Home Blog Page 8377

బీజేపీలోకి మాజీ ఎంపీ రాథోడ్?


తెలంగాణలో బీజేపీ బలపడేందుకు తనవంతు ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ముందుకెళుతోంది. టీఆర్ఎస్ సర్కారుపై దూకుడుగా వెళుతోంది. తెలంగాణలో టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయం అనే సంకేతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. మరోవైపు బీజేపీలోకి ఇతర పార్టీల నేతలను ఆహ్వానిస్తూ జిల్లాలో బలపడేందుకు ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా కాంగ్రెస్ కు చెందిన ఓ మాజీ ఎంపీ బీజేపీలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతుండటం చర్చనీయాంశంగా మారింది.

Also Read: అర్థగంటలోనే కరోనా రిజల్ట్!

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. టీడీపీ నుంచి అంచెలంచెలుగా ఎదిగిన రమేష్ రాథోడ్ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ లో చేరారు. ఖానాపూర్ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఓటమిపాలయ్యారు. దీంతో నాటి నుంచి ఆయన కాంగ్రెస్ కార్యక్రమాలను దూరంగా ఉంటున్నారు. కేవలం సన్నిహితులతో మాత్రం టచ్లో ఉంటున్నారట. దీంతో నాటి నుంచే ఆయన కాంగ్రెస్ ను వీడుతారనే ప్రచారం జరుగుతోంది. తాజాగా మరోసారి ఆయన కాంగ్రెస్ వీడుతారనే చర్చ నడుస్తోంది.

కాగా రమేష్ రాథోడ్ కు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో మంచి పట్టు ఉంది. నార్నూర్ జడ్పీటీసీ నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. 1999లో తొలిసారి ఖానాపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే 2004లో అదేస్థానం నుంచి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత వచ్చిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో పోటీచేసి జడ్పీ చైర్మన్ బాధ్యతలు చేపట్టారు. 2008 ఖానాపూర్ ఉప ఎన్నికల్లో ఆయన భార్య సుమన్ రాథోడ్ ను ఎమ్మెల్యేగా పోటీ చేయించి గెలిపించుకున్నారు. 2009లో ఆదిలాబాద్ ఎంపీగా విజయం సాధించి జిల్లాలో బలమైన నేతగా ఎదిగారు.

ఇక 2014లో టీడీపీకి ప్రతికూల వాతావరణం ఎదురవడంతో ఆ ఎన్నికల్లో ఆయన ఎంపీగా ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరారు. కిందటి ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యే స్థానం కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయితే టీఆర్ఎస్ ఆయనకు సీటు కేటాయించకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ తరపున ఖానాపూర్ ఎమ్మెల్యేగా పోటీచేసి ఓటమిపాలయ్యారు. నాటి నుంచి కాంగ్రెస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈనేపథ్యంలోనే ఆయన భవిష్యత్ రాజకీయ దృష్ట్యా బీజేపీలోకి వెళుతున్నారనే ప్రచారం జరుగుతోంది.

Also Read: కేసీఆర్ తప్పులపై కాంగ్రెస్ మళ్లీ ఫెయిల్?

అయితే రాథోడ్ రాకను బీజేపీ ఎంపీ సోయం బాబురావు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. సోయం బాపూరావు ఆదిమ తెగకు చెందినవాడు. రమేష్ రాథోడ్ లంబాడ తెగకు చెందినవాడు. వీరిమధ్య బీజేపీ అధిష్టానం సయోధ్య కుదిర్చి జిల్లాలో మరింత పట్టుపంచుకునేందుకు ప్రణాళికలు చేస్తోంది. బీజేపీ బలోపేతం దృష్ట్యాలో సోయం బాపూరావుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సర్దిచెప్పినట్లు తెలుస్తోంది. దీంతో బీజేపీలోకి ఆయన రాకకు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. దీంతో త్వరలోనే రమేష్ రాథోడ్ కమలం గూటికి చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. మరీ దీనిపై రమేష్ రాథోడ్ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే..!

ఇంతకీ ఆ గుమ్మడికాయల దొంగ ఎవరు నాగబాబు…?

జనసేన పార్టీ నేత మెగా బ్రదర్ నాగబాబు మళ్ళీ ట్విట్టర్ లో యాక్టివ్ అయ్యారు. ఎన్నికల సమయంలో ఓటు వేసేటప్పుడు ప్రజలు ఎలా ఉండాలో…. జరిగే వాటిని గమనిస్తూ తమ అమూల్యమైన ఓటుని ఎలా వేయాలో గతంలో వివరించిన నాగబాబు ఇప్పుడు మరో ఆసక్తికరమైన వీటిని వేశారు.

తాజాగా నాగ బాబు అడిగిన ప్రశ్న ఏమిటంటే.. తాను చేసిన ట్వీట్ లో గుమ్మడికాయల దొంగ ఎవరు అని అడుగుతున్నారు. నువ్వు చేసిన తప్పును గుర్తించి ఉలిక్కిపడి భుజాలు తడుముకున్నావే గుమ్మడికాయల దొంగ అని నాగబాబు ట్వీట్ వేయడం ఇప్పుడు పెద్ద సంచలనంగా మారింది. అయితే ఇక్కడ నాగబాబు ధైర్యంగా ఎవరి పేరునీ ప్రస్తావించకపోవడం గమనార్హం.

కానీ నాగబాబు ట్వీట్ ను ఒక్కొక్కరికీ ఒక్కోలాగా అర్థమయింది. వైసిపిని ఉద్దేశించి ఆ ట్వీట్ అని కొందరు అంటుంటే…. కాదు కాదు టిడిపి అధినేత చంద్రబాబు ని ఉద్దేశించి చేసిన ట్వీట్ ఇది అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

రాష్ట్రంలో నడుస్తున్న కుల రాజకీయాల పైన నాగబాబు ట్వీట్ వేశాడా…. లేదా టిడిపి-వైసిపి అవినీతి రాజకీయాలను ఆయన ఈ విధంగా ప్రశ్నించారా అన్నది ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్. మరోపక్క నాగబాబు మీద విపరీతమైన ట్రోలింగ్ కూడా జరుగుతుండడం విశేషం. ఇటు టీడీపీ, అటు వైసీపీ.. కలిసి కట్టుగా ఈ దాడికి పాల్పడుతుండడం గమనార్హం.

అదే సమయంలో టీడీపీ శ్రేణులు వైసీపీకి, వైసీపీ శ్రేణులు టీడీపీకి.. నాగబాబు ట్వీట్‌ని అన్వయిస్తుండడం మరో విశేషం. ఎలాగైనా చివరికి ఆ ఇద్దరూ కలిసి జనసేనపై ‘కులం’ పేరుతో, ఇతరత్రా అర్థం పర్థం లేని అంశాలతో జనసేనపై విషం చిమ్ముతున్నారనుకోండి.. అది వేరే సంగతి.

ఎడారి రాజకీయాల్లో కీలక మలుపు.. సొంతగూటికి సచిన్ పైలట్?


ఎడారి రాజకీయాలు చివరి దశకు చేరుకుంటున్నాయి. ఈనెల 14నుంచి రాజస్థాన్లో అసెంబ్లీ నిర్వహించుకునేందుకు గవర్నర్ అనుమతి ఇచ్చిన సంగతి తెల్సిందే. మరో నాలుగురోజుల్లో అసెంబ్లీ సమావేశాలకు ప్రారంభం కానుండటంతో రాజస్థాన్ రాజకీయాలు రసకందాయంలో పడుతున్నాయి. గడిచిన నెలరోజులుగా రాజస్థాన్లో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. సీఎం అశోక్ గెహ్లాట్, డిప్యూటి సీఎం సచిన్ పైలట్ మధ్య నెలకొన్న వివాదాలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సంక్షోభంలోకి నెట్టాయి.

Also Read: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జికీ కరోనా..

