Home Blog Page 8398

జగన్ వ్యూహం.. టీడీపీ అధినేతకు షాక్


2019 ఎన్నికల తర్వాత టీడీపీ గ్రాఫ్ పడిపోతూ వస్తోంది. కిందటి ఎన్నికల్లో ఏపీలో ఫ్యాన్ గాలి ఏకపక్షంగా వీయడంతో వైసీపీ బంపర్ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. సీఎంగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఓ చేత్తో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ మరోచేత్తో ప్రత్యర్థులకు స్కెచ్ గీస్తున్నారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ సీఎం జగన్ అనేక పథకాలు ప్రవేశపెడుతూ ప్రజల్లోకి దూసుకెళుతోన్నారు. మరోవైపు ఏడాది కాలంలోనే టీడీపీ చెందిన పలువురు నేతలను జైళ్లకు పంపించి ఆపార్టీని చావుదెబ్బ కొట్టారు.

Also Read: ‘నిమ్మగడ్డ’ వ్యవహారంలో ప్రభుత్వానికి షాక్..

చంద్రబాబు నాయుడు హయాంలో మంత్రులు పనిచేసిన నేతలు ఒక్కొక్కరుగా జైళ్లబాట పడుతున్నారు. దీంతో టీడీపీ నేతల గుండెల్లో గుబులుపుడుతోంది. ప్రభుత్వం ఎప్పుడూ ఏ స్కామ్ బయటికితీసి జైళ్లోకి పంపుతుందోననే భయాందోళన టీడీపీ నేతల్లో వ్యక్తమవుతుండటంతో ఆపార్టీకి చెందిన నేతలంతా ప్రస్తుతం సైలంటయ్యారు. ఇదిలా ఉంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్ బాబు సైతం త్వరలోనే జైళ్లకు వెళ్లడం ఖాయమని ప్రచారం జరిగింది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కారణంగా ప్రభుత్వం తాత్కాలికంగా అరెస్టుల వ్యవహారాన్ని పక్కకు పెట్టినట్లు తెలుస్తోంది.

అయితే చంద్రబాబు ఆర్థిక మూలలను దెబ్బతీసేందుకు సీఎం జగన్ పక్కా ప్రణాళికతో ముందుకెళుతున్నట్లు తెలుస్తోంది. తాజా పరిణాలు చూస్తుంటే బాబుకు చెందిన హెరిటేజ్ కంపెనీ కొద్దిరోజుల్లో భారీగా దివాళా తీయడం ఖాయమనే వాదన విన్పిస్తుంది. బాబుకు చెందిన హెరిటేజ్ కంపెనీ ఏపీలో నెంబర్ వన్ గా కొనసాగుతోంది. హెరిటేజ్ కంపెనీ తెలంగాణతోపాటు పలు రాష్ట్రాల్లో విస్తరించి పాలవ్యాపారంతో లాభాలను ఆర్జిస్తుంది. ప్రస్తుతం ఈ వ్యాపారాన్ని చంద్రబాబు భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణిలు చూస్తున్నారు. కొన్నాళ్ళు లోకేష్ కంపెనీ వ్యవహాలను చూసినా ఇప్పుడు పాలిటిక్స్ కే పూర్తిగా అంకితమయ్యారు.

బాబుకు హెరిటేజ్ కంపెనీ కొండంత అండగా ఉంది. ఇప్పుడు దానిని దెబ్బకొట్టేందుకు జగన్ వ్యూహాన్ని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. దేశంలోనే అతిపెద్ద పాల ఉత్పతుల సంస్థగా ఉన్న అమూల్ డైరీతో రాష్ట్ర ప్రభుత్వ పరంగా తాజాగా ఒప్పందం కుదుర్చుకోవడం ఇందులో భాగమేనని తెలుస్తోంది. దీంతో ఏపీలో పాల ఉత్పత్తుల మార్కెట్ లోకి అమూల్ ప్రవేశిస్తుంది. ప్రభుత్వ అండతో అమూల్ రాష్ట్రంలో కార్యకలాపాలు చేపడితే ముందుగా దెబ్బపడితే మాత్రం హెరిటేజ్ కేనని తెలుస్తోంది.

Also Read: కేసీఆర్ ని విమర్శించే ధైర్యం బాబుకు లేదా..?

ఏపీలోకి అమూల్ ఎంట్రీతో హెరిటేజ్ కంపెనీ ఆదాయానికి భారీగా గండిపడనుంది. ప్రభుత్వం కూడా పాడిరైతులకు మరింతగా ప్రోత్సాహాకాలు ఇచ్చి వారిని అమూల్ వైపు ఆకర్షించే అవకాశం ఉంది. జాతీయ స్థాయిలో మంచిపేరు తెచ్చుకున్న అమూల్ కంపెనీ ఏపీలో నిలదొక్కుకుంటే హెరిటేజ్ కంపెనీ తీవ్రనష్టం వాటిల్లే అవకాశ ఉందనే టాక్ విన్పిస్తుంది. ఇది ఒకరకంగా బాబు ఆర్థిక మూలాలకు దెబ్బేయడమేనని అంటున్నారు.

ప్రభుత్వం మాత్రం పాడిరైతులకు శ్రేయస్సు కోసం అమూల్ ఎంట్రీకి తలుపుకు తెరిచినట్లు చెబుతుంది. అమూల్ రాకతో పాడిరైతులకు మరింత గిట్టుబాటు ధర లభించి ఆర్థికంగా ఎదుగుతారని చెబుతోంది. ఏదిఏమైనా జగన్ వ్యూహానికి బాబు ఆర్థిక మూలాలు కుదేలవడం ఖాయంగా కన్పిస్తోంది. దీని నుంచి చంద్రబాబు ఎలా గట్టెక్కుతారో వేచిచూడాల్సిందే..!

‘అమ్మఒడి’కి నిధుల మళ్లింపు వివాదం..!


రాష్ట్ర ప్రభుత్వం జగనన్న అమ్మఒడి పథకానికి బ్రాహ్మణ సంక్షేమ కార్పోరేషన్ నిధులు మళ్లించడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతుంది. ఈ వ్యవహారంపై బీజేపీ పార్టీ తీవ్ర స్థాయిలో మండి పడుతుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్షీనారాయణ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి నిధులు మళ్లింపు వ్యవహారంపై లేఖ రాశారు. అదేవిధంగా పార్టీ ఉపాధ్యక్షులు విష్ణువర్థన్ రెడ్డి ఈ అంశంపై మీడియా సమావేశంలో ప్రభుత్వ వైఖరిని తప్పబట్టారు. బ్రహ్మణ కార్పోరేషన్ నిధులను బ్రహ్మణ సంక్షేమానికి వినియోగించకుండా ఇతర కార్యక్రమాలకు మళ్లించడంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

బ్రహ్మణ కార్పోరేషన్ కు దేవాదాయశాఖ నుంచి మంజూరు చేసి నిధుల నుంచి ప్రభుత్వం జగనన్న అమ్మవడి పథకానికి రూ.26.41 కోట్లను మళ్లించింది. పెద్ద మొత్తంలో నిధులు మళ్లించడంతో పేద బ్రహ్మణులు సంక్షేమ పథకాలు అందక ఇబ్బందులు ఎదుర్కొంటారని బీజేపీ నాయకులు అంటున్నారు. బీజేపీ నాయకులతో పాటు కొద్ది రోజులుగా ప్రభుత్వం, పార్టీపై అసంతృప్తిలో ఉన్న వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సైతం ఈ అంశాన్ని లేవనెత్తారు. సంక్షేమ పథకాలకు నిధులు లేని ప్రభుత్వం కార్పోరేషన్ ల నిధులు మళ్లిస్తుందని, ఇదే క్రమంలో బ్రహ్మణ కార్పోరేషన్ నిధులు మళ్లించిందన్నారు.

Also Read: ‘నిమ్మగడ్డ’ వ్యవహారంలో ప్రభుత్వానికి షాక్..

బ్రహ్మణ కార్పోరేషన్ నిధుల మళ్లింపు విషయంపై ఆ సంస్థ ఛైర్మన్ మల్లాది విష్ణువర్ధన్ స్పందించారు. జగనన్న అమ్మఒడి పథకం కింద రాష్ట్రంలో 42.33 లక్షల మంది విద్యార్ధులకు ఏడాదికి రూ.15 వేలు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. ఓసి కేటగిరిలో 8,89,113 మంది లబ్ధి పొందుతున్నారని వీరిలో బ్రహ్మణ వర్గానికి చెందిన వారు 17,611 మంది ఉన్నారని వీరికి లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వం దేవాదాయ శాఖ నుంచి అదనపు బడ్జెట్ లో కేటాయించిన రూ.26.41 లక్షలు మంజూరు చేయడం జరిగిందన్నారు. వీరంతా బ్రహ్మణ కార్పోరేషన్ సంక్షేమ పథకాలకు అర్హులైన వారు మాత్రమేనని చెప్పారు.

