కరోనా కల్లోలం ఈసారి ఐపీఎల్ కు ఏదీ కలిసిరావడం లేదు. దేశం దాటి యూఏఈలో ఈసారి ఐపీఎల్ నిర్వహిస్తున్నారు. అయితే అందరికంటే ఎక్కువగా చెన్నై టీంలో 13మంది కరోనా బారినపడడంతో ఆ జట్టు కుదేలైంది.
కరోనా కారణంగా చెన్నై టీం ఆటగాళ్లు ఎక్కువ రోజులు క్వారంటైన్ లో ఉన్నారు. సరైన మ్యాచ్ ప్రాక్టీస్ లేకుండా పోయింది. కీలక ఆటగాళ్లు రైనా, హర్భజన్ వైదొలిగారు. దీంతో తొలి మ్యాచ్ సెప్టెంబర్ 19న ముంబై, చెన్నై మధ్య జరగాల్సి ఉంది. కానీ చెన్నై టీంకు సరైన విశ్రాంతి , ప్రాక్టీస్ కోసం సెప్టెంబర్ 23కు వారి తొలి మ్యాచ్ మార్చాలని ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ నిర్ణయించారట.. వీటి స్థానంలో కోల్ కతా, బెంగళూరును ఆడించాలని ప్లాన్ చేశారట..
కానీ చెన్నై కెప్టెన్ ధోని మాత్రం అనూహ్య నిర్ణయం తీసుకున్నారట.. మొదటి మ్యాచ్ లో డిఫెడింగ్ చాంపియన్ చెన్నై ఆడుతుందని స్పష్టం చేశాట.. ధోని తమ మ్యాచ్ వాయిదాకే ఒప్పుకోలేదని తెలిపింది.
కరోనా వచ్చినా సరే రిస్క్ తీసుకునేందుకే ఎంఎస్ ధోని డిసైడ్ అవ్వడం.. అతడి పట్టుదలకు నిదర్శనమని అంటున్నారు. రైనా, భజ్జీ లేకున్నా ధోని పట్టుదల అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.