సచిన్ పైలట్ తనవర్గం నేతలతో కలిసి సీఎం అశోక్ గ్లెహ్లాట్ పై తిరుగుబాటు చేశారు. స్వతంత్రుల మధ్దతుతో ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి సొంతపార్టీ నేతలే ఝలక్ ఇచ్చారు. సచిన్ పైలట్ బీజేపీ నేతలతో కలిసి తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు యత్నించారని సచిన్ వర్గంపై ఆరోపణలు చేయడంతో వీరిమధ్య వివాదం తారాస్థాయికి చేరింది. కాంగ్రెస్ అధిష్టానం రంగంలోకి దిగిన సచిన్ పైలట్, తనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు ప్రయత్నించినా వారు ససేమిరా అనడంతో రాజస్థాన్లో కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలో పడిపోయింది.

అయితే సీఎం అశోక్ గెహ్లాట్ మాత్రం తనకు పూర్తిస్థాయి మద్దతు ఉందని.. బీఎస్పీ సహా ఇతర పార్టీల ఎమ్మెల్యేలు తనకు మద్దతు ఇస్తున్నారని తొలి నుంచి చెబుతున్నారు. దీంతో బీఎస్పీ అధినేత మాయవతి రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఓటింగ్ నిర్వహిస్తే తమ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఓటేసేలా విప్ జారీ చేసేందుకు రెడీ అవుతున్నారు. దీంతో అలర్టయిన సీఎం అశోక్ గెహ్లాట్ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు శతవిధలా ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ అధిష్టానం కూడా సచిన్ వర్గాన్ని బుజ్జిగించే ప్రయత్నాలు చేస్తున్నాయి.

సచిన్ పైలట్ మాత్రం సీఎం అశోక్ గెహ్లాట్ కు మాత్రమే తాము వ్యతిరేకమని కాంగ్రెస్ పార్టీకి కాదని తేల్చిచెబుతున్నారు. అంతేకాకుండా తాను బీజేపీలో చేరిదిలేదని స్పష్టం చేశారు. ఈనేపథ్యంలోనే సచిన్ పైలట్ తో రాహుల్ గాంధీ మరోసారి సమావేశమైనట్లు ప్రచారం జరుగుతోంది. సోమవారం మధ్యాహ్నం 1.00గంటకు ఢిల్లీలో సచిన్ వర్గంతో రాహుల్ బేటీ అయినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో ప్రియాంకగాంధీ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు రెండుగంటలపాటు పార్టీ భవిష్యత్ తదితర కార్యాచరణపై వీరంతా చర్చించినట్లు తెలుస్తోంది. ఈ బేటిలో సచిన్ పైలట్ ఎట్టకేలకు అధిష్టానం బుజ్జగించినట్లు తెలుస్తోంది. ఈమేరకు సచిన్ పైలట్ వర్గంతో సీఎంకు రాజీ కుదిర్చినట్లు ప్రచారం జరుగుతోంది.

Also Read: ట్రైన్ ప్రయాణానికి 9 రూల్స్!

ఇదిలా ఉంటే బీజేపీ అధిష్టానం కాంగ్రెసులో నెలకొన్న సంక్షోభాన్ని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తుంది. సచిన్ పైలట్ వర్గాన్ని తనవైపు తిప్పుకునేందుకు పావులు కదుపుతోంది. అయితే బీజేపీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు అదృశ్యమైనట్లు తెలుస్తోంది. అశోక్ గెహ్లాట్ తమ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేస్తున్నాడని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరో నాలుగు రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు ఉండటంతో రాజస్థాన్ రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. అయితే రాజస్థాన్ రాజకీయ చదరంగంలో ఎవరు పైచేయి సాధిస్తారు? ఎవరు పావులుగా మారుతారనేది ఆసక్తికరంగా మారింది. ఇక రాహుల్ రాయబారం ఏమేరకు ఫలించిందనేది మాత్రం ఆగస్టు 14తో తేలిపోవడం ఖాయం కన్పిసుంది.

షూటింగ్ చేసేముందే ఆలోచించుకోండి !


టాలీవుడ్ లో ఇప్పుడు ఎవర్ని కదిలించినా వచ్చే నెల నుండి షూటింగ్ అనే మాటే వినిపిస్తోంది. కానీ మరోపక్క కరోనా మహమ్మారి తీవ్రత ఇంకా రోజురోజుకు విచ్చలవిడిగా పెరుగుతూనే ఉంది. సినిమా రంగంలోని పేదలు కరోనాతో తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటూనే ఉన్నారు. అయితే షూటింగ్ లు ఇప్పటికిప్పుడు స్టార్ట్ చేస్తే రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో.. ఒకవేళ సినీ కార్మికులకు కరోనా వస్తే..? రాకుండా పెద్ద నిర్మాతల దగ్గర నుండి చిన్న నిర్మాతల వరకూ ఎక్కువ జాగ్రతలు తీసుకోవాలి. తీసుకున్నా కరోనాను ఆపగలమా ? దీనికి తోడు ప్రొడక్షన్ కాస్ట్ కూడా ఎక్కువ అవుతుంది.

Also Read: రెమ్యునిరేషన్ పెంచితే న్యూడ్ సీన్స్ కైనా రెడీ !

అసలు ఇంత ఖర్చు పెట్టి సినిమా తీసినా సినిమా రిలీజ్ ఇప్పట్లో కాదు కదా.. మరి షూటింగ్ ఎందుకు చేయడం. పైగా షూటింగ్స్ అంటే వందలమందితో చేయాల్సిన పని. కరోనా రాకుండా అరికట్టే మార్గదర్శకాలను షూటింగ్ స్పాట్లో తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వాలు స్పష్టం చేసినా.. అది అసాధ్యం. షూటింగ్స్ లో భౌతికదూరం పాటించడం కుదరదు. ఈ క్రమంలో సినీ కార్మికులకు ఒకవేళ కరోనా సోకితే.. సినిమా పక్షులు కృష్ణ నగర్ కష్టాలతో పాటు కరోనా కష్టాలు కూడా అనుభవించాల్సి వస్తోంది. మరి షూటింగ్స్ తెగ తాపత్రయం పడుతున్న హీరోలు, దర్శకనిర్మాతలు సినీ కార్మికులకు కరోనా సోకితే ఆదుకుంటారా ?

Also Read: కరోనా – బాలయ్య మధ్యలో బోయపాటి !

ఏమో.. అప్పుడు ఎవ్వరూ కనిపించకపోతే.. చివరికీ బలి అయ్యేది సినీకార్మికులే కదా. హీరోలకు దర్శకనిర్మాతలకు కరోనా వచ్చినా వారు సేఫ్ గానే ఉంటారు. అదే పేదలకు వస్తే.. అది తీవ్రంగా వస్తే.. చావును ఆపడం పేదల వల్ల కాదు కదా. మరి షూటింగ్ లను మొదలు పెట్టాలనుకుంటున్న హీరోలు నిర్మాతలు సినీ కార్మికులకు ఎలాంటి భరోసాని ఇస్తారో కరోనా విషయంలో వాళ్ళు ముందుగానే ఆలోచించుకుని షూటింగ్స్ ను స్టార్ట్ చేసుకుంటే బెటర్.

చిన్న నిర్మాతల పరిస్థితి మరీ ఘోరం !


యావత్తు సినీ లోకం కరోనా వైరస్ కారణంగా అగమ్యగోచరంలో పడిందనేది వాస్తవం. ప్రస్తుతం టాలీవుడ్‌ లో కరోనా కారణంగా దాదాపు 80 సినిమాలు ఆగిపోయాయట. 80 సినిమాలు అంటే.. సుమారు వేలమంది ఉపాది పోయినట్లే. తాజాగా ఇండిస్ట్రీ వ‌ర్గాలు లెక్కల ప్రకారం వందల కోట్ల రూపాయల వరకూ పెట్టుబడులు కరోనా కోరల్లో ఇరుక్కుపోయాయి. ప్ర‌తి ఏటా టాలీవుడ్ లో సుమారు 200 సినిమాలకు పైగా తెరకెక్కుతాయనేది అందరికీ తెలిసిందే. అయితే ఆ సినిమాల్లో సగంకు పైగా చిన్న సినిమాలే. చిన్న నిర్మాతలు ఫైనాన్స్ తెచ్చి ఈ సినిమాలను చేస్తారు.

