Homeఆంధ్రప్రదేశ్‌బోగాపురం పరిసరాల్లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్..!

బోగాపురం పరిసరాల్లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్..!

Executive Capital of AP
మూడు రాజధానుల్లో భాగంగా విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం అక్కడ రాజధానికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన దిశగా చర్యలను వేగవంతం చేసింది. విశాఖ నగరంలో భూముల లభ్యత సమస్య ఉండటంతో విశాఖ-విజయనగరం జిల్లాల మధ్య ఉన్న ప్రాంతంలో రాజధాని నిర్మించేందుకు జనగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చకచకా అడుగులు వేస్తుంది. చట్టపరంగా ఉన్న అడ్డంకులు ఎట్టిపరిస్థితిలో తొలగిపోతాయని గట్టినమ్మకంతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం రాజధానికి అవసరమైన అన్ని ప్రణాళికలు సిద్ధం చేసింది. బోగాపురం విమానాశ్రయం కోసం టిడిపి ప్రభుత్వం జిఎంఆర్ సంస్థకు 2,700 ఎకరాలను కేటాయించింది. ఈ భూముల్లో 500 ఎకరాలను ప్రభుత్వం వెనక్కి తీసుకుని మిగిలిన భూముల్లో విమానాశ్రయం నిర్మాణానికి జిఎంఆర్ కు అనుమతి ఇచ్చింది.

Also Read: రాయలసీమపై జగన్ ప్రేమకు మరో తార్కాణం!

విమానాశ్రయం భూముల నుంచి తీసుకున్న 500 ఎకరాల భూమిలో రాజధానికి అవసరమైన భవనాల నిర్మాణం చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ ప్రాంతానికి ఇప్పటికే రహదారి సౌకర్యం కోసం పనులు జరుగుతున్నాయి. ఈ అభివృద్ధి ప్రణాళికలు రూపకల్పన, అమలు బాధ్యతను గుజరాత్ కు చెందిన హెచ్.సీ.పీ సంస్థకు అప్పగించారు. ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్యకార్యదర్శి ప్రవీణ ప్రకాష్ ఆధ్వర్యంలో ఈ వ్యవహారం అంతా సాగుతుంది. హెచ్.సీ.పీ డైరెక్టర్ బిమల్ పటేల్ తో కలిసి ప్రవీణ్ ప్రకాష్ పలుమార్లు ఎంపిక చేసిన భూముల్లో పర్యటించి చేపట్టాల్సిన అంశాలపై చర్చించారు. ముఖ్యమంత్రి సూచనలకు అనుగుణంగా అక్కడి భవనాల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పన వంటి చర్యలు చేపట్టనున్నారు.

అమరావతిలో రైతుల నుంచి అంత పెద్దమొత్తంలో భూములను రాజధాని కోసం సమీకరించడాన్ని అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ తప్పబట్టారు. రాజధానికి 1,000 నుంచి 1,500 ఎకరాలు సరిపోతుందని అసెంబ్లీలో చర్చ సందర్భంగా వాఖ్యానించారు. ప్రస్తుతం భోగాపురం సమీపంలో ఏర్పాటు చేసే కార్యనిర్వాహక రాజధానిని 1,000 నుంచి 1,500 ఎకరాల్లోనే ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సద్ధం చేసినట్లు తెలుస్తోంది. భోగాపురం విమానాశ్రయ భూములు 500 ఎకరాలు వెనక్కి తీసుకోగా మిగిలిన భూములు రైతుల నుంచి, సమీపంలో ఉన్న ప్రభుత్వ భూములను వినియోగించుకోవాలనే అభిప్రాయంతో ఉన్నారు.

Also Read: జగన్ మూడు రాజధానులకు బీజేపీ వ్యతిరేకమా?

రాజధానికి ఎంపిక చేసిన ప్రాంతంలో మౌలిక సదుపాయాల పనులను విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ చేపట్టింది. భోగాపురంలో నిర్మిస్తున్న ఎయిర్పోర్టు చుట్టు ఉన్న 350 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాజధానిని దృష్టిలో ఉంచుకునే, అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు రూపొందించి పనులు చేపట్టారు. మరోవైపు 140 కిలో మీటర్ల మేర మెట్రో రైల్ ప్రాజెక్టు అక్కడ ఏర్పాటు చేయడానికి కారణం రాజధానిని దృష్టిలో ఉంచుకునే అనేది స్సష్టం అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వ దూకుడు చూస్తుంటే చట్టపరంగా సమస్యలు తొలగేలోపే రాజధానికి అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను కల్పించే విధంగా ఉంది.

 

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
RELATED ARTICLES

Most Popular