Home Blog Page 8399

పవన్ దూకుడు పాలిటిక్స్ కి బ్రేక్?

Pawan kalyan

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గతంలో దూకుడు పాలిటిక్స్ మంచిది కాదన్న ఆలోచనలో ఉన్నట్లు ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతుంది. అందుకే మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లుల వ్యవహారంలో గవర్నర్ నిర్ణయం తరువాత స్పందించడమే మంచిదని కొందరి సలహా మేరకు పవన్ గమ్మున ఉన్నట్లు చెబుతున్నారు. రాజధాని ఎక్కడికి తరలిపోదని గతంలో పవన్ రైతులకు హామీ ఇచ్చారు. తాను మూడు రాజధానుల అంశంపైనే విభేదిస్తూ బిజెపి తో పొత్తు సైతం పెట్టుకున్నట్లు ఒక సందర్భంలో పేర్కొన్నారు.అయితే ఆయన జట్టు కట్టిన కమలం గవర్నర్ ను ఈ బిల్లులు ఆమోదించకండి అని లేఖ రాసినా కూడా జనసేనాని ఉలుకు పలుకు లేకపోవడం తో అందరిలో ఆసక్తి పెరుగుతుంది. తాను పొత్తు పెట్టుకున్న బీజేపీలోనే అమరావతి రాజధానిపై రెండు వర్గాలుగా విడిపోయి ఉన్నాయి.

ఈ పరిస్థితుల్లో రాజధాని అంశం తాను ఎందుకు ప్రస్తావించాలన్నది పవన్ కళ్యాణ్ అభిప్రాయంగా అనిపిస్తుంది. గవర్నర్ నిర్ణయం తర్వాతనే పవన్ కల్యాణ్ రాజధాని అంశంపై ప్రస్తావించే అవకాశముంది.నిజానికి ఇప్పుడు పొలిటికల్ ఫీల్డ్ లో ప్రధాన యుద్ధం మూడు రాజధానుల అంశమే. దీనిపై టిడిపి, బిజెపి, కమ్యూనిస్ట్ లు అంతా ఒక్కటై అమరావతి ని ముక్కలు చేసేందుకు ససేమిరా అంటున్నాయి.

అయితే రాజధానిని ముక్కలు చేసేందుకు అస్సలు ఒప్పుకునేది లేదని ఒకనాడు రైతుల ఉద్యమానికి బాసటగా నిలిచిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మౌన ముద్ర లో ఉన్నారు. కనీసం ట్విట్టర్ వేదికగా అయినా ఆయన స్పందించకపోవడం పోవడం ఎపి లో చర్చనీయాంశంగా మారింది. గవర్నర్ వద్దకు చేరిన కీలక బిల్లుల సమయంలో ఎందుకు ఆయన మాట్లాడటం లేదన్న సందేహాలు పెల్లుబికుతున్నాయి.సొంత రాజకీయ అజెండాను అమలు చేసుకునే ఉద్దేశ్యం తోటే పవన్ కళ్యాణ్ ఇంతటి ముఖ్యమైన అంశం విషయంలో మూగనోము పట్టారన్నది రాజకీయ పరిశీలకుల విశ్లేషణ.

ఆరు నెలలు.. కాంగ్రెస్ ఆరు వైఫల్యాల కథ

Congress Party


దేశంలో రాజకీయ పార్టీలన్నాక ఒక స్ట్రాటజీ అవసరం. అలా ఉంటూనే అప్ డేట్ అవుతూ ఉంటే ప్రజల్లో పేరు ప్రఖ్యాతలు.. దాంతోపాటు అధికారం సిద్ధిస్తుంది. అయితే సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయాక రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని వదిలేసి అస్త్రసన్యాసం చేశాడు. అప్పటి నుంచి అజ్ఞాతంలో ఉంటే ఈ ఏడాది కాస్త యాక్టివ్ అయ్యాడు.

అయితే కేంద్రంలోని బలమైన బీజేపీని ఎదుర్కొనే విషయంలో కాంగ్రెస్ పార్టీ వేస్తున్న తప్పటడుగులు ఆ పార్టీని మరింత దిగజార్చుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

Also Read: 22న బలపరీక్ష.. ఉత్కంఠగా రాజస్థాన్ రాజకీయం

ఆరు నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఆరు తప్పులు చేసింది. తద్వారా అధికార బీజేపీకి మరింత బలాన్ని ఇచ్చిందని విశ్లేషకులు అంచనావేస్తున్నారు.

కరోనా వ్యాపించకముందు ఫిబ్రవరిలో దేశ రాజధాని ఢిల్లీలో షహీన్ బాగ్ అల్లర్లు కాంగ్రెస్ ప్రతిష్టను దిగజార్చాయి. దేశద్రోహులుగా ముద్రపడిన కొందరు హిందుత్వవాదులతో గొడవపడడం.. ఆ అల్లర్లలో పలువురు మరణించడం.. కాంగ్రెస్ పార్టీ స్టాండ్ వ్యతిరేకులకు ఇవ్వడంతో ప్రజల్లో ఒకింత ఆగ్రహజ్వాలలను కాంగ్రెస్ ఎదుర్కొంది. పాకిస్తాన్ కు జైకొట్టిన వారికి కాంగ్రెస్ మద్దతు ఇచ్చిందంటూ బీజేపీ ప్రచారం చేయడం ఆ పార్టీకి బలాన్నిచ్చింది.

ఇక మార్చిలో మధ్యప్రదేశ్ లో ఎంతో భవిష్యత్ ఉన్న యువనేత జ్యోతిరాధిత్య సింధియాను కాంగ్రెస్ పార్టీ కోల్పోయింది. సీనియర్లకు పీఠం ఇచ్చి యువ సింధియాను బీజేపీకి వదులుకోవడం కాంగ్రెస్ చేసిన రెండో తప్పు. అందుకే మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ సర్కార్ కూలి.. బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది.

ఇక ఏప్రిల్ లో వలస కార్మికులను రెచ్చగొట్టి కరోనా వేళ బీజేపీపై కాంగ్రెస్ ఒత్తిడి తెచ్చే పని చేసింది. కానీ బీజేపీ నష్ట నివారణ చర్యలతో అందులోనూ మైలేజీని కాంగ్రెస్ సొంత చేసుకోలేకపోయింది.

Also Read: రాజకీయాల్లో పవన్ పై పెరిగిన ఒత్తిడి?

ఇక మే నెలలో ఓడిన సంవత్సరం తర్వాత కూడా కాంగ్రెస్ కురువృద్ధులకే అందలం ఎక్కించడంపై యువ కాంగ్రెస్ వాదులు గళం ఎత్తారు. అటు సింధియా.. ఇటు సచిన్ పైలెట్ తిరుగుబావుటా ఎగురవేయడం కాంగ్రెస్ కోలుకోకుండా చేసింది.

ఇక జూన్ లో చైనాతో వార్ లో ఆ దేశానికి మద్దతిచ్చేలా.. భారత్ ను అవమానించేలా కాంగ్రెస్ వ్యవహరించడం.. దాన్ని బీజేపీని క్యాష్ చేసుకోవడం తెలిసిందే. ఇక రాజస్థాన్ కుంపటిలో జులైలో సచిన్ పైలెట్ బయటకు పోవడంతో యువ త్రయం రెండు రాష్ట్రాల్లో తుడుచుపెట్టుకుపోయింది.

ఇలా ఆరు నెలల్లో కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరు తప్పులు ఆ పార్టీని మరింత కృంగదీశాయని.. తప్పులను సరిదిద్దుకోకపోతే ఆ పార్టీ మూల్యం చెల్లించడం తప్పదు అని క్షేత్రస్థాయి కాంగ్రెస్ వాదులు హెచ్చరిస్తున్నారు.

జగన్ పై నోరు మెదపని నేతలు.. రేపే కేబినెట్ విస్తరణ


ఎన్నో రాష్ట్రాల్లో ఎందరో సీఎంలు మంత్రివర్గ విస్తరణలు చేస్తుంటారు. ఫలానా వారికి మంత్రి పదవులని.. ఫలానా వారు అలిగారని ఊహాగానాలు వెల్లువెత్తాయి. కానీ ఏపీలో మాత్రం అలాంటి అసమ్మతులకు.. అసంతృప్తులకు సీఎం జగన్ అవకాశం ఇవ్వడం లేదు.

నిన్నటికి నిన్న స్పీకర్ తమ్మినేనిని మంత్రివర్గంలోకి తీసుకుంటారంటూ ప్రచారం సాగింది. కానీ తీసుకోవడం లేదు. ఆయన వ్యతిరేక స్వరం ఒక్కటి కూడా వినిపించడం లేదు. ఇక మిగతా నేతలు కూడా అంతే.. సామాజిక కోణంతో బడుగు, బలహీన వర్గాలకు పదవులు ఇస్తున్న జగన్ దూకుడు ముందు ఎవరూ వైసీపీలో నోరెత్తని పరిస్థితి నెలకొంది. నోరెత్తితే బీసీల విషయంలో విలన్లు అయిపోతారు కాబట్టి కిక్కురుమనకుండా ఉంటున్నారు. దీంతో మీడియా కూడా పనిలేకుండా చేస్తున్నారు జగన్.