దేవాదాయ శాఖకు దేవాలయాల్లో భక్తులు విరాళాలు, కానుకలు రూపంలో సమర్పిస్తారని ఆ నిధులను దేవాలయాల అభివృద్ధికి కాకుండా ప్రభుత్వం తన అవసరాలకు వినియోగించుకోవడాన్ని బీజేపీ నేతలు ఎండగడుతున్నారు. ఈ వ్యవహారంపై బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలను జగన్ ప్రభుత్వం లైట్ గా తీసుకుంది. పెద్దగా పట్టించుకోకుండా తనపని తాను చేసుకుపోతుంది.

ప్రభాస్‌ మూవీలో దీపిక పాత్ర రివీల్‌!


రాధేశ్యామ్‌’ తర్వాత నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ ఓ సినిమాకు ఒప్పుకున్న సంగతి తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ స్థాపించి 50 సంవత్సరాలు అయిన సందర్భాన్ని పురస్కరించుకొని నిర్మాత అశ్వినీదత్‌ ఈ మూవీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 200 నుంచి 300 కోట్ల బడ్జెట్‌తో ఈ మూవీని నిర్మించబోతున్నారు. ఆయన అల్లుడు నాగ్‌ అశ్విన్.. ప్రభాస్‌ కోసం ఓ సైన్స్‌ ఫిక్షన్‌ స్టోరీని ఇప్పటికే సిద్ధం చేశాడు. ప్రభాస్‌ రేంజ్‌ను, వరల్డ్‌ వైడ్‌ అతని ఫేమ్‌ను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే పక్కా స్క్రిప్టును రాసి పెట్టుకున్నాడట. రాజుకు తగ్గ రాణి అంటూ ప్రభాస్‌ 21వ మూవీ కోసం బాలీవుడ్‌ స్టార్ దీపిక పడుకోన్‌ను హీరోయిన్‌గా ఎంచుకున్నారు. ఈ విషయాన్ని డైరెక్టర్ నాగ్‌ అశ్విన్‌తో పాటు వైజయంతీ మూవీస్‌ అధికారిరంగా ప్రకటించింది.

Also Read: డైరెక్టర్ తో ఆడుకుంటున్న హీరోలు !

బాహుబలి, సాహో తర్వాత మన రెబల్‌ స్టార్ మార్కెట్‌ మరింత విస్తృతమవగా… బాలీవుడ్‌ మేటి నటి దీపిక రాకతో ఈ ప్రాజెక్ట్‌పై హైప్‌ అమాంతం పెరిగింది. ఏకంగా రూ. 30 కోట్ల పారితోషికం ఇచ్చి దీపికను ఎంచుకోవడం ఇప్పటికే సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. ఇప్పుడు ఈ మూవీలో దీపిక రోల్‌ గురించి ఇంట్రస్టింగ్‌ విషయం తెలిసింది. ఈ పాన్‌ ఇండియా చిత్రంలో ఆమె ఓ డ్యాన్సర్ పాత్రను పోషిస్తున్నట్టు సమాచారం.ఈ సైస్స్‌ ఫిక్షన్‌ మూవీ ఆ డ్యాన్సర్ చుట్టూనే తిరుగుతుందట. హీరోయిన్‌ పాత్రతోనే అనేక ట్విస్టులు, టర్న్‌లు ఉంటాయని చెబుతున్నారు. ‘జిల్‌’ ఫేమ్‌ రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్‌లో ప్రభాస్‌ నటిస్తున్న ‘రాధేశ్యామ్‌’ పూర్తయిన వెంటనే ఈ మూవీని సెట్స్‌పైకి తీసుకెళ్లాలని చూస్తున్నారు. మరోవైపు కపిల్‌ దేవ్‌ నేతృత్వంలోని ఇండియా 1983 వరల్డ్‌ కప్ విక్టరీపై వస్తున్న ‘83’ అనే మూవీలో దీపిక హీరోయిన్‌గా నటించింది. ఆమె భర్త రణ్‌వీర్ సింగ్‌ లీడ్‌ రోల్‌ పోషించిన ఈ మూవీ రిలీజ్‌కు రెడీగా ఉంది.

నామినేటెడ్ పదవుల పంపకం తేలేదెన్నడు?


2019 ఎన్నికల్లో వైసీపీ బంపర్ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. సీఎంగా జగన్మోహన్ రెడ్డి పదవీ చేపట్టి ఏడాది గడిచిపోయింది. దీంతో పార్టీనే నమ్ముకున్న నేతలు తమ పరిస్థితి ఏంటీ? అని ప్రశ్నిస్తున్నారు. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి, పార్టీని నమ్ముకొని ఉన్నామని.. పార్టీ అధికారంలోకి వచ్చినపుడు కూడా తమను పట్టించుకోకపోతే ఎలా? అంటూ వైసీపీ నేతలు లోలోపల నిరసన గళం విప్పుతున్నారు. తమగోడును అధిష్టానం పట్టించుకోవడంతో వైసీపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారనే టాక్ విన్పిస్తోంది.

నామినేటెడ్ పదవులతో ప్రజలకు పెద్దగా ఒరిగేదేమీ లేదు. పార్టీలోని నేతలను సంతృప్తిపరచడానికి, తమ బలాన్ని పెంచుకోవడానికి మాత్రమే అధికారంలో ఉన్న పార్టీలు ఆయా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తుంటాయని అందరికీ తెల్సిందే. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిపోతున్నా ఇప్పటివరకు నామినేటెడ్ పోస్టుల భర్తీ ఉసేత్తడం లేదు. దీంతో ఈ పదవులపై ఆశలు పెట్టుకున్న నేతలంతా నైరాశ్యంలో మునిగిపోతున్నారు. అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి తొలి ఏడాదిలోనే నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాలని భావించారు.

Also Read: జగన్ తో ఫైట్.. నిమ్మగడ్డే గెలిచాడు!

నామినేటెడ్ పదవులకు స్థానిక సంస్థల ఎన్నికలకు సీఎం జగన్ ముడిపెట్టడంతో ఈ ప్రక్రియ ముందుకు సాగడం లేదని తెలుస్తోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే ఏదో ఒక నామినేటెడ్ పోస్టు దక్కించుకొని జిల్లాల్లో పెత్తనం చెలాయించాలకున్న నేతలకు ఆ అవకాశం దక్కడం లేదు. ఇప్పటికే ఏడాది కాలం వృథా అయిపోయిందని నేతలు మదనపడుతున్నారు. నామినేటెడ్ పదవులను స్థానిక ఎన్నికల్లో సత్తాచూపించిన నేతలతో భర్తీ చేయాలని అధిష్టానం భావిస్తుంది. దీంతో లోకల్ బాడీ ఎలక్షన్స్ తర్వాతే పదవుల పంపకం చేపట్టాలని వైసీపీ నేతలు భావిస్తోంది.

అయితే స్థానిక సంస్థల ఎన్నికలు తరుచూ వాయిదా పడుతుండటంతో నామినేటెడ్ పదవులపై ఆశలు నేతలు అధిష్టానం తీరును తప్పుబడుతున్నారు. మరోవైపు పార్టీని నమ్ముకున్న వారిని పక్కన పెట్టి ఇతర పార్టీల నుంచి వైసీపీలో చేరిన వారికి కీలకమైన పోస్టులు కట్టబెట్టడంపై నేతలు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల ముందు వైసీపీలో చేరిన మాజీఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్ ఓడినా కూడా ప్రతిష్టాత్మకమైన వీఎమ్ ఆర్డీయే చైర్మన్ పదవిని కట్టబెట్టారని, అలాగే మరో కీలక‌మైన సింహాచలం ట్రస్ట్ బోర్డ్ మెంబర్ షిప్ లను కూడా ఇతర జిల్లాల వారికి కట్టబెట్టి పార్టీని నమ్ముకున్న వారిని పక్కన పెట్టారనే విమర్శలు వెల్లువెత్తుతోన్నాయి.

Also Read: కేసీఆర్ ని విమర్శించే ధైర్యం బాబుకు లేదా..?

పదేళ్ళుగా పార్టీ జెండా పట్టిన వారికి పార్టీలో న్యాయం జరగలేదన్న అసంతృప్తిని నేతలు బహిర్గతం చేస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో జరిగే సూచనలు కన్పించకపోవడం వైసీపీ నేతలు నైరాశ్యంలో మునిగిపోతున్నాయి. అయితే అధిష్టానం మాత్రం పార్టీని నమ్ముకున్న వారికి తప్పక న్యాయం జరుగుతుందని చెబుతోంది. దీంతో సీఎం జగన్ నామినేటెడ్ పోస్టుల భర్తీని ఎప్పుడు చేపడుతారనేది చర్చనీయాశంగా మారింది.

ఉత్తరాంధ్ర జిల్లాలపై జగన్ ఫోకస్..


