోధించగలవు.

ఫేస్ మాస్క్‌ లు ధరించినవారికి సంక్రమణ ప్రమాదాన్ని 65% తగ్గించాయని కొత్త డేటా సూచిస్తుంది, ఇది చాలా ముఖ్యమైనది. అంతేతప్ప అది పూర్తిగా నిరోధిస్తుందని వెల్లడికాలేదు. వైద్య నిపుణులు ధరించే N95 మాస్కులు మరింత రక్షణను అందిస్తాయి. ఈ మాస్కులు ప్రసార ప్రమాదాన్ని మరింత తగ్గిస్తుందని వైద్యులు అంటున్నారు. కానీ ఇవి తక్కువ సరఫరా అవుతున్నాయి.

విమర్శల సుడిగుండం లో యోగీ ప్రభుత్వం

యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి ఆత్మరక్షణలో పడినట్లు కన్పిస్తుంది. వికాస్ దూబే మరణం పెద్ద వివాదాన్నే రేపింది. ఎన్ కౌంటర్ లో రౌడీ షీటర్లు చనిపోవటం యోగీ ప్రభుత్వంలో కొత్తేమీ కాదు. ఒకవిధంగా ఆ ఎన్ కౌంటర్లే ఇప్పటివరకు యోగీ పాపులారిటీ ని పెంచింది. ఉత్తర ప్రదేశ్ లో శాంతి భద్రతలు పెద్ద సమస్య. ఎవరయితే రౌడీలను, సంఘ విద్రోహకర శక్తులను అదుపులో పెడతారో వాళ్ళే సమర్ధ ముఖ్యమంత్రులుగా పేరు తెచ్చుకున్నారు. ఇంతకుముందు ముఖ్యమంత్రుల్లో మాయావతి కి మంచి పరిపాలనాదక్షురాలిగా పేరువచ్చింది. కారణం రౌడీలను సమర్ధవంతంగా అదుపులో పెట్టింది. అదే స్ఫూర్తి ని యోగీ కూడా ప్రదర్శించాడు.

యోగి ఆదిత్యనాథ్ పరిపాలన   

యోగీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయటం చాలామందికి ఈ వ్యాసకర్తతో సహా ఆశ్చర్యం వేసింది. అంత పెద్ద రాష్ట్రానికి ఏ పరిపాలనా అనుభవంలేని ఓ స్వామీజీ ని ముఖ్యమంత్రిని చేయటం సహజంగానే అనుమానాలకు తావు ఏర్పడుతుంది. ఆ రోజు మోడీ నిర్ణయం తప్పని అనుకున్న వాళ్ళలో ఈ వ్యాసకర్త కూడా ఒకరు. అదే అభిప్రాయాన్ని వ్యాసంలో కూడా వ్యక్తపరచటం జరిగింది. కానీ మా అంచనాలు తప్పని తర్వాత తేలింది. అంతకుముందు పరిపాలన చేసిన చాలామంది ముఖ్యమంత్రులతో పోలిస్తే యోగీ పరిపాలన మెరుగ్గా వుందని రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. యుపిలో వున్న కుల కొట్లాటల్లో ఓ స్వామీజీ ముఖ్యమంత్రి కావటం, తనకు స్వంతగా వెనకేసుకోవాలనే ఆలోచన లేకపోవటం సానుకూలపరిణామం గా పనిచేసింది. అయితే అది ఒక్కటే ముఖ్యమంత్రి పరిపాలనకు పాపులారిటీ కాజాలదు. పరిపాలన చేసే సామర్ధ్యం ఉన్నప్పుడే ఈ లక్షణాలు అదనపు విలువను జోడిస్తాయి. లేకపోతే నిజాయితీ ఒక్కటే పాపులారిటీ ని తెచ్చిపెట్టదు. యోగీ విషయం లో జరిగింది ఇదే. నిర్ణయాలు తీసుకోవటంలో వేగం, నిస్పక్షపాతంగా పనిచేయటం, పరిపాలనలో సమర్ధత ఇవన్నీ కలిసి తనని పాపులర్ ముఖ్యమంత్రిగా ప్రజల్లో నిలబెట్టాయి.

యోగీ ఆదిత్యనాథ్ పరిపాలనలో ముఖ్యమైనది శాంతి భద్రతలను మెరుగుపరచటం. ఉత్తర ప్రదేశ్ లో సమాజ్ వాది పార్టీ పరిపాలనలో శాంతి భద్రతలు ఘోరంగా విఫలమయ్యాయి. అదే ఆ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసింది. అందుకనే యోగీ ఆదిత్యనాథ్ శాంతి భద్రతల అంశానికి అత్యధిక ప్రాధాన్యతని ఇచ్చాడు. ఎంతోమంది రౌడీ షీటర్లను ఎన్ కౌంటర్ చేయటమో, అరెస్టు చేసి లోపలవేయటమో చేసే సరికి మిగతా రౌడీ షీటర్లు రాష్ట్రం నుంచి పారిపోవటమో, స్వచ్చందంగా లొంగి పోవటమో జరిగింది. ఎన్ కౌంటర్లు ఎక్కువభాగం బూటకమైనా ప్రజలు వాటిని ఆహ్వానించారు. గత రెండు సంవత్సరాల్లో ఉత్తర ప్రదేశ్ శాంతి భద్రతల పరిస్థితి ఎంతో మెరుగుపడింది. ఇది సామాన్య జననాడి. దానితోపాటు యోగీ ఆదిత్యనాథ్ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు నాందిపలికాడు. ఎప్పుడూలేనిది ఉత్తర ప్రదేశ్ లో మెల్లి మెల్లిగా పెట్టుబడులు పెట్టే వాతావరణం వచ్చింది. కరోనా మహమ్మారి రాకుండా వుంటే ఇప్పటికే దీనికి సంబంధించిన ఫలితాలు కనబడేవి. ఇంకా మిగిలిన రెండు సంవత్సరాల్లో గుణాత్మక మార్పులు వస్తాయని వూహిస్తున్నారు. ఈ నేపధ్యంలో నిన్న జరిగిన సంఘటనను ఒక్కసారి పరిశీలిద్దాం.