కన్నాపై అదిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసిందా?

ఇన్నాళ్లు మంత్రులుగా చలామణీ అయిన మోపిదేవి, పిల్లి సుభాష్ లు రాజ్యసభ ఎంపీలుగా పోవడంతో ఖాళీ అయిన రెండు మంత్రిపదవులను భర్తీ చేసేందుకు సీఎం జగన్ ఏపీ కేబినెట్ విస్తరణ చేయబోతున్నాడనే ప్రచారం కొద్దిరోజులుగా సాగుతోంది. అయితే జూలై 22న బుధవారం మధ్యాహ్నం 1.29 నిమిషాలకు ఇద్దరు కొత్త మంత్రులతో ప్రమాణం స్వీకారం చేయబోతున్నారని ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ముహూర్తాన్ని ఖరారు చేశారని.. రేపు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కొత్త మంత్రులతో ప్రమాణం చేయిస్తారని వార్తలు వస్తున్నాయి.

తూర్పు గోదావరి జిల్లాకు చెందిన శెట్టి బలిజ సామాజికవర్గానికి చెందిన రాంచంద్రాపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణతోపాటు శ్రీకాకుళం జిల్లాకు చెందిన మత్స్యకార కుటుంబానికి చెందిన పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు పేర్లు దాదాపు మంత్రులుగా ఖరారైనట్టు సమాచారం.

22న బలపరీక్ష.. ఉత్కంఠగా రాజస్థాన్ రాజకీయం

ఇద్దరు బలహీన సామాజికవర్గాలకే జగన్ మంత్రి పదవులు ఇవ్వబోతున్నారనే ప్రచారం వైసీపీలో సాగుతోంది. అయితే మంత్రి పదవులు ఆశించిన తమ్మినేని సహా ఎవరూ నోరెత్తకపోవడం.. జగన్ నిర్ణయంపై స్పందించకపోవడం గమనార్హం.

ఈసారి ఆ ఇద్దరు మంత్రులతోపాటు కేబినెట్ లోని మరో నలుగురిని తీసేసి కొత్తవారిని తీసుకుంటారనే ప్రచారం జరిగింది. కానీ జగన్ మాత్రం అవేమీ లేకుండా కేవలం రెండు మాత్రమే భర్తీ చేయబోతున్నారు. దీంతో అటు వైసీపీ లోనూ.. ఇటు మీడియాలోనూ జగన్ వ్యూహాత్మక వైఖరిపై ఎటూ పాలుపోని పరిస్థితి నెలకొంది.

కాంగ్రెస్ కు కేసీఆర్ మాస్టర్ స్ట్రోక్..!


పరిస్థితులు ఎలా ఉన్నా కేసీఆర్ తనకు అనుకూలంగా మార్చుకోవడంలో దిట్టని అందరికీ తెల్సిందే. ఎంతటి కిష్టపరిస్థితులైనా అవలీలాగా ఎదుర్కొంటూ కేసీఆర్ ముందుకెళుతున్నారు. కరోనా మహమ్మరి కారణంగా టీఆర్ఎస్ సర్కార్ పై ప్రభుత్వంపై కొంత వ్యతిరేకత వచ్చినప్పటికీ దీటుగానే ఎదుర్కొంటున్నారు. టీఆర్ఎస్ ఆరేళ్ల పాలనలో ఏనాడూ ప్రతిపక్షాలకు ఛాన్స్ ఇవ్వని కేసీఆర్ కొంతకాలం మౌనంగా ఉండటంతో ప్రతిపక్షాలు జోరు పెంచాయి. ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పై దూకుడు పెంచడంతో కేసీఆర్ ఆ పార్టీకి షాకిచ్చిందుకు రెడీ అవుతున్నారు.

22న కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం..

తెలంగాణ ఉద్యమ సమయంలో మాజీ ప్రధాని పీవీ నర్సింహారావును కేసీఆర్ ఎన్నోసార్లు విమర్శించారు. అయితే పీవీ శతజయంతి ఉత్సవాల సందర్భంగా సీఎం కేసీఆర్ పీవీపై ప్రశంసలు కురిపించారు. పీవీ తెలంగాణవాడు గర్వకారణమని చెప్పుకొచ్చారు. ఆయన శతజయంతి ఉత్సవాలను తెలంగాణలో ఏడాదిపాటు నిర్వహిస్తామంటూ ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. తెలంగాణ వాడైన పీవీని కాంగ్రెస్ అవమానించిదంటూ ఆ పార్టీని కార్నర్ చేస్తూనే తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేశారు.

పీవీ జయంతి ఉత్సవాలకు కోట్లాది రూపాయాలను విడుదల చేయడంతోపాటు ఏయే రోజుల్లో ఎలాంటి కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహించనుందో ముందే ప్రకటించేశారు. కాంగ్రెస్ చెందిన పీవీని కేసీఆర్ తనకు అనుకూలంగా మార్చుకోవడంతో కాంగ్రెస్ నేతలు తలలు పట్టుకుంటున్నారు. పీవీ తెలంగాణ వాడైనందుకు కాంగ్రెస్ ఆయనకు సరైన గౌరవం దక్కకుండా అనేకసార్లు వ్యవహరించిదనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. పీవీ జయంతిని కేసీఆర్ తనకు అనుకూలంగా మార్చుకోవడంలో కేసీఆర్ విజయవంతం కావడంతో కాంగ్రెస్ నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

చంద్రబాబు సామ్రాజ్యాన్ని కూల్చే జగన్ ఆయుధం!

పీవీ శతజయంతి ఉత్సవాలను కేసీఆర్ చేయడంతోపాటు ఆయనపై తనకున్న చిత్తశుద్ధిని చాటుకునేందుకు సిద్ధపడుతున్నారు. త్వరలో గవర్నర్ కోటలో ఖాళీకానున్న మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి పీవీ కూతురు వాణి దేవీకి కేటాయించేందుకు కేసీఆర్ సిద్దమవుతున్నారట. తెలంగాణ వాడైన పీవీని టీఆర్ఎస్ పార్టీ గౌరవిస్తుందనే భావనను ప్రజల్లోకి తీసుకెళుతూ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేందుకు కేసీఆర్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

పీవీ కూతురుకు ఎమ్మెల్సీ ఆఫర్ చేయడం ద్వారా సీఎం కేసీఆర్ తెలంగాణతోపాటు జాతీయ స్థాయిలో మంచిపేరు రావడం ఖాయం. జాతీయ రాజకీయాలపై ఆసక్తి ఉన్న కేసీఆర్ కు ఇది మున్ముందు చాలా ఉపయోగపడనుంది. అన్ని ఆలోచించే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారనే టాక్ విన్పిస్తుంది. ఇదిలావుంటే కాంగ్రెస్ నేత అయిన పీవీని ఆ పార్టీపైనే అస్త్రంగా ఉపయోగించడం కేసీఆర్ కే సాధ్యమనే వాదన విన్పిస్తుంది. కేసీఆర్ ఇచ్చిన మాస్ట్రర్ స్ట్రోక్ కు కాంగ్రెస్ నేతలు మరింత ఢీలాపడిపోడం ఖాయంగా కన్పిస్తోంది.

బాబు ఆవేశానికి తమ్ముళ్లు బలి కావాల్సిందేనా?


రాజకీయ పార్టీలకు, విగ్రహాలకు విడదీయరాని సంబంధం ఉంటుందని అందరికీ తెల్సిందే. అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి చెందిన నేత విగ్రహాలను ఆవిష్కరించి ప్రచారం చేసుకోవడం అన్ని రాష్ట్రాల్లోనూ కామన్ అయిపోయింది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదేమీ కొత్తకాదు. దివంగత ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలను టీడీపీ, వైసీపీ పోటీపోటాగా అన్ని ప్రాంతాల్లో ఆవిష్కరిస్తూ విగ్రహాల రాజకీయాలకు పాల్పడుతుంటడం అందరూ గమనిస్తూనే ఉన్నారు.

ఇక చంద్రబాబు నాయుడు పరిపాలన రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో దివంగత ఎన్టీఆర్ విగ్రహాలను అనేకచోట్ల ప్రతిష్టించారు. తమ పార్టీ నేత విగ్రహాలు అన్నిచోట్ల ఉంటే అక్కడి ప్రాంతవాసులంతా తమనే గుర్తించుకుంటారనే కోణంలో అధికారంలో ఉన్న పార్టీలన్నీ వారివారి నేతల విగ్రహాలను ఆవిష్కరించేందుకు పోటీపడుతుంటాయి. ఇందులో భాగంగానే చంద్రబాబు తానే అధికారంలో శాశ్వతంగా ఉండిపోవాలనే ఆలోచనతో వీలైన ప్రతీచోట ఎన్టీఆర్ విగ్రహాలను ప్రతిష్టించారు. అయితే కిందటి ఎన్నికల్లో టీడీపీ అధికారాన్ని కోల్పోయింది.

వైసీపీలో షాడో మినిష్టర్లు.. జగన్ కు కొత్త తలనొప్పి?