ఏపీలో కొత్త జిల్లాలకు జగన్ సర్కార్ ఆమోదం తెలిపిన సంగతి తెల్సిందే. జగన్ గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రకారం నియోజకవర్గ ప్రతిపాదికను జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చూడుతోంది. ఏపీలోని 13జిల్లాలు 26జిల్లాలుగా మారనున్నాయి. అయితే ఈ సంఖ్య 30వరకు పెరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఆయా జిల్లాల నుంచి వచ్చిన ప్రతిపాదనలు, ప్రజలు, నేతల నుంచే వచ్చే విజ్ఞఫ్తుల మేరకు జిల్లాల ఏర్పాటులో మార్పులు చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. జిల్లాల ఏర్పాటు విషయంలో జగన్ సర్కార్ పక్కా ప్రణాళికతో ముందుకెళుతున్నట్లు తెలుస్తోంది.

Also Read: ప్రధాన ప్రతిపక్షం సైలెన్స్.. ఏపీలో ఇదే చర్చ..!

జిల్లాల ఏర్పాటుతో వైసీపీ మరింత బలపడే అవకాశం ఉంది. దీంతో సీఎం జగన్ జిల్లాల ఏర్పాటును ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలపై జగన్ ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. మూడురాజధానుల బిల్లు ఆమోదం పొందేక విశాఖ రాజధాని కావడం ఖాయమని తేలిపోయింది. అమరావతి నుంచి రాజధాని విశాఖకు మారుతుండటంతో ఈ ప్రాంతంలో వైసీపీ మరింత బలపడేందుకు అవకాశం దొరికింది. విశాఖ రాజధానితోపాటు ఉత్తరాంధ్రలో వైసీపీ బలపడేలా జిల్లాల విభజనకు జగన్ శ్రీకారం చుట్టారనే వాదనలు విన్పిస్తున్నాయి.

మూడు జిల్లాలు ఉన్న ఉత్తరాంధ్ర ఇక ఐదు జిల్లాలుగా మారనుంది. అయితే అరకు భౌగళిక పరిస్థితులరీత్యా విశాఖతోపాటు, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల వరకూ విస్తరించి ఉంది. అరకు నాలుగు జిల్లాలకు విస్తరించి అతి పెద్ద నియోజకవర్గంగా ఉంది. దీంతో అరకుని రెండుగా చేయాలని ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి సీఎం జగన్ కు సూచించారు. దీంతో అరకును రెండుగా చేసేందుకు ఉన్న అవకాశాలు పరిశీలించాలని అధికారులకు జగన్ ఆదేశించారు. దీంతో అరకు రెండుగా మారితే ఉత్తరాంధ్ర జిల్లాల సంఖ్య ఆరుకు పెరుగుతాయి. అయితే అరకుతోపాటు రాబోయే కొత్త జిల్లా ఏంటనే ఆసక్తి ఉత్తరాంధ్రలో నెలకొంది.

Also Read: కన్నా భవితవ్యం తేలేది ఈవారమేనా?

అరుకును రెండు విభజిస్తే వైసీపీకి మరింత పట్టు దక్కుతుందనే భావనతోనే డిప్యూటీ సీఎం శ్రీవాణి ఈ ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పార్వతీపురం జిల్లాగా చేయమని సంతకాల సేకరణ జరుగుతుండటంతో కురుపాం ఎమ్మెల్యేగా ఉన్న శ్రీవాణి ఈ ప్రతిపాదన జగన్ ముందుపెట్టినట్లు తెలుస్తోంది. పార్వతీపురం పక్కనే కురుపాం ఉంది. ప్రజల కోరిక మేరకు ఇక్కడ కొత్త గిరిజన జిల్లాను సాధిస్తే ఈ ప్రాంతంలో శ్రీవాణి హవా మరింత పెరగడంతో వైసీపీ మరింత బలపడనుంది.

ఇక శ్రీకాకుళంలోని పాలకొండను కొత్త గిరిజన జిల్లాగా ప్రకటించాలని ఉద్యమాలు చేపడుతున్నారు. దీని వెనుక కూడా రాజకీయ పెద్దలు ఉన్నారనే చర్చ సాగుతోంది. దీంతో ఈ రెండింటిలో ఏది గిరిజన జిల్లాగా మారునుందనే చర్చ నడుస్తుంది. ఇందులో ఏ ఒక్కటి గిరిజన జిల్లాగా ప్రకటించకపోయినా ఇబ్బందులు ఏర్పడే అవకాశాలున్నాయి. అయితే తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం కూడా అరకు పరిధిలోకే వస్తుంది. దీంతో ఆయా ప్రాంతాలను కలుపుతూ అక్కడే కొత్త గిరిజన జిల్లా తెస్తే ఈ రెండు జిల్లాలు కూడా సైడ్ అయిపోతాయనే వాదనలు విన్పిస్తున్నాయి. దీంతో ఉత్తరాంధ్ర జిల్లాల సంఖ్యపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఏదిఏమైనా విశాఖ రాజధానితో ఉత్తరాంధ్ర ప్రాంతం మరింత వైభవం దక్కించుకోవడం ఖాయంగా కన్పిస్తుంది.

ప్రభాసా మజాకా.. జపాన్‌లో ‘సాహో’ రికార్డు


ఏ ముహూర్తాన దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి ‘బాహుబలి’ మొదలు పెట్టాడో.. అప్పటి నుంచి యంగ్ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ స్టార్డమ్‌ అమాంతం పెరిగిపోతూ వస్తోంది. బాహుబలి రెండు పార్టులు రిలీజై సూపర్ హిట్స్‌ కావడంతో ప్రభాస్‌ పాన్‌ ఇండియా స్టార్ అయిపోయాడు. వరల్డ్‌ వైడ్‌ అతని పేరు మార్మోగింది. బాహుబలి తర్వాత అతను యాక్షన్‌ డ్రామా ‘సాహో’తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. సుజీత్‌ డైరెక్ట్‌ చేసిన ఈ మూవీ తెలుగులో అంతగా ఆడకపోయినా హిందీ వెర్షన్‌ మాత్రం బాలీవుడ్‌లో మంచి వసూళ్లు రాబట్టింది. ఈ మూవీ రిలీజై దాదాపు ఏడాదైంది. టీవీలో కూడా వచ్చి టీఆర్పీస్‌లో దుమ్ముదులిపింది. ఈ మూవీ ఇప్పుడు జపాన్‌లో సరికొత్త రికార్డు సృష్టించింది.

Also Read: ప్రభాస్‌ మూవీ కోసం దీపిక అంత తీసుకుందా!

కరోనా తర్వాత జపాన్‌లో ఈ మధ్యే థియేటర్లు రీఓపెన్‌ అయ్యాయి. ప్రభాస్‌, శ్రద్ధా కపూర్ హీరో, హీరోయిన్లుగా నటించిన సాహో ఇప్పుడు జపానీస్‌ భాషలో అక్కడ మరోసారి ప్రదర్శితమవుతోంది. విషయం అక్కడితోనే అయిపోలేదు. జపాన్‌లో రిలీజైన్‌ భారతీయ సినిమాల్లో అత్యధిక ఓపెనింగ్‌ కలెక్షన్స్‌ సాధించిన చిత్రంగా నిలిచింది సాహో. 1.10 వేల యూస్‌ డాలర్లు వసూల్‌ చేసి… అమీర్ ఖాన్ ‘దంగల్‌’ రికార్డును బ్రేక్‌ చేసింది. అలాగే, జపాన్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టి ఐదు ఇండియన్‌ ఫిల్మ్స్‌లో చోటు దక్కించుకుంది. ‘ఇంగ్లిష్‌ వింగ్లిష్‌’, ‘3 ఇడియట్స్‌’, ‘ముత్తు’, ‘బాహుబలి 2’ ఈ లిస్ట్‌లో ఉన్నాయి. మొత్తానికి రీరిలీజైన సినిమానే ఇలా రికార్డు కొడితే.. ప్రభాస్‌ ఫ్యూచర్లో వచ్చే మూవీస్ ఇంకెన్ని రికార్డులు బద్దలు కొడుతాయో చూడాలి.

మహిళా టెర్రరిస్ట్‌గా సమంత!


అందం, అభినయంతో తెలుగులోనే కాకుండా సౌత్‌ ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకుంది సమంత అక్కినేని. నాగచైతన్యను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె కెరీర్ ఊపందుకుంది. వరుస హిట్లతో దూసుకెళ్లోంది. పెళ్లయ్యాక కథల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తోందామె. ఈ క్రమంలో రీసెంట్‌గా ‘మజిలీ’, ‘ఓ బేబీ’ వంటి హిట్‌ సినిమాల్లో అద్భుతమైన నటనతో మెప్పించింది. ఇప్పుడు ఓ హిందీ వెబ్‌ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అమెజాన్‌లో సూపర్ హిట్‌ అయిన ‘ఫ్యామిలీ మ్యాన్‌’ సిరీస్‌ సెకండ్‌ పార్ట్‌లో సమంత కీలక పాత్ర పోషించింది. క్రైమ్‌ థ్రిల్లర్గా వచ్చిన ఫస్ట్‌ సీజన్‌ వరల్డ్‌ వైడ్‌ ఎంతో సక్సెస్‌ సాధించింది. తెలుగు సహా ప్రాంతీయ భాషల్లో కూడా స్ట్రీమ్‌ అవడంతో అందరికీ చేరువైంది. ఇండియాకు ముప్పు తలపెట్టే టెర్రరిస్టులను పట్టుకునే ప్రధాన పాత్రలో మనోజ్‌ బాజ్‌పేయ్‌ పోలీసు అధికారిగా, ఓ కుటుంబ పెద్దగా అద్భుత నటన కనబరిచాడు.

