
విశాఖ రాంకీ ఫార్మాసిటీలోని కెమికల్ పరిశ్రమలో జరిగిన ప్రమాదాన్ని అధికార ప్రతిపక్షాలు రాజకీయ ప్రయోజనాలకు ఉఫయోగించుకోవాలని చూస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు ఆరోఫణలు చేసుకుంటున్న వైనం విమర్శలకు తావిస్తుంది. ప్రస్తుతం ప్రమాదం జరిగిన పరిశ్రమ అధికార పార్టీకి చెందిన నాయకుడికి సంబంధించినదిగా సమాచారం. దీంతో ఇది టిడిపి కుట్ర అని వైసీపీ నాయకులు, అభిమానులు సోషల్ మీదియా వేదికగా ప్రచారం చేస్తున్నారు. టిడిపి మాత్రం ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని విమర్శలు చేస్తున్నారు. పనిలో పనిగా చంద్రబాబు, లోకేష్ పేర్లతో ట్విట్టర్ ఖాతాలతో ఫేక్ ట్వీట్ లు సిద్ధమైపోయాయి. విశాఖ సేఫ్ ప్లేస్ కాదని లోకేష్, కార్యనిర్వాహక రాజధానికి పరికిరాదని చంద్రబాబు ట్విట్ చేసినట్లు ఫేక్ పోస్టులు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ ప్రచారాన్ని టిడిపి యువనేత నారా లోకేష్ ఖండించారు. ప్రాంతీయ విధ్వేషాలు రెచ్చగొట్టే విధంగా వైసిపి సోషల్ మీడియా బ్యాచ్ ఈ విధంగా ప్రచారం చేస్తుందని అధికారక ట్వట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు.
అధికార పక్ష నేతలు మాత్రం ప్రమాదాన్ని తెలిగ్గా తీసుకుంటూ ప్రభుత్వ చర్యలను సమర్ధించుకునే ప్రయత్నం చేస్తున్నారు. విశాఖను ప్రభుత్వం కార్యనిర్వహక రాజధానిగా నిర్ణయించడంతో కుట్ర పూరితంగానే ప్రమాదాలు జరుగుతున్నాయనే వాధనలు వినిపిస్తున్నారు. అదేవిధంగా పరిశ్రమలు ఉన్నప్పుడు ప్రమాదాలు జరుగుతాయని, హైదరాబాదులోను గతంలో అనేక పారిశ్రామిక సంస్థల్లో ప్రమాదాలు చోటు చేసుకున్నాయని సోషల్ మీడియా వేదికగా, బయట సమాధానాలు ఇస్తున్నారు. ఇది బాధ్యతా రాహిత్యంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభుత్వం తొలి ప్రమాదం నుంచి గుణపాఠం నేర్చుకోకపోవడంతో రాష్ట్రంలో అతి తక్కువ కాలంగా నాలుగు భారీ ప్రమాదాలు చోటు చేసుకున్నాయని చెబుతున్నారు.
ముద్రగడ.. కాపులు.. ఓ కుట్రకోణం!
మరోవైపు ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం జరిగినప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖలోని అన్ని పరిశ్రమల్లో నిర్వహణా లోపాలు, భద్రతా ప్రమాణాలపై ఆడిట్ నిర్వహించాలని కోరారు. ప్రభుత్వం మాత్రం ఆపని చేయకపోగా పవన్ పై రాజకీయంగా ఎదురుదాడికి దిగింది. ఈ నిర్లక్ష్యానికి ప్రభుత్వంతోపాటు ప్రజలు, ఆయా సంస్థల్లో పని చేస్తున్న కార్మికులు బలికావాల్సి రావడం దురదృష్టకరం. ముందు జాగ్రత్తతో ఉంటే కర్నూలు, విశాఖల్లో జరిగిన ప్రమాదాలు నివారించేందుకు అవకాశం ఉందనేది జనసేన నేతల వాదన.
కేంద్రం విధించిన లాక్ డౌన్ తొలగించిన అనంరతం విశాఖ నగరంలో జరిగిన పారిశ్రామిక ప్రమాదాల్లో ఇది మూడవది. తొలి ప్రమాదం ఎల్జీ పాలిమార్స్, రెండవది సాయినార్ సంస్థలో జరిగాయి. ఈ ప్రమాదాలు అన్ని పరిశ్రమ నిర్వహణలో యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే జరుగుతున్నాయనేది ప్రభుత్వం గుర్తించాల్సిన వస్తవం. ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంలో హైపవర్ కమిటీ విచారణలో ఇదే విషయం తెటతెల్లమయ్యింది. ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం అనంతరం అన్ని పరిశ్రమల నిర్వహణలో తీసుకుంటున్న చర్యలను పరిశ్రమల శాఖ పూర్తి స్థాయిలో పర్యవేక్షించకపోవడంతో వరుస ప్రమాదాలకు కారణంగా చెప్పొచ్చు.