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఓదార్పుయాత్ర, పాదయాత్ర చేసిన సమయంలో చాలాచోట్ల దివంగత వైఎస్ఆర్ విగ్రహాలను ప్రతిష్టించారు. అయితే చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ విగ్రహాలను చాలాచోట్ల పెట్టనీయకుండా అడ్డుకున్నారు. కొన్నిచోట్ల అప్పటికే ప్రతిష్టించిన విగ్రహాలను తీయించారు. విజయవాడ బస్టాండ్ సమీపంలో మాజీ ఎంపీ లడగపాటి రాజగోపాల్ తనకెంతో ఇష్టమైన పోలవరం డిజైన్ బ్యాగ్రౌండ్ తో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ విగ్రహాన్ని రాత్రికి రాత్రే తొలగించడంలో అప్పట్లో తీవ్ర దూమారం రేపింది. ట్రాఫిక్ కు ఎలాంటి అంతరాయం లేకుండా నిర్మించిన ఈ విగ్రహాన్ని ప్రభుత్వం కావాలనే తొలగించిందని వైసీపీ నేతలు ఆరోపణలు గుప్పించారు.

ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి సీఎం అవడంతో ఇప్పుడు వైసీపీ నేతల వంతు వచ్చింది. నెల్లూరు జిల్లా కావ‌లి కూడ‌లిలో ఎన్టీఆర్ విగ్ర‌హాన్ని స్థానిక వైసీపీ నేతలు తొలగించారనే ప్రచారంతో టీడీపీ రంగంలోకి దిగింది. ఈ అంశాన్ని స్థానిక టీడీపీ నేతలు సీరియస్ తీసుకొని వైసీపీపై పోరాడాలని చంద్రబాబు సూచించారు. ఎన్టీఆర్ విగ్రహం టచ్ చేయాలంటే వైసీపీ నాయకులకు వణుకుపుట్టేలా చేయాలని టీడీపీ శ్రేణులను పిలుపునిచ్చారు.

ఆమంచి ఆధిపత్యానికి గండికొట్టిన కరణం..!

ఇదంతా బాగానే ఉన్నా బాబు పిలుపు మేరకు త‌మ్ముళ్లు దూకుడుగా వెళితే వారిని కాపాడేవారు ఎవరనే ప్రశ్న తలెత్తుతోంది. ఇప్పటికే చంద్రబాబు హయాంలో పనిచేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు జైల్లో మగ్గుతున్నారు. ఇప్పుడు ఈ విషయంలో నేతలు దూకుడుగా వెళ్లి అరెస్టయితే ఎవరు తమను బయటికి తీసుకొస్తారనే ప్రశ్నలకు సమాధానం లేకుండా పోయింది. మాజీ మంత్రులకే ఇప్పటివరకు బెయిల్ దొరకడం లేదని ఇక తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోతే వారి పరిస్థితి ఏంటనే సందేహాలు కలుగుతున్నాయి. దీంతో చంద్రబాబు ఆవేశానికి నేతలు బలికావాల్సిందేనా? అంటూ తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు.

నేను ఇబ్బంది పడుతున్నా: రష్మిక


వరుస హిట్స్‌, చేతి నిండా సినిమాలు, తెలుగులోనే కాకుండా సౌత్‌ అన్ని భాషల్లో స్టార్ హీరోయిన్‌గా దూసుకెళ్తోంది రష్మిక మందన్నా. ముఖ్యంగా ఈ ఇయర్ అయితే ఆమె కెరీర్లో చాలా స్పెషల్‌. రష్మిక లైఫ్‌లో 2020 గొప్పగా ఆరంభమైంది. ఆమె హీరోయిన్‌గా నటించిన సరిలేరు నీకెవ్వరూ, భీష్మ సూపర్ హిట్స్‌ అయ్యాయి. మరెన్నో ఆఫర్లు ఆమె చేతుల్లోకి వచ్చాయి. ప్రస్తుతం అల్లు అర్జున్‌ సరసన ‘పుష్ప’ చిత్రంలో రష్మిక హీరోయిన్‌గా నటిస్తోంది. సుకుమార్‌ దర్శకత్వంలో ఈ సినిమా పాన్‌ ఇండియా సినిమాగా తెరకెక్కబోతోంది. అయితే కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ఈ సినిమా చిత్రీకరణ ఆగిపోయింది. హైదరాబాద్‌లో ఫారెస్ట్‌ సెట్స్‌ వేసి షూట్‌ చేయాలని సుకుమార్ ప్లాన్‌ చేస్తున్నాడు. మరోవైపు కన్నడలో ‘పొగరు’ , తమిళ్‌లో ‘సుల్తాన్‌’ మూవీ చేస్తోంది రష్మిక. ఈ రెండూ షూటింగ్‌ పూర్తి చేసుకొని పోస్ట్‌ ప్రొడక్షన్‌ దశలో ఉన్నాయి. ఇలా మూడు హిట్స్‌.. ఆరు అవకాశాలు అన్నట్టు రష్మిక కెరీర్ ఓ రేంజ్‌లో దూసుకెళ్తోంది. అయినప్పటికీ ఆమె చాలా ఇబ్బంది పడుతుందట.

కరోనా రాకుండా స్టార్ హీరో ఇంటికి ప్లాస్టిక్‌ కంచె

ఇంత సక్సెస్‌, స్టార్డమ్‌ ఉన్న నటికి ఇబ్బందులు ఏంటి? అనుకుంటున్నారా?. అందరిలాగే కరోనా కష్టాలు రష్మిక కుటుంబాన్ని తాకాయి. కొంపదీసి వాళ్ల ఫ్యామిలీలో ఎవరికైనా కరోనా సోకిందా? అన్న అనుమానం వద్దు. వాళ్ల ఫ్యామిలీ క్షేమంగానే ఉంది. కాకపోతే లాక్‌డౌన్‌ షూటింగ్స్‌ ఆగిపోవడం, వ్యాపారం కూడా దెబ్బతినడంతో తమ కుటుంబానికి ఆర్థికంగా కొంత ఇబ్బంది కలుగుతోందని రష్మిక తెలిపింది. కరోనా వల్ల పనులన్ని ఆగిపోవడంతో తనతోపాటు తన తండ్రికి కూడా కొన్ని ఆర్థిక సమస్యలు ఎదురయ్యాయని చెప్పింది. అయితే, తాము కొంత ఇబ్బంది పడుతున్నప్పటికీ తమ దగ్గర పనిచేసే వాళ్లకు జీతాలు ఇస్తున్నామని తెలిపింది. తమ వద్ద 20 మంది ఉద్యోగులు పని చేస్తున్నారని, ఇబ్బందులు ఉన్నా వాళ్లకు మాత్రం తప్పనిసరిగా సకాలంలో జీతాలను అందిస్తున్నామని చెప్పింది. మనకు ఇబ్బంది ఉంది కదా అని ఎదుటివాళ్ళని కూడా అలాంటి ఇబ్బందికి గురి చేయకూడదు అని సోషల్‌ మీడియా ద్వారా తెలిపింది. సెలబ్రిటీలను కూడా కరోనా ఇబ్బందులు గురి చేస్తుండగా.. ఈ కష్టకాలంలో కూడా ఉద్యోగులకు సకాలంలో వేతనం ఇస్తున్నామని చెప్పిన రష్మికను పలువురు మెచ్చుకుంటున్నారు.

సూసైడ్‌ ఆర్‌ మర్డర్… సుశాంత్‌పై బయోపిక్‌

A film on Sushant Singh Rajput

A film on Sushant Singh Rajput

ఎంతో భవిష్యత్తు ఉన్న యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య బాలీవుడ్‌లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. మానసిక ఒత్తిడి కారణంగా సుశాంత్‌ బలవన్మరణం పాలవగా.. అందుకు కారణం అతనికి అవకాశాలు రాకుండా చేయడమే అన్న ఆరోపణలు వచ్చాయి. బాలీవుడ్‌ కొన్నికుటుంబాల గుప్పిట్లోనే ఉందని, వాళ్ల బంధువులకే అవకాశాలు ఇస్తూ.. ఇతరులను తొక్కేస్తున్నారని కంగనా రనౌత్‌ వంటి ప్రముఖులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. సుశాంత్‌ మరణించి నెల కావస్తున్నా ఈ వివాదం ఇంకా ముగియనే లేదు. కాగా, సుశాంత్‌ ‌ జీవితం ఆధారంగా ఇప్పుడు ఓ సినిమా రాబోతోంది. ‘సూసైడ్‌ ఆర్‌ మర్డర్‌’ అనే టైటిల్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు బాలీవుడ్‌ నిర్మాత విజయ్‌ శేఖర్‌ గుప్తా ప్రకటించాడు. ‘ఎ స్టార్‌ వాజ్‌ లాస్ట్‌’ (ఓ స్టార్‌ని కోల్పోయాం) అనేది ట్యాగ్‌ లైన్‌ షామిక్‌ మాలిక్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో సుశాంత్‌ పాత్రలో సచిన్‌ తివారీ నటిస్తున్నాడు. అతని పస్ట్‌ లుక్‌ను కూడా రిలీజ్‌ చేశాడు. ఇందులో సచిన్‌ తివారీ అచ్చం సుశాంత్‌లా కనిపిస్తున్నాడు.

Also Read: మణిరత్నం ‘నవరస’ సిరీస్‌లో తెలుగు స్టార్లు!

