పరిస్థితులు ఎలా ఉన్నా కేసీఆర్ తనకు అనుకూలంగా మార్చుకోవడంలో దిట్టని అందరికీ తెల్సిందే. ఎంతటి కిష్టపరిస్థితులైనా అవలీలాగా ఎదుర్కొంటూ కేసీఆర్ ముందుకెళుతున్నారు. కరోనా మహమ్మరి కారణంగా టీఆర్ఎస్ సర్కార్ పై ప్రభుత్వంపై కొంత వ్యతిరేకత వచ్చినప్పటికీ దీటుగానే ఎదుర్కొంటున్నారు. టీఆర్ఎస్ ఆరేళ్ల పాలనలో ఏనాడూ ప్రతిపక్షాలకు ఛాన్స్ ఇవ్వని కేసీఆర్ కొంతకాలం మౌనంగా ఉండటంతో ప్రతిపక్షాలు జోరు పెంచాయి. ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పై దూకుడు పెంచడంతో కేసీఆర్ ఆ పార్టీకి షాకిచ్చిందుకు రెడీ అవుతున్నారు.
22న కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం..
తెలంగాణ ఉద్యమ సమయంలో మాజీ ప్రధాని పీవీ నర్సింహారావును కేసీఆర్ ఎన్నోసార్లు విమర్శించారు. అయితే పీవీ శతజయంతి ఉత్సవాల సందర్భంగా సీఎం కేసీఆర్ పీవీపై ప్రశంసలు కురిపించారు. పీవీ తెలంగాణవాడు గర్వకారణమని చెప్పుకొచ్చారు. ఆయన శతజయంతి ఉత్సవాలను తెలంగాణలో ఏడాదిపాటు నిర్వహిస్తామంటూ ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. తెలంగాణ వాడైన పీవీని కాంగ్రెస్ అవమానించిదంటూ ఆ పార్టీని కార్నర్ చేస్తూనే తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేశారు.
పీవీ జయంతి ఉత్సవాలకు కోట్లాది రూపాయాలను విడుదల చేయడంతోపాటు ఏయే రోజుల్లో ఎలాంటి కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహించనుందో ముందే ప్రకటించేశారు. కాంగ్రెస్ చెందిన పీవీని కేసీఆర్ తనకు అనుకూలంగా మార్చుకోవడంతో కాంగ్రెస్ నేతలు తలలు పట్టుకుంటున్నారు. పీవీ తెలంగాణ వాడైనందుకు కాంగ్రెస్ ఆయనకు సరైన గౌరవం దక్కకుండా అనేకసార్లు వ్యవహరించిదనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. పీవీ జయంతిని కేసీఆర్ తనకు అనుకూలంగా మార్చుకోవడంలో కేసీఆర్ విజయవంతం కావడంతో కాంగ్రెస్ నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
చంద్రబాబు సామ్రాజ్యాన్ని కూల్చే జగన్ ఆయుధం!
పీవీ శతజయంతి ఉత్సవాలను కేసీఆర్ చేయడంతోపాటు ఆయనపై తనకున్న చిత్తశుద్ధిని చాటుకునేందుకు సిద్ధపడుతున్నారు. త్వరలో గవర్నర్ కోటలో ఖాళీకానున్న మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి పీవీ కూతురు వాణి దేవీకి కేటాయించేందుకు కేసీఆర్ సిద్దమవుతున్నారట. తెలంగాణ వాడైన పీవీని టీఆర్ఎస్ పార్టీ గౌరవిస్తుందనే భావనను ప్రజల్లోకి తీసుకెళుతూ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేందుకు కేసీఆర్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
పీవీ కూతురుకు ఎమ్మెల్సీ ఆఫర్ చేయడం ద్వారా సీఎం కేసీఆర్ తెలంగాణతోపాటు జాతీయ స్థాయిలో మంచిపేరు రావడం ఖాయం. జాతీయ రాజకీయాలపై ఆసక్తి ఉన్న కేసీఆర్ కు ఇది మున్ముందు చాలా ఉపయోగపడనుంది. అన్ని ఆలోచించే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారనే టాక్ విన్పిస్తుంది. ఇదిలావుంటే కాంగ్రెస్ నేత అయిన పీవీని ఆ పార్టీపైనే అస్త్రంగా ఉపయోగించడం కేసీఆర్ కే సాధ్యమనే వాదన విన్పిస్తుంది. కేసీఆర్ ఇచ్చిన మాస్ట్రర్ స్ట్రోక్ కు కాంగ్రెస్ నేతలు మరింత ఢీలాపడిపోడం ఖాయంగా కన్పిస్తోంది.
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Read MoreWeb Title: Kcr offer to former pms daughter
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com