Home Blog Page 8348

‘మంత్రుల’పై సర్వేలో ఏం తెలిసిందంటే..!


జగన్ కేబినెట్ లో మంత్రులు ఆయన మాట వినడం లేదా అని ప్రశ్నిస్తే లేదనే సమాధానం వినిపిస్తుంది. ఇందుకు కారణం మంత్రుల పనితీరు ముఖ్యమంత్రి జగన్ ఆశించిన విధంగా లేకపోవడంతో పాటు అవినీతికి దూరంగా ఉండమని సీఎం చెబుతుంటే మంత్రులు మాత్రం ఆ ఒక్కటి చెప్పోదన్నట్లుగా వ్యవహరిస్తున్నారంట. ఈ విషయం ప్రభుత్వం నిర్వహించిన సర్వేలోనే వెల్లడైనట్లు సమాచారం. ప్రభుత్వం పీకే కన్సల్టింగ్ వాలంటీర్ సిష్టం సర్వే పేరుతో నిర్వహించిన ఈ సీక్రెట్ సర్వేలో వైసీపీ మంత్రుల తీరుపై ప్రజల్లో తీవ్ర అంసతృప్తి ఉన్న విషయం స్పష్టమైందని పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు.

Also Read: వైసీపీ ఎమ్మెల్యేపై కోర్టుకెక్కిన పార్టీ నాయకులు..!

అంతేకాకుండా ప్రభుత్వ కార్యాలయాల్లో మంత్రుల ఆదిపత్యం, అవినీతి, బంధుప్రీతి ఎక్కువగా ఉందని, ఎమ్మెల్యేలకు, మంత్రులకు మధ్య విభేదాలు, సొంత నియోజకవర్గాలలో సైతం మంత్రులు పట్టు సాధించకపోవడం వంటి అనేక విషయాలు ఈ సర్వేలో వెలుగులోకి వచ్చాయని చెబుతున్నారు. కొద్ది రోజుల కిందట కొందరు మంత్రుల పనితీరుపై సీఎం అసంతృప్తితో ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. వీరిలో ఉపముఖ్యమంత్రి, హోం మంత్రి సుచరిత, పర్యాటక శాఖ మంత్రి అవంతి తదితరులు ఈ జాబితాలో ఉన్నారు.

Also Read: సుప్రీం కోర్టు జగన్ కు షాక్ ఇచ్చింది…! కానీ జగన్ హ్యాపీ

తాజా సర్వేలో మరింత మందిపై ప్రజల్లో అసంతృప్తి ఉందని, ఇది పార్టీకి, ప్రభుత్వానికి సరైంది కాదనే విషయం స్పష్టం చేసినట్లు సమాచారం. ముఖ్యమంత్రి కేబినెట్ ఏర్పాటు చేసిన సమయంలోనే రెండున్నరేళ్ల పాటే మంత్రి పదవుల్లో ఉంటారని అనంతరం 90 శాతం మంది పదవులు కోల్పోతారని తేల్చి చెప్పారు. ఇప్పటికి14 నెలలే పూర్తవడంతో కేబినెట్లో మార్పులు చేయడానికి మరో 16 నెలల గడువు మాత్రమే ఉండటంతో దీపం ఉండగానే ఇల్లు చక్కెబెట్టుకోవాలని కొందరు మంత్రులు తాపత్రయ పడుతున్నారు. మంత్రులపై ప్రజల్లో సదాభిప్రాయం తీసుకురావడానికి సీఎం జగన్మోహన్ రెడ్డి ఏం నిర్ణయాలు తీసుకుంటారు, ఏలా దారిలోకి తెచ్చుకుంటారు అనేది ఇప్పుడు పార్టీ నేతల మధ్య చర్చనీయాంశంగా మారింది.

మరో ఉద్యమం చేపట్టిన రాజధాని రైతులు..!


అమరావతిలోని రైతులు రాజధానికి ఏ మూహూర్తంలో భూములు ఇచ్చరో గాని కొంత కాలంగా వారు ఉద్యమాల పేరుతో రోడ్లకే పరిమితం అవుతున్నారు. అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని 252 రోజులుగా రాజధాని ప్రాంత రైతులు ఉద్యమాన్ని కొనసాగిస్తున్న విషయం విధితమే. తాజాగా మరో ఉద్యమానికి రైతులు చేపట్టారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు ఏటా ప్రభుత్వం కౌలు చెల్లించాల్సి ఉంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో రాజధాని అంశాలకు ప్రధమ ప్రాధాన్యత దక్కేది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం పరిస్థితి తారుమారు అయ్యింది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమయ్యే జూన్ నాటికి కౌలు చెల్లించాల్సి ఉండగా ప్రభుత్వం ఇప్పటి వరకూ కౌలు చెల్లించలేదు.

Also Read: వైసీపీ ఎమ్మెల్యేపై కోర్టుకెక్కిన పార్టీ నాయకులు..!

దీంతో రాజధాని రైతులు మరోమారు ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. విజయవాడలోని సీఆర్డీఏ కార్యాలయంలో కమిషనర్ ను కలిసి కౌలు చెల్లించాలని కోరడానికి రాజధాని గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అయినప్పటీకీ కొందరు సీఆర్డీఏ కార్యాలయానికి చేరుకోవడం అక్కడ మరి కొందరిని అరెస్టు చేసి సింగ్ నగర్ పోలీసు స్టేషన్ కు తరలించారు. వీరికి మద్దతుగా వచ్చిన సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు మధు, రామకృష్ణలను పోలీసులు అరెస్టు చేశారు.

రాజధానిలో 22 వేల మంది రైతులు సుమారు 32 వేల ఎకరాలను రాజధాని నిర్మాణానికి ఇచ్చారు. జరీబు భూములకు రైతులకు ఎకరాకు రూ.50 వేలు, మెట్ట భూముల రైతులకు ఎకరాకు రూ.30 వేలు చొప్పున ఏటా కౌలు చెల్లించాలని ప్రభుత్వం ఒప్పందం, అదే విధంగా కౌలు ఏటా పది శాతం పెంచాల్సి ఉంది. ఏటా కౌలు రూపంలో రూ.189 కోట్లు చెల్లించాల్సి ఉండగా ప్రభుత్వం మూడు నెలలగా రైతులు కౌలు చెల్లించలేదు.