బీహార్లోని మారుమూల గ్రామం నుంచి ఓ యువకుడు బాలీవుడ్‌లో మంచి నటుడిగా ఎదిగాడు.. అతని జీవితం ఎలా అంతమైంది అనే విషయాలను ఈ మూవీతో కళ్లకు కట్టనున్నారు. సుశాంత్‌ సూసైడ్‌కు కారణాలు, దాని వెనకున్న మిస్టరీని కూడా టచ్‌ చేయనున్నారు. అయితే, సుశాంత్‌ మృతిని క్యాష్‌ చేసుకోవడానికి తాను సినిమా తీయడం లేదనీ విజయ్‌ శేఖర్ చెప్పాడు. బాలీవుడ్‌లో బంధుప్రీతి, మాఫియా ప్రభావం ఎలా ఉంది? జియా ఖాన్‌, దివ్యభారతి మొదలుకుని సినీ నేపథ్యం లేకుండా చిత్రపరిశ్రమలోకి వచ్చిన వ్యక్తుల ప్రయాణం గురించి ప్రపంచానికి చెప్పడానికే తీస్తున్నట్లు స్పష్టం చేశాడు. సెప్టెంబర్ 16వ తేదీ నుంచి ముంబై, పంజాబ్‌లో యాభై రోజుల పాటు షూటింగ్‌ చేసేలా ప్లాన్‌ చేస్తోంది చిత్ర బృందం.

ఆ నేతల అరెస్టును కరోనా ఆపుతుందా?


ఏపీగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఇటీవలే ఏడాది పాలన పూర్తి చేసుకున్నారు. జగన్ సీఎం అయినప్పటి నుంచి ఓవైపు సంక్షేమం మరోవైపు ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తూ ముందుకెళుతున్నారు. 2024 ఎన్నికలే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి ముందుకెళుతున్నారు. ఈక్రమంలోనే గత టీడీపీ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలను బయటికి తీస్తూ ఆ పార్టీ నేతల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నారు. చంద్రబాబు హయాంలో మంత్రులుగా పనిచేసిన వారంతా ఒక్కొక్కొరుగా జైళ్లకు వెళుతుండటంతో టీడీపీ నేతల్లో భయాందోళన మొదలైంది.

Also Read: జగన్ దెబ్బకు దెబ్బ సిద్ధాంతంలో భాగమేనా ఇది?

చంద్రబాబు నాయుడికి నమ్మకస్థుడిగా ఉన్న మాజీమంత్రి అచ్చెన్నాయుడు, టీడీపీలో బలమైన నాయకత్వం కలిగిన మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, జేసీ ప్రభాకర రెడ్డి, చింతమనేని ప్రభాకర్ లాంటి నేతలు ఇప్పటికే అరెస్టయ్యారు. ఇంకా పలువురు టీడీపీ నేతలను జైళ్లకు పంపేందుకు జగన్ సర్కార్ సిద్ధమవుతోంది. ప్రధానంగా ఉత్తరాంధ్రకు చెందిన కీలక నేతలు ఈ లిస్టులో ఉన్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, పితానితోపాటు కొంతమంది మాజీ ఎమ్మెల్యేలపై ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. వీరితోపాటు చంద్రబాబు తనయుడు లోకేష్ బాబు కూడా త్వరలోనే అరెస్టవుతారని ప్రచారం జోరుగా సాగింది.

అయితే రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, ఇతర కారణాలతో ప్రస్తుతానికి టీడీపీ నేతల అరెస్టుకు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. ఏపీలో కరోనా కేసులను కట్టడి చేసేందుకు ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. దేశంలోనే అత్యధిక కరోనా టెస్టులు చేస్తూ అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుంది. ఇలాంటి సమయంలో టీడీపీ నేతలను అరెస్టు చేస్తే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందనే ఆలోచనతో సీఎం జగన్ వెనుకడుగు వేసినట్లు తెలుస్తోంది. తాత్కాలికంగా నేతల అరెస్టులకు బ్రేక్ పడిని అధికారులు రహస్యంగా నేతల అవినీతిపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.

Also Read: ఆనం సడెన్ సైలెంట్ వెనుక కారణాలేంటీ?

ప్రస్తుతానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఇతర నేతలెవరూ కూడా ప్రభుత్వానికి పెద్దగా వ్యతిరేకంగా మాట్లాడటం లేదు. కరోనా నేపథ్యంలో చంద్రబాబు నాయుడు హైదరాబాద్లోని తన నివాసానికే పరిమితయ్యారు. ఇంకా మిగతా టీడీపీ నేతల హడావుడి కూడా రాష్ట్రంలో ఎక్కడ కన్పించడం లేదు. దీంతో జగన్ సర్కార్ కు ఎదురులేకుండా పోతుండటంతో ప్రస్తుతానికి అరెస్టుల వ్యవహారాన్ని పక్కకు పెట్టినట్లు తెలుస్తోంది.

జగన్ సర్కార్ ఇప్పటికే టీడీపీ నేతల అవినీతికి సంబంధించిన ఆధారాలన్నీ సేకరించి పెట్టుకుంది. సరైన సమయంలో వాటిని అస్త్రంగా ప్రయోగించనుందని టాక్ విన్పిస్తుంది. ప్రస్తుతానికి కరోనా కారణంగా నేతల అరెస్టులకు బ్రేక్ పడినప్పటికీ టీడీపీ నేతల్లో మాత్రం అరెస్టు గుబులు నెలకొందనే ప్రచారం జరుగుతోంది. ఎప్పుడేం జరుగుతుందోనని భయాందోళనలో టీడీపీ నేతలు ఉన్నట్లు తెలుస్తోంది.

కరోనా దెబ్బతో కళావిహీనంగా మారిన బడి!

 

Schools closed

మాయదారి కరోనా దెబ్బతో రాష్ట్రంలో కోవిద్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రైవేట్‌ బడులు ఒక్కొక్కటిగా మూతపడుతూ… వస్తున్నాయి.‘‘ఇక పాఠశాలలను మేము నడపలేం బాబోయ్‌’’ అంటూ నిర్వాహకులు చేతులెత్తేస్తున్నారు. ఇప్పటికే తాము లక్షలాది రూపాయల నష్టాన్ని మూటగట్టుకున్నామని.. మళ్లీ బడులు తెరిచి మరింత ఆర్థిక భారాన్ని మోయలేమంటూ వెనక్కి తగ్గుతున్నారు. ఫలితంగా వందలాది మంది విద్యార్థులు, ఉపాధ్యాయులతో గత ఏడాది ఇదే సమయానికి కళకళలాడిన  పాఠశాలలు.. ఇప్పుడు కళావిహీనంగా మారాయి. ప్రార్థన గీతాలు, తరగతి గదుల్లో పిల్లల సందడి కరువై బావురుమంటున్నాయి. కరోనా వైరస్‌ రాష్ట్రాన్ని కకావికలం చేస్తోంది. కంటికి కనిపించని వైర్‌స ను ఎదుర్కొని నిలబడేందుకు ప్రజలందరూ పడరాని పాట్లు పడుతున్నారు. ఇప్పటికే వ్యాపార, వాణిజ్య రంగాలన్నీ పూర్తిగా కుదేలయ్యాయి. కొంతమంది చేసేదేమీ లేక వ్యాపారాలను వదులుకుని.. ఇతర రంగాల వైపు వెళ్తున్నారు. ఇప్పుడు అదే దారిలో ప్రైవేట్‌ పాఠశాలల యజమానులు నడుస్తున్నారు.

రాష్ట్రంలోని 33 జిల్లాల్లో గుర్తింపు పొందిన ప్రైవేట్‌ పాఠశాలలు సుమారు 11వేల వరకు ఉన్నాయి. ఇందులో హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లోనే సుమారు 5,526 బడులు ఉన్నాయి. ఇవి కాకుండా రాష్ట్రంలో అనధికారికంగా మరో 6వేల ప్రైవేట్‌ పాఠశాలలు ఉన్నాయి. అన్ని పాఠశాలల్లో కలిపి మొత్తం 33లక్షల మంది చదువుతుండగా, 3.5 లక్షల మంది వరకు బోధన, బోధనేతర సిబ్బంది పని చేస్తున్నారు. కాగా, గ్రేటర్‌ హైదరాబాద్‌ లోని ప్రభుత్వ గుర్తింపు పొందిన బడుల్లోనే 16.05 లక్షల మంది విద్యాభ్యాసం చేస్తున్నారు.

వైరస్‌ ప్రభావంతో మార్చి 16 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలను పూర్తిగా మూసివేయడంతో విద్యార్థులు ఇంటికే పరిమితమయ్యారు. ఏప్రిల్‌ రెండో వారంలో వార్షిక పరీక్షలు నిర్వహించి విద్యార్థుల నుంచి రావాల్సిన పెండింగ్‌ ఫీజులు వసూలు చేసుకోవాల్సిన తరుణంలో వైరస్‌ కారణంగా బడులన్నీ అనివార్యంగా మూతపడ్డాయి. దీంతో ప్రైవేట్‌ స్కూళ్ల యాజమాన్యాలకు సుమారుగా రూ.500 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అంచనాలున్నాయి.