కరుడుగట్టిన నేరస్థుడు వికాస్ దూబే

వికాస్ దూబే కరుడుగట్టిన రౌడీ. ఇప్పటికి తనమీద 60 నేరపూరిత కేసులున్నాయి. రాజ్ నాథ్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు బిజెపి నాయకుడొకరిని పోలీసు స్టేషన్ లోనే హత్యచేసాడు. ఇప్పటికి డజను సార్లు అరెస్టు అయినా కేసులు నమోదు చేసినా ప్రతిసారి చట్టంలోని లొసుగులను ఆధారం చేసుకొని బయటకు వచ్చాడు. చాలా సందర్భాల్లో సరైన సాక్ష్యం చెప్పటానికి ఎవరూ ముందుకు రాకపోవటం కూడా జరిగింది. దానితోపాటు పోలీసు వ్యవస్థలో , రాజకీయ నాయకులతో సన్నిహిత సంబంధాలు వుండి ఎప్పటికప్పుడు రక్షణ పొందుతూ వచ్చాడు. ప్రస్తుత అధికార వ్యవస్థలోని డొల్లతనం వికాస్ దూబే తెలివిగా ఉపయోగించుకొని బయటపడటానికి ఉపయోగపడింది. మనం క్రైం సినిమాల్లో చూసే వర్ణనలకు ఏ మాత్రం తీసిపోని విధంగా వికాస్ దూబే చరిత్ర వుంది. ప్రజలకి ఇటువంటి పరిస్థితుల్లో వున్న వ్యవస్థల మీద నమ్మకం పోవటం సహజం. ఆ ఆలోచనే ప్రత్యామ్నాయ మార్గాలపై ప్రజలు మళ్లేటట్లు చేస్తుంది. ఈ రోజుకీ చాలామంది న్యాయం కోసం పోలీసుల దగ్గరికీ , కోర్టుల దగ్గరికీ కాకుండా స్థానిక చోటా మోటా నాయకుల్ని ఆశ్రయిస్తూ వుంటారు. ముఖ్యంగా పేద ప్రజలు. ఆ సైకాలిజీ నే ప్రజలు ఎన్ కౌంటర్లకు మద్దతిచ్చేదాకా తీసుకెళ్ళింది. అంతెందుకు ఇటీవల హైదరాబాద్ లో ఓ అమ్మాయి రేప్ కేసులో నిందితుల్ని ఎన్ కౌంటర్ చేయాలని బహిరంగంగా ప్రదర్శనలు చేసి డిమాండ్ చేయటం ప్రజాభిష్టానికి అనుగుణంగా పోలీసులు ఎన్ కౌంటర్ చేయటం ( ఇది జనం అనుకుంటున్నది) మనకు తెలిసిందే. ఇదే ఉత్తర ప్రదేశ్ లో మొత్తం రౌడీ షీటర్ల విషయం లోనూ ప్రజాభిష్టానికి అనుగుణంగానే యోగీ ఆదిత్యనాథ్ ఈ ఎన్ కౌంటర్లు చేయించాడని అనుకుంటున్నారు. అయితే ఇటీవల ఈ విషయంలో యోగీ దూకుడు తగ్గింది. ఎందుకంటే మానవ హక్కుల సంఘాలు, మేధావులు వీటిని తీవ్రంగా తప్పు పట్టటంతో కొంతమేర తగ్గాడని చెప్పొచ్చు. అదీగాక ఏ ఉద్దేశంతో మొదలయ్యాయో అది నెరవేరింది కూడా. అదివరకటిలాగా కాకుండా శాంతి భద్రతలు అదుపులోకి వచ్చాయి.