Also Read: సూసైడ్‌ ఆర్‌ మర్డర్… సుశాంత్‌పై బయోపిక్‌

సెకండ్‌ సీజన్‌లో అత్యంత కీలకమైన పాత్ర కోసం సమంతను తీసుకున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఇది ఓ మహిళా టెర్రరిస్ట్‌ పాత్రను సమంత పోషిస్తోంది. పాకిస్తాన్‌ ఉగ్రవాద సంస్థ కోసం ఇండియాలో ఓ స్లీపర్ సెల్‌గా ఆమె పని చేస్తుందట. ఇది నెగెటివ్‌ రోల్‌ అయినప్పటికీ.. బ్యాక్‌డ్రాప్‌లో ఎమోషన్‌ స్టోరీ ఉండే చాలెంజింగ్‌ పాత్ర కావడంతో సమంత దీనికి అంగీకరించిందని తెలుస్తోంది. ఈ పాత్రలో సమంత అద్భుతంగా నటించిందని మేకర్స్‌ చేబుతున్నారు. ఈ సిరీస్‌ రిలీజైన తర్వాత నార్త్‌లో కూడా సమంత పేరు మార్మోగుతుందని, బాలీవుడ్‌ దృష్టి ఆమెపై పడుతుందని అంటున్నారు.

Also Read: ‘రాధేశ్యామ్‌’లో కీలక మార్పు!

ఒకటి రెండు రోజుల ప్యాచ్‌ వర్క్‌ మినహా షూటింగ్‌ మొత్తం కంప్లీట్‌ అయింది. ప్రస్తుతం డబ్బింగ్‌ పనులు నడుస్తున్నాయి. మనోజ్‌ ముంబైలో డబ్బింగ్‌ చెబుతుండగా.. సమంత కోసం హైదరాబాద్‌లోనే డబ్బింగ్‌ ఏర్పాట్లు చేశారు. వెబ్ సిరీస్‌ డైరెక్టర్లు రాజ్‌ నిడిమోరు, క్రిష్ణ డీకే .. జూమ్‌ కాల్స్‌ ద్వారా మనోజ్‌, సమంతతో రెగ్యులర్గా మాట్లాడుతున్నారు. వీలైనంత త్వరగా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు పూర్తి చేయాలని చూస్తున్నారు. ఫస్ట్‌ పార్ట్‌లో నటించిన ప్రియమణి, సందీప్‌ కిషన్‌, నీరజ్‌ మాధవ్‌, షరీబ్‌ హంషి పాత్రలు సెకండ్ సిరీస్‌లోనూ కొనసాగుతాయి. ఈ సిరీస్‌ సెప్టెంబర్ లేదా అక్టోబర్లో రిలీజ్‌ చేయాలని చూస్తున్నారు.

పవర్ స్టార్ ట్రైలర్ లీక్‌..


ప్రపంచంలోనే పస్ట్‌ పెయిడ్‌ ట్రైలర్ అంటూ… తన కొత్త మూవీ ‘పవర్ స్టార్’ ట్రైలర్ చూడాలంటేరూ. 25 కట్టాలని అనౌన్స్‌ చేశాడు రామ్‌గోపాల్‌ వర్మ.. ఈ రోజు 11 గంటలకు ‘ఆర్జీవీ వరల్డ్‌ థియేటర్’ లో రిలీజ్‌ చేస్తున్నట్టు ప్రకటించాడు. తీరా వర్మ రిలీజ్‌ చేసే కొన్ని గంటల ముందే ఆ ట్రైలర్ లీకైంది. దాంతో చేసేదేమీ లేక యూట్యూబ్‌లో హెచ్‌డీ ట్రైలర్ను రిలీజ్‌ చేశాడు వర్మ. ట్రైలర్ కోసం ఇప్పటికే డబ్బులు చెల్లించిన వారికి ఆ అమౌంట్‌ రిటర్న్‌ చేస్తామని ట్వీట్‌ చేశాడు. ట్రైలర్ లీక్‌ తమ టీమ్‌లోని ఒకరి పని అయి ఉంటుందని, ఆ వ్యక్తిని గుర్తించి చర్యలు తీసుకుంటామని చెప్పాడు. ఇక, ఈ మూవీ ఎవరినీ ఉద్దేశించింది కాదు అని ఆర్జీవీ చెప్పినా.. ఇది వవన్‌ కళ్యాణ్‌ను టార్గెట్‌ చేస్తూ తీసిందని అర్థమవుతోంది. పైగా టైటిల్‌ మధ్యలో గ్లాసు, ఎన్నికల తర్వాతి కథ అనే ట్యాగ్‌లైన్‌ ఇచ్చాడు. అచ్చం పవన్‌ కళ్యాణ్‌ను పోలిన ప్రధాన పాత్రధారితో రిలీజ్‌ చేసిన పోస్టర్లు, ‘గడ్డి తింటావా’ అనే సాంగ్‌ మూవీపై భారీ హైప్‌ క్రియేట్‌ చేశాడు. దీనిపై పవన్‌ ఫ్యాన్స్‌ గుర్రుగా ఉన్నా.. వర్మ తన పని తాను చేసుకుంటున్నట్టు ట్రైలర్ను చూస్తుంటే అర్థమవుతోంది. ఎలక్షన్స్‌ తర్వాతి పరిస్థితిని సెటైరికల్‌గా చూపించే ప్రయత్నం చేశాడు వర్మ.

Also Read: మణిరత్నం ‘నవరస’ సిరీస్‌లో తెలుగు స్టార్లు!

ఈ చిత్రం ప్రవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌కు అంకింతం అంటూ హీరో క్యారెక్టర్ను ప్రవన్‌ కళ్యాణ్‌ అని పరిచయం చేశాడు వర్మ. ‘ఒక్క సీటు.. ఒక్క సీటు కూడా రాలేదా ఆ’ అంటూ హీరో ఆవేదన చెందుతుంటే. పక్కన ఉన్న వ్యక్తి (నాదెండ్ల మనోహర్ను పోలిన క్యారెక్టర్) ‘ఒక్కటి వచ్చింది సార్. కానీ మీకు ఒక్కటి కూడా రాలేదు’ అని చెప్పడంతో హీరో టీవీ పగలగొట్టడం.. ‘ఒకసారి గుండెల మీద చెయ్యేసుకుని చెప్పరా! నువ్వు పవర్ స్టార్ అయ్యింది కానిస్టేబుల్ కొడుకుగానా లేదా నా తమ్ముడిగానా?’ అంటూ చిరంజీవి లుక్ లో ఉన్న వ్యక్తి  డైలాగ్‌తో సెటైర్స్‌ బాగానే వేశాడు ఆర్జీవీ. ‘సత్య ప్రమాణకంగా చెబుతున్నాను బ్రదర్.. మీరు ఓడిపోయినందుకు నేను చాలా బాధపడుతున్నాను’ అంటూ చంద్రబాబు లుక్ లో ఉన్న వ్యక్తి ( అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు ఫేమ్‌) అంటే.. మిమ్మల్ని నమ్మద్దు.. నమ్మద్దు అని చాలా మంది చెప్పారు… మీకో దండం అంటూ ప్రవర్ కళ్యాణ్‌‌ ఆ వ్యక్తిని ఇంటి నుంచి వెళ్లగొట్టడం.. త్రివిక్రమ్‌ లుక్‌లోని దర్శకుడిని కొట్టడం, బండ్ల గణేశ్‌ పాత్రధారి వచ్చి కాళ్ల మీద పడడం ఫన్నీగా ఉంది. ఇంతకీ నేను రాజకీయాల్లో ఉండాలా.? వదిలేయాలా? అని చీకట్లో కూర్చొని ప్రవన్‌ ఆలోచిస్తుండగా.. ముఖం కనిపించని ఓ వ్యక్తి చేతిలో బాటిల్‌తో వచ్చి అతని వెనక కూర్చోవడంతో ముగిసిన ట్రైలర్ ను.. రెండు గంట్లోనే దాదాపు 4 లక్షల మంది వీక్షించడం గమనార్హం. కాగా, ఈ మూవీని 25వ తేదీన రిలీజ్‌ చేస్తున్నట్టు ఆర్జీవీ ప్రకటించాడు.

 

కేసీఆర్ ని విమర్శించే ధైర్యం బాబుకు లేదా..?