Also Read: సుప్రీం కోర్టు జగన్ కు షాక్ ఇచ్చింది…! కానీ జగన్ హ్యాపీ

కౌలు చెల్లిస్తే రాజధాని తరలింపునకు వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమం మరింత ఉధృతం అయ్యే అవకాశం ఉందని భావిస్తున్న ప్రభుత్వం కావాలనే కౌలు చెల్లింపులో జాప్యం చేస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఇతర సంక్షేమ పథకాలకు రూ.వేల కోట్లు కేటాయిస్తున్న ప్రభుత్వం రాజధాని రైతులకు చెల్లించాల్సిన కౌలు రూ.189 కోట్లు విడుదల చేయడంలో జాప్యం చేయడం పెద్ద విషయమేమీ కాదనేది వీరి భావన.

ప్రభాస్ పెళ్లి.. అందుకే చేసుకోవట్లేదట !


ప్రభాస్.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్.. ఏ బాలీవుడ్ బడా స్టార్ కి చేతగాని ఇంటర్నేషనల్ మార్కెట్ ను క్రియేట్ చేసుకున్న ఏకైక తెలుగు హీరో. తెలుగులో నంబర్ వన్ స్టార్ అనే వార్ జరిగిన ప్రతిసారి.. నంబర్ వన్ తమ హీరోనే అంటూ ఫ్యాన్స్ పోటీ పడేవారు. ఎప్పుడూ ఆ పోటీలో ప్రభాస్ ఫ్యాన్స్ లేరు. బాహుబలి అందించిన అందలంకు ఇప్పుడు పోటీ పడాల్సిన అవసరమే లేదు. ఎవరు నెంబర్ వన్ అనే అనుమానమే లేదు. నిజానికి ప్రభాస్ రేంజ్ ఈ స్థాయికి వెళ్తుందని ఎవ్వరూ ఉహించలేదు. అంతలా ఎదిగిపోయాడు ప్రభాస్. కానీ, ప్రభాస్ ఫ్యాన్స్ కి ఎప్పటినుండో వెలితిగా మిగిలిపోయిన అంశం.. ప్రభాస్ పెళ్లి. సినిమాల పరంగా ఫుల్ జోష్ లో ఉన్న ప్రభాస్.. పర్సనల్ లైఫ్ లో మాత్రం మిగిలిన హీరోలు కంటే.. కాస్త వెనుక పడ్డాడు. మరి ప్రభాస్ ఫాన్స్ కి కాలర్లు ఎగరేసే రోజు రావాలంటే.. అది ప్రభాస్ పెళ్లి రోజే అవ్వాలని సోషల్ మీడియాలో కామెంట్స్ రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి.

Also Read: ‘పుష్ప’ కోసం సుకుమార్ కాపీల గోల !

ఇంతకీ అసలు ప్రభాస్ ఎందుకు పెళ్లి చేసుకోవట్లేదు.. ప్రభాస్ కంటే పదేళ్లు వయసు తక్కువ ఉన్న హీరోలు కూడా పెళ్లి పిల్లలతో హ్యాపీగా సెటిల్ అయిపోతే.. ప్రభాస్ మాత్రం ఇంకా సోలో లైఫ్ సో బెటర్ అనే విధంగా లైఫ్ ను లీడ్ చేస్తున్నాడు. అయితే తాజాగా ప్రభాస్ పెళ్లి పై బాలీవుడ్ మీడియాలో ఒక గాసిప్ వైరల్ గా మారింది. స్వీటీ అనుష్కతో ప్రభాస్ చాలా సంవత్సరాలుగా లవ్ లో ఉన్నాడని.. అయితే కొన్ని కారణాల వల్ల ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిందని.. అందుకే వాళ్ళు పెళ్లికి దూరంగా ఉంటున్నారని.. ఆ కారణంగానే అనుష్క కూడా పెళ్లి చేసుకోకుండా మళ్లీ ప్రభాస్ ప్రేమ కోసం ఎదురుచూస్తుందని ఇలా మొత్తానికి బాలీవుడ్ మీడియా ప్రభాస్ పెళ్లి పై అనేక రూమర్లను ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా అందిస్తోంది.

Also Read: ఆర్జీవీ అనే జీవికి అవేమి పట్టవు !

ఇక ప్రస్తుతం ప్రభాస్ చేతినిండా సినిమాలు ఉన్నాయి. మరో రెండుమూడు ఏళ్ల వరకు తీరిక లేకుండా డేట్స్ ఇస్తేనే.. ప్రభాస్ ఒప్పుకున్న రెండు భారీ పాన్ ఇండియా సినిమాలు పూర్తవుతాయి. ఎందుకంటే ప్రభాస్ ఇప్పుడు చేస్తోన్న ప్రాజెక్టులు అన్నీ బాహుబలిని మించిన ప్రాజెక్టులే. పైగా విజువల్ ఎఫెక్ట్స్ ప్రధానంగా నడిచే సినిమాలు. ప్రస్తుతం ప్రభాస్ చేస్తోన్న రాధేశ్యామ్ కూడా పాన్ ఇండియా మూవీనే. అలాగే ఆ తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మొదలవ్వబోయే సినిమాతో పాటు ఆదిపురుష్ సినిమా కూడా భారీ పాన్ ఇండియా సినిమాలే. ఈ సినిమాలతో ప్రభాస్ ఇంటర్నేషనల్ స్టార్ అయిపోతాడేమో.

కరోనా.. తెలంగాణలో తిరగబడుతుందా?


ప్రపంచం మొత్తం ఇప్పుడు కరోనా చుట్టే తిరుగుతోంది. చైనా నుంచి వచ్చిన ఈ మహమ్మారి ఇప్పుడు అందరినీ కబళిస్తోంది. ప్రజలు, ప్రభుత్వాలు ఇప్పుడు వాటితోనే పోరాడుతున్నాయి. అయితే కరోనా కాటుకు గురైతే ఇక మళ్లీ ఆ మహమ్మారి మన దరిచేరదనే కాన్ఫిడెంట్ అందరు బాధితుల్లో ఉంది. కానీ ఇప్పుడు ట్రెయిన్ రివర్స్ అవుతోంది.