ఈ పరిస్థితుల్లో వికాస్ దూబే 8 మంది పోలీసులను ( ఒక డిఎస్పి తో సహా) చంపటం యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి పెద్ద దెబ్బతగిలింది. అందుకే ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అనేక స్పెషల్ టీములు తనకోసం గాలించ సాగాయి. ఇంతలో కాంగ్రెస్ నాయకుడు జితిన్ ప్రసాద దీన్ని బ్రాహ్మణులకు వ్యతిరేకంగా జరుగుతున్న దాడిగా ప్రచారం చేసాడు. బ్రాహ్మణులలో పోయిన మద్దత్తు ని తిరిగి సంపాదించుకొనే పనిని భుజాన కెత్తుకున్నాడు. యోగీ కి వ్యతిరేకంగా వున్న జర్నలిస్టులు , మేధావులు ఇప్పటికే వికాస్ దూబే ని రక్షించటం కోసం బిజెపి నాయకులే తనని నేపాల్ బోర్డర్ కి పంపించారని ప్రచారం చేశారు. అందులో ప్రముఖ జర్నలిస్టు రాజదీప్ దేశాయ్ కూడా చేరాడు. ఆశ్చర్యంగా నిన్న ఉజ్జయినీలో పట్టుబడటం తో ఆ ప్రచారానికి తెరపడింది. అక్కడనుండి కాన్పూర్ తరలించే క్రమంలో వికాస్ దూబే ‘ఎన్ కౌంటర్లో’ మరణించటం పెద్ద వివాదాస్పదమయ్యింది. ఇది ఖచ్చితంగా బూటకపు ఎన్ కౌంటరేనని ఎక్కువమంది భావించటం జరిగింది. ఖచ్చితంగా ఇది బూటకపు ఎన్ కౌంటరేననే దాంట్లో ఎటువంటి సందేహంలేదు. హైదరాబాద్ లో జరిగింది బూటకపు ఎన్ కౌంటరేనని అందరికీ తెలుసు. అయినా ప్రజల మద్దత్తు వుంది. ఇది సూత్రపరంగా తప్పని తెలుసు. అయినా ప్రజాభీష్టం భిన్నంగా వుంది. ఇక ఈ సంఘటన పై యోగ్యతా యోగ్యతలు పరిశీలిద్దాం.

కులపైత్యం పరాకాష్టకు చేరింది 

వికాస్ దూబే పారిపోయిన దగ్గరనుంచీ ఓ విచిత్ర ప్రచారం జరుగుతుంది. కాంగ్రెస్ నాయకుడు జితిన్ ప్రసాద మొదలుపెట్టిన కుల కుంపటి పెరిగి పెద్దదయి వెర్రి తలలు వేస్తుంది. వికాస్ దూబే ని విష్ణు మూర్తి ఆరో అవతారం పరశురాముడు తో పోలుస్తూ సాంఘిక మాధ్యమాల్లో పోస్టులు కోకొల్లలుగా వస్తున్నాయి. వికాస దూబే బ్రాహ్మణుడు కావటం తో ఎంతోమందిని హత్య చేసిన కిరాతకుడైనా మనవాడు అనేభావనతో సాంఘిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం చూస్తుంటే చదువు వీళ్ళకు నేర్పిన సంస్కృతి ఇదేనా అని నోటిమీద వేలేసుకోవటం మనవంతయ్యింది. వీళ్ళే ఇంతకుముందు యోగీ ఆదిత్యనాథ్ రౌడీలను ఎన్ కౌంటర్ చేసినందుకు విపరీతంగా పొగిడారు. అదే తమకులంవాడు ఎన్ కౌంటర్ అయ్యేసరికి యోగీ ఠాకూర్ కాబట్టి బ్రాహ్మణులకు అన్యాయం చేస్తున్నాడని ప్రచారం చేస్తున్నారు.  అతను పొట్టనపెట్టుకున్న వాళ్ళలో బ్రాహ్మణులు  కూడా వున్నారని మరిచిపోయారు. వికాస్ దూబే హత్యచేసిన బిజెపి నాయకుడు శుక్లా   బ్రాహ్మణుడే. దీర్ఘకాలంలో ఈ ప్రచారం పెద్దగా నిలబడకపోవచ్చు. ఎందుకంటే ఇంతకుముందు ఎన్ కౌంటర్ కాబడ్డ వారు వెనకబడిన కులాల వాళ్ళు, ముస్లింలు వున్నారు. అప్పుడు గుర్తుకు రాని  కులం ఇప్పుడు ఎలా గుర్తుకొస్తుంది? నేరస్తుడు ఏ కులం వాడైనా , ఏ మతస్తుడైనా నేరం నేరమే. అప్పుడు ఎన్ కౌంటర్ కరెక్టయితే ఇప్పుడూ కరెక్టే. ఇప్పుడు తప్పయితే అప్పుడూ తప్పే. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. అసలు ఈ ఎన్ కౌంటర్లు సమర్ధనీయమా?

ఎన్ కౌంటర్ సమర్ధనీయమా?