ఏపీ ప్రతిపక్ష నాయకుడు, టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షడు అనేవి ప్రస్తుతం చంద్రబాబుకు వున్న హోదాలు. జాతీయ పార్టీ అధ్యక్షుడిని అని చెప్పకొనే బాబు రాజకీయాలు మాత్రం కేవలం ఆంద్రప్రదేశ్ కే పరిమితం. ఎన్నికలు వచ్చే నాటికి గానీ ఆయనకు ఓ జాతీయ పార్టీ అధ్యక్షుడిని అనే మాట గుర్తుకురాదు. ఎదో ఒక వర్గం పక్షాన చేరి…ఎన్నికల సమయంలో ఢిల్లీ టూర్స్ వేయడం ఆయనకు అలవాటు. ఆయన ఢిల్లీ ప్రయాణాలను దేశ రాజకీయాలలో కీలక పరిణామాలుగా అనుకూల పత్రికలు ఊదరగొడుతూ ఉండేవి. గత సార్వత్రిక ఎన్నికల ముందు బీజేపీ వ్యతిరేక కూటమితో జత కట్టి, మోడీకి సవాలు విసిరారు. కాంగ్రెస్ తో కూటమి గట్టిన మాయావతి, మమతా బెనర్జీ, కుమార స్వామి, అఖిలేష్ యాదవ్ అందరూ బీజీపీకి వ్యతిరేకంగానే ఉన్నారు. బాబు మాత్రం మోడీ అధికారంలోకి రాగానే వెంటనే అనుకూల స్వర్యం అందుకున్నారు. ఆయనతో విభేదించకుండా ఉండాల్సింది అని మీడియా సాక్షిగా తప్పు చేశానని ఒప్పుకున్నారు.

Also Read: ‘నిమ్మగడ్డ’ వ్యవహారంలో ప్రభుత్వానికి షాక్..

చంద్రబాబుది అవకాశవాద రాజకీయం అనడానికి ఇది కేవలం ఒక ఉదాహరణ. మోడీతో బాబు విభేదించడం వెనుక కారణం కూడా ప్రజల సానుభూతి కోసమే జరిగింది. ఐదేళ్ల పాలనలో ఇసుమంత అభివృద్ధి, సంక్షేమం జరిగిన దాఖలాలు లేవు. తన ఐదేళ్ల వైఫల్యాన్ని మోడీపై నెట్టేసి, తాను నిర్దోషిగా ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. అది వర్క్ అవుట్ కాక ఓటమి చవిచూశారు. ఐతే జాతీయ పార్టీ నాయకుడిగా చెప్పుకొనే చంద్రబాబు పోరాటం ఆంధ్రప్రదేశ్ కే ఎందుకు పరిమితం అవుతుందనేది అసలు ప్రశ్న.

Also Read: బాబు ఆవేశానికి తమ్ముళ్లు బలి కావాల్సిందేనా?

కోవిడ్ నియంత్రణ, వైద్య సేవల విషయంలో జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టీడీపీ నేతల తాజా వాదన. వందల్లో మరణాలు సంభవిస్తున్నా పట్టించుకొనే నాధుడే లేడని, జగన్ కి ప్రజల ప్రాణాల పట్ల అసలు బాధ్యత కూడా లేదని టీడీపీ నేతలు విమర్శల దాడి చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ తో పోల్చుకుంటే తెలంగాణాలో పరిస్థితి అద్వానంగా ఉంది. అక్కడ కేసుల లెక్కలలో పారదర్శకత లేదని, ప్రభుత్వం ప్రజల్ని తప్పుదారి పట్టిస్తోందని, గవర్నర్ మరియు న్యాయ శాఖ తీవ్ర ఆరోపణలు చేయడం జరిగింది. కరోనా సంక్లిష్ట సమయంలో రెండు వారాలు సీఎం కేసీఆర్ కనిపించకుండా పోయారు. మరి ఈ విషయాలపై టీడీపీ ఎందుకు మాట్లాడడం లేదో పార్టీ నేతలకే తెలియాలి. ఏపీ ప్రజల పట్ల ఉన్న భాద్యత, తెలంగాణా ప్రజల పట్ల టీడీపీకి లేదా అనేది చెప్పాలి. లేక కెసిఆర్ ని విమర్శించడానికి బాబు భయపడుతున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

జగన్ తో ఫైట్.. నిమ్మగడ్డే గెలిచాడు!

Ramesh Kumar


నిమ్మగడ్డ వర్సెస్ సీఎం జగన్ పోరులో చిట్టచివరికి నిమ్మగడ్డే గెలిచాడు. హైకోర్టు నుంచి సుప్రీం కోర్టు దాకా.. చివరకు గవర్నర్ వద్దకు చేరిన పంచాయితీలో నిమ్మగడ్డ ఎక్కని గడప లేదు.. తొక్కని వాకిలి లేదు. హైదరాబాద్ లో బీజేపీనేతలతో సంప్రదింపులు జరిపారు. పట్టువదలని విక్రమార్కుడిలా సీఎం జగన్ కాదంటున్నా ఫైట్ చేశారు. చివరకు ఆయనకు ఇష్టం లేకున్నా ఏపీ ఎన్నికల కమిషనర్ గా గవర్నర్ సాయంతో నియామకం కావడానికి రెడీ అయ్యారు.

ఏపీ సీఎం జగన్ ధాటికి టీడీపీ కూసాలు కదిలిపోతున్నాయి. మాజీ టీడీపీ మంత్రులు జైలు పాలు అవుతున్నారు. జగన్ ను తిట్టిన వారు జైలుకు వెళుతున్నారు. ఈ క్రమంలోనే జగన్ తో పేచీ ఎందుకని చాలామంది టీడీపీ మాజీ మంత్రులు అజ్ఞాతవాసం గడుపుతూ రాజకీయాల్లో అస్సలు యాక్టివ్ లేరు. మొన్నటివరకు జగన్ ను తిట్టిన తిట్టు తిట్టకుండా విమర్శించే దేవినేని ఉమ కూడా సైలెంట్ అయ్యారు. జగన్ సర్కార్ సాగునీటి ప్రాజెక్టుల అవకతవకలపై విచారణ చేస్తుండడంతో ఆయన కూడా మౌనం దాల్చారు.

Also Read: కోవిడ్ బారిన పడిన విజయసాయి..

ఇలా అందరూ భీకర మెజార్టీతో గద్దెనెక్కి అధికార బలంతో చెలరేగిపోతున్న జగన్ ధాటికి కిక్కురుమనకుండా ఉంటే.. నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాత్రం ఎదురు నిలిచి న్యాయస్థానాల ద్వారా పోరాడి గెలిచాడు. చంద్రబాబు నియమించిన ఆయన సామాజికవర్గానికే చెందిన నిమ్మగడ్డకు తాజాగా సుధీర్ఘ పోరాటం తర్వాత ఊరట లభించింది.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తిరిగి నియమించాలంటూ గవర్నర్ హరిచందన్ కొద్దిసేపటి క్రితమే ఆదేశాలు జారీ చేశారు. హైకోర్టు తీర్పు ప్రకారం ఎస్ఈసీగా నిమ్మగడ్డను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి గవర్నర్ లేఖ రాశారు. మే 29నాటి హైకోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలని లేఖలో పేర్కొన్నారు.

హైకోర్టు ఆదేశానుసారం.. తనను ఏపీ ప్రభుత్వం తిరిగి ఎస్ఈసీగా నియమించడం లేదంటూ నిమ్మగడ్డ రమేష్.. ఇటీవలే గవర్నర్ ను కలిసి విన్నవించుకున్నారు. తాజాగా ఈరోజు ఆయనను అపాయింట్ చేయాలని గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు.

Also Read: ఆ ముక్క ముందు మోడీని కదా అడగాల్సింది బాబు..!

ఏపీ సీఎం జగన్ కు వ్యతిరేకంగా స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేశారు అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్. చంద్రబాబు ప్రభుత్వంలో నియామకమైన ఈయన టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని జగన్ ఆయనను పలు ఆర్డినెన్స్ లు తెచ్చి తొలగించారు.మరో ఆర్డినెస్స్ తీసుకొచ్చి మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కనగరాజ్ ను నియమించారు. అయితే హైకోర్టు దాన్ని కొట్టివేసి నిమ్మగడ్డనే ఏపీ ఎన్నికల కమిషనర్ అని ప్రకటించింది. దీంతో జగన్ సర్కార్ దీనిపై సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. సుప్రీం కోర్టు కూడా నిమ్మగడ్డకే అనుకూలంగా తీర్పు వచ్చింది. అయినా కూడా హైకోర్టు ఆదేశాలను ఏపీ ప్రభుత్వం అమలు చేయకపోవడంతో తాజాగా గవర్నర్ ను కలిసి విన్నవించాలని నిమ్మగడ్డకు హైకోర్టు సూచించింది. గవర్నర్ కూడా నిమ్మగడ్డ వెంటే నిలవడంతో ఇప్పుడు జగన్ ఏం చేస్తాడన్నది ఉత్కంఠగా మారింది. నిమ్మగడ్డను నియమించక తప్పని పరిస్థితిని జగన్ ఎదుర్కొంటున్నారు.

