టాలీవుడ్ స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్.. ‘అల వైంకుఠపురములో’ రిలీజై చాలా రోజులైంది. థియేటర్ల నుంచి ఓటీటీలోకి కూడా వచ్చేసింది. హీరో హీరోయిన్లు, దర్శకుడు ఇతర సినిమాలతో బిజీగా ఉన్నారు. అయినా ఈ మూవీ రోజూ వార్తల్లో నానుతోంది. దానికి కారణంగా మూవీలో సంగీతం. మ్యూజికల్‌గా బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఈ మూవీలో ప్రతీసాంగ్ శ్రోతలను ఎంతగానో ఆకట్టుకుంది. మరీ ముఖ్యంగా ‘బుట్ట బొమ్మ’ సాంగ్ అయితే చిన్నా పెద్దా అన్న తేడా లేకుండా అందరినీ ఒక ఊపు ఊపేస్తోంది. రామజోగయ్య శాస్త్రి అందించిన అద్భుత సాహిత్యానికి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అదిరిపోయే బాణీలు అందించాడు. కొరియోగ్రాఫర్ జానీ క్లాసిక్ నృత్యరీతులు సమకూర్చాడు. బన్నీ, పూజా హెగ్డే కూడా పాటలో లీనమైపోయి నర్తించిన ఈ సాంగ్ యూత్‌నే కాదు అన్ని వయసుల వారినీ కట్టి పడేసింది. విజువల్స్ పరంగా ‘బుట్టబొమ్మ’ వీడియో సాంగ్ వరల్డ్ వైడ్ క్రేజ్‌ని అందుకోవడమే కాకుండా తెలుగులో కనివినీ ఎరుగని రికార్డ్‌ను క్రియేట్ చేసింది.
జగన్-కేసీఆర్ దోస్తీకి జలగండం..?
యూట్యూబ్‌లో ‘బుట్టబొమ్మ’ వీడియో సాంగ్‌కు రికార్డ్ వ్యూస్ వస్తుండటం విశేషం. తాజాగా 200 మిలియన్ వ్యూస్ దాటిన ‘బుట్టబొమ్మ’ వీడియో సాంగ్.. ఇప్పుడు ఏకంగా 260 మిలియన్ వ్యూస్‌తో తెలుగులో అత్యధిక వ్యూస్ సాధించిన వీడియో సాంగ్‌గా రికార్డ్‌ను క్రియేట్ చేసుకుంది. అలాగే..1.9 మిలియన్ లైక్స్ వచ్చాయి. మరికొద్ది రోజుల్లో 2 మిలియన్ లైక్స్ మార్క్ చేరేలా ఉంది. ఈ పాటను ఇంతగా ఆదరిస్తున్న ఆడియన్స్‌కు నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ కృతజ్ఞతలు తెలిపింది. తెలుగులో అత్యధిక వ్యూస్ సాధించిన సాంగ్‌గా రికార్డు సృష్టించిన విషయాన్ని తెలుసుకొని హీరోయిన్ పూజా హెగ్డే, సంగీత దర్శకుడు ఎస్.థమన్ కూడా ట్విట్టర్‌లో స్పందించారు. ‘రికార్డులు మోగిపోతున్నాయ్. ఇంతటి స్థాయిలో ఘనవిజయాన్ని అందించిన ఫ్యాన్స్‌కు ధన్యవాదాలు. మీరంటే నాకు ఎంతో ఇష్టం. ‘బుట్టబొమ్మ’ పాట షూట్ చేయడానికి అల్లు అర్జున్, నేను మా మనసు, ఆత్మ, చెమట.. కొన్నిసార్లు కన్నీళ్లు (నేను మాత్రమే) ధారపోశాం. ఇప్పుడు ఈ పాటను ఇంత గొప్ప ఆదరణ చూసి మనసు ఉప్పొంగిపోతోంది’ అని ట్వీట్ చేసిన పూజా హెగ్డే బుట్టబొమ్మ రికార్డును తెలిపే పోస్టర్ను, పాట లింక్‌ను షేర్ చేసింది.
Breaking records 🙌🏼 To all those ppl who made this possible, you have my heart ❤️ @alluarjun and I put our heart,soul, sweat and sometime tears(only on my end😂) to shoot #ButtaBomma and it’s so gratifying to see it do well. Seeing ppl loving the song EVERYTHING. Ty #Grateful https://t.co/jeHtcEvlB2
— Pooja Hegde (@hegdepooja) July 10, 2020
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Read MoreWeb Title: Butta bomma song is number one in telugu
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com