Also Read: మాజీ మిస్ ఇండియా వరల్డ్ కు కరోనా.. ఆందోళనలో ఫ్యాన్స్

ఇప్పుడు ఈ చిన్న నిర్మాతల పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. చేసిన అప్పులు కట్టాల్సిందే అనేది అప్పు ఇచ్చిన వారి డిమాండ్. కానీ ఆ అప్పుల కట్టే అవకాశం లేదు. బాగున్నా సినిమాకి తరువాతైనా డబ్బులు వస్తాయి. మరి ప్లాప్ సినిమాకి ? ఆ నిర్మాతలకు టీ డబ్బులు కూడా రావు. ఇప్పుడు వారి పరిస్థతి ఏమిటో ? పాపం వారి నష్టాలు ఎంత మేర ఉంటాయనేది ఇప్పుడే అంచనా వేయలేమ‌ని.. సినిమాలు రిలీజ్ అయితే గాని క్లారిటీ రాదు.

ఇది పరిశ్రమకు పెద్ద దెబ్బగా మిగలబోతుంది. చిన్న నిర్మాతలు ఇక సినిమాలు చేయాలంటే భయపడే పొజిషన్. ఇఫ్పటికిప్పుడు సినిమా హాళ్ళకు అనుమతులు ఇవ్వటం సాధ్యమైయ్యే పని కాదు, ఇచ్చినా సినిమాని రిలీజ్ చేయడానికి మళ్ళీ అప్పు చేయాలి.

Also Read: రెమ్యునిరేషన్ పెంచితే న్యూడ్ సీన్స్ కైనా రెడీ !

వీరి నష్టం ఒకెత్తు అయితే, దీనికి తోడు పరిశ్రమ పై ఆధారపడిన, వివిధ శాఖ‌ల్లో పనిచేసే సుమారు పది వేల మంది వరకు ఉపాధి కోల్పోయి నానా ఆగచాట్లు పడుతున్నారు. మ‌రి ఈ క‌రోనా కాలం ఎప్పుడు ముగుస్తుందో, సినిమా కాలం ఎప్పుడు మొద‌ల‌వుతుందో గాని సినీ ప్రపంచాన్ని కరోనా కుదిపేసింది.

‘జగన్ గారూ… మనం వరస్ట్?’ అటగా..!

Jagan

కరోనా వైరస్‌ ను కట్టడి చేయడంలో ఏపీ రాష్ట్రం వరస్ట్ అంటూ ఓ ఆంగ్ల పత్రిక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ప్రస్తుతం ఏపీలో ప్రతి రోజూ నమోదవుతున్న కేసుల తీరు చూస్తుంటే త్వరలోనే భారత్‌ ను కరోనా కేసుల్లో మొదటి స్థానానికి చేర్చే అవకాశం ఉన్నట్టుగా ఉందని పేర్కొంది.

అంతేకాకుండా, అమెరికా, బ్రెజిల్‌ తర్వాత ఏపీలోనే కొత్త కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయని.. ప్రపంచంలోని అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో ఒకటిగా మారిందని ఆ ఆంగ్ల పత్రిక తన తాజా ప్రత్యేక కథనంలో పేర్కొంది.

పరిపాలనలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కు ప్రముఖ ఆంగ్ల పత్రిక మూడో ర్యాంకు ఇచ్చిందంటూ ఆయన సొంత పత్రిక పతాక శీర్షికన ప్రచురించింది. కానీ కరోనా విషయానికి వస్తే రాష్ట్రం గడ్డు పరిస్థితిలో ఉందని.. ఇదే కొనసాగితే రాబోయే రోజుల్లో దేశంలోనే నంబర్‌ వన్‌ గా మారుతుందని.. ప్రస్తుతం ప్రపంచంలో మూడో స్థానంలో ఉన్న భారతదేశాన్ని.. ప్రథమ స్థానానికి తీసుకెళ్తుందని అదే ఆంగ్ల పత్రిక పేర్కొంది.

కరోనా విషయంలో తొలుత రాష్ట్రం స్థానికం నుంచి జాతీయ స్థాయికి.. ఇప్పుడు ప్రపంచ స్థాయికి చేరుకుందని తెలిపింది. కట్టడి జోన్లను ప్రకటించినా.. అక్కడ వైరస్‌ నియంత్రణ చర్యలు లేవు. ప్రతి ఒక్కరినీ పరీక్షించకపోవడం .. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారిని నిలువరించి ప్రత్యేక పరీక్షలు చేపట్టకపోవడమూ రాష్ట్రంలో కరోనా వైరస్‌ తీవ్రతను పెంచేసిందని వివరించింది.

రామోజీ మెడకు మళ్లీ ‘మార్గదర్శి’ ఉచ్చు

Ramoji rao enters the business again


ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు మెడకు మరోసారి ‘మార్గదర్శి’ ఉచ్చు పడింది. ఈ ఫైనాన్షియల్ సంస్థలో అక్రమ డిపాజిట్ల సేకరణ వ్యవహారంలో హైకోర్టులో చాకచక్యంగా విచారణ కొట్టివేయబడింది. కానీ ఇప్పుడు మార్గదర్శి అధినేత రామోజీరావుకు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది.

Also Read: ‘ఈనాడు’తో లాభం లేదనుకుంటున్న రామోజీ?

నిజానికి ఈ కేసు నాడు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో రాజకీయ ప్రత్యర్థులపై అప్పటి రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తో కలిసి వేయించిన కేసు. ఆ కేసులో ఆ తర్వాత హైకోర్టులో రామోజీరావు కొట్టివేసేలా చేసుకున్నారు. ఈ కథ ఇక్కడితో ముగిసిందని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు ఉండవల్లి మరోసారి అనూహ్యంగా తిరగదోడడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా అక్కడ సీఎం జగన్, ఇక్కడ కేసీఆర్ లు ఈనాడు సంస్థపై, అధినేత రామోజీరావు రాతలపై ఆగ్రహంగా ఉన్న వేళ ఈ కేసులు మళ్లీ మొదటికి రావడం రాజకీయంగా వేడెక్కించింది.

వైఎస్ఆర్ హయాంలో రాజమండ్రి ఎంపీగా ఉన్న ఉండవల్లి మార్గదర్శి వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చి కోర్టును ఆశ్రయించాడు. అయితే ఈ కేసును అప్పట్లో హైకోర్టు కొట్టివేసింది. తిరిగి ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసును సవాల్ చేస్తూ సుప్రీంను తాజాా ఆశ్రయించారు.తాజాగా మార్గదర్శి కేసులో రామోజీరావు, మార్గదర్శి ఫైనాన్షియర్లకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మాజీ ఐజీ కృష్ణంరాజును ఇంప్లీడ్ చేసేందుకు అనుమతినిచ్చింది.

గతంలో ఆర్బీఐ చట్టం సెక్షన్ 45 ( ఎస్) నిబంధనలు వర్తించవని రామోజీ రావు చేసిన వాదనలతో అంగీకరించి ఉమ్మడి హైకోర్టు విభజన రోజున ఈ కేసును కొట్టివేసింది. గోప్యంగా ఉంచిన ఉమ్మడి హైకోర్టు తీర్పును ఆలస్యంగా గ్రహించిన ఉండవల్లి.. తాజాగా కోర్టును ఆశ్రయుంచారు. 266 రోజుల పాటు జరిగిన జాప్యాన్ని మన్నించాలని కోరుతూ సుప్రీం కోర్టు ను ఆశ్రయించారు.

Also Read: అర్థగంటలోనే కరోనా రిజల్ట్!

ఈ రోజు రామోజీరావుకు, మార్గదర్శి ఫైనాన్సియర్స్ కు, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలకు, కృష్ణంరాజు కు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది.ఈ నోటీసులకు లిఖిత పూర్వక సమాధానాలు దాఖలు చేసిన తర్వాత తదుపరి విచారణ చేపడుతామని సుప్రీం కోర్టు పేర్కొంది.

ఈ క్రమంలోనే రామోజీపై కొద్దికాలంగా ఎక్కడ దొరుకుతాడని భావిస్తున్న ఏపీ సీఎం జగన్ ఇందులో కీలకపాత్ర పోషించే అవకాశాలు లేకపోలేదు అని రాజకీయ వర్గాలంటున్నాయి. ఇక కేసీఆర్ కూడా నజర్ పెడితే ఈ కేసులో మరిన్ని చిక్కులు రామోజీకి తప్పవని అంటున్నారు. మొత్తంగా హైకోర్టులో సమసిపోయిన ‘మార్గదర్శి’ కేసు సుప్రీంలో మరోసారి విచారణకు రావడం రామోజీకి గుదిబండగా మారింది.

మాజీ మిస్ ఇండియా వరల్డ్ కు కరోనా.. ఆందోళనలో ఫ్యాన్స్


ప్రముఖ బాలీవుడ్ నటి, మాజీ మిస్ ఇండియా వరల్డ్ నటాషా సూరికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ప్రకటించింది. ఈనెల మొదట్లోనే ఆమె పూణేకు వెళ్లింది. అక్కడి నుంచి ఇటీవలే ముంబై తిరిగొచ్చాక అనారోగ్యానికి గురికావడంతో కరోనా టెస్టు చేయించుకుంది. ఇందులో ఆమె పాజిటివ్ అని తేలినట్లు తెలిపింది. దీంతో హోం ఐసోలేషన్లో ఉంటున్నట్లు పేర్కొంది.

Also Read: రూ. 200 కోట్లతో ఎన్టీఆర్ మూవీ?

తన కుటుంబ సభ్యులు కూడా తాజాగా అనారోగ్యం పాలవడంతో వారికి కూడా కరోనా టెస్టులు వైద్యులు నిర్వహించారని తెలిపింది. ఇంకా ఆ రిపోర్టులు రావాల్సింది ఉందని చెప్పింది. వారంతా కూడా హోం ఐసోలేషన్లో ఉంటూ చికిత్స పొందుతున్నారని వెల్లడించింది. అలాగే తనతో ఇటీవల సన్నిహితంగా ఉన్నవారంతా కరోనా టెస్టులు చేయించుకోవాలని సూచించింది.

నటషా సూరి 2006 సంవత్సరంలో ఫేమినా మిస్ ఇండియా వరల్డ్ కిరిటాన్ని గెలుచుకుంది. 2005లో మిస్ మహారాష్ట్ర, నేవీ క్వీన్ గా నిలిచింది. అదేవిధంగా 2004లో గెట్ గార్జియల్ విజేతగా నిలిచింది. 2006లో మిస్ ఇండియా వరల్డ్ కిరిటాన్ని సొంతం చేసుకోవడంతోపాటు మిస్ బ్యూటీఫుల్ స్మైల్, మిస్ పర్సనాలిటీ అవార్డులను సొంతం చేసుకుంది. అదే సంవత్సరం మిస్ వరల్డ్ సెమీ ఫైనలిస్టుగా, మిస్ బెస్ట్ బాడీ(3వ స్థానం), ఉత్తమ డిజైనర్ గౌన్, మిస్ టాలెంట్ (టాప్-5)లో చోటు దక్కించుకుంది.

2016లో వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. మలయళ కామెడీ మూవీ ‘కింగ్ లయర్’ మూవీతో చిత్రసీమలోకి ఎంట్రీ ఇచ్చింది. సినిమాల్లోకి రాకముందే నటషా సూరి టెలివిజన్ రంగంలో అనేక షోలకు హోస్టుగా చేసింది. ఇక పలు అంతర్జాతీయ, జాతీయ సంస్థల డిజైనర్ కంపెనీల తరపున అనేక ర్యాంపు షోల్లో పాల్గొంది. బాలీవుడ్ లో బా బా బ్లాక్ షీప్, వర్జిన్ భానుప్రియ సినిమాల్లో నటించింది. తాజాగా ‘డెంజరస్’ మూవీలో బిపాషా బసు, కరణ్ సింగ్ గ్రోవర్ తో కలిసి నటించింది.

Also Read: వెంకీ కాదన్న రీమేక్‌లో అడవి శేష్!

అయితే తాను ‘డెంజరస్’ ప్రమోషన్లలో పాల్గొనాల్సి ఉందని.. అయితే అనారోగ్య కారణాల రీత్య తాను పాల్గొనడం లేదని స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టు కోసం తాము చాలా కష్టపడ్డామని అయితే కరోనా కారణంగా ఇంటికే పరిమితం కావాల్సి వచ్చిందని వాపోయింది. త్వరలోనే రికవరీ అవుతాననే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. నటాషాకు కరోనా సోకిందనే విషయం తెలియడం ఆమె ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. త్వరగా ఆమె కరోనా నుంచి కోలువాలని దేవుడిని ప్రార్థిస్తున్నారు.

రెమ్యునిరేషన్ పెంచితే న్యూడ్ సీన్స్ కైనా రెడీ !

హాట్ బ్యూటీ ‘హెబ్బా పటేల్‘ చిన్న సినిమాలతోనే పెద్ద హీరోయిన్ రేంజ్ స్టార్ డమ్ ని తెచ్చుకున్నా ఎంతో కాలం ఆ స్టార్ డమ్ నిలుపుకోలేకపోయింది. అదృష్టం కలిసి వచ్చి తక్కువ టైంలోనే ఎక్కువ సినిమాలు చేసినా, పెద్దగా కెరీర్ ను బిల్డ్ చేసుకోలేకపోయింది. ప్రసుతం ఏ క్యారెక్టర్ దొరికితే అది చేస్తోంది. కాగా తాజాగా ఓ వెబ్ సిరీస్ లో కూడా అమ్మడు నటించబోతుంది.

Also Read: రూ. 200 కోట్లతో ఎన్టీఆర్ మూవీ?

ఆహా డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ ఫామ్‌ కోసం ఒరిజినల్ షోలు మరియు చిన్న చిత్రాలను నిర్మించే ప్లాన్ లో భాగంగా అల్లు అరవింద్, విరాటపర్వం దర్శకుడు వేణు ఉడుగులతో ఓ వెబ్ సిరీస్ ను ప్లాన్ చేశాడు. అయితే, వేణు ఈ ప్రాజెక్ట్ కోసం దర్శకత్వం వహించట్లేదు. కేవలం నిర్మాణ బాధ్యతలు మాత్రమే చూసుకుంటున్నాడు. కాగా వేణు రాసిన ఈ స్క్రిప్ట్ మెయిన్ క్యారెక్టర్ లో ‘హెబ్బా పటేల్’ను తీసుకోబోతున్నారు.

హై లెవల్ లైఫ్ స్టయిల్ కు అలవాటు పడిన ఓ మిడిల్ క్లాస్ అమ్మాయి తన ఆర్థిక అవసరాల కోసం వ్యభిచార కూపంలో ఇరుక్కుని.. అనేక చీకటి రాత్రులు చెప్పుకోలేని ఇబ్బందులు పడి తిరిగి ఆ వ్యభిచార ఉచ్చులో నుండి ఎలా బయట పడిందనేదే మెయిన్ కాన్సెప్ట్. అన్నట్టు ఈ వెబ్ సిరీస్ లో సెమీ న్యూడ్ సీన్స్ కూడా ఉన్నాయట. అయినా, హెబ్బా చేయడానికి ఒప్పుకుంది. రెమ్యునిరేషన్ పెంచితే న్యూడ్ సీన్స్ కు కూడా రెడీ అన్నట్టు హింట్ ఇచ్చిందట ఈ బ్యూటీ.