ఎటువంటి పరిస్థితుల్లో సమర్ధనీయం కాదు. ప్రజాభీష్టం ఎన్ కౌంటర్లకు అనుకూలంగా ఉండటానికి కారణం ఇప్పుడున్న న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేకపోవటమే. మన దేశంలో అత్యవసరంగా సంస్కరణలు రావాల్సింది న్యాయ వ్యవస్థలో. మనం అరువు తీసుకున్న బ్రిటీష్ న్యాయ వ్యవస్థ ఆధునిక ప్రజాస్వామ్య దేశాల్లోకల్లా అధ్వానపు వ్యవస్థ. న్యాయం జరగదనుకున్నప్పుడు విచారణకే రాకుండా వాయిదా వేయించుకో గలగటం ఈ వ్యవస్థలో ప్రత్యేకత. అందుకే ప్రజలకు నమ్మకం లేకుండా పోతుంది. అంతమాత్రాన ప్రత్యామ్నాయ పద్దతులు ఎటువంటి పరిస్థితుల్లోనూ సమర్ధనీయం కాదు. అది హైదరాబాద్ ఎన్ కౌంటర్ అయినా, కాన్పూర్ ఎన్ కౌంటర్ అయినా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొనే అధికారం పోలీసులకు లేదు. ఈ కేసులో 8 మంది పోలీసులు చనిపోయివుండోచ్చు. అంతమాత్రాన పోలీసులే న్యాయనిర్ణేతలు అయితే ఎలా? దీన్ని వెనకుండి నడిపించిన రాజకీయ నాయకత్వంది కూడా ముమ్మాటికీ తప్పే. మిగతా ఎన్ కౌంటర్లకీ దీనికి తేడా వుంది. ఈ సంఘటన లో ముద్దాయిని అరెస్టు చేయటం జరిగింది. దేశవ్యాప్త ప్రచారం జరిగింది. అప్పటికే దీనిపై ఎంతో చర్చోపచర్చలు జరిగాయి. ఇది బూటకపు ఎన్ కౌంటర్ కాదనటానికి బెనిఫిట్ అఫ్ డౌట్ ఏ మాత్రం లేదు. అటువంటప్పుడు ఈ చర్య ని ఎవరూ సమర్ధించలేరు.

యోగీ ఆదిత్యనాథ్ కి ముందుగా ఈ విషయంలో కోర్టు గండం వుంది. ఇంతవరకు జరిగిన ఎన్ కౌంటర్లకు దీనికి తేడావుంది. దీన్ని ఏ కోణంలోనూ సమర్ధించే ఆధారాలు లేవు. రెండోది, ముఖ్యమైనది ప్రజాభిప్రాయం మిగతా ఎన్ కౌంటర్లలో లాగా విస్తృత జనామోదంగా లేదు. మూడోది, మొట్టమొదటసారి ప్రతిపక్షాలకు ఒక ఆయుధం దొరికింది. అయితే ప్రతిపక్షాలు విమర్శించినట్లు బిజెపి నాయకులతో వికాస్ దూబే కి సన్నిహిత సంబంధాలున్నాయి కాబట్టి బూటకపు ఎన్ కౌంటర్ చేసారనేది నిజం కాకపోవచ్చు. అదే నిజమయితే ఇంతకుముందు జరిగిన ఎన్ కౌంటర్లలో బిజెపి తోటి సంబంధాలు వున్నాయి కాబట్టి చేయలేదుకదా. ఎంతోమంది రౌడీ షీటర్లు సమాజ్ వాది నాయకులతోనే ఉండేవి. అయినా ఎన్ కౌంటర్ చేశారు. కారణం అదో పాలసీ గా పెట్టుకున్నట్లు అనిపిస్తుంది. వికాస్ దూబే కి బిజెపి నాయకులతో సంబంధాలు లేవని చెప్పలేము. అదేసమయంలో బిజెపి నాయకులొక్కరితోనే సంబందాలున్నయనేది కూడా నిజం కాదు. సమాజ్ వాది పార్టీ నాయకులు మిగతా రాజకీయ పార్టీ నాయకులతో కూడా సంబంధాలు వున్నాయి. వాళ్ళు అధికారం లో ఎవరుంటే వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు. నేరస్తులందరూ చేసే పనే ఇది. ఉదాహరణకు ఇప్పుడు దొంగ బంగారం కేసులో కేరళ లో సిపిఎం నాయకులతోనూ సంబంధాలు పెట్టుకున్నారు. కేరళ ముఖ్యమంత్రి ఎటువంటి లెటర్ రాసినా కింద సిపిఎం నాయకులకు సంబంధం లేదని తనుకూడా సర్టిఫికేట్ ఇవ్వలేడు. ఇదీ అంతే . కాకపోతే అసలు ఈ ఎన్ కౌంటర్ పాలసీనే సమర్ధనీయం కాదు. తాత్కాలికంగా ప్రజలకి ఇది మంచిగా అనిపించినా దీర్ఘ కాలంలో అది ప్రజలకు చేటు చేస్తుందని మరిచిపోవద్దు. పూర్తి అవినీతిమయమైన పోలీసు వ్యవస్థ ప్రజలకు న్యాయం చేస్తుందని ఎవరైనా భావిస్తే అది తెలివితక్కువతనమే. యోగీ ఆదిత్యనాథ్ తీసుకున్న ఈ విధానం పులి మీద స్వారి చేస్తున్నట్లే. స్వారి మొదలుపెట్టిన తర్వాత దిగనూ లేడు, అదేసమయం లో ఎల్లకాలం స్వారీ చేయనూ లేడు. ప్రస్తుతానికి యోగీ ఆదిత్యనాథ్ కి గండం లేకపోయినా ఈ విధానం ఎప్పటికైనా తనకి గుదిబండే. ఈ విషవలయం నుంచి బయటపడకపోతే ఎప్పటికైనా యోగికి ప్రమాదమే.  ఏమవుతుందో చూద్దాం.

కిటికీ సేవలు ఎంత కాలం?