Also Read: సుప్రీం కోర్టు జగన్ కు షాక్ ఇచ్చింది…! కానీ జగన్ హ్యాపీ

అవును.. తెలంగాణలో కరోనా సోకి కోలుకున్న వారిలో మళ్లీ వైరస్ తిరగబడుతుండడం కలకలం రేపుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ పరిణామం చోటుచేసుకోగా.. దేశంలోనూ కేసులు పునరావృతం కావడం కలకలం రేపుతోంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కరోనా నుంచి కోలుకోని మళ్లీ తిరగబెట్టడంతో ఆస్పత్రిలో చేరారు.ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. తెలంగాణలోనూ తాజాగా అలాంటి కేసులు వెలుగుచూడడం విశేషం.

తెలంగాణ ఇద్దరు వ్యక్తులు కరోనా బారిన రెండోసారి పడ్డారని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన 1.11 లక్షల కేసుల్లో రెండు రీఇన్ఫెక్షన్ కేసులు గుర్తించామని మంత్రి చెప్పారు. దీంతో కరోనా సోకిన వ్యక్తికి మళ్లీ వ్యాధి సోకదనే ప్రచారం వట్టి మాట అని మంత్రి వివరించారు.

“తక్కువ యాంటీ బాడీలు ఉన్న వారు మళ్లీ వ్యాధి బారిన పడే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది” అని ఈటల హెచ్చరించారు. తెలంగాణలో కరోనా రెండోసారి సోకే కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. రెండోసారి వచ్చే వారికి లక్షణాలు స్వల్పంగా ఉంటున్నాయని తెలిపారు.
తెలంగాణ ఇప్పటివరకు ఒక్కరోజులో అత్యధిక కేసులు బుధవారం నమోదయ్యాయి. బుధవారం 3,018 కొత్త కేసులు వెలుగుచూశాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,11,688 కు చేరాయి. గత 24 గంటల్లో మరో 10 మంది వైరస్ బారిన పడ్డారు. మొత్తం మరణాల సంఖ్య 780 కు పెరిగింది.

Also Read: కలిసొచ్చిన కాలం.. టీపీసీసీలో ఉత్తమ్ దే రాజ్యం

తెలంగాణలో మరణాల రేటు 0.7-0.8 శాతంగా ఉండగా.. రికవరీ రేటు 76-77 శాతం గా ఉంది. ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణలో పరిస్థితి మెరుగ్గా ఉందని అధికారులు తెలిపారు.

-ఎన్నం

ప్రభాస్‌ హాలీవుడ్‌ ఎంట్రీ?


ఐదేళ్ల క్రితం వరకు ప్రభాస్‌.. టాలీవుడ్‌కు మాత్రమే డార్లింగ్. బాహుబలి రిలీజయ్యాక అతను నేషనల్‌ స్టార్ గా మారిపోయాడు. అనేక భాషల్లో, అనేక దేశాల్లో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. అంతగా ఆడని ‘సాహో’తో సైతం ఆహా అనిపించాడు. ఇప్పుడు వరుసగా మూడు పాన్‌ ఇండియా సినిమాలతో ముందుకు రాబోతున్న ప్రభాస్‌ స్టార్డమ్‌ అమాంతం పెరిగింది. అతని సినిమాల కోసం దేశం మొత్తం ఎదురు చూస్తోంది. వంద కోట్ల పారితోషికం.. ఐదొందల కోట్ల బడ్జెట్‌ మూవీస్‌తో అతను బాలీవుడ్‌ బడా హీరోలను సైతం వెనక్కునెట్టేస్తున్నాడు. తానాజీ ఫేం ఓం రౌత్‌ దర్శకత్వంలో వస్తున్న ‘ఆదిపురుష్‌’ తర్వాత అతను బాలీవుడ్‌లో పాగా వేసే అవకాశం ఉంది.

Also Read: అన్నీ చేసినా.. పెద్దగా సంపాదించలేకపోయాను !

అయితే, మన డార్లింగ్‌ జోరు బాలీవుడ్‌తో ఆగేలా లేదు. అతను హాలీవుడ్‌లో అడుగు పెట్టే అవకాశం కనిపిస్తోంది. రెబల్‌ స్టార్ సక్సెస్, ప్రోగ్రెస్‌ సంతోషంగా ఉన్న అతని పెదనాన్న కృష్ణం రాజు ప్రభాస్… హాలీవుడ్‌ స్టార్ అవడం పెద్ద కష్టమేం కాబోదని అంటున్నారు. ఆదిపురుష్‌ సినిమా గురించి రీసెంట్‌గా మాట్లాడిన ఆయన ప్రభాస్‌ను హాలీవుడ్‌ హీరోగా చూడాలని ఉందంటూ మనసులో మాట బయటపెట్టారు. ‘ప్రభాస్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ స్టార్ కావడం అతనికి పెద్ద పని కాదు. సోషల్‌ ఫాంటసీ కథతో భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని విజువల్ వండర్‌గా రూపొందించాలని ఆదిపురుష్ నిర్మాతలు నిర్ణయించారు. ఈ కథ విన్న ప్రభాస్ చాలా ఇంప్రెస్‌ అయ్యాడు. నేను కూడా ఈ సినిమా కథ విన్నాను, బాగా నచ్చింది. ఖచ్చితంగా చాలా పెద్ద సినిమా కానుంది. ఆదిపురుష్ చిత్రం భారతీయ భాషల్లోనే కాదు హాలీవుడ్‌లో కూడా విడుదల కానుంది. అయోధ్య రామాలయానికి ఇటీవలే పునాదిరాయి వేశారు. ప్రపంచం అంతా ఆ రాముడి కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఆదిపురుష్ తెరపైకి రావడం గొప్ప విషయం’ అని కృష్ణం రాజు పేర్కొన్నారు.

Also Read: బాలయ్య బాబుకు హీరోయిన్ గా జయసుధ !

పెదనాన్న కలను నిజం చేయడం కోసమైనా ప్రభాస్‌ హాలీవుడ్‌పై కన్నేసే అవకాశం ఉంది. హాలీవుడ్ కు దగ్గరయ్యేందుకే అమెరికాలో ఓ విల్లా కొనుగోలు చేయాలని ప్రభాస్‌ భావిస్తున్నాడని సమాచారం. ప్రభాస్‌ ప్రస్తుతం రాధే శ్యామ్ లో నటిస్తున్నాడు. దాని తర్వాత నాగ్‌ అశ్విన్‌తో ఓ సైంటిఫిక్‌ థ్రిల్లర్ మూవీ చేయనున్నాడు.