ఇందులో గ్రేటర్‌ హైదరాబాద్‌ లోని 5,526 బడులే దాదాపు రూ.260-280 కోట్ల వరకు నష్టపోయాయి. కొన్ని యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్లు చేసి పెండింగ్‌ ఫీజులు వసూలు చేసేందుకు ప్రయత్నించినా ఫలితం కానరాలేదు. కేవలం 15 శాతం మంది బకాయిలు చెల్లించగా, మిగతా 85శాతం మంది డబ్బుల్లేవని చేతులెత్తేశారు. మార్చి 16 నుంచి బడులను మూసివేయడంతో తమ వద్ద పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బందికి కూడా చాలా యాజమాన్యాలు వేతనాలు చెల్లించలేదు. కేవలం కొన్నిస్కూళ్లు మాత్రమే మార్చి, ఏప్రిల్‌ నెల వేతనాలు అందజేశాయి.

వైసీపీలో షాడో మినిష్టర్లు.. జగన్ కు కొత్త తలనొప్పి?


వైసీపీలో ఎక్కడ చూసినా షాడో మినిష్టర్ల గురించే చర్చ నడుస్తోంది. జగన్ క్యాబినెట్లో కొందరు మంత్రులు వ్యవహారిస్తున్నతీరు ఆయనకు కొత్త తలనొప్పులను తీసుకొస్తోంది. అధికారం ఒకరిది అయితే పెత్తనం మరొకరు చేస్తుండటం హాట్ టాపిక్ గా మారింది. మంత్రి పదవులను అడ్డంపెట్టుకొని వారి బంధువులు షాడో మినిష్టర్లు వ్యవహరిస్తుండటం ఇప్పటికే సీఎం జగన్ దృష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పటికే వారికి స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారనే టాక్ విన్పిస్తోంది. అయితే కొన్నిరోజులు సైలంటై మళ్లీ షాడో మినిష్టర్లు పెత్తనం చేస్తున్నారని వైసీపీలో గుసగుసలు మొదలయ్యాయి.

ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ వేసిన ఆర్ఆర్ఆర్..!

జగన్ క్యాబినెట్లో అనేక సమీకరణాల మధ్య కొందరికీ అనుహ్యంగా పెద్ద పదవులు దక్కగా మరికొందరికీ అవకాశం రాలేదు. అయితే మంత్రి పదవులు దక్కించుకున్న కొంతమంది వ్యవహారం ఇప్పుడే చర్చనీయాంశంగా మారింది. వైసీపీ శ్రేణులు ఏదైనా పని కోసం మంత్రుల వద్దకు వెళితే వారికి బదులుగా వారి బంధువులు పెత్తనం చేస్తుండటంతో వారంతా అవాక్కవుతున్నారట. దీంతో ఆ నేతలపై తీరుపై వైసీపీలో అసంతృప్తిగా ఉన్న నేతలు బహిరంగనే విమర్శలు గుప్పిస్తున్నారు.

ఈనేపథ్యంలోనే మంత్రి శ్రీరంగనాథరాజు కుమారుడుపై ఇటీవల తీవ్ర ఆరోపణలు వచ్చాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో మంత్రి కుమారుడు షాడో మినిస్టర్ గా హల్చల్ చేస్తున్నారని ఎంపీ రఘురామ కృష్ణంరాజు అసంతృప్తి వ్యక్తం చేశారు. హోంమంత్రి మేకతోటి సుచరిత కుటుంబంలోనూ ఒక షాడో మినిస్టర్ ఉన్నారనే జోరుగా ప్రచారం జరుగతోంది. ఈయనే నేరుగా బదిలీల వ్యవహారాలు చక్కబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని తెలియడంతో సీఎం జగన్ మందలించారని సమాచారం. కొన్నిరోజులు స్తబ్దుగా ఉన్న సదరు షాడో మినిస్టర్ మళ్లీ యథావిధిగా పనులు చక్కబెడుతున్నారట.

ఆనం సడెన్ సైలెంట్ వెనుక కారణాలేంటీ?

డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి కుటుంబంలోనూ ఒక షాడో మినిష్టర్ చక్రం తిప్పున్నారట. కురుపాం నియోజకవర్గంలో ఆయన చెబితే మంత్రి పనులు చేస్తారని గుసగుసలు విన్పిస్తున్నాయి. డిప్యూటీ సీఎం అంజాద్ బాషా బంధువు కడపలో షాడో మినిష్టర్ అవతారం ఎత్తగా ఆ జిల్లాకు చెందిన ప్రభుత్వ చీఫ్ విప్ అధిష్టానం వద్దకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

వైసీపీలో పెరుగుతున్న అసంతృప్తులను కట్టడి చేసేందుకు జగన్ శాయశక్తుల ప్రయత్నిస్తుంటే షాడో మినిష్టర్ల వ్యవహారం ఆయనకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. వీరి చర్యలతో పార్టీకి చెడ్డపేరు వస్తుండటం జగన్ వీరిపై చర్యలు తీసుకునేందుకు సన్నహాలు చేస్తున్నారట. దీంతో జగన్ వీరికి ఎలా చెక్ పెడుతారనే చర్చ వైసీపీలో జోరుగా నడుస్తోంది.

చంద్రబాబు సామ్రాజ్యాన్ని కూల్చే జగన్ ఆయుధం!


ప్రత్యర్థి చాలా బలవంతుడు.. 40 ఇయర్స్ ఇండస్ట్రీ. చేతిలో బలమైన మీడియా ఉంది. అందుకే ఇన్నేళ్లుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చక్రం తిప్పారు. ఇప్పటికీ తిప్పుతున్నారు. ఓడినా.. గెలిచినా తనదే అప్పర్ హ్యాండ్ అని టీడీపీ అధినేత చంద్రబాబు చెలరేగిపోతుంటారు. అలాంటి బాబు ఆయువు పట్టుపై కొట్టాలని ఆయన ప్రత్యర్థి.. వైసీపీ అధినేత కం సీఎం జగన్ డిసైడ్ అయినట్టు తెలిసింది. చంద్రబాబు ఎక్కడా దొరక్కుండా నిర్మించుకున్న ఆర్థిక సామ్రాజ్యాన్ని కూల్చే పనికి జగన్ శ్రీకారం చుట్టినట్టు తెలిసింది.

సీఎం వైఎస్ జగన్ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఆర్థిక వెన్నుముకను దెబ్బతీయడమే లక్ష్యంగా ముందుకెళుతున్నట్టు తెలిసింది. వైసీపీ పెద్దల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఒకే టైంలో చంద్రబాబు ఆర్థిక సామ్రాజ్యాన్ని కూల్చడానికి జగన్ రంగం సిద్దం చేస్తున్నారు.

ఆమంచి ఆధిపత్యానికి గండికొట్టిన కరణం..!

చంద్రబాబుకు.. లెఫ్ట్.. రైట్ లాంటి ఆర్థిక అండదండలు ఇచ్చే సుజనాచౌదరి.. సీఎం రమేశ్ లు ఇప్పుడు బీజేపీలో చేరినా వారి తెరవెనుక ఉన్నది చంద్రబాబేనంటారు. వీరే కాదు.. చంద్రబాబు పార్టీకి టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కూడా పెద్ద మద్దతుదారుగా ఉన్నారు. ఈ ముగ్గురి ఆర్థిక బలాలు దెబ్బతీసేలా జగన్ స్కెచ్ గీస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే టీడీపీ గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కు చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన భూమిని జగన్ ప్రభుత్వం తిరిగి తీసుకొని గల్లా ఆర్థిక సామ్రాజ్యానికి తీవ్ర హానీ తలపెట్టింది.

ఇప్పుడు చంద్రబాబు ప్రధాన ఆదాయ వనరును దెబ్బకొట్టేలా వ్యూహం పన్నింది. దేశంలోనే శ్వేత విప్లవానికి నాందిపలికిన అమూల్ డెయిరీ ఉత్పత్తుల సంస్థతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదర్చుకోవడం వెనుక జగన్ మాస్టర్ ప్లాన్ ఉందని సమాచారం.

రాజకీయాల్లో పవన్ పై పెరిగిన ఒత్తిడి?

చంద్రబాబు సీఎంగా ఉండగా.. ప్రభుత్వం విజయ డెయిరీని నీరుగార్చి తన హెరిటేజ్ పాల వ్యాపారాన్ని ఏపీలో విస్తరించారనే ఆరోపణలున్నాయి. హెరిటేజ్ ను వేల కోట్ల రూపాయల సంస్థగా మలచడానికి ప్రభుత్వ డెయిరీ సంస్థతోపాటు పలు ప్రైవేట్ డెయిరీ కంపెనీలను దెబ్బతీశాడంటున్నారు..

ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఏపీలోని పాడి రైతులతో కలిసి ఆమూల్ సంస్థతో ఒప్పందం చేసుకుంటున్నారు. తద్వారా హెరిటేజ్ కు పాలుపోసే రైతులకు మంచి ధర ఇప్పించి ఆమూల్ కు పోసేలా ప్రభుత్వం సబ్సిడీలు.. ప్రోత్సాహకాలు ఇవ్వనుంది. హెరిటేజ్ కు ప్రయోజనం చేకూర్చేందుకు సహకార రంగంలోని ఇతర డెయిరీలను చావుదెబ్బ తీసిన చంద్రబాబును హెరిటేజ్ కంటే బలమైన అమూల్ సంస్థతో కొట్టేందుకు జగన్ రెడీ అయ్యారని తెలిసింది. ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్న జగన్ సంస్థ ఇక ఏపీలోని పాడి రైతుల నుంచి పాలను అమూల్ కు పోసేలా రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. తద్వారా హెరిటేజ్ సంస్థ ఆర్థిక మూలాలు దెబ్బతీసే మహా ప్లాన్ అమలు చేయబోతున్నట్టు సమాచారం.

-ఎన్నం

ప్రస్తుత సమయంలో ఏ ప్రయణమైనా ప్రమాదమే?

Journey

దేశంలో రోజు రోజుకి కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో రైళ్లు, బస్సులు, విమానాలవంటి ప్రజారవాణా సౌకర్యాలను ఉపయోగించుకునేటప్పుడు వైరస్ బారినపడే ప్రమాదమని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రయాణించే సమయంలో వ్యాధివ్యాప్తి ప్రమాదం ఎంత అనే దానిపై నిర్దిష్ట పరిశోధనలు లేవు. కానీ కరోనా వ్యాపిస్తున్న తీరును గమనించాక, దీన్ని మనం అంచనా వేయవచ్చు.

వైరస్‌ సోకిన వ్యక్తి దగ్గినా, తుమ్మినా, వైరస్‌ గాలిలోకి వెళ్లి అది ఇతరుల శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. కళ్ళు, ముక్కు, నోటి ద్వారా నేరుగా, లేదంటే చేతికి అంటుకున్న కణాలు ముఖం మీద చేతులు పెట్టుకున్నప్పుడు లోపలికి ప్రవేశించవచ్చు. గాలి బయటికి వెళ్లకుండా ఉండే ప్రదేశాలలో ఈ వ్యాధి సంక్రమణకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కిటికి తెరవడానికి వీలున్న ప్రజారవాణా సౌకర్యాలలో ప్రయాణం కొంత వరకు సురక్షితం. రైళ్లు, బస్సుల ద్వారా వచ్చే ప్రమాదం ఎంత అన్నది ఆయా బస్సులు, రైళ్లు, స్టేషన్లలో ఉండే రద్దీ మీద ఆధారపడి ఉంటుంది.

ఇంతకు ముందున్న ఆంక్షలను వదిలేసి, ఎవరైనా ప్రజా రవాణా సదుపాయాలను వాడుకోవచ్చని బ్రిటన్‌ ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌ ప్రకటించారు. అక్కడ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ఇల్లు దాటారంటే ప్రతి ఒక్కరు ఒక మీటరు దూరం నిబంధన పాటించాలి. మూసి వేసినట్లుండే ప్రజా రవాణా వ్యవస్థల్లో ఉపరితలంపై వైరస్‌ ఉండిపోతుంది. అయితే ఇది వ్యాప్తికి ఎంత వరకు కారణమవుతుందో కచ్చితంగా తెలియదు.

ప్రభాస్‌ మూవీ కోసం దీపిక అంత తీసుకుందా!


సస్పెన్స్‌ వీడింది. నాగ్‌ అశ్విన్‌ డైరెక్షన్‌లో ప్రభాస్ హీరోగా తెరకెక్కబోయే పాన్‌ ఇండియా మూవీలో హీరోయిన్‌గా దీపికా పదుకోన్‌ను ఫైనల్‌ చేశారు. బాహుబలి తర్వాత ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్‌ తెచ్చుకోవడంతో పాటు వెయ్యి కోట్ల హీరోగా ఎదిగిన ప్రభాస్‌కు ఇప్పుడు బాలీవుడ్‌లోనూ విశేష ఆదరణ ఉంది. ఎంత ఖర్చుచేసినా దానికి రెట్టింపు కలెక్షన్స్‌ వస్తుంది కాబట్టి… ప్రభాస్‌ మూవీల విషయంలో నిర్మాతలు బడ్జెట్‌ విషయంలో ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు అలాగే, తన అల్లుడు నాగ్‌ అశ్విన్‌ డైరెక్ట్‌ చేస్తున్న ప్రభాస్‌ 21వ మూవీని అశ్వినీదత్‌ భారీ బడ్జెట్‌తో ప్లాన్‌ చేశారు. దేశ వ్యాప్త ‌గా మార్కెట్‌, ప్రభాస్‌ స్టామినాను దృష్టిలో ఉంచుకొని బడా హీరోయిన్‌ కావాలని నిశ్చయించుకున్నారు. దాంతో, చాలా మంది పేర్లు వినిపించాయి. కియారా అడ్వాణి అనుకున్నా చివరకు దీపిక పడుకొన్‌ను ఫైనల్‌ చేశారు. రాజుకు తగ్గ రాణి అని నాగ్‌ అశ్విన్‌ పేర్కొన్నారు.

Also Read: సల్మాన్‌తో చేయనంటే బెదిరించారు.. కంగనా

బాలీవుడ్‌లో నంబర్ వన్‌ హీరోయిన్‌గా ఉన్న దీపిక రాకతో ఈ మూవీ రూపురేఖలు మారిపోయాయి. ‘బాహుబలి’ రేంజ్ టాక్ వచ్చింది. తెలుగులోనే కాకుండా హిందీ జనాలు కూడా ఈ మూవీ గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలో దీపిక పదుకోన్‌ రెమ్యునరేషన్‌ గురించి కూడా ఆసక్తికర విషయాలు బయటికొస్తున్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ సరసన నటించడానికి దీపికా ఏకంగా రూ. 30 కోట్లు డిమాండ్ చేసినట్లుగానూ, అందుకు చిత్రయూనిట్ అంగీకరించిందన్న వార్త హల్‌చల్‌ చేస్తోంది. బాలీవుడ్‌లో బడా హీరోయిన్‌గా ఉన్న దీపిక సాధారణంగా 10 నుంచి 15 కోట్ల రెమ్యునరేషన్‌ తీసుకుంటుంది. లేడీ ఓరియంటెండ్‌ మూవీస్‌కు సైతం ఆమె 15 కోట్లలోపే తీసుకునేది. 10 కోట్లుగా ఉన్న పారితోషికాన్ని ఆమె రీసెంట్‌గానే 15 కోట్లు చేసిందని బాలీవుడ్‌ టాక్. అలాంటిది ప్రభాస్‌ మూవీ కోసం రెమ్యునరేషన్‌ను డబుల్‌ చేసిందని తెలుస్తోంది. అంతేకాదు ఈ మూవీ హిందీ రైట్స్‌లో వాటా కూడా ఆడిగిందన్న వార్తలు వచ్చాయి. అందుకు నిరాకరించిన అశ్వినీదత్‌… గంపగుత్తంగా ఆమెకు 30 కోట్లు ఇచ్చేందుకు ఒప్పుకున్నారని తెలుస్తోంది. ఒక్క హీరోయిన్‌కే అన్ని కోట్లు ఇస్తే హీరో ప్రభాస్‌కు ఇంకెంత ఇచ్చారనే చర్చ మొదలైంది. ఏదేమైనా షూటింగ్‌ కూడా మొదలవకుండానే ఈ మూవీ ఇప్పుడు అందరి నోట్లో నానుతోంది. సినిమాలకు కావాల్సింది కూడా అదే. పబ్లిసిటీ ఎక్కువైతే.. అదే స్థాయిలో కలెక్షన్స్‌ వస్తుంటాయి.

కరోనా రాకుండా స్టార్ హీరో ఇంటికి ప్లాస్టిక్‌ కంచె


కరోనా కష్టకాలంలో బాలీవుడ్‌కు ఈ ఏడాది ఏదీ కలిసిరావడం లేదు. కరోనా కారణంగా సినిమాలు, షూటింగ్స్‌ ఆగిపోయి ఎంతో మంది ఉపాధి కోల్పోయారు. వివిధ కారణాలతో పలువురు ప్రముఖులు చనిపోయారు. మరోవైపు ముంబైలో కరోనా వైరస్ ఉధృతి మ‌రింత వేగంగా ఉంది. సినీ తారలు కూడా క‌రోనా బారిన ప‌డుతున్నారు. ఇటీవలే అమితాబ్ బచ్చన్ కుటుంబం కరోనా బారిన పడింది. బిగ్‌బీతో పాటు అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్, ఆరాధ్య బచ్చన్‌ల‌కు క‌రోనా సోకింది. వీరంతా ముంబై నానావతి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అందరి ఆరోగ్యం నిలకడగానే ఉంది. అయితే, బిగ్‌బీ కుటుంబమే కరోనా బారిన పడడంతో బాలీవుడ్‌ ఉలిక్కి పడింది. ముంబై కేంద్రంగా ఉన్న బాలీవుడ్‌ ప్రముఖులు వెంటనే అప్రమత్తమవుతున్నారు. ఈ ప్రాణాంతక వైరస్ బారిన ప‌డ‌కుండా ఉండేందుకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పైగా, వైరస్‌ గాలి ద్వారా కూడా వ్యాప్తిస్తోందని ప్రపంచ ఆరోగ్య శాఖ హెచ్చరించింది.

https://www.instagram.com/p/CC3vqzaBv_f/

ముంబైలో కరోనా ఉధృతిని దృష్టిలో ఉంచుకొని బాలీవుడ్‌ బాద్‌షా షారూఖ్‌ఖాన్ అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాడు. తనతో పాటు కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు సరికొత్త ఆలోచన చేశాడు. తన బంగ్లా మన్నత్‌ చుట్టూ ప్లాస్టిక్‌ షీట్లతో క‌వ‌రింగ్ చేయించారు. ఈ బంగ్లాలో షారూఖ్‌తో పాటు ఆయన భార్య గౌరి, ముగ్గురు పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులు, పనివాళ్లు ఉంటున్నారు. ఎంత జాగ్రత్తగా ఉన్న పలువురుకి వైరస్‌ సోకుతున్నందున లాభం లేదని.. బంగ్లా మొత్తాన్ని ట్రాన్స్‌పరెంట్‌ కవర్లతో కప్పేశాడు. కరోనా వైరస్ గాలి ద్వారా కూడా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఇంట్లోకి వైరస్‌ రాకుండా ఇది అడ్డుగా ఉంటుంది. అలాగే, వ‌ర్షం నుంచి కూడా బంగ్లాకు రక్షణనిస్తోంది. ప్లాస్టిక్ కవర్లతో మన్నత్‌ను కప్పిన ఫొటోలు ఇప్పుడు నెట్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి. షారుక్‌ ప్లాస్టిక్‌ కంచె ఐడియా బాగుందని పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.

వైద్య ఆరోగ్యశాఖ జారీ చేసిన సూచనలు

Corona precautions

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఈ క్రింది సూచనలు, సలహాలను జారీ చేసింది.

1. దగ్గు జలుబు జ్వరంతో బాధపడుతున్నవారు ఎవరికి తెలియజేయాలి…?

జవాబు: మీరు నివసించు ప్రాంతానికి చెందిన ఆరోగ్య కార్యకర్తలకు లేదా వార్డు/గ్రామ వాలంటీర్లకు తెలియజేయాలి. వారు మీ ఇంటికి వచ్చి మీ ఆరోగ్య స్థితిగతులను పరిశీలించి మీకు కోవిడ్ పరీక్ష చేయుటకు ఏర్పాటు చేస్తారు.

2. కోవిడ్ పరీక్ష లో పాజిటివ్ గా నిర్ధారించిన ఎడల ఏమి చేయాలి.

జవాబు:ముందుగా కంగారు పడకుండా ధైర్యంగా ఉండవలెను. కుటుంబ సభ్యులతో గాని ఇతరులతో కానీ కలవకుండా దూరాన్ని పాటించాలి. మాస్కు ధరించాలి. ఇంట్లో సామానులు ఏమి తాకరాదు. ఇంటిలో 60 సంవత్సరాలు పైబడినవారు, పిల్లలు గర్భిణీ స్త్రీలు ఉన్న ఎడల వారికి దూరముగా ఉండవలెను. వారికి కూడా పరీక్షలు నిర్వహించే వరకు విడిగా ఉండవలెను.

3. వ్యాధి నిర్ధారణ తర్వాత ఏం చేస్తారు.

జవాబు:ఈ వ్యాధి సోకిన వ్యక్తిని దగ్గరలోని ఆసుపత్రి వద్ద ఆరోగ్య కార్యకర్తలు లేదా మండల /మున్సిపాలిటీ అధికారులు పరీక్షలు నిర్వహించెదరు.

4. ఎటువంటి పరీక్షలు నిర్వహిస్తారు.

జవాబు:ప్రతి కరోనా సోకిన వ్యక్తికి రక్త పరీక్షలు, ఎక్స్ రే, శ్వాస పరీక్షలు మొదలగునవి చేసి వ్యాధి తీవ్రతను నిర్ణయిస్తారు.

5. పరీక్షల అనంతరం ఏం చేస్తారు.

జవాబు:వ్యాధి సోకిన ప్రతి 100 మందిలో సుమారు 75 మందికి ఎటువంటి లక్షణాలు ఉండవు. అలాంటి వారు ఇంటి వద్దనే పదిరోజులు ఆరోగ్య కార్యకర్తల సలహాలు పాటించాలి. మిగతా 25 మందిని వ్యాధి లక్షణాలను బట్టి కోవిడ్ కేర్ సెంటర్స్ కు మరియు ఆసుపత్రులకు తరలించడం జరుగుతుంది.

6. హోమ్ ఐసోలేషన్ పై ప్రజల్లో ఉన్న అపోహలు ఎలా నివృత్తి చేస్తారు.

జవాబు:ముందుగా ప్రజలు ఒక్క విషయం అర్థం చేసుకోవాలి. ఈ వ్యాధి ఇప్పటికిప్పుడే అంతరించి పోదు. ప్రతి ఒక్కరూ స్వీయ రక్షణ చర్యలు పాటించాలి. అదేవిధంగా ఈ వ్యాధి సోకిన ప్రతి ఒక్కరికి హాస్పటల్లో చికిత్స అవసరం లేదు అనేది కూడా అర్థం చేసుకోవాలి. భవిష్సత్ లో చాలా ఎక్కువ మంది వ్యాధికి గురికావచ్చు. అందరూ హాస్పటల్లో చేరాలని కోరుకోవటం సహజమే కానీ సాధ్యపడదు. అందువలన వ్యాధి లక్షణాలు లేనివారు ఇంటి వద్దనే ఉండి చికిత్స పొందాలి.

7. వ్యాది సొకిన వ్యక్తి పట్ల ఇరుగు పొరుగు వారి భయాలు ఎలా ఉంటాయి

జవాబు:కరోనా వ్యాధి సోకిన వ్యక్తి యొక్క ఇరుగు పొరుగు వారు భయపడడం సహజమే. కానీ ఇంటిలోని వారు ఇరుగు పొరుగు వారు మానసికంగా సిద్ధపడాలి. రేపు మీకు కూడా రావచ్చు. అలా అని ప్రతి ఒక్కరిని వెలివేయడం సమంజసం కాదు. ఇది ఒక తరహా ఫ్లూ లాంటిది. వస్తుంది పోతుంది అని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. వ్యాధిగ్రస్తుని పట్ల సానుకూల దృక్పథం అలవాటు చేసుకోవాలి.

8. హోం ఐసోలేషన్ ఉండాలంటే వారి గృహంలో ఎలాంటి సదుపాయాలు ఉండాలి.

జవాబు:వేరే గది మరియు మరుగుదొడ్డి ఉండాలి. ఒకవేళ ఒకే మరుగుదొడ్డి ఉంటే వ్యాధిగ్రస్తుడు వాడిన అర్ధగంట తరువాత ఇతరులు వాడుకోవచ్చు. బట్టలు ఉతికే డిటర్జెంట్ పౌడరు తో మరుగుదొడ్డి శుభ్రం చేస్తే సరిపోతుంది.

9. హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వ్యాధిగ్రస్తుడి తో ఎవరు ఉండవచ్చు.

జవాబు:వృద్ధులు చిన్నపిల్లలు మరియు గర్భిణీ స్త్రీలు ఉన్న ఎడల వారిని వేరే గృహంలో ఉంచాలి. వ్యాధిగ్రస్తుని కి సపర్యలు చేయుటకు ఒక వ్యక్తి ఉంటే సరిపోతుంది .

10. సపర్యలు చేయు వ్యక్తి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి.

జవాబు: ఎల్లప్పుడూ మాస్కు ధరించాలి. సోకిన వ్యక్తి యొక్క వస్తువులను బట్టలను తాకరాదు. ఒకే గదిలో ఉండాల్సి వచ్చినప్పుడు ఒకరికొకరు రెండు మీటర్ల దూరాన్ని పాటించాలి.

11. ఈ వ్యాధి సోకిన వ్యక్తి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి.

జవాబు:ముందుగా వ్యాధి తీవ్రత లేదు కాబట్టే ఇంటిలో ఉండమన్నారు అని తెలుసుకోవాలి. ఎప్పుడు సెల్ ఫోను ఆన్ లో ఉంచుకోవాలి. ఆరోగ్య సేతు యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలి. కార్యకర్తలు అందజేసిన మందులు వాడాలి. తేలికపాటి వ్యాయామాలు ధ్యానం చేయాలి.
వారి గదిని, బట్టలను మరుగుదొడ్డిని వారే శుభ్రం చేసుకోవాలి. అతను ఉపయోగించిన పాత్రలు శుభ్రం చేసుకోవాలి.

12. హోం ఐసోలేషన్ లో ఎన్ని రోజులు ఉండాలి.

జవాబు: జ్వరం గాని ఇతరత్రా ఎటువంటి అనారోగ్య లక్షణాలు లేని ఎడల పది రోజుల తదుపరి పూర్తిగా కోల్కన్నట్లుగా భావించవచ్చును.14 రోజుల తర్వాత అతను దైనందిన కార్యక్రమాలను చేసుకోవచ్చును.

13. హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వ్యక్తికి అనారోగ్య సమస్యలు తలెత్తితే ఏం చేయాలి

జవాబు: జిల్లా కేంద్రంలోని కంట్రోల్ సెంటర్లో వీరి పేర్లు ఫోన్ నెంబర్లు నమోదు కాబడును. ప్రతిరోజు కాల్ సెంటర్ ల నుండి వీరికి ఫోన్ చేసి వారి ఆరోగ్య స్థితిగతులను తెలుసు కొందురు. ఆరోగ్య కార్యకర్తలు ప్రతిరోజు వారి ఆక్సిజన్ స్థాయిలను తెలుసు కొందురు. మందులను అందజేస్తారు అత్యవసరమైన ఎడల కాల్ సెంటర్ కి ఫోన్ చేసిన వెంటనే మెరుగైన చికిత్స కొరకు ఆస్పత్రికి తరలించ బడును. అధైర్య పడవలసిన అవసరం లేదు.

14. హోం ఐసోలేషన్ అనంతరం పరీక్షలు అవసరమా

జవాబు: అనారోగ్య లక్షణాలు లేని ఎడల మరలా వ్యాధి నిర్ధారణ పరీక్షలు అవసరం లేదు.

15. ఎటువంటి ఆహారం తీసుకోవాలి.

జవాబు: బలవర్ధకమైన ఆహారాన్ని తీసుకోవాలి. శాఖాహారులు పప్పు ధాన్యాలకు , పాలు, పండ్లు, ప్రాధాన్యతనివ్వాలి. మాంసాహారులు పాలు, పండ్లు, గుడ్డు, చికెన్, మటన్, చేపలు ఆహారంగా తీసుకోవచ్చును.

16. హోమ్ ఐసోలేషన్ వారిపట్ల ప్రజల్లో ఉన్న అపోహలను ఎలా నివృత్తి చేస్తారు.

జవాబు:హోమ్ ఐసోలేషన్ అనేది తప్పనిసరి పరిస్థితి అనేది ముందుగా ప్రజలు అర్థం చేసుకోవాలి. గాలి ద్వారా వ్యాప్తిచెందుతోంది అనే ఆలోచన రాకూడదు.ఈ వ్యాధి సోకిన వ్యక్తిని ప్రేమాభిమానాలతో చూసుకోవాలి. అటువంటి వ్యక్తిని తాకరాదు. మనం పోరాడాల్సింది కరోనాతో, వ్యక్తి తో కాదు అనే నినాదాన్ని తూచా తప్పక పాటించాలి. స్వీయ రక్షణ చర్యలు పాటించాలి. మాస్కు ధరించాలి. అవసరమైతే తప్ప బయటకి రాకూడదు…

ఆనం సడెన్ సైలెంట్ వెనుక కారణాలేంటీ?


మాజీ మంత్రి ఆనం రాంనారాయణకు నెల్లూరు జిల్లాలో మంచి పట్టుంది. కొన్నిదశాబ్దాలపాటు నెల్లూరు జిల్లాను రాజకీయాలతో ఆనం బ్రదర్స్ శాసించారు. చంద్రబాబు, వైఎస్ హయాంలో ఓ వెలుగు వెలిగిన ఆనం రాంనారాయణ ప్రస్తుతం అంతగా యాక్టివ్ కన్పించడం లేదు. సొంత జిల్లాల్లోనే ఇప్పుడు అంతగా ప్రభావం చూపలేకపోతున్నారనే టాక్ విన్పిస్తుంది.

22న కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం..

2019 ఎన్నికల సమయంలో ఆనం రాంనారాయణ టీడీపీని వదిలి వైసీపీలో చేరారు. వైసీపీ తరుఫున వెంకటగిరి నుంచి పోటీచేసి విజయం సాధించింది. వైసీపీ పార్టీ అధికారంలోకి రావడంతో తనకు మంత్రి పదవీ దక్కుతుందని ఆనం రాంనారాయణ ఆశించారు. అయితే ఆయనకు భంగపాటు తప్పలేదు. తన కంటే ఎంతో జూనియర్లు అయిన అనిల్ కుమార్, గౌతమ్ రెడ్డిలను జగన్ తన క్యాబినెట్లోకి తీసుకోవడంతో ఆనంలో అసంతృప్తి మొదలైంది.

దీంతో వీలుచిక్కినప్పుడల్లా జగన్ సర్కార్, మంత్రులపై అక్కసు వెళ్లగక్కుతోన్నారు. తన నియోజకవర్గంలో అధికారులు అభివృద్ధికి సహకరించడం లేదనే ఆరోపణలు గుప్పిస్తున్నారు. నెల్లూరులో మాఫియా రాజ్యమేలుతోందని పరోక్షంగా మంత్రి అనిల్ కుమార్, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలపై విమర్శలు గుప్పించారు. జిల్లాలో ఇసుక అక్రమాలు, నీళ్ల దోపీడి జరుగుతుందని మూడురోజుల్లో మీడియా సమావేశంపెట్టి నిరూపిస్తానంటూ హెచ్చరించారు.

ఎమ్మెల్సీ రేసు.. నేతల్లో పెరుగుతున్న టెన్షన్..!

అయితే ఆ తర్వాత ఏం జరిగిందో ఏమోగానీ నెలరోజులైనా కూడా ఆయన మీడియా సమావేశం నిర్వహించలేదు. పార్టీ ఇమేజ్ డ్యామేజ్ చేసేలా ఆనం వ్యవహరిస్తుండటంతో అధిష్టానం సీరియస్ అయినట్లు తెలుస్తోంది. దీంతో సీఎం జగన్మోహన్ రెడ్డి పార్టీపై ఆరోపణలు చేస్తే వేటు తప్పదని ఆనంకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఆనం రాంనారాయణ సైలంటయ్యారని ప్రచారం జరుగుతోంది.

అయితే మరోసారి క్యాబినెట్ విస్తరణ సమయంలో తనకు మంత్రి పదవీ దక్కుతుందని రాంనారాయణ భావిస్తున్నారు. దీంతో ఆయన తానంతట తానే సైలంటయ్యారనే ఆయన అనుచరులు చెబుతోన్నారు. ఏదిఏమైనా రాంనారాయణ సడన్ గా సైలంటవడం ఆసక్తిని రేపుతోంది.

ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ వేసిన ఆర్ఆర్ఆర్..!


నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు రాష్ట్ర ప్రభుత్వానికి కొత్త ట్విస్ట్ ఇచ్చారు. తనకు ఆంధ్రా పోలీసులపై నమ్మకం లేదని కొంత కాలంగా చెబుతున్నారు. ఇదే సమయంలో కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర హోం మంత్రి రాజనాథ్ సింగ్, ఆ శాఖ కార్యదర్శిని కలిసి రక్షణ కోరారు. కేంద్ర బలగాలతో ఇంత వరకూ రక్షణ కల్పించకపోవడంతో ఆయన ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. తనపై కొందరు బెదిరింపులకు పాల్పడుతుండటంతో కేంద్ర బలగాల భద్రత కోరినట్లు చెప్పారు. ఈ చర్య రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం ప్రతిష్ట మరింత రచ్చకీడ్చేదిగా ఉందని ఆ పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు.

Also Read: ఆమంచి ఆధిపత్యానికి గండికొట్టిన కరణం..!

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలపై ఆ పార్టీ ఏంపీ రఘురామ కృష్ణంరాజు కొంత కాలంగా విమర్శలు ఎక్కుపెడుతున్నారు. కొన్ని సార్లు పరోక్షంగా ముఖ్యమంత్రిపైనా విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ఆ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, మంత్రి ఆయనకు వ్యతిరేకంగా గళం విప్పారు. దీంతో ఆయన ఎమ్మెల్యేలను పందులు అనే విధంగా సినిమా డైలాగ్ తో విమర్శలు చేశారు. ఈ క్రమంలో ఆ పార్టీ నాయకులే పార్టీకి రాఘురామ కృష్ణంరాజు వైసీపీ వ్యతిరేకిగా మారారంటూ నిరసనలు తెలియజేసి దిష్టిబొమ్మలు దగ్దం చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు సామాజిక మాద్యమాల్లో బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ అంశంపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా పెద్దగా పట్టించుకోలేదంటూ ఎంపీ ఆరోపించారు.

Also Read: 22న కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం..

వైసీపీ షోకాజ్ నోటీసుతో తన విమర్శలను పక్కన పెట్టిన ఎంపీ రఘురామ కృష్ణంరాజు చట్టపరంగా, న్యాయపరంగా ఆ పార్టీని, ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టే దిశగా ముందుకు వెళుతున్నారు. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ… వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరు వినియోగించుకుంటుందని, ఆ పేరుతో తనకు షోకాజ్ నోటీసు ఇచ్చిందని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో ఆ పేరుతో రిజిస్టర్ అయిన పార్టీ నాయకులు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీపై ఢిల్లీ హై కోర్టులో కొద్ది రోజుల కిందట పిటీషన్ దాఖలు చేశారు. మరోవైపు పలు అంశాలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వారానికి ఓ లేఖ రాస్తూ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా తనకు కేంద్ర బలగాలతో రక్షణ కావాలని ఢిల్లీ హై కోర్టులో పిటీషన్ వేసి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను మరింత దిగజార్చరనే వాదనలు వినిపిస్తున్నాయి.