Government offices

Government offices

ప్రభుత్వ కార్యాలయాలపై కరోనా ప్రభావం తీవ్రంగా పడింది. నిత్యం వచ్చేపోయే వారితో సందడిగా ఉండే కార్యాలయాలు ఇప్పుడు భయం నీడలో పనిచేస్తున్నాయి. అత్యవసర, తప్పనిసరి పనుల కోసం కొందరు వస్తూనే ఉన్నారు. నేరుగా ప్రజలను కలిసేందుకు జంకుతున్న అధికారులు దరఖాస్తులు, వినతిపత్రాలను ఇచ్చి వెళ్లాలని సూచిస్తున్నారు. కొన్ని తహసీల్దార్‌, పురపాలక సంఘాలు, ఎంపీడీఓ కార్యాలయాలలో ప్రధాన ద్వారాలు మూసేసి, కిటికీలని మాత్రం తెరిచి లోపల రెండు అట్టపెట్టెలను పెట్టి, సమస్యల పరిష్కారం కోసం వచ్చే వారిని ఆ పెట్టెల్లో వినతిపత్రాలను వేసి వెళ్లాలని సూచిస్తున్నారు. అయితే సమస్యల పరిష్కారం కోసం వచ్చేవారి సంఖ్య ఎక్కువ ఉంటోంది. భూవివాదాలు, భూ సమస్యల పరిష్కారం కోసం నిత్యం పదుల సంఖ్యలో తహసీల్దార్‌ కార్యాలయాలకు జనం వస్తూనే ఉన్నారు.

భూవివాదాలు, రైతుబంధు నేపథ్యంలో తహసీల్దార్‌ కార్యాలయాలకు తాకిడి పెరిగింది. రెవెన్యూ అధికారులు దగ్గరలోని వీఆర్వోల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలని స్పష్టం చేస్తున్నారు. వీఆర్వోలు విధిగా గ్రామాల్లో ఉండాలని.. ఎప్పటికప్పుడు ప్రజల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని తహసీల్దార్‌ లు సూచిస్తున్నారు. భూవివాదాలు, భూముల సర్వేలకు సంబంధించిన సమస్యలపైనే ఎక్కువమంది రెవెన్యూ   కార్యాలయాలకు వస్తున్నారు.అయితే క్షేత్రస్థాయికి వెళ్లి ఆ పనులు చేసేందుకు సర్వే అధికారులు జంకుతున్నారు. సాధారణంగానే భూముల సర్వే అంశంలో తీవ్ర జాప్యం జరిగేది. తాజా పరిస్థితుల వల్ల జాప్యం మరింత పెరిగింది.

ఉద్యోగుల్లో ఎవరికైనా కరోనా సోకితే మిగిలినవారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దీంతో సిబ్బంది అందరికీ పరీక్షలు చేస్తున్నారు. కార్యాలయాలను తాత్కాలికంగా మూసివేస్తున్నారు. శానిటైజేషన్‌ సహా వివిధ జాగ్రత్తల అనంతరమే తెరుస్తున్నారు. దీనివల్ల కూడా వివిధ సేవలకు అంతరాయం కలుగుతోంది. ఈ విధంగా ప్రభుత్వ కార్యాలయాలలో కిటికీ సేవలు ఇంకా ఎంతకాలమో తెలియక ప్రజలు గగ్గోలు పెడుతున్నారు.

సరికొత్త దారిలో దూసుకుపోతున్న కరోనా!

Corona virus
“మూలిగే నక్కమీద తాటికాయ పడ్డట్లు” ఇప్పటికే కరోనాతో ప్ర‌పంచ దేశాలు సైతం వాణికిపోతుంటే.. ఇప్పుడు మరో వార్త అన్ని దేశాల వెన్నులో వ‌ణుకుపుట్టిస్తోంది.. ఎప్పుడు.. ఎవ్వ‌రికి.. ఎలా.. ఎక్క‌డి నుంచి క‌రోనా సోకుతుందో కూడా తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంది… దీంతో.. ఇంటి నుంచి బ‌య‌ట‌కు అడుగు పెట్టాలంటేనే ఆలోచించాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. విదేశాల నుంచి వ‌చ్చిన వైర‌స్.. మొద‌ట న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాలు, ఆ త‌ర్వాత ప‌ల్లెలు ఇలా.. అంతా ఎగ‌బాకుతోంది.. ఇక‌, క‌రోనా వైర‌స్ ల‌క్ష‌ణాలు ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త‌వి గుర్తిస్తున్నారు. మరికొందరిలో.. ఏ లక్షణాలు లేకుండానే కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అవుతోంది..

క‌రోనా వైర‌స్ ల‌క్ష‌ణాల్లో ఇప్పటి వ‌ర‌కు జలుబు, తుమ్ములు, జ్వరం, దగ్గు.. ప్రధానంగా ఉండ‌గా.. ఆ త‌ర్వాత వాసన గ్రహించే శక్తిని కోల్పోయి కూడా ఈ వైరస్ బారిన పడ్డారు. అంతే కాదు.. రుచి కూడా తెలియ‌ని ల‌క్ష‌ణం కూడా ఒక‌టి ఉంద‌ని తేల్చారు.. అయితే.. కొత్తగా తలనొప్పి, వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న వారికి కూడా వైరస్ సోకుతున్నట్లు వైద్య నిపుణులు తేల్చారు.. తలనొప్పి, వాంతులు, విరేచనాలను సాధారణ అనారోగ్య సమస్యలుగా ప‌రిగ‌ణించ‌కుండా.. వీటిలో ఏ ఒక్కటి ఉన్నా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం మేల‌ని సూచిస్తున్నారు వైద్యులు. సెంటర్స్ ఫర్ డిసీస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) చెబుతున్న క‌రోనా ల‌క్ష‌ణాల‌ను ఓ సారి చూస్తే.. 1. జ్వరం లేదా చలి జ్వరం, 2. దగ్గు, 3. శ్వాస అందకపోవడం లేదా శ్వాస తీసుకోవడం కష్టంగా మార‌డం, 4. ఆయాసం, 5. ఒంటి నొప్పులు లేదా కండరాల నొప్పులు, 6. తలనొప్పి, 7. రుచి తెలియకపోవడం లేదా వాసన గ్రహించే శక్తిని కోల్పోవడం, 8. గొంతునొప్పి, 9. జలుబు, 10. వాంతులు, 11. విరేచనాలుగా ఉన్నాయి.. రోజుకురోజుకూ విస్త‌రిస్తోన్న ఈ వైర‌స్‌ లో మ‌రెన్ని కొత్త ల‌క్ష‌ణాలు బ‌య‌ట‌ప‌డ‌తాయో చూడాలి మ‌రి.

రాజకీయ నాయకులు కూడా వర్క్ ఫ్రం హోమ్?

Telangana-Agriculture

Telangana-Agriculture

కరోనా విజృంభిస్తున్న తరుణంలో వివిధ రంగాల ఉద్యోగులే కాదు చివరికి రాజకీయ నాయకులు కూడా వర్క్ ఫ్రం హోం కు సిద్ధమౌతున్నారు. ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ ఆయన ఉంటున్న ఫామ్ హౌజ్ లోనే భారీ సెట్ ఏర్పాటు చేసి అక్కడ నుండే పాలన కొనసాగించాలని చూస్తున్నారు. తాజాగా కర్ణాటక సీఎం యడ్యూరప్ప కూడా కేసీఆర్ బాట పట్టారు. ఇటీవల బెంగళూరులోని సిఎం కార్యాలయంలో అధికారులకు కరోనా పరీక్షలు చేయగా అందులో ఒకరికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ నేపద్యంలో ముఖ్యమంత్రి యడ్యూరప్ప కీలక నిర్ణయం తీసుకున్నారు.

ముందస్తు చర్యల్లో భాగంగా ఇంటి నుంచి విధులు నిర్వర్తించేలా తీసుకున్న నిర్ణయాన్ని ప్రకటించారు. అంతే కాక ఒక అధికారికి కరోనా వైరస్ వ్యాప్తి నేపద్యంలో అందరు అధికారులకు కరోనా పరీక్షలు నిర్వహించేలా తగిన చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో కొద్ది రోజులు పాటు ఇంటి నుంచే తమ కార్యకలాపాలు కొనసాగుతాయని యడ్యూరప్ప  చెప్పారు. ఆన్‌ లైన్‌ లో అవసరమైన ఆదేశాలు, సూచనలు ఇస్తామని ఆయన చెప్పారు. తాను ఆరోగ్యంగా ఉన్నానని చెప్పిన యడ్యూరప్ప ప్రజలను భయపడవద్దని సూచించారు. కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు సూచించిన మార్గదర్శకాలను పాటించాలని ఆయన ప్రజలను కోరారు.

తెలుగు రాష్ట్రాలలో కూడా వివిధ పార్టీ నేతలు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.

నా కోడ్‌ చెబితే 25 శాతం డిస్కౌంట్‌ ఇస్తారు.. సమంత


కరోనా దెబ్బకు షూటింగ్స్‌ ఆగిపోవడంతో సినీ ప్రముఖులు అంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. హైదరాబాద్‌లో కరోనా ఉధృతి ఎక్కువగా ఉండడంతో సిటీలో ఉన్న వాళ్లు బయటికి అస్సలు రావడం లేదు. ఈ క్రమంలో తమకు తోచిన పనులు చేసుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. ఖాళీ సమయం దొరికింది కాబట్టి కొత్త విషయాలు నేర్చుకుంటున్నారు. సోషల్‌ మీడియా వేదికగా అభిమానులను తరచూ పలుకరిస్తున్నారు. అలాంటి వాళ్లలో సమంత ముందుంది. తన భర్త నాగ చైతన్యతో వంట, వర్కౌట్స్‌, వాకింగ్‌, యోగా చేస్తున్న వీడియోలు, ఫొటోలు సోషల్‌ మీడియాలో షేర్ చేసిందామె. ఇప్పుడు బ్యూటీ టిప్స్‌ చెబుతోంది. ముఖాన్ని కాంతివంతంగా మార్చే విటమిన్ ఇన్‌ఫ్యూషన్ థెరపీ గురించి వివరించింది. తాను ఈ థెరపీ చేయించుకున్న వీడియోను ఆమె ఇన్స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. దీని గురించి వివరించింది.

కేసీఆర్ ను డిఫెన్స్ లో పడేస్తున్న జగన్!

‘ఇప్పటిదాకా నేను కూకింగ్, గార్డెనింగ్‌ గురించే ఎక్కువగా మాట్లాడుతున్నా అని తెలుకున్నా. అందుకే ఇప్పుడు మీ ముఖాన్ని ఎలా కాంతి వంతంగా మార్చుకోవాలో చెబుతున్నా చూడండి. ఫస్ట్‌ నా గ్లోయింగ్‌ స్కిన్‌ను నేను చాలా ఇష్టపడుతా. అందుకోసం విటమిన్‌ ఇన్ఫ్యూషన్‌ థెరపీ చేయించుకుంటా. దీనివల్ల ముఖం మెరిసిపోతుంది. దీన్ని నేను నెలకు గానీ రెండు నెలలకు ఒకసారి గానీ చేయించుకుంటా. ఇతరులకు ఎంతో కొంత మంచి చేసే విషయాన్నే చెబుతా. సో అంబ్రోసియా క్లినిక్‌లో నేను ఈ థెరపీ చేయించుకొని మంచి రిజల్ట్‌ పొందా. మీరు కూడా చేయించుకోవచ్చు. ఒకవేళ మీరు ‘సమంత’ అనే కోడ్‌ చెబితే మీకు 25 శాతం డిస్కౌంట్‌ కూడా ఇస్తారు. పదండి అందరం మెరిసిపోదాం’ అని సమంత రాసుకొచ్చింది.

https://www.instagram.com/p/CCdUJYEBu2c/

ఆ ముగ్గురితో బాబుకు షాకిచ్చేందుకు రంగం సిద్ధం?


అధికారం బెల్లం లాంటిది.. దానికోసమే రాజకీయ నాయకులు పరితపిస్తారు. కేసీఆర్, చంద్రబాబు హయాంలో డైరెక్టుగా ఇతర పార్టీల నేతలకు మంత్రి పదవులు ఇచ్చే సంప్రదాయం ఉండేది. కానీ వైఎస్ జగన్ మాత్రం కొన్ని నియమాలను రాజకీయాల్లో పెట్టుకున్నారు. రాజీనామా చేసి వస్తేనే తన పార్టీలోకి తీసుకుంటాడు. అదే ఇప్పుడు గోడ దూకే రాజకీయ నేతల ముందరి కాళ్లకు బంధం వేస్తోంది. వారికి పదవుల దక్కకుండా చేస్తోంది.

అందుకే ఇన్నాళ్లు ఓపిక పట్టిన టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలకు ఇప్పుడు సమయం వచ్చింది. చంద్రబాబుకు అదును చూసి షాకిచ్చేందుకు సీఎం, వైసీపీ అధినేత జగన్ రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది.

బ్రెజిల్ దేశాధ్యక్షుడిని కాపాడిన ఇండియన్ మెడిసిన్..!

ప్రస్తుతానికి ముగ్గురి రాజీనామాలతో చంద్రబాబుకు షాకివ్వడానికి జగన్ రెడీ అయ్యారు. ఆ ముగ్గురిలో ఒకరికి మంత్రి పదవి కూడా ఇచ్చే యోచనలో జగన్ ఉన్నాడట.. దీంతో అటు చంద్రబాబును చిత్తుగా ఓడించొచ్చు.. ఇటు టీడీపీ బలాన్ని దెబ్బకొట్టి బలపడొచ్చు అని జగన్ స్కెచ్ వేశారట..

టీడీపీ ఎమ్మెల్యేలుగా గెలిచి ఆ పార్టీపై ధిక్కార స్వరం వినిపిస్తూ వైసీపీకి సపోర్టు చేస్తున్న రెబల్ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, మద్దాల గిరి, కరణం బలరాంలు ముగ్గురు రాజీనామాలకు సిద్ధం అయ్యారని తెలిసింది.. త్వరలోనే వారు రాజీనామాలు చేయడం.. స్పీకర్ ఆమోదించడం.. వారి నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరపడం ఖాయమని వైసీపీ వర్గాల ద్వారా తెలిసింది. టీడీపీని చిత్తుగా ఓడించి ఆ ముగ్గురిని గెలిపించుకోవాలని సీఎం జగన్ ప్లాన్లు చేస్తున్నారట.. ఇందులో వల్లభనేని వంశీకి ఖాళీ అయిన రెండు మంత్రి పదవుల్లో ఒక పదవిని ఇచ్చేందుకు కూడా జగన్ డిసైడ్ అయినట్లు సమాచారం.

కేసీఆర్ ను డిఫెన్స్ లో పడేస్తున్న జగన్!

ఈ ముగ్గురు నేతలూ టీడీపీ నుంచి గెలిచి వైసీపీకి మద్దతుగా రాజకీయం చేశారనే అపవాదు ఉంది. దీంతో టీడీపీ నేతలు.. సోషల్ మీడియాలో వంశీ, కరణం, గిరిల రెండు నాల్కల ధోరణిపై విమర్శలు గుప్పించారు. వంశీ తిరగబడి టీడీపీకి రాజీనామా చేశారు. ప్రస్తుతం శాసనసభలో టెక్నికల్ గా టీడీపీ ఎమ్మెల్యేగా ఉంటూ వైసీపీకి మద్దతు ప్రకటించిన వల్లభనేని వంశీ ఇప్పుడు ఆ టీడీపీ వాసనలు వదిలించుకోవాలని డిసైడ్ అవుతున్నాడట.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైసీపీ తరుఫున గన్నవరంలో పోటీచేసి గెలిచి ఆ అపవాదును తుడుచుకోవాలని ఆలోచిస్తున్నాడట.. ఈ క్రమంలోనే సీఎం జగన్ ను ఒప్పించాలని సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిసింది.. వంశీతోపాటు కరణం, గిరి కూడా రెడీ కావడంతో మొత్తం ముగ్గురితో రాజీనామాలు చేయించి ప్రజాక్షేత్రంలోనే చంద్రబాబును ఓడించి బుద్దిచెప్పాలని జగన్ డిసైడ్ అయ్యాడని సమాచారం.

చైనా వెనక్కి వెళ్లినట్లు నమ్మిస్తుందా?


భారత్-చైనా సరిహద్దుల్లో కొంతకాలంగా ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి. గాల్వానాలోయలో జూన్ 15న ఇరుదేశాల సైనికుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఓవైపు శాంతి చర్చలంటూనే చైనా సరిహద్దుల్లో భారత జవాన్లపై దొంగదాడికి యత్నించింది. ఈ సంఘటనలో భారత్ జవాన్లు 21మంది వీరమరణం పొందారు. వెంటనే అప్రమతమైన భారత జవాన్లు చైనా సైనికులను సమర్థవంతంగా తిప్పికొట్టారు. భారత ప్రతిదాడిలో చైనాకు చెందిన 43మంది మృతిచెందిననట్లు తెలుస్తోంది. చైనా సైనికులు ఎంతమంది చనిపోయారని లెక్కలు మాత్రం ఆ దేశం అధికారికంగా ప్రకటించలేదు. అయితే చైనాకు భారీగా నష్టం జరిగినట్లు భారత ఆర్మీ అధికారులు తెలిపారు.

బ్రెజిల్ దేశాధ్యక్షుడిని కాపాడిన ఇండియన్ మెడిసిన్..!

కరోనా మహమ్మరి విషయంలో ప్రపంచాన్ని ఎలా తప్పుదోవ పట్టించిందో అందరికీ తెల్సిందే. దొంగదెబ్బతీయడం, దొంగలెక్కలు చెప్పడం చైనాకు అలవాటేనని ప్రపంచ దేశాలు సైతం చైనా విమర్శిస్తున్నాయి. భారత్-చైనా సరిహద్దుల్లో ఘర్షణలో చైనాను భారత్ సమర్థవంతంగా ఎదుర్కోవడంపై ప్రపంచ దేశాలు భారత్ కు మద్దతు ప్రకటించాయి. చాలాదేశాలు బహిరంగంగానే భారత్ కు మద్దతు పలికాయి. భారత జవాన్లు మృతిపై కేంద్రం కూడా చాలా సీరియస్ అయింది. చైనాకు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధమైంది.

చైనాను రక్షణ, ఆర్థికంగా, దౌత్యపరంగా దెబ్బతీసేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. సరిహద్దుల్లో కమాండర్ స్థాయి అధికారులకు పరిస్థితులను బట్టి నిర్ణయాన్ని తీసుకునే అధికారాన్ని కల్పించింది. త్రివిధ దళాలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. యుద్ధవిమానాలను సరిహద్దుల్లో గస్తీ ఉంచింది. మరోవైపు చైనాకు చెందిన పలు కాంట్రాక్టులను రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. అలాగే చైనాకు చెందిన 59యాప్స్ ను భారత్ లో నిషేధించి చైనాకు షాకిచ్చింది.

కేసీఆర్ ను డిఫెన్స్ లో పడేస్తున్న జగన్!

ఇటీవల భారత్ ప్రధాని లద్దాక్ లో పర్యటించిన చైనాకు గట్టివార్నింగ్ ఇచ్చారు. సరిహద్దుల్లో భారత జవాన్లకు ఆత్మస్థైర్యం కల్పించేలా ప్రసంగించారు. అనంతరం చైనా దాడిలో గాయపడిన భారత జవాన్లను పరామర్శించారు. మరోవైపు చైనాపై అంతర్జాతీయంగా ఒత్తిడి పెరగడంతో సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తగ్గించేందుకు చైనా తన సైన్యాన్ని వెనక్కి తరలించేందుకు నిర్ణయం తీసుకుంది. ఈమేరకు సరిహద్దుల్లో రెండుకిలోమీటర్ల వెనక్కి వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే 1962 యుద్ధ సమయంలోనూ చైనా ఇలానే వెనక్కి వెళ్లి దొంగదెబ్బ తీసిందని ఆర్మీ అధికారులు చెబుతోన్నారు.

చైనా నమ్మదగిన దేశంకాదని చెబుతున్నారు. సరిహద్దుల్లో వెనక్కి వెళ్లినట్లు నటించి మళ్లీ ఉద్రిక్తలు సృష్టిస్తుందటం కామన్ గా మారిందంటున్నారు. ఈనేపథ్యంలో భారత సైనికులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అప్రమత్తంగా లేకుంటే మూల్యం చెల్లించుకోవాలని వస్తుందని సూచిస్తున్నారు. ఈమేరకు భారత ఆర్మీ కూడా ఎప్పటికప్పుడు సైనికులతో సమీక్షలు నిర్వహిస్తూ సరిహద్దుల పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుకుంటున్నారు.