కాగా ఈ మొత్తం ఎపిసోడ్ లో ఎంతో బలవంతుడైన జగన్ ను ఎదుర్కొని ఒక రిటైర్డ్ ఐఏఎస్.. అదీ చంద్రబాబు అనుకూలవాదిగా పేరొందిన నిమ్మగడ్డ రమేశ్ కుమార్ గెలిచాడనే చెప్పవచ్చు. జగన్ ప్రభుత్వంలో టీడీపీ నియమించిన వ్యక్తి నిమ్మగడ్డ మున్ముందు ఎలా వ్యవహరిస్తాడన్నది ఆసక్తిగా మారింది. వీరిద్దరి టామ్ అండ్ జెర్రీ ఫైట్ రంజుగా ఉండనుంది.

-ఎన్నం

ఇక నుండైనా ఆహారపు అలవాట్లు మార్చుకుంటారా?

Virus
దేశంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్న వేళ, మనలో కొంతమంది ఇప్పుడు పాజిటివ్ స్టేజిలో ఉన్నారు. అనేకమంది దేహంలో ఉన్న “వ్యాధి నిరోధక శక్తి” ప్రస్తుతం వైరస్ తో పోరాడుతూనే ఉంది. మీరు కరోనా టెస్ట్ లు చేయించు కోవడం ఇప్పుడు వీలుకాదు. అందరకీ టెస్ట్ లు చేసే అవకాశం లేదు. అతి ఖరీదైన కరోనా మందులు కొనటం కష్టమే.. ఒకవేళ కొనాలన్నా.. అవి అందుబాటులో లేవు. కావున మనల్ని మనం కాపాడుకోవడం తప్పనిసరి. వ్యాధినిరోధకశక్తి కి సపోర్టు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఈ క్రింది ఆహారపు అలవాట్లు పాటించినట్లైతే మన వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవచ్చు.

1. రోజూ ఒక నిమ్మకాయ రసం తీసుకోవాలి,

2. జింక్ (టాబ్లెట్: జింక్ కోవైట్),

3.విటమిన్ డి3 (ఉదయం 7నుంచి 8 గంటల మధ్య ఎండలో అర్ధ గంట ఉంటే సహజసిద్దంగా వస్తుంది).

4.వేడి నీరు ఉదయం/ సాయంత్రం

5.మంచి ఆహారం తినాలి. ఆకుకూరలు, గుడ్లు, చికెన్,మటన్.. ఫ్రై కి దూరంగా ఉండండి ఓన్లీ కర్రీ

6. కనీసం నాలుగు లీటర్ల నీటిని తాగినట్లైతే… కరోనా మహమ్మారి నుండి దాదాపు తప్పించుకున్నట్లే..

ప్రధాన ప్రతిపక్షం సైలెన్స్.. ఏపీలో ఇదే చర్చ..!


ఏపీలో ఎక్కడ చూసిన ప్రధాన ప్రతిపక్షం టీడీపీ గురించి చర్చ నడుస్తోంది. ప్రజా సమస్యలపై ముందుండి పోరాడాల్సిన టీడీపీ కొద్దిరోజులుగా ఆ విషయాన్నే పక్కన పెట్టిందనే వాదనలు విన్పిస్తున్నాయి. ఒకటి అర మినహా దాదాపు అన్ని జిల్లాల్లో టీడీపీ నేతలు ఎక్కడా యాక్టివ్ గా కన్పించకపోవడం చర్చనీయాంశంగా మారింది. టీడీపీ నేతల సడన్ సైలంట్ వెనుక కారణాలపైనే ప్రజల్లో విస్కృతంగా చర్చ నడుస్తోంది.

Also Read: పవన్ దూకుడు పాలిటిక్స్ కి బ్రేక్?

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సైతం టీడీపీ నేతలపై నజర్ పెట్టినట్లు తెలుస్తోంది. ఆయా జిల్లాల్లో అంతగా యాక్టివ్ గా పనిచేయని నేతల నివేదికను ఇప్పటికే బాబు తెప్పించుకున్నారని తెలుస్తోంది. వీరిందరి పనితీరు, గ్రాఫ్ బాబుకు పెద్దగా నచ్చడంలేదని టాక్ విన్పిస్తుంది. వీరిలో ఎక్కువగా గత ఎన్నికల ముందు వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చినవారే ఉన్నట్లు సమాచారం. టీడీపీ రెండోసారి అధికారంలోకి వస్తుందనే ఆశతో వైసీపీ జెండాను పీకేసీ పచ్చకండువా కప్పుకున్నారు. అయితే వీరి ఆశలన్నీ 2019 ఎన్నికల్లో చంద్రబాబు వొమ్ము చేశారు. ప్రస్తుతం వారంతా టీడీపీలో కొనసాగుతోన్న వారి మనస్సు మాత్రం వైసీపీ వైపు లాగుతుండటంతో నేతలు సైలంట్ అయినట్లు తెలుస్తోంది.

గత ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వారంతా మళ్లీ అధికార పార్టీవైపు చూస్తున్నారు. అయితే వైసీపీలో ఇప్పటికే నేతల తాకిడి ఎక్కువగా ఉండటంతో సీఎం జగన్ తలుపులు మూసేశారు. దీంతో చేసేదిలేక టీడీపీలోనే కొనసాగుతున్నారు. అయితే అవకాశం వస్తే చంద్రబాబుకు హ్యండిచ్చి అధికార పార్టీలోకి జంప్ అయ్యేందుకు రెడీ అవుతున్నారు. మరోవైపు జగన్ అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడి హయాంలో జరిగిన అవినీతిని వెలికితీస్తూ టీడీపీ నేతలను జైళ్లకు పంపిస్తుండటంతో తెలుగు తమ్ముళ్లంతా ఎందుకైనా మంచిదని కొంత దూకుడును తగ్గించినట్లు తెలుస్తోంది.

Also Read: ఢిల్లీలో విజయసాయి దుకాణం బంద్?

దీంతోనే టీడీపీ నేతలు ఏడాది కాలంగా పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా యాక్టివ్ ఉండటం లేదని తెలుస్తోంది. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన నేతలంతా ఎప్పుడెప్పుడు అధికారం పార్టీలోకి వెళుదామా? అని కాచుకుని కూర్చున్నారట. అయితే వీరు యాక్టివ్ గా లేరనే సాకుతో చంద్రబాబునాయుడు వీరిని పక్కకు పెట్టే సాహసం చేయలేకపోతున్నారు. దీంతో కిందిస్థాయి నాయకులు తమకు పదవుల్లేకుండా తామేందుకు కార్యక్రమాలు చేయాలని ఊరుకుంటున్నారట. దీంతో టీడీపీ పరిస్థితి రెంటికి చెడ్డ రెవడీగా మారిపోయింది. టీడీపీ పరిస్థితి ఇలానే కొనసాగితే వచ్చే ఎన్నికల వరకు కూడా పార్టీ కోలుకోవడం కష్టమేననే వాదన విన్పిస్తుంది. నేతల సైలంట్ ను చంద్రబాబు ఎలా బ్రేక్ చేస్తారో వేచి చూడాల్సిందే..!

ఆ ముక్క ముందు మోడీని కదా అడగాల్సింది బాబు..!


సోషల్ మీడియా వేదికగా నేడు ప్రతిపక్షం చేసిన రాద్ధాంతం ఏమిటంటే జగన్ పెట్రోల్, మరియు డీజిల్ పై స్టేట్ వ్యాట్ పెంచేశారు. నమ్మి ఓటు వేసినందుకు వాతలు, కోతలు పెడుతున్నారు. ఒక చేత్తో పంచుతూ… మరో చేత్తో రెండింతలు లాక్కోవడం జగన్ కి బాగా తెలిసిన విద్య. ఇవి సోషల్ మీడియా వేదికగా జగన్ పై టీడీపీ నేతల ఆరోపణలు. ఇక టీడీపీ వ్యవస్థాపక సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి లైవ్ లోకి వచ్చి ఏకి పారేశారు. పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెంచడం అంటే, పేదవాళ్లపై పెనుభారం మోపినట్లే అన్నారు. రవాణా ఖర్చులు పెరిగి ఆభారం నిత్యావసర ధరలపై పడుతుంది అనేది ఆయన ఆరోపణ. ఆర్థిక సూత్రాల ప్రకారం ఆయన చెప్పిన దానిలో నిజం ఉంది. మరి రాష్ట్ర ఆర్థిక అవసరాల మాటేమిటీ? కరోనా వైరస్ వలన రాష్ట్రానికి వచ్చే అత్తెసరు ఆదాయం అడుగంటి పోగా, ఆదాయ మార్గాల సంగతేమి అనేది ఒక ప్రశ్న.

Also Read: ఆనం సడెన్ సైలెంట్ వెనుక కారణాలేంటీ?