Also Read: స్టార్ హీరో కుమారుడితో సోషల్ మీడియా బ్యూటీ!

ఇక భవిష్యత్తు మొత్తం డిజిటల్ మీడియాదే.. ఓ వైపు థియేటర్స్ కి ఆదరణ తగ్గిపోతుండగా ఓటిటి ప్లాట్ ఫామ్స్ కి డిమాండ్ పెరుగుతుంది. అందుకే హెబ్బా లాంటి ఖాళీ ఫిగర్లు అందరూ డిజిటల్ యాప్స్ పై పడుతున్నారు. షోలు సినిమాలు అని తేడా లేకుండా తమకున్న ఆ కొద్దీ టాలెంట్ ను జనం పైకి వదలడానికి సర్వత్రా సిద్ధం అవుతున్నారు.

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జికీ కరోనా..


మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తానే ట్వీటర్లో సోమవారం వెల్లడించారు. రెగ్యూలర్ చెకప్ భాగంగా ఆస్పత్రికి వెళ్లగా వైద్యులు అనుమానంతో కరోనా టెస్టులు చేయడంతో ఈ పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన హోం ఐసోలేషన్లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. తనను ఇటీవల కలిసి వారంతా కరోనా పరీక్షలు చేయించుకుని హోం ఐసోలేషన్ కు వెళ్లాలని ఆయన సూచించారు.

Also Read: ట్రైన్ ప్రయాణానికి 9 రూల్స్!

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కరోనా సోకడంతో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఆయనకు ఎవరి వల్ల కరోనా సోకిందనే చర్చ నడుస్తోంది. ఆయనను ఎక్కువగా రాజకీయ ప్రముఖులు, ఇతర రంగాల్లోని సెలబ్రెటీలు ఇటీవల తరుచూ కలుస్తున్నారు. ఈక్రమంలోనే వారి నుంచి ఆయనకు కరోనా సోకి ఉండొచ్చనే టాక్ విన్పిస్తోంది. కాగా ప్రణబ్ వయస్సు 60ఏళ్లు పైబడి ఉండటంతో ఆయన ఆరోగ్యంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవల దేశంలోని సినీ సెలబ్రెటీలు, రాజకీయ నాయకులంతా కరోనా బారినపడి వార్తల్లో నిలుస్తున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ కుటుంబం కూడా కరోనా బారిన పడింది. అమితాబ్ 60ఏళ్లు పైబడినప్పటికీ కరోనాను జయించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఇక అమితాబ్ కోడలు ఐశ్వర్యరాయ్ బచ్చన్, మనవరాలు ఆరాధ్య కూడా కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ సైతం కరోనా నుంచి కోలుకున్నారు.

Also Read: 2000 నోట్లు రద్దు?

అదేవిధంగా రాజకీయ ప్రముఖుల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఇటీవల కరోనా బారినపడ్డారు. వీరితోపాటు పలువురు మంత్రలకు కరోనా బారినపడి పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మధ్యప్రదేశ్, కర్ణాటక ముఖ్యమంత్రులకు సైతం కరోనా పాజిటివ్ వచ్చింది. ఇక పలు రాష్ట్రాల్లోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల‌కు క‌రోనా సోకింది. వీరిలో కొంతమంది మృత్యువాతపడగా మరికొందరు రికవరీ అవుతున్నారు.

అర్థగంటలోనే కరోనా రిజల్ట్!

Telangana

Corona

గ్రేటర్‌ లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(పీహెచ్‌సీలు), అర్బన్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో దాదాపు అన్నిచోట్ల ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షలు చేస్తున్నారు. అర్థగంటలోనే పరీక్షలు నిర్వహించి రిజల్ట్ చెప్పేస్తున్నారు. హైదరాబాద్‌ లో 97, మేడ్చల్‌ జిల్లాలో 79, రంగారెడ్డి జిల్లాలో 20 కేంద్రాల్లో పరీక్షలు కొనసాగుతున్నాయి. 30 నిమిషాల్లోనే ఫలితం చెప్పేస్తున్నారు. పాజిటివ్‌ వస్తే…కరోనా ఉన్నట్లే. లక్షణాలు ఉన్నవారికి ఒకవేళ నెగెటివ్‌ వస్తే మాత్రం అనుమానించాల్సిందేనని వైద్యులే అంటున్నారు. ఇలాంటి వారు తప్పనిసరిగా ఆర్టీ-పీసీఆర్‌ టెస్టు చేయించుకోవాలని సూచిస్తున్నారు. ఈ పరీక్ష ఫలితానికి 2 నుంచి 3 రోజులు పడుతోంది. అందువల్ల ఈ పరీక్షకు పెద్దగా ఆసక్తి చూపడంలేదు. లక్షణాలు తీవ్రమై ఆరోగ్య పరిస్థితి ముదిరాక ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు. ఇలాంటి వారి ఊపిరితిత్తులకు సీటీ స్కాన్‌ చేసి కరోనా ఇన్‌ ఫెక్షన్‌ ఉందా? లేదా? నిర్ధారిస్తారు. కరోనా ఇన్‌ ఫెక్షన్‌ ఉంటే ఆమేరకు చికిత్సలు అందిస్తారు. జ్వరం, గొంతునొప్పి, జలుబు, ఆయాసం, గుండె పట్టేసినట్లు ఉంటే…అన్ని రకాల పరీక్షలు చేయించుకోవడం మేలని వైద్యులు చెబుతున్నారు. 95 శాతం వరకు ఆర్టీ-పీసీఆర్‌ లో తెలుస్తుంది. ఒకవేళ ఈ టెస్టులో నిర్ధారణ కాకపోతే…అప్పుడు ఛాతీ ఎక్స్‌రే, లేదంటే సీటీ స్కాన్‌ చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. చాలా పీహెచ్‌సీల వద్ద ఆర్టీ-పీసీఆర్‌ పరీక్షలు చేయడం లేదు. కేవలం యాంటీజెన్‌లతో సరిపెడుతున్నారు. అవసరమైన వారికి ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లాలని సూచిస్తున్నారు. నెగెటివ్‌ వచ్చింది కదా అని కొందరు నిర్లక్ష్యం వహిస్తున్నారు. రెండు, మూడు రోజుల తర్వాత పరిస్థితి విషమించి ఆర్టీ పీసీఆర్‌ పరీక్షకు వెళుతున్నారు. అక్కడ నిర్ధారణ అయిన వారు అప్పటి వరకు బయట తిరగడం మరికొందరికి కరోనా సోకుతోంది.

పది చోట్ల ఉచితంగానే పరీక్షలు

గ్రేటర్‌ లో దాదాపు పది ప్రభుత్వ ల్యాబ్‌ ల్లో ఆర్టీ-పీసీఆర్‌ పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నారు. నేరుగా వెళితే పరీక్షలు చేయరు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో స్వాబ్‌ లు స్వీకరించి ఆ ల్యాబ్‌ లకు పంపితే పరీక్షలు చేస్తున్నారు. ఐసోలేషన్‌ కేంద్రాలుగా ఉన్న చార్మినార్‌ యునానీ, అమీర్‌ పేటలోని ఆయుర్వేద ఆసుపత్రి, నేచర్‌ క్యూర్‌ లో అనుమానితుల నుంచి స్వాబ్‌లు తీసి ఆర్టీసీ-పీసీఆర్‌ ల్యాబ్‌ లకు పంపిస్తున్నారు. ప్రభుత్వ సంచార వాహనాల్లోనూ, కొన్ని ప్రైవేటు ల్యాబ్‌ లు ఈ పరీక్షలు చేస్తున్నాయి. ప్రైవేటు ల్యాబ్‌ లకు ప్రతి టెస్టుకు రూ.2200, ఇతర ఖర్చులు చెల్లించాల్సి ఉంటుంది.

కరోనా – బాలయ్య మధ్యలో బోయపాటి !