బైక్, స్కూటర్ కొనుగోలు చేసే వారికి కేంద్రం శుభవార్త…?

మీలో ఎవరైనా బైక్ లేదా స్కూటర్ కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా…? అయితే మీకో శుభవార్త. కేంద్రం త్వరలోనే బైక్, స్కూటర్ ల ధరలను భారీగా తగ్గించనుంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల వాహనదారులకు భారీగా ప్రయోజనం కలగనుంది. ప్రస్తుతం కేంద్రం 28 శాతం జీఎస్టీ విధిస్తూ ఉండటం వల్ల టూ వీలర్లను కొనుగోలు చేసే వారిపై అధిక భారం పడుతోంది. అయితే వచ్చే నెల మూడో వారం జరగబోయే సమావేశం కంటే ముందే కేంద్రం జీఎస్టీ తగ్గించనుందని తెలుస్తోంది.

ద్విచక్ర వాహనాలపై జీఎస్టీ తగ్గింపు వల్ల అమ్మకాలు పెరిగే అవకాశం ఉంది. అయితే కేంద్రం జీఎస్టీ రేటును ఎంత తగ్గిస్తుందనే విషయం మాత్రం తెలియాల్సి ఉంది. కరోనా వైరస్ వ్యాప్తి, లాక్ డౌన్ వల్ల గత కొన్ని నెలలుగా టూవీలర్ల అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. తీవ్ర ప్రతికూల పరిస్థితుల వల్ల వాహన డీలర్లు భారీ నష్టాలను మూటగట్టుకుంటున్నారు. వాహన కంపెనీలకు కూడా నష్టాలు వాటిల్లుతున్నాయి.

ఇలాంటి సమయంలో జీఎస్టీ తగ్గింపు నిర్ణయం వల్ల వాహనాలకు డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుంది. కేంద్రం మరికొన్ని రంగాలకు ప్రయోజనం చేకూరే దిశగా అడుగులు వేయనుందని తెలుస్తోంది. కన్‌స్ట్రక్షన్, ఎయిర్‌లైన్స్, హాస్పిటాలిటీ, రియల్ ఎస్టేట్, హోటల్స్, టూరిజం రంగాలకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరే విధంగా కేంద్రం ముందడుగులు వేయనుంది. సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం అమలు చేస్తున్న ఎమర్జెన్సీ క్రెడిట్ లింక్డ్ గ్యారంటీ పథకంలో కూడా పలు మార్పులు చేయాలని కేంద్రం భావిస్తోందని సమాచారం.

‘పుష్ప’ కోసం సుకుమార్ కాపీల గోల !


క్రియేటివ్ డైరెక్టర్ అని ముందు పేరు వేసుకుని కథలను కాపీ కొడితే దరిద్రంగా ఉంటుంది. ఏ హాలీవుడ్ సినిమా నుండో.. ఏ నవల నుండో కాపీ కొట్టి.. తామేదో గొప్ప సినిమా తీసినట్టు.. తామేదో సినిమా హిట్ సూత్రాన్ని కనిపెట్టినట్లు ఫోజులు కొడుతుంటారు మన డైరెక్టర్లు. అయితే సుకుమార్ కూడా ఆ కోవలోకే వచ్చేలా ఉన్నాడేమో అనిపిస్తుంది. సుక్కు ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో పుష్ప సినిమా చేస్తున్న సంగతి విదితమే. నిజానికీ ఈ సినిమా స్టోరీ లైన్ ఎప్పుడో బయటకు పొక్కింది. శేషాచలం అడవుల్లో ఉన్న గంధపు చెక్కల స్మగ్లింగ్ గురించి ఈ సినిమా ఉంటుందని.. అడవిలో కథ ఎక్కువగా నడుస్తోందని.. సినిమాలో అల్లు అర్జున్ చిత్తూరు యువకుడిగా కనిపించనున్నాడని.. కథలో బన్నీ క్యారెక్టర్ చుట్టూ మంచి ఎమోషన్ ఉంటుందని ఇలా చాలానే వినిపించాయి.

Also Read: బాలయ్య బాబుకు హీరోయిన్ గా జయసుధ !

అయితే ప్రస్తుతం ఈ సినిమా కథకు సంబంధించి సుకుమార్ పై కొన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా కథ కాపీ స్టోరీ అని, ప్రముఖ రచయిత, సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహిత డా. వేంపల్లి గంగాధర్ తను రాసిన ఎర్రచందనం దారిలో తమిళ కూలీలు.. అనే పుస్తకాన్ని కాపీ కొట్టి సినిమాను తీస్తున్నారని ఇన్ డైరెక్ట్ గా సుకుమార్ పై ఆరోపణలు చేస్తున్నారు. ఏ డైరెక్టర్ అయినా, ఒక సినిమా తీస్తున్నాడు అంటే.. ఆ సినిమా తాలూకు కథకు సంబంధించిన నవలలు, పుస్తకాలను చదువుతారు. వాటిల్లో అంశాలను కాపీ కొట్టి తమ సినిమా సీన్స్ ను రాసుకుంటారు. త్రివిక్రమ్ లాంటి డైరెక్టర్ రాసే సినిమా డైలాగ్స్ లో.. సగంకు పైగా యండమూరి పుస్తకాల నుండే ఉంటాయి.

Also Read: అన్నీ చేసినా.. పెద్దగా సంపాదించలేకపోయాను !