ఇక ఏపీలో పెట్రోల్ పై రూ. 1.24, డీజిల్ పై రూ.0.93 పెంచడం జరిగింది. ఈ విషయంలో మొదట టీడీపీ ప్రశ్నిచాల్సింది కేంద్రాన్ని. అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా, పెట్రోల్, డీజిల్ ధరలు ఎందుకు పెంచుతున్నారని బాబు కానీ ఆయన నేతలు కానీ బీజేపీని పల్లెత్తి మాటన్న పాపాన పోలేదు. మరి టీడీపీ జాతీయ పార్టీ అని చెప్పుకొనే చంద్రబాబుకు మరియు టీడీపీ నేతలకు ఇది ఎందుకు కనిపించదు. ఎన్నికలకు ముందు మోడీపై తొడలు కొట్టిన టీడీపీ నేతలు ఎందుకు కిక్కురు మనడం లేదు అంటే…అంతా చంద్రబాబు ట్రైనింగే. ఎలాగైనా బీజేపీ పంచన చేరి, జగన్ అరెస్టుల దాడిని నుండి భయటపడాలనేది చంద్రబాబు ఆలోచన. రోజుల వ్యవధిలో దాదాపు రూ. 10 పెంచిన కేంద్రాన్ని వదిలేసి, రూపాయి పెంచిన వైసీపీని టార్గెట్ చేయడం వింతగా తోస్తుంది.

Also Read: జగన్ దెబ్బకు దెబ్బ సిద్ధాంతంలో భాగమేనా ఇది?

ఈ విషయంలో పవన్ కళ్యాణ్ కొంచెం మెచ్యూరిటీగా వ్యవహరించారు అనిపిస్తుంది. పెట్రోల్ మరియు డీజిల్ పై ఏపీ స్టేట్ టాక్స్ పెంచిన అంశాన్ని ఆయన విమర్శించలేదు. దానికి కారణం, జగన్ ని ప్రశ్నించే ముందు ఆయన పెట్రోలు ధరలపై బీజేపీని నిలదీయాల్సివస్తుంది. బీజేపీతో మిత్ర పక్షముగా ఉన్నందున ఆయనకు ఇంకా ఎక్కువ భాద్యత ఉంది. దానితో ఏపీ ప్రభుత్వంపెంచిన వ్యాట్ గురించి ఆరోపణలు చేస్తే బీజేపీ అడ్డగోలుగా పెంచిన డీజిల్ మరియు పెట్రోల్ ధరలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే ఆయన గమ్మున ఉన్నాడు. మరి ఈ విషయంలో పవన్ కి ఉన్న పరిజ్ఞానం కూడా బాబుకు లేకుండా పోయింది.

డైరెక్టర్ తో ఆడుకుంటున్న హీరోలు !


దర్శకుడు అజ‌య్ భూప‌తి పరిస్థితి మరీ కామెడీగా ఉంది. ఊరు పేరు లేని హీరోతో సూపర్ హిట్ కొట్టి.. కార్తికేయ అనే కుర్రాడిని హీరోగా నిలబెట్టాడు. దాంతో కార్తికేయ ఇప్పటికే నాలుగు సినిమాలు చేశాడు. కానీ అజయ్ భూపతి మాత్రం మహా సముద్రంలోనే మునిగిపోయాడు. సినిమా సెట్స్ పైకి వెళ్లాలంటే చాలా కష్టం, నిజమే.. కానీ హిట్ వచ్చాక కూడా అతిగతి లేకపోతే ఎలా.., నిజంగా తన మొదటి సినిమా అవకాశం కోసం ఎంత కష్టపడ్డాడో తెలియదు గాని, రెండో సినిమా కోసం మాత్రం అజయ్ ఎన్నో రాత్రులు ఎదురు చూడాల్సి వస్తోంది. అయినప్పటికీ అజయ్ కి మాత్రం సినిమా సెట్ కావట్లేదు. ఆ హీరో ఈ హీరో అంటూ రూమర్స్ అయితే లెక్కకి మించి వచ్చాయి గానీ, ఇంతవరకు అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.

Also Read: ఎవరు ఏమన్నా ఎక్స్ పోజింగే కంఫర్ట్ అట !

పొరపాటున ఒక సినిమా హిట్ అయితే చాలు, ఇక ఆ డైరెక్టర్ చుట్టూ అవకాశాలు క్యూ కడతాయని ఇండస్ట్రీలో తరుచూ చెప్పుకుంటారు. కానీ అజయ్ విషయంలో ఇలా జరగపోగా.. సినిమా చేయడానికి ఒప్పుకున్న హీరోలు కూడా హ్యాండ్ ఇస్తున్నారు. ఈ రోజుల్లో సక్సెస్ ఉన్నోళ్లకు షేక్ హ్యాండ్ తప్ప, హ్యాండ్ ఇవ్వరు. కానీ పాపం అజయ్ కే ఇలా జరుగుతుంది అనుకుంటా. మొదట తానూ ఇప్పుడు చేయాలనుకున్నా మహాసముద్రం సినిమాని రామ్ తో చేయలనుకున్నాడు. రామ్ ఒప్పుకున్నాక, మధ్యలో వద్దు అన్నాడు. ఆ తరువాత యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తో అనుకున్నా.. మొత్తానికి బెల్లంకొండ కూడా భయపడ్డాడు.

Also Read: సూసైడ్‌ ఆర్‌ మర్డర్… సుశాంత్‌పై బయోపిక్‌

అక్కడ నుండి రవితేజ దగ్గరకు వచ్చాడు. రవితేజ కూడా ఓకే అని చివర్లో తప్పుకున్నాడు. ఆ తరువాత సమంత – నాగచైతన్య జంటగా అనుకున్నా అదీ లేదని తేలిపోయింది. చివరకు ఎలాగోలా శర్వానంద్ ను ఒప్పించాడు. లాక్ డౌన్ తరువాత అధికారికంగా ఈ సినిమాని ప్రకటించబోతున్నారని అనుకునే లోపు ఇప్పుడు ఈ సినిమా నుండి శర్వానంద్ కూడా తప్పుకునట్లు తెలుస్తోంది. ఇది నిజం అయితే, అజయ్ భూపతికి కోలుకోలేని దెబ్బే. ఏమైనా హీరోలు ఈ డైరెక్టర్ తో ఆడుకుంటున్నారు.

‘నిమ్మగడ్డ’ వ్యవహారంలో ప్రభుత్వానికి షాక్..


నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంపై రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ స్పందించారు. ఈ మేరకు ఆయన ఆదేశాలను రాజ్ భవన్ అధికారులు ప్రభుత్వానికి పంపారు. నిమ్మగడ్డను రాష్ట్ర ఎన్నికల అధికారిగా నియమించే విషయంలో సానుకూలంగా స్పందించారు. ఎస్ఇసి నియామకం కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని ప్రభుత్వానికి సూచించారు. సుప్రీం కోర్టు హైకోర్టు తీర్పును సమర్ధించడంతోపాటు హైకోర్టు తీర్పుపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు అంగీకరించనందున నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియమించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు.

ఆ ఎంపిక ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కి?

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డను తొలగించిన వ్యవహారంలో దాఖలైన పిటీషన్ లను విచారించిన హైకోర్టు ఎన్నికల కమిషనర్ పదవీ కాలాన్ని తగ్గిస్తూ ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ చెల్లదని చెప్పింది. నిమ్మగడ్డను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా కొనసాగించాలని, ప్రభుత్వం జస్టిస్ కనగరాజ్ ను ఎన్నికల కమిషనర్ గా నియమిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను హై కోర్టు రద్దు చేసింది. హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం అమలు చేయకుండా ఈ తీర్పుపై స్టే ఇవ్వాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. సుప్రీం కోర్టు అందుకు నిరాకరించడంతోపాటు రాజ్యాంగ వ్యవస్థలతో ఆటలాడుకోవద్దంటూ కఠిన వ్యాఖ్యలను చేసింది.

అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మగడ్డను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియమించలేదు. దీంతో నిమ్మగడ్డ హైకోర్టులో మరో పిటీషన్ దాఖలు చేయడంతో విచారించిన హైకోర్టు నిమ్మగడ్డకు గవర్నర్ ను కలిసి పరిస్థితిని విన్నవించాలని సూచించింది. శుక్రవారానికి ఈ వ్యవహారాన్ని తేల్చాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. హై కోర్టు ఆదేశాలతో నిమ్మగడ్డ సోమవారం ఉదయం గవర్నర్ ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. తనను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా కొనసాగించాలని ప్రభుత్వానికి సూచించాలని కోరారు. ఈ అంశంపై పూర్వాపరాలను పరిశీలించిన గవర్నర్ ఎట్టకేలకు నిమ్మగడ్డను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా కొనసాగించాలని హై కోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని ప్రభుత్వానికి సూచించారు.

పవన్ దూకుడు పాలిటిక్స్ కి బ్రేక్?

ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను కొనసాగించేందుకు సరేమిరా అంటున్న జగన్ ప్రభుత్వానికి ఈ వ్యవహారం పెద్ద షాక్ గా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎస్ఇసి వ్యవహారంలో చివరికి నిమ్మగడ్డ పంతమే నెగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. గవర్నర్ ఆదేశాలు ప్రజాస్వామ్య విలువలను కాపాడే విధంగా ఉన్నాయని టిడిపి నాయకులు చెబుతున్నారు. గవర్నర్ ఆదేశాలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏం నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే, హై కోర్టు ఆదేశాల ప్రకారం శుక్రవారం లోగా ఈ అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుని కోర్టుకు వివరించాల్సి ఉంది

బాలయ్య సినిమాలో భారీ మార్పులు !


ప్లాప్ లకు కేరాఫ్ ఆఫ్ అడ్రెస్ అనే ముద్ర నుండి నందమూరి బాలకృష్ణకు సింహాతో విముక్తి కలిగించిన డైరెక్టర్ బోయపాటి శ్రీను. హిట్ వాసన లేక డీలా పడ్డ నట సింహానికి హిట్ ఇచ్చి.. సినిమాల్లో బాలయ్యకు మళ్ళీ మార్కెట్ తెచ్చిన ఘనత కచ్చితంగా బోయపాటికే దక్కుతుంది. కాగా ఈ మాస్ డైరెక్టర్ దర్శకత్వంలో బాలయ్య ప్రస్తుతం ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం టీజర్ కూడా రిలీజ్ అయింది. టీజర్ కు ఎవరేజ్ టాక్ వచ్చింది. అయితే బాలయ్య అభిమానులకు మాత్రం టీజర్ బాగా నచ్చిందనుకోండి. కాగా ఈ సినిమా స్క్రిప్ట్ లో లేటెస్ట్ గా కొన్ని మార్పులు చేశారు. సినిమాలో బాలయ్య సరసన ఇద్దరు హీరోయిన్స్ ఉండగా.. ఇప్పుడు ఒక హీరోయిన్ తాలూకు పార్ట్ ను తీసేసారు. అలాగే సాంగ్స్ ను కూడా తగ్గించారు. రెండు సాంగ్స్ తొలిగించారు. కరోనా రావడం, షూటింగ్ పోస్ట్ ఫోన్ అవ్వడంతో బోయపాటి మళ్ళీ స్క్రిప్ట్ వర్క్ చేస్తూ ఈ మార్పులు చేశారు.

కరోనా రాకుండా స్టార్ హీరో ఇంటికి ప్లాస్టిక్‌ కంచె

ఇక ఈ సినిమాలో బాలకృష్ణ రెండు పాత్రల్లో కనిపించనున్నారని అందులో ఒక పాత్ర, అఘోరా పాత్ర అని సోషల్ మీడియాలో గత కొన్ని నెలలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో ఎలాంటి అఘోరా నేపథ్యం లేదని, కేవలం ఈ సినిమా ఎమోషనల్ బ్యాక్ డ్రాప్ లో సాగే పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్ అని బోయపాటి టీమ్ లోని సభ్యులు చెబుతున్న తాజా అప్ డేట్. అలాగే సినిమాలో ఎలాంటి రాజకీయ నేపథ్యం కూడా లేదట, కొన్ని పోలిటికల్ డైలాగ్స్ ఉన్నా, అవి అభిమానులను దృష్టిలో పెట్టుకుని మాటలు రచయిత ఎమ్ రత్నం రాశారట.

మెగాస్టార్ భయం అదే.. కానీ దానికే ఫిక్స్ !

ఇక బాలయ్య ప్లాప్ ల పరంపరతో పాటు బోయపాటి ఖాతాలో పడిన ‘వినయ విధేయ రామ’ అనే భారీ డిజాస్టర్ కూడా ఇప్పుడు వీళ్ళు చేస్తున్న సినిమా మార్కెట్ పై పడనుంది. ఇంతకుముందు వీరి కలయికలో వచ్చిన ‘సింహ, లెజెండ్’ లాంటి భారీ విజయాలు ఉన్నా.. ఆ సినిమాల సక్సెస్ ఈ సినిమాకి పెద్దగా ప్లస్ అయ్యేలా కనబడటం లేదు. ఇద్దరూ ప్లాప్ ల్లో ఉండటంతో సినిమాకి మైనస్ కానుంది. ఒకవేళ ఈ సినిమా హిట్ అయితే మాత్రం, బాలయ్యకు మరో పదేళ్లు కెరీర్ ఉంటుంది. అన్నిటికంటే ముందు వీళ్ళు హ్యాట్రిక్ హిట్ కొడతారు. మరి ప్లాప్ ల్లో ఉన్న ఈ హిట్ కాంబినేషన్ హిట్ కొట్టాలని ఆశిద్దాం.

ప్రభాస్ తరువాత అతనే.. పాన్ ఇండియా స్టార్ !


సీరియల్ యాక్టర్ నుండి స్టార్ హీరో కావడం అంటే.. అది సామాన్యమైన జర్నీ కాదు, బాలీవుడ్ లో షారుక్ లాంటి టాప్ స్టార్ ఉన్నా, సౌత్ ఇండస్ట్రీలో మాత్రం ఆ క్రెడిట్ ఒక్క కన్నడ రాకింగ్ స్టార్ యశ్ కే దక్కుతుంది. ఒక బస్ డ్రైవర్ కొడుకుగా కెరీర్ స్టార్ట్ చేసిన యశ్, మొదట చాలా చిన్న చిన్న క్యారెక్టర్స్ చేశాడు. అతను ఈ స్థాయికి రావడానికి ఎన్నో ఏళ్ళ కష్టం ఉంది. అయితే యశ్ సినీ జర్నీ కేజీఎఫ్ తో పూర్తిగా మారిపోయింది. షార్ప్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన `కేజీఎఫ్ చాప్టర్- 1` సృష్టించిన సంచలనాలు ఒక్కఎత్తు అయితే, యాక్షన్ నేపథ్యంలో వచ్చిన ఆ సినిమాలో యశ్ నటన మరో ఎత్తు. వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద అద్భుత‌ వసూళ్లు సాధించి యశ్ ను పాన్ ఇండియా స్టార్ ను చేసింది.

ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ తో యశ్ రేంజ్ మరింత పెరగబోతుందట, ప్రభాస్ తరువాత సౌత్ ఇండస్ట్రీ నుండి పాన్ ఇండియా స్టార్స్ నేమ్స్ లో యశ్ పేరే ఉంటుందని బాలీవుడ్ మీడియా కథనాలను రాస్తోంది. నిజానికి ఇప్పటివరకూ బాహుబలి తరువాత ఆ స్థాయిలో హిందీ ప్రేక్షకులను ఆకట్టుకున్న సినిమా కేజీఎఫ్ నే. ఇప్పుడు ప్రశాంత్ నీల్ పార్ట్ 1 కంటే భీభత్సమైన రీతిలో సీక్వెల్ ను తెరకెక్కిస్తున్నాడని.. సినిమా బడ్జెట్ ను కూడా ఆ స్థాయిలొనే ఖర్చు పెడుతున్నాడని ఈ సినిమా గురించి బాలీవుడ్ మీడియా ప్రొజెట్ చేస్తుంది. పైగా ఈ సినిమాకి బాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ ఉంది. అందుకు కారణం సినిమాలో విలన్ గా సంజయ్ దత్ నటిస్తుండటంతో ఈ సీక్వెల్ కి హిందీలో మంచి డిమాండ్ రావడానికి హెల్ప్ అయింది.

ఇక సంజయ్ దత్ కి సంబంధించిన పార్ట్ ను ఇప్పటికే షూట్ చేసి, ఎడిటింగ్ చేయడం కూడా పూర్తయిందని.. సంజయ్ దత్ సీన్స్ అన్ని అద్భుతంగా వచ్చాయని.. సినిమా మొత్తంలోనే అధీరా క్యారెక్టర్ యాక్షన్ కే హడల్ పుట్టించేలా సాగుతోందని తెలుస్తోంది. నిజంగానే సంజయ్ దత్ పాత్ర అంత అద్భుతంగా వస్తే.. కేజీఎఫ్ 2కు హిందీ జనం నీరాజనాలు పలకడం ఖాయం. అప్పుడు ఆ సినిమాకి వచ్చే అఖండ విజయం యశ్ ఖాతాలో పడుతుంది. అతన్ని పాన్ ఇండియా స్టార్ గా ప్రమోట్ అవుతాడు. మరి ఇవ్వన్నీ జరగాలంటే.. కరోనా తగ్గాలి, థియేటర్లు ఓపెన్ అవ్వాలి. ఇంతకీ కేజీఎఫ్ అంటే మీనింగ్.. కోలార్ బంగారు గ‌నులు. ఆ గ‌నుల‌ పై ప్ర‌పంచ మాఫియా క‌న్ను ఎలా ఉండేది అన్న‌ దానినే సినిమాగా చేస్తున్నారు. హోంబలే ఫిలింస్ సంస్థ అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తోంది.