
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చే సరికి రాష్ట్రంపై అప్పుల రూపంలో లక్షల కోట్ల రూపాయల భారం ఉంది. అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలుపై దృష్టి పెట్టడంతో ఆ అప్పుల భారం మరింత పెరిగింది. అయితే కరోనా, లాక్ డౌన్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఏపీకి కొత్త సమస్యలను సృష్టిస్తోంది. రాష్ట్రానికి గడిచిన ఆరు నెలల నుంచి కరోనా, లాక్ డౌన్ వల్ల ఆదాయం భారీగా తగ్గింది.
Also Read : జగన్ దగ్గరకు పోతా అంటున్న బాలయ్య… బాబు తట్టుకోగలడా?
అదే సమయంలో జగన్ సర్కార్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలు, పెన్షనర్ల జీతాలు, ప్రభుత్వ ఉద్యోగుల జీతాల కోసం తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులపై ఆధారపడుతోంది. తాజాగా వెలుగులోకి వస్తున్న సమాచారం ప్రకారం జగన్ సర్కార్ గంటకు దాదాపు 9 కోట్ల రూపాయల అప్పు చేసినట్టు సమాచారం. కాగ్ రిపోర్టుల ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కాగ్ గత మూడు నెలల్లో ఏపీ ప్రభుత్వం 33,294 కోట్ల రూపాయలు అప్పు చేసినట్టు తెలిపింది.
ఈ సంవత్సరం బడ్జెట్ లో యాభై వేల కోట్లు అప్పు చేస్తామని చెప్పిన ఏపీ ప్రభుత్వం మూడు నెలలల్లోనే ఏకంగా 33,000 కోట్ల అప్పు చేయడం గమనార్హం. అయితే ప్రభుత్వం ఇంత అప్పు తెచ్చినా గత మూడు నెలల్లో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదు. దీంతో ప్రభుత్వం చేసిన అప్పును అనుత్పాదక వ్యయంగానే పరిగణించాల్సి వస్తోంది. గత మూడు నెలలల్లో ప్రభుత్వ ఆదాయం 21,000 కోట్లుగా ఉంది. ఆదాయం కంటే అప్పు ఎక్కువగా ఉండటం వల్ల రాష్ట్రం భవిష్యత్తులో ఇబ్బందులు పడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
Also Read : బాలయ్య మంత్రం.. కరోనా పరార్ అవాల్సిందే?