ఇప్పుడు సుకుమార్ కూడా అలాగే చేస్తోన్నట్లు కనిపిస్తోంది. ఒక్క సుకుమారే కాదు, పాత తరం డైరెక్టర్ ఆదుర్తి సుబ్బారావు కాలం నుండి ఇలాగే జరుగుతుంది. గొప్ప రచయిత చలం రాసిన పుస్తకాల నుండి ఎన్నో అంశాలను సినిమా వాళ్ళు డైరెక్ట్ గానే కాపీ కొట్టారు. కొడుతూనే వస్తున్నారు. మొదటి నుండి తెలుగు సాహిత్యకారులను సినిమా రంగం తొక్కేస్తోనే ఉంది. ఇక గతంలోనూ వేంపల్లి రాసిన మొండి కత్తి పుస్తకాన్ని ప్రేరణగా తీసుకొని త్రివిక్రమ్ అరవింద సమేత వీర రాఘవ చిత్రాన్ని తీశాడనే ఆరోపణలు ఆ మధ్య బాగా వినిపించాయి. ఇప్పుడు మళ్లీ అదే వేంపల్లి రాసిన పుస్తకాన్ని కాపీ కొట్టి సుకుమార్ పుష్ప అనే సినిమా తీస్తున్నాడంటూ స్వయానా వేంపల్లే ఆరోపిస్తున్నాడు.

క్లాసులు వింటూ 25 కోట్లు సంపాదించిన విద్యార్థిని..?

క్లాసులు వింటే డబ్బులు సంపాదించడం ఏమిటి…? ఎక్కడైనా క్లాసులు వింటే డబ్బులు ఇస్తారా…? అని అనుకుంటున్నారా…? అయితే ఒక విద్యార్థిని తరగతి గదిలో పాఠాలు వింటూ ఏకంగా 25 కోట్ల రూపాయలు సంపాదించింది. క్లాసులో పాఠాలు వినే సమయంలో 25 కోట్ల రూపాయలు సొంతం చేసుకుంది ఆస్ట్రేలియాకు చెందిన ఒక యువతికి అదృష్టం లాటరీ రూపంలో వరించింది. అయితే అన్ని కోట్లు సొంతమైనా ఆ యువతి క్లాస్ రూమ్ లో ఎలాంటి స్పందన లేకుండా ఉండిపోయింది.

పూర్తి వివరాల్లోకి వెళితే ఆస్ట్రేలియాకు చెందిన 20 ఏళ్ల విద్యార్థిని పాఠాలు వినే సమయంలో ఈ మెయిల్ చెక్ చేసుకోగా 3.4 మిలియన్ డాలర్ల లాటరీని గెలుచుకున్నట్టు మెయిల్ వచ్చింది. దీంతో మనసులో నుంచి పట్టరాని ఆనందం పొంగుకొస్తున్నా క్లాసుకు భంగం కలగకూడదని ఆమె సైలెంట్ గా ఉండిపోయింది. మన దేశ కరెన్సీ ప్రకారం సదరు యువతి ఏకంగా 25,27,47,500 రూపాయలు గెలుచుకుంది.

క్లాస్ అయిపోయిన్ వెంటనే పట్టరాని ఆనందంతో యువతి తన స్నేహితులకు అసలు విషయం చెప్పేసింది. సెట్ ఫర్ లైఫ్ లాటరీని గెలుచుకున్న యువతి గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అదృష్టవంతురాలైన యువతి గెలుచుకున్న డబ్బుతో ఏం చేస్తావని ఎవరైనా ప్రశ్నిస్తే ఆ డబ్బుతో రెండు ఇళ్లు కొంటానని ఒక ఇల్లు తన తల్లికి బహుమతిగా ఇచ్చి మరో ఇంట్లో తాను నివాసం ఉంటానని చెప్పింది. తనకు ఇతర దేశాలకు వెళ్లడం చాలా ఇష్టమని మిగిలిన డబ్బుతో విదేశాలను ఒక రౌండ్ వేసి వస్తానని యువతి చెబుతోంది.

2,000 నోట్లు రద్దు అంటూ ప్రచారం.. ఆర్బీఐ ఏం చెప్పిందంటే?

ప్రధాని నరేంద్ర మోదీ 2016లో నోట్ల రద్దు చేసిన తరువాత కొత్త 500, 2000 రూపాయల నోట్లు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఆ తర్వాత 2,000 రూపాయల నోట్లు రద్దవుతాయంటూ భారీగా ప్రచారం జరుగుతోంది. దీంతో ఆర్బీఐ 2,000 రూపాయల నోట్లు రద్దవుతున్నాయంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తోంది. అయితే తాజాగా మరోసారి 2,000 రూపాయల నోట్ల రద్దు గురించి ప్రచారం జరుగుతుండటం గమనార్హం.

ఆర్బీఐ తాజాగా గత ఆర్థిక సంవత్సరంలో ఒక్క 2,000 రూపాయల నోటు కూడా ముద్రించలేదని కీలక ప్రకటన చేసింది. చలామణిలో ఉన్న 2,000 రూపాయల నోట్లను క్రమంగా తగ్గిస్తున్నామని కీలక ప్రకటన చేసింది. గత కొన్ని నెలల నుంచి 2,000 నోట్లు మినహా మిగిలిన నోట్లను పెద్దఎత్తున మార్కెట్లోకి చలామణిలోకి తెచ్చామని ఆర్బీఐ తెలిపింది. అందువల్ల ఈ నోట్ల వాడకం భారీగా పెరిగింది. అయితే ఆర్బీఐ ప్రకటనతో 2,000 నోట్ల రద్దు గురించి ప్రచారం జరుగుతున్నా నోట్ల రద్దు వార్త నిజం కాదు.

మరోవైపు కరోనా వైరస్, లాక్ డౌన్ ప్రభావం నోట్ల సరఫరాపై తీవ్రంగా పడిందని ఆర్బీఐ తెలిపింది. గతేడాదితో పోలిస్తే 23.3 శాతం నోట్ల సరఫరా తగ్గిందని పేర్కొంది. అయితే ఇదే సమయంలో నకిలీ నోట్ల సంఖ్య పెరగడంతో నకిలీ నోట్ల గురించి ప్రజలు అవగాహన పెంచుకోవాలని ఆర్బీఐ కీలక సూచన చేసింది. మరోవైపు 2,000 నోట్ల రద్దు గురించి వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో పలువురు మోసగాళ్లు ఈ నోట్లను అడ్డం పెట్టుకుని మోసాలకు పాల్పడుతుండటం గమనార్హం.

కేంద్రం పై సుప్రీం కోర్టు అసహనం..! లాక్ డౌన్ వేసిన వాళ్ళే పరిష్కారం చూపాలి

COVID-19: Supreme Court Likely to Begin Physical Hearings From ...