బాలయ్య అంతే.. ఒక్కసారి ఆయన ముహూర్తం పెట్టుకుని ఓ పని చేయాల్సిందే అంటే… ఇక ఎవరు చెప్పినా, ఏం జరిగినా వెనుకడుగు వేయరు. ఇప్పుడు ఇదే పెద్ద బాధ అయిపోయింది బోయపాటి టీంకి. షూటింగ్ ఇప్పుడు వద్దులేండి అంటే.. హే.. కరోనా నన్ను ఏమి చేయలేదు అంటున్నాడట. సరే, మీరు కారణ జన్ములు గనుక మిమ్మల్ని ఏమి చేయకపోయినా.. మమ్మల్ని ఏమైనా చేస్తే అనే అనుమానం వ్యక్తం చేస్తే.. నేను ఉన్నాను కదా కరోనా మీ జోలికి రాదు అన్నాడట. బాలయ్య ఉద్దేశ్యంలో కరోనా కూడా బాలయ్యకు భయపడాలి అన్నమాట. నిజానికి ఈ యవ్వారాన్ని మొత్తం ఒక షార్ట్ ఫిల్మ్ లా తీస్తే మంచి ఫన్ దొరుకుతుంది ఆడియన్స్ కి. ఏది ఏమైనా బాలయ్య షూట్ చేయకుండా ఉండేలా లేడు. కానీ, మిగిలిన నటీనటులు వస్తారా అంటే డౌటే. అసలుకే సంవత్సరం నుండి వెతుకుతున్నా ఇంతవరకూ బాలయ్యకి హీరోయిన్ దొరకలేదు. దొరికినా బాలయ్య అనేసరికి మొహం చాటేస్తున్నారు.

Also Read: స్టార్ హీరో కుమారుడితో సోషల్ మీడియా బ్యూటీ!

ఇప్పుడు బాలయ్య గనుక షూటింగ్.. మనల్ని కరోనా ఏమి పీకలేదు.. కరోనాని నలిపేస్తాను అని తన రెగ్యులర్ సినిమా డైలాగ్ లు చెబితే.. ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు కూడా బాలయ్య సినిమాకి దొరకరు. ఒకపక్క కరోనా మహమ్మారి దెబ్బకు దేశవ్యాప్తంగా సినీ లోకం అల్లాడిపోతోంది. మొత్తం స్తంభించిపోయి షూటింగ్ లన్నీ ఆపేసుకుని కూర్చుంటే.. అరవై ఏళ్ల బాలయ్య మాత్రం షూటింగ్ మొదలుపెట్టడానికి తెగ ఆవేశ పడుతున్నాడు. ఇప్పటికే స్టార్ హీరోలందరూ ఈ సంవత్సరం మొత్తం తమ షూటింగ్ షెడ్యూల్స్ ను మరియు విదేశీ షెడ్యూల్‌ లను పూర్తిగా రద్దు చేసుకున్నారు. అయినప్పటికీ బాలయ్య మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు.

Also Read: రూ. 200 కోట్లతో ఎన్టీఆర్ మూవీ?

సినిమాలోని ప్రీ క్లైమాక్స్ కు వచ్చే ఓ సీక్వెన్స్ ను విస్తృతంగా షూట్ చేయాలి. ఆ సీక్వెన్స్ కథకు చాలా కీలకమైనదట.
అందుకే ఎట్టి పరిస్థితుల్లో ఆ సీక్వెన్స్ ను ఇప్పుడే షూట్ చేసేద్దాం అంటున్నాడు బాలయ్య. బాలయ్యకి ఆ సీక్వెన్స్ బాగా నచ్చిందని.. ఎప్పుడెప్పుడూ ఆ సీక్వెన్స్ లో నటించాలా అని ఎప్పటి నుండో బాగా ఆత్రుతగా ఉంటున్నాడట. మరి ఇప్పుడు బోయపాటి బృందం ఏమి చేస్తోందో.. ఏది ఏమైనా జాగ్రత్తగా డీల్ చేయకపోతే కరోనా ఎఫెక్ట్ కంటే ముందు, వారికి బాలయ్య ఎఫెక్ట్ తగులుతుంది. అన్నట్టు ఈ సినిమాని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనుండగా తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు.

కేసీఆర్ తప్పులపై కాంగ్రెస్ మళ్లీ ఫెయిల్?


తెలంగాణలో కరోనా తీవ్రంగా ప్రబలుతున్న వేళ అవన్నింటిని పక్కనపెట్టి కేసీఆర్ సర్కార్ సచివాలయం కూల్చివేతలో బిజీ అయ్యింది. దీనిపై ప్రజల్లో, ప్రతిపక్షంలో తీవ్ర వ్యతిరేకత వచ్చినా వెనక్కి తగ్గలేదు. ఏకంగా 400 కోట్లకు పైగా రిలీజ్ చేసి కేసీఆర్ సర్కార్ ముందుకెళుతోంది.

Also Read: అడ్డంగా బుక్కయిన కేటీఆర్…! అలా మాట్లాడి ఉండకూడదు

అయితే ఇంతటి కరోనా క్లిష్ట సమయంలో వైద్యసేవలపై దృష్టిసారించకుండా బిల్డింగులు కడుతానంటున్న కేసీఆర్ సర్కార్ వ్యవహారాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సిన కాంగ్రెస్ మాత్రం పిల్లిమొగ్గులు వేస్తోంది. కరెక్ట్ గా గురిచూసి కొట్టకుండా అభాసుపాలవుతోంది. వరుసగా రెండు సార్లు కాంగ్రెస్ కు దెబ్బ పడింది.

మొదటగా.. తెలంగాణ సచివాలయం కూల్చివేతకు మీడియాకు, ప్రజలను అనుమతించకుండా కూలుస్తున్నారని.. జీ బ్లాక్ కింద నిజాం నిధి ఉందంటూ రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించాడు. శాస్త్రీయ ఆధారాలు లేకుండా ఇలా గుప్త నిధులంటూ హైకోర్టును ఆశ్రయించడంపై రేవంత్ కు హైకోర్టు చీవాట్లు పెట్టింది.

Also Read: కేసీఆర్ పై కోపం.. కానీ ఏం చేయలేకపోతున్నారు!

ఇక అది మరిచిపోకముందే తాజాగా మరోసారి సచివాలయం కూల్చివేతలను పరిశీలించేందుకు అనుమతించాలని కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, షబ్బీర్ అలీ, అంజన్ కుమార్ యాదవ్, కొండా విశ్వేశ్వరరెడ్డిలు దాఖలు చేసిన పిల్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే విచారణ కోరే హక్కు ఉంటుంది కానీ.. ఫీల్డ్ లోకి వెళ్లి విచారణ జరిపే అధికారం లేదంటూ హైకోర్టు స్పష్టం చేసింది. ఇలా సచివాలయం కూల్చివేతల పరిశీలనకు అనుమతించాలన్న కాంగ్రెస్ నేతలకు హైకోర్టులో చుక్కెదురైంది.

రెండు సందర్భాల్లోనూ కాంగ్రెస్ నేతలు ఫెయిల్ అయ్యారనే చెప్పవచ్చు. ఎందుకంటే సచివాలయం కూల్చివేతలో ఏదో మతలబు ఉందన్న విషయం బహిరంగ రహస్యమే.. కేసీఆర్ సర్కార్ ఫెయిల్యూర్ ను ఎండగట్టడంలో కాంగ్రెస్ పిల్లిమొగ్గులు వేస్తూ కరెక్ట్ గా వ్యవహరించడం లేదన్న టాక్ రాజకీయవర్గాల్లో నడుస్తోంది.

వెంకీ కాదన్న రీమేక్‌లో అడవి శేష్!


బాలీవుడ్‌ వైవిధ్య నటుడు ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించిన ‘ఆర్టికల్ 15’ చిత్రం హిందీలో ఒక ఊపు ఊపింది. మూవీ రిలీజైన తొలి రోజు నుంచే అద్భుత స్పందన వచ్చింది. విమర్శల ప్రశంసలు అందుకుంది. సమాజంలో కుల వివక్షను ఎత్తి చూపే కథాంశంతో వచ్చిన ఈ మూవీలో ఆయుష్మాన్‌ పోలీస్ ఆఫీసర్ గా నటించాడు. అనుభవ్‌ సిన్హా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ నిర్మించింది. గతేడాది విడుదలై ఘన విజయంతో పాటు పలు పురస్కారాలు అందుకున్న ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చేయబోతున్నారన్న వార్తలు కొన్ని నెలల నుంచి వస్తున్నాయి. ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేశ్‌ బాబు ఈ రీమేక్‌పై ఆసక్తి చూపిస్తున్నారని, ఆయన తమ్ముడు వెంకటేశ్‌ హీరోగా నటిస్తాడన్న టాక్‌ వచ్చింది. అయితే, దీనిపై ఇప్పటిదాకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దాంతో, ఈ రీమేక్‌ ఆలోచనను సురేశ్‌ విరమించుకున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. వెంకీ ఆసక్తి చూపించలేకపోవడంతో ఈ ప్రాజెక్ట్‌ను పక్కనపెట్టినట్టు సమాచారం.

Also Read: స్టార్ హీరో కుమారుడితో సోషల్ మీడియా బ్యూటీ!

కానీ, ఆర్టికల్‌ 15 తెలుగు రీమేక్‌ టాపిక్‌ ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చింది. తాజాగా ఈ మూవీ కోసం టాలెంటెడ్‌ యాక్టర్ అడవి శేష్‌ను సంప్రదించినట్టు తెలుస్తోంది. చిన్న గ్రామంలో కనిపించకుండాపోయిన ముగ్గురు అమ్మాయిల కేసును దర్యాప్తు చేసే క్రమంలో వెలుగు చూసే అనూహ్య ఘటనలే ఆర్టికల్‌15 మూవీ ఇతివృత్తం. ఇలాంటి ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్స్‌ అడవి శేష్‌కు కొట్టిన పిండి. క్షణం, గూఢచారి, ఎవరు చిత్రాల్లో ఇలాంటి పాత్రలే చేశాడతను. దాంతో, ఆర్టికల్‌ 15 తెలుగు రీమేక్‌కు అతనే సరైనోడు అనిపిస్తోంది. అతను ఓకే చేబుతాడా లేదో చూడాలి.

Also Read: రూ. 200 కోట్లతో ఎన్టీఆర్ మూవీ?

శేష్ ప్రస్తుతం మేజర్ సినిమాలో నటిస్తున్నాడు. 26/11 ఉగ్రదాడి సందర్భంగా తన ధైర్య సాహసాలతో హీరోగా నిలిచిన మేజర్ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవిత చరిత్ర ఆధారంగా ఈ మూవీ తెరకెక్కనుంది. సూపర్ స్టార్ మహేశ్‌ బాబు ఈ చిత్రానికి నిర్మాత.

‘ఈనాడు’తో లాభం లేదనుకుంటున్న రామోజీ?


తెలుగు ప్రింట్ మీడియాలో ఈనాడు పేపర్ కు తిరుగులేదంటే అతిశయోక్తి కాదేమో.. ఉదయం లేవగానే ఈనాడులో వార్తలు చూడనిదే చాలామందికి పొద్దుగడవు.. అంతలా ఈనాడు పత్రిక ప్రతీఒక్కరి దినచర్యలో భాగమైంది. అయితే ఇప్పుడు ప్రింట్ మీడియాకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనికితోడు కరోనా ఎఫెక్ట్ తోడవడంతో ప్రింట్ మీడియాకు భారీగా ఆదాయం పడిపోతుంది. దీంతో పెద్ద పత్రికలుగా చెలామణి అవుతున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే తెలంగాణ పేపర్లు ఆదాయ మార్గాలపై దృష్టిసారించాయి. వీటిలో సాక్షి, నమస్తే తెలంగాణ పత్రికలకు ప్రభుత్వాల అండ ఉండటంతో వాటికి ఇప్పట్లో వచ్చే ఇబ్బందేమీ లేదని చెప్పొచ్చు.

Also Read: జగన్, నమ్మకం.. ఓ పోసాని కథ!

ఇక మిగిలింది ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలే. తొలి నుంచి ఈనాడు పత్రికలే తెలుగులో ట్రెండ్ క్రియేట్ చేయడం ఆనవాయితీగా వస్తోంది. మిగిలిన పేపర్లన్నీ గుడ్డిగా ఈనాడును ఫాలో అవుతుంటాయి. రామోజీ రావు ఈనాడులో ఏ సంస్కరణ అవలంభిస్తూదో ఆ వెంటనే ఆంధ్రజ్యోతిలో అమలవుతూ ఉంటుంది. ఈనాడు ప్లానింగ్ నే మక్కికిమక్కి ఆంధ్రజ్యోతి ఫాలో అవుతుందనే టాక్ మీడియా వర్గాల్లో విన్పిస్తుంది. ఇక కొద్దిరోజులుగా ఈనాడు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటుండటంతో ఆయన స్వయంగా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. దీంతో ఉద్యోగుల జీతాల్లో కోతలు, సెలవులపై పంపడం వంటివి జరుగుతున్నాయి. ఇది ఒక్క ఈనాడుకే పరిమితం కాలేదు.. దాదాపు అన్ని మీడియా సంస్థలు ఉద్యోగుల తొలగింపు, జీతాల్లో కోత విధించేందుకు పోటాపోటీ పడుతున్నాయి.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈనాడు నెంబర్ వన్ గా కొనసాగుతోంది. అయితే ఇప్పుడు ఖర్చులు పెరగడం.. ఆదాయం తగ్గడంతో ఈనాడులో సంస్కరణ మొదలయ్యాయి. రానున్న రోజుల్లోనూ ప్రింట్ మీడియా కోలుకునే అవకాశం లేకపోవడంతో రామోజీ రావుకు ఈనాడుపై ఓ నిర్ణయానికి వచ్చారనే ప్రచారం జరుగుతోంది. జిల్లాల్లో ఇప్పుడు ఉన్న యూనిట్లను మెల్లిమెల్లిగా తగ్గిస్తూ రానున్న రోజుల్లో పూర్తిగా ఎత్తేసేందుకే మొగ్గుచూపుతుందట. ఒక్కొ పేపర్ ప్రింట్ కు రూ.18 అవుతుండగా అది మార్కెట్లో రూ.6 అమ్మాల్సి వస్తోంది. రానున్న రోజుల్లోనూ ఆదాయం(టీడీపీ యాడ్స్) వస్తాయన్న నమ్మకం లేకపోవడంతో రామోజీ రావును ఈనాడు ప్రింట్ మీడియాను వదిలించుకునే యత్నం చేస్తున్నారనే టాక్ విన్పిస్తోంది.

Also Read: అడ్డంగా బుక్కయిన కేటీఆర్…! అలా మాట్లాడి ఉండకూడదు

మరోవైపు ఈనాడు ప్రింట్ మీడియాలో ఖర్చులను తగ్గిస్తూ డిజిటల్ రంగంపై ఫోకస్ పెడుతోంది. ఇందులో భాగంగానే ఈనాడుకు ఇప్పటికే ఉన్న ఈనాడు.నెట్, ఈ పేపర్ పై దృష్టిసారించింది. ఈనాడు పేపర్ చదివే వారందరిని డిజిటల్ కు అలవాటు పడేలా చేయనుంది. ఇందులో భాగంగానే నాలుగు నెలల నుంచి ఈనాడు ఆదివారం మ్యాగజైన్.. రోజువారీ ప్రత్యేక పేజీలు కేవలం వెబ్ ఎడిషన్లు మాత్రమే ఇస్తున్నారు. ఈనాడుకు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 10లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. వీరికి నెలవారీ సబ్ స్క్రిప్షన్ ఇచ్చి ఇకపై ఆన్ లైన్లోనే నగదు వసూలు చేసే ప్రణాళికలను చేస్తోంది.

గత నాలుగు నెలల్లో వ్యూస్ కూడా బాగానే వచ్చాయట. దీంతో ప్రింట్ మీడియాను పక్కకు పెట్టి డిజిటల్ వైపే ఈనాడు ఫోకస్ పెట్టింది. అయితే వెబ్ పోటీని ఈనాడు ఏమాత్రం తట్టుకోగలుగుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే ఈటీవీ భారత్ యాప్ తీసుకొచ్చి ఈనాడు దెబ్బతింది. అయితే ఈ-పేపర్, ఈనాడు.నెట్ తోనే ఎన్నిరోజులు వెబ్ మీడియాలో నెట్టుకోస్తారనేదనేది చూడాల్సిందే. ఇప్పటికే ఈనాడు ప్రింట్ మీడియాతో రానున్న రోజుల్లో పెద్దగా లాభం లేదనే రామోజీ దృష్టికి వెళ్లింది. స్వతహాగా వ్యాపారవేత్త అయిన రామోజీ లాభం లేకుండా ఎన్నిరోజులు ఈనాడు ప్రింట్ మీడియాను భుజాన మోస్తారనేది వేచి చూడాల్సిందే..! ఇక ఆయన బాటలో నడిచేందుకు ఇప్పటకే పలు ప్రింట్ మీడియా సంస్థలు సన్నహాలు చేసుకుంటుండటం గమనార్హం.

రూ. 200 కోట్లతో ఎన్టీఆర్ మూవీ?


కన్నడ‌లో యాక్షన్‌ చిత్రాల దర్శకుడిగా ప్రశాంత్‌ నీల్‌కు మంచి పేరుంది. కేజీఎఫ్‌1 తర్వాత అతని పేరు దేశ వ్యాప్తంగా మార్మోగుతోంది. రెండేళ్ల కిందట వచ్చిన ఈ పీరియాడికల్‌ మూవీ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. యశ్‌ హీరోగా నటించిన ఈ చిత్రం అనేక రికార్డులు బద్దలు కొట్టింది. కన్నడనాట రూ. 200 కోట్లు కలెక్ట్‌ చేసిన తొలి చిత్రంగా నిలిచింది. తెలుగు, తమిళ్‌, మలయాళం, హిందీలో కూడా విడుదలై మరెన్నో రికార్డులు బద్దలు కొట్టింది. ప్రస్తుతం కేజీఎఫ్2 పనుల్లో బిజీగా ఉన్నాడు ప్రశాంత్‌. ఇది కూడా భారీ యాక్షన్‌ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, అతనిప్పుడు యాక్షన్‌ మూవీస్‌కు కాస్త విరామం ఇచ్చి వేరే జోనర్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. కేజీఎఫ్‌ 2 తర్వాత టాలీవుడ్‌ యంగ్‌ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తో సినిమాను ఒప్పుకున్నాడు. ఇది మ్యూజిక్‌, డ్యాన్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఉండనుంది. మైత్రీ మూవీ మేక్సర్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. అటు ప్రశాంత్‌, ఇటు ఎన్టీఆర్ ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండడంతో ఇంకా టైటిల్‌ ఖరారు చేయని ఈ మూవీ 2022లో సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. దీన్ని కన్నడతో పాటు తెలుగులో నేరుగా తెరకెక్కించడంతో పాటు పలు భాషల్లో రిలీజ్‌ చేయనున్నారు.

Also Read: స్టార్ హీరో కుమారుడితో సోషల్ మీడియా బ్యూటీ!

ప్రశాంత్‌ నీల్‌ ఇప్పటికే కథ పూర్తిగా చెప్పగా.. ఎన్టీఆర్ బాగా ఇంప్రెస్‌ అయ్యాడట. ఈ మూవీ గురించి ఇప్పుడు ఆసక్తికరమైన విషయం తెలిసింది. ప్రశాంత్‌ నీల్-ఎన్టీఆర్ చిత్రానికి నిర్మాతలు రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌ను కేటాయించారట. 2023లో భారీ స్థాయిలో రిలీజ్‌ చేయాలని ప్లాన్‌ చేశారు. మరోవైపు ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ లో మన్యం వీరుడు కొమరం భీమ్‌గా ప్రేక్షకులను అలరించనున్నాడు. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్ మరో హీరో. ఆలియా భట్‌, ఐరిష్‌ బ్యూటీ ఒలీవియా మోరిస్‌ హీరోయిన్లు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

ట్రైన్ ప్రయాణానికి 9 రూల్స్!

Train journey

కరోనా వ్యాప్తి నేపథ్యంలో రైలు ప్రయాణం పూర్తిగా మారిపోయింది. రైలు ఎక్కాలంటే ఇంతకుముందులా కాదు. చాలా విషయాలు గుర్తుంచుకోవాలి. అనేక రూల్స్ పాటించాలి.

1.ఇ-టికెట్ కన్ఫామ్ అయిన ప్రయాణికులను మాత్రమే రైల్వే స్టేషన్‌ లోకి, రైలులోకి అనుమతిస్తారు. (కర్ఫ్యూ పాస్ అవసరం లేదు). ఇప్పటికీ కొందరు ప్రయాణికులు ప్రోటోకాల్స్ పాటించకపోవడంతో మళ్లీ ఆ ముఖ్యమైన అంశాలను గుర్తు చేస్తోంది రైల్వే. మరి ఆ పాయింట్స్ ఏవో తెలుసుకోండి.

2.ప్రయాణికులు 90 నిమిషాల ముందే రైల్వే స్టేషన్‌ కు చేరుకోవాలి. రైల్వే స్టేషన్‌ లోకి వెళ్లే ముందు థర్మల్ స్క్రీనింగ్ ఉంటుంది. 

3.అన్ని రైల్వే స్టేషన్లలో ప్రయాణికులందరికీ థర్మల్ స్క్రీనింగ్ ఉంటుంది. ఎలాంటి లక్షణాలు లేని ప్రయాణికులను మాత్రమే రైలు ఎక్కేందుకు అనుమతిస్తారు. స్టేషన్లలో ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్స్‌ లో, రైలు కోచ్‌ లల్లో హ్యాండ్ శానిటైజర్లు అందుబాటులో ఉంటాయి. రైల్వే స్టేషన్‌ లోకి వచ్చేప్పుడు, ప్రయాణ సమయంలో మాస్క్ తప్పనిసరి. 

4.ప్రయాణానికి ముందే స్మార్ట్‌ ఫోన్‌ లో ఆరోగ్య సేతు యాప్ డౌన్‌ లోడ్ చేసుకోవాలి.

5.ప్రయాణికులకు లెనిన్, బ్లాంకెట్స్, కర్టైన్లు అందించరు. ప్రయాణికులు వాటిని వెంటతెచ్చుకోవాలి.

6.ప్రయాణికులు ఆహారాన్ని, మంచినీళ్లను కూడా వెంటతెచ్చుకోవాలి.

7.ప్రయాణికులు చాలా తక్కువ లగేజీతో రావడం మంచిది.

8.రైలు ఎక్కేప్పుడు, ప్రయాణంలో సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలి. 

9. వెళ్లే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో హెల్త్ ప్రోటోకాల్స్‌ని ప్రయాణికులు అంగీకరించాల్సి ఉంటుంది.

పైన తెలపబడిన ముఖ్యమైన నియమనిబంధనల్ని ప్రయాణికులకు భారతీయ రైల్వే వివరించింది. 9 అంశాలతో ట్విట్టర్‌ లో పోస్ట్ చేసింది.  రైలు ఎక్కే ముందు ప్రయాణికులు ఆ 9 పాయింట్స్ గుర్తుంచుకోవాలి.. లేకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. భారతీయ రైల్వే గతంలోనే ఇందులో కొన్ని అంశాలను ప్రయాణికులకు వివరించింది.