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు ఆ తర్వాత కేంద్రం పై కూడా అసహనం వ్యక్తం చేసింది. విపత్తు నిర్వహణ చట్టం కింద అధికారులు ఉన్నప్పటికీ ఈఎంఐ విషయంలో ప్రజలకు ఉన్న సమస్యలకు ఆర్బిఐ ని సాకుగా చూపడం తగదని హితవు పలికింది. కరోనా వైరస్ మహమ్మారిని అడ్డుకునేందుకు లాక్ డౌన్ విధించింది కేంద్రం కాబట్టి ప్రజలకు రిలీఫ్ కల్పించే విషయంలో వారికి వచ్చిన కష్టాల విషయంలో కూడా కేంద్రమే నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలు చెల్లించే వివిధ ఈఎంఐలపై రెండు విడతలుగా ఆరునెలలపాటు మారటోరియం విధించిన సంగతి తెలిసిందే.

అయితే బ్యాంకులు మాత్రం ఆరు నెలలపాటు ఈఎంఐ మాత్రమే చెల్లించక్కర్లేదని… కానీ లోన్ ఆపిన కాలానికి వడ్డీ చెల్లించాల్సి ఉందని స్పష్టం చేశాయి. దీనివల్ల ఈఎంఐ వ్యవధి మాత్రమే పెరుగుతుందని పేర్కొన్నాయి. దేశ వ్యాప్తంగా విమర్శలు వ్యక్తం అయినప్పటికీ అలా చేస్తే బ్యాంకుల విపరీతంగా నష్టపోతాయని అందువల్ల కచ్చితంగా వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని ఆర్బీఐ వివరించింది. కేంద్రం కూడా ఈ విషయంలో స్పష్టంగా తన నిర్ణయాన్ని ప్రకటించకుండా ఆర్బీఐకి వదిలేసింది

ఈ నేపథ్యంలో దీనిని సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై బుధవారం జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపి కేంద్రానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. అన్నీ సమస్యలకు ఒకేరకమైన పరిష్కారం ఉండదని…. కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ వినిపించిన వాదనలపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. 

“మీరు విధించిన లాక్ డౌన్ వల్లే ఈ పరిస్థితి వచ్చింది. ఈ సమయంలో కూడా వ్యాపారాత్మక ధోరణి వీడి ప్రజల కష్టాల గురించి కూడా ఆలోచించాలని హితవు పలికింది. విపత్తుల నిర్వహణ చట్టం అమలుతో పాటు ఈఎంఐ వడ్డీ చెల్లింపు విషయంలో వైఖరి ఏమిటో చెప్పాలని ఆదేశించింది. అందుకు వారం రోజులు గడువు కావాలని సొలిసిటర్ జనరల్ కోరడంతో ధర్మాసనం అందుకు అంగీకరించింది. సెప్టెంబరు 1కి తమ నిర్ణయాన్ని తెలియజేయాలని పేర్కొంది.

ఆర్జీవీ అనే జీవికి అవేమి పట్టవు !


కరోనా భయంతో ప్రపంచం అల్లాడిపోతోంది, సినీ లోకం మొత్తం కష్ట కాలంలో నలిగిపోతోంది, ఒక్క రామ్ గోపాల్ వర్మ మాత్రం తప్ప. జనం చచ్చిపోతున్నా.. వాళ్ళ చావులో ఉన్న డ్రామా ఏమిటి అని ఆలోచించే వర్మ నుండి ఫ్యామిలీ ఎమోషన్స్ ను ఆశించడం మన అత్యాశే అవుతుందేమో. కానీ వర్మ అంటేనే ఓ వైవిధ్యమైన వ్యక్తిత్వం. ఆ విషయంలో వర్మకి రారు ఎవరు సాటి. ఏమైనా ఎవరు ఏమనుకున్నా తన వివాదాస్పద సినిమాలను అలాగే కంటిన్యూ చేస్తూ ఎప్పుడూ ఏదొక సినిమా చేసుకుంటూ ముందుకు పోతున్నాడు వర్మ. అయితే ‘మర్డర్’ అనే సినిమా విషయంలో మాత్రం వర్మకు బాగానే ఎదురుదెబ్బలు తగిలాయి.

Also Read: బాలయ్య బాబుకు హీరోయిన్ గా జయసుధ !

మిర్యాలగూడలో సంచలనం సృష్టించిన ‘ప్రణయ్‌ హత్య’ నేపథ్యంలో వర్మ ఈ చిత్రాన్ని చేస్తున్నా అని చెప్పగానే… ఆ కథ తాలూకు వ్యక్తులు తీవ్రంగా ఈ సినిమాని వ్యతిరేకిస్తూ కోర్టుకు వెళ్లి మొత్తానికి విజయం సాధించారు. దాంతో వర్మ ఈసారి తన బయోపిక్ ను ఎనౌన్స్ చేశాడు. దీన్నిబట్టి వర్మ మానసిక పరిస్థితి బాగాలేదేమో అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. తాను చేయబోయే సినిమాకి వర్మ జీవితానికి ఎక్కడా పోలికలు ఉండవని.. ఇదంతా తన పేరును ఉపయోగించి సినిమాని క్యాష్ చేసుకోవాలని వర్మ చూస్తున్నాడని.. వర్మ చివరకు ఇంతటి నీచానికి దిగజారుతాడని ఎప్పుడూ అనుకోలేదని.. వర్మ శిష్యులు పెదవి విరుస్తున్నారు.

Also Read: అన్నీ చేసినా.. పెద్దగా సంపాదించలేకపోయాను !

సమాజాన్ని అలాగే మహిళలను ఎలా గౌరవించాలో కూడా తెలియని వర్మను చూస్తే అసహ్యం వేస్తోందని.. ఇప్పటికే వర్మ వల్ల ఎన్నో బాధలను అనుభవించానని…వర్మ నీచుడు అని వర్మ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన సిద్ధూ అనే అసిస్టెంట్ డైరెక్టర్ తన బాధను వ్యక్తపరుస్తున్నాడు. అదేంటో గాని, వర్మని అసహ్యించుకునేవారు ఎంతమంది ఉంటారో.. అభిమానించే వారు అంతే గొప్పగా వర్మను పొగుడుతూ ఉంటారు. కాకపోతే ఇలాంటి విమర్శలను పొగడ్తలను ఆర్జీవీ అనే జీవి పెద్దగా పట్టించుకోరు అనుకోండి అది వేరే విషయం.

మళ్లీ మురుగదాస్‌తో మహేశ్.. ఈ సారి హిట్‌ పక్కా!


టాలీవుడ్‌ సూపర్ స్టార్ మహేశ్‌ బాబు, సౌతిండియా స్టార్ డైరెక్టర్ మురుగదాస్‌ మరోసారి కలిసి పని చేయబోతున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో తొందర్లోనే సినిమా రానుంది. మహేశ్‌, మురుగదాస్‌ కాంబినేషన్లో ఇది వరకు వచ్చిన థిల్లర్ డ్రామా ‘స్పైడర్’ కమర్షియల్‌గా ఫ్లాప్‌గా మిగిలింది. అలాగే, ఆ మూవీలో మహేశ్‌ డ్యాన్స్‌పై తెగ ట్రోలింగ్‌ నడించింది. స్టోరీ బాగున్నా దాన్ని తనదైన శైలిలో ప్రెజెంట్‌ చేయడంలో మురుగదాస్‌ విఫలమయ్యాడు. అలాగే, మ్యూజిక్‌ కూడా పెద్ద మైనస్‌గా మారింది. దాంతో, పెద్ద బడ్జెట్‌తో భారీ అంచనాలతో రిలీజైన ఈ చిత్రం తీవ్రంగా నిరాశ పరిచింది. అయితే, వీరిద్దరూ మరోసారి జతకట్టబోతున్నారని కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి.

Also Read: బాలయ్య బాబుకు హీరోయిన్ గా జయసుధ !

మురుగదాస్‌ ప్రస్తుతం విజయ్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. దీనికి తుపాకి 2 అనే టైటిల్‌ పరిశీలనలో ఉంది. కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌ కాగా, విద్యుత్‌ జమ్వాల్‌ విలన్‌. జయరాం, సత్యన్‌ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. 2012లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన తుపాకి కి ఇది సీక్వెల్‌. ఈ మధ్యే రజినీకాంత్‌తో దర్బార్తో హిట్‌ కొట్టిన మురుగదాస్‌ ఫామ్‌లో ఉన్నాడు. భారీ అంచనాలున్న విజయ్‌ 65వ సినిమాపై దృష్టి పెట్టిన ఆయన ఇప్పటికే మహేశ్‌ కోసం కథ సిద్ధం చేశారట. ‘స్పైడర్’లా కాకుండా పక్కా కథనం తయారు చేశారట. మహేశ్‌కు కచ్చితంగా హిట్‌ ఇవ్వాలని మురుగదాస్‌ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సినిమాపై తొందర్లోనే ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

వైసీపీ ఎమ్మెల్యేపై కోర్టుకెక్కిన పార్టీ నాయకులు..!


గుంటూరు జిల్లా మైనింగ్ కార్యకలాపాలకు పెట్టింది పేరు. ఇక్కడ సున్నపురాయితోపాటు రబ్బీసు, రాతి క్వారీలు ఎక్కువగా ఉంటాయి. తాజాగా గుంటూరు జిల్లాలో అధికార పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే అక్రమ మైనింగ్ కు పాల్పడినట్లు హై కోర్టులో పీటీషన్ దాఖలయ్యింది. ఈ పీటీషన్ దాఖలు చేసింది వైసీపీ నాయకులు కావడం ఇక్కడ ట్విస్ట్… హై కోర్టు న్యాయవాది ఎం.నాగ రఘు ఈ పిటీషన్ ను సత్తెనపల్లి నియోజకవర్గంలోని రాజుపాలెం మండల వైసీపీ నాయకుల తరుపున ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.

Also Read: సుప్రీం కోర్టు జగన్ కు షాక్ ఇచ్చింది…! కానీ జగన్ హ్యాపీ

సత్తెనపల్లి ఎమ్మెల్యే, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు కొంత కాలంగా రాజుపాలెం మండలం కొట నెమలిపురి, కొండమోడు గ్రామాల్లో అక్రమ మైనింగ్ కు పాల్పడ్డతున్నారని వైసీపీ నాయకుల ఆరోపణ. పీటీషన్ ను స్వీకరించిన హై కోర్టు వైసీపీ నాయకులు వేస్తే ప్రజాప్రయోజన వ్యాఖ్యం కిందకు ఎలా వస్తుందని న్యాయవాదిని ప్రశ్నించింది. కేసు విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది. కేసుకు సంబంధించి పూర్తి నివేదికను సమర్పించాలని ప్రభుత్వం తరుపు న్యాయవాదిని హై కోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగా న్యాయవాధి నాగరఘు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ కు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, మంత్రి విచారణకు ఆదేశించినా విచారణ అధికారులు పట్టించుకోలేదని తెలిపారు. మైనింగ్ శాఖ అధికారులకు అక్రమ మైనింగ్ గురించిన తెలిసినా స్పందిచడం లేదని విమర్శించారు.

Also Read: అమరావతికే కాదు… రాష్ట్రంలో ప్రతీ రైతన్నకు ప్రభుత్వాలు నేర్పిన గుణపాఠం ఇదే..!

జిల్లాలో అక్రమ మైనింగ్ దశాబ్ధాలుగా కొనసాగుతుంది. టీడీపీ హయాంలోను మజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అనుమతి తీసుకున్న ప్రాంతాని కంటే అధికంగా మైనింగ్ చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై హై కోర్టు ఆదేశాలతో విజిలెన్స్ అధికారులు మైనింగ్ జరిగిన ప్రదేశాన్ని సందర్శించి అక్రమాలు జరిగిన విషయం వాస్తవమేనని నిర్ధారించారు. అప్పట్టో టీడీపీ ప్రభుత్వమే అధికారంలో ఉండటంతో ఈ వ్యవహారంపై పెద్దగా శ్రద్ద పెట్టలేదు. హై కోర్టు ఆదేశాలను పెద్దగా పట్టించుకోలేదు.

ఈ క్యాన్సర్లు ఉన్నవారికి కొవిడ్‌ ముప్పు!

గడిచిన 8 నెలల నుంచి ప్రజలు కరోనా మహమ్మారి వ్యాప్తి వల్ల ఎదుర్కొంటున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. ఇప్పటికే ఈ వ్యాధి లక్షణాలు వెలుగులోకి రావడంతో పాటు దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడే వారికి వైరస్ వల్ల ముప్పు ఎక్కువన్న సంగతి తెలిసిందే. అయితే శాస్త్రవేత్తల అధ్యయనంలో తాజాగా వైరస్ కు సంబంధించి కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కొన్ని రకాల క్యాన్సర్లతో బాధ పడే వాళ్లకు 60 శాతం కరోనా ముప్పు ఎక్కువని తాజా అధ్యయనంలో తేలింది.

లండన్ పరిశోధకులు అనేక పరిశోధనలు చేసి ఈ విషయాలను వెల్లడించారు. ల్యుకేమియా, బోన్ మ్యారో, బ్లడ్ క్యాన్సర్ బారిన ఎక్కువగా పడే అవకాశం ఉందని తేలింది. బర్సింగ్ హామ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి ఈ విషయాలను వెల్లడించారు. 1,044 మంది క్యాన్సర్ రోగులపై మార్చి నెల 18 నుంచి మే నెల 8వ తేదీ వరకు పరిశోధనలు నిర్వహించి సాధారణ క్యాన్సర్ తో పోలిస్తే బ్లడ్, బోన్ మ్యారో, ల్యుకేమియా క్యాన్సర్ల బారిన పడిన వారికి వైరస్ ముప్పు ఎక్కువని చెప్పారు.

ఈ రోగులలో 319 మంది రోగులు అధ్యయనం చేస్తున్న సమయంలోనే వైరస్ బారిన పడి చికిత్సకు కోలుకోలేక మృతి చెందారని చెప్పారు. లాన్సెట్ జర్నల్ లో ఈ అధ్యయనాన్ని ప్రచురించారు. ఈ పరిశోధనల్లో పాల్గొన్న వ్యక్తులలో ఒకరైన రాచెల్ కెర్ ఈ పరిశోధన ఫలితాల ద్వారా కరోనా బారిన పడ్డ కొన్ని రకాల క్యాన్సర్ రోగులకు మెరుగైన చికిత్స అందించడం సాధ్యమవుతుందని… టైర్డ్ రిస్క్ అసెస్‌మెంట్ టూల్‌ ను ఈ ఫలితాల సహాయంతో సృష్టించవచ్చని తెలిపారు.

కలిసొచ్చిన కాలం.. టీపీసీసీలో ఉత్తమ్ దే రాజ్యం


కాలం కలిసిరావడం అంటే ఇదేనేమో.. జాతీయ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుత నాయకత్వం సంక్షోభం తెలంగాణ పీసీసీ చీఫ్ గా కొనసాగుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి పాలిట వరంగా మారిందన్న ప్రచారం సాగుతోంది. ఏఐసీసీలో తాజాగా సోనియాగాంధీ నాయకత్వాన్ని సీనియర్లు 23మంది వ్యతిరేకించడం.. కాంగ్రెస్ లో తుఫాను చెలరేగడం.. చివరకు మరో ఆరు నెలల వరకు సోనియాగాంధీనే అధినేత్రిగా కొనసాగునుండడంతో ఇప్పట్లో రాష్ట్ర శాఖలను ముట్టుకునే సాహసం కాంగ్రెస్ చేయదు అని ఖాయమైపోయింది. దీంతో  పీసీసీ చీఫ్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డినే మరికొంత కాలం ఉంటాడని తెలుస్తోంది.

Also Read: అధ్యక్షుడైనా బండి సంజయ్ సంతోషంగా లేడా?

నిజానికి గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడం.. ఉత్తమ్ కుమార్ రెడ్డి పదవీకాలం ముగిసిపోవడంతో తనే స్వచ్ఛందంగా వైదొలిగి తన స్థానంలో ఇతరులను నియమించాలని పార్టీ అధిష్టానానికి స్వయంగా లేఖ రాశారు. పార్టీ నాయకత్వం దీనిపై ఢిల్లీ దూతను పంపి పలువురి పేర్లను పీసీసీ చీఫ్ కు సెలెక్ట్ చేసి పంపించింది. పీసీసీ చీఫ్ గా అందరికంటే ముందంజలో రేవంత్ రెడ్డి ఉన్నాడని.. ఆయన పేరును ఖరారు చేసిందనే ప్రచారం సాగింది.

రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా ప్రకటించడానికి అధిష్టానం రెడీ కాగానే కాంగ్రెస్ సీనియర్లు అంతా కూడబలుక్కొని వ్యతిరేకించడంతో కాంగ్రెస్ అధిష్టానం పునరాలోచనలో పడింది. మొదటి నుంచి పార్టీలో ఉన్న నేతలకే పీసీసీ పగ్గాలు అప్పగించాలని పార్టీ నేతలు కోరడంతో ఇక కొత్త పీసీసీ చీఫ్ ఎంపిక ఆలస్యమైంది.

ఈ క్రమంలోనే జాతీయ కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి 23మంది సీనియర్లు లేఖ రాయడం పార్టీలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. చివరకు సోనియానే మళ్లీ పార్టీ చీఫ్ గా కొనసాగింది.

Also Read: టీ.కాంగ్రెస్ కు ఊపుతెచ్చే ప్లాన్ చేశారు?

ఇంతటి సంక్షోభ పరిణామాలన్నీ తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి కలిసివచ్చినట్టుగా ప్రచారం సాగుతోంది. ఏఐసీసీకి కొత్త చీఫ్ వచ్చే వరకు ఉత్తమ్ పదవీకాలానికి ఢోకా ఉండకపోవచ్చనే అభిప్రాయంతో ఉన్నారు.

ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే ఏఐసీసీకి కొత్త చీఫ్ వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో పీసీసీ చీఫ్ కూడా మారే అవకాశాలు లేవు. సోనియాగాంధీ ఏఐసీసీ చీఫ్ గా ఉన్నంతకాలం ఉత్తమ్ కుమార్ రెడ్డి పదవికి ఢోకా లేదని.. ఆమె మార్చబోదని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో మరికొంతకాలం ఉత్తమ్ పీసీసీ చీఫ్